202 - ధర్మ నామకఋషి వంశ వివరణము.

మత్స్యః : ఆస్మి నైవస్వతే ప్రాప్తే శృణు ధర్మస్య పార్థివ

 దాక్షాయణీభ్య స్సకలం వంశం దైవత ముత్తమమ్

వర్వతాదిమహాదుర్గశరీరాణి నరాధిప

 అరుందత్యా ప్రసూతాని ధర్మా ద్వైవస్వతే నరే

అష్టాచ వసవః పుత్తా స్సోమపా శ్చ వసో స్తథా

 ధ్రువో ధరశ్చ సోమశ్చ ఆవశ్చైవానలోనిలః

ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోప్టో ప్రకీర్తితాః

ధర స్య పుత్రో ద్రవిణః కాలః ఫుల్తో ధ్రువస్యచ

 కాలస్యావయవానాంతు శరీరాణినరాధిప

మూర్తిమ స్త్రీ చ కాలాద్దీ సమ్ప సూతా న్య శేషతః

సోమస్య భగవా న్వర్చా శ్రీమాం శ్చాపస్య కీర్త్యతే

అనేక జన్మజననః కుమారస్యానలస్యలు

 పురోజవా శ్ఛానిలస్య ప్రత్యూషస్య తు దేవలః

 విశ్వకర్మా ప్రభాసస్య త్రిదశానాం స వర్దకికి

యమీసుతా ఇతి ప్రోక్తా నాగవీభ్యాదయో నవ

 గ్రహర్షాణాంచ సర్వేషా మన్యేషాం చామితో జసామ్

 అమ్బాపు తస్స్మృతో మోషో భానోః పుత్తా సుభానవః

మరుత్వత్యాం మరుత్వ న స్సర్వే పుత్రాః ప్రకీర్తితాః

 సజ్కల్పాయాశ్చ సజ్కల్పా స్తథా పుత్రాః ప్రకీర్తితాః

ముహూర్తాస్తు ముహూర్తాయా స్సాధ్యా స్సాధ్య సుతా మతాః

 మనో మనుశ్చ ప్రాణశ్చ నరో జాతశ్చ వీర్యవాక్

చిత్తహార్యోఒయన శ్చైవ హంసో నారాయణ స్తథా

 విభుశ్చాపి ప్రభు శ్చైవ సాధ్యా ద్వాదశకీర్తితాః

విశ్వాయాశ్చ తథా పుత్రా విశ్వేదేవాః ప్రకీర్తితాః

క్రతు ర్దక్ష వసు సత్యః కాలః కామోదితి స్తథా

కురజో మనుజో విశ్వో రోచమానశ్చ తేదశ

 ఏతానదు క్త స్తవ ధర్మవంశ స్సజేపతః పార్థివవంశ ముఖ్య

వ్యా సేన వక్తుం న హి శ క్తి ర స్తి రాజ న్వినా వర్షశతై రనే కైః

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే ధర్మవంశ వివరణం నామ ద్వ్యు త్తర ద్విశ తత మోధ్యాయః

మత్స్య జనార్ధనుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ వైవస్వతమన్వంతరము వచ్చిన మీదట ధర్ముడ నునతనికి దక్ష పుత్రికలయందు 1. సకల దేవతవంశమును ఉత్పన్నమయ్యేను. వారిలో అరుంధతియందు. సకల పర్వతాది మహాదుర్గ ప్రదేశముల దేవతాత్మతత్వములును జనించెను. సోమపాయులు (సోమ పానము చేయు యోగ్యతకల) వసుపులు ఎనిమిది మంది. 2. వసువను నా మెయందు జనించిరి. వారు ధ్రువుడు ధరుడు సోముడు ఆపుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు; ధరునకు ద్రవిణుడు ధ్రువునకు కాలుడు సుతులు కాలావయవశ రీరములన్నియు మూర్తిమంతములై కాలు నడు జనించేను. సోమునకు వర్చుడు. ఆపునకు శ్రీమాన్ అనలునకు (శివుని నుండి గంగ నుండి శర స్తంబము నుండి కృత్తికల నుండి) అనేక జన్మముల తరువాత పుట్టిన కుమార స్వామి అనిలున కు పురోజవుడు ప్రత్యూషునకు దేవలుడు ప్రభాసునకు దేవతల వడ్లంగియగు విశ్వకర్మ జనించిరి.  3. యమీ అను నా మెయందు నాగవీథి మొదలగునవి జనించెను. వీరు గ్రహనక్షత్రాదీ జ్యోతిర్గణముల శ్రేణులు. 4. లంబ అనుకామె యందు ఘోషులు అనువారు కలిగిరి. 5. భానువన నామెయందు భానువులు కలిగిరి. 6. మరుత్వతి యందు మరుత్వంతులను వారు కలిగిరి. 7. సంకల్పయందు సంకల్పులు. 8. ముహూర్తయందు ముహూర్తములు. 9. సొధ్యయందు మనుడు మనువు ద్రోణుడు నరుడు జాతుడు వీర్యవంతుడు చిత్తహార్యుడు ఆయనుడు హంసుడు నారాయణుడు విభువు ప్రభువు అను పండేండు మంది సాధ్యులు కలిగిరి. 10. విశ్వ అను ధర్ము నీ పత్నియందు క్రతువు దక్షుడు వసుడు సత్యుడు కాలుడు కాముడు అతిథి కుర జుడు మనుజుడు విశ్వుడు రోచమానుడు అను పదిమంది విశ్వేదేవులు కలిగిరి. రాజముఖ్యా! నీకిట్లు ధర్ముని వంశమును సంక్షేపముగా తెలిపితిని. విస్తరించి చెప్పుట అనేక శతవర్షముల కాలమున తప్ప శక్యము కాదు.

ఇది శ్రీ మత్స్యమహాపురాణము నందు ధర్మవంశాను కీర్తనమను రెండు వందల రెండవ ఆధ్యాయము.