228 - రాజధర్మాః-అద్భుతానాం ఫలం తచ్ఛాంతిశ్చ

 మనుః : ఆద్భుతానాం ఫలం దేవ శమనం చ తథా వద  

 యథా వేత్స్యా మ్యహం సమ్య బ్రూహి వదతాం వర

 మత్స్యః: అత్ర తే కీర్తయిష్యామి యదు వాచ మహాతపాః

ఆత్రయే వృద్ధగర్గస్తు సర్వధర్మభృతాం వరః

 సరస్వత్యాం సమాసీనం గర్గం ప్రోతసి పార్థివ

 పప్రచ్ఛాత్రి ర్మహాతేజా గర్గం మునిజనప్రియమ్

 అత్రిః : నశ్యతాం పూర్వరూపాణి జనానాం కథయస్వ మే

నగరాణాం చ తథా రాజ్ఞాంత్వం హి సర్వవిదుత్తమః

 గర్గః : పురుషాపచారా న్నియత మపరజ్య ని దేవతాః

 తతోపరాగాద్దేవానా ముపసర్గః ప్రవర్తతే

 దివ్యా నరిక భౌమంచ త్రివిధం పరికీర్తితమ్

 గ్రహర్ట వైకృతం దివ్యమాంతరిక్షం నిబోధ మే

ఉల్కాపాతో దిశో దాహః పరివేష స్తథైవ చ

 గన్ధర్వనగరం చైవ వృష్టిశ్చ వికృతా చ యా

ఏవమాదీని లో కేస్మి న్నా నరిక్షం చ నిర్ది శేత్

 చరస్థిర భవం మంభూకమ్ప మపి భూగతమ్

 జలాశయానాం వికృతం భౌమం తదపి కీర్తితమ్

 భౌమేచాల్పఫలం జ్ఞేయం చిరేకై వ విపచ్యతే

 అభజం మధ్యఫలదం శాన్త్యా చైవోపశామ్యతి

ఆద్భుతేతు సముత్పన్నే యది వృష్టి శ్శివా భవేత్

 సప్తాహాభ్య న్తరే ప్లేయ మద్బుతం నిష్ఫలం భవేత్

ఆద్బుతస్య వికారస్య వినాశాస్త్యానదృశ్యతే

 త్రిభి ర్వరే స్సమా జ్ఞేయం సుమహ ద్బయకారకమ్

 రాజ్ఞ శ్శరీరే లోకస్య పురేద్వారే పురోహితే

 పాక మాయాతి పుత్త్రేషు తథా వై కోశ వాహనే

దేవా! అద్భుతములు కనబడినచో వాని వలన కలుగు ఫలమును వానికి జరుపవలసిన శాంతిని నాకు బాగుగా తెలియునట్లు లెస్సగా ప్రవచింపుము. ఏలయన.నీవు ఆయా విషయములను బాగుగ చేప్పగలవారిలో ఉత్తముడవు; అనిన మనువునకు మత్స్యరూపుడగు జనార్దనుడిట్లు చెప్పెను: ఈ విషయమున సర్వధర్మ తత్వవేత్తలలో ఉత్తముడగు మహాతపస్వి వృద్ధగర్గుడు అత్రికి చెప్పిన దానినే నీకు తెలి పెదను; మనురాజా! పూర్వము సరస్వతీనదీ ప్రవాహ (తీర) మున లేన్సగా కూర్చుండిన ముని జనప్రియుడగు గర్గుని మహాతేజస్వియగు ఆత్రి ఇట్లడిగేను: సర్వజోత్తముడవగు గర్గా! జనులోనగరములో రాజులో నశించుటకు పూర్వ రూపములు (నాశము సూచించు నిమి త్తములు) ఏవియే నాకు చెప్పము; ఆన గర్గుడిట్లనెను: జనుల అపచారము చే దేవత లాగ్రహింతురు; దానిచే ఉపద్రవములు జరుగును; నిమి త్తములు దివ్యములు ఆంతరిక్షములు భౌమములునని మూడు విధములు; గ్రహ నక్షత్రములయందు కనబడు వికృతి దివ్యము; ద్యులోక సంబంధి; ఉల్కలు పడుట దిక్కులు మండునట్లు కనబడుట గంధర్వ నగరములు పట్టణములవంటివి మేఘమండలమున కనబడుట) వికృతములగు వానలు ఈ మొదలగునవి ఆంతరిక్షములు; భూమి పై నుండు చరస్థిర, ప్రాణి పదార్థ జాత మందు కనబడు వికారములు భౌమములు; భూకంపములు జలాశయముల వికారము కూడ భౌమమే; భౌమాద్భుతముల వలన కలుగు ఫలమల్పము; అదీయు త్వరగ కలుగదు; అభజ(ఆంతరిక్ష) నిమి త్తములు మధ్యమ (కొంచెమేక్కువగా) ఫలమిచ్చును; ఆదియు శాంతులచే శమించును; ఇదికాక దివ్యాద్భుతములు కనబడిన ఏడు దినములకు లోగా శుభకరమగు (వికృతులు లేని) వాన కురిసినచో ఆ అద్భుతము దుష్పలితము నీయజాలదు; దివ్యాద్బుతములకు శాంతి జరుపనిదే దాని దుషల్ళము శమించదు; దానిచే ఆది కనబడిన మూడు సంవత్సరములకులోగా రాజుకో ప్రజలకో పురద్వారమందో రాజ పురోహితునకో రాజపుత్రులకో కోశమునకో వాహనములకో హాని సంభవించును.

ఋతుస్వభావా ద్రాజేంద్ర భవ న్యద్భుతసంజ్ఞతాః

 శుభావహా స్తే విజ్ఞేయా స్తాంశ్చ మే గదత శ్శృణు

వజ్రాశనిమహీకమ్పసన్గ్యానిర్వాతనిస్స్వనాః

 పరి వేషో రజోధూ మో రక్తారా స్తమయోదయాః

 ద్రుమేభ్యో భవతి స్నేహోబహుశ సుఫలాద్రుమాః

 గోపక్షేమధువృద్ధిశ్చ శుభాని మధుమాధవే

తథోల్కాపాతకలుషం కపిలార్కేన్దుమణలమ్

*అనగ్ని జ్వలనం స్ఫోటో ధూమరేణ్వనిలాహతమ్

 పద్మర కారుణా సన్త్యా నభః క్షుద్దా ర్ణవోపమమ్

 సరితాం చామ్బుసంతోషం దృష్ట్వా గ్రీష్మే శుభం వదేత్

 శక్రాయుధం పరీవేష విద్యుదులాధిరోహణమ్

 కమ్పోద్వర్తన వై కృత్యం హసనం దారుణం జితేః

నద్యో(ద్యు)దపానసరసాం విధూనతరణప్లవాః

 శృజిణాంచ వరాహాణాం వరాసు శుభ మిష్యతే

 శీతానిలతుషారత్వం నర్గ(ర)నం మృగపక్షిణామ్

 రక్షభూతపిశాచానాం దర్శనం వాగమానుషీ

దిశో ధూమాన్ల కారాశ్చ సనభవనపర్వతాః

ఉచ్చై సూర్యోదయాస్తాచ హేమ నే శోభనాః స్మృతాః

 దేవ గన్ధర్వ స్త్రీరూప విమానాద్భుతదర్శనమ్

గ్రహనక్షత్రతారాణాం దర్శనం వాగమానుషీ

 గీతవాదిత్రనిర్దోషో వనపర్వతసానుషు

సస్యవృద్దీ రసోత్పత్తి శ్శరత్కాలే శుభావహాః

హిమపాతానిలో త్పాత విరూపాద్భుత దర్శనమ్

 కృష్ణాజ్జనాభమాకాశం తారోల్కాపాతపిజ్జురమ్

 చిత్రగోద్భవః స్త్రీపు గోజాశ్వ మృగపక్షిషు

 పత్రాజ్కురలతానాంచ వికారా శ్శిశిరే శుభాః 

ఋతుస్వభావేన వినాఒద్బుతస్య జాతస్య దృష్టస్య చ శీఘ్రమేవ

 కుర్యా చ్ఛుభాం శాంతి మన స్తరంచ శుభాం యథోక్తాం వసుధాధి పేన

ఇతి శ్రీమత్స్య మహా పురాణే గర్గాతిసంవాదే అద్భుతశాంత్యాది కథనం నామ

 అష్టావింశత్యుత్తర ద్విశతతమోఽధ్యాయః

(*కృష్ణ శ్వేతంతథాపీతం ధూసర ధ్వాంతలోహితమ్.)

ఋతు స్వభావముననుసరించి కనబడు అద్భుతములు కొన్ని కలవు; అందు శుభములయినవి తెలి పెదను; వినుము; వసంత ఋతువున పిడుగులు పడుట భూకంపములు సంధ్యలయందలి ఉరుములు పరివేషములు ధూళి ధూమ వ్యాప్తి అరోదయా సమయములు ఎర్రగ నుండుట చెట్లనుండి నూనెలు జిగురులు కారుట చెట్లు అధికముగ కాయుట పండ్లు పండుట.గోపక్షి మధు (తేనె)వృద్ధి. ఇవి శుభావహములు; గ్రీష్మ రువున ఉల్కాపాతములు రవి చంద్ర మండలములు కపిల వర్ణములగుట అగ్ని లేక మంటలు. భూమి బద్దలగుట (చీలుట)-గాలి ధూళి దుమారము సంధ్యాకాంతులు తారలు పూ రేకుల కాంతితో కనబడుట ఆకాశము కల్లోలిత సముదమువలె కనబడుట జలాశయములయందలినీరు ఎండుట. ఇవి శుభావహములు; వర్షర్తువునందు ఇంద్ర ధనుస్సులు పరివేషములు మెరపులు ఉల్కలు అధికమగుట కొమ్ములుగల ప్రాణు లును పందులును వణకుటయు ఒడలు పొరలించుకొనుటయు ఉత్సాహముతో ధ్వనులు చేయుటయు భూమి ఉబ్బుట పెల్లలు విరిగిపడుట సదులందును బావులందును చెలమలందును చెరువులందును సరస్సులందును నీరు అధికముగా కదలి యాడుటయు వస్తువులు నీటి పై తేలియాడుటయు కొట్టుకొనిపోవుచుండుటయు శుభములు; హేమంతర్తువునందు చల్లని గాలులు మంచు అధికమగుట మృగములు పక్షులు గట్టిగ ధ్వనిచేయుట రక్షభూత పిశాచములు కనబడుట. ఆమానుష వాక్కు వినబడుట దిక్కులును ఆకాశ వన పర్వతములును దూమాంధకార వ్యా ప్తములగుట వన పర్వత ములాకాశముతో కలిసినట్లు కనబడుట సూర్యోదయాస్తమయములు ఎక్కువ భేదముతో వ్యత్యాసముతో కనబడుట - ఇవి శుభావహములు; శరదృతువునందు దేవశ్రీ గంధర్వ రూపములును విమానములును మొదలగు అద్బుతములాకాశమున కనబడుట గ్రహ నక్షత్ర తార అధికముగా కనబడుట అమానుష వాక్కు వినబడుట వనములందును పర్వత సానువులందును గీతవాదిత్ర ధ్వనులు వినబడుట సస్య వృద్ధి రసోత్ప త్తి. ఇవి శుభకరములు; శిశిర ఋతువునందు హిమపాతముతో పెనుగాలులు వికృత రూపములు కనబడుట ఆకాశము కాటుక వలె నల్లనె కనబడుట పింజర వర్ణముతో ఉల్కలు తారలు రాలుట మానవ స్త్రీలయందును గోవులు మేకలు అశ్వములు జింకలు పక్షులు.వీనియందును విచిత్ర గర్భోత్పత్తి పత్రాంకుర లతలయందు వింత మార్పులు శుభకరములు; ఇట్టి ఋతు స్వభావమునకు విరుద్ధములగు ఆద్భుతములు కనబడినచో వెంటనే శీఘ్రముగా రాజు వీని ఆశుభ ఫలమును శమింపజేయు శాంతిని జరిపించవలయును.

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున శుభాద్భుత దర్శన కథనమును అద్భుత ఫల తచ్ఛాంతియునను రెండు వందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము.