మత్స్య మహా పురాణము
200 - వసిష్ఠ గోత ప్రవరాను కీర్తనము -వసిష్ఠ నిమి చరితము॥
శ్రీమత్స్య : వసిష్ఠస్తు మహాతేజా నిమేః పూర్వపురోహితః ।
బభూవుః పార్థివ శ్రేష్ఠ యజ్ఞా స్తస్య సమ స్తత॥
శ్రాంతాత్మా పార్థివ శ్రేష్ట విశ శ్రామ తథా గురుః ।
తం గత్వా పార్థివ శ్రేష్ఠో నిమి ర్వచన మబ్రవీత్॥
భగవ న్యష్టు మిచ్చామి తన్మాం యాజయ మా చిరమ్ ।
తము వాచ మహాతేజా వసిష్టః పార్థివో త్తమమ్॥
కళ్చాత్కాలం ప్రతీక స్వ తవ యజ్ఞ స్సునంస్కృతై : ।
భృశం శ్రావో ఒస్మి విశ్రమల యాజయిష్యామి తే నృప॥
ఏవముక్తః ప్రత్యువాచ వసిష్టం నృపసత్తమః ।
పార లౌకిక కార్యేషు కః ప్రతీక్షితు ముత్స మాత్॥
న చ మే సౌహృదం బ్రహ్మ నృతా నేన బలీయసా ।
ధర్మకార్యే త్వరా కార్యా చలం యస్మాద్ది జీవితమ్॥
ధర్మపథ్యాదనో జన్తు ర్మృతో ఒపి సుఖ మశ్నుతే ।
శ్వః కార్య మద్య కుర్వీత పూర్వా ప్లే చావరాహ్లికమ్॥
న హి ప్రతీక్షతే మృత్యుః కృతం వా యది వాఒకృతమ్ ।
క్షేత్రాపణ గృహాసక్త మన్యతగతమానసమ్॥
వృక జ్చోరణ మాసాద్య మృత్యు రాదాయ గచ్ఛతి ।
నై కా నేన ప్రియః కశ్చిద్ ద్వేష్యశ్చాస్య న విద్యతే॥
ఆ ఆయు ష్యే కర్మణి క్షీణే ప్రసహ్య హరతే జనమ్ ।
ప్రాణవాయో శ్చలత్వం చ త్వయా విదిత మేవ చ॥
యత్ర వా జీవతే బ్రహ్మ క్షణమాత్రం త దద్భుతమ్ ।
శరీరం శాశ్వతం మన్యే విద్యాభ్యా సే ధనార్జనే॥
అశాశ్వతం ధర్మకార్యే ఋణవా నస్మి సజ్క టే ।
సోహం సమృతసమారో భవన్మూల ముపాగతః॥
న చే ద్యొజయ హే మాం త్వ మన్యం యాస్యామి యాజకమ్ ।
ఏవ ముక్త స్తదా తేన నిమినా బ్రాహ్మణోత్తమః॥
శ శాప తం నిమిం క్రోధా ద్విదేహ స్వం భవిష్యసి ।
శ్రాంతం మాం త్వం సముత్సృజ్య యస్మా దన్యా న్విజోత్తమాక్॥
ధర్మజ్ఞస్తు నరేంద్రః త్వం యాజక నర్తు మర్హసి ।
మత్స్య జనార్దనుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను: మహాతేజుడగు వసిష్ఠుడు నిమియను రాజునకు పూర్వ పురోహితుడు; రాజ శ్రేష్ఠా! నిమి ఎల్లప్పుడును అనేక యజ్ఞముల ననుష్ఠించుచుండెడి వాడు; అవి అన్నియు అనుష్ఠింప జేసిచేసి గురుడగు ॥ వసిష్ఠుడు ఆలసి విశ్రాంతికొనెను॥ అట్టి అతని కడకుపోయి నిమి "భగవన్! నేను యజింప సంకల్పించుచున్నాను॥ నీవు వెంటనే వచ్చి నా చే యజనము నిర్వర్తింపజేయు"మనెను॥ మహాతేజుడగు॥ వసిష్టుడా పార్టీ వోత్తమునితో “కొంచెము కాలము ఓపిక పట్టుము; నీవు జరిపిన యజ్ఞములను చక్కని సంస్కారములతో జరిపించి జరి పించి మిగుల బడ లియున్నా ను॥ కావున నృపా! విశ్రమించిన పిదప యజింపజేయుదును॥” అనెను॥ ఇట్లనిన గురునితో నిమి యిట్లు మారు పలికెను: పార లౌకిక కార్యములందు ఎవడు ప్రతీక్షించు (ఎదురుచూచు చుండగోరును? యముడు బలియుడు॥ అతనికి నా పై ఏమియు మైత్రీభావము లేదు॥ జీవితము చంచలమయినది; కావున ధర్మ కార్యాచరణము నందు త్వరపడుటయే ధర్మము॥ ధర్మ కార్యానుష్ఠానమును తన పరలోక యాత్రయందలి దారి బత్తెముగా భద్రపరచి కొనీన ప్రాణి మరణానంతరముకూడ సుఖించును॥ (ఇది కాక లౌకిక కార్యములందు కూడ) రేపటి పనిని నేడే ఆచరించ వలయును॥ అపరాష్ట్రమున చేయవలసిన పనిని పూర్వాహముననే అచరించవలేను॥ మానవుడు తాను ఆ పని చేసినను చేయకున్నను మృత్యువు ఆందుల కై వేచియుండదు॥ పొలములు అంగడులు ఇండ్లు మొదలగువాని యందాస క్తి గలిగి (ధర్మము కాని) ఇతర విషయములందు ,మనస్సుంచి పరధ్యానములో ఉన్న మానవుని సమీపించి మృత్యువు తోడేలు గోరెనువలే తీసికొనిపోవును॥ మృత్యువునకు ‘ ఈ ప్రాణీ నాకు ప్రియమైనది; ఈ ప్రాణీ ద్వేష్యమయినది॥ అనునది లేదు॥ ఆయువునకు సంబంధించిన పూర్వ కర్మ ఫలాంశము ముగియగానే అది ప్రాణిని బలవంతముగా ఎత్తుకొనిపోవును॥ ప్రాణవాయువు చంచలమని నీకును తెలియునుగదా! ఏచోటనో ఏ క్షణమో బదికి తిమి॥ అనినచో అదియు ఆశ్చర్యకరమే॥ విద్యాభ్యాసము విషయమునను ధనార్జనము విషయమునను శరీరము శాశ్వతమనుకొనవలెను॥ ధర్మ కార్యాచరణము చేయు విషయమున శరీరము అశాశ్వతమనుకొనవలెను॥ అని నా తలపు॥ కనుక అటి సంకట రూపమయిన ధర్మ కార్య మున నేను (దేవతలకు) ఋణపడి ఉన్నాను॥ అందువలన నేను సం భార ములు అన్నియు సమకూర్చుకొని నీకడకు వచ్చినాను॥ నీవు వెంటనే నాచేత యజ్ఞమనుష్టింపజేయననినచో మరియొక యాజకుని కడకు పోవుదును॥
అని నిమీ పలుకగా వసిష్ఠుడు తాను బ్రాహ్మణోత్తముడు అయియుండియు క్రోధవశుడై నేను అలసియున్నా ననగా(నాశ్రమ తీరువరకు వేచియుండక) ధర్మజ్ఞుడవయియుండియు నీవు మరియొకని యాజకునిగా చేసికోనవలెననుకొను చున్నావు॥ కావున నీవు విదేహుడవయ్యెదవు॥ (దేహము లేని వాడు- మరణించినవాడు) అని శపించెను॥
నిమిత్తం ప్రత్యువాచాథ ధర్మకార్య రతస్య మే॥
విఘ్నం కరోషి నాన్యేన యాజనం చ తథేచ్చసి ।
శాపం దదాసీ యస్మా త్వం విదేహోద్య భవిష్యసి॥
ఏవ ము కేతు లౌ జాతో విదేహౌ ద్విజపార్థివో ।
దేహహీనో తయోర్జీవో బ్రహ్మాణ ముషజగ్మతుః॥
ఆగతౌ తౌ సమీక్ష్యాథ బ్రహ్మా వచన మబ్రవీత్ ।
అద్య ప్రభృతి తే స్థానం నిమిజీవ దదామ్యహమ్॥
నేత్రపక్మసు సర్వేషాం త్వం వసిష్యసి పార్థివ ।
త్వత్సమ్బన్గా తథా తేషాం నిమేష స్సమ్భవిష్యతి॥
చాలయిష్య ని తు తదా నేత్రపక్ష్మాణి మానవాః ।
ఏవ ము కే మనుష్యాణాం నేత్రపక్ష్మసు సర్వతః॥
జగామ నిమజీవస్తు వర దానా త్స్వయమ్భువః ।
వసిష్ఠజీవం భగవా నహ్మా వచన మబ్రవీత్॥
మిత్రావరుణయోః పుత్రో వసిష్ఠ త్వం భవిష్యసి ।
పసి ప్లేతి చ తే నామ తతాపి చ భవిష్యతి॥
జన్మద్వయ మతీతం చ త తాపి త్వం స్మరిష్యసి ।
ఏతస్మిన్నేవ కాలేతు మిత్రశ్చ వరుణ స్తథా॥
బదర్యాశ్రమ మాసాద్య తప పతు రవ్యయమ్ ।
తపస్యతో స్తయో రేవం కదాచి న్మాధవే దినే॥
పుష్పితద్రుమసంస్థానే శుభే వాతాచ మారుతే ।
ఉర్వశీతు వరారోహా కుర్వతీ కుసుమోచ్చయమ్॥
సుసూక్ష్మర కవసనా తయో రృష్టిపథం గతా ।
తాం దృష్ట్వా సుముఖీం సుభ్రూం నీలనీర జలోచనామ్॥
ఉభౌ చుమభతు ధైర్యా తద్రూపపరి మోహితొ ।
తపస్యతో స్తయో ర్వీర్య మస్టలచ్చ మృగాసనే॥
సన్నం రేత స్రతో దృష్ట్వా పాపభీతో పరస్పరమ్ ।
చక్రతుః కలశే శుక్రం తోయపూర్లే మనోరమే॥
తయోరృషివరౌ జాతా తేజసాప్రతిమౌ భువి ।
వసిష్ఠశ్చాప్యగ స్త్యశ్చ మిత్రావరుణయో స్సుతౌ॥
నిమి వసిష్ఠునితో ఇట్లు మారుపలికేను: ధర్మ కార్యానుష్ఠానాసక్తుడనైన నాకు విఘ్నము కలిగించుచున్నావు; ఇంకొక చేత యజనము చేయించుకొనుట కొప్పుకోనవు; పైగా నన్నే శపించుచున్నావు; 'కావున నీవే వెంటనే విదేహుడ వగుదువు; అనేను॥ వెంటనే ఇరువురును విదేహులయిరి॥ దేహహీనములగు ఆ ఇరువురి జీవములును బహ్మకడకు పోగా చూచి బ్రహ్మ ఇట్లనెను: నిమజీవా! ఇంతటినుండి నీకు ప్రాణుల కనురెప్పలు స్థానముగా ఇచ్చుచున్నాను; నీవచ్చట నివసింతువు గాని; దాని సంబంధమున ప్రాణు లకు ‘నిమిషము' 'జెప్పపాటు' కలుగును॥ నిమిశ = నిమి॥ దీని యందు శయనించి విశ్రాంతిగొని॥యుండును కావున నీమీశ = నిమిష॥ అను శబ్దము సిద్ధించును॥)॥ ఆ సమయమున మానవులు మొదలగు ప్రాణులు) కను రెప్పలు కదలింతురు, ॥ ఆనీ బ్రహ్మ పలికిన వెంటనే స్వయంభూ 'వర దానమున నిమీ జీవుడు మానవాది ప్రాణుల కను రెప్పలయందంతటను హ్యాపించెను; భగవానుడగు బ్రహ్మ వసిష్ట జీవునితో ఇట్లు పలికేను: వసిష్ణా! నీవు మిత్రావరుణుల నేడు జంట దేవతల) కుమారుడవయ్యెదవు॥ ఆజన్మమునందును నీకు ఇదే నామముండును॥ అపుడును నీకు గడచిన రెండు జన్మల స్మృతియుండును॥ అనెను॥ ॥ అదే సమయమున మిత్రుడును వరుణుడును (వరుసగా ఈ ఇద్దరును ఉదయించు నూర్యునికిని॥ఆ స్తమించు సూర్యునకును ఆధిష్ఠాతృ దేవతలు) బదర్యా శ్రమమును ఆశ్రయించుకొని నిరుపమానమయి నియమమున ఎట్టి మార్పులునులేని తపమాచరించుచుండిరి॥ ఆ కాలమున ఒక వసంతర్తువున వృక్ష వ్యవస్థయంతయు పూచియుండ హాయి గొలుపు గాలి వీచుచుండ ఉత్తమ సుందరియగు ఊర్వశి పూవులు కోయుచు॥ చక్కని బొయగల మిగుల సన్నని వస్త్రము ధరించి ఉండి వారి కంటికగపడుట తటస్థించేను॥ ఆందమగు మోము కనుబొమలు పద్మలోచనములు కల ఆమెను చూచి వారు ఇద్దరును తద్రూప పరిమోహితులయి తమ గుండె నిబ్బరము కోల్పోయిరి॥ తపస్సాచరించుచు కూర్చుండిన వారి వీర్యము వారి మృగాజీనాసనమున పడెను॥ ఇట్లగుట మహాపాపము; కావున పోరు పర స్పరము పొపభీతులయి (సంప్రతిం చుకొని)॥ ఆ శుక్రమును మనోహరమగు జలపూర్ణ కలశమునం(బిందెయం)దు ఉంచిరి॥ ఆ ఇరువుర తేజస్సునను భూమియందే అప్రతిమ తేజోవంతులగు అగస్త్యుడు వసిష్ఠుడు అనువారు మిత్రావరుణ పుత్త్రులయి జనించిరి॥
వసిష్ఠస్తూపయేమేథ భగినీం నారదస్య తు ।
అరుందతీం వరారోహాం తస్యాం శ క్తి మజీజనత్॥
శక్రేః పరాశరః పుత్త స్తస్య వంశం నిబోధమే ।
యస్య ద్వైపాయనః పుత్త స్వయం విష్ణు రజాయత॥
ప్రకాశో జనితో యేన లోకే భారతచనమాః ।
యేనాజ్ఞానత మోందస్య లోకస్యోన్మీలనం కృతమ్॥
పరాశరస్య తస్య త్వం శృణు వంశ మనుత్తమమ్ ।
కాణ్డర్సభో వాహనపో జైహ్మ్యపో భౌమతాపనః॥
గోపాలిః ప్చఞ్చశ్చైషా మేతే గౌరాః పరాశరాః ।
ప్రపోహయా వాహ్యమయాః ఖ్యాతేయాః కౌతుజాతయః॥
హర్యశ్విః వక్చామో హ్యేషాం నీలా జ్ఞేయాః పరాశరాః ।
కారాయణాః కపిముఖాకి కాకేయస్థాజపాతయః॥
పుష్కరః పశ్చిమశ్చైషాం కృష్ణా జేయాః పరాశరాః ।
ఆవిష్ణాయన వాలేయ స్వా యష్టా శ్చోపయాశ్చ యే॥
ఇషీకహ స్త్చవేతే శ్వేతాః సర్వే పరాశరాః ।
పాటికో పొదరి శ్చైవ స్తమ్బావై క్రోధనాయనాః॥
షోమిరేషాం పణమస్తు ఏతే శ్యామాః పరాశరాః ।
స్వల్పాయనా వారాయణా నైలేయాః ఖలు యూథపాః॥
త ని రేషాం పఇమస్తు ఏతే ధూమ్రాః పరాశరాః ।
పరాశ రాణాం సర్వేషాం త్యారేయః ప్రవరోమతః॥
పరాశరశ్చ శ క్తిశ్చ వసిష్ఠశ్చ మహాతపాః ।
పరస్పర మవై వాహ్యా స్సర్వే ఏతే పరాశరాః॥
ఉక్రా స్తవై తే నృప వంశ ముఖ్యాః పరాశరా స్సూర్యసమప్రభావాః ।
యేషాం తు నామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం పురుషో జహాతి॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే గోత్రప్రవరానుకీర్తనే వసిష్ఠగోత్ర ప్రవర వివరణం నామ
ద్విశతత మోధ్యాయః॥
తరువాత వసిష్టుడు నారదుని ఆక్క యగు అరుంధతియును ఉ తమ సుందరిని వివాహమాడెను॥ వారికి శ క్తి అత నికి పరాశరుడు ఆతనికి సాక్షాద్విష్ణువు ద్వైపాయనుడు పుత్తులయిరి॥ ఆ ద్వైపాయను నుండీయే ప్రకాశ జనకుడగు భారతమను చంద్రుడు ఉదయించెను॥ అజ్ఞానాంధకారమున కన్నులు కనరాని వారికి కన్నులు తెరచి అది చూపునిచ్చెను॥ అట్టి ద్వైపాయనుని పితయగు పరాశరుని వంశమును తెలి పేదను వినుము॥ ఇది చాల ఉత్తమమయినది॥
Summary of chapter 200 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya concludes the Gotra and Pravara section by detailing the sacred lineages descending from Maharshi Vashishṭha and Maharshi Agastya. The text lists major sub-clans like Parāshara, Shakti, and Kundina for Vashishṭha, and the Agastya Pravaras, establishing the complete framework of ancestral lineages that preserve the spiritual heritage of Sanātana Dharma.