మత్స్య మహా పురాణము
134 - మయుడు దేవతల చేతిలో ఓడి త్రిపుర దుర్గమున ప్రవేశించుట
సూతః : మయో మహారణం కృత్వా మాయావీ దానవేశ్వరః ।
వివేశ తూర్ణం త్రిపుర మభ్రో నీలమివామ్బరమ్॥
స దీర్ఘ ముష్ణం నిఃశ్వస్య దానవాన్వీక్ష్య మధ్యగః ।
దధ్యౌ లోక క్షయే ప్రాప్తీ తథా కాల ఇవాపరః॥
ఇంద్రోపి కమ్పతే యస్య స్థితో యుద్దే సురాగ్రతః ।
సచాపి నిధనం ప్రాప్తో విద్యున్మాలి మహాయశాః॥
దుర్గం తత్ త్రిపురం యస్య న సమం విద్యతే పరమ్ ।
తస్యా ప్యేషో లయః ప్రాప్తో న దుర్గం కారణం క్వచిత్॥
కాలస్య వశగం సర్వం దుర్గం దుర్గాస్తోరంచ యత్ ।
కాలే క్రుద్దే కథం తస్మా తాణాన్తోద్య భవిష్యతి॥
లోకేషు త్రిషు యత్కించి ఛీప్యతే నిర్భయాత్మకమ్ ।
కాలస్య తద్వశః పూర్వ మితి పైతామహో విధిః॥
అస్మినః ప్రభవేద్యోగా దసన్గార్యే మితాత్మని ।
లజ్ఘనే కసమర్థస్యా దృతే దేవా న్మ హేశ్వరాత్॥
నాస్థా మందే న యమే వరుణే న చ విత్త పే ।
స్వామీ యఏష దేవానాం దుర్జయ స్సమరే క్వచిత్॥
ఐశ్వర్యస్య ఫలంయత ప్రభుత్వస్యచ యత్ఫలమ్ ।
తదహం దర్శయిష్యామి యావద్విధి మహం గతః॥
వాపీ మమృతతోయేన పూర్ణాం సక్ష్యామి తామహమ్ ।
ఉపజీవంతీ యాం దైత్యా స్సఞ్జివన మినౌషధమ్॥
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగేను: మాయావియు దానవేశ్వరుడునగు మయుడు మహాయుద్దము చేసిన అనంతరము మేఘము నీలాకాశ మున ప్రవేశించినట్లు త్రిపురమున శీఘ్రముగా ప్రవేశించెను. అతడు దానవులనడుమ కూర్చుండి దీర్ఘముగ వేడి ఊర్పులు వదలుచు రెండవ ప్రళయకాల యముడువలె చింతింపసాగెను. సురల కగ్రగామి యగు ఇంద్రుడును యుద్ధమున ఎవని ఎదుట నిలువజాలక గడగడ లాడుచుండెడివాడో ఆట్టి మహా యశ శ్శాలియగు విద్యున్మాలియు మరణించెనుగదా! దేనికి సాటియగు మరియొక దుర్గము ఏదియు లేదో-ఆట్టిదానికి గూడ ఇదుగో! ఇపుడు నాశము ప్రాప్తించినట్లు కనబడుచున్నది; ఎక్కడను గెలుపు ఓటములకు దుర్గము హేతువుకాదు. దుర్గము. కాని మరియేదీ కాని ప్రతియొక టియు కాలమునకు వశమయి నడుచుచుండును. అందువలన కాలుడు క్రుద్దుడైనను కాలము రానపుడు ఇప్పుడే ప్రాణాంతము ఎట్లు జరుగును? మూడు లోకముల యందును ఇది నిర్బయమయినదనీ, చెప్పదగినదేదేది కలదో.అది ఎల్ల మొట్ట మొదలే కాలమునకు వశ గమయి యుండెను. అని బ్రహ్మ చెప్పిన వచనము. సంధారణము చేయుటకు సాధ్యము కానిదియు అమిత స్వరూపము కలదియు అగు కాలము విషయమున మహేశ్వరుడు దేవుడునగు శివుడు ఒక్కడు తప్ప మరి ఎవ్వడు తన సాధనముల అమరిక తో తన శ క్తి చూపగలడు? ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు - ఈ ఎవ్వరిని నేను లెక్క పెట్టను. దేవతలకు ప్రభువగు ఈ పర మేశ్వరుడు మాత్రమే యుద్ధమున ఎక్కడను దుర్జయుడు. ఐశ్వర్యమునకు ఫలము, ఏదో -ప్రభుత్వమునకు ఫలము ఏదో దానిని నా విధానముననుసరించినంత లో నేను చూ పెదను. దైత్యులకందరకును సంజీవనౌషధమువలే జీవనాధారమగు అమృత జలపూర్ణమగు వాపిని (దిగుడు బావిని) సృష్టింతును.
మయకృతమాయామృతవాపీనిర్మానం
ఇతి సఞ్చిన్య మనసా మయో మాయావినాం వరః ।
అస్రాక్షి న్మాయయా వాసీం రమామివ పితామహః॥
ద్వీయోజనాయతాం దీరాం పూర్ణయోజనవిస్తృతామ్ ।
మాధుర్యర వీచీభి శ్చిత్రరూపాం కథామివ॥
చన్హనిర్యాసకల్పస్య పుష్టస్యామృతగనినః ।
పూర్ణాం పరమతోయస్య గుణపూర్ణా మివాజ్ఞనామ్॥
ఉత్పలైః కుముదైః పద్మే ర్వృతాం కాదమ్బకే స్తథా ।
చన్దభాస్కరసఙ్కాశై గ్రమరాభరణే ర్యుతామ్॥
హంసై ర్మధుర వాచాలై శ్చారుచామీకరప్రభైః ।
కామేషుభి రీవాకీర్ణాం దీప్యతే రమణీమివ॥
సృష్ట్వా మయ స్స తాం పీం గజ్గామివ మ హేశ్వరః ।
అస్యాం ప్రజేపయామాస విద్యున్మాలిన మాదృతః॥
స వాప్యాం మజ్జితో దై త్యో దేవశత్రు ర్మహాబలః ।
ఉత్తస్థా విన్దనే రిద్ధ సంవర్ధిత ఇవానలః॥
మయస్య చాజ్జ్వలిం కృత్వా తార కాక్షోభివాదితః ।
విద్యున్మాలీతి వచనం మయమేవ మభాషత॥
క్వ ననీ సహరుద్రేణ వృతః ప్రమథజమ్బుకై: ।
యుధ్య మానశ్చ నిప్పీడ్య మయా దేహేషు మోహితః॥
ప్రసాదాదేవ రుద్రస్య భవామః ప్రభవిష్ణవః ।
తై ర్వా వినిహత యుద్దే భవిష్యా మా యమాసనమ్॥
విద్యున్మా లివచ స్త్వేవం నిశమ్యాత్య న మూర్జితమ్ ।
సమ్పరిష్వజ్య సార్ధాక్ష ఏవమాహ మహాసురః॥
విద్యునాలి న్న మే రాజ్య మభి పేతం న జీవితమ్ ।
త్వయా వినా మహాబాహో త్వదర్థన మహాసుర॥
మయామృతమయీ వాపీ చైషా మాయాబలేనతు ।
సృష్ట్వా దానవదైత్యానాం హతానాం జీవవర్ధనీ॥
దిష్ట్యా త్వాం దైత్యః పశ్యామి యమలోకా దిహాగతమ్।
నిర్గతం నిర్గన సేహ భాగ్యాదివ మహానిధిమ్॥
దృష్ట్వా దృష్ట్వా తు తాంవాపీం మాయయా తు వినిర్మితామ్ ।
హృష్టాస్తాం వీక్ష్య దైత్యేంద్రా ఇదం వచన మబ్రువః॥
మాయావులలో మొనగాడగు మయుడు తన మనస్సులో ఇట్లాలోచించి బ్రహ్మదేవుడు రంభను సృజించినట్లు తన మాయతో వాపిని సృష్టించెను. దాని పొడవు రెండు యోజనములు; వెడల్పు ఒక యోజనము; ఆది ‘కథ’ యను కావ్య విశేషమువలె మాధుర్య రసముతో నిండిన అలలతో నిండియుండెను; చందనపు బంకవలే నుండి నదియు పుష్టి కలిగించునదియు అమృతమువలే రుచి కలు గుటతోపాటు కమ్మని వాసనలు వెదజల్లు ఉత్తమ జలముతో నిండి సద్గుణపూర్ణ యగు యువలివలె కనబడుచుండెను. నల్లని తెల్లని కలువపూలతోను పద్మములతోను కాదంబములనేడు హంసలతోను చుట్టుకొనబడి చంద్ర సూర్యులతో క్రమ్మ బడినట్లు ఆ వాపీ కనబడుచుండెను. తుమ్మెదలనేడు ఆభరణములతో అలంక రించబడియుండెను. కమ్మని ధ్వనులు చేయుచు మనోహరమగు బంగారు కాంతులు గల హంసలతో కూడి అది మన్మథ బాణములతో వ్యా ప్రయైన రమణీవలే కనవచ్చుచుండెను. మ హేశ్వరుడు గంగనువలే మయుడు ఆ వాహిని సృష్టించి విద్యున్మాలిని ఆదరముతో దానిలో పడ వేయించెను. దేవ శత్రువును మహాబలుడుసగు ఆ విద్యున్మాలిని దాని యందు ముంచగానే క టైలతో చక్కగా వృద్ధి చేయబడి ప్రజ్వలించుచు ప్రకాశించు అగ్ని వలే అతడు ప్రకాశించుచు లేచి నిలువబడెను. మయుని నమస్కరించెను. తార కాముడు విద్యున్మాలికి నమస్కరించెను. అంతట విద్యున్మాలి మయునితో ఇట్లు పలికేను: ప్రమథులు అనేడు జంబుకములు తను కొలుచుచుండగా రుద్రుని వెంటనుండు నంది ఎక్కడ? నేను బాణములతో అతని దేహమును పీడించి మోహపరచితిని. మనము ఇప్పుడయినను రుద్రుని అనుగ్రహమువలననే సమ ర్థులము అయ్యే దము. అప్పుడు శత్రువులను గెలిచెదము. లేక వారే మనలను చంపిరా.యమునకు ఆసనముగా అయ్యెదము. ఇట్లు పలికిన విద్యున్మాలి మాటలు విని మహాసురుడును మిగుల బలశాలియునగు మయుడు ఇట్లు పలికెను: విద్యున్మాలీ: మహాబాహూ! నాకు ఈ రాజ్యముకూడ ఇష్టముకాదు. మహాసురా! నీకొరకే నేను మరణించిన దైత్యులకును దానవులకును జీవన వర్ధనము కలిగించు ఈ అమృతమయియగు వాపిని నా మాయాబలముతో సృష్టించితిని. దైత్యుడా! నేను అదృష్టవంతుడను గనుక తనంతట తాను వెలికివచ్చి నిర్ధనునకు కనబడిన మహానిధివలె నాకు నీవు కనబడు చున్నావు. మయుడు తన మాయతో నిర్మించిన ఆ మాయామయమగు అమృతవాపీని చూచీ చూచి దైత్యపుంగవులు హర్షము చెంది ఇట్లు పలుక నారంభించిరి:
దానవా యుధ్య తేదానీం ప్రమథై స్సహ నిర్భయాః ।
మయేన నిర్మితా వాపీ హతా స్త్సఞ్జీవయిష్యతి॥
తతః క్షుద్దామ్బుధిరివ భేరీ సాతు భయంకరీ ।
వాద్యమానా రవై రుచ్చై గౌరవీతి పునఃపునః॥
శ్రుత్వా భేరీర వం ఘోరం మేఘసన్నా దసన్నిభమ్ ।
నిష్పత స్తి సురాస్తూర్ణం త్రిపురా యుద్ధలాలసాః॥
లోహరాజతసౌవర్ణాః కటకై ర్మణిభూషితైః ।
ఆముక్త మజ్జలై ఝరై ర్మకు టైరపి చోత్కటైః॥
ధూమాయ నే హ్యవిరతం లల స్తఇవ పావకాః ।
ఆయుధాని సమాదాయ కోటిశో దృఢ విక్రమాః॥
నృత్యమానా ఇవ నటా గర్జనఇవ తోయదాః ।
కరోచ్ఛితా ఇవ గజా స్సింహా ఇవన నిర్ణయాః॥
హదాఇవన గమ్బీరా సూర్యా ఇవచ తాపినః ।
యమాఇవచ దైత్యేనా స్వరయన్తో బలంమహత్॥
ప్రమథాహ్యపి సోత్సాహా గరుడోత్పాతపాతినః ।
యుయుత్సవ్ విధావన్తి దానవాక్ దానవారయః,
ననీశ్వరేణ ప్రమథా సారకా క్షేణ దానవాః ।
చక్రు స్సదై త్యా స్సజామం చోద్యమానా బలేన తే॥
తోమరై శ్చన్దసఙ్కాశై శ్శూలై శ్చానలసన్ని భైః ।
బాజైశ్చ దృఢ నిర్ముకై రభిజమ్ను కి పరస్పరమ్॥
శరాణాం సృజ్యమానానా మసీనాం చ నిహత్యతామ్ ।
రూపాణ్యాస న్మహౌలానాం పత స్తీనా మివామ్బరాత్॥
శక్తి భిర్భిన్న హృదయా నిర్దయాహతపాతితాః ।
సౌర యేష్వివ నిర్మగ్నా కి కూజ నే ప్రమథా స్సురాశి॥
హేమకుణ్డలజుష్టాని కిరీటమకుటానిచ ।
శిరాంసి వ్యాపత నింతిస్మ గిరికూటనిభానిచ॥
దానవులారా ఇపుడు నిర్భయులై ప్రమథులతో తలపడి యుద్ధము చేయుడు. యుద్దమున రాక్షసులు మరణించినను వారిని మయుడు నిర్మించిన 'వాపి' బ్రతికించగలదు. అని దైత్యులు పరస్పరము అన నారంభించిరి. అంతట దానవులు మోగించు భయంకర భేరి క్షోభిల్లు సముద్రమువలే మాటిమాటికి బిగ్గరగా మోగనారంభించెను. మేఘ ధ్వనులబోలు భేరీనాదమును విని యుద్ధము చేయు కుతూహలముతో త్రిపుర దానవులు పురమునుండియు. దేవతలు తమతమ సేనాని వేశములనుండియు బయటకు వచ్చిరి. తె పురదానవులు ఇనుముతోను వెండి తోను బంగారుతోను చేసి మణులతో అలంకరించబడిన గుండనీ హారములును ఉతటములగు మకుటములును ధరించియుండిరి. దృఢ విక్రములగు ఆదానవులు కోట్లకొలదిగా అయుధములు ధరించి ఎడతెగక జ్వలించుచు నాలుకలు కోయు అగ్నులవలె పొగలు గ్రక్కుచుండిరి. వారు నృత్యము చేయు నటుల వలేను గర్జించు మేఘములవలెను తొండము పైకెత్తిన ఏనుగుల వలను నిర్ణయములగు సింహములవలేను కనబడు చుండిరి. గంభీరములగు హ్రదములవలేను అధిక ముగ, తపించు సూర్యులవలేను యములవలెను దైత్యేంద్రులు తమ దైత్య మహా సేనను త్వర పెట్టుచుండిరి.
ప్రమథులును ఉత్సాహవంతులయి గరుడుడు ఎగిరిపడునట్లు ఎగిరిపడు పాదములతో తాము దానవులకు శత్రువులు కావున దానవులతో యుద్ధము చేయగోరి దానవుల మీదకు పరుగెత్తుచుండిరి. నందీశ్వరునితో కూడి ప్రమధు లును తార కాక్షునితో కూడి దానవులును దైత్యులును తమతమ బలముల పేరణతో సంగ్రామము చేయనారంభించిరి. చంద్రులవంటి తో మరములతోను అగ్ను లవంటి శూలములతోను దృఢముగా విడువబడిన శరములతోను వారు పరస్పరము కొట్టుకొనసాగిరి. ప్రయోగించబడు శరములును విసరిపడవేయబడు ఖడ్గములును అంతరిక్షమునుండి రాలిపడు ఉల్కల వలె కానవచ్చుచుండెను. శక్తుల దేబ్బలతో హృదయములు చీలగా నిర్ణయముగా తగిలి దెబ్బలతో పడి పోవుచున్న - ప్రమథులును దేవతలును నరక కూపములలో మునిగిపోవుచున్న వారువలే కనబడుచుండిరి. బంగారు కుండలములు అలంకారములుగా గలిగి కిరీటములును మకుటములును ధరించియున్న ప్రమథుల. దేవతల శిరస్సులు పర్వతశృంగముల వలే అంతరిక్షమునుండి క్రింద పడుచుండెను.
శిలీముఖైః పట్ట సైశ్చ ఖడ్గై: పరశుభిస్తథా ।
ఛిన్నాః కరికరాకారా భుజాః పేతు ర్ధరాతలే॥
గర్జని సహసమ్మృష్టాః ప్రమథా భీమతర్జనాః ।
సాధయ ని పరే సిద్ధా యుద్ధ గాడ్గర్వమద్భుతమ్॥
ప్రమథాభాసిబలవద్దానవాభాసిడర్పితః ।
ఇతి చోచ్చారయ న్వాచం చారణా రణభూగతాః॥
పరి ఘోరాహతాః కేచిద్దానవై శజ్కరానుగాః ।
వమన్తో రుధిరం వక్రా స్స్వర్ణధాతు మివాలాః॥
ప్రమథెరపి గీర్వాణె ర్దారితా సురశత్రవః ।
ద్రుమైశ్చ గిరీశృజైశ్చ బహవోపహతా రడే॥
సూదితాకో సూదితాన్ దైత్యా నన్యే దానవుణ్ణవాః ।
ఉత్తిష్య శిక్షపు ర్వాప్యాం మయదానవచోదితాః॥
తే చాపి భాస్వరై రే స్వర్గలోకా దివాగతాః ।
ఉ త్తస్థు స్తూయమానాఖ్యా సద్రూపాభరణామ్బరాః॥
అథ్లె కే దానవాః ప్రాప్య వాపీ ప్రక్షేపణా దసూ
ఆస్ఫోట్య సింహ నాదైశ్చ కృత్వాధావం స్తథాసురాన్॥
దానవాః ప్రమథా నేతా స్ర్పసర్పథ కిమాస్యతే ।
హతానపిపి నోవాపీ పున సజ్జీవయిష్యతి॥
ఏవం శ్రుత్వా శజుకర్ణ స్తథా హ్యశ నిసన్నిభః ।
సమాగత్యతు దేవేశ మిదం వచన మబ్రవీత్॥
సూదితాసూదితా దేవ ప్రమథే రసురాహ్యమీ ।
ఉత్తిష్టనే పునర్భీమా స్సస్యాఇవ జలోషితాః॥
అస్మినిల పురేవాపీ పూర్ణామృతర (పూర్ణామృతరసాంభాసా) సాహ్వయా ।
నిహతా నిహతా యత్ర క్షిప్త జీవ నీ దానవాః॥
ఇతి వ్యజ్ఞాపయద్దేవం శ జుకర్ణో మహేశ్వరమ్ ।
దానవానాం బలే మూర్చా కోపశ్చాసీ త్సుదారుణకి॥
తారకాక్షస్తు భీమాక్షస్తార కాక ఇవామ్బుదః ।
అభ్యధావ త్సుసజుద్దే మహాదేవరథం ప్రతి॥
త్రిపురేషు తదోత్కృష్టభేరీశ జర వోభవత్ ।
దానవా నుద్దతా దృష్ట్వా దేవదేవరథం ప్రతి॥
బాణములతో పట్టిసములతో ఖడ్గములతో గండ్ర గొడ్డండ్రతో నరుక బడిన ప్రమథుల భుజములు ఏనుగు తొండములవలె క్రింద పడుచుండెను. చక్కగా అలంకరించుకొని యుద్ధము చేయుచున్న ప్రమథులు కొందరు భయంకరముగా గర్జించుచుండిరి. ఇది అంతయు చూచుచు అంత రిక్షమున సిద్ధులు కొందరు అద్భుతమగు యుద్ధ సంగీ తమును సాధన చేయుచు ఆనందించుచుండిరి. (ఈ యుద్దమును వర్ణించుచు గేయములు రచించి పాడుచుండిరి.) రణభూమికి తిన్న గా అంతరిక్షమున నిలిచిన చారణుల నేడు దేవ జాతులవారు 'ప్రమథుడా నీవు దానవునికంటె బల వంతుడవుగా కానిపించుచున్నావు. దానవా నీవే ప్రమథునికంటె దర్పితుడవుగా భాసించుచున్నావు.' అని ఇట్లు యుద్ధములో పైచేయిగా నున్న వారిని పొగడుచుండిరి.
ప్రమథులు కొందరు దానవుల పరిఘల దెబ్బలు తిని నోట నెత్తురు క్ర కుచు స్వర్ణ ధాతువుల క్రక్కు కొండల వలె నుండిరి. ప్రమధులును దేవతలును చీల్చివేయగా వృక్షములతో పర్వత శిఖరములతో కొట్టగా దానవులు చచ్చు చుండిరి. అట్టివారిని మయుడు తన వారి చేత వాపియందు పడ వేయించుచుండెను. వారు మరల బ్రదికి ప్రకాశించు దేహములతో స్వర్గము నుండి వచ్చు దేవతలవలె వచ్చుచుండిరి: వారి ఆభరణములును వస్త్రములును దేవతలకువలే నుండుటచే పొగడలందుకొనుచుండిరి. అటు తిరిగి బ్రదికిన కొందరు దానవులు భుజములు చరచి సింహనాదము చేయగా భయపడి ప్రమథులును దేవతలును పారిపోవుచుండిరి. దానవులు కొందరు ప్రమధులను దేవతలను చూచి 'ఇంకను పారిపోక నిలిచెద రేల? మీరు మమ్ము చంపినను 'వాసి' మమ్ము మరల బ్రదికించును.' అనుచుండిరి. అది విని వజ్ర సమానుడగు శంకుకర్ణుడనునాతడు శివునికడకు పోలఎ ఇట్లనెను: దేవా! ఈ దానవులను మన ప్రమథులు చంపివేసినను నీటితో తడిపిన పైరులవలె లేచి భయంకరులై వచ్చుచున్నారు. ఈ త్రిపుర దుర్గమునందు అమృత రసముతో నిండిన ‘అమృతరసా' అను 'వాడి' (దిగుడు బావి) కలదట. చచ్చిన దానవులను దానియందు వేయగా వారందరు మరల బ్రదికి వచ్చు చున్నారు.
అంతలో దానవులు దారుణమగు కోపోద్రేకము చెందిరి. తారకొవుడు భయంకర నేత్రములతో తారకాక్షమను మేఘమువలే మహా క్రోధముతో మహాదేవుని రథము వైపునకు పరుగెత్తుకొని వచ్చేను. దేవదేవుని రథము వైపునకు దానవులుద్దతులయి పోవుట తెలిసి త్రిపుర దుర్గ వాసులు అధిక భయంకరముగా భేరీ శంఖధ్వనులు చేసిరి.
తే తత్ర నిస్సృతా దేవా స్తారకా క్షేణ సంయుగే ।
జ్ఞాత్వా క్షోభ మగాద్రుద్ర స్స్వయమ్భూశ్చ పితామహః॥
తాభ్యాం దేవవరిష్ఠాభ్యా మన్విత స్స రథోత్తమః ।
*అనాధవంత మాసాద్య సీద తే- గుణవానివ॥
ధాతుక్షయా ద్దేహమివ గ్రీష్మే నర్యామివోదకమ్ ।
శైథిల్యం యాతి సరథ స్నేహో విప్రకృతో యథా॥
శరాదేక బలాద్దేవ స్సీద స్తం సరత్తమమ్ ।
ఉజ్జహార మహాప్రాణ స్ట్రైలోక్యం రథరూపిణమ్॥
శరాదపిచ నిమ్లత్య పీతవాసా జనార్దనః ।
వృషరూపం మహత్కృత్వా రథం జగ్రాహ దుర్ధరమ్॥
విషాణా భ్యాంచ త్రైలోక్యం రథమేవ మహారథః ।
ప్రగృహ్యోద్వహతే విష్ణుః కులం కులమహాన్యథా॥
తార కాషోపి దై త్యన్తో గిరీస్ట్రోఇవ పక్షవాక్ ।
*పరిఘేన స తా నశ్వా నహ్మాణం హతవాంశ్చ సః॥
స తార కాక్షాభిహతః ప్రచోదం న్యస్య కూబ రే ।
విజజ్వాల ముహురహ్మా పునశ్శ్వాసం సముద్గరః॥
తత్ర దైత్యై ర్ముహు ర్నా దో దానవై శ్చాపి భైరవః ।
*తతో వృషమయో విష్ణు స్తత్పురం ప్రవివేశహ॥
షరూపివిష్ణుకృతమాయామృతవాపీపానమ్॥
తత్రామృతరసాం వాపీం గత్వా జలజమన్దిరామ్ ।
శతపత్రవన్యాంచ కర్పూరవోదగల్గినీమ్॥
పపౌ సమ్మోహ్య దై త్యేనా? నషరూపధరో హరిః ।
వాపీం పీత్వా సురేన్షాణాం పీతవాసాజనార్దనః॥
నర్ధమానో మహాబాహుః ప్రవివేక శరం తతః ।
తతోసురా భీమగజై శ్శరార్దితాః ప్రహార సంవర్ధితశోణితాపగాః॥
పరాజ్ము ఖా, భీమగణైః కృతా రణే యథా మృగాః కేసరిణా మహావనే ।
స తార కాక్ష స్తటిమాలి రేవచ మయేనసార్గం ప్రమథై రభిద్రుతాః॥
పురం పరావృత్య గతాళ్ళరాతురా యథా శరీరం పవనాదయో గతాః ।
గణేశ్వరా హ్యుత్కటగర్వశాలినో మహేన్దనన్దశ్వరషణ్ముఖా యుధి॥
వినేదురుచ్చై ర్జహసుశ్చ దుర్మదా జయేమ చన్దశ్చ దిగీశ్వరై స్సహ॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే త్రిపురోపాఖ్యానే దేవదానవయోర్యుద్దే దేవగణపరాజితమయాదీనాం త్రిపురప్రవేశ కథనం నామ చతుశ్త్రింశుదుత్తరశతత మోఽధ్యాయః॥
(*అన్యతనమాసాద్య.)
(*అభ్యద్రవ త్తదాదేవం బ్రహ్మాణం ప్రభుమీశ్వరమ్.)
(*రథచరణకరోఒప్యవాద యుద్దే వృషభవపుర్వృషభేన్హపత్రపూతః ।
దీతీతనయబలం విమథ్య సర్వం త్రిపురపురం ప్రవివేశ కేశవః సజల జలజరాజితాం సమస్తాం కుముదవరోత్పలపుల్లపజ్క జాడ్యామ్।
సుర గురు రపి తత్పపౌ జలాన్హా మఖిలమివార్ణవ (మగ్నిరివో) (మౌ)ర్వసమ్భవః॥)
ఆ సమయమున తారకాక్షునితో జరుగనున్న ఆయుద్దమునకై దేవతలును వెలుపలికి వచ్చి రంగమున నిలిచిరి. ఇది తెలిసి రుద్రుడును స్వయంభూబ్రహ్మయు కలత చెందిరి. ఆ దేవశ్రేష్ఠులిద్దరు నారోహించియున్న రథో తమము అనాథుడు వచ్చి తనా శ్రయించగా వానినేట్లు రక్షింతునయని దిగులు చెందు గుణవంతుడగు వీరుడువ లేను ధాతు క్షయ వ్యాధి గ్రస్తమయిన దేహమువలెను గ్రీష్మ నదీజలము వలెను తిరస్కరింపబడిన స్నేహమువలెను (తాను చూపిన స్నేహమును అవతలివారు తిరస్కరించినచోవలె) శిథిలము కాసాగెను. ఆరథము సామాన్యమయినది కాదు. త్రే లోక్యరూపమయినది. ఆట్టి శంకర రథమును (తై లోక్యమును) తాను శరీరమునందు ఉండి యేమ (ముఖ్య) ప్రాణత త్వరూపుడుగా ఆ బాణమునందున్న విష్ణువు పైకి లేవనే త్రేను. ఐనను ఆది నిలువబడుటలేదు. అందుచే పీతాంబరుడగు జనార్దనుడు వెంటనే శరమునుండియు ఎగిరి దుమికి మహావృషభ (ధర్మ రూపమును ధరించి పచ్చి మరెవ్వరికి ధరించుటకు (పడకుండ నిలిపి పట్టుటకు) సాధ్యముకాని ఆ రథమును తన కొమ్ములతో ఎత్తి పట్టి నిలిపెను. అది కేవల రథముకాదు. త్రైలోక్యరూపము అయినది. దేవో త్తముడగు ఆ విష్ణువు దానినట్లు నిలిపి పట్టుట ఒక కులమందలి మహాపురుషుడు తన కులమును ఉన్నతికి తెచ్చుటవలే కనబడుచుండెను.
దై త్యేంద్రుడగు తారకాక్షుడు టెక్కలుగల గిరివలే ఎగిగివచ్చి పరిఘతో అశ్వములను సారథిని చావమో దేను. బ్రహ్మ యు తారకాక్షుని చేతి దెబ్బతిని ప్రతోదము (కళా కోరడా)ను కూబరమున పడ వేసి మాటిమాటికి శ్వాస వదలుచు ఉష్ణమును కక్కుచు కూలబడెను. అది చూచి దైత్య దానవులు మాటిమాటికిని భయంకరమగు నాదము చేయసాగిరి.
అంతట విష్ణువు పృషభరూపమున తిపుర దుర్గమును ప్రవేశించెను. అచ్చట ఆదేవుడు ' అమృతరస'యను ‘వాసి'ని చూ చెను. దానియందు సాధారణ జాతి పద్మములును నూరు దళముల పద్మములు నుండేను. కర్పూరపు పొడి వాసన దానినుండి వచ్చుచుండెను. వృషరూపధారియగు హరి దానవులను సమ్మోహపరచి వారికి తెలియకుండ ఆ వాపీ యందలి నీటిని)ని తాగితే నెను. పీతాంబరుడగు జనార్దనుడు ఆసు రేంద్రుల ఆవాసిని తావి ఆ మహా బాహుడు గర్జన సేయుచు మరల శరమును ప్రవేశించెను. తరువాత అసురులను భయంకరులగు వమథులు బాణపు దెబ్బలతో బాధించిరి. ఆ శరప్రహారములతో రక్తనదులు అధికమయ్యెను. ఇట్లు వారు సింహములు మృగములను తరిమినట్లు దానవులను రణమునుండి పరాజ్ముఖులనుగా చేసి తరిమిరి. తారకాకుడును విద్యున్మాలియు మయుడును పారిపోయిరి. శరీరమునుండి ప్రాణవాయువులు మొదలగు జీవా శిత ధర్మములు వెడలిపోయినట్లు వారెల్లరును రణ రంగమునుండి త్రిపుర దుర్గమునకు వెడలిపోయిరి.
మహేంద్ర నందీశ్వర షణ్ముఖులును చంద్రుడును దిక్పాలురును ప్రమథ గణాధిపతులును అత్యధిక గర్వ శాలు రై యుద్ధమున మనము జయించెదమను విశ్వాసముతో దుర్మదులయి గర్జించిరి; బిగ్గరగా నవ్విరి.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున మయాదులు పరాజితులయి త్రిపుర మున ప్రవేశించుటయను నూట ముప్పది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 134 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the dramatic event when Kāmadeva entered Mahādeva's hermitage and released his flower arrow of passion just as Goddess Pārvatī offered a lotus garland to Mahādeva. Feeling a sudden perturbation, Mahādeva looked around and spotted Kāmadeva hidden behind a tree with his bow bent. Filled with divine fury at this disruption of Dharma, Mahādeva opened His fiery third eye, releasing a blazing flame that instantly reduced Kāmadeva to ashes before the horrified eyes of Rati and Pārvatī.