మత్స్య మహా పురాణము
233 - నద్యాది వైకృతశాంతి .
గర్గః : నగరా దపసర్పస్తే సమీప ముపయాంతి చ ।
నవ్యో హదప్రస్రవణా విర సాశ్చ భవ ని చ॥
వివర్ణం కలుషం తప్తం ఫేనావర్తం తు సజ్కులమ్ ।
స్నేహం క్షీరం సగరళం వహంతే వాకులోదకాః॥
షణ్మాసాభ్య నరే తత్ర వరచక్ర భయం విదుః ।
జలాశయా నద నే వా ప్రజ్వలన్త కథంచన॥
విముక్తి ని తథా బ్రహ్మ స్ట్వాలాధూమర జాంసి ।
చ ఆఖాతేవా జలోత్పత్తి స్పుసత్త్వావా జలాశయాః॥
సజీతశబ్దా శూయ స్తే జనమార భయం భవేత్ ।
దివ్య మమ్బోమయం సర్పి ర్మధు తై లావ సేచనమ్॥
జప్తవ్యా వారుణా మన్హా నైశ్చ హోమో జలే భవేత్ ।
మధ్వాజ్యయుక్తం పరమాన్న మత్ర దేయం ద్విజానాం ద్విజభోజనార్థమ్॥
గావశ్చ దేహ స్సితవస్త్రయుక్తా స్తథోదకుమా స్సలిలాఘశాంతై॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధ ర్మే నద్యాది వైకృత శాంతి కథనం నామ
త్రయస్త్రింశ దుత్తర ద్విశతతమోఽధ్యాయః॥
గరుడు అతితో ఇట్లు చెప్పెను: నదులును హదములును ప్రస్రవణములు (సెలయేళ్ళు నీటి ఊటలు బుగ్గలు మొదలగునవి) నగరమునకు దగ్గరగా నున్న వి దూరముపోవుట దూరమున నున్నప్ దగ్గరకు వచ్చుట వీటి నీరు రుచి తప్పుట వివర్ణమగుట కలుషమగుట కాగుట నురుగులు సుడులు ఏర్పడుట కలతపడుట కాలువల నీటియందు నూనె పొలు విషము ప్రవహించుట జరిగినచో ఆరు మాసములకు లోగా ఆదేశ మందు పరచక భయమేర్పడును; జలాశయములు మోగుట మండుట మంటలనో పొగ నో ధూళులనో వేలిక క్కుట త్రవ్వకయే నీరు పైకి వచ్చుట జలాశయములందు జల జంతువులధీక మగుట నీటినుండి సంగీతధ్వనులు వినబడుట జరిగినచో జనమరణ భయము కలుగును;
దీని శాంతికై దివ్యములగు జలములును తేనెయు నూనెలును జలాశయములందు వేయుచు పొరుణ మంత్రము లతో హోమము జరుపవలెను; వారుణమంత్ర జపము జరిపించవలయును.
బ్రాహ్మణులను తేనెతో నూనేతో కూడిన పరమాన్నము భుజింపజేయవలయును. గోవులను తెల్లని వస్త్రము లను ఉదకుంభములను బ్రాహ్మణులకు దానమీయవలయును; దోష శాంతియగును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున నద్యాది వైకృత శాంతియను రెండు వందల ముప్పది మూడవ అధ్యాయము.
Summary of chapter 233 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the ancient science of Śakuna-shāstra, interpreting environmental signals, bird calls, and animal behaviors encountered when embarking on journey or starting projects. Bhagavān Matsya details how the sights and sounds of white cows, filled water vessels, burning lamps, scholars, flowering trees, and specific bird calls on the right side indicate success, while sightings of dry wood, weeping people, or single jackal roars warn of obstacles.