79 - మందార సప్తమీ వ్రతము

ఈశ్వర : ఆథాత స్సంప్రవక్ష్యామి సర్వపాపవినాశ నీమ్

సర్వకామప్రదాం పుణ్యాం నామ్నా మన్దారసప్తమీమ్

మాఘస్యామలపక్షేతు పశ్చిమ్యాం లఘుభుజ్నరః

దన్తకాష్ఠం తతః కృత్వా షష్ఠ్యా ముపవ సే న్నరః

విప్రా న్త్సమూజయిత్వాతు మన్దారం ప్రాశయే న్ని శి

తతః ప్రభాత ఉత్థాయ కృతస్నానః పున ర్ద్విజాక్

భోజయే చ్ఛ క్తితః కృత్వా మన్దార కుసుమాష్టకమ్

సౌవర్ణం పురుషం తద్వ త్పద్మహస్తం సుశోభనమ్  

పద్మం కృష్ణతిలైః కృత్వా తామ్రపాత్రేఽష్టపత్రకమ్

 హేమమన్దార కుసుమై ర్భాస్కరాయేతి పూర్వతః

నమస్కారేణ తద్వచ్చ సూర్యాయే త్యనలే దళే

 దక్షిణే తద్వదర్కాయ తథార్యమ్ణేతి నైరృతే

పశ్చి మే వేదధామ్నేతి వాయవ్యాం చణ్డభానవే

 పూష్ణేత్యుత్తరతః పూజ్య మానన్దాయేత్యతఃపరమ్

 కర్ణికాయాంచ పురుషం స్థాప్య సర్వాత్మ నేతి చ

 శుక్లవస్త్రై స్సమా వేష్ట్య భక్ష్యమాల్యఫలాదిభిః

 ఏవ మభ్యర్చ్య తత్సర్వం దద్యా ద్వేద విదే పునః

 భుఞ్జీ తాత్రే లలవణం వాగ్యతః ప్రాజ్ముఖో గృహీ

 అనేన విధినా సర్వం సప్తమ్యాం మాసి మాసిచ

 కుర్యాత్సంవత్సరం యావ ద్వి త్తశాఠ్యవివర్జితః

 ఏవ మేత ద్వృతాన్తేతు విధాయ కలశోపరి

 గోభి ర్విభవతస్సార్దం దాతవ్యం భూతి మిచ్చతా

 నమో మన్దార నాధాయ మన్దార భవనాయ చ

 త్వం రవే తారయస్వాస్మా నస్మా త్సంసార సాగరాత్

 అనేన విధినా యస్తు కుర్యా స్మన్దారసప్తమీమ్

విపాప్మా స సుఖీ మర్త్య శ్శ్య కేణ దివి మోదతే

ఇమా మమౌఘపటలభీషణధ్వాన్తదీపికామ్

 గచ్ఛ న్పృగృహ్య సంసారశర్వర్యాం న స్ఖలే న్నరః  

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మన్గార సప్తమీ వ్రత కథనం నా మైకోనాశీతిత మోఽధ్యాయః

ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇక ఇప్పుడు సర్వపాపనాశకము సర్వకామప్రదము పుణ్యదము నగు మందార సప్తమీ వ్రతమును తెలి పెదను. మాఘ శుక్ల పంచమినాడు లఘువుగా భుజించవలెను. షష్టి నాడు పలు దోము కొని స్నానాదికమును చేసికొని పగలంతయు ఉపవసించి రాత్రి మందార కుసుమమును ఆహారముగా తీసికొనవలెను. సప్తమినాడు బ్రాహ్మణ భోజనము జరుపవలెను. ఆనాడు ఎనిమిది బంగరు మందార పుష్పములను.పద్మహస్తుడగు మనో హరుడగు పురుషుని బంగారు ప్రతిమను అష్టదళ సువర్ణ కమలమును రాగి పళ్లెరములో నూవులు పోసి దాని పై నుంచ వలేను. పిమ్మట ఆ అష్టదళ పద్మమునందలి దళములలో తూర్పునుండి ఈశాన్యము వరకు గల ప్రతియొక దళమును ఈ ఎనిమిది బంగారు మందార కుసుమము లతో వరుసగా- 1. భాస్కరాయ నమః-ప్రాగ్గళం పూజయామి; 2. సూర్యాయ నమః- ఆగ్నేయ దళం పూజయామి; 6. అర్కాయ నమః-దక్షిణ దళం పూజయామి; 4. అర్యమే నమః నైరృత, దళం పూజయామి; 6. వేదధామ్నే నమః పశ్చిమ దళం పూజయామి; 6. చండ భానవే నమః వాయవ్య దళం పూజయామి; 7. పూ షే నమః ఉత్తర దళం పూజయామి; 8. ఆనందాయ నమః ఈశాన్య దళం పూజయామి; ఆని పూజించవలెను. స్వర్ణ పురుష ప్రతిమను పద్మకర్ణికయందుంచి ' సర్వాత్మనే నమః' అని పూజించి నూతన శ్వేతవస్త్రము చుట్టి భక్ష్యమాల్య ఫలాదులతో అర్చించి అవి అన్ని యు వేద వేత్తయగు విప్రునకు దానమీయవలయును. ఆ రాత్రి తైల లవణములు (కారము పులుపు) లేకుండ ప్రాజ్ముఖుడై భుజించి మౌనము పాటించవలెను.

ధనమునకై లోభించక యథాశక్తిగ ఇట్లు ప్రతిమాసము సంవత్సర కాలము చేయవలెను. ప్రశాంతమున ఈ సామగ్రులను కలశముతోను గోవుతోను కూడ విప్రునకు దానము ఈయవలెను. దీనిచే సకల సంపదలు కలుగును. “మందారనాధుడు మందార కుసుమము భవనముగా కలవాడు సగు రవీ! మమ్ము సంసార సాగరమునుండి తరింప జేయుము.” అని ప్రార్థించుచు ఇట్లు మందార సప్తమీ వ్రతము చేయు నరులు పాపముక్తులై స్వర్గమున ఇంద్రునితో కూడి ఆనందింతురు: పాపము లనెడు చీకటితో నిండిన సంసార మనెడు రాత్రియందు దీపము వంటి 'ఈ వ్రతమును ఆధార ముగా తీసికొనినచో జారీ పడరు. ఈప్సితార్థ ఫలప్రదమగు దీనిని వినినను. చదివినను తెలిపినను అట్టివాడును పాపముక్తు డగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మందార సప్తమీ వ్రతమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.