26 - కచ దేవయానీ సంవాదము

శౌనకః : సమావృత్తం తు దత్తం తం విసృష్టం గురుణా తతః

ప్రస్థితం త్రిదశావాసం దేవయాన్యబ్రవీ దిదమ్

దేవయానీ: ఋ షే రజ్గిరసః పౌత్త్ర: వృత్తే నాభిజనేన చ

భ్రాజసే విద్యయా చైవ తపసా చ దమేన చ

ఋషి ర్యథాజ్గిరా మాన్యః పిత్రు ర్మప మహాయశాః

తథా మాన్యశ్చ పూజ్య శ్చ మమ భూయో బృహస్పతి,

ఏవం జ్ఞాత్వా విజానీహి య ద్భ్రవీమి తపోధన

 వ్రతస్థనియమో పేత యథా వర్తామ్యహం త్వయి

స సమావృత్తవిద్యో మాం భక్రాం న త్యక్తు మర్హసి

గృహాణ పాణిం విధివ న్మమ మన్త్రపురస్కృతమ్

కచః: పూజ్యో మాన్యశ్చ భగవా న్యథా మమ పితా తవ

తథా త్వ మనవద్యాజ్గీ(పూజనియోత్తమోత్తమో) పూజనీయోత్తమా శుచిః,

ఆత్మప్రాణైః ప్రియతమా భార్గవస్య మహాత్మనః

త్వం భద్రే- ధర్మతః పూజ్యా గురుపుత్త్రీ సదా మమ

గురు ర్నిత్యం పూజ్యత మో మాన్య శ్శుక్ర పితా తవ

దేవయాని తథైవ త్వం నైవం మాం వక్తు మర్హ సి

దేవయానీ: గురుపుత్రస్య పుత్రో మే న తు త్వమనీ మే పితుః

తస్మా నాన్యశ్చ పూజ్యశ్చ మహీపీ త్వం ద్విజోత్తమ

అసురై ర్హన్య మానే చ కచ త్వయి పునః పునః

తదా ప్రభృతి యా వృత్తి స్తాం త్వం వేత్సి న వేతి మే

సౌహార్దే చానురాగేచ వేత్త మే భక్తి ముత్తమామ్

న మా మర్హ సి ధర్మజ్ఞ త్యక్తుం (శక్తామనాగనం)శక్తాం మనోరమామ్

శౌనకుడు శతానీకునితో ఇట్లు చేప్పెను! కచుడు ఇట్లు విద్యాధ్యయన సమాప్తి చేసి సమావర్తన వ్రతము జరిపి స్వగృహమునకు పోవుటకు తన గురుని అనుమతి నందెను. గురుడు అతనికి వీడ్కోలు చెప్పెను. అతడును దేవలోకము నకు పోవుటకు బయలుదేరెను. అప్పుడు దేవయాని కచునితో ఇట్లు పలికెను: “నీవు స్వయముగా ఆంగిరః ప్రజాపతికి పౌత్రుడవు. ఉన్నత వంశము మంచి నడవడి విద్య తపస్సు దమము కలిగి మిగుల ప్రకాశించుచున్నారు. మా తండ్రికి మహాయకుడగు అంగిరోమహర్షి పూజ్యు డై నట్లు మీ తండ్రి బృహస్పతి నాకు అట్లును ఆంతకంటే అధికముగా కూడ మాన్యుడును పూజ్యుడును. ఇది తెలిసి తపోధనా! నేను చెప్పుచున్న విషయము అర్థము చేసికొనుము. నీవు విద్యావతము నందుండి ఆ నియమములు పాటించుచున్న నీ విషయము లో నే నెట్లుంటినో నీవు ఎరుగుదుపు. ఇపుడు నీవు విద్యాధ్యయ నము ముగించి సమావర్తనము చేసికొనినావు. నేనో నీ భక్తురాలను. నన్ను నీవు విడుచుట తగదు. గు థావిధిగా మంత్ర పూర్వకముగా నీవు నా పాణిగ్రహణము చేయుము.”

కచుడు: “నీవు లక్షణవంతమయిన దేహము కలదానవగుటతోపాటు ఉ త మురాలవును పవిత్రురాలవును. భగ వానుడగు మీ తండ్రివలె నీవును నాకు పూజ్యురాలవు. మహాత్ముడగు భార్గపు శుక్రునకు నీవు వా 1 ప్రాణములవలె ఇష్టవు. గురువు త్రివగుటచే పూజ్యురాలా! ధర్మము నను - రించి సీపును సదా నాకు పూజ్యువు. నీకు త డ్రియు నాకు గురుడును అగు శుక్రులవారు నాకు సదా పూజ్యుడే కదా! కనుక నీవును నాకు ఆట్టి దానవే. కనుక దేవయానీ! నీవు ఇట్లు పలు కధగదు.”

దేవయాని: “నాకు గురుడు పూజ్యుడు) అగు అంగిరసుని కుమారుడగు బృహస్పతికి కుమారుడవే కాని నా తండ్రికి పుత్రుడవు కావు. కనుక నీవును నాకు మాన్యుడవును పూజ్యుడవును. అదియుగాక మాటిమాటికిని నిన్ను రాక్ష సులు వధించగా నేను నీ విషయమున ఎట్లుంటినో నీవు ఎరుగుదువా.ఎరుగవా? సౌహార్దముగా గాని అనురాగముగాగాని నాకు నీ యందలి భక్తిని నీవు ఎరుగుదువు, నీవు ధర్మమును ఎగినవాడవు. నేను శక్తురాలను-సౌందర్యవతిని.నీ మనస్సును ఆనంద పెట్టుదానను. నన్ను నీవు విడుచుట తగదు.”

కచః: అనియోజ్యే నియాగే మాం నియుంక్ష్యసి శుభప్రతే

ప్రసీద సుభ్రూ ర్మహ్యం త్వం గురో ర్గురుతరే శుభే

యత్రోషితం విశాలాక్షి త్వయా చన్ద్రనిభాననే

తత్రాహ ముషితో భద్రే కుక్షౌ కావ్య స్య భామిని

భగినీ ధర్మతో మే త్వం మైవం వోచ శ్శుభాననే

సుఖేనాధ్యుషితో భద్రే న మన్యు ర్విద్య తే మమ

ఆపృచ్ఛే త్వాం గమిష్యామి శివ మస్తు చ మే పథి

ఆవిరోధేన ధర్మస్య కర్తవ్యోఽస్మి కథా న్తరే

అప్రమత్తోత్తితా నిత్య మారాధయ గురుం మమ

దేవయానీ: యది మాం ధర్మకామార్థం ప్రత్యాఖ్యాస్యసి ధర్మతః

తతః కచ న తే విద్యా సిద్ది మేషా గమిష్యతి

కచః: గురుపుత్రీతి కృత్వా హం ప్రత్యాచక్షే న దోషతః

గురుణా చాభ్యనుజ్ఞాతా కామ మేవం శ్రేయస్వ మామ్

ఆర్పం ధర్మం బ్రువాణో హి దేవయాని యథా త్వయా

శప్తో నార్హోఽస్మి శాపస్య కామతోఽపి న ధర్మతః

తస్మా ద్బవత్యా యః కామో న తథా స భవిష్యతి

ఋషిపుత్రో న తే కశ్చి త్కదా పాణిం గ్రహీష్యతి

ఫలిష్యతి న మే విద్యా త్వద్వచ శ్చేతి తత్తథా

అధ్యాపయిష్యామి చ యం తస్య విద్యా ఫలిష్యతి

శౌనక: ఏవ ముక్త్వా నృవ శ్రేష్ఠ దేవయానీం కచ స్తదా

త్రిద శేశాలయం శీఘ్రం జగామ ద్విజపుజవః

తదాగమ మభి పేక్ష్య దేవా స్సేన్ద్రపురోగమాః

బృహస్పతేశ్చ సదసి కచ మాహుర్ముదాన్వితాః

దేవాః : య త్వ మస్మద్ధితం కర్మ కృతవా న్మహ దద్భుతమ్

న తేజసా ప్రణశితా భాగ భాక్త్వంభవిష్యసి

ఇతి శ్రీమత్స్య మహాపురాణే మత్స్యమనుసంవాదా నర్గత శౌనక శతానీక సంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే దేవయానీ కచసంవాదో నామ షడ్వింశతిత మోఽధ్యాయః

కచుడు: “నీవు శుభములగు కర్మములనే ఆచరించుదానవు. నియోగించకూడని పనిలో నీవు నన్ను నియో గించుచున్నావు. నా పై దయ చూపుము. (అనురాగమును కాదు.) నీవు సుందరివి కాదని నే ననలేదు. కాని నీవు శుభ స్వరూపవు. కావున నీవు నాకు నా గురునికంటెను గురుతరపూజ్యతరవు. నీవు వసించిన శుక్రుని గర్భమునందే నేనును వసించితిని. కోపింపకుము. ధర్మము చే నీవు నాకు సహోదరివి. శుభాననా! నన్నిట్లు పలుక దగదు. నీ దయ చే నే నిచట సుఖముగా ఉంటిని. నిజమే. నీ విట్లడిగితి వని నాకు నీ పై కోపమును లేదు. నాకు సెలవు ఇమ్ము. పోయి వత్తును. నాకు మార్గమున శుభమగునట్లు దీవించుము. ఇక మీదట ఇతర విషయములందును ధర్మావిరుద్ధముగా నడుచు కొనునట్లు ఆశీర్వదించుము. ఏమరుపాటు లేని పూనిక తో నా గురుని నిత్యమును ఆరాధించుచుండును.”

దేవయాని: “నీవు కేవలము ధర్మమునందే దృష్టినుంచి నా అనురాగమును తిరస్కరించుచున్నావు. కనుక నీకు ఈ విద్య సిద్ది నీయదు.”

కచుడు: “నీవు గురుపుత్తివి అను హేతువుచే నేను ..న్ను కాదంటినే కాని నీయందు దోషమున్నదని కాదు. ఒక వేళ మీ తండ్రి అనుమతించినచో నన్ను నీవు భర్తగా ఆశ్రయించినను నేను కాదనను. నేను చెప్పినది ఆరమగు ధర్మము. ఇట్టి నన్ను నీవు ధర్మ దృష్టితో నైను కామదృష్టితోనే యైనను శపించుట న్యాయము కాదు. కనుక నీ కామ పురుషార్థము కూడ అది ధర్మానుకూలముగా నడువకపోవుగాక! (బ్రాహ్మణుడగు) ఋషిపుత్తుడు ఎవ్వడును ఎప్పుడును నిన్ను వివాహమాడకుండుగాక! నీ మాటచే నాకు ఈ విద్య ఫలింపకున్నను నేను దాని నుపదేశించిన దానికి ఫలించును.”,

దేవయానితో ఇట్లు పలికి వెంటనే కచుడు స్వర్గమున కై బయలుదేరిపోయెను. ఇంద్రాది దేవతలును కచుడు స్వర్గమునకు మరలి వచ్చిన సందర్భమున-బృహస్పతి సన్నిధిలో నభ జరిపి దానిలో సంతోషమున కచునితో ఇట్లనిరి: “నీవు , చాల గొప్పదియు అద్భుతమును నగు హితమును మాకు ఆచరించితివి. కావున నీ తేజస్సు ఎన్నటికిని నశింప కుండును. నీకు యజ్ఞములందు భాగము ఉండును.”

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యయాతి చరితమున దేవయానీ కచ సంవాదము అను ఇరువది ఆరవ అధ్యాయము.