213 - సావిత్రి సత్యవంతులు తమ యాశ్రమమున కేగుట.

మత్స్యః : సావిత్రీ తు తత స్సాధ్వీ జగామ వర వర్ణినీ

పథా యథా ఒగతేనైవ యత్రాసీ త్సత్యవా న్మృతః

సా సమాసాద్య భర్తారంత స్యోత్సగగతం శిరః

కృత్వా వివేళ తన్వణీ లమ్బమానే దివాకరే

సత్యవానపి నిర్ముక్తో ధర్మరాజా చ్చనై శనైః

ఉన్మీలయతి నేత్రాభ్యాం ప్రాస్ఫురచ్చ నరాధిప

తతః ప్రత్యాగత ప్రాణః ప్రియాం వచన మబ్రవీత్

క్వాసౌ ప్రయాతః పురుషో యో మా మేవం వికర్షతి

జానానీ చ వరారో హే కశ్చాసౌ పురుష శుభే

వనే ఒసిం శ్చారుసర్వాజి సుప్తస్య చ దినం గతమ్

ఉపవాసపరిశ్రాంతా కర్శితా భవతీ మయా

అస్మద్దురృదయేనాద్య పితరౌ దుఃఖితో తథా

ద్రష్టుమిచ్ఛామ్యహం సుభ్రు గమనే త్వరీతా భవ

సావిత్రీ : ఆదిత్య స్త మనుప్రాస్తే యది తే రుచితం ప్రభో

ఆశ్రమం చ ప్రయాస్యావ శ్శ్వశురౌ హీనచక్షుషో

యథావృత్తం చ తతైవ ప్రవక్ష్యామి తవాశ్రమే

సత్యవత్సహితసావిత్ర్యైస్వాశ్రమగమనమ్

ఏతావదుక్త్వా భర్తారం సహ భర్తా తదా యణా

సమాసాద్యాశ్రమం చైవ సహ భర్తా నృపాత్మజా

ఏతస్మిన్నేవ కాలేతు లబ్దచకు ర్మహీపతిః

ద్యుమత్సేన స్సభార్యస్తు పర్యతప్యత భార్గవ

ప్రియపుత్త్ర మపశ్యన్వై స్ను షాం చై వాథ కర్శితామ్

ఆశ్వాసమానస్తు తథా స తు రాజా తపోధనై

 దదర్శ పుత్త్ర మాయా న్తం స్నుషయా సహ కాననాత్

సావిత్రీచ పరారోహా సహ సత్యవతి తదా

పవందే తత్ర రాజానం సభార్యం నృపనన్దనమ్

పరిష్వక స్తథా పితా సత్యవా న్నృపనన్దనః

ఆభివాద్య తత స్సర్వా న్వనే తస్మిం స్తపోధనా

ఉవాస తత్ర తాం రాత్రి మృషిభి స్సహ ధర్మవిత్

మత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చేప్పెను: అనంతరము పతివ్రతయు ఉత్తమశ్రీయు ఆగు సావిత్రి సత్యవంతుడు మరణించిన చోటికి తానువచ్చిన త్రోవనే పోయెను; సుందరాంగియగు ఆమే సూర్యాస్తమయ సమయము నకు తన భర్తను చేరి అతని తలను తన తొడ పై నుంచుకొని కూర్చుండెను; ధర్మరాజు నుండి విడుదల పొందిన సత్యవంతుడును మెల్లమెల్లగా కన్నులు తెరవసాగేను; కదలసాగేను; మనురా జా! అనంతర మతడు ప్రాణములు మరల రాగా తన ప్రియురాలితో ఇట్లనెను: ఇంతకుమునుపు నన్ను పట్టిలాగు చుండిన ఆ పురుషుడెచ్చటికి పోయెను? శుభవగు వరారోహా! ఆ పురుషుడెవరో నీకు తెలియునా? మనోహరాంగీ! ఈ అడవిలో ని దించుచుండగనే పగలు గడచినది; నో మూలమున నీవు ఉపవాసముతో కృంగివయితివి; మనమీది బెంగతో మన తల్లిదండ్రులు దుఖించుచుందురు; వారిని త్వరగా చూడవలెనని యున్నది; త్వరగా పోదముపద; అన సావిత్రి ఇట్లనెను: ప్రభూ! మీ ఇష్టము ఎట్లో అట్లే చేయుదము; ఆదిత్యుడ స్తమించు వేళ కులోగానే ఆశ్రమమునకు పోవుదము; తల్లిదండ్రులును కన్నులు లేనివారుగదా! జరిగినదంతయు అక్కడనే . ఆ శమమునందే - చెప్పెదను: ఇంతమాత్రము చెప్పి ఆమె తన భర్తతో కూడి వెంటనే వేడ లేను; అతనితో కూడి యే ఆశ్రమమునకు చేరెను కూడ; ఆంతకు లోపలనే ఆ రాజు ద్యుమత్సేనుడును అతని భార్యయును కనులు వచ్చి యోభార్గవా! మనూ! తన అనుగు కొడుకును చిక్కియున్న కోడలును ఇంక ను రాలేదేయని పరితపించుచుండిరి; ఆచటి తపోధనులు వారిని ఓదార్చుచుండిరి; అంతలోనే తమ కోడలితో కూడివచ్చుచున్న కుమారుడు వారికి కనబడెను; ఉత్తమశ్రీ యగు సావిత్రి తన పతియగు సత్యవంతునితో కూడి రాజానందకరుడగు ద్యుమత్సేన రాజును ఆతని భార్యను నమస్కరించెను; సత్యవంతుడు తండ్రిచే కౌగిలించు కోనబడెను; ధర్మవిదుడుగు ఆ రాజకుమారుడు ఆ వనమందలి తపోధనులను అందరను నమన్కరించి ఆ రాత్రియంతయు ఆ ఋషులతోకూడ గడపెను.

సావిత్ర్యపి జగాగాథ యథావృత్త మనీన్దితా

వ్రతం సమాపయామాస తస్యామేవ తదా నిశి

తతస్తు రాత్రి యామా నే ససైన్య స్తస్య భూపతేః

ఆజగామ జన సర్వో రాజ్యార్థాయ నిమంత్రణే

విజ్ఞాపయామాస తథా తత్ర ప్రకృతిశాసనమ్

విచక్షుష స్తే నృపతే యేన రాజ్యం పురా హృతమ్

ఆమాత్యై స్సహితో రాజా భనానేవపురే నృపః

ఏత చ్ఛుత్వా యయా రాజా బలేన చతుర జి

లేభే చ సకలం రాజ్యం ధర్మరాజా న్మహాత్మనః

భ్రాతృణాం చ శతం లేభే సావిత్ర్య పి వరాజనా

మత్స్యః : ఏవం పతివ్రతా సాధ్వీ పితృపక్షం నృపాత్మజా

ఉజ్జహార వరారోహా భర్తృపక్ష స్తథై వచ

మోక్ష(చ)యామాస భర్తారం మృత్యుపాశవశం గతమ్

తస్మా త్సాధ్వ్య స్ప్రియః పూజ్యా స్సతతం దేవవ న్నరై

తాసాం రాజ నసాదేన ధార్యతే వై జగ త్రయమ్

తాసాం హి వాక్యం భవతీహ సత్యం ఫల కామా స్సకలా హ్యభిష్టాః

తస్మా త్సదా తాః పరిపూజనీయాః కామా స్త్సామగ్రా నభికామయానై

ఇతి శ్రీమత్స్య మహాపురాణే సావిత్య్రుపాఖ్యానే సత్యవత్సహిత సావిత్య్రా స్స్వాశ్రమగమనాది  కథనం నామ త్రయోదశోత్తర ద్విశతతమోధ్యాయ

తరువాత ఉత్తమ క్రియగు సావిత్రియు జరిగినదంతయు అచటి వారికి చెప్పెను; ఆ రాత్రియందే ఆమె ఉపవాసవ్రత సమాప్తిని కూడచే నెను; ఆ రాత్రి కడపటి జాము ముగియు, వేళకు ఆ ద్యుమత్సేనుని పరిజనమంతయు సైన్యమును వెంటగొని ఆ రాజును రాజ్యపాలనమునకై రమ్మని పిలువ వచ్చెను; ప్రకృతి (ప్రజా) జనమగుతమ్ము పొలించుమనియు వారు ద్యుమత్సేనుని ప్రార్ధించిరి; వారిట్లనిరి; రాజా! కన్నులులేని నీ రాజ్యమును ఎవడు ఆపహరిం చేనో ఆరాజును నీ మంత్రులు చంపివేసిరి; ఆ పురమునందు ఇపుడు నీవే రాజవు; అనగా విని ఆద్యుమత్సేనరాజు చతురంగ బలముతో పోయి మహాత్ముడగు ధర్మరాజు ననుగ్రహమున తన సకల రాజ్యమును పొందెను; ఉత్తమాంగనయగు సావిత్రియు నూరుగురు తమ్ములు కలదయ్యెను; పతివ్రతయు ఋజువరనయు వరారోహయునగు ఆ రాజ పుత్రి ఇట్లు తన పితృపక్షమును ప్రతిపక్షమును కూడ ఉద్దరిం చెను; మృత్యుపాశ వశ గతుడైన భర్తను విడిపించుకొనెను; కావున మానవులు పతివ్రతలను దేవతలనువలే పూజించవలెను; రాజా! వారి యనుగ్రహముననే ఈ జగత్రయమును నిలుపబడు చున్నది; ఈ లోకమందు వారేది పలికిన నది సత్యమే జరుగును! సకల కామ సిద్దియు కావలెనని కోరుకొనువారు సదా వారిని పూజించుచుండవలయును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సావిత్య్రు పాఖ్యానమున సావిత్రీ సత్యవంతులు స్వాశ్రమమునకు మరలి పోవుటయను రెండు వందల పదు మూడవ అధ్యాయము.