104 - ప్రయాగ మాహాత్మ్యము

యుధిష్ఠిరః : యథా యథా ప్రయాగస్య మాహాత్మ్యం కథితం త్వయా

 తథాతథా ప్రముచ్యహం సర్వపా వై ర్న సంశయః

 భగవ నేన విధినా కర్తవ్యో ధర్మ నిశ్చయః

 ప్రయాగే యో విధిః ప్రోక్త స్తన్మే బ్రూహి మహామునే

 మార్కణ్డేయః : కథయిష్యామి తే వత్స తీర్థయాతావిధిక్రమమ్

 ఆరేణ చైవ విధినా యథా దృష్ణో యథా శ్రుతః

 ప్రయాగ తీర్థయాత్రార్జీ యః ప్రయాతి నరః క్వచిత్

 బలివర్గం సమారూఢ శృణు తస్యాపి యత్పలమ్

 నర కే వసతే ఘోరే గవాం క్రోశోహి దారుణః

సలిలంచ న గృహని పితర స్తస్య దేహినః

 యస్తు పుత్తం స్ను షాం భార్యాం లాలయే ల్పౌలయేత్తథా

యథాత్మానం తథా సర్వం దానం విపేషు దాపయేత్ 

ఐశ్వర్యలోభమోహాద్వా గచ్చే ద్యానేన యో నరః

 నిష్పలం తస్య త తీర్థం తస్మాద్యానం వివర్జయేత్

 గళాయమునయోర్మధ్యే యస్తు కన్యాం ప్రయచ్ఛతి

ఆర్తేనైవ విధానేన యథావిభవసమ్భవమ్

 న స పశ్యతి తం ఘోరం నరకం తేన కర్మణా

 ఉత్తరా న కురూనత్వా మోదతే కాలమక్షయమ్

 పుత్తాన్జారాంశ్చ లభతే ధార్మిక గ్రూపసంయుతాక్

 తత్ర దానం ప్రదాతవ్యం యథావిభవసమ్భవమ్

 తేన తీర్థఫలంచైవ వర్ధతే నాత్ర సంశయః

 స్వరే తిష్ఠతి రాజేన్ద యావదాభూత సమ్ల్పవమ్

వటమూలం సమాసాద్య యస్తు ప్రాణా న్విము ఊ్చతి

సర్వలోకానతిక్రమ్య శివలోకం స గచ్ఛతి

 తత్ర తే ద్వాదశాదిత్యా స్తప నే రుద్ర మాశ్రితాః

 నిర్గహ ని జగత్సర్వం వటమూలం న దహ్యతే

 నస్టే చంద్రార్కపవనే యదా చై కార్ణవం జగత్

 స్వపతే తత్ర వై విష్ణుఃపరమాత్మా పునఃపునః

 దేవదానవగన్దర్వా ఋషయస్సిద్ధచారణాః

సదా సేవ ని తత్తీర్థం గజ్గాయమునసజ్గమే

యుధిష్ఠిరుడు మార్కండేయునితో ఇట్లనెను: భగవన్! తాము నాకు ప్రయాగ మాహాత్మ్యమును చెప్పుచున్న కొలదిని నేను సర్వపాపముక్రుడ నగుచున్నట్లు భావించుచున్నాను. ఆ క్షేత్రమున ధర్మ సంపాదనము చేయు విధానమును తెలుప వేడెదను. అనగా మార్కండేయు డతని కిట్లు చెప్పసాగెను: ఆర్ష పరంపర లో నేను వినినట్లును కనినట్లును ప్రయాగ తీర్థయాత్రా విధిక్రమమును తెలి పెదను.

ప్రయాగ తీర్థయాత్ర ఎద్దు పై చేసినచో గోవులకు కలుగు దారుణ క్రోధఫలముగా ఆతడు ఘోర నరకమున వసించును. అత డిచ్చిన సలిలమును కూడ పితరులు గ్రహింపరు. ఐశ్వర్యమద లోభ మోహాదులచే అట్లు పోయినను వాని యాత్ర నిష్ఫలము. కావున యానము పై తీర్థయాత్ర చేయనేరాదు. తన పత్నీ పుస్ను షాదులను తను కాపాడు కొనునంత శ్రద్ధతోనే తీర్థయాత్రను చేసి అచట స్నానమాడి విపులకు దానమును చేయవలెను. గంగా యమునా మధ్య మున (ప్రయాగయందు) ఆర్ష విధానమున తన విభవము కొలది కన్యాదాన మొనర్చువాడు తత్పుణ్యమున నరకమును చూడనైన చూడడు. (ముందు జన్మములలో) ఉత్తర కురువర్షము లందనంతకాలము సుఖించును. ధార్మికులు రూప వ"తులు నగు దారపుత్తు లతనికి లభింతురు. ప్రళయ కాలము వరకు స్వర్గమున వసించి సుఖించును. కావున అచట తన విభవ విస్తరానుసారము దానములు చేయవలెను. దానిచే అతని పుణ్యము వృద్ధి నందును.

అచటి వటమూలమున ప్రాణముల వదలినయాతడు సర్వలోకముల నతిక్రమించి శివలోకము చేరును. ఆ ట తపమాచరించిన పుణ్యమున ద్వాదశాదిత్యులును రుద్రుని చేరగలిగిరి. కావుననే (ప్రళయమునను) వారును సర్వజగమును దహింతురు కాని వటమూలమును దహించరు. చంద్రార్క పవనులును నశించి జగ మేకార్లవమయినపుడును ప్రతి కల్పాంతమందును పరమాత్ముడు విష్ణువచటనే నిదురించును. దేవదానవ గంధర్వ ఋషి సిద్దచార ణాదులు సదా ఆ తీర్థమును సేవించుచుందురు. కావున రాజేంద్రా! పవిత్రమగు ఆ తీర్థయాత్ర చేయవలెను.

 తతో గచ్ఛేత్తు రాజేంద్ర ప్రయాగం సంశితంచ తత్

యత్ర బ్రహ్మాదయో దేవా దిశశ్చ సదిగీశ్వరాః

 లోకపాలాశ్చ సాధ్యాశ్చ పితరో లోకసమ్మతాః

సనత్కుమార సహితా స్తథావై పరమర్షయః

 అంగిరఃప్రముఖ శ్చైవ తథా బ్రహ్మర్షయోఒవరే

 యక్షా నాగా స్సువర్ణాశ్చ సిద్దా శ్చక్రచరాశ్చ యే

 సరితః సాగరాః శైలా స్తథా విద్యాధరాశ్చ యే

 హరిశ్చ భగవా నా స్తే ప్రజాపతిపుర స్సరః

 గంగాయమునయోర్మద్యం పృథివ్యా జఘనం స్మృతమ్

ప్రయాగం రాజశూర్దూల త్రిషు లోకేషు విశ్రుతమ్

తతః పుణ్యతరం నా స్త్రీ త్రిషు లో కేషు భారత

 శ్రవణా త్తస్య తీర్థస్య నామసంకీర్తనా దపి

 మృత్తికాలంభనాద్వాపి నరః పాపా త్ర్పముచ్యతే

 తత్రాభి షేకం యః కుర్యా న్మకరసే దివాక రే

 స తుల్యఫలమాప్నోతి రాజసూయాశ్వమేధయోః

న వేదవచనాతీతం న లోకవచసా తథా

 మతి రుతమణే యాతి ప్రయాగగమనం ప్రతి

 కోటితీర్థ సహస్రాణి షష్టికోట స్తథావరాః

తేషాం సాన్నిధ్య ముతైవ సతతం కురునందన

 యా గతి ర్యోగయుక్తస్య సత్త్వస్థస్య మనీషీణః

 సా గతి స్త్య జతః ప్రాణా స్ధంగాయమునసంగమే

 న తే జీవ స్తి లో కేస్మి న్యత్ర యత్ర యుధిష్ఠిర

 యే ప్రయాగం న సమ్ర్పాప్తా స్త్రీషు లోకేషు విశ్రుతమ్

ఏపం దృష్ట్వా తు త తీర్థం ప్రయాగం పరమం పదమ్

 ముచ్యతే సర్వపాపేభ్యః శశాంక ఇవ రాహుణా

కంబళాశ్వతరో నాగో యమునాదక్షిణే తపే

 తత్ర స్నాత్వాచ దత్వాచ ముచ్యతే సర్వపాత కైః

 తత్ర గత్వాచ సంస్థానం మహాదేవస్య ధీమతః

 నర స్తారయతే పూర్వా న్గళాతీతా న్గళాపరాన్

 కృత్వాభి షేకంతు పున స్సోశ్వమేధఫలం లభేత్

 స్వర్గలోక మవాప్నోతి యావదాభూతసంప్లవమ్

 బ్రహ్మాది దేవతలు దిశలు దిగధిపతులు లోక పాలురు సాధ్యులు లోక పూజ్య పితరులు సనత్కుమారాది మహర్షులు అంగిరః ప్రముఖ బ్రహ్మరులు యక్షనాగ గరుడ సిద్ద చారణులు నదీ సాగర శైలములు విద్యాధరులు ప్రజా పతియు హరియు సదా అచటనుందురు.

గంగా యమునా మధ్యము (ప్రయాగ) వృథివీ జఘన స్థానము. అని లోకత్రయ ప్రసిద్ధము. లోకత్రయమునను అంతకంటే పుణ్యకర ప్రదేశము మరిలేదు. ఆ తీర్థపు నామమును వినినను కీర్తి సచినను మృత్తికను సంపాదించినను తాకినను నరుడు పాపముక్తుడగును. గవి మకర సంక్రాంతిఁసందచట స్నానము చేసినచో రాజసూయాశ్వమేధ తుల్య ఫలము లభించును. వేదవచన లోకవచములబట్టి ఇట్లు చెప్పుట మాత్రముకాదు; (ఇది ప్రత్యక్ష సిద్దము.) ప్రాణో త్ర్కమణ సమయమందై న ప్రయాగకు పోవలెనని సంకల్పము కలుగుట మేలు. వేయికోట్ల తీర్థములును మరి అరువది కోట్ల తీర్థములును సతతమచటనేయుండును. కావున సత్త్వగుణ ప్రధానుడై యోగమనుష్టించినవానికి కలుగు సుగతి ప్రయాగలో మరణించినంత మాత్రమున కలుగును. త్రిలోక ప్రసిద్దమగు ప్రయాగతీర్థ మునకు పోవని వారేచ్చ ఔచ్చట జీవించి నను జీవించినట్లే. యమునా దక్షిణ తీరమున కంబళుడు అశ్వతరుడు ననునాగులుందురు. అచటి నీరు స్నానమాడినను తావినను సర్వపాపము క్రియగును. అచటనే శివ క్షేత్రమొకటి కలదు. అచటి కేగికను అతని వెనుక ముందు పదితరముల వారు తరింతురు. అచట స్నానమాడినచో అశ్వమేధ ఫలము కలిగి ప్రళయకాలము వరకు స్వర్గమున సుఖిం చును.

పూర్వభాగేతు గంగాయా స్త్రిషు లో కేషు భారత

 కూపం చైవతు సాముద్రం ప్రతిష్ఠానం (నే)తు విశ్రుతమ్

 బ్రహ్మ చారీ జితక్రోధ స్త్రిరాత్రం యది తిష్ఠతి

 సర్వపాపవిశుద్ధాత్మా సోశ్వమేధఫలం లభేత్

ఉత్తరేణ ప్రతిష్టానా ద్బాగీరథ్యాస్తు పూర్వత

 హంసప్రపతనం నామ తీర్థం త్రైలోక్య విశ్రుతమ్

 అశ్వమేధఫలం తత్ర స్నానమాత్రేణ భారత

 యావచ్చంద్రశ్చ సూర్యశ్చ తావత్స్వర్ణే మహీయతే

ఊర్వశీపులినే రమ్యే విపులే హంసపాండురే

 పరిత్యజతి యః ప్రాణాం చ్ఛృణు తస్యాపి య త్ఫలమ్

 పజ్జర్వర్షసహస్రాణి షష్టి ర్వర్షశ తాని చ

 వసతే పితృభిః సార్ధం సూర్యలో కే నరాధిప

 ఊర్వశీం తు సదా పశ్యే ద్దేవలోకే నరాధిప

 పూజ్యతే సతతం తత్ర ఋషిగంధర్వకిన రైః

 తతః స్వర్గపరిభ్రష్టః క్షీణకర్మా దీవి చ్యుతః

ఊర్వశీసదృశీనాంతు కన్యానాం లథలే శతమ్

 గ నా మశ్వసహస్రాణాం మహాభోగపతి ర్భవేత్

 మధ్యే నారీసహస్రాణాం బహ్వీనాం వసతి ర్భవేత్

 దశ గ్రామసహస్రాణాం భోక్తా భవతి నిత్యశ

 కాంచీనూపుర శబ్లే శ్చ సుహ్రాసౌ ప్రతిబుధ్యతే

భుక్త్వాతు భోగా నిపులాం స తీర్థం లభతే పునః

 శుక్లామ్బరధరో నిత్యం నియత సంయతేస్ట్రియః

 ఏక కాలం తు భుజాన్ మాసం శమ్భో ర్గతిర్భవేత్

 సువర్ణాలజ్కృతానాంతు నారీణాం లభతే శతమ్

 స భుక్త్వా విపులా న్బోగాం స తీర్థం లభతే పునః

 అథ సంధ్యావటే రమ్యే బ్రహ్మచారీ జితేంద్రియః

ఉపాసీత శుచిస్సంధ్యాం బ్రహ్మలోక మవాప్నుయాత్  

ఆచటనే గంగకు తూర్పున సాముద్ర కూపము అనియు ప్రతిష్టాన నగరమున నొక ప్రదేశము కలదు. జితక్రోధుడై బ్రహ్మచర్యమున త్రిరాత్రమట గడపినచో సర్వపాప విశుద్దాత్ముడై ఆశ్వమేధ ఫలమందును. భాగీరథీ గంగకు తూర్పున ప్రతిష్టానమునకు ఉత్తరమున *హంసప్రపతనమను తైలోక్య విశ్రుత మగు తీర్థము కలదు. అచట స్నాన మాత్రమున అశ్వమేధ ఫలము లభించును. ఆ చంద్ర సూర్యముగ స్వర్గమున సుఖించును. మనోహర మై విశాల మై హంసవలె తెల్లనిదగు ఊర్వశీపులినము (పులినము-ఇసుక తిన్నె) ఆనుచోట ప్రాణత్యాగమున ఆరువది ఆరు వేల సంవత్సరములు తన పితరులతో కూడ సదా ఊర్వశీ దర్శనముతో రవి లోకమున వసించును. (ఊర్వశి-అగ్ని తత్త్వాత్మిక యగు శ క్తి) అచట ఋషి గంధర్వ, కిన్నరుల సతత పూజలందుకొనుచు పుణ్యాంతమున స్వర్గ పరిభ్రష్టుడైనను ఊర్వశిని పోలు నూరుర కన్యలను కనును: ఆనముద్ర పర్యంత పృథివికి పతియగును. ధనధాన్యయుతుడు బహు సహస్ర గవాశ్వాధిపతియునగును. బహు సహస్ర నారీపతియు దశ సహస్ర గ్రామాధిపుడు నగును. అందే ! యొ డ్డాణముల సవ్వడి వినుచు నిద్ర మేల్కాంచువాడగును. ఇట్లు భోగములన్ని యనుభవించియు మరల ఈ తీర్థమున కే వచ్చును.

 ఈ తీర్థమున శుక్లాంబరధరుడు నియతేంద్రియుడునై ఏక భుక్తము చేయుచుఁ డునతడు శివ సాంనిధ్యమందును. మరల భూమిపై జన్మించియు స్వర్గ భూషణాలంకృతలగు నారీశతమునకు పతియగును. విపుల భోగముల ననుభవించి మరల ఆ తీర్థమున కేగి దాని సేవించును. అచటి సంధ్యావటమను రమ్య ప్రదేశమున శుచియు బ్రహ్మచారియు జితేంద్రియుడునై సంధ్యోపాసన చేయువాడు బ్రహ్మలోక ప్రాప్తుడగును.

(*హంసలు పొలేడిచోటు అని అర్థము. హంసలు కొంచములు మొదలగు వలన జాతి జలవకులు వర్షాకాలమున మన దేశమును విడిచి ఉత్తరమందలి ఇతర దేశములకు పోవునపుడును అచటినుండి మరల శరత్కాలమున మన దేశములోనికి వచ్చునపుడును నడుమ అవి ఈ ప్రదేశమున వాలి కొలదికాలము గడపి పోవుచుండును. అనగా ఇది ఉభయ ప్రకృతులకు అనుకూల ప్రదేశ మయి పవిత్రమయి యుండునది. అందుచేతనే దీనికా పేరు వచ్చెను.)

కోటితీర్థం సమాసాద్య యస్తు ప్రాణా న్పరిత్యజేత్

కోటిర్వర్షసహస్రాణా స్వర్గలో కే మహీయతే

 తతస్స్వర్గా త్పరిభ్రష్టః క్షీణకర్మా దివశ్చ్యుతః

సువర్ణమణిము క్తాఢ్యే కులే జాయేత రూపవా

తతో భోగవతీం గత్వా వాసు కే రుత్తరేణతు

 దశాశ్వమేధికం నామ తీర్థం తత్రాపరంభ వేత్

 కృతాభి షేకస్తు నర స్సోశ్వమేధఫలం లభేత్

 ధనాఢ్యో రూపవాక్ దక్ష దాతా భవతి ధార్మికః

 చతుర్వేదేషు యత్పుణ్యం సత్యవాదిషు యత్పలమ్

అహింసాయాంతు యో ధర్మో గమనాదేవ తత్ఫలమ్

 కురు క్షేత్రసమా గజ్జా యత్రకుత్రోవగాహితా

తస్మా దశ గుణా సాహి కాళిన్ద్యా యత్ర సజ్జతా

 యత్ర గజ్గా మహాభాగా బహుతీర్థ తపోధనా

 సిద్ధ క్షేత్రం తదుభయం నాత కార్యా విచారణా 

క్షితౌ తారయతే మర్త్యా న్నా గాం సారయతే హ్యధః

దివి తారయతే దేహం సేస తిపథగా స్మృతా

యావదస్థీని గడ్డాయాం తిష్టస్తే యస్య దేహినః

 తావద్వరసహస్రాణి స్వర్గలోకే మహీయతే

 తీర్ణానాం తు పరం ర్థం నదీ నాము మా నదీ

 మోక్షదా సర్వభూతానాం మహాపాతకినామపి

 సర్వత్ర సులభాగజ్జా తిషు స్థానేషు చుర్లభా

 గఙ్ఞాద్వారే వయాగేచ గజాసాగరసజ్గమే

తత్ర స్నా త్వా దివం యా ని యే మృతా స్తేపునర్భవాః

 సర్వేషా మేవ భూతానాం పాపోపహత చేతసామ్

 గతి మన్వేషమాణానాం నాస్తి గజ్గాసమా గతిః

 పవిత్రాణాం పవిత్రంచ మజ్జళానాంచ మజ్గళమ్

 మహేశ్వర శిరోభ్రష్టా సర్వపాపహరా శుభా

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మార్కణ్డేయయుధిష్ఠిర సంవాదే ప్రయాగ మాహాత్మ్యే చతురుత్తర శతత మోధ్యాయః

 అచటి కోటి తీర్థమున ప్రాణత్యాగముచే సహస్రకోటి సంవత్సరములు స్వర్గ సుఖమబ్బును. పుణ్యావసానమున స్వర్గభ్రష్టుడయ్యు సువర్ణ మణిముక్తి సంపన్న మగువంశమున రూపవంతుడై జనించును. వాసుకి ప్రదేశమునకు ఉ త్తరమునగల దశాశ్వమేధిక తీర్థమున స్నానమాడినచో అశ్వమేధ ఫలమందును. స్వర్గ వాసానంతరము ధనాఢ్యుడు రూపవంతుడు సమర్థుడు దాతయు ధార్మికుడునై జన్మించును. చతుర్వేదాధ్యయనము సత్యవచనము అహింస పాటించుటచే గలుగు ఫలమంతయు ఆ తీర్థగమనముచే గలుగును. గంగయందేచ్చట స్నానమాడినను కురు క్షేత్ర వాస సమాన పుణ్యము లభించును. ఆనది యమునతో కలిసిన ఈ ప్రయాగ మంతకంటే పది మడుగులు పుణ్యప్రదము. బహు తీర్థములు తపోధనులు నిండియున్న ఈ గంగా యమునా సంగమ స్థానము సిద్ద క్షేత్రమే; ఇందు సంశయమే లేదు. గంగ మూడు తొవల ప్రవహించి పాతాళమున నాగులను భూలోకమున నరులను స్వర్గమున దేవతలను తరింప జేయునది కావుననే ఆమెకు త్రిపథగయను నామము కలిగినది. ఏ ప్రాణికిగల ఎన్ని అస్థి ఖండములు గంగయందు నిలుచునో ఆతడన్నీ వేలయేండ్లు స్వర్గ సుఖమందును. గంగ తీర్థములలో ఉత్తమతీర్థ ము; నదులలో ఉ తమనది; . మహాపాతకులగు ప్రాణులకును మోక్ష మొసగునది; గంగ సర్వత సులభముగ లభించును; మూడు స్థానముందు ఆమె దుర్లభ; (చాల పుణ్యప్రదాయిని); అవి ఏవనిన గంగా ద్వారము (హరిద్వారము) ప్రయాగ గంగా సాగర సంగమము: ఈ మూడు తావులయందును స్నానమాడువారు పునరావృత్తిలేని రోక ములందుదురు; పాప కలుషిత చిత్తులై గడపి పుణ్య గతి కోరు ఆర్తులకు గంగవంటి శరణ్యము.మరిలేదు. ఆమే పవిత్రమగు వానిలో నెల్ల పవిత్ర యైనది; శుభమగు వానిలో కెల్ల శుభకరి; మహేశ్వర శిరమునుండి జారిపడి సర్వుల సర్వపాపముల పోగొట్టు శుభరూపురాలు గంగ.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను  నూట నాలుగవ అధ్యాయము.