269 - మండప లక్షణము.

సూతః : అథాత స్సంప్రవక్షామి మణ్డపానాం తు లక్షణమ్

మణ్ణపప్రవరాన్వక్ష్యే ప్రాసాదస్యానురూపతః

 త్రివిధా మణ్డపాః కార్యా జ్యేష్ఠమధ్యకనీయసః

 నామత స్తా ంప్రవక్ష్యామి శృణుధ్వ మృషిసత్తమాః

 పుష్పకః పుష్పభద్రశ్చ సువ్రతోఽమృతమస్థనః

 కౌశల్యో బుద్ధిసజ్కీర్ణో గజభద్రో భయావహః

శ్రీవత్సో విజయశ్చైవ వాస్తుకీర్తి శ్శ్రుతింజయః

 యజ్ఞభద్రో విశాలశ్చ సుశ్లిష్ట శ్శత్రుమర్దనః

 భాగపఞ్చో నన్దనశ్చ మానవో మానభద్రకః

 సుగ్రీవో హరిత శ్చైవ కర్ణికారశ్శతర్ధికః

 సింహశ్చ శ్యామభద్రశ్చ శశ కశ్చ తథైవచ

 సప్తవింశతి రాఖ్యాతా లక్షణం శృణుత ద్విజాః

 స్తంభా యత్ర చతుష్షష్టిః పుష్పక స్స ఉదాహృతః

 ద్విషష్టిః పుష్పభద్రస్తు షష్టి స్సువ్రత ఉచ్యతే

అష్టపఞ్చాశక స్తమ్భః కథ్యతేఽమృతమన్దనః

 కౌశల్య ష్షట్చ పఞ్చాశ చ్చతుః పఞ్చాశ తా పునః

 నామ్నా తు బుద్దిసజ్కీర్ణో ద్విహీనో గజభద్రకః

జయావహస్తు పఞ్చాశ చ్చ్రీవత్స స్తద్ద్విహీనకః

 విజయ స్తద్విహీన స్స్యా ద్వాస్తుసజ్కీర్తిక స్తతః

 ద్వాభ్యా మేవ ప్రహీయేత తతశ్శ్రుతిజయోఽవరః

 చత్వారింశద్యజ్ఞభద్ర స్తద్విహీనో విశాలకః

 షట్త్రింశశ్చైవ సుశ్లక్ష్ణో ద్విహీన శ్శత్రుమర్దనః

 ద్వాత్రింశ ద్భాగపఞ్చస్తు తింశద్బి ర్నన్దన స్మృతః

 ఆష్టావింశన్మానవస్తు మానభద్రో ద్విపానకః

 చతుర్వింశస్తు సుగ్రీవో ద్వావింశో వర్షణో మతః

 వింశతిః కర్ణికార స్స్యా దష్టాదశ శతర్ధిక

సింహో భవేద్ద్విహీనశ్చ శ్యామభద్రో ద్విహీనకః

సుభద్రస్తు తథా ప్రోక్తో ద్వాదశ స్తమ్భ ఉచ్యతే  

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇంతవరకును తెలిసికొనిన దేవాలయ నిర్మాణాదికమునకును దేవతా పూజోత్సవాదులకును ఉపయుక్తము కావున ఇపుడిక మండపముల లక్షణమును తెలి పెదను; ప్రాసాదదేవాలయమునకు అనురూపముగా నుండు మండప శేషములను తేలి పెదను వినుడు; జ్యేష్టము మధ్యమము కనిష్టము అని మూడు విధములుగా మండప నిర్మాణము చేయవచ్చును; ఋషిన ములారా! వాటిని నామగ్రహణముతో మొదట తెలివి తరువాత వారి లక్షణ మును తెలి పెద వీనుడు; ఇవి మొ త్తము ఇరువది ఏడు విధములు; ఇవి అరువది నాలుగు స్తంభములు మొదలు పం డెండు స్తంభముల వరకు రెండేసి స్తంభముల వంతున తగ్గుటతో ఏర్పడును; 1. పుష్పకము.64 స్తంభములు కలది; 2. పుష్ప భద్రము.62 స్తం; 8. సు వతము-60 సం; 4. అమృత మంథనము- 58 స్తం; 6. కౌశల్యము -66 స్తం; 6. బుద్ధి సంకీ గ్లము.54 స్తం; 1. గజభద్రము. 52 స్తం; 8. జయావహము- 50 స్తం; 9. శ్రీవత్సము. 48 స్తం; 10. విజయము.46 స్తం; 11. వాస్తుకీ ర్తి 44 స్తం; 12. శ్రుతింజయము.42 స్తం; 18. యజ్ఞభద్రము-40 స్తం; 14. విశాలము -88 స్తం; 16. సుల్లి ష్టము.36 స్తం; 16. శత్రుమర్గనము.34 స్తం; 17. భాగపంచము 82 స్తం; 18. నందనము. 30 సం; 19. మానవము - 28 స్తం; 20. మానభద్రకము 26 స్తం; 21. సుగ్రీవము-24 స్తం; 22. హరితము-22 స్తం; 28. కర్ణికారము -20 స్తం; 24. శతర్ధికము. 18 స్తం; 25. సింహము-16 స్తం; 26. శ్యామభద్రము-14 స్తం; 27. శశక సుభద్రము. 12 స్తం.

మణ్డపాః కథితా స్తుభ్యం యథావల్లక్షణాన్వితాః

 త్రికోణం వృత్తమధ్యంతు హ్యష్టకోణం ద్విరష్టకమ్

 చతుఃకోణంచ కర్తవ్యం సంస్థానం మణ్డపస్య తు

 రాజ్ఞాం చ విజయం చైవ శత్రూచ్చాటన మేవచ

 పుత్రలాభ స్స్త్రియః పుష్టి స్త్రికోణాదిక్రమా ద్భవేత్

 ఏవంతు శుభదః ప్రోక్తో హ్యన్యథాతు భయావహః

చతుష్షష్టిపదం కృత్వా మధ్యే ద్వారం ప్రకల్పయేత్

 విస్తారాద్ద్విగుణోచ్చ్రాయ స్త్రిభాగాచ్చ కటిర్భవేత్

విస్తారార్ధో భవే ద్గర్భో భిత్తయోఽన్యా స్సమ న్తతః

 గర్భపాదేన విస్తీర్ణం ద్వారం త్రిగుణ మాయతమ్

 తథా ద్విగుణవి స్తీర్ణముఖ స్తద్వ దుదుమ్బరః

విస్తారపాదప్రతిమం బాహుళ్యం శాఖ యో స్మృతమ్

 త్రిపఇ్చసప్తనవభి శ్శాఖాభి ర్ద్వ్రా మిష్యతే

కనిష్ఠం మధ్యమం జ్యేష్ఠం యథాయోగం ప్రకల్పయేత్

 విస్తారా ద్ద్విగుణోచ్ఛాయా చ్చత్వారింశద్భి రున్న తమ్

 అజ్ఞుళానాం శతం సార్ధం చత్వారింశ త్తథోన్నతమ్

 త్రింశ ద్వింశోత్తరం చాన్యత్ ధన్యము త్తమ మేవతు

శతం చతుర్భిః సహితం వాతన్ని ర్గమనంభవేత్

అధికం దశభి స్తద్వ త్తథా షోడశభి శ్శతమ్

 శతమానం తృతీయం తు నవత్యాశీతిభి స్తథా

 దశ ద్వారాణి చై తాని క్రమేణోక్తాని సర్వదా

అన్యాని వర్జనీయాని మ(మా)నసోద్వేగ దాని తు  

ఇంతవరకును నీకు యథావత్ గా (శాస్త్రమునందును సంప్రదాయమునందును ఉన్న వి యున్నట్లు) లక్షణము లతో కూడిన మండపములను తెలిపితిని; మండప సంస్థానము ( మండప నిర్మాణమునకై సిద్ధపరచు భూప్రదేశపు ఆకృతి. The ground plan for a Mandapa) 1. త్రిభుజముగాగానీ 2. వృ త్తముగా గాని 8. అష్టభుజాకృతితోగాని 4. షోడశ భుజాకృతితోగాని లీ. చతుర్భుజాకృతి (Square shape)తోగాని యుండవచ్చును; ఇవి వరుసగా 1. రాజులకు విజయ మును 2. శత్రూచ్చాటనమును (భయ పెట్టి పారదోలుట) 3. పుత్రలాభము 4. శ్రీ సమృద్ధి 5. పుష్టి కలిగించును; ఈ చెప్పిన విధములలో ఏదో యొక రూపమున నిర్మించిన మండపము శుభావహము; మరియొక విధముగ నిర్మించినధి భయా వహము. (చూ. పుట . 293)

మండప నిర్మాణ వ్యవస్థ: మండప నిర్మాణమునకై నిర్ణయించుకొనిన ప్రదేశమును (సంస్థాన భూమి పైనుండు ప్రదేశమును) చతుఃషష్టిపద రూపమున (64సమ చతురస్రములుగా) విభజించుకొనవలయును; ఇట్టి విభాగములలో నట్టనడిమి వీభాగములందుండునట్లు (4.5 పదములయందుండునట్లు ద్వారమునుంచవలయును; ద్వారపు వెడలుపు ఎంతయుండునో ఆవాకిటి ఎత్తు అంతకు ద్విగుణముండవలయుమ; *ద్వారపు కటి(గడియ) ద్వారపు వెడల్పులో మూడవవంతు పొడవున నుండవలయును; మండపమందు మండప గర్బము ఉండును; ఇదీ మండపపు మొత్తము వెడల్పులో నగముండవలయును; అనగా చతుషష్టి పద విభజనానుసారము ఎటునుండి చూచినను 8.4.5.7 పదములలో ఏర్పడు. చదరమున ఇదియుండ వలయును; ఈ మండపమునకును నాలుగువైపులను గోడలుండును; దీనికిని ముందువైపున ద్వారము గర్భపు వేడలుపుతో నుండును; ఈ ద్వారపు పొడవు (ఎత్తు) ఈ వేడలుపునకు మూడింతలుండవలయును; లేదా ఈ గర్భమండప ద్వారపు వెడల్పు ఇంతకు రెట్టింపు ఉన్నను (అనగా గర్భమండపపు వెడల్పులో సగము) ఉండవచ్చును; ఈ ద్వారపు తలుపులు మేడి కొయ్యతో చేయవలయును; ద్వార శాఖలు (నిలువుకమ్ములు) ద్వారపు వెడల్పులో నాల్గవవంతు మందముతో (వేడ ల్పుతో నుండవలయును; తలుపును మూడు గాని ఐదుగాని ఏడుగాని, చెక్క-లను కలిపి చేయవచ్చును; 1. ఇది ద్వార నిర్మాణమునందు ఒక పద్దతి; ఇట్లు కాక జ్యేష్ట మధ్యమ కనిష్ఠ భేదమున. ఒక్కొక్క భేదములో మరల మూడేసి విధము లతోనైన ద్వార మేర్పరచవచ్చును; ఎట్లన- 2. సూట నలువది 8 నూట ముప్పది 4. నూట ఇరువది అంగుళముల ఎత్తుతో నుండునవి జ్యేష్ఠ పరిమాణపు ద్వారములు; ఇవి ధన్యములును ఉత్తమములును; 5. నూట నాలుగు 6. నూటపది 7. నూట పదునారు అంగుళముల ఎత్తుతో నుండు ద్వారములు మధ్యమ పరిమాణక ద్వారముల వర్గమునందలివి; 6. నూరు 9. తొంబది 10. ఎనుబది అంగుళముల ఎత్తుతో నుండు ద్వారములు మూడును కనిష్ట పరిమాణక ద్వారముల వర్గము నందలివి; ఈ క్రమమున చెప్పిన పది ద్వారములును నర్వదా గ్రాహ్యములు; ఇతర విధములగు కొలతలతో నుండు ద్వార ములు వర్ణించవలయును; ఏలయన అవి మానసోద్వేగకరములు.

 * మత్స్య-2.69 ఆ. కటిః. గడియ (ఇది తెలుగు పదమే సంస్కృతమున చేరెనా? ఆనిపించు ప్రయోగము; ఇచ్చటనే శాఖా చెక్క'; తలుపులు మొదలగు వానిని ఎన్నీ చెక్కలు కలిపి చేయవచ్చును? అను విషయమున కై) ఇదియు తెలుగుపదమే సంస్కృతమున చేరేనా? అనిపించు ప్రయోగము.

ద్వార వేదం ప్రయత్నేన సర్వవాస్తుషు వర్జయేత్

వృక్ష కోణభ్రమిద్వార స్తంబకూపధ్వజాద(జై ర)పి

 కుడ్యశ్వ! భ్రేణ వా విద్దం ద్వారం న శుభదం భవేత్

 క్షయశ్చ దుర్గతిశ్చైవ ప్రవాసః క్షుద్భయం తథా

 దౌర్బాగ్యం బన్జనం రోగో దారిద్ర్యం కలహం తథా

విరోధశ్చార్థనాశశ్చ సర్వ వేధా ద్బవే త్ర్కమాత్

 పూర్వేణ ఫలినో వృక్షాః క్షీరవృక్షాస్తు దక్షిణే

పశ్చి మేన జలం  శ్రేష్టం పద్మోత్పలవిభూషితమ్

 ఉత్తరే సరళై స్తాలై శ్శుభా స్యా త్పుష్ప వాటికా

 సర్వతస్తు జలం శ్రేష్టం స్థిర మస్థిర మేవ వా

 పార్శ్వత శ్చాపి కర్తవ్యం పరివారాలయాదికమ్

యామ్యే తపోధనస్థాన ముత్తరే మాతృకాగృహమ్

 మహానసం తథాగ్నే యే నైరృత్యేఽథ వినాయకమ్

 వారుణే శ్రీనివాసస్తు వాయవ్యే గృహమాలికా

 ఉత్తరే యజ్ఞశాలా తు నిర్మాల్యస్థాన ముత్తరే

 వారుణే సోమదై వత్యే బలి నిర్వాపణం స్మృతమ్

 పుర తో వృషభస్థానం శేషే స్యా త్కు సుమాయుధః

 బలిం వాపి త థై శానే విష్ణోశ్చ జలశాయినః

ఏవ మాయతనం కుర్యాత్కుణ్డమణ్డప సంయుతమ్

ఘణ్టావితానక సతోరణచిత్రయుక్తం నిత్యోత్సవ ప్రముదితేన జనేన సార్ధమ్  

యః కారయే తురగృహం వివిధద్వజాజ్కం శ్రీ స్తం న ముఞ్చ్తితి సదా దేవిపూజ్యతే సః

ఏవం గృహార్చన విధావపి శక్తిత స్యాత్సంస్థాపనం సకలమంత్ర విధానయుక్తమ్ గోవస్త్రకాఞ్చనహిరణ్యధరా ప్రదానం దేయం గురుద్విజవరేషు తథాఽన్న దానమ్

ఇతి శ్రీమత్స్య మహాపురాణే మళ్తపలక్షణాదిక థనం నామ ఏకోనస ప్రత్యుత్తరద్విశతత మోఽధ్యాయః

సర్వ వాస్తులయందును ప్రయత్నముతో ద్వారవేధము లేకుండునట్లు చూడవలయును; వృక్షము.కోణము -భ్రమి గాలిచక్రము కుమ్మరిసారె.గానుగ లోనగునవి) ఇతరులఇంటిద్వారము. స్తంభము. బావి-ధ్వజము-(జెండా)-గోడ గోయి. ఇట్టివాని వేధ పొందిన ద్వారము హాని కలిగించును; వీనిచే క్షయము.దుర్గతి ప్రవాసము. వుద్భయము. దౌర్భాగ్యము.బంధ నము.రోగము.దారిద్ర్యము కలహము.విరోధము.ధననాశము. ఇట్టి ఫలములు కలుగును.

ఈ మండపపు ఆవరణములో తూర్పున పండ్ల చెట్లు.పాలుగల (మర్రివంటి చెట్లు దక్షిణమందును వశ్చిమమునను కలువలతో తామరలతో అలంకృతమయియుండు జలము (జలాశయము)ను ఉత్తరమున సరళ తాళాది వృక్షములును పుష్ప వాటికయును ఉండవలయును; ఇవికాక ఈ అన్ని దిక్కులందును అవకాశమున్న చోటులందు స్థిరమయినదో (ప్రవ హించనిది) ఆస్థిరమయినదో (ప్రవహించునది) నీరు ఉండుటమంచిది.

ఇదే ఆవరణమునందు దక్షిణమున తపోధన (అనుష్టానమో జపములో తపములో పొరాయణ మే యోగసాధ నమో చేసికొను వారి స్థానమును ఉత్తరమున (సప్త మాతృకాగృహములును ఆగ్నేయమున వంటశాలయు నైరృతమున వినాయక గృహమును పడమట విష్ణుని గృహమును వాయవ్యమున (యాత్రికుల వనతి ) గృహముల వరుసయు ఉత్తరమున యజ్ఞశాలయు ఉత్తరముననే న్మీల్య స్థానమును పడమటగాని సోమదేవతాక స్థానమునందు (ఉత్తరమున) గాని బలి నిర్వహణ స్థానమును ముందు వైపున వృషభ స్థానమును (పడమట) శేష స్థానమునందు మన్మథ స్థానమును ఈశాన్యము నందు జలమునందు శయనించియుండు విష్ణుని స్థానమును. ఈ విధముగ కుండములతోను మండపములతోను కూడిన ఆయతన దేవాలయమును నిర్మింపజేయవలయును. ప్రక్కలందు పరివార శాలలుండవలెను.

 ఘంటలు మేలుకట్టులు వివిధ తోరణములు (మహాద్వారములు) నిత్సోత్సవములు దర్శింపవచ్చి ఆనందముతో నిండియుండు జనులు వివిధధ్వజ విశేషములు ఉండునట్లు దేవాలయమును ఎవరు నిర్మింతురో వారిని ఇహమున లక్ష్మి, ఎన్నడును విడువదు; వారు పరమున స్వర్గమునందు పూజలనందుకొనుచు సుఖములనందుదురు; ఇదే విధముగ గృహ మందును యథాశ క్తి గా సకల మంత్రములతో శాస్తోక్ష విధానములతో ఆర్చన విధానమును వ్యవస్థ చేసికోనవలయును; ఆయా ప్రక్రియా సందర్భములయందు గురువులకును ద్విజులకును గోవస్త్ర హిరణ్య , భూదానములను చేయవలయును; ఎల్లరకును అన్న దానము చేయవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రాసాద (దేవాలయ) లక్షణమునందు మండప లక్షణాది కథన మను రెండు వందల అరువది తొమ్మిదవ యధ్యాయము.