58 - తటాకాది ప్రతిష్ఠా విధానము

 సూతః : జలాశయగతం విష్ణుమువాచ రవినన్దనః

తటాకారామకూ పేషు వాపీషు నళినీషచ

 విధిం పృచ్ఛామి దేవేశ దేవతాయతనేషుచ

 కే తత్ప్రచర్త్విజో నాధ, వేద వా కీదృశీ భవేత్

దక్షిణా బలయః  కాల స్థ్సాన మాచార్య ఏవచ

 ద్రవ్యాణి కాని శస్తాని సర్వమాచక్ష్వ తత్త్వతః

శ్రీమత్స్య: : శృణు రాజ న్మహాబాహో తటాకాదిషు యో విధిః

పురాణేష్వితిహాసోఽయం పఠ్యతే వదతాం వర

 ప్రాప్య పక్షం శుభం శుక్లం నాతీతే చోత్తరాయణే

 పుణ్యేఽహ్ని విప్రకథితే కృత్వా బ్రాహ్మణ వాచనమ్

 ప్రాగుదక్ప్రవణే దేశే తటాక స్య సమీపత :

 చతుర్హాస్తాం శుభాం వేదిం చతురశ్రాం(స్రాం) చతుర్ముఖామ్

 తథా షోడశహస్తశ్చ మండపశ్చ చతుర్ముఖః

వేదాశ్చ పరితో గర్తాఽరత్ని మాత్రా స్స మేఖలాః

నవ సప్తాథవా పఞ్చ చాతిరిక్తా నృఫాత్మజ :

 వీత స్తిమాత్రా యోనిస్స్యా త్వట్ సప్తాజ్గుళ విస్తృత

 గర్తా శ్చతస్ర శ్శస్తాఃస్యు స్త్రీపర్వోచ్చ్రితమేఖలాః

సర్వత స్సర్వవర్ణాః స్యుః పతాకధ్వజసంయుతా  

అశ్వత్థోదుమ్బరప్లక్ష వటశాఖాకృతానితు

మండపస్య ప్రతిదిశం ద్వారాణ్యేతాని కారయేత్

 శుభాస్స్మృతాష్టహోతారో ద్వారపాలా స్తథాష్ట్రవై

అష్టౌతు జాపకాః కార్యా బ్రాహ్మణా వేదపారగాః

 సర్వలక్షణసమ్పూర్ణోమన్త్రవి ద్విజితేన్ద్రియః

కులశీల సమాయుక్త స్థాపక స్స్యాద్ద్విజోత్తమః

 ప్రతిగర్తేషు కలశయజ్ఞోపకరణానిచ

 వ్యజనం చామరే శుభ్రే తామ్రపాత్రం సువి స్తరమ్

 సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: తటాకములు ఆరామములు (తోటలు) బావులు దిగుడు బావులు సరస్సులు దేవాలయములు వీని ప్రతిష్ట జరుపు 1. విధానమును అచట కావలసిన 2. ఋత్విజులు 3. వేదికలు 4. దక్షిణలు 5. బలులు 6. కాలము 7. స్థానము 8. ఆచార్యుడు 9. ద్రవ్యములు ఏవి ఎట్టివిగా నుండవలెనో తెలుపుము. అని మనువు మత్స్యనారా యణు నడిగేను.

 మత్స్యనారాయణుడిట్లు చెప్పెను: మహాబాహు! రాజా! పురుష శ్రేష్టా! వినుము. ఈ విధానమంతయు ( వేది కములగు) పురాణములయందు “ఇతిహాస” రూపమున ఇతి.హ- (ఉండెను అనికాదు. ఇది ఇట్లుండవలెను ఆని ఇచ్చట అర్థము.) అని చెప్పబడియున్నది. 6. (కాలము ఉత్తరాయనము-శుక్లపక్షము - బ్రాహ్మణులు నిర్ణయించిన శుభ దినము ప్రశస్తములు. బ్రాహ్మణులచే స్వస్తి వాచనము జరిపించిన తరువాతనే ఈ ప్రతిష్ఠా కార్యము జరుపవలేను. 7. (స్థానము) తటాకము - ఆరామము -కూపము.పి-దేవాలయము) సమీపమున తూర్పునకు ఉత్తరమునకు వాలుగా ఉన్న ప్రదేశము ప్రశస్తము. 3. వేదికలు) నాలుగేసి మూరల భుజములతో చతురస్రముగా నుండు నాలుగు ముఖములు గల వేదికను పదునారు మూరల భుజములు గల చతుర్ముఖ మండపములో నిర్మించవలెను. వేదికకు చుట్టును మేఖలలతో కూడినవియు పిడిమూర భుజములు లోతునుగల గుంటలు తొమ్మిదికాని ఏడు కాని ఐదు కాని త్రవ్వవలేను. ఇవికాక పండెం డంగుళముల పొడవును ఆడంగుళముల వెడలుపునుగల యోని (ఆధోముఖ త్రిభుజాకృతి వేది)- నాలుగు గుంటలు ఏర్పరచవలయును. ఈ గుంటలలో ప్రతిదానికి చుట్టును మూడు వరుసలలో ఎత్తైన మేఖలలు ఉండవలెను. (మేఖల = చుట్టును ఉండెడి గట్టు) అనేక వర్ణముల పతాక లును జెండాలును తోరణములును) రావి మేడి జువ్వి మర్రి కొమ్మలతో చేసి అమర్చిన ద్వారములును మండపము చుట్టును ఏర్పరచవలెను. 2. (ఋత్విక్కులు మొదలగువారు) ఎనిమిది మంది ద్వారపాలురు-ఎనిమిది మంది హోతలు ఎనిమిది మంది జపకర్తలును వేదపారంగతులయిన బ్రాహ్మణు లుండ వలెను. 8. ఆచార్యుడు) నర్వ వైదిక లక్షణములు కలిగి మంత్రవేత్త జితేంద్రియుడు కులశీలవంతుడు నగు బ్రాహ్మణుడు ఆచార్యుడు(ప్రధాన ఋత్విక్)గా నుండవలెను. 9. (ద్రవ్యములు) ప్రతియొక గుంట దగ్గరను కలశములు యజ్ఞోపకరణ ములు (స్రుక్ స్రువములు దర్భలు మొదలగునవి) విసనకర్ర తెల్లని చామరములు వెడల్పయిన రాగిపాత్ర ఉండవలెను.

తత్ప్ర స్వనేక వర్ణాస్స్యు ర్బలయః ప్రతి దైవతమ్

 ఆచార్యః ప్రక్ష పే ద్భూమా వనుమన్త్రం విచక్షణః

 త్ర్యరత్ని మాత్రయూప స్స్యా త్క్షీ రవృక్షవినిర్మితః

 యజమానప్రమాణోవా సంస్థాప్యో భూతిమిచ్ఛతా

 హేమాలజ్కారిణః కార్యాః పఞ్చవింశతిఋత్విజః

 కుణ్డలానిచ హైమాని కేయూరకటకానిచ

 తథాజ్గుళిపవిత్రాణి వాసాంసి వివిధానిచ

దక్షిణాశ్చ సమాస్సర్వా ఆచార్యే ద్విగుణం స్మృతమ్

 దద్యా చ్చయనసంయుక్త మాత్మనశ్చాపి యత్ప్రియమ్

సౌవ ర్ణౌ కూర్మమక రౌరాజ తౌ మత్స్యడుణ్డు భౌ

 తా మ్రౌ కుళీరమణ్డూకా వాయనశ్శింశుమారకః

 ఏవమాసాద్య తత్సర్వ మాదా వేవ విశామ్పతే

 శుక్లమాల్యామ్బర ధర శ్శుక్లగన్దానులేపనః

సర్వౌషధ్యుదక స్నాత స్స్నా పితో వేదపుజ్గవై

 యజమాన సృపత్నీ కః పుత్ర పౌత్రసమన్వితః

పశ్చిమద్వారమాశ్రిత్య ప్రవిశే ద్యాగమణ్డపమ్

తతోమజ్గళ శబ్ధేన భేరీణాం నిస్వనేనచ

 రజసా మణ్డలం కుర్యాత్పఞ్చవర్ణేన తత్త్వవిత్

 షోడశారం తత్ప్రశ్చక్రం పద్మగర్భం చతుర్ముఖమ్

చతురశ్రంచ పరితో వృత్తం మధ్యే సుశోభనమ్

 వేద్యాంచ పరితః కృత్వా గ్రహాక్ లోకపతీం సతః

 విన్య సే న్మ న్త్రస్సర్వా న్ప్రతిధిక్షు విచక్షణః

 కూర్మాదీక్ స్థాపయన్మధ్యే వారుణం మన్త్రమాశ్రితః

 బ్రహ్మాణంచ శివం విష్ణుం తత్రైవ స్థాపయద్బుధః

 వినాయకoచ విన్యస్య కమలా మమ్బికాం తథా

శా న్త్యర్థం సర్వలోకానాం భూత గ్రామం న్య సేత్తత

 పుష్పాక్షతఫలై ర్యుక్త మేవం కృత్వాఽధివాససా

 కుంభాంశ్చ రత్నగర్భాంస్తా న్వారిణా పరిపూరితాక్

 (బలులు ప్రతి యొక దేవతను ఉద్దేశించి అనేక వర్ణములు గల బలులు ఏర్పరచి అన్ని విషయములను ఎరిగిన ఆచార్యుడు వాటిని మంత్రసహితముగా వేయవలెను. 9. యూపము) యూప స్తంభము మూడు పిడిమూరల పొడవున గాని యజమానుని ఎత్తునగాని ఉండుట క్షేమప్రదము. ( భూషణములు) ఇరువదియైదు మంది ఋత్విజులకును బంగారుతో కుండలములు భుజకీర్తులు చేతి కడియములు వేళ్ళకు పవిత్రములు చేయించవలెను. వివిధములగు వస్త్రము లీయవలెను. దక్షిణలు అందరకును సమానము గాను ఆచార్యునకు మాత్రము ఒక్కొక్క ఋత్విజునకు ఇచ్చినదానికి ద్విగుణముగాను ఇచ్చుట కేర్పరచవలేను. వారి కీంక ను మంచము పరపు మరింకేదైన తనకు నచ్చినది కాని బంగారుతో చేసిన కూర్మమకరములను వెండితో చేసిన చేపను నీటిపామును రాగితో చేసిన ఎండి కప్పు నీటి కాకి శిశుమారము మత్స్యము ఇట్టివి కూడ చేయించవలెను.

1. ఇట్టివి సమకూర్చుకొనిన తరువాత యజమానుడును అతని భార్య యు సర్వేషధీజలములతో విప్రులు పఠించు వేదమంత్రములతో స్నానమాడి తెల్లని వస్త్రములను తెల్లని గంధములను తాల్చి పుత్ర పౌత్తులతో కూడి పడమటి ద్వార మునుండి యాగ మంటపమును ప్రవేశించవలయును. మంగళ వాద్యములు మ్రోగుచుండ ఐదువన్నెల ముగ్గు పొడితో చతురస్రమును దాని నడుము వృత్తమును దానిలోపల షోడశారచక్రమును దాని నడుమ పద్మమునందు బ్రహ్మను లిఖించ వలెను. ఇట్లలంక రించిన వేది పై ఆయా దిక్కులందును స్థానములందును దిక్పాలకులను గ్రహములను ఆయా మంత్రము లతో నిలుపవలేను. వారుణ మంత్రములతో కూర్మము మొదలగు ప్రతిమలను త్రిమూర్తులను గణపతిని లక్ష్మీపార్వ(సర స్వతీ )తులను సర్వభూత గణములను సిలుపవలెను. మంటపమున పీఠము పై వస్త్రము పరచి దాని పై పుష్పాక్షతఫలము లను ఉంచి రత్నములతో జలములతో నిండిన కలశము లుంచి వాని నడుమనే పై విధముగా గ్రహాదులను నిలువ వలయును.

వస్త్రాదిభిర లజ్కృత్య ధ్వారపాలా న్త్సమ స్తతః

 జపధ్వమితి తాన్భ్రూయా దాచార్య స్త్వధిపూజయేత్

 బహ్వృచౌ పూర్వతస్థాప్యౌ దక్షిణేన యజుర్విదౌ

సామగౌ పశ్చిమే తర్వ దుత్త రేణ అథర్వణౌ

 ఉదజ్ముఖో దక్షిణతో యజమాన ఉపావి శేత్

 యజధ్వమితి తాన్భ్రూయా ద్యాజకా నునరేవతు

 ఉత్కృష్టమన్త్రజ ప్యేన తిష్టధ్వమితి జాపకాక్

ఏవమాదిశ్య తాన్త్సర్వా ర్యుక్ష్యాగ్నిం సమర్చయేత్

జుహుయా ద్వారు ణైర్మన్త్రై రాజ్యంచ సమిధ స్తథా

 ఋత్విగ్బిశ్చైవ హోతవ్యం వారుణై రేవ సర్వతః

 గ్ర హేభ్యో విధివద్దుత్వా తథేన్ద్రాయేశ్వరాయచ

మరుద్భ్యో లోకపాలేభ్యో విధివ విశ్వకర్మణే

 రాత్రిసూక్తం చ రౌద్రం చ పాపమానం సుమజ్గమ్

జ పేర న్పౌరుషం సూక్తం పూర్వతో బహ్వృచః పృథక్

 శాక్తం రౌద్రం చ సౌమ్యం చ కూశ్మాణ్డం జాతవేదసమ్

సౌరం సూక్తం జ పేరం స్తే దక్షిణే తు యజుర్విదః

వై రాజం పౌరుషం సూక్తం సౌవర్ణం రుద్రసంహితామ్

శ్యైతంచ పఞ్చనిధనం గాయత్రం జ్యేష్టసామ చ

 వామదేవ్యం బృహత్సామ రౌరవంచ రథ స్తరమ్

గవాం వ్రతం వికర్ణంచ రక్షోఘ్నం వయనం తథా

 గాయేర న్త్సామగా రాజ నృశ్చిమద్వార మాశ్రితాః

ఆథర్వణా శోత్తరత శ్శాన్తికం పౌష్టికం తథా

 జ పేర న్మనసా దేవ మాశ్రితా వరుణం ప్రభుమ్

పూర్వేద్యు రభితోమన్త్రై (రాత్రావేవం) రేవం కృత్వాఽధివాసనమ్

గజాశ్వరథవల్మికా తజ్గమహ్రాదగోకులాత్  మృద మాదాయ కుమ్భేషు ప్రక్షి పే చ్చత్వరా తథా

  రోచనాం యవసిద్దార్థా న్గన్ధా న్గుగ్గులు మేవ చ

 స్నపనం తస్య కర్తవ్యం పఞ్చగవ్యసమన్వితమ్

  ప్రత్యేకంతు మహామన్త్రై రేవం కృత్వా విధానతః

 ఏవం క్షిపతి బాహ్యార్థై ర్విధియు క్తేన కర్మణా  

తరువాత ద్వార పాల ఋత్విక్కులను జాపకులను ఆచార్యుని హోతలను పూజించవలెను. ద్వారపాలురలో ఋగ్వేదులను ఇద్దరను తూర్పున యజుర్వేదులను ఇద్దరను దక్షిణమున సామవేదులను ఇద్దరను పడమట ఆథర్వణులను ఇద్దరను ఉత్తరమున కూర్చుండ పెట్టవలయును. యజమానుడు తాను మంటపములో దక్షిణ దిశను ఉత్తరమునకు తిరిగి కూర్చుండవలెను. ద్వారపాలురను వేదపఠనము చేయుడనియు జాపకులను జపిం చుడనియు హోతలను యజనము చేయించుడనియు ఋత్విగ్వరణము చేసి ప్రార్థించవలెను.

తరువాత అగ్ని కి పరుక్షణము చేసి ఆర్చించవలయును. గ్రహములను ఇంద్రుని ఈశ్వరుని మరుత్తులను ' లోక పాలురను విశ్వకర్మను ఉద్దేశించి వారుణ మంత్రములతో నేతితో సమిధలతో హోమము చేయవలెను. ఈ హోమ కాలము లోనే ద్వారపాలురలో ఋగ్వేదీయులు రాత్రి-రుద్ర -పవమాన-పురుష సూక్తములను పఠింతురు. యజుర్వేదులుశా క రౌద్ర.సౌమ్య-కూశ్మాండ జాతవేదన..సౌర-సూకములు పఠింతురు. సామవేదులు వై రాజపౌరుష. సౌపర్ణ-రౌద్ర- శ్యేత. పంచనిధన-గాయత్ర. జ్యేష్ణసామ-వామదేవ -బృహత్సామగౌరవమరథంతర-గవాంద్రత-వికర్ణ-రక్షోఘ్న -వయన-సూక్తములు పఠింతురు. ఆథర్వణులు వరుణ దేవతాక ములగు శాంతిక పౌష్టిక మంత్రములు పఠింతురు.

ఇంకను గజములు ఆశ్వములు రథములు నిలుచు ప్రదేశములనుండియు పుట్టనుండియు నదీసంగమ ప్రద గోకుల ప్రదేశములనుండియు ఇండ్ల ముంగిళ్ళనుండియు తెచ్చిన మృత్తికను కడవలలో వేసి వానియందు నింపిన నీటితో గోరోచనా యవ సిద్దార్త (తెల్ల ఆవలు) గంధ గుగ్గులు చూర్ణములతో పంచ గవ్యముతో ఆయా మంత్రములతో వరుణు నకు యథావిధానముగ స్నపనము చేయించవలేను. ఇదంతయు తటాక ప్రతిష్టకు ముందటి దినమున చేయవలసిన ప్రక్రియ.

తతః ప్రభాతే విమలే సఞ్జాతేఽథ శతం గవాయ్

 బ్రాహ్మణేభ్యః ప్రదాతవ్య మష్టషష్టిశ్చ వా పునః

 ప్రజాశ దథ షట్త్రింశ త్ప్చ వింశతి రేవచ

తత స్సాంవత్సర ప్రో కే శుభే లగ్నే సుశోభనే

 వేద శబ్ధై స్సగాన్దర్వై ర్వాద్యైశ్చ వివిధైః పునః

 కనకాలకృతాం కృత్వా జలే గా మవతార యేత్

 సామగాయచ సా దేయా బ్రాహ్మణాయ విశాంపతే

 పాత్రి మాదాయ సౌవర్ణాం పఞ్చరత్న సమన్వితామ్

 తత్ర నిక్షిప్య మకర మత్స్యాధీం శ్చైవ సర్వతః

 ధృతాం చతుర్భి ర్విప్రేన్ద్రైర్వేదవేదాజ్గపారగై

మహానదీజలో పేతాం దధ్యక్షతసమన్వితామ్

 ఉత్తరాభిముఖై ర్న్యస్తాం జలమధ్యేఽవతారయేత్

 ఆథర్వణేన సామ్నా చ పున, రామేత్యథైవచ

ఆపోహిష్టేతి మన్త్రేణ క్షిప్త్వాఽఽగత్య చ మణ్డపమ్

పూజయిత్వా సద సత్ర బలిం దద్యా త్సమ స్తతః

 పున ర్దినాని హోత్తవ్యం చత్వారీ మునిసత్తమాః 

చతుర్థే కర్మకర్తవ్యం దేహ తత్రాపి శ క్తితః

దక్షిణా రాజశార్దూల వరుణస్య క్షమాపణమ్

 కృత్వాతు యజ్ఞపాత్రాణీ యజ్ఞోపకరణాని చ

 ఋత్విగ్భ్యస్తు సమం దత్వా మణ్డపం విభజే త్పునః

 హోమపాత్రీంచ శయ్యాంచ స్థాపకాయ నివేదయేత్

 తత్ప్రస్సహస్రం విప్రాణా మథవాఽష్టశతం తథా

 భోజనీయం యథాశక్తి పఞ్చాశ ద్వాథ వింశతిః

   ప్రతిష్టా దినమున ఉదయకాలమున బ్రాహ్మణులకు నూరుకాని ఆరువది ఎనిమిది కాని ఏబదికాని ముప్పది ఆరుకాని ఇరువదికాని గోవుల దానమీయవలెను. తరువాత జ్యోతిషికులు చెప్పిన 'శుభలగ్నమునందు వేద-గాన-వాద్య ధ్వనులనడుమ బంగారుతో అలంకరించబడిన గోవును ( ఈ క్రొత్త తటాక పు) నీటిలో దింపి పిమ్మట దానిని సామ వేదియగు బ్రాహ్మణునకు దానమీయవలేను. పిమ్మట పంచరత్నములు తాపటము చేసిన బంగారు పాత్రలో మకర మత్స్యాది ప్రతిమలను వేసి వేద వేదాంగ పారంగతులై న నలుగురు విప్రులు దానిని పట్టుకొనగా దానిలో నదీ జలములు దధి- అక్షతలు నింపి ఉత్తరాభిముఖులై న ఆ వి! పులచే 'దానిని నీటిలో దింపించవలెను. ఆథర్వణసోమ మంత్రములతో ‘పునర్మామా' ‘ఆపోహిష్ణా' అను మంత్రములతో ఆపాత్రను నీటిలో పడ వేసి మంటపమునకు వచ్చి సదస్సును (సదస్సు లోని పెద్దలను పూజించి మంటపమునకు అన్ని దిక్కులందు బలి వేయవలెను. తరువాత నాలుగు దినములు వరుసగా హోమము జరిపి - నాలుగవనాడు- కర్మ సమాపి జరుపవలేను. వరుణునకు (మంత్ర పూర్వముగ) క్షమాపణము చెప్పి యజ్గ పాత్రములను యజ్ఞాపక రణములను మండప సామగ్రిని దక్షిణలను ఋత్విజులకు సమముగా పంచవలెను. హోమ పాత్రను శయ్యను ఆచార్యునకు ఈయవలెను. తరువాత యథా శక్తిగా వేయి . అష్టోత్తర శతము . ఏబది-ఇరువది మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ..

ఏవ మేష పురాణేషు తటాక విధి రుచ్యతే

 కూపవాపీషు సర్వాసు తథా పుష్కరిణీషు చ

 ఏష ఏవ విధి ర్దృష్టః ప్రతిష్ఠాసు తథై వచ

 మన్త్రతస్తు విశేష స్స్యా త్ప్రాసాదోద్యానభూమిషు

 అయం త్వశ క్తా వర్దేన విధిర్దృష్ట స్స్వయంభువా

 అల్పే ష్వేకాగ్ని వ తుర్యా ద్వితశాఠ్యా దృతే నృణామ్

 పావృట్కాలే స్థితం తోయ మగ్ని షోమసమం స్మృతమ్

 శరత్కాలే స్థితం యత్స్యా తదుక్థ్యఫలదాయకమ్

వాజపేయాతిరా తాభ్యాం హేమన్తే శిశిరే స్థితమ్

 అశ్వమేధసమం ప్రాహుర్వసనసమయే స్థితమ్

 గ్రీష్మేప్య వస్థితం తోయం రాజసూయా ద్విశిష్యతే

ఏతా న్మహారాజ విశేషధర్మా న్కరోతి యోఽత్యర్థ విశుద్ధబుద్ధిః

 స యాతి రుద్రాలయ మాశు పూతః కల్పా ననేకా న్దివి మోదతేచ

 అనేక లోకా న్త్సమహర్జనాదీ న్బుక్వా పరార్ధద్వయ మజ్గనాభిః

 సహైవ విష్ణోః పరమం పదం యః ప్రాప్నోతి తద్యోగఫలేన భూయః

 ఇతి శ్రీమత్స్యపహాపురాణే మత్స్యమనుసంవాదా నర్గతేశ్వరనారదసంవాదే తటాక విధిక థనం నామాష్టపడా శోఽధ్యాయః

ఇది (వైదిక ) పురాణములందు చెప్పియున్న తటాక ప్రతిష్ణా విధానము. బావులు దిగుడు బావులు కోనేళ్ళు మొదలగు జలాశయ ప్రతిష్టలన్ని టియందు ఇదే విధానము. ప్రాసాదములు ఉద్యానములు భూమి ప్రతిష్ఠించుట దాన మిచ్చుట మొదలగు వానిలో మంత్రములు భేదించవచ్చును. శ క్తిలేని వారు దీనిని సంక్షిప్త పరచి ఏకాగ్ని (వానప్రస్థుడు) వలేనే న జరుపవచ్చును. తనకు ధనము విషయమున శక్తి యుండియు కోరత చేయరాదు. ఈ శాస్త్ర విధానమున ప్రతిష్టించిన జలాశయములలోని నీరు ప్రాణుల కుపయోగింపబడి వర్షాకాలము నందుపయుక్తమై అగ్నిష్టోమమను యజ్గము చే కలుగు ఫలమును శరత్కాలమున ఉపయోగపడి ఉక్ట్య యజ్గఫలమును హేమంతమున ఉపయోగపడి వాజపేయ యజ్గఫలమును శిశిరమున ఉపయోగపడి అతిరాత్రయజ్గఫలమును వన స్తమున ఉపయోగపడి అశ్వమేధ ఫలమును గ్రీష్మమునకూడ ఉపయోగపడి రాజసూయముకంటే అధిక ఫలమును ఇచ్చును.

 ధనము ఉన్నంతలో నిర్మల బుద్ధి కలిగి ఈ వి శేష ధర్మముల నాచరించినవాడు పవిత్రు డై శివలోకమున కేగును. అనేక కల్పముల కాలము స్వర్గమున నానందించును. రెండు పరార్దములపాటు తన ధర్మపత్నితో కూడ మహర్షనాది లోకములందు సుఖించి యోగసిద్దులకు మాత్రము లభించు విష్ణు పరమపద మును కూడ పొందును..

ఇది శ్రీమత్స్యమహాపురాణమున తటాక ప్రతిష్టా విధాన కథనమను ఏబది ఎనిమిదవ ఆధ్యాయము.