165 - ప్రళయానువర్ణనము॥  

మత్స్యః : భూత్వా నారాయణో యోగీ సత్యమూర్తిర్వీభావసుః

 గభ స్తిభిః ప్రదీప్తాభి స్సంశోషయతి సాగరా

తతః పీత్వార్ణవాన్త్సర్వాన్న దీః కూపాంశ్చ సర్వశః

 పర్వతానాంచ సలిలం సర్వమాదాయ రశ్మిభిః

 పీత్వా స రశ్మిభి శ్చైవ మహీంగత్వా రసాతలే

రసాతలీయమాదాయ పిబతే రసము త్తమమ్

మూత్రాసృక్ల్కేదమన్యచ్చ యద స్తి ప్రాణిమ ధ్రువమ్

 తత్సర్వమర విన్దాక్ష ఆద త్రీ పురుషోత్తమః

 వాయుశ్చ బలవాన్భూత్వా విధున్వానోఽఖిలం జగత్

 ప్రాణాపానసమాసాద్యాన్వాయూ నాకర్షతే హరిః

 తతో దేవగణానాం చ సర్వేషాం చైవ దేహినామ్

పఞ్చేన్ద్రియగుణాస్సర్వే భూతాన్యేవ తు యాని చ

 గన్దోఘ్రాణం శరీరంచ వృథివీం సం శ్రీతా గుణాః

 జిహ్వా రసశ్చ స్నేహశ్చ సంశ్రితా సలిలే గుణాః

రూపం చక్షుర్విపాకశ్చ జ్యోతిషీహాశ్రితా గుణాః

స్పర్శః ప్రాణశ్చ చేష్టాచ పవనే సంశ్రితాగుణాః

 శబ్దశ్శోత్రం చ ఖాన్యేవ గగనే సంశ్రితా గుణాః

లోకమాయా భగవతా ముహూర్తేన వినాశితా

 మనో బుద్దిశ్చ సర్వేషాం క్షేత్రజ్ఞ శ్చేతి యుతః

 తం వరేణ్యం పరమేష్ఠింహృషీ కేశ ముపా శ్రితాః  

తతో భగవత స్తస్య రశ్మిభిః పరివారితః

 వాయునాక్షమ్యమాణ్యశ్చ ద్రుమశాఖాముపాశ్రితః

 తేషాం సజ్ఘర్షణో ద్భూతః పావకశ్శతధా జ్వలః

అదహచ్చ తదా సర్వం వృతస్సంవర్తకోనలః

మత్యుడు మనువునకిట్లు చెప్పెను: యోగియు సత్యమూర్తియు అగు నారాయణుడు సూర్యుడయి మిగుల ప్రజ్వలించు కిరణములతో సముద్రముల నెండింపజేయును సముద్ర నదీ కూప పర్వతములందలి జలమునంతను తన కిరణములతో గ్రహించి ఇట్లు భూస్థిత జలము త్రాగిన తరువాత పాతాళమునకు పోయి అచటి జలమును కూడ పీల్చును తరువాత ఆరవిందా కుడగు ఆ పురుషోత్తముడు ప్రాణులయందలి మూత్ర రక్తాది ద్రవమును కూడ పీల్చును బలవ ద్వాయులై అఖిల జగమును చలింపచేయుచు ప్రాణుల ప్రాణాపాన సమానాది పాయువులను కూడ లాగివేయును తరువాత దేవగణాది సర్వ ప్రాణుల పంచేంద్రియ గుణములను పంచ భూతములను పృథివికుండు ఘణ గంధ శరీర ఘనీభవనములు (ఈ మూడును వరుసగా 1 ఇంద్రియము -2 దాని విషయముపృథివీ భూత లక్షణము) జలమునకుండు జిహ్వారస స్నేహములు అగ్ని కుండెడు చక్షూరూప విపాకములు పాయువునందలి ప్రాణ స్పర్శవిపాక ములును ఆకా శమునకుండు శ్రోత్ర శబ్ద శూన్యతలును ( వీటికి మూల తత్వమయిన సర్వప్రాణుల మనోబుద్ది క్షేత్రజ్ఞ (చైతన్య) త త్వ ములును వరేణ్యుడు ప్రార్థనీయుడు- శ్రేష్ఠుడు పరమేష్ఠి (సర్వోత్తమ స్థానమందున్న) హృషీ కేశుడు (ఇంద్రియాధిపతి) అగు భగవానుని ఆశ్రయించియుండు లోకమాయయు భగవంతునిచే ముహూర్తములో నశింపజేయబడును తరువాత ఆ భగవానుని కిరణములతో చుట్టుకొనబడినదియు వాయువుచే ఆక్రమింపబడినదయి వృక్షశాఖల నాశ్రయించియుండు నదియు ఆ కొమ్మల రాపిడితో " పుట్టినదియునగు ప్రళయాగ్ని వందలవిధములుగా మండుచు నర్వము ను చుట్టుకొని దహించివేయును

సపర్వతద్రుమాన్గుల్మాన్లతావల్లీ న్తృణాని చ

 విమానానిచ దివ్యాని పురాణి వివిధానిచ

 యాని చాశ్రయణీయాని తాని సర్వాణి సోఽదహత్

 భస్మీకృత్వా తతస్సర్వాన్లోకాన్ లోకగురుర్హరిః

 భూయో నిర్వాపయామాస యుగా న్తే తేన కర్మణా

 సహస్రవృష్టిశ్శతధా భూత్వా కృ ష్ణో మహాఘనః

 దివ్యతోయేన హవిషా ప్లావయామాస మేదినీమ్

 తతః క్షీర నికా శేన స్వాదునా పరమామ్బసా

శివేన పుణ్యేన మహీ నిర్వాణమగమత్పరమ్

 తేన రోధేన సఇ్చన్నా పయసాం వర్షతో ధరా

 ఏకార్ణవజలీభూతా సర్వసత్త్వవివర్జితా

 మహాసత్త్వాన్యపి విభుం ప్రవిష్టాన్యమితౌజసమ్

 నష్టార్కపవనాకా శే రూక్షే జగతి సంవృతే

 సంశోషమాత్మనః కృత్వా సము దాణిచ దేహినః

 దగ్ద్వ సమ్లావ్య చ తదా స హ్యేకస్తు సనాతనః

 పౌరాణం రూపమాస్థాయ స్వపిత్యమీతవిక్రమః

 ఏకార్ణవజలవ్యాపీ యోగీ యోగముపాసతే

 అనేకానీ సహస్రాణి యుగాన్యే కా ర్ణ వామ్బసి

 న చైనం కశ్చిదవ్యక్తం వ్యక్తం వేదితుమర్హతి

క శ్చైవ పురుషో నామ కింయోగః కశ్చ యోగ వాక్

 అసౌ కియ న్తం కాలంచ ఏకార్ణవవిధిం ప్రభుః

 కరిష్యతీతి భగవానితి కశ్చిన్న బుద్ద్యతే

 న ద్రాష్టా నైవ గమితా న జ్ఞాతా నైవ పార్శ్వగః

 న చ విజ్ఞాయతే కశ్చిత్తమృతే దేవసత్తమమ్

 నభః క్షితింపవనమపః ప్రకాశం ప్రజాపతిం భువనధరం సురేశ్వరమ్

పితామహం శ్రుతినిలయం మహామునిం ప్రశామ్య భూయశ్శయనం హ్యరోచయత్ ఇతి శ్రీమత్స్యమహాపురాణే నారాయణనాభిపద్మోద్భవకథనే దైనందినప్రళయా

నువర్ణనం నామ పళ్చిషష్ట్యుత్తరశతత మోఽధ్యాయః

ఆ అగ్ని పర్వతములు వృక్షములు గుబురులు పొదలు లతలు వల్లులు తృణములు దివ్య విమానములు (భవన విశేషములు) వివిధ పురములు వాటి నాశ్రయించదగినవి అన్నియు కాల్చును లోక గురుడగు శ్రీహరి సర్వలోకములను భస్మీక రించి మరల అదే యుగాంతమున అదే ప్రక్రియతో ఆ అగ్ని ని చల్లార్చును నల్లని మహామేఘ మే నూరుల విధముల వేలకొలది వానలు కురియించి దివ్యజలమను హవిస్సుతో భూమిని తడుపును పాలవలెనుండి రుచికల శుభ పవిత్రోత్తమ జలముతో భూమి మహాతృప్తిని పొందును వర్షమువలన ఏర్పడిన ఆ నీటి వరదతో కప్పబడినదయి భూమి సర్వప్రాణి రహితమయి ఏకార్ణవ జలావృత యగును ఎంతటి మహాసత్వము (ప్రాణు)లును అమిత శక్తి శాలియగు పరమాత్మునందు ప్రవేశించును జగమంతయు అర్క వాయ్వాకోశాదులు లేక రూక్షమయి (ఆర్గత లేక ) మరుగుపడగా అమిత వికముడు సనాతనుడునగు భగవానుడు సముద్రములను ప్రాణులను తనుదాను కూడ మొదట ఎండింపజేసికొని తరువాత దహించి పిమ్మట నీటితో ముంచెత్తి తానొక డేయుండి పురాణ ( మొదటి) శుద్ద రూపము నాశ్రయించి తాను నిద్రించును

ఇట్లా యోగి ఏకార్ణవ జలమునందు వ్యాపించి దానియందనేక సహస్ర యుగముల కాలము యోగమందుండును సర్వలయమే యోగము) ఈ పరమాత్ముని ఎవ్వరును వ్యక్త రూపునిగాగాని ఆవ్యక్త రూపునిగాగాని నిశ్చయింప జాలరు ఈ ఉత్తమ పురుషుడెవ్వరు? ఇతని యోగము ఏది? ఈ యోగి ఎట్టి యోగి? భగవానుడగు ఈ ప్రభువెంత కాలము ఏకార్ణవ స్థితియందుండును? అని ఎవరును ఎరుగరు ఆ దేవసత్తముడొక్కడే కాని అతనిని చూచు వాడు తెలుపు వాడు తెలిసికొనువాడు పార్శ్వచరుడు ఎవరును ఉన్నట్లు శాస్త్ర ప్రమాణముచే తెలియదు ఆకాశము భూమి వాయువు జలము ఆగ్ని - ఈ పంచభూతములను ప్రజాపతిని భువన రక్షకుడగు సురేశ్వరుని వేదముల కాశ్రయుడు మహామునియగు బ్రహ్మను తనయందు లయింపజేసి మరల ఏకార్ణవ జలమందు తన ఇచ్ఛతోనే శయనించియుండును

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రళయాను వర్ణనమను నూట ఆరువది ఐదవ అధ్యాయము