158 - తారకుడు కుమారుడు సేనానిగానున్న దేవసేనను చూచుట॥

సూతః : వామం విదార్య నిష్క్రాంతస్సుతో దేవ్యాః పున శిశుః

స్కన్నాచ్చవదనే వహ్నే శ్శు క్రత్సువదనోరిహా

కృత్తికా మేళ నాదేవ శాఖాభి స్సవి శేషతః

శాఖాభిదా స్సమాఖ్యాతా షట్సు వక్త్రేషు విస్తృతాః

యత స్తతో విశాఖోసా ఖ్యాతో లోకేషు షణ్ముఖః

స్కందో విశాఖషడ్వక్షఃకార్తికేయశ్చ విశ్రుతః

చైత్రస్య బహు కే పడే పజ్చద శ్యాం మహాబలే

సమ్భూతావర్కసదృశో విశాలే శర కాననే

చైత్ర స్యైవ సితే పక్షే పఞ్చమ్యాం పాక శాసనః

బాలకాభ్యాం చకారై కం మత్వా చామర భూతయే

తస్యామేవ తతష్టఫ్యామభిషిక్తో గుహః ప్రభుః

సర్వైరమర సక్షాత్ ర్ర్బహ్మేశో పేంద్రభాస్కరైః

గన్షమాల్యై శ్శుభైర్దూపై స్తథా క్రీడనకై రపి

ఛతైశ్చామర జాలైశ్చ భూషజైశ్చ విలేపనై కి

అభిషిక్తో విధానేన యథావతణ్ముఖః ప్రభుః

సుతామస్మై దదౌ శక్రో దేవ సేనేతి విశ్రుతామ్

పత్యర్థం దేవదేవస్య దదౌ విష్ణుస్తదాయుధాక్

యక్షాణాం దశలవాణీ దదవస్మై ధనాధిపః

దదౌ హుతాశన స్తేజో దదౌ వాయుశ్చ వాహనమ్

దదౌ క్రీడనకం త్వష్టా కుక్కుటం కామరూపిణమ్

ఏవం సురాస్తు తే సర్వే పరివారమన నకమ్

దదుర్ముదిత చేతసాః స్కన్దియాదిత్యవర్చసే

జాను భ్యామవనౌ స్థిత్వా సురసజ్ఘా స్తమస్తువ

స్తోత్రేణానేన వరదం షణ్ముఖం ముఖ రాస్సురాః

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఇటు తరువాత మరల దేవి వామ కుక్ష్మిని (ఉదరపు ఎడమ భాగము) చీల్చుకొని ఇంకొక శిశువు వేలికివచ్చెను ఇతడును శివుని ఇంద్రియమునుండి అగ్ని నోటిలోనికి సన్న మయిన (జారిపడిన) శుక్రమునుండి జనించిన వాడే; ఇతడును చక్కని మొగములు కలవాడు; అతడు వి శేషించి (దేవ తల) శత్రువుల చంపువాడు; (షట్) కృత్తికలును ఆశిశుని ఆరు శిరస్సులను ఒకటిగా కలిపిరి ఆరు మొగములుగా విస్తరిల్లిన ఈ కుమారుని రూప భేదములకే శాఖలు అని పేరు (లోక సాధారణముగ కాక) విశేషించీ కూర్చబడిన (ముఖ) భేదములు కలవాడు కావున లోకములందు ఈ షణ్ముఖుడు విశాఖుడని ప్రసిద్ధుడయ్యెను ఇట్లే శిశువులు 1 స్కంద ( శివునినుండి అగ్ని నోటియందు జారిపడిన వీర్యమునుండి జనించినవాడు; 2 విశాఖుడు (ముఖ శాఖలు విశేషముగా కూర్చబడినవాడు); 3 షడ్వక్రుడు (ఆరు మొగములు కలవాడు); 4 కార్తికేయుడు (కృత్తిక లకు సంతానము) అని ప్రసిద్దులేరి; మహాబలులగు ఈ శిశువులిద్దరును చైత్రమాసపు బహుళ పక్షమున పంచదశి (పదునై దవ తిథి అమావాస్య యందు జనించిరి; విశాల శరవణ (రెల్లువన) మున జనించిన వీరిద్దరును సూర్యసమానులు; వీరు జన్మించిన ఆరవ దినమున చైత్ర శుక్ల పంచమినాడు (ఉత్తర భారతమున మాసములు కృష్ణపక్షము తరువాత శుక్లపక్షముగా లెక్కింతురు) ఇంద్రుడు ఆ బాలకులతో (కలయిక తో) ఒ కే శిశువును నిర్మించెను దేవతల క్షేమమునకై ఆ ఇంద్రుడు ఇదే చైత్ర శుక్ల షష్ఠిదినమున ఈ ప్రభుని (సమర్థుని గుహునిగా (దేవ నేనా రక్షకునిగాగూహించు రక్షించు వానిగా) అభి షేకించెను బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు -రవి మొదలగు దేవత లెల్లరును కూడి శుభములగు గంధములు మాల్యములు ధూపములు కుమారు డింకను శిశువే కావున క్రీడ నక ములు ( ఆట వస్తువులు) ఛత్తములు చామరములు భూషణములు విలేపనములు (ప్రసి కొను గంధాదికము) మొదలగు వానితో శాస్త్ర విధానమున యథావిధిగా ఆ అభి షేకమును జరిపించిరి ఇంద్రుడి దేవ దేవునకు పత్ని గా తన పుత్తియగు 'దేవ సేన'ను ఇచ్చెను (ఇతడు ఇట్లు దేవ సేనాపతి యయ్యెను) అదే సమ యమున అతనికి విష్ణువు ఆయుధములను కుబేరుడు దశలక్ష యక్షులను అగ్ని తన తేజస్సును వాయువు వాహన (మయూర ) మును త్వష్ట దేవతల వడ్లంగి) అతనికి ఆట వస్తువుగా కామ రూపమగు కుక్కుటమును (కోడిని) ఇట్టే ఇంక ను దేవతలెల్లరును అనంతమగు పరివారమును (వస్తు వాహన జనములను) సూర్యతేజస్కుడగు ఈ నందునకు ముదిత చిత్తులయి ఇచ్చిరి!

సురలు మోకాళ్ళు నేలకు తాకునట్లు నేలపై నిలిచి గొంతుక విడిచి వర దుడగు ఆ షణ్ముఖుని ఈ చేప్పబోవు స్తోత్రముతో స్తుతించిరి

అమరకృతకుమారస్తుతిః

దేవాః : నమః కుమారాయ మహా ప్రభాయ స్కన్దాయ చాస్కన్దిత దానవాయ

నవార బిమ్బద్యుతయే నమోస్తు నమోఽస్తు తే షణ్ముఖ కాలరూపిణే

పినద్ధ నాగాభరణాయ భర్త్రే నమో రణే దారుణదారణాయ

నమోస్తు తేఽర్కప్రతిమప్రభాయ నమోస్తు గుహ్యాయ గుహాయ తుభ్యమ్

నమోస్తు తే లోకభయాపహాయ నమోస్తు తే బాలకృపాపరాయ

నమో విశాలాయత లోచనాయ నమో విశాఖాయ మహా వతాయ

నమో నమ స్తేస్తు మనోరమాయ నమో నమ స్తేస్తు గుణోత్కటాయ

నమో మయూరోజ్జ్వలవాహనాయ నమోస్తు కేయూరధరాయ తుభ్యమ్

నమో ధృతోదగ్రపతాకినేఽస్తు నమః ప్రభావప్రణతాయ తేఽస్తు

నమోస్తు ఘణ్టాధర వీర్యశాలినే క్రియాపరాణాం భవ భవ్యమూర్తయే

క్రియా పరా యజ్ఞపతిం చ స్తుత్వా విరేము రేవం హ్యమరాధిపాద్యాః

ఏవం తదా షడ్వదనంతు సేన్ద్రే ర్ముదా సుతుష్టశ్చ గుహ స్తతస్తాక్

నిరీక్ష్య నేత్త్రె రమరై స్సు రేశా ఞ్చత్రు హనిష్యామి గత జ్వరాస్థ్స

కుమారః : కం వః కామం ప్రయచ్చామి భవతాం భ్రూత నిర్వృతాః

యదప్య సాధ్యం హృద్యం వో హృదయే చిన్తితం పరమ్

ఇత్యుక్తాస్తు సురా స్తేన బ్రోచుః ప్రణతమౌళయః

సర్వ ఏవ మహాత్మానం గుహం తద్గతమానసాః

అమరులు చేసిన కుమార స్తుతి॥

గొప్ప కాంతిగలవాడును దానవులను నశింపజేయువాడును నూతన రవి బింబతేజుడును కాలరూపుడు నునగు కుమారునకు స్కందునకు షణ్ముఖునకు నమస్కారము నానా భరణములను ధరించినవాడును లోకముల కధిపతియు లోక పోషకుడును రణమునందు దారుణులగు వారినికూడ చీల్చు వాడును రవి సమానతేజుడును యోగులకు తప్ప ఎరుక వడని రహస్య స్వరూపుడును దేవ సేనా రక్షకుడును అగు నీకు నమస్కారము లోకముల భయము పోగొట్టువాడును కృపా పరుడును విశాలములయి దీర్ఘములగు నేత్రములు కలవాడును మహా శ్రేష్టవ్రతుడు (వ్రతము = కర్మము-కృత్యము)ను అగు బాలుడగు విశాఖునకు నమస్కారము మనస్సులకొనందకారుడును సద్గుణములచే అందర మించినవాడును 'ప్రజా శించు మయూరము వాహనముగా గలవాడును భుజకీర్తుల ధరించినవాడును నగు నీకు వందనము భయంకరము ఉన్న తము నగు పతాక ధరించినవాడు ప్రభావశాలుర చేత కూడ ప్రణామములందుకొనువాడు ఘంటను ధరించినవాడు వీర్యశాలి క్రియా పరులగు (పురుష కారము చేయుచుండు) వారి కై జన్మించిన మంగళ స్వరూపుడు అగు నీకు నమస్కారము యజ్ఞ పతియగు కుమారుని యజ్ఞ (హవిరహణ) పరులగు ఇంద్రాదులు ఇట్లు స్తుతించి నమస్కరించిరి అంత షణ్ముఖుడగు గుహుడు సంతుష్టుడయి ఆ ఇంద్రాదులగు దేవ శేష్టులను అమలములగు నేత్రములతో చూచి ఇట్లు పలికేను: మీరు హృదయ సంతాపము లను విడువుడు మీ శత్రువుల చంపుదును (సొమాటతో సంతృప్తి చెంది మీరు మీ కేమి కోరిక నేను తీర్చవలయునో చెప్పుడు మీ హృదయ సంకల్పితము ఆది మీకింపయినచో పౌలును ఆది ఎంత ఆసాధ్యమయినను గొప్పదనను తీర్చెదను అనగా దేవతలు నమస్కారముతో శిరస్సు వంచి మనస్సులతని యందే నిలిపి అందరును మహాత్ముడగు గుహునితో ఇట్లనిరి

దేవాః : దైత్యేన్ద్రస్తార కో నామ సర్వాయరకులా న్తకృత్

బలవాగ్దుర్జయో దుష్టో దురాచారోఽతికోపనః

తమేవ జహి హృద్యోఽర్థ ఏషోఽస్మాకం భయావహః

ఏవముక్త స్తథోత్యుక్త్వా సర్వామరపదానుగః

జగామ జగతాం నాధ స్తూయమానోఽమరేశ్వరై

తారకస్య వధార్థాయ జగతాం కణ్టక స్య వై

తతశ్చ ప్రేషయామాస శక్రో లబ్దసమాశ్రయః

దూతం దానవసింహస్య పరుషాక్షర వదినమ్

స తు గత్వాఽబ్రవీ ద్ధైత్యం నిర్భయో భీమదర్శనః

దూతః : శక్ర స్త్వామాహ దేవేశో దై త్య కేతో దివస్పతిః

తారకాసుర త చ్చ్రుత్వా ఘట శక్త్యా యథేచ్చయా

యజ్ఞగద్దళ నాదా ప్తం కిల్బిషం దానవ త్వయా

తస్యాహం శాసకస్తేఽద్య రాజాస్మి భువనత్రయే

సూతః : శ్రుత్త్వేతద్దూతవచనం క్రోధ సంర క్తలోచనః

ఉవాచ దూతం దుష్టాత్మా నష్టప్రాయవిభూతికః

తారకుడను దైత్యేంద్రుడున్నాడు వాడు సర్వదేవతా సమూహ నాశ కుడు; బలవంతుడు -దుర్జయుడుదుష్టుడు దురాచారుడు-అతి కోపవంతుడు; మాకు భయము కలిగించుచున్నాడు వానిని చంపుటయే మా హృదయమందున్న కోరిక; ఆది తీర్చి వానివలన మా భయము పోగొట్టుము అనగా కుమారుడు సరే ఆనేను మరియు ఆ జగన్నాధుడు సర్వామరులును తన వెంటరాగా అమరేశ్వరు లెల్ల జయ ధ్వనులతో తను స్తుతించుచుండ లోక కంటకుడగు తారకుని వధింప బయలుదేరెను తనకు ఇంతటి సమాశ్రయము దొరకుటతో ఇంద్రుడును దానవసింహుడగు తారకుని కడకు పరుషాక్షరములతో మాటాడగల దూతను పం పెను భయంకర రూపముగల ఆ దూతయు వాని కడకుపోయి నిర్భయు డై ఇట్లు పలికెను: తార కా! దేవేశుడు స్వర్గపతియగు ఇంద్రుడు (నా ద్వారమున నీతో) ఇట్లు చెప్పుచున్నాడు; అది విని ఇచ్చకును శ క్తికిని తగినట్లు చేయుము “దానవా! నీవు లోకములను చీల్చి బాధ కలిగించి) పాపము నంపాదించితివి భువనత్రయ పాలకుడనగు నేను ఇపుడు నిన్ను అదుపులో ఉంచెదను” (ఇది ఇంద్రుని సం దేశము) తన విభవమంతయు చాలవరకు అప్పటికే నశించియున్న దుష్టాత్ముడు ఆ తారకుడు దూత వచనము విని క్రోధ సంరక్ష నేత్రుడయి ఇట్లనెను:

తారకః : దృష్టం తే పౌరుషం శక్ర రణేషు శతశో మయా

నిస్త్రవత్వాన్న తే లజ్జ విద్యతే శక్ర దుర్మతే

సూతః : ఏవము క్తే గతే దూతే చిన్తయామాస దానవః

నా లబ్దసంశ్రయశ్శక్రో వక్తు మేవం హి చార్హతీ

జిత స్స శక్రో నోఽకస్మాజ్ఞాయతే సంశ్రయాశ్రయః

నిమిత్తాని చ దుష్టాని సోఽపశ్య నా శవేదినః

పాంసువర్షమసృక్పాతం గగనాదవనీతలే

భుజనేత్రప్రకమ్పంచ వక్రోషం మనో భ్రమమ్

స్వకాన్తవ స్త్రీపద్మానాం మ్లానతాం చావలోకయత్

దుష్టాంశ్చ ప్రాణినో రౌద్రా న్త్యో పశ్య దుష్ట వేదినః

తదచిన్యైవ దితిజో న్యస్త (స్వస్థ)చిత్తోభవత్క్షణాత్

యావద్గజఘటాఘణ్టారణత్కార రవోత్కటామ్

తావత్తురజ్గనజాత క్షుణ్ణభూ రేణుపిఞ్జరామ్

సైన్యై స్సేనాబలోదగ్రధ్వజరాజివిరాజితామ్

విమానై శ్చాద్భుతాకారై శ్చలితామర చామరైః

తాం భూషణనిబద్ధాంచ కిన్న రోద్గీతనాదినీమ్

నానానాక తరూత్ఫుల్లకుసుమాపీడ ధారిణీమ్

వికోశాస్త్రపరిష్కారాంవర్మనిర్మలదర్శనామ్

వన్ద్యుద్ఘుష్టస్తుతిర వాం నానావాద్యనినాదితామ్

సేనాం నాకసదాం దైత్యః ప్రాసాదస్థో వ్యలోకయత్

చిన్ల యామాన్త స తదా కిఞ్చిదుద్భ్రాన్త మానసః

అపూర్వః కో భవేద్యోద్ధా యో మయా న వినిర్జితః

తతశ్చిన్తాకులో దైత్యశుశ్రువే వికటాక్షరామ్

సిద్ధవన్దిభిరుద్ఘుష్ట మిదం హృదయదారణమ్

శక్రా! నేను వందలమారులు రణమున నీ పౌరుషమును చూచితిని దుర్మతివి; నీకు బిడియమును సిగ్గును రెండును లేవు కనుక ఇట్లు మాటాడుచున్నా వు; అని తారకుడు వలుకగా విని దూత వెడలిపోయెను తరువాత ఆ దానవు డిట్లాలోచించేను: “ఏదియో ఆశ్రయము దొరుక నిదే ఇంద్రుడు ఇట్లు పలుక జాలడు; ఓడిపోయినవాడు ఆకస్మికముగా సంశ్రయమును దేనినో ఆశ్రయముగా పొందియుండును”ఇట్లనుకొనుచుండగనే వానికి (తమ) సౌశ మును తెలుపు దుర్ని మీ తములును కనబడెను ధూళివానర కపాతము ఆక సమునుండి నేలపై పడుట( ఎడమ భుజము నేత్రము అదరుట నోరు ఎండుట మనోభ్రమము తన భార్యల ముఖ పద్మములు ( అకారణముగా) వాడి పోవుట దుష్ట ప్రాణులు మరింత రౌద్రరూపములగుట దుష్ట సూచనలు ఇట్టివి వానికి కనబడెను ఐనను వాడు వానిని లెక్క పెట్టక క్షణములో స్వస్థచిత్తుడై ఈ విషయములను ఆలోచించుట మానెను అంతలో వాడు తన ప్రాసాదము నాగోహించగా వానికి దేవ సేన కనబడెను అది గజముల మందల ఘ'టల ఘణతారరవముతో హద్దు మీరి గుర్రముల గుంపులు నలగ గొట్టిన భూమి రేణువులతో ఎరుపు కలిసిన వర్ణము కలిగి సేనా బలములతోను భయము గొల్పు ధ్వజముల శ్రేణులతోను ప్రకాశించుచు నుండెను ఇంక ను ఆ సేన ఆశ్చర్యము గొలుపు ఆకృతిగల విమానములును కదలుచున్న చామరము లును భూషణాలంకార నిబంధములును కిన్నరులు బిగ్గరగా పొడుపాటలు ఆనేక ములగు స్వర్గీయ వృక్షములందు పూచిన వూలతో కూర్చిన కొప్పులు ఒరనుండి బయటకు తీసిన ఖడ్గాద్యాయుధాలంకార శోభలు వంది జనులు బిగ్గరగా పాడు స్తోత్రముల ధ్వనులు నానా వాద్య ధ్వనులు కలిగి ఉండెను

ఇది చూచి తారకుడు కొంచెముగా తన మనస్సు ఉద్రా స్తము కాగా నాచే ఓటమి తినని కొత్త యోధుడు ఎవ్వడై యుండును? అని ఆలోచించుచు కలత నొందసాగేను ఇంతలో పానీకి వికట పరుషాక్షరములతో సిద్ద (దేవతా జాతి) వంటిజనులు బిగ్గరగా పొడుచుండిన హృదయ దారణమగు ఈ “గాథ " వినబడేను:

ఆథ గాథా

జయతులశక్తీదీధితిపిఞ్జర - భుజదణ్డచణ్డరణరభస - సురవదన కుముద కాననవికాసనేన్దో - కుమారవర –జయ దితిజకులమహోదధిబడబానల-షణ్ముఖ-మధురరవమయూరరథ-సురముకుటకోటిమట్టిత చరణనఖాజ్కురమహాసన-జయ లలితచూడాకలాపవనమలదళ కమలకాన్త - దైత్యేశవంశదుస్సహదావా నల- జయ విశాఖ విభో-జయ బాల సప్తవాసర - దేవ సేనానాయక జయ నకలలోక తారక-సన-జయ గౌరీ నన్దన-ఘణ్టాప్రియ-ప్రియ-విశాఖ-విభో-ధృతపతాక ప్రకీర్ణ ప్రచలకనక భూషణ భాసుర దినకర చ్ఛాయ - జయ జనిత సమమలీలాలూనాభిలారాతే- జయ సకలలోక తారక దితిజాసుర వర తారకా నక - జయ భువనావళిశాక వినాశన!

ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవాసుర సజ్జా తారకకృతదేవ సేనా వలోకనకథనం నామ అష్టపఞ్చశదుత్తరశతతమోఽధ్యాయః

గాథార్థము

సాటిలేని శ క్తియను ఆయుధపు కాంతులతో పింజర వర్ణుడా! భుజదండములతో భయంకరమగు యుద్దావేశము కలవాడా! దేవతా ముఖములనెడు కలువలకు వికాసము కలిగించు చంద్రా! కుమారులలో ! శేష్టుడా! నీకు " జయము; డైత్యవంశ మహా సముద్రమునకు బడ బాగ్నీ ! షణ్ముఖా! మధుర ధ్వనిగల నేమిలిని పూనిచిన రథము కలవాడా! దేవతల కిరీటముల కొనలతో నలిగిన కాలి గోళ్ళ మొలక లతో కూడిన మహాపీఠము కలవాడా! నీకు జయము; సుందరమగు వెంట్రుకల కొప్పను కమల వనమందు ఉండిన విమల దళములు కల కమలములతో అందమగువాడా! దైత్యరాజ వంశమునకు సహింపరాని దావాగ్నీ ! నీకు జయము; ప్రభూ! విశాఖా! ఏడు దినముల పసిపోడా! సకలలోక తార కా! నందొ! గౌరీనందనా! ఘంటా ప్రియా ప్రియా! విశాఖా? విభూ! దేవ సేనానాయకా! పతాక లను దాల్చినవాడా! చేదరి పోయి మిగుల కదలు చున్న బంగరు సొమ్ములతో ప్రకాశించువాడా! సూర్యతేజస్కా! నీకు జయము; యుద్ద సంభ్రమమున ఆవలీలగా (ఆటగా) సమస్త శత్రువులను ఖండించువాడా! సకల లోక తారకాః దితి సంతానమగు అసురులలో ! శేష్టుడగు తారకునకు యముడా! భువన సమూహ శోక వినాశ నా! జయము

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున తారకుడు దేవ సేనను చూచుటయను నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము