34 - యయాతికి యౌవనప్రాప్తి-పూరు రాజ్యాభి షేకము

శౌనక : ఏవ ముక్త స్స రాజర్షిః కావ్యం స్మృత్వా మహావ్రతమ్

 సజ్క్రామయామాస జరాం తదా పుత్త్రే మహాత్మని

 పౌర వేణాథ వయసా యయాతి ర్న హుషాత్మజః

  ప్రీతియుక్తో నర శ్రేష్ఠ శ్చ చార విషయా నియాన్

 యథా కామం యథోత్సాహం యథాప్రీతి యథాసుఖమ్

 ధర్మా విరుద్దం రాజేంద్రో యథార్హతి స ఏవ హి

దేవా వార్షణే ర్యజైశ్శాద్దెరపి పితామహా

 దీనా ననుగ్ర హై రిప్లైః కామైశ్చ ద్విజస త్తమాన్

 అతిథీ నన్న పానైశ్చ విశశ్చ ప్రతిపాలనై

ఆనృశం సేన శూద్రాంశ్చ దస్యూ న్ని గ్రహణేన చ

 ధర్మేణచ ప్రజా స్సర్వా యథావ దనుర ఙ్ఞాయ

 యయాతికి పాలయామాస సాక్షా దిగ్ద ఇవావరః

స రాజా సింహవిక్రాన్తో యువా విషయగోచరః

 అవిరోధేన ధర్మస్య చచార సుఖ ముత్తమమ్

స సమాప్య సుఖం కామాక్ తృప్తః ఖిన్న శ్చ పార్థివః

 కాలం వర్షసహస్రంతు సస్మార మనుజాధిపః

 పరిచి న స కాలజ్ఞః కాలాకాంక్ష్మీ చ వీర్యవాక్

 పూర్ణం మత్వా స తం కాలం పూరుం పుత్త మువాచహ

 న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి

 హవీషా కృష్ణవ ర్మేవ భూయ ఏకాభివర్ధతే

 యత్పృథివ్యాం ఏహియవం హిరణ్యం పశవ స్త్రియః

 *ఏక స్యాపి న పర్యాప్తం తస్మా తృష్ణాం పరిత్యజేత్

 యథా సుఖం యథోత్సాహం యథాకామ మరిగ్గమ

 సవితా విషయాః పుత్త యౌవనేన మయా తవ

పూరో ప్రీతోస్మి భద్రంతే గృహాణేదం స్వయావనమ్

 రాజ్యం చైవ గృహాణేదం త్వం హి మే ప్రియకృత్సుతః

 శౌనక  : ప్రతి పేదే జరాం రాజా యయాతి రాహుష స్తదా

యౌవనం ప్రతి పేదేచ పూరు స్స్వం పునరాత్మజః

(నాలమేకస్య నస్సర్వమితి వశ్య న్న ముహ్యతి)

శౌనకుడు శకానీకునకు ఇంకను ఇట్లు చెప్పెను: రాజర్షియగుయయాతి తన కుమారుడగు) పూరుని సమాధానము విని లోగడ శుక్రుడు చెప్పియున్నట్లు) మహా వేదవత సంపన్నుడగు కావ్యుని-శుక్రుని స్మరించి మహాత్ముడగు (మహా మనస్కుడగు) పూరునియందు తన ముసలితనమును వ్యాపింపజేసెను. పూరుని వనముతో తాను తన యోగ్యతకు తగి నట్లును తన కామమును ఉత్సాహమును ప్రీతిని సుఖమును అనుసరించియు ధర్మమునకు అవిరుద్దముగా తనకు ప్రియములగు విషయసుఖములను అనుభవించి పీతియుక్తుడయ్యెను. దేవతలను వారికి అర్ధములగు యజ్ఞములతోను పితరులను శ్రాద్ధముల తోను దీనులను అనుగ్రహములతోను ద్విజస త్తములను వారికిష్టములగు కోరికలను తీర్చుటతోను అతిథులను అన్న పానములతోను వైశ్యులను వాణిజ్యము కని పెట్టి చూచుటతోను శూద్రులను కరుణా భావనముతోను దొంగలను దోపిడి గాండ్రను నిగ్రహణము (దండించుట) తోను ప్రజలను అందరను ధర్మముతోను ఎవరికి తగినట్లు వారిని అనురంజింప (తృప్తినంద) జేయుచు సాక్షాత్ రెండవ ఇంద్రుడువలే యయాతి పాలించుచుండెను. ఆ రాజు సింహమువలె విక్రమము చూపుచు యువకుడై విషయ సుఖముల ననుభవించుచునే ధర్మమునకు అవిరుద్ధముగా ఉ త్తమమగు సుఖమును అనుభవించెను. ఆ యయాతి రాజు సుఖముగా ఆ యా కోరికలను అనుభవించి, తృప్తి పొందెను. పొందుటతోపాటే వాటీ విషయమున (ఇవి ఎందులకు? ఎన్నాళ్ళు? అని) ఖేద ముకూడ పోందెను. ఇంతలో వేయిఏండ్లు గడచెను. అతడది కూడ జ్ఞాపకము చేసికొనెను. అతడు కాలమును కొలత త్త్వమును ఎరిగినవాడు కావునను వీర్యవంతుడై నను కాలము ఎప్పుడెప్పుడు ముగియునా ఆనీ ఎదురు చూచుచున్న వాడు కావునను తాననిన వేయిఏండ్ల కాలము ముగి సెనని గుర్తించి పుత్రుడగు పూరునితో ఇట్లు పలికెను: “కామము కామములను అనుభవించుట చే ఎన్నటికిని ఉపశమించదు. హవిస్సుతో అగ్ని వలె ఇంకను పెరుగుచునేయుండును. పుడమి మొ త్తము పై గల వరియు యవలును బంగారును పశువులును స్త్రీలును అన్ని యు కలిసినను ఒక నికి కూడ చాలవు. కావున తృష్ణను విడువవలెను. (అన్ని విధములగు) శత్రువులను అణచినవాడా! నేను నా సుఖమునకు కామమునకు ఉత్సాహము నకు తగినట్లు నేను నీ యౌవనముతో విషయసుఖముల ననుభవించితిని. ఇందు నీ యోగ్యత నాకు ఇంత ప్రీతి కలిగించినది. ఇదిగో! నీ యావనము తీసికొనుము. ఇదిగో! రాజ్యము కూడ తీసికొనుము. ఏలయన నాకు ప్రీతి కలిగించు పుత్రుడవు నీవు.”

ఇట్లు పలుకుచునే యయాతి తన వార్ధకమును తీసికొనెను. పూకునకు తన యౌవనము మరల లభించెను.

రాజ్యేఽ భి షేతు కామం తం పూరుం పుత్త్రం కనీయసమ్

 బ్రాహ్మణ ప్రముఖావర్ణి ఇదం వచన మబ్రువన్

 యయాతిపౌరసంవాదః

 ప్రకృతయః : కథం శుక్రస్య దౌహిత్రం దేవయాన్యా స్సుతం ప్రభో

జ్యేష్ఠం యదు మతిక్రమ్య రాజ్యం పూ రోః ప్రదాస్యసి

 జ్యేష్ఠో యదు స్తవ సుత స్తుర్వసు సదస నరః

శర్మిష్ఠాయా స్సుతో ద్రుహ్యు స్తథానుః పూరువచ

 కథం జ్యేష్ట మతిక్రమ్య క నీయా నాజ్య మర్హతి

ఏతత్సమ్బోధయామ స్వాం ధర్మం త్వ మనుపాలయ

 యయాతిః : బ్రాహ్మణప్రముఖా వర్ణా స్సర్వే శృణ్వస్తు మే వచః

జ్యేష్ఠం ప్రతి యథారాజ్యం న దేయం మే కథ ఇ్చన

 మమ జ్యేషైన యదునా నియోగో నానుపాలితః

 ప్రతికూలః పితుర్యశ్చ న స పుత్తా స్సతాం మతః

 మాతాపిత్రార్వచనకృ ద్ధితః పథ్యశ్చ య స్సుతః

 స పుత్తః పుత్తవర్యశ్చ వర్తతే పితృమాతృషు

 యదునాహ మవజ్ఞాత స్తథా తుర్వసునాపిచ

 ద్రుహ్యునా చానునా చైవ మయ్యవజ్ఞా కృతా ధృశమ్

 పూరుణా మే కృతం వాక్యం మానితంచ విశేషతః

కనీయా న్మమ దాయాదో జరా యేన ధృతా మమ

 మమ కామ స్సచ కృతః పూరుణా పుత్రరూపిణా

 శు కేణచ వరో దత్తః కావ్యేనోశనసా స్వయమ్

 పుత్రోయ స్వనువర్త్త స రాజా పృథివీపతిః

భవన్తః ప్రతిజానను పూరూ రాజ్యేభిషిచ్యతామ్

 ప్రకృతయః : యః పుత్త్రో గుణసమ్పన్నో మాతాపితో రైత స్సదా

సర్వశోర్హలతి కల్యాణం కనీయానపి స ప్రభుః

 అర్హః  పూరు రిదం రాజ్యం యః ప్రియః ప్రియకృత్రవ

 వర దానేన శుక్రస్య న శక్యం వస్తు ముత్తరమ్

 శౌనకః  : పౌర జానపదై స్తుస్టై రిత్యుక్తో నాహుష స్తదా

అభీషిచ్య తతః పూరుం రాజ్యే స్వం సుత మాత్మజమ్

 దత్వాచ పూనవే రాజ్యం వనవాసాయ దీక్షితః

 పురాత్స నిర్యణో రాజ్ఞా బ్రాహ్మణే స్తాపపై స్సహ

 యదోస్తు యాదవా జాతా స్తుర్వసో ర్యవనా స్సుతాః

 ద్రుహ్యోస్సువై భోజాస్తు అనోస్తు మ్లేచ్ఛజాతయః

పూరోస్తు పౌరవో వంశో యత్ర జాతేసి పార్థివ

 ఇదం వర్షసహస్రం యో రాజ్యం కా రయితుం వశీ

ఇతి శ్రీమత్స్యమహాపురాణే శౌనక శతానీక సంవాదే చంద్రదవంశానువర్ణనే యయాతిచరితే చతు స్త్రింశోధ్యాయః

 పూరుడు కడసారి కుమారుడే యైనను యయాతి అతనికే తన రాజ్యము నీయదలచెను. ఆది తెలిసి బ్రాహ్మణులు మొదలగు ఆయా వర్ణములవారు ఈ విధముగా పలికిరి: "ప్రభూ! శుకునికి దౌహిత్రుడును దేవయానికి కుమారుడును కొడుకులలో పెద్దవాడును అగు యదుని విడిచి రాజ్యమును పూరున కిచ్చుచున్నావు. ఇది ఎట్లు ? క్రమముచే యదువు మొదటివాడు. తుర్వసుడు రెండవవాడు. శర్మిష్ణ కుమారులలో ద్రుహ్యుడు అనుడు పూరుడు అను వారు క్రమముగా కుమారులు. పెద్ద వానిని విడిచి కడసారి వాడు రాజ్యమునకు ఎట్లు అర్జుడగును? ఇది నీకు తెలియజేయుచు హెచ్చరించు చున్నాము. నీవు ధర్మమును అనుపాలనము చేయుట మంచిది.”

యయాతి: “బ్రాహ్మణులు మొదలగు సర్వవర్ణములవారు అందరును నామాట వినగోరుచున్నాను. పెద్ద వానికి ఏవిధముగను రాజ్యము ఈయగూడని హేతువును చేప్పెదను. యదువు నా పెద్దకొడుకు అయి ఉండియు నానీయోగమును అనుపాలించలేదు. అదియు కాక తండ్రికి ప్రతికూలుడగు పుత్రుడు పుత్రుడు కాడని విజ్ఞుల తలపు. తల్లిదండ్రుల మాట పాటించుచు వారికి హితుడు అనుకూలుడు ఐయుండు కుమారుడే పుత్రుడును పుత్రులలో శ్రేష్ఠుడును ఐ తల్లిదండ్రులకు దగ్గర వాడై యుండును. యదువు తుర్వసుడు ద్రుహ్యుడు అనువు ఈ నలుగురును నన్ను లెక్క సేయలేదు. పూరుడు మాత్రము నామాటను అధికమగు ఆదరముతో పాటించినాడు. సౌజరను తాను మోసికొనిన పూరు డే చిన్న వాడై నను నా ఆ స్త్రీని అనుభవించుటకు అధికారి. పుత్రులలో మేటియై అతడే నాకోరికను తీర్చినాడు. అదీ కాక కవి మునికి కుమారుడు అగు ఉశనసుడు శుక్రుడు) స్వయముగా “నిన్ను అనువర్తించు కుమారుడే నీతరువాత రాజు కాదగినవాడు.” అని వరమును ఇచ్చియున్నాడు. కావున పూరుని రాజ్యమునం దభి షేకము చేయుటకు మీకభ్యంతరము లేదను విషయము స్పష్టముగా చెప్పగోరుచున్నాను.” ప్రకృతులు (పౌరులు జానపదులు అగు ప్రజాజనము): “గుణ సంపన్నుడు మాతాపితరులకు ఎల్లప్పుడు మేలు సేయు వాడు అగుకొడు కే ప్రతియొక విధమునను శుభమును పొంద అర్హుడు. కడగొట్టువాడే నను. అత డే ప్రభువు. నీకు ప్రియము నాచరించి నీ ప్రీతికి పాత్రుడై నందున పూరుడే ఈరాజ్యమునకు అర్హుడు. ఈ విషయమున శుక్రుని వరదానము కూడ ఇట్లే యుండుట చేత మరేమియు పైమాట మేము చెప్పు నవకాశము లేదు.”

పౌరులును జానపదులును నగు ప్రజాజనము సంతుష్టులే ఇట్లు పలుకగానే యయాతి పూరుని తన రాజపదమునం దభి షేకించెను. అతనికి తన రాజ్యమును అప్పగించెను. వనవాసమునకై దీక్ష తీసికొనెను. బ్రాహ్మణులును తాపసులును వెంటరాగా పురమును వెలువడి వనమున కేగెను.

యదుని సంతతివారు యాదవులును తుర్వసుని సంతతివారు యవనులును ద్రుహ్యుని సంతతివారు భోజ జాతీ యులును అను సంతతివారు మ్లేచ్చ జాతులవారుసునైరి. పూరుని సంతతివారు పౌరవులని ప్రసిద్ధి నొందిరి. ఈ వంశము నందే నీవు (శతానీకుడు) జనించి వేయి ఏండ్లపాటు రాజ్యము నేలువాడ వయినావు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున పూరురాజ్యాభి షేకమను ముప్పది నాలుగవ అధ్యాయము.