91 - శర్కరా పర్వత దానము -  ధర్మమూర్త్యుపాఖ్యానము

 ఈశ్వర  : అథాత స్సంప్రవక్ష్యామి శార్కరాచల ముత్తమమ్

 యస్య ప్రదానా ద్విష్ణ్వర్క రుద్రా స్తుష్య న్తి సర్వదా

 అష్టభి శ్శర్కరా భారై రుత్తమ స్స్యా న్మహాచలః

 చతుర్భి ర్మధ్యమః ప్రోక్తో భారాభ్యా మధమ స్స్మృతః

 భారేణ చార్ధబారేణ కుర్యా ద్య స్స్వల్పవితవాన్

 విష్కమ్భపర్వతా న్కుర్యా త్తురీయాంశేన మానవః

 ధాన్యపర్వతవత్సర్వ మాపాద్యామరసంయుతమ్

మేరోరుపరి తద్వచ్చ స్థాప్యం హేమతరుత్రయమ్

 మన్దార: పారిజాతశ్చ తృతీయః కల్పపాదపః

 ఏవం వృక్షత్రయం మూర్ద్నీ సర్వేష్వపి నివేశ యేత్

 హరిచన్దనమన్దారౌ పూర్వపశ్చిమభాగయోః

 నివేశ్యౌ సర్వ శైలేషు వి శేషాచ్ఛర్కరాచలే

 మన్దరే కామదేవస్తు ప్రత్యగ్వ క్త్రస్సదా భవేత్

 గన్ధమాదనమధ్యేతు ధనద స్స్యా దుర్ముఖః

 ప్రాజ్ముఖో హేమ మూర్తిస్తు హంసస్యా ద్విపులాచలే

 హైమీ సుపార్శ్వే సురభి ర్ధక్షిణాభిముఖీ భవేత్

 ధాన్యపర్వతవత్సర్వ మావాహనమఖాదికమ్

కృత్వాఽథ గుర వే దద్యా న్మధ్యమం పర్వతో త్తమమ్

 ఋత్విగ్భ్య శ్చతుర శ్శైలా నిమాన్మన్త్రా ముదీరయేత్

సౌభాగ్యామృతసారోఽయం పరమ శ్శర్కరాచలః

 తస్మా దానన్దకారీ త్వం భవ శైలేన్ద్ర సర్వదా

 అమృతం పిబతాం యేతు ని పేతుర్బువి శీకరా:

 దేవానాం తత్సముత్థోఽయం పాహి న శ్శర్కరాచల

మనోభవధనుర్మధ్యా దుద్భూత శ్శర్కరాచలః

ఈశ్వరుడు నార దునకు ఇట్లు చెప్పెను: ఇక మీదట శర్కరా పర్వతదాన విషయము తెలి పెదను. అది ఉత్తమము. దాని దానమున విష్ణు రవి రుద్రులు శాశ్వత తృప్తి నందుదురు. దీని కై ఎనిమిదికాని నాలుగుకొని రెండు కాని బారువల చక్కెర కావలెను. శ క్తిలేనివారు ఒక బారువతోనో అర బారువతోనైన చేయవచ్చును. మొత్తము చక్కెర తూకములో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతముల చేయవలెను. ధాన్య పర్వతమునందువలెనే ఆయా పర్వతములను వాని పై దేవతలను నిలుపవలయును. అందునను మేరు పర్వతము పైని మిగిలిన వానిమీదను మందార పారిజాత కల్స వృక్షములనెడు మూడు (జాతుల కల్ప) వృక్షములను బంగారుతో చేయించి అమర్చవలేను. వాని శిరోభాగములందు హరి చందనము -మందారము (అను కల్ప వృక్ష జాతులను ఆ పర్వతముల తూర్పు పడమరలందమర్చవలేను. ఇవి (లోగడ చెప్పిన అన్ని పర్వతములందును విశ్లేషించి శర్కరాచలమునందును చేయవలెను. విష్కంభ పర్వతము లందును - మందరమున పడమటి మొగముగా మన్మథుడుండవలెను. గంధమాదనమున కుబేరుడు ఉత్తరపు మొగమై ఉండవలెను. విపుల పర్వతమున హంస ప్రతిమ తూర్పు మొగమై ఉండవలెను. సుపార్శ్వమున కామధేనువు దక్షిణపు మొగమై ఉండవలెను. ఆవాహన హోమాదిక మంతయు ధాన్య పర్వతమునందువలెనే. పైవలెనే నడిమి పర్వతమును ఆచార్యునకును విష్కంభ పర్వతములను ఋత్విక్కులకును ఈయవలెను. దానమంత్రము: శర్కరాచలము ఉత్తమమును సౌభాగ్యామృతసారమును; ఇట్టి నీవు మాకు సదా ఆనందము కలుగజేయుము. దేవతలు అమృతము తావునపుడు నేల పై చిందిపడిన అమృత బిందువులే చక్కెర అయ్యేను. దానితో ఏర్పడిన శర్కరాచలమా! నన్ను రక్షించుము. మన్మథుని ధనువునడుమనుండి ఉత్పన్న మీ శర్కరాచలము. అట్టి నీవు శర్కరాచలమా! మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము.

తన్మయోఽసి మహా శైల పాహి సంసార సాగరాత్

యో దద్యా చ్ఛర్కరా శైల మనేన విధినా నరః

  సర్వపాపవినిర్ముక్త స్స యాతి (హరి)శివమన్దిరమ్

 చన్ద్రతారార్కసఙ్కాశ మధిరుహ్యానుజీవిభిః

సహైవ యాన మాతి ష్ఠేత్సతు విష్ణుప్రభో దివి

 తతః కల్పశతా న్తేతు సప్తద్వీపాధిపో భవేత్

 ఆయురారోగ్యసమ్పన్నో యావజ్జన్మాయుతత్రయమ్

 భోజనం శ క్తితో దద్యా త్సర్వ శైలే ష్వమత్సర

 సర్వత్రాక్షారలవణ మశ్నీ యా త్తదనుజ్ఞయా

పర్వతోపస్కరా న్త్సర్వా న్ప్రాపయే ద్భ్రాహ్మణాలయమ్ 

ధర్మమూర్త్యుపాఖ్యానమ్

ఆసేత్పురా బృహత్కల్పే ధర్మమూర్తి ర్నరాధిపః

 సుహృచ్ఛక్రస్య నిహతా యేన దైత్యా స్సహస్రశ

 సోమసూర్యాదయో యస్య తేజసా విగతప్రభాః

భవన్తి శతశో యేన శత్రవశ్చ పరాజితాః

 యదృచ్ఛారూపధారీచ మను ష్యే ష్వపరాజితః

 తస్య భానుమతీ నామ భార్యా త్రైలోక్యసున్దరీ

లక్ష్మీరివ స్వరూ పేణ నిర్జితామర సున్దరీ

రాజ్ఞా స్తస్యాగ్రమహిషీ ప్రాణేభ్యోపి గరీయసీ

 నారీదశ సహస్రాణాం మధ్యే శ్రీరివ జాయతే

 నృపకోటి సహస్రేణ కదాచిన్న ప్రముచ్యతే

కదాచి దాస్థానగతః పప్రచ్చ స్వపురోధసమ్

విస్మయేనాన్వితో రాజా వసిష్ఠ మృషిసత్తమమ్

 భగవ న్కర్మణా కేన మమ లక్ష్మీ రనుత్తమా

కస్మాచ్చ విపులం తేజో మచ్ఛరీరే పదో త్తమమ్  

ఈ విధానముతో శర్కరా శైలదానము చేసినవారు వెంటనే విష్ణుని కాంతివంటి కాంతి కలవారై తనఅనుజీవులతో కూడ చంద్రతారా సూర్యులవలె ప్రకాశించు విమానము నెక్కి సర్వపాప వినిర్ముకులై శివ భవనమున కేగుదురు. ఇట్లు నూరు కల్పములచట సుఖించి గల కల్పాది సృష్టియందు వరుసగా ముప్పది వేల జన్మముల వరకు ఆయురారోగ్య సంపన్నుడగు సప్త ద్వీపాధిపతిగా జన్మించుచుండును.

సములందును ఇతరులతో పోటీపడక తన శక్తి కొలది భోజన దానము చేయవలెను. అన్ని వ్రతములయందును ఆ పెద్దల యనుమతితో ఉప్పు కొర ము (పులుపు) లేని ఆహారము తినవలెను.

పిమ్మట పర్వతోపస్కరములగు సానుగులన్నియు ఆయా బ్రాహ్మణుల యిండ్లకు పంపవలయును.

పూర్వము బృహకల్పమునందు ధర్మమూ రి యను రాజుండెడి వాడు. . అతడు ఇంద్రునకు , మీతుడు; వేల కొలదిగా రాక్షసుల జంపినవాడు; సోమ సూర్యాది జ్యోతిస్సులకంటెను తేజశ్శాలి. వందలకొలది. శత్రువుల నోడించిన వాడు; ఎవరి చేతను ఓటమి నేరుగనివాడు; కామరూపము ధరించగలవాడు. అతని పట్టపురాణి భానుమతీయనునా మే తె లోక్య సుందరి; అమర సుందరులను కూడ అందమున జయించినదియును లక్ష్మీ దేవివలే రూపము కలదియుసు; ఆమె ఆ రాజునకు ప్రాణముల కంటెను మిన్న గా ప్రీతిపాత్రురాలు కూడ సు; రాజునకు గల పదివేల మంది సీజనములో ఆమె సాక్షాత్ లక్ష్మీవలే శోభించుచుం డేడిది. వారిని వారి అధీనస్థులగు వేల కోటుల రాజులును ఎప్పుడును విడిచియుండెడి వారు కారు.

ఒక నా డా రాజు తన సభలో నున్న తన పురోహితుడగు వసిష్టుని జూచి మిగుల ఆశ్చర్యము తో నిట్లు ప్రశ్నించేను : "భగవన్! ఏ (సత్) కర్మకు ఫలముగా నాకు ఇంత ఉత్తమమగు. లక్ష్మీయు నాశ రీరమున సదా ఇంత ఉత్తమమగు విపుల తేజమును సిద్ధించినది?”

వసిష్టః : పురా లీలావతీనామ వేశ్యా శివపరాయణా

 తయా దత్త శ్చతుర్ధశ్యాం గురవే లవణాచలః

హేమవృక్షామరై స్సార్దం యథావ ద్విధిపూర్వకమ్

 శూద్ర స్సువర్ణకారశ్చ నామ్నా సాణ్డోఽభవ త్తదా

 భృత్యో లీలావతీగే హే తేన హైమా వినిర్మితాః

 తరవోఽ మరముఖ్యాశ్చ శ్రద్ధాయు కేన పార్థివ

 అతిరూపేణ సమ్పన్నా ఘటయిత్వా వినా భృతిమ్

 ధర్మకార్య మీతి జ్ఞాత్వా న గృహ్ణాతి కథంచన

(ఉజ్జ్వాలితాశ్చ)ఉల్లాసితాశ్చ తత్పత్న్యా సౌవర్ణామలపాపాః

లీలావతీ గిరేః పార్శ్వే పరిచర్యాచ పార్థివ

 కృతా తాభ్యామశాఠ్యేన ద్వీజు శుశ్రూషణాదినా

 సాచ లీలావతీ వేశ్యా కాలేన మహతా తథా

సర్వపాపవినిర్ముక్తా జగామ శివమన్దిరమ్

యోఽని సువర్ణ కారోపి దరిద్రోఽవ్యతిసత్యవాక్

 న మూల్య మాదా ద్వేశ్యాత స భవానిహ సాంప్రతమ్

 సప్తద్వీపపతి ర్జాత సూర్యాయుతసమప్రభ

 భార్యా సువర్ణ కారస్య తరవో హేమనిర్మితాః

 సమ్యగుల్లాసీతా భక్త్యా సేయం భానుమతీ తవ

 ఉల్లాసనా దుత్కటరూప మస్యా స్సఞ్జాత మస్మి స్పమదాధిపత్యమ్

యస్మాత్కృతం తత్పరిచారకర్మ అనుద్ధతాభ్యాం లవణాచలస్య:

 తస్మాచ్చ లో కేష్వపరాజితత్వ మారోగ్యసౌధాగ్య యు తాచ లక్ష్మీః

తస్మా త్వమపత్ర విధానపూర్వం ధాన్యాచలాదీ న్దశధా కురుష్వ

 తథేతి సమ్పూజ్య స ధర్మమూర్తిః పాదౌ వసిష్ఠస్య దదౌచ సర్వాక్

ధాన్యాచలాదీ న్విధివత్పురారే ర్లోకంగతోఽ సౌ సుర పూజ్యమానః

 పశ్యేత్తు భక్త్యా యది దీయమానం స్పృ శేధథో యః పురుషో దరిద్రః

శృణోతి భక్యాథ మతిం దదాతి వికల్మష స్సోపి దివం ప్రయాతి  

దుఃఖస్య ప్రశమము వైతి (పఠ్యమానైశ్శైలేన్ద్రైర్భవ)పూజ్యమానై

శైలేన్ద్రై ర్భవభయభేదనై ర్మనుష్యః

 యకుర్యాదితి మునిపు జ్గవేహ భక్త్యా శాస్త్రాత్మా సకలగిరీ న్ద్రసంప్రదానమ్

ఇతి శ్రీమత్స్యమహా పురాణే ఈశ్వర నారదసంవాదే శర్కరాచల దానమాహాత్మ్య కథనం నామైక నవతితమోఽధ్యాయః

వసిష్ఠుడు రాజునకిట్లు సమాధానము ఇచ్చెను: పూర్వము శివుడే తనకు పరమాశ్రయముగా భావించు లీలావతి యను వేశ్య యుండెను. ఆమె ఒక ) చతుర్దశి నాడు తన ఆచార్యునకు లవణ పర్వతమును యథావత్ గా విధానానుసారము సువర్ణ వృక్ష దేవతా ప్రతిమలతో కూడ దానమిచ్చెను. ఆ లీలావశ్యింట భృత్యుడుగా ఆశ్రితుడుగా 'సాండుడు' అను పేరుగల శూద్రుడు సువర్ణ కారుడుండెను. అతడు ( ఈవ్రతమున కై) శ్రదాయుకుడై బంగారు , చెట్లను దేవతా ప్రతిమలను చేసి ఇచ్చేను. ఇది దేవ కార్యము గదాయను మంచి తలంపుతో వాటిని మిగుల రూప సంపన్న ములుగా నిర్మించియు వేతనము ఏమియు తీసికొనలేదు. అతని భార్యయును ఆ వృక్ష ప్రతిమలకును దేవతా ప్రతిమలకును మెరుగు పెట్టెను. ఇంతేకాక ఆ శూద్ర దంపతులిద్దరును లీలావతి దానము చేయ సిద్దపరచి, లవణ పర్వత సమీపమున బ్రాహ్మణ సేవాది రూపమున ఏమాత్రమును కపటము లేని సేవ ఎంతయో చేసిరి. ఆ లీలావతి యను వేశ్యయును. చాల కాలము (అట్లు జీవి చిన్న తరువాత సర్వపాప వినిర్ముక్తురాలయి శివలోక ము చేరెను. తాను దరిద్రుడగు బంగారు పని వాడై యుండియు అతి సత్యవంతుడై { ఈ పని కై) భృతి తీసికొనని ఆతడే నీవు ధర్మమూర్తియను రాజు) గా ఇపు డున్నా వు. సప్త ద్వీపాధిపతివి-పది వేల సూర్యుల తేజస్సువంటి తేజస్సు కలవాడవు అయినావు. తన భర్త చేసిన బంగారు చెట్లకు భక్తితో మెరుగు పెట్టిన అలనాటి సువర్ణ కారు ఏ భార్య నీయీ భానుమతి; ఆ మెరుగు పెట్టిన పుణ్యముననే ఈమెకు నేడి మేర మీరిన రూపమును ఇంతులందరలో మేలిదనము కలుగుటయునై నది. ఏమియు పొగరులేక లవణాచలదాన వ్రత కాలమున బ్రాహ్మణాదుల పరిచర్యలు చేసినందున అపరాజితుడవై ఆరోగ్య లక్ష్మీ సౌభాగ్యములనందగలిగితివి.

కావున నీవు ఇపుడును విధాన పూర్వకముగా ధాన్యాచలాది దశ విధ పర్వత దానములను ఆచరించుము.

అనిన వసిష్ణుని పాదములను ధర్మమూర్తి సంపూజించి ధాన్యా చలాదీకములు అన్ని యు అట్లే దానమిచ్చెను. తత్పలముగా సుర పూజ్యమానుడగుచు శివలోక ప్రాప్తుడయ్యెను.

ఇంతేకాదు. దరిద్రులేయైనను ఈ పర్వతదాన వ్రతములు జరుగుచుండగా చూచినను వాటిని తాకినను ఈ విషయములు వినినను ఇతరులకు తెలిపినను అట్టివాడును పాపవిముక్తుడై స్వర్గము చేరును. ఈ పర్వత దానములన్నియు సంసారభయ నాశకములు; దేవ పూజ్యమానములు. దీని ప్రభావమున మానవుడు దుఃఖశాంతి నొందును. వీని నన్నిటిని భక్తితో నాచరించినవాడు ఆత్మశాంతి నందుననుటలో సంశయమేలేదు.

ఇట్లని ఈశ్వరుడు నారదునకు తెలిపెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఈశ్వర నారద సంవాదమున శర్కరా చలదాన  మాహాత్మ్య కథనమను తొంబదియొకటవ అధ్యాయము.