70 - అనంగ శయన వ్రతము

 బ్రహ్మా : వర్ణాశ్రమాణాం ప్రభవః పురాణేషు మయా శ్రుతః

సదాచారాశ్చ భగవ ధర్మశాస్త్ర వినిశ్చయా

 పుణ్యస్త్రీణాం సదాచారం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః !

పతివ్రతానాం దేవేశ చరితం పరికీర్తయ

ఈశ్వరః : యస్మిన్నేవ యుగే బ్రహ్మన్త్సహస్రాణి చ షోడశ

వాసుదేవస్య భార్యాణాం భవిష్య న్త్యమ్బుజోద్భవ

తాభి ర్వసన్తసమయే కోకిలాళికులాకులే

పుష్పితో పవనోత్బుల్ల కల్హార సరస స్తటే

 నిర్భరాపానగోష్టీషు ప్రసక్తాభి రలంకృతః

కుర జ్గనయన శ్రీమాన్మాలపాకృత శేఖరః

గచ్ఛన్త్సమీపమార్గేణ సామ్బః పరపుర ఞ్జయః

 సాక్షాత్కన్దర్పరూ పేణ సర్వాభరణభూషితః

అనజ్గశరతప్తాధి సాభిలాషాభి రీక్షితః

ప్రవృద్దే మన్మథ స్తాసాం భవిష్యతి యదాఽఽత్మని

 తదా వేశ్య జగన్నాధ స్సర్వతో జ్ఞానచకుషా

శాపం వక్ష్యతి తా స్సర్వా వో హరిష్యన్తి దస్య వః:

 మత్పరోక్షం యతః కామాత్ర్పాప్త మీదృగ్విచేష్టితమ్

తదా ప్రసాదితో దేవ ఇదం వక్ష్యతి శార్జ్గభృత్

 కృష్ణశాపా త్తత్పత్నీ నాం వేశ్యాత్వ ప్రాప్తిః

 తాభి శాపాభితప్తాభి ర్భగవాన్భూతభావనః

ఉత్తార భూతం దాసీత్వం సమ దాద్భ్రహ్మణః ప్రియమ్

 ఉపదేక్ష్య త్యథాత్మానం భావికర్మణి కారకమ్

భవతీనాం ముని ర్దాల్భ్యో యద్ర్వతం కథయిష్యతి

 తదేవోత్తారణాయాలం దాసీత్వేఽపి భవిష్యతి

 ఇత్యు క్త్వాతాః పరిత్యజ్య  (గతేద్వారవతీశ్వరే)గతోఽన్తర్దాన మీశ్వరః  

 బ్రహ్మదేవుడు ఈశ్వరు నిట్లడిగేను. భగవన్! (వేదిక) పురాణము లయందు చెప్పబడియున్న వర్ణాశ్రమముల ఉత్పత్తిని ధర్మశాస్త్రములయందలి ఆచార నిర్ణయములను సదాచారములను కూడ వింటిని. పుణ్య స్త్రీలు పాటించవలసిన సదాచారమును పతివ్రతల సదాచారమును వినగోరుచున్నాను. నా కవి తెలుపుము.

ఈశ్వరు డతనికి ఇట్లు చేప్పెను: ముందు రాబోవు యుగమున శ్రీకృష్ణునకు పదునారువేల మంది భార్య లగు దురు. ఆ కాలమున ఒకానొక వసంతర్తువునందు కోయిలల తుమ్మెదల గుంపులు దట్టమయి ధ్వనులు చేయుచుండ పూగిన ఉదానముల నడుమ వికసించిన ఎర్ర కలువలతో నిండిన నస్సు నోడ్డున ఉన్న శ్రీకృష్ణ భార్యల పదు నారు వేల మందికి సమీపముగా కృష్ణ కుమారుడు సాంబుడు. పోవుట జరుగును. అతడు లేడి కన్ను లవంటి చంచలములు మనోహరములు నగు కన్నులు కలవాడు; మాలతీ పుష్పములతో కేశపాశము నలంకరించుకొనిన వాడు, మద్యపానగోష్ఠులయందు దట్ట ముగా మునిగియున్న స్త్రీలు ఆతని చుట్టు పరివేష్టించి యుండి ఆతని నలంకరించి యుందురు. అతడును సర్వాభరణము లతో అలంకరించబడి - సాక్షాత్ మన్మథునివలె నుండును. అతనిని. శ్రీకృష్ణపత్నులందరును మన్మథ బాణ తాపము చే వాంఛాపూర్వకముగా చూతురు.. వారి మనస్సులందు కామ మధికమగుటను భగవానుడు. జ్ఞాననేత్రముతో చూచి నేను లేని చోట మీరు కామముచే ఇట్లు ఆచరించితివీ - కాపున మిమ్ము, దోపిడిగాండ్రు హరింతురు. అని శపించును.

శాపముచే అభితాపము చేంది వారందరును సర్వభూతముల, సృజించి పోషించువాడు. శారధారియగు కృష్ణ భగవానుని వేడికొని అనుగ్రహింపజేసికొందురు. మీరు ఈ శాపమునుండి తరించుటకు మీకు దాసీత్వము. ప్రాప్తించును. నేను రాబోవు పనులు ఏవి ఎట్లు జరుగనున్న వో అట్లు చేయువాడను. ఇక ముందు దాల్ఫ్యుడు ఆను బ్రాహ్మణుడు మీకు ప్రీతికరమగు వ్రతమును దేని నుపదేశించునో దాని నాచరించుడు. ఆది మిమ్ములను మీ దాసీత్వమునుండి తరింప జేయగలుగును.” అని ప్రీతితో భగవానుడు వారికి ఉపదేశించి వారిని విడిచి అంతర్థానము నందును.

తతః కాలేన మహతా భారావతరణే కృతే

నివృత్తే మౌసలే తద్వత్కేశ వేఽపి దివం గతే

శూన్యే యదుకులే సర్వే చోరైరపి జితేఽర్జునే

హృతాసు కృష్ణపత్నీషు దాసభగ్యాసు చాంబుధౌ

 తిష్ఠత్సు దుఃఖదౌర్బాగ్య సన్తప్తాసు చతుర్ముఖ

 ఆగమిష్యతి యోగాత్మా దాల్భ్యో నామ మహాతపాః

తాస్త మర్ఘ్యైశ్చ సమ్పూజ్య ప్రణిపత్య పునఃపునః

లాలవ్యమానా బహుశో బాష్పపర్యాకులేక్షణాః

స్మరన్త్యో వివిధా నోగా దివ్యమాల్యానులేపనా

భర్తారం జగతా మీశ మన న్త మపరాజితమ్

దివ్యానుభావాంచ పురీం నానారత్నగృహాణి చ

 ద్వారకావాసిన స్సర్వాక్ దేవభూతాన్కుమార కా

 ప్రశ్న మేత త్కరిష్యన్తి మునే రభిముఖం స్థితాః

స్త్రియః : దస్యుభి ర్భగవ న్త్సర్వాః పరిభుక్త వయం బలాత్

స్వధర్మచ్యవనేఽస్మాక మస్మి న్న శ్శరణం భవాక్

 ఆదిష్టోఽసి పురా బ్రహ్మన్కేశ వేనచ ధీమతా

కస్మా దీ శేన సంయోగం ప్రాప్య వేశ్యాత్వ మాగతాః

వేశ్యానామపి యో ధర్మ స్తన్నో బ్రూహి తపోధన

 కథయిష్యతి తత్తాసాం యద్దాల్భ్యశ్చకి తాననః

దాల్భ్యః : జలక్రీడావిహారేషు పురా సరసి మాన సే

 భవతీనాం సగర్వాణాం నార దోఽబ్యాశ మాగమత్

హుతాశనసుతా స్సర్వా భవన్త్యోఽప్సరసః పురా

ఆప్రణమ్యావలే పేన పరిపృష్ట స్స యోగ విత్

కథం నారాయణోఽ స్మాకం భర్తా స్యా దిత్యు పోషణమ్

తస్మా ద్ర్వతప్రదానం చ శాపశ్చాయ మభూ త్పురా

శయ్యాద్వయప్రదానేన మధుమాధవమాసయోః

 సువర్ణోపస్కరాస్సర్వాః ప్రదేయ శ్శుక్లపక్షయోః

భర్తా నారాయణో నూనం భవిష్య త్యన్యజన్మని

యదకృత్వా ప్రణామం మే రూపసౌభాగ్యమత్సరాత్

పరిపృష్టోఽస్మి తేనాశు వియోగో వో భవిష్యతి

చోరై రపహృతా స్సర్వా వేశ్యాత్వం సమవాప్స్యథ

ఏవం నారదశా పేన కేశవస్యచ ధీమతః

వేశ్యాత్వ మాగతా స్సర్వా భవ న్త్యః కామమోహితాః

ఇదానీమపి యద్వక్ష్యే తచ్ఛృణుధ్వం వరాజ్గనాః

తరువాత చాలకాలమునకు శ్రీకృష్ణ భగవానుడు భూభారావతారణము చేసి మౌసల (ఇనుపరోకలి పొడినుండి ఉత్పన్న మైన తుంగదుబ్బులతో యాదవులు పరస్పరము చేసికొనిన యుద్ధమునకు తరువాత తానును వైకుంఠము చేరును. యదుకులమున వీరులు లేక పోగా ఆర్జునుని జయించి దోపిడి గాండ్రు కృష్ణపత్నుల నపహరించి దాసీత్వమునకు పాలుపర తురు. వారు దుఃఖముచేతను దురదృష్టముచేతను నం తాపము చెంది సముద్ర తీరమున నుండగా యోగాత్ముడగు దాల్బుక డను మహాతపస్వి అచ్చటకు వచ్చును. వా రతనిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి పునః పునర్నమస్కారము లర్పింతురు. బాష్ప వ్యా ప్రములయిన కన్నులతో వా రనేక విధములుగా ఏడ్చుచు (తా మదివరకు అనుభవించిన) దివ్య భోగములను దివ్య మాల్యసుగంధానులేపనములను లోకేశుడు ఆనంతుడు పరాజయము నేరుగనివాడు నగు, తమ పతిని దీవ: లక్ష్మణ ములుగల తమ ద్వార కాపురిని ఆచటి నానా రత్న గృహములను దేవ సదృశులై యుండి అప్పుడు దేవత్వమును పొందిన ద్వారకావాసులగు కుమారకులను తలచుచు దుఃఖించుచు ఆ మునీ కెదురుగా నిలిచి ఇట్లు ప్రశ్నింతురు. "

“భగవన్: మేమందరమును దస్యులచే బలాత్కారమున అనుభవించబడితిమి. మాకు కలిగిన ఈ ధర్మ భ్రంశములో మీరే మాకు దిక్కు అగుదురని పూర్వమే శ్రీకృష్ణభగవానుడు మాకు ఆదేశించియున్నాడు. భగవానునకు పత్నులమగు మేము వేశ్యాత్వమును పొందుట కేమి హేతువు? తపోధనా! వేశ్యలకు ఆచరణీయమగు ధర్మమేదియో మాకు తెలుపుము.” అని అడుగగా ఆశ్చర్యచకితమయిన ముఖముతో దాల్యుడు వారితో నిట్లనును: “పూర్వము మీరందరును అగ్ని పుత్రికలగు అప్సరసలుగా ఉండిరి. ఒకప్పుడు మీరు మానస సరస్సున జలక్రీడా విహారములందుండగా నారదుడు మీకడకు వచ్చెను. మీరు గర్వముచే అతనిని నమస్కరించక యే మాకు నారాయణుడు పతియగు ఉపాయము ఏమ'ని అడిగితిరి. మధు (చైత్ర మాధవ (వైశాఖ) మాసములందు బంగారు అలంకరణములతో సర్వ పరికరములతో మంచము లను పడకలను (ఒక్కొక్క మాసమునందొక్కొక్కటిగా) ఉపవాస సహితమగు వ్రతాచరణముతో దానము చేసినచో నారాయణుడు పతియగునని ఉపదేశించి ఆముని రూప సౌభాగ్య గర్వముచే నన్ను నమస్కరింపక యే ఈ విషయము అడిగితిరి కావున మీకు నారాయణునితో వియోగము శీఘకాలములోనే కలుగును. చోరులచే అపహరింపబడి మీరు వేశ్యాత్వమును పొందుదురు. అని శపించును. ఇట్లు నారద శ్రీకృష్ణుల శాపముచే మీరు కామ మోహితులయి వేశ్యాత్యమును పొందితిరి. ఉత్తమ స్త్రీలారా! నేనిపుడు చెప్పునది వినుడు.

పురా దైవాసురే యుద్దే హతేషు శతశ స్సురైః

 దానవాసుర దైత్యేషు రాక్ష సేషు తత్ప్ర స్తతః

తేషాం నారీసహస్రాణి శతశోఽథ సహస్రశః

 పరిణితాని యాని స్యు ర్బలా ద్భుక్తాని యాని తు

 తాని సర్వాణి దేవేశః ప్రోవాచ వదతాం వరః

వేశ్యాధర్మేణ వర్తధ్వ మధునా నృపమన్దిరే

భక్తిమత్యో వరారోహా స్తథా దేవకులేషు చ

రాజానస్వామినస్తుభ్యం సూతకం చాపి తత్సమమ్

భవిష్యతీచ సౌభాగ్యం సర్వాసామపి శ క్తితః

యః కశ్చి చ్చుల్క మాదాయ గృహమేష్యతి వై సదా

అచ్చద్మ నై వోపచార్య సతదాఽన్యత్ర దామ్బికాత్

దేవతానాంచ విప్రాణాం పుణ్యేఽహ్ని సముపస్థితే

గోభూహిరణ్యధాన్యాని ప్రదేయాని చ శ క్తితః

బ్రాహ్మణేభ్యో వరారోహా: కార్యాణి వివిధానిచ

యచ్చా న్యచ్చ వ్రతం సమ్య గుపదేక్ష్యా మ్యహం తతః

అవిచా రేణ సర్వాభి రను ష్ఠేయం చ తత్సునః

సంసారోత్తారణా యాలం ఏత ద్వేద విదో విదుః

యదా సూర్యదినే హస్తః పుష్యోవాథ పునర్వసూ

భవేత్సర్వౌషధిస్నాననం సమ్యజ్ఞా రీ సమాచరేత్

తదా పఞ్చశరస్యాపి సన్ని ధానత్వ మేష్యతి

అర్చయే త్పుణ్ణరీకాక్ష మనజ్గ స్యానుకీర్తనైః

పూర్వము దేవాసుర యుద్ధములందు దేవతల చేతులలో వందలకొలదిగా దానవులు అసు 2 లు దైత్యులు రాక్షసులు మరణించిరి. వారి స్త్రీలు వేలకొలదిమంది వీరిచే హరించబడి బలాత్కారమున పెండ్లాడబడుటయో అనుభ వించబడుటయో జరిగెను. వారితో పురుషోత్తముడగు దేవేంద్రుడిట్లనెను . మీరిక మీదట భూలోకమున) రాజమందిరము లందును దేవమందిరములందును భ క్రిమతులై వేశ్యా ధర్మముతో నుండుడు. (అచటి రాజులే మీకు యజమానులగుదురు. వారికి వచ్చిన ఆశౌచములు మొదలగునవి మీకును వర్తించును. మీకందరకును యోగ్యతానుసారము సౌభాగ్యము (ఐదువతనము) ఉండును. కపటి కానీ ఎవడు శుల్కము వెల) తీసికొని మీకడకు వచ్చినను అతనికి మీరు కపటము లేకుండ - ఉపచారము చేయవలయును. పుణ్య దినములందు దేవతలకును బ్రాహ్మణులకును గో భూ-హిరణ్య-దానములు చేయవలయును. బ్రాహ్మణులకు మీచేతనైన కార్యములు (నృత్యము-సంగీతము మొదలగునవి) చేయవలయును. ఇది కాక నేను మీకొక వ్రతము నుపదేశింతును. దానిని మీరు ఏమాత్రమును వెనుక ముందులు విచారించక అనుష్టించవలయును. దానిచే మీరు సంసారమును తరింతురు. ఆదిత్యపార మున హస్త పుష్య పునర్వసులలో నేదైన నక్షత్రముండగా (మీజాతి వారు) సర్వోషధులతో స్నానమాడి మన్మథుని నన్ని ధానము (ప్రతిమా ప్రతిష్టాపనము) ఏర్పరచుకొని మన్మథ నామములతో విష్ణు నర్చించవలయును.

కామాయ పాదౌ సమ్పూజ్య జజ్ఘేవై మోహకారిణే

మేడ్రం కన్దర్పనిధయే కటిం ప్రీతిమతే నమః

నాభిం సౌఖ్యసము దాయ వాసవాయ తథోదరమ్

హృదయం హృదయేశాయ స్తనా వానన్దకారిణే

ఉత్కణ్ఠాయచ వై కణ్ఠ మాస్య మాహ్లాదకారిణే

వామాజ్గం పుష్పచాపాయ పుష్పబాణాయ చక్షిణమ్

నమోనఽజ్గాయవై మౌళిం విలోలాయేతి మూర్ధజాక్

సర్వాత్మనే శిర స్త ద్వ ద్దేవదేవస్య పూజయేత్

నమశ్శివాయ శాన్తాయ పాశాజ్కుశధరాయ చ

గదినే పీతవస్త్రాయ శజ్ఖచక్రధరాయచ

నమో నారాయణాయేతి కామదేవాత్మనే నమః

నమశాన్త్యై నమః ప్రీత్యై నమో రత్యై నమో నమః

నమః పుష్టై నమ స్తుష్టై నమ స్సర్వార్థసమ్పదే

ఏవం సమ్పూజ్య గోవిన్ద మనజ్గాత్మాన మీశ్వరమ్

గన్దై ర్మాల్యే స్తథా ధూవై ర్నై వేద్యై శ్చైవ కామినీ

తత ఆహూయ ధర్మజ్ఞం బ్రాహ్మణం వేదపారగమ్

అవ్య జ్గావయవం పూజ్య గన్దధూపార్చనాదిభిః

శాలేయం తణ్డులప్రస్థం ఘృతపాత్రేన సంయుతమ్

తస్మై విప్రాయ సా దద్యా స్మగ్మథ: ప్రీయతామితి

యథేప్తాహారభు క్తేతు తమేవ ద్విజస త్తమమ్

రత్యర్థం కామదేవోఽయ మితి చిత్తేన ధార్యతామ్

యద్య దిచ్ఛతి విప్రేన్ద్ర స త తుర్యా ద్విలాసినీ

సర్వభావేన చాత్మాన మర్పయే త్స్మితభాషిణీ

ఏవ మాదిత్యవారేణ సదా తద్వ త్సమాచరేత్

తణ్డులప్రస్థదానంచ యావనాసా స్త్రయోదశ

పూజామంత్రములు: 1. కామాయనమః-పాదౌ పూజయామి; 2. మోహ కారిణేనమః-జం మే . పూజయామీ; 3. కందర్ప నిధయేనమః. మేడ్రం పూజయామి; 4. ప్రీతిమ తేనమః కటిం పూజయామి; 6. సౌఖ్య సముదాయనమః నాభిం పూజయామి; 6. పాసపోయనమః ఉదరం పూజయామి; 7. హృదయేశాయనమః హృదయం పూజయామి 8. ఆనంద కారిణేనమః- స్తనౌ పూజయామి; 9. ఉత్కంతాయనమః-కంఠం పూజయామి; 10. ఆహ్లాద కారిణేనమః -ఆన్యం పూజయామి; 11. పుష్పచాపాయనమః వామాంగం పూజయామి; 12. పుష్పబాణాయ నమః-దక్షిణాంగం పూజయామి, 18. అనంగాయనమః - మౌళిం పూజయామి; 14. విలోలాయనమః - కేశాన్ పూజయామీ; 15. సర్వాత్మనేనమః శిరః పూజయామి; (ఇది అంగపూజ).

గదాధరుడు-పీతవస్తుడు.శంఖచక ధరుడు - మన్మథాత్ముడునగు నారాయణునకు నమస్కారము. శాంతి. ప్రీతి-రతి-పుష్టి-తుష్టి-సర్వార్థ సంపది రూపయగు లక్ష్మికి నమస్కారము .

ఇట్లు మన్మథాత్మకుడు ఈశ్వరుడగు గోవిందుని గంధమాల్య ధూపదీప నైవేద్యములతో ఈ స్త్రీలు పూజించ వలేను. తరువాత ఆమే ధర్మజ్ఞుడు వేద పారంగతుడు అంగ వైకల్యములేని వాడు నగు బ్రాహ్మణుని పిలిపించి గంధ దీపాద్యర్చనలతో ఆతనిని పూజించి కుంచేడు మంచి రాజనాల వరి బియ్యమును నేతితోడి పాత్రను 'మన్మథః ప్రీయతామ్' అనేడు మంత్రముతో దానము చేసి ఈ పదార్థములు మీయశ్రేష్ట భోజనమునకు సరిపోవుగాక! యని భక్తితో పలుకవలెను. రతీదేవికి ఆనందము కలిగించు మన్మథుడే ఈ బ్రాహ్మణుడని భావన చేయుచు. ఈ విలాసిని ఆ విప్రుని మనస్సునకు ప్రీతికరముగా అతడు కోరినట్లు సర్వభావము తో ఆత్మార్పణముచే నృత్య గీతాది విలాసములతో ఆతనిని సంతోష పెట్ట వలయును. ఇట్లు ప్రతి ఆదివారము నాడును పదుమూడు మాసములు విడువక, వ్రతము చేయవలయును.

తత స్త్రయోదశే మా సే సంప్రాప్తే తస్య భామినీ

విప్రస్యోపస్కరై ర్యుక్తా శయ్యాం దద్యా ద్విలక్షణామ్

సోపధానక విశ్రామాం స్వా స్తరావర ణాం శుభామ్ ప్రదీపోపాసహచ్ఛత్రపాదుకాసనసంయుతామ్

సపత్నీక మలజ్కృత్య హేమసూత్రాజ్గుళీయకై

సూక్ష్మవస్త్రైస్సకటకై రూపమాల్యాను లేపనై

 కామదేవం సపత్నీకం గుడకుమ్బోవరి స్థితమ్

తామ్రపాత్రాసనగతం హేమసూత్రపటావృతమ్

సకాంస్యభాజనో పేత మికుదణ్డసమన్వితమ్

దద్యా దనేన మ న్త్రేన తథై కాం గాం పయస్వినీమ్

యథా న్తరం న పశ్యామి కామ కేశవయో స్సదా

తథైవ సర్వకామా ప్తిరస్తువిష్ణో సదా మమ

యథా న కామినీ దేహా త్ప్రయాతి తవ కేశవ

తథా మమాపి దేవేశ శరీరేషు కురు ప్రభో

తథాచ కాఇ్చనం దేవం ప్రతిగృహ్య ద్విజోత్తమః

(కామోఽదాత్కామో)కోఽదా త్కామో దదాతీతి వైదిక  మన్త్ర ముచ్చరేత్

అనజ్గః ప్రతిగృహ్ణాతి అనజ్గోవై దదాతి చ

అనజ్గ సారకోభాభ్యా మనజ్గాయ నమోనమః

తతః ప్రదక్షిణీకృత్య విసృజ్య ద్విజపుజ్గవాక్

శయ్యాగవాదికం సర్వం బ్రాహ్మణస్య గృహం నయేత్

తతఃప్రభృతి యోఒన్యోవై రత్యర్థం గృహ మాగతః

స మాన్య శ్చోపచారేణ స సమ్పూజ్యో భవే త్తదా,

ఏవం త్రయోదశం యావ న్మాస మేకం ద్విజోత్తమమ్

తర్పయేత యథాకల్పం ప్రోషి తేన్యం సమర్చయేత్

తదనుజ్ఞయాచ వస్తవ్యం యావ దబ్ధాగ మో భవేత్

ఆత్మనోఽపి తథా విఘ్నో గర్భసూతక రాజతః

దై వోవా మానుషో వా స్యా దుపరాగేణ పాతతః

సా వత్సరా నష్ట పఇ్చ చాష్ట సజ్ఖ్యా సమాపయేత్

తథాపిచ ద్విజం దేవం యథాశక్త్యా సమర్చయేత్

పదుమూడవ మాసమున బ్రాహ్మణ దంపతులను బంగారు గొలుసులు యజ్ఞోపవీతము ఉంగరములు కడి యములు మురుగులు సన్నని వస్త్రములు గంధమాల్యాను లేపనములు-ఇట్టివానితో అలంకరించి వారికి శయన దానము చేయవలెను. వారికి అన్ని పరికరములతో కూడిన మంచము-దిండ..పరపు.పరపుపై కప్పు దుప్పటి.ఆనుకొనుదిండు. ప్రదీపము - చెప్పులు-గొడుగు-పాదుకలు పీట. ఇట్టి వన్నియు చేర్చిన విలక్షణమయిన శయ్యను దానము చేయవలెను. ఒక కడవలో బెల్లము నింపి దాని పై తామ్ర పాత్ర నిలుపవలేను. దాని పై ఆసనము నమర్చి దాని పై రతీ మన్మథుల (బంగారు) ప్రతిమలను బంగారు సరిగగల వస్త్రములు కట్టిన వానిని ఉంచవలెను. కంచు పాత్రను చెరకు గడను కూడ వాటితో పాటు చేర్చి పాడియావును ఇవన్నియు కూడ ఆ విప్ర దంపతులకు దానమీయవలెను.

దాన మంత్రమునకి అర్ధము: మన్మథ విష్ణువుల నడుమ నేను అభేదము భావించుచు నారాయణుని సేవించు చున్నాను. కావున నారాయణా! నాకు అన్ని కోరికలు నెర వేరుగాక! కేశ వా! నీ దేహమునుండి నీకామిని లక్ష్మి) వేరు కానట్లే నాకును అన్ని కోరికలును (కామములు) తీరుగాక ! ఈ దానమును ప్రతిగ్రహించు వాడును దానఫలమును ఇచ్చు వాడును మన్మథుడే. విప్రాః దానము గ్రహించు నిన్ను ను ఇచ్చు నన్ను ను తరింపజేయువాడును మన్మథుడే. అట్టి మన్మథు నకు నమస్కారము. (ఇచట కామో దాతా-ఇత్యాది వేదమంత్రమును చెప్పవలెను.)

తరువాత ఆ విప్రదంపతులను ప్రదక్షిణించి వారిని వారి గృహమునకు పంపిపిమ్మట ఈ దానమిచ్చిన వన్ని యు వారి ఇంటికి చేర్చవలెను.

అది మొదలు తమ ఆనందమునకై తమ ఇంటికి ఎవరు వత్తురో వారిని ఉపచారములతో ఆనందపరచవలెను.

లోగడ చెప్పిన పదుచూడు మాసముల క్రమములోను ఒక బ్రాహ్మణుని మాత్రమే అర్చించవలెను. ఒక వేళ అతడు ఆ నడుమ దేశాంతరము పోయినచో ఆతని అనుమతితో మరియొక బ్రాహ్మణుని అర్చించవచ్చును.

తాను గర్భవతి యగుట.తనకు పురుడువచ్చుట-తన రాజునకు ఆశాచమువచ్చుట. ఇతరములగు దైవిక హేతు వులు-మానుషము లైన హేతువులు గ్రహణములు-వ్యతీపాతము మొదలగు దోషములు - వీనిచే వ్రతమున విఘ్నము సంభ వించినను ఎనిమిది. ఐదు.ఎనిమిది. ఈ క్రమమున(8-5=13) మొత్తము పదుమూడు మాసములగునట్లు కొన్ని సంవత్సరములపాటు ఈ వ్రతమును ఆమె చేయుచుండవలెను. ఏ విఘ్నము వచ్చినను బ్రాహ్మణుని (మన్మథ) దేవుని యథా శ క్తిగా అర్చించుచునే యుండలేను.

ఏతద్ది కథితం సమ్య గ్బవతీనాం విశేషతః

స్వధర్మోఽయం యతో భావ్యో వేశ్యానా మిహ సర్వదా

పురుహూతేన యత్ప్రోక్తం దానవేషు పురా మయా

తదిదం సాంప్రతం సర్వం భవతీ ష్వనుయుజ్యతే

సర్వపాపప్రశమన మన న్తఫలదాయకమ్

కల్యాణినీనాం కథితం త త్కురుధ్వం వరాజ్గనాః

 కరోతి యాఽ శేష మఖణ్డ మేత త్కల్యాణినీ మాధవలోకసంస్థా

సా పూజితా దేవగణై ర శేషై రానన్దకృత్థాన ము ప్రతి విష్ణోః

శ్రీమత్స్యః : తపోధన స్సోఽవ్యభిధాయ చైత దనజ్గదానవ్రత మజ్గనానామ్

స్వస్థాన మేష్యంత్యథతాస్సమస్తా వ్రతం చరిష్యన్తి చ దేవయోనే

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే అనజ్గశయన వ్రతకథనం నామ సప్తతిత మోఽధ్యాయః

(దాల్భ్య వచనము) కృష్ణ పత్ను లారా! పూర్వము దేవేంద్రుడు రాక్షస స్త్రీలను భూలోకమున వేశ్యలుగా బుట్టు డని వారికి చెప్పిన స్వధర్మము ఇది; ప్రకృతమున మీరును ఈ వ్రతమునే అనుష్టించ వలయును. ఇది సర్వపాప ప్రశ మనము; అనన ఫలదాయకము; 'కల్యాణినులు' ఆను. వేశ్యా స్త్రీలకు విధించబడిన వ్రతము ఇది; దీనిని మీరును ఆచరించుడు. దీనిని అఖండ ముగా ఎడతెగక ఆచరించిన 'కల్యాణిని' విష్ణు లోకమున వసించును. అచట ఆమే ఆ శేష దేవ గణముల పూజల నందుకొనును.

మత్యుడు చివరకు ఇట్లు చెప్పెను.ఆ దాల్బ్యముని కృష్ణ పత్నులకు పదునారు వేల మందికిని ఇట్లు ఈ ఆనంద శయన దాన వ్రతమును ఉపదేశించి తన స్థానమునకు మరలి పోవును. వారును ఈవ్రతమును అట్లే ఆచరింతురు.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున అనుగశయన వ్రతము అను డెబ్బదవ అధ్యాయము.