మత్స్య మహా పురాణము
212 - సావిత్రీయమ సంవాదము - సావిత్రికి యమునివలన చతుర్థవర లాభము
సావిత్రి : ధర్మాధర్మవిధానజ్ఞ సర్వధర్మ ప్రవర్తక ।
త్వమేవ జగతో నాథః ప్రజాసంయమనో యమః॥
కర్మణామనురూ పేణ యస్మా ద్యమయ సే ప్రజాః ।
తస్మా ద్వై ప్రోచ్య సే దేవ యమ ఇత్యేవ నామతః॥
ధర్మేణేమాః ప్రజా స్సర్వా యస్మా ద్రజ్ఞాయ సే విభో ।
తస్మాచ్చ ధర్మరాజేతి నామ సద్భి ర్ని గద్యతే॥
సుకృతం దుష్కృతం చోభే పురోధాయ జనా యదా ।
త్వత్సకాశం మృతా యా ని తస్మా త్వం మృత్యు రుచ్య సే॥
కాలం కలార్ధం కలయ న్సర్వేషాం త్వం హి తిష్ఠసి ।
తస్మా తాలేతి తే నామ ప్రోచ్యతే తత్వదర్శిభిః॥
సర్వేషా మేవ భూతానాం యస్మా ద నకరో మహాక్ ।
తస్మా త్వ మ నకః ప్రోక్తః సర్వై రేవై ర్మహాద్యుతే॥
వివస్వత స్వం తనయః ప్రథమః పరికీర్తితః ।
తస్మా ద్వైవస్వతో నామ్నా సర్వలోకేషు కథ్యసే ॥
ఆయు ష్యే కర్మణి క్షీణే గృహ్ణసి ప్రాణిజీవనమ్ ।
తదా త్వం కథ్య సే లో కే సర్వప్రాణహరోసి వై॥
సావిత్రి యమునితో ఇట్లనెను: ధర్మాధర్మ విధానమును ధర్మముఇటువంటిది ఆధర్మము ఇట్టిది అని ఎరిగిన వాడా! సర్వ ధర్మములను ప్రవర్తిల్లజేయువాడా! జగములకు నాథుడపు (రక్షకుడవు) ప్రజా సంయమనుడవు (ఈమాటకు అర్థము వెంటనే వివరించబడును.) అగుటచే యముడవు నీవే; వారివారి కర్మములకు తగినట్లుగా ప్రజలను యమింతువు (అదుపులో ఉంతువు) కావున దేవా! యముడు అను నామముతో వ్యవహరించబడుచున్నావు; విభూ! ఈ ప్రజలనందరను ధర్మముచే రంజిల్ల (ఆనందింప జేయుదువు కావున 'ధర్మరాజు' అని నిన్ను సజ్జనులందురు; మృతు లయిన జనులు తమ సుకృతమునో దుష్కృతమునో తమముందుంచుకొని నీ సమీపమును చేరుదురు కావున నీకు మృత్యువు అను పేరు వచ్చినది; (మృతాః-యాంతి-ఏనం- ఇతి మృత్యుః అని వ్యుత్పత్తి; వీనిలో-మృత-య =మృత-యు = మృత్యు) కల (540 రెప్ప పాటులు) దాని అంశములు మొదలగు కోలావయవ పరిమాణములతో ప్రాణి జీవితములను గణనచేయుచు కాలవ్యవస్థ నేర్పరతువు కావున నీకు కొలుడు అని పేరు. సర్వభూతములకు ఆంతమును కలిగించు మహా త త్వమవు కావున నీకు అంతకుడు అని వ్యవహారము; వివస్వంతుని (సూర్యుని) మొదటి కుమారుడవు గావున నీవు వైవ స్వతుడవు; ఆయువును ఈ జన్మపు ప్రారబ్ద కర్మమును ముగియగనే ప్రాణులను నీ దగ్గరకు తీసికొనెదవు కావున నీవు సర్వప్రాణహరుడవు.
తవప్రసాదా ద్దేవేశః త్రయీధర్మో న నశ్యతి ।
తవ ప్రసాదాద్దేవేశ ధర్మే తిష్ఠంతి జంతవః॥
తవ ప్రసాదా ద్దేవేశ సజ్కరో నప్రజాయతే ।
సతాం సదా గతి ర్దేవ త్వమేవ పరికీర్తితః॥
జగత్స్య జగన్నాథ మర్యాదాపరిపాలక ।
త్రాహి మాం త్రిదశ శ్రేష్ఠ దుఃభితాం శరణాగతామ్॥
పితరౌ చ తథా నాథ రాజపుత్తస్య దుఃఖితో ।
యమః : స్తవేన భక్త్యా ధర్మక్షే మయా తుషేన సత్యవాక్॥
తవ భర్తా విముక్తాసౌ లబ్దకామా ప్రజాబలే ।
రాజ్యం కృత్వా త్వయా సార్ధం పత్సరాశీతి పణ్చకమ్॥
నాకపృష్టం తథా ఒఓరుహ్య త్వయా సహ స రంస్యతే ।
త్వయి పుత్ర శతం చాపి సత్యవా న్షనయిష్యతి॥
తే చాపి సర్వే రాజానో వీర్యవన్తోఒమరోపమా।
ముఖ్యాస్తు నామ్నా పుత్తాస్తే భవిష్య ని హి శాశ్వతాః॥
పితుశ్చ తే పుత్తశతం భవితా తవ మాతరి ।
మాళ వ్యాం మాళ వా నామ శాశ్వతాః పుత్తపౌ తౌణః॥
భాతర స్తే భవిష్య ని క్షత్రియా దశోపమాః ।
స్తోత్రేణానేన ధర్మజ్ఞే కల్య ఉత్థాయ యస్తు మామ్॥
కీర్తయిష్యతి తస్యాపి దీర్ఘ మాయు ర్భవిష్యతి ।
మత్స్యః : ఏతావదుక్త్వా భగవాంత్స ధర్మో విముచ్య తం రాజసుతం మహాత్మా॥
అదర్శనం తత్ర యమో జగామ కాలేన సార్ధం సహ మృత్యునా చ॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే సావిత్య్రుపాఖ్యానే సావిత్రీయమసంవాదే సావిత్య్రై యమ దత్తసత్యవజ్జీవిత రూప చతుర్థవర లాభో నామ ద్వాదశోత్తర ద్విశతతమోధ్యాయః॥
దేవేశా! నీ యనుగ్రహముననే వేదత్రయ ధర్మము నశించకున్న దీ; ప్రాణులు ధర్మమందు నిలిచి యుందురు; ధర్మములు పరస్పరము సంకీర్ణము కాకయున్న వి; సజ్జనులకు ఎల్లప్పుడును గతినీవే; ఈ జగత్తున మర్యాదను (న్యాయ ధర్మముల హద్దును) రక్షించు జగన్నాధుడవు నీవే; దుఃఖితను శరణాగతను ఆగు నన్ను రక్షించుము; దేవ శేష్టా! ఈ రాజపుత్తుని తల్లిదండ్రులును నా వలెనే దుఃఖితులయియున్నారు; అనగా యముడిట్లనెను: ధర్మజ్ఞవగు అబలా! నీ భ క్తితోను స్తవముతోను సంతుష్టుడనగు నేను నీ భర్తయగు సత్యవంతుని వదలితిని; నీ కోరిక నెరవేరినది కదా! నీవు వెడలి పొమ్ము; అతడు నీతోకూడి నాలుగు వందల ఏండ్లు రాజ్యమేలును; అనంతరము స్వర్గమును ఆరోహించి నీతో కూడి సుఖించును; ఇతడు నీయందు నూరుమంది పుత్రులను. కనును; వారు వీర్యవంతులగు రోజులుగా దేవసమానులుగా నగుదురు; వారు రాజులలో ముఖ్యులును నీ పేరుతో (సావిత్రులు అని) ప్రసిద్దులును శాశ్వతులును నగుదురు; నీ తండ్రికి నీ తల్లియ గుమాళ వియందు మాళవులను ప్రసిద్ధ నామముగల వారు (కీర్తిచే)శాశ్వతులు పుత్ర పౌత్తవంతులునగు నూరుగురు కుమారులు కలుగుదురు; ఆ నీతమ్ములందరును దేవసములగు క్షత్రియులగుదురు; ధర్మజ్ఞా ప్రభాతమున మేలుకోంచి ఈ స్తోత్రముతో నన్ను ఎవరు స్తుతింతురో వారు కూడ దీర్ఘాయుష్మంతులగుదురు.
అని ఇట్లు చెప్పి మహాత్ముడగు యమ భగవానుడు రాజ సుతుడగు సత్యవంతుని వదలి కాలునితోను మృత్యువు తోను అదృశ్యుడయ్యెను.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున సావిత్ర్యు పాఖ్యానమున సావిత్రీయమ సంవాదము- యముడు సావిత్రికి సత్యవంతుని జీవితమును వరముగా నిచ్చుట యను రెండు వందల పండ్రెండవ యధ్యాయము.
Summary of chapter 212 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya continues the exaltation of Purushakāra, urging humanity to engage relentlessly in righteous action rather than passively succumbing to perceived fate. Bhagavān Matsya explains that brave, energetic, and industrious individuals overcome adverse past destiny through intense present effort, wisdom, and spiritual discipline. The text highlights historical examples of kings and sages who altered their cosmic destinies through unshakeable resolve, establishing that human effort aligned with Dharma is the supreme force that shapes individual and collective destiny.