68 - సప్తమీ స్నపన వ్రతము

 నారదః : కి ముద్వేగాద్భుతే కృత్య మలక్ష్మీః కేన హన్యతే

మృతవతాభి షేకాదికార్యేషు చ కిమిష్యతే

 పురా కృతాని పాపాని ఫల స్త్యస్త్మిం స్తపోధన

 రోగదుః ఖాదిరూపేణ తథై వేష్టవధేన చ

తద్వినాశచ వక్ష్యామి సదా కల్యాణకారకమ్

స ప్రమీస్నపనం నామ జనపీడావినాశనమ్

బాలానాం మరణం యత్ర క్షీరపానాం ప్రదృశ్యతే

తద్వ ద్వృద్దనరాణాంచ యౌవనే చాపి వర్తతామ్

శాన్తయే తత్ర వక్ష్యామి మృతవత్సాది కే చ యత్

ఏతదే వాద్భుతో ద్వేగచిత్తభ్రమవినాశనమ్

భవిష్యతిచ పారా హే యత్ర కల్పే తపోధన

వైవస్వతంచ తత్రాపి యత్రా నర మనుత్తమమ్

 భవిష్యతిచ తత్రాపి పఞ్చవింశతిమం తథా

 కృతం నామ యుగం తత్ర హైహయాన్వయవర్దనః

భవితా నృపతి ర్వీరః కృతవీర్యః ప్రతాపవాక్

స సప్తద్వీప మఖిలం పాలయిష్యతి మణ్డలమ్

యావద్వర్ష సహస్రాణి సప్తసప్తతి నారద

జాతమాత్రంతు తత్రాపి యావత్పుత్త్రశతం తథా

 చ్యవనస్యకు శా పేన వినాశ ముపహాస్యతి

 సహస్రబాహుశ్చ తతో భవితా తస్య వై సుతః

సంయుత శ్శజ్ఖచక్రాదిచక్రవర్తిత్వలక్ష ణైః

 కృతవీర్య స్తదాగత్య సహస్రాంశుం దివాకరమ్

ఉవవాసవ్రతై ర్దివ్యై ర్వేద సూక్తైశ్చ నారద

పుత్త్రేస్య జీవనాయాల మేతత్స్నాన మవాప్ప్యతి

 కృతవీర్యేణవే పృష్ట ఇదం వక్ష్యతి భాస్కరః

ఆ శేషదుఃఖశమనం కలికల్మషనాశనమ్

నారదుడు ఈశ్వరుని ఇట్లు ప్రశ్నించెను: ఉద్వేగము (భయమును కలవరపాటును) కలిగించు ఆద్భుత విషయములు సంభవించినపుడు ఏమి చేసిన చో వాటివలన సంభవించు అశుభము నశించును? శిశు మరణము ఆభి షేకము మొదలగు కార్యములందు (అశుభ నివారణము శుభవృది కలుగుటకు) ఏమి చేయవలయును?

ఈశ్వరుడు ఇటు చెప్పెను: నారదమునీ! పూర్వ జన్మమున చేసిన పాపములు ఈ జన్మమున రోగములు ఇతర దుఃఖములు ఇష్ట జనుల మృతి మొదలగు రూపముస ఫలించును. అవి నశించి శుభము కలిగించు విధానమును చెప్పెదను. బాలురును పాలు త్రాగు శిశువులు వృద్ధులు యౌవనస్థులు ఆకస్మికముగ మరణించుట . మరణించిన శిశువులు జన్మించుట ఆశ్చర్యకరములు భయాకులత్వమును కలిగించునవి అగు సంఘటనలు జరుగుట మొదలగు జనపీడ లను నశింప జేయు ‘స ప్రమీస్న పనము’ అను శాంతి ప్రక్రియ కలదు.

రాబోవు వరాహకల్పమున వైవస్వత మన్వంతరమున ఇరువది పెదవ మహాయుగమున హైహయ వంశమున కృతవీర్యుడను రాజు పుట్టి డెబ్బది ఏడు వేల సంవత్సరములపాటు సప్తద్వీపసహిత భూమండలమును పాలించును.  చ్యవ నుని శాసమున అతని నూరుగురు కుమారులు పుట్టిన వెంటనే మరణింతురు. అతని కే సహస్రబాహుడు కాబోవు కమా రుడు (అర్జునుడు) శంఖచక్రాది ( రేఖారూప) చక్రవర్తిత్వ లక్షణములతో పుట్టును. ఈ పుత్రుడు (చ్యవన శాపముచే మర ణించక) జీవించుటకై కృతవీర్యుడు సూర్యుని అడుగగా అతడు అతనికి ఉపవాస వ్రతములతో వేదసూక్త పారాయణము మొదలగు వానితో కూడిన ఈ సూత్రము జంబును ప్రకియ ఆ శేష దుఃఖ శాంతిని కలిగించి కలి కల్మషములను నశింపజేయును.

సూర్యః : అలంక్లే శేన మహతా పుత్త్ర స్తవ సరాధిప

భవిష్యతి చిరంజీవి కలికల్మషనాశనమ్

 సప్తమీస్నపనం వక్ష్యే సర్వలోక హితాయ వై

జాతస్య మృతవత్సాయాః సప్తమే మాసి నారద

 అథవా శుక్లసప్తమ్యా మేతత్సర్వం ప్రశామ్యతి

 గ్రహతారాబలం లబ్ధ్వా కృత్వా బ్రాహ్మణవాచనమ్

బాలస్య జన్మనక్షత్రపాథిదేవా న్యజే ద్బుధః

 తద్వ ద్వృద్దనరాణాంచ కృత్యం స్యా దిత రేషు చ

గోమయే నానులిప్రాయాం భూమా వేకాగ్రవ త్తదా

తణ్డులై రక్తశాలీయై ర్బహుగో క్షీరసంయుతే

నిర్వ పే తూర్యరుద్రాభ్యాం తన్మన్త్రాభ్యాం విధానతః

కీర్తయే త్సూర్యదై వత్యం సప్తార్చిశ్చ ఘృతాహుతీః

 జుహుయా త్సూర్యసూ కేన తద్వ ద్రుద్రాయ నారద

హోతవ్యా స్సమిధ స్తత్ర తథై వారపలాశయోః

యవకృష్ణతిలైర్హోమః కర్తవ్యోఽ ష్టశతం పునః

వ్యాహృతీభి రథాజ్యేన తథై వాష్టశతం పునః

హుత్వా స్నానంచ కర్తవ్యం మజ్గళాజ్గేన ధీమతా

విప్రేణ వేదవిదుషా విధివ ద్దర్భపాణినా

స్థాపయిత్వాఽథ చతురః కుమ్భా న్కోణేషు శోభనా  

పఞ్చమఞ్చ పున ర్మధ్యే దధ్యక్షత సమన్వితమ్

స్థాపయే దవ్రణం కుమ్బం సప్తార్చే నాభిమ స్త్రీతమ్

 సౌరభ్యేణాథ తోయేన పూర్ణా న్పల్లవసంయుతా

సర్వా న్త్సర్వౌషధియుతా ఞ్చ్వేత దూర్వాఫలాయు లౌక్

పఞ్చరత్నైశ్చ సంయుక్తా న్వాసోభిః పరివేష్టితాక్

గజాశ్వరథవల్మీక సజ్గమహ్రదగోకులాత్

 సంశుద్దమృద మాదాయ సర్వేష్వథ నిధాపయేత్

చతుర్ ష్వథచ కుమ్భేష పఞ్చమం చాపి మధ్యమమ్

 వేష్టయేద్వస్త్రయుగ్మేన సౌరాన్మన్త్రా దీరయేత్

 సప్తభిశ్చాథ నారీఖి రవ్యజ్గాజ్గాభి రేవచ

 పూజితాభి ర్యథాశ క్త్యా మాల్యదస్త్రవిభూషణైః

 సవి ప్రాభిశ్చ కర్తవ్యం మృతవత్సాభిషేచనమ్

సూర్యుడిట్లు చెప్పెను: రాజా! (కృత వీర్యా!) నీవు ఎక్కువ క్లేశము పొందవలసిన పని లేదు. నీ కుమారుడు చిరంజీవి కాగలడు. కలికల్మష నాశకమగు సప్తమీ స్నపనము (సప్తమినాడు స్నానము చేయించుట) అను స్నాన ప్రక్రియను సర్వలోక హితమునకై చెప్పెదను.

[కాలము] మరణించిన శిశువులు పుట్టుట పాలు త్రాగెడి శిశువులకు మరణాంతమగు వ్యాధులు కలుగుట మొద లగునవి సంభవించినపుడు తల్లి గర్భవతియైన ఏడవ మాసమునగాని బిడ్డని శై శవమున శుక్లపక్ష సప్తమినాడు కాని శిశువు నకు గ్రహతారాబలములు బాగుగా నున్న దినమున కానీ బాలుని జన్మ తిథి జన్మనక్షత్రములందు కాని శాస్త్ర సంప్రదాయ ముల నెరిగి దేవతల నారాధించవలయును. వృద్ధులు యువకులు మొదలగు వారికి ఆకస్మికముగ మరణాంతక వ్యాధులు ఉపద్రవములు కలిగినను అద్భుతములు సంభవించినను ఈ సప్తమీ న్న వనము జరుపవలేను.

[స్థానము] గోమయముతో అలికిన ప్రదేశమున (స్థితి) ఏకాగ్రభావముతో ఈ సప్తమీ స్నపనము చేయవలెను. (ద్రవ్యములు) ఎర్రని వడ్లనుండి చేసిన బియ్యముతో ఎక్కువ పరిమాణముగల ఆవుపాలతో మొదట సూర్యదేవతాక ములు రుద్రదేవతాకములు నగు మంత్రములతో ఆగ్ని లో ఆహుతులను వేల్చవలెను. తరువాత సూర్యదేవతాక ములును రుద్ర దేవతాకములు ఆగు సూక్తములతో వేరు వేరుగ ఈ ఇద్దరు దేవతల నుద్దేశించి ప్రతి ఋక్కుతోను స్వాహా ఆనీ పలుకుచు) నేతితో తడిపిన జిల్లేడు- మోదుగ సమిధలతోను యవలతోను నల్లని నూవులతోను. నేతితో నూటఎనిమిదేసి సారులు ఆహు తులు వేయవలెను.

తరువాత మంగళ పవిత్ర ద్రవ్యములతో మంగళ స్నానము జరుపుకొని యజమానుడు మంగళాలంకారములు వస్త్రములు ధరించి మంగళ శ రీరుడు కావలెను. వేదవిదుడు దర్భ పవిత్రపాణి యగు బ్రాహ్మణునిచే నాలుగు కోణము లందును రంధములు లేని నాలుగు (మామిడి పల్లవములు మొదలగునవి ఆలంకరించిన) మంగళ కలశములను స్థాపింప జేయవలెను. నాలుగింటికి నడుమ రంధ్రములేని మరియొక ఐదవ కలశమును నిలుపవలెను. దానియందు పెరుగును అక్షతలను వేయవలెను. (అక్షతము-దెబ్బ తిననిది; నడుము విరుగకుండునట్లు జోటిలో దంచి చేసిన బియ్యము అక్షతలు; అంతేకాని వేరు విధమగునవి కావు.) దీనిని అగ్ని దేవతాక ములగు మంత్రములతో అభిమంత్రించవలెను. ఈ ఐదిటిని సుగంధ జలముతో నింపవలేను. వాటియందు రావి మామిడి జువ్వి మొదలగు చిగుళ్లను అన్ని విధములగు ఓషధులను (భృంగము మొదలగునవి) తెల్ల గరికను ఫలములను కూడ వేయవలెను. పంచరత్నములను కూడ వేయవలెను. నూతన వస్త్రములతో చుట్టవలెను. ఏనుగలు గుర్రములు రథములు గోవులు మొదలగునవి తిరుగు స్థలములనుండి పుట్టనుండి నదీద్వయ-నదీసాగర-సంగమ ప్రదేశములనుండి సంపాదించిన శుద్దమగు (జల్లించిన) మట్టి కూడ వానితో వేయవలెను. నడుమ నున్న ఐదవ కలశమును మాత్రము రెండు వస్త్రములతో చుట్టవలెను. అంతట సూర్యదేవతాకములగు మంత్రము లను పఠించవలయును. అంగ వైకల్యములేని  ఏడుమంది ముత్తైదువలను ఏడుమంది బ్రాహ్మణులను యథాశక్తిగా పూలతో వస్త్రములతో అలంకరణములతో సంపూజించి వారిచేత మరణించునంత దుర న్తములగు వ్యాధులకు లోనై బాధ పడుచున్న ఈ శిశువును (బాలుడుకాని బాలిక కాని) స్నానము చేయించవలెను.

దీర్ఘాయురస్తు బాలోఽయం జీవవత్సా చ భామినీ

ఆదిత్య శ్చన్ద్రమా స్సార్థం గ్రహనక్షత్రమణ్డలైః

 శక్రశ్చ లోకపాలాశ్చ బ్రహ్మ విష్ణు ర్మహేశ్వరః

 ఏతే చాన్యేచ దేవౌఘా స్సదా పాన్తుకుమారకమ్

మాత్రాఽశ నిర్మా హుతభుజ్మా చ బాలగ్రహాః క్వచిత్

పీడాం కుర్వన్తు మా మాతు ర్జనకస్య జనస్య వే

 తత్ప్ర శుక్లామ్బరధరా కుమారపతిసంయుతా

పద్మజం పూజయే ద్భక్త్యా సదస్యాంశ్చ గురూన్పునః

 కాఇ్చనించ తతః కృష్ణతిలపాత్రోపరి స్థితామ్

 ప్రతిమాం ధర్మరాజస్య గుర వేతు నివేదయేత్

వస్త్రకాఞ్చనర త్నౌఘై రకై స్సఘృతపాయ సై:

 పూజయేద్భ్రాహ్మణాం స్తద్వ ద్విత్తశాఠ్యవివర్జితః

భుక్త్వాచ గురుణా చేయము చ్చొర్యా మంత్రసన్తతిః

 దీర్ఘాయురస్తు బాలోఽయం యావద్వర్ష శతం సమాః

యత్కిఞ్చి దస్య దురితం క్షిప్తం త ద్బడబానలే

బ్రహ్మా రుద్రో వసు స్స్కన్దో విష్ణు ర్దేవో హుతాశనః

రక్షన్తు సర్వదుఃఖేభ్యో వరదా స్సన్తు సర్వదా

ఏవమాదీని వాక్యాని వదస్తు పూజయే ద్గురుమ్

శక్తిత కపిలాం దద్యా త్ర్పణిపత్య విసర్జయేత్

 చరంచ పుత్త్ర సహితా ప్రణమ్య రవిశజ్కరౌ

 హుత శేషం తదాశ్నీఽ యా దాదిత్యాయ నమోఽ స్త్వితి

 ఇదమే వాద్బుతోద్వేగ దుస్స్వప్నేషు చ శస్యతే

కర్తు ర్జన్మాదిఋక్షాణాం దేవా న్త్సమ్పూజయే తదా

 శాన్త్వర్థం శుక్ల సప్తమ్యా మేవం కుర్వ న్న సీదతి

స చానేన విధానేన దీరాయు రభవ న్నృపః

 సంవత్సరాణాం ప్రయుతం శశాస పృథివీ మీమామ్

పుణ్యం పవిత్రమాయుష్యం సప్తమీస్నపనం రవే

 కథయిత్వా ద్విజ శ్రేష్ఠం తత్రైవాన్తర ధీయత

 ఆరోగ్యం భాస్కరా దిచ్ఛే ద్ద్రవ్య మిచ్ఛే ద్దుతాశనాత్

 ఈశ్వరాద్జ్ఞాన మన్విచ్ఛే ద్గతి మిచ్చే జ్ఞానార్ధనాత్

ఏత న్మహాపాతక నాశనం స్యా దప్యక్షయం వేద విదో వదన్తి

 శృణోతి యశ్చైన మనన్య చేతా  స్తస్యాపి సిద్ధిం మునయో వదన్తి

ఇతి శ్రీమత్స్య మహాపురాణే మత్స్యమను సువాదే సప్తమీన్న పన వ్రతకథనం

నామాష్టషష్టిత మోఽధ్యాయః

స్నాన సమయమున ఆచార్యుడు ఈ ఆర్థ మిచ్చు మంత్రములను పలుకవలయును. “ఈ బాలుడు (బాలిక) దీర్ఘాయువగుగాక! ఈ శ్రీ (మాత) జీవించిన శిశువు కలది యగుగాక! ఆదిత్యుడు, చంద్రుడు గ్రహములు నక్షత్ర (మండల)ములు ఇంద్రుడు లోకపాలురు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ఇతర దేవతలును ఈ కుమారకుని (కుమారిక ను) సదా రక్షింతురు గాక ! ఇచట పిడుగుకాని అగ్ని కాని బాలగ్రహములు కాని ఈ శిశువునకును తల్లిదండ్రులకును ఏ పీడను కలుగ నీయకుందురు గాక !”

తరువాత ఈ శిశుమాత శిశువుతోను భర్తతోను కూడి . బ్రహ్మదేవుని సభయందలి పెద్దలను గురువులను పూజించవలెను. తరువాత ఒక తామ్ర పాత్రయందు నల్లని నూవులను నింపి దాని పై బంగారు (యమ) ధర్మరాజ ప్రతిమను ఉంచి దానినంతటిని గురువునకు సమర్పించవలెను. పిమ్మట వస్త్రములు బంగారు రత్నములు ఇచ్చి పిండివంటలు నేతి పాయసములు- వీనితో బ్రాహ్మణులను భుజింపజేసి పూజించవలయును. గురుని కూడ భుజింపజేయవలెను.

అపుడు గురువు ఈ యర్ధమునిచ్చు మంత్రములను పలుకవలయును: “ఈ బాలుడు (బాలిక) దీర్ఘాయువగుగాక ! నూరేండ్లు నిండుగా జీవించుగాక ! ఈ శిశుని పాపమంతయు బడబానలములో పడుగాక ! బ్రహ్మ రుద్ర వసు సుబ్రహ్మణ్య విష్ణు హుతాశనులు ఈ శిశువును అన్ని దుఃఖములనుండి కాపాడుచు వరముల నిత్తురుగాక!”. ఈ మొదలగు వాక్యములు మంత్ర రూపమున పలికిన గురుని యథాశ క్తిగ సమ్మానించి శ క్తియున్న చో కపిల గోదానము , చేసి నమస్క రించి వీడ్కొనవలయును.

తరువాత శిశుమాత శిశువుతో కూడి రవి శ కరులను నమస్కంచి హోమము చేయగా మిగిలిన ‘చరు’ ద్రవ్యమును ‘ఆదిత్యాయ నమోస్తు’ అనుచు భుజించవలయును. (చరువు. ఆవిరి బయటికి పోనీయక అత్తెసరుతో పాలతోనో నేతితోనో నీటితోనైన వరిబియ్యపు-గోధుమ నూక -యవలనూక - సీనిలో దేనితోనైన చేసిన అన్నము.)

ఈ విధానము ఆశ్చర్యకరములగు అపురూవపు సంఘటనలు జరిగినపుడు కలవరపాటు భయము కలిగించు సంఘటనములు దుస్స్వప్నములు సంభవించినపుడు కూడ ప్రశస్తమయినది. యజమానుని జన్మ నక్షత్రము మొదలగు నవి కల దినమున ఆయా నక్షత్రాధిదేవతలను పూజించవలయును. లేదా శుక్లపక్ష సప్తమినాడై నను ఈ శాంతి జరుప వచ్చును. (అందుచేతనే దీనికి సప్తమీ స్నపనమని పేరు.) దానివలన ఉపద్రవములు శాంతించును. శుభము కలుగును.

కృతవీర్యుడు సూర్యుని ఉపదేశానుసారము ఈ శాంతిక స్నానము తన కుమారునకు జరిపించుటచేతనే అతడు ఆర్జునుడు దీర్ఘాయుష్మంతుడై లక్ష సంవత్సరము లీ పృథివిని పాలించెను.

అని ఇట్లు సప్తమీ స్నపన ప్రక్రియను కృతవీర్యునకు తెలిపి రవి అంతర్ధానమునందెను.

రవినుండి “ఆరోగ్యమును అగ్ని నుండి ద్రవ్యమును ఈశ్వరుని నుండి జ్ఞానమును విష్ణునినుండి సద్గతిని కోరవలయును.(పొందవలయును.)

ఈ స్నాన విధానము మహాపాతక నాశనము; అక్షయ ఫలప్రదము; అని వేదతత్వ వేత్తలు చెప్పుదురు. అనన్య చితులే దీనిని వినిన వారికి కూడ దీనిని యథా విధానముగ ఆచరించిన ఫలము కలుగునని మునులు చెప్పుచున్నారు.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సప్తమీ స్నపన విధానమను ఆరువది ఎనిమిదవ అధ్యాయము.