55 - ఆదిత్యశయన వ్రతము 

నారదః : ఉపవాసే ష్వశ కస్య తదేవ ఫల మిచ్ఛతః

అనాయా సేన రోగా ద్వా కిమిష్టం ప్రత ముచ్యతామ్

 శ్రీ ఈశ్వర : ఉపవాసే ష్వశక్తానాం నక్తభోజన మిష్యతే

 యస్మిన్వ్రతే తదప్య స్తి శ్రూయతాంవై వ్రతం మహత్

 ఆదిత్యశయనం నామ యథావ చ్చజ్కరార్చనమ్

 యేషు నక్షత్రయోగేషు పురాణజ్ఞాః ప్రచక్ష తే

 యదా హస్తేన సప్తమ్యా మాదిత్యస్య దినం భవేత్

 సూర్యస్య వారే సంక్రా న్తి స్తిథిఃస్యా త్సర్వకామదా

 ఉమామ హేశ్వరస్యార్చా మర్చయే తూర్యనామభిః

 సూర్యార్చాం శివలిజ్గంచ న గృహే పూజయే ద్యతః

 త్విషాంపతే శ్శివస్యాపి న భేదో దృశ్యతే క్వచిత్

 యస్మా త్తస్మా న్ముని శ్రేష్ఠ గ్ర హేశంతు సమర్చయేత్

నారదుడు ఈశ్వరు నిట్లు ప్రశ్నించేను:ఉపవాసములు చేయుటకు శ క్తిలేని వారై కాని వ్యాధి బాధవలనకాని అనాయాసముగా ఇదే పైన చెప్పిన ఫలమును కోరువారు చేయదగిన వ్రతము నుపదేశించుము. అనగా ఈశ్వరు డిట్లు చెప్పేను: ఉపవాసము చేయ శ క్తిలేనివారు న క్షము (పగలు ఉపవసించి రాత్రి భుజించుట) భుజించి చేయదగిన మహా వ్రతమును కలదు. చెప్పెదను; వినుము. ఈ వ్రతమునకు ఆదిత్య శయనమని పేరు. ఆయా నక్షత్రములు కల దినము లందు (సూర్యాభేద భావనతో) శంకరు నర్చించవలయును. న ప్రమీతిథి - ఆదిత్యవారము-హ స్తనక్షత్రము-సూర్యుడు ఏదేని రాశియందు ప్రవేశించుట - ఈ నాలుగు అంశములును కలిసిన దినమున ఈ వ్రతము చేసినచో అన్ని కోరికలును నేర వేరును. గృహమునందు సూర్యప్రతిమ శివలింగము ఈ రెంటిని పూజించరాదు. ఏదో ఒకటి మాత్ర ముండవలెను.) ఆదికాక రవి శివులకు భేదములేదు. కనుక రవి నామములతో శివమూ ర్తిని (కాని లింగమును కాని) పూజించవలెను.

హస్తే చ సూర్యాయ నమోస్తు పాదా వర్కాయ చిత్రాసు చ గుల్ఫదేశమ్

 స్వాతీషు జజ్ఘే పురుషోత్తమాయ ధాత్రే విశాభాసుచ జానుదేశమ్

 తథాఽనురాధాసు నమోఽభిపూజ్య మూరుద్వయంచైవ సహస్రభానోః

జ్యేష్ఠాస్వనజ్గాయ నమోస్తు గుహ్య మిన్ద్రాయ సోమాయ కటిం చ మూలే

 పూర్వోత్తరాషాఢయుగేచ నాభిం త్వాష్ట్రే నమ స్సప్తతుర జ్గమాయ

తీక్ష్ణాంశ వేచ శ్రవణేచ కుక్షిం పృష్ఠం ధనిష్ఠాసు వికర్తనాయ

 వక్షస్థ్సలం ధ్వాన్త వినాశనాయ జలాధివర్క్షే ప్రతిపూజనీయమ్

 పూర్వోత్తరాభాద్రపద ద్వయేచ బాహూ నమ శ్చణ్డకరాయ పూజ్యౌ

 సామ్నా మధీశాయ కరద్వయంచ సమ్పూజనీయం ద్విజ రేవతీషు

నఖాని పూజ్యాని తథాశ్వినీషు నమోస్తు సప్తాశ్వధురన్దరాయ

 కఠోరధామ్నే భరణీషు కణ్ఠం దివాకరాయే త్యభిపూజనీయమ్

 గ్రీవాగ్ని ఋ క్షేఽధర మమ్బుజేశం సమ్పూజయే నారద రోహిణీషు

 మృగో త్తమాజ్గే దశ నాః పురారే స్సమ్పూజనీయ రవయే నమస్తే

 నమస్సవిత్రేతి చ శా జ్క రేచ నాసాభిపూజ్యాథ పునర్వసౌచ

 లలాట మమ్భోరుహవల్లభాయ పు ష్యేఽలకా వేదశరీరధారిణే

సార్పేఽథ మౌళిం విబుధ ప్రియాయ మఘాసు కర్ణావితి గోగణేశ

 పూర్వాసు గో బ్రాహ్మణనన్దనాయ నేత్రాణి సమ్పూజ్యతమాని శంభోః

అథోత్తరాఫల్గునివై భ్రువౌచ విశ్వేశ్వరాయేతి చ పూజనీయౌ

 నమోస్తు పాశాఙ్కుశ పద్మశూల కపాలఖడ్గేషు ధనుర్ధరాయ

 గజాసురానజ్గవురా ర్ద కాది వినాశ మూలాయ నమశ్శివాయ

 ఇత్యాది శస్త్రాణిచ పూజయిత్వా విశ్వేశ్వరాయేతి శిరోభిపూజ్యమ్

1. సూర్యాయనమః_హ సనక్షత్ర పాదౌ పూజయామి; 2. అర్కాయనమః-చిత్రాసు-గుల్ఫౌ పూజయామి; 3. పురు షోత్తమాయ నమః-స్వాతీషు-జం ఘే పూజయామి; 4. ధాత్రేనమః విశాఖా సు-జానునీ పూజయామి; 5. సహస్రభానవేనమః అనురాధాసు-ఊరూ పూజయామి; 6. అనంగాయ ఇంద్రాయనమః - జ్యేషాసు- హ్యం పూజయామి; 7. సోమాయనమః మూలే కటిం పూజయామి; 8. త్వ ప్లే సప్తతురంగమాయనమః, పూర్వాషాడో తరాషాఢయోః నాభిం పూజయామి; 1. తీత్తాంశ వేనమః శ్రవణే. కుక్షిం పూజయామి; 10. వికర్తనాయనమః ధనిషాసు-పృష్టం పూజయామి; 11. ధ్వాంత వినాశ నాయనమఃశతభిషకు -వక్షఃస్థలం పూజయామి; 12. చండకరాయనమః పూర్వాభాద్రాసు ఉత్తరాభాద్రాసు. బాహూ పూజయామి; 16. సామ్నా మధీశాయ నమః- రేవతీషు-హసౌ పూజయామి; 14. సప్తాశ్వధురంధరాయ నమః అశ్వినీషు-నఖాని పూజయామి; 15. కరధామ్నే నమః -భరణీషు-కంఠం పూజయామి; 16. దివాకరాయనమః కృత్తి కాసు-గ్రీవాం పూజయామి; 17. ఆంబుజేశాయనమః.రోహిణీషు. అధరం పూజయామి; 18. రవయేనమః.మృగశీరే.దంతాన్ పూజయామి; 19. సవిత్రేనమః- ఆర్గాసు-నాసికాం పూజయామి; 20. అంభోరుహవల్లభాయనమః-పునర్వసాలలాటం పూజయామి; 21. వేదశ రీర ధారిణేనమః-పు ష్యే అలకాన్ పూజయామి; 22. ఏబుధప్రియాయనమః -ఆ శ్లేషాసు_శిరః పూజయామి; 28. గ్రహగణేశాయనమః మఖాసు కర్ణి పూజయామి; 24. గో బ్రాహ్మణనందనాయనమః-పూర్వఫల్గునీషు. నేత్రాణి పూజయామి; 25. విశ్వేశ్వరాయనమః -ఉత్తర ఫల్గునీషు భుజౌ పూజయామి; అను . ఈ మంత్రములతో ఆయా నక్షత్రములు గల దినములందు ఆయా అవయవములందు ప్రధాన భావనతో సర్వాంగ పూజను ప్రతిదినము న కవ్రత పూర్వకముగా జరుపుచుండవలెను. ప్రతి దినమునను శివుని ఉద్దేశించి ఈ చెప్పబోవు అర్థము కల మంత్రముతో స్తుతి చేయుచు శివుని శిరమున పూజ సేయవలెను: “పాశాంకుశ పద్మ శూలక పాల ఖడ బాణ ధనుర్ధారియు గజాసురుడు-మన్మ థుడు త్రిపురాసురులు. అంధక దానవుడు మొదలగువారి వినాశమునకు కారణమునగు శివునకు నమస్కారము.”.

భోక్తవ్య మత్రైవ మతైలశాక మమాంస మక్షార మభుక్త శేషమ్

 ఇత్యేవం ద్విజ నక్తాని కృత్వా దద్యా త్పున ర్వశీ

 శాలేయతండులప్రస్థ మౌదుమ్బరమయే ఘృతమ్  

సంస్థాప్య పాత్రే విప్రాయ సహిరణ్యం నివేదయేత్

 సప్తమే వస్త్రయుగ్మంచ పార్వణీ త్వధికం భవేత్

చతుర్ధ శేతు సంప్రాప్తే పారణే నారదాబ్ది కే

 బ్రాహ్మణా న్బోజయే ద్భక్త్యా గుడ క్షీరఘృతాదిభిః

 కృత్వాఽథ కాఞ్చనం పద్మ మష్టపత్రం సకర్ణికమ్

 శుద్దమష్టాజ్గుళం తచ్చ పద్మరాగదళాన్వితమ్  

శయ్యాం సులక్షణాం కృత్వా విరుద్ధగ్రన్దివర్జితామ్

సోపధానవితానాంచ స్వా స్తీర్ణవ్యజనాశ్రయామ్

 పొదుకోపానహచ్ఛత్ర చామరాసన దర్పణైః  

 భూషణై రపి సంయుక్తాం ఫలవస్త్రాను లేపనై

 తస్మి న్ని ధాయ తత్పద్మ మలజ్కృత్య గుణాన్వితామ్

 కపిలాం వస్త్రసంయుక్తాం సుశీలాంచ పయస్వినీమ్

 హేమశృజ్గీం రౌప్యఖురాం సవత్సాం కాంస్యదోహినీమ్

దద్యా న్మన్త్రేణ పూర్వా హ్ణే అభి జి భిల జ్ఘయేత్

 యథై వాదిత్యఃశయన మశూన్యం తవ సర్వదా

 కాస్త్యా ధృత్యా శ్రియా రత్యా తథా మే సస్తు వృద్ధయః

 యథా న దేవా శ్శ్రేయాంసం త్వదన్య మనఘం విదుః

తథా మా ముద్దరా శేష దుఃఖసంసార సాగరాత్

 తతః ప్రదక్షిణీకృత్య ప్రణమ్యచ విసర్జయేత్

 శయ్యాగవాది తత్సర్వం ద్విజస్య భవనం నయేత్  

ఈ పూజా వ్రత దీనములందు తైలము మాంసాహారులు కూడ) మాంసము ఉప్పు (కారము-పులుపు) లేని భోజనము చేయవలెను. ఇది పదునాలుగు సంవత్సరములు చేయవలసిన వ్రతము - ప్రతి సంవత్సరమును వ్రతము కడపటి (ఇరువది ఐదవ దినమున కుంచెడు మంచి వరిబియ్యమును మేడి పాత్రలో నేతిని బంగారమును బ్రాహ్మణునకు దాన మీయవలెను. ఏడవ సంవత్సరపు వ్రతములో వస్త్రముల జతనుకూడ ఈయవలెను. పదునాల్గవ సంవత్సరపు వ్రతములో భ క్తితో బ్రాహ్మణులకు గుడ క్షీర ఘృతాదికముతో భోజనములు పెట్టవలేను. ఎనిమిది అంగుళముల వ్యాసముకల బంగారు పద్మమును ఎనిమిది రేకులు నడుమ దుద్దు కల దానిని చేయించవలయును. రేకుల యందు పద్మరాగములు తాప టము చేయవలెను. ముడులు కాని ఎదురు నాలుకలు కాని లేని కొయ్యతో మంచము చేయించవలేను. దిండ్లు. చాందనీలు. పరపు విసనకర్రలు-పాదుకలు-చేప్పులు-గొడుగు చామరములు కాలిపీటలు. అద్దములు.అలంకారములు -ఫలములు-వస్త్ర ములు-గంధ ద్రవ్యములు అమర్చవలేను. ఆ మంచము పై ఆ పద్మమును అన్ని అమరికలతో ఉంచవలేను. పొడువని కపిల గోవును పొలిచ్చు దానిని దూడ కలదానిని వస్త్రములతో బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అలంకరించవలెను. పాలు పిదుకు కంచు పాత్రతో కూడ ఈ యావును. పై సామగ్రిని బ్రాహ్మణునకు మధ్యాహ్నము గడువకుండ దానమీయ వలెను. దానము ఇచ్చునపుడు ఈ యర్థము కల మంత్రము చెప్పవలెను: “ఆదిత్యా: నీ పడక ఎల్లప్పుడును కాంతితో నిబ్బరముతో శోభతో ఆనందముతో నిండియుండునట్లే నాకును ఈ అన్ని వృద్ధులును కలుగుగాక ! దేవతలు కూడ నీకంటె మరెవ్వరిని పూజ్యునిగా తలచరు కావున (నీ వందర దేవతల కంటే గొప్పవాడవు కావున) నన్ను అశేష దుఃఖ సంసార సాగరమునుండి ఉద్ధరింపుము.” పిమ్మట (బ్రాహ్మణునకు ప్రదక్షిణము చేసి అతనిని పంపవలయును. ఈ దాన ద్రవ్యములను ఆ విప్రుని ఇంటికి చేర్చవలెను.

నైత ద్విశీలాయ న నా స్తికాయ కుతర్కదుష్టాయ వినిన్దకాయ

ప్రకాశ నీయం వ్రత మిన్దుమౌళే ర్యశ్చాపి నిన్దా మధికం విధత్తే

 భక్తాయ దాన్తాయచ గుహ్య మేత దాఖ్యేయ మానన్దకరం శివస్య

ఇదం మహాపాతకహృ న్న రాణా మప్యక్షయం వేదవిదో వద న్తి

 న బన్దుపుత్త్రైర్న బలై ర్వియుక్తః పత్నీ భి రానన్దకర స్సురాణామ్

నాభ్యేతి రోగం నచ శోచ్యదుఃఖం యా చాథ నారీ కురుతేఽతిభక్త్యా

 ఇదం వసిష్ఠేన పురాఽర్జునేన కృతం కుబే రేణ పురన్దరేణ

  యత్కీర్తనాద వ్యభిలాని నాశ మాయా న్తి పాపాని న సంశయోఽత

 ఇతి పఠతి శృణోతి వా య ఇ త్థం రవిశయనం పురుహూతవల్లభ స్యాత్

అపినరకగతా న్పి తౄ నశేషా నపి దివ మానయతీహ యః కరోతి

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదా నర్గతేశ్వర నారదసంవాదే ఆదిత్యశయన వ్రత కథనం నామ పఇ్చపఞ్చాశోఽధ్యాయః

 ఈ వ్రతమును నా స్త్రీకుడు కుతర్క దుష్టుడు నిందకుడు అగువానికి చెప్పరాదు. ఇది విని వాడింకను అధిక నింద చేయును. ఇంద్రియ నిగ్రహము కల భక్తునకు చెప్పవలెను. ఇది శివునకానందకరము; పొతకహరము; అక్షయ పుణ్యప్రదము. దీని నాచరించిన స్త్రీని పురుషునకును బంధుపుత పరివారములు దేవతా ప్రీతి లభించును. రోగ శోక దుఃఖములు కలుగవు. దీనిని పూర్వము వసిష్ణుడు అర్జునుడు కుబేరుడు ఇంద్రుడు చేసిరి. దీనిని కీర్తించినను పాపములు నశించును. దీనిని చదివినను వినినను ఇంద్రుడు ప్రీతి చెందును. ఆచరించినచో వాని పితరులు నరకము లందున్న ను స్వర్గమునకు పోయి సుఖింతురు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున ఆదిత్యశయన వ్రతమను ఏబదియైదవ అధ్యాయము .