272 - అధ్యాయము - భవిష్య ద్రాజాను కీర్తనము

మేధ (ఘ) స్వాతి పదునెనిమిది స్వాతి పదునెనిమిది స్కఛ స్వాతి ఏడు మృగేంద్ర స్వాతికర్ణుడు మూడు కుంతల స్వాతికర్ణుడు ఎనిమిది తరువాత పుష్ప నేనుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత సౌమ్యుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత స్వాతికర్ణుడు ఒకటి పులోమావి ఇరువది ఏడు ఆరిష్టకర్ణుడు ఇరువది ఐదు హాలుడు ఐదు మందులకుడు ఐదు తరువాత పురీంద్ర సేనుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత సౌమ్యుడు ఏండ్లు ఈయలేదు) తరువాత సుందర శాంతికర్ణుడు ఒకటి చకోర స్వాతికర్ణుడు ఆర యేడు శివస్వాతి ఇరువది ఎనిమిది గౌతమీ పుత్రుడు ఇరువది యొకటి వాని కొడుకు సులోముడు ఇరువది ఎనిమిది శివశ్రీ ఏడు శాంతికర్ణుని కుమారుడు శివస్కందుడు సంఖ్య లేదు) ఏండ్లు యజ్ఞశ్రీ శాంతి కర్ణి ఇరువది తొమ్మిది విజయుడు ఆరు వాని కుమారుడు చండశ్రీ శాంతకర్ణుడు. పది కడపటివాడగు సులోముడు ఏడు సంవత్సరములు రాజ్య మేలుదురు; ఇట్లు ఇరువది తొమ్మిది మంది ఆంధ్రులు 460 ఏండ్లు భూమి ననుభవింతురు.

ఆoధ్రాణాం సంస్థితా రాజ్యే తేషాం భృత్యాన్వయే నృపాః

సప్తైవాoధ్రా భవిష్యoతి దశాభిరా నృపా స్తథా

సప్త గర్దభినశ్చాపి శకా శ్చాష్టాద శై వతు

యవనాఽష్టౌ భవిష్యoతి తుషారాశ్చ చతుర్దశ

 త్రయోదశ గురుణ్డాశ్చ హూణా హ్యేకోనవింశతిః

 యవనాఽష్టౌ భవిశ్యoతి సప్తాశీతి మహీ మిమామ్

 సప్త గర్దభిలా భూపా భోక్ష్యoతిమాం వసున్దరామ్

సప్తవర్ష సహస్రాణి తుషారాణాం మహీస్మృతా

*శతానీ త్రీణి చ తథా నవ చాష్టాదశై వతు

 శతాన్యర్ధ(ధ్యర్ధ) చతుష్కాణి +భవితవ్యాశ్చతుర్దశ

 గరుణ్డా వృషలై స్సార్ధం భోక్ష్యంతేoలేచ్ఛసమ్భవాః

 శతాని త్రీణి భోక్ష్యంతే వర్షాణ్యే కాద శై వతు

 ఆoధ్రా శ్శ్రీపార్వతీయాశ్చ తే ద్వే పఞ్చశతం సమాః

స ప్తషష్టితు వర్షాణి దశాభీరా స్తతస్తువై

 తేషూత్పన్నేషు కాలేషు తతః కిలకిలా నృపాః

 భవిష్యoతిహ యవనా ధర్మతః కామతోఽర్థత

 తై ర్విమిశ్రా జనపదా ఆర్యా మ్లేచ్ఛాశ్చ సర్వశః

 విపర్యయేణ వర్తoతే క్షయ మేష్యoతి వైప్రజాః

లుబ్ధానృతధ్రుహశ్చైవ భవితారో నృపా స్తతః

 కల్కినాతు హతా స్సర్వే ఆర్యా మ్లేచ్ఛాశ్చ సర్వతః

 అధార్మికాస్తు యేఽత్యర్థం పాషణ్డాస్తు తథైవచ

ప్రనష్టే నృపవం శేతు సoధౌ నష్టే కలౌ యుగే

కిఞ్చి చ్ఛిష్టాః ప్రజా స్తా వై నష్టధర్మపరిగ్రహాః

 అసాధనా హ్యసత్త్వాశ్చ వ్యాధిశోకేన పీడితాః

 అనావృష్టిహతాశ్చైవ పరస్పరవధేప్సవః

 ఆశరణ్యాః పరిత్రస్తా స్సజ్కటం మోర మాశ్రితాః

 సరిత్పర్వతవాసినోభవిష్యoత్యఖిలాః ప్రజాః

ఏవం నృ పేషు నష్టేమ ప్రజా స్త్యక్త్వా గృహాణీచ

 నష్ట స్నేహా నిరాసక్తా స్త్య క్తభ్రాతృసుహృద్గణాః

 వర్ణాశ్రమపరిభ్రష్టా హ్యధర్మనిరతాశ్చతా

 పత్రమూలఫలాహారా శ్చిరపత్రాజినామ్బరాః

 వృత్త్యర్థమభిలిప్సoత్య శ్చరిష్యoతి వసున్దరామ్

తరువాత ఈ ఆంధ్రుల భృత్యుల వంశములవారు (ఆంధ్ర భృత్యు లనబడు ఆంధ్రులు) ఏడు మంది ఆధీరులు వదిమంది గర్గభులు ఏడుగురు శకులు పదునెనిమిది మంది యవను లేనిమిది మంది తుషారులు పదునలుగురు గురుండులు వదుముగ్గురు హూణులు పందొమ్మిది గురు యవను లెనిమిది మంది ఈ భూమీ నేలుదురు; యవనుల పాలనకాలము ఎను బది ఏడేండ్లు; తరువాత ఏడుగురు గర్గభిల రాజులు పాలింతురు; తుషారులు ఏడువేల మూడువందల ఎనుబది ఏండ్లు పాలింతురు; పదుముగ్గురు గురుండులును వారికి సమకాలముననే కొందరు వృషలులును పదునెనిమిది వందల ఏబది. నాలుగేండ్లును ఈ భూమిని పాలింతురు; ఇచట మూలమున చాల ప్రతులయందు “శతాన్యర చతుష్కాణి' ఆని యున్నది; కాని ‘శతాధ్యర్ధ చతుష్కాణి' = 'ఆధ్యర్ధశత+చతుర్ = ఆర్ధశతము చతుర్ (అధికము) = 54 ఎక్కువగా కల వదు నేని మిది వందలుఅగును) ఈ గగు)రుండులు మ్లేచ్చజాతీ యులు; (మేచ్చులు అనగా భాషను అవిస్పష్టముగా ఉచ్చరించుచు మాటలాడు వారును ఆపళ బ్దములను కూడ వ్యవహరించువారును అని యర్థము; భారతీయులు వ్యవహరించు శుద్దగీర్వాణ

*శతాని త్రీణ్యశీలించశతాన్యష్టాద శైవతు  + భవితవ్యాస్త్రయోదశ.

వాణి మాటలాడని ఆభారతీయ జాతుల వారందరును ఇట్టివారుగా మన వాజ్మయమున పేర్కొనబడిరని తోచును;) తరు వాత మరల ఆంధ్రులు మూడువందల పదునొకండు శ్రీపర్వత ప్రాంత జాతీయులు ఏబది రెండు సంవత్సరములు పాలిం తురు; తరువాత పది మంది ఆధీరులు అరువది ఏడు ఏండ్లు పోలింతురు; కాలక్రమమున వారును నశించగా మిగిలినవారు ధరార్థ కామ ప్రవృత్తులయందు యవనులే అనదగియుందురు; జనపదములు(గ్రామములు) వీరితో మిశ్రితము లగును; అంతటను ఆర్యులును మ్లేచ్చులును కలగాపులగమయి యుందురు; వీరు తమ తమ ధర్మములు తప్పి వర్తింతురు? ప్రజలు క్షయ మందు దురు; ఆక్రమమున రాజులును లుబ్దులును ఆనృతరతులు నగుదురు; క్రమముగా అంతటను ఆర్యులును మ్లేచ్ఛులును అత్యంతము ఆధార్మికులగువారును పొషండులును కల్కి హతు లగుదురు; కలియుగ ప్రధాన పరిమాణము ముగియగా సంధికాలము రాగా నృపవంశ మును నశించగా పోయినవారు పోగా మిగిలిన కొలది మంది ప్రజలును ధర్మమును ఆచ రించనివారగుచు బాగుపడుటకు ఏ సాధనములును మనోదేహములందు సత్వమును (సత్తువనిబ్బరము) లేక వ్యాధిక పీడితులగుచు అనావృష్టిచే బాధలందుచు పరస్పర వధకాంక్షులగుచు రక్షించు వారులేక భయమందుచు ఘోరంకట మందుచు నదుల తీరములందో పర్వత ప్రాంతములందో నివసింపపోవుదురు; ఇట్లు రాజులు నశించగా ప్రజలు గృహములు విడిచి పరస్పర ప్రీతి స్నేహములు లేక నిరాసక్తులును భ్రాతృమిత్ర గణములను విడిచిన వారు నగుచు వర్ణాశ్రమ ధర్మ పరిభ్రష్టులును అధర్మనిరతులును పత్రమూల ఫలాహారులును నారలో ఆకులో చర్మములో ధరించుచు జీవనమునకై ఆహా రము మా తము దొరకిన చాలు ననుకోనుపొరునయి భూమియందంతటను తిరుగ నారంభింతురు.

ఏవం కష్ట మనుప్రాప్తాః ప్రజాః కలియుగాoతరే

నిశ్శేషాస్తు భవిష్య ని సార్ధం కలియుగేన తు

 క్షిణే కలియుగే తస్మి oదివ్య వర్షసహస్ర కే

 ససoద్యాంశేతు నిశ్శేషః కృతంతు ప్రతిపత్స్యతే

 ఏష వంశక్రమః కృత్స్నః కీర్తితోఽయం మయా క్రమాత్

 అతీతా వర్తమానాశ్చ తథై వానాగతాశ్చ యే

మహాపద్మాభిషేకాత్తు యావజ్జన్మ పరీక్షితః

 ఏకమేవ సహస్రంతు జ్ఞేయం పఞ్చశ తో త్తరమ్

 పౌలోమాస్తు తథాoధ్రాస్తు మహాపద్మా న్తరే పునః

 ఆన స్తరం శతాన్యష్టౌ Oషడ్వింశత్తు సమా స్తథా

 తావత్కాలాoతరం భావ్య మాoధ్రాంతా దాపరీక్షితః

 భవి ష్వే తే ప్రసజ్ఞ్యాతాః పురాణజ్ఞెశ్శ్రుతర్షిభిః

సప్తర్షయ స్తథా ప్రాంశుః ప్రదీప్తేనాగ్ని నా సమాః

సప్తవింశతిథావ్యానా మాoధ్రాణాంతు తదాపునః

 సప్తవింశతిపర్యంతే యత్ర నక్షత్రమణ్డలే

 సప్తర్షయస్తు తిష్ఠంతి పర్యాయేణ శతం శతమ్

 సప్తర్షిణాం తు పర్యాయే తత్స్మృతం దివ్యసజ్ఞ్యయా

*సమా దివ్యా స్స్మృతా ష్షష్టి ర్దివ్యా బ్దానిచ సప్తతిః

 ఏభిః ప్రవర్తతే కాలో దివ్యై స్సప్తర్షిభిస్తు వై

 సప్తర్షిణాంతు యౌ పూర్వౌ దృశ్యేతే హ్యుదితౌ నిశి

 తయో ర్మధ్యేతు నక్షత్రం దృశ్యతే యత్సమం దివి

 తేన సప్తర్షయో జ్ఞేయా యుక్తా వ్యోమ్ని శతం సమాః

నక్షత్రాణా మృషీణాంతు యోగ స్వైతన్ని దర్శనమ్

 సప్తర్షయో మఘాయుక్తాః కాలే పారిక్షితే శతమ్

 బ్రాహ్మణాస్తు చతుర్వింశా భవిష్యoతి శతం సమాః

తతః ప్రభృత్యయం సర్వ లోకో వ్యాపత్స్యతే భృశమ్

 ఆనృతోపహతా లుబ్ధా ధర్మతః కామతో ఽర్థతః

 శ్రౌతే స్మార్తే ప్రశిథిలే నష్టవర్ణాశ్రమే తథా

 సజ్కరం దుర్బలాత్మానః ప్రతిపత్స్య ని మోహితాః

బ్రాహ్మణా శ్శూద్రయోనిస్థా శ్శూద్రా వై మoత్రయోనయః

O షట్త్రింశ త్తు  *మాసాదివ్వాః స్మృతాఃషట్చదివ్యై ర్వర్షైశ్చ సప్తభిః

ఉపస్థాస్యoతి విప్రాస్తా న్వేదార్థ మభి లిప్సపః

 క్రమేణై వహి దృశ్యoతే స్వవర్ణాన్తర దాయకమ్

 క్షయమేవ గమిష్యoతి క్షీణ శేషా యుగక్షయే

 యస్మిoకృష్ణో దివం యాత స్తస్మిన్నేవ తదాఽహని

ప్రతిపన్నం కలియుగం ప్రమాణం తస్య మే శృణు

 చతుశ్శతసహస్రంతు వర్షాణాం యత్స్మృతం బుధైః

 చత్వార్యష్ట సహస్రాణి సఙ్ఖ్యాతం మాసు షేణ తు

 దివ్యం వర్ష సహస్రంతు తథా సoధ్యా ప్రవర్తతే

ఇట్లు కలియుగ కాలమున ప్రజలు కష్టమును ఆధమ స్థితిని పొంది కలియుగముతోపాటు నిః శేషులగుదురు; దీవ్యవర సహస్ర పరిమాణక మగు కలియుగము తన సంధి సంధ్యాంశలతో కూడ ముగియగా కృతయుగము వచ్చును; ఇట్లు నేను మీకు వంశ క్రమమంతయు యథాక్రమముగ కీర్తించి అతీత వర్తమానాగత రాజ వంశమును తెలిపితిని; పరీ క్షిత్తుడు జన్మించినది మొదలు మహాపద్ముని యభి షేక మువరకును మొ త్తము కాలావధి ఒక వేయి ఐదువందల ఏండ్లు; మహా పద్మాభి షేకము మొదలుగ ఆంధ్రులలో కడపటి రాజుల వరకును ఎనిమిది వందల ఇరువది యా రేండ్లు; పరీక్ష్మి జన్మము. మొదలుగా ఆంధ్రుల వరకు అగుకాలము వీని మొత్తము; ఈ విషయమంతయు పురాణజ్ఞులగు వైదిక ఋషులు భవిష్య పురాణమందు లెక్కించి చెప్పియున్నా రు.

న పరులు చాల పొడవయి (ఉన్నతమయి) ప్రజ్వలించుచుండు అగ్ని తో నములై ఆకసమున కనబడుచుందురు. గదా! వీరు క్రమముగా ఆయా నక్షత్రములందు సంచరించుచు సమగ్రముగా నక్షత్ర మండల సంచారావృత్తిని ముగించి మరల మఖా నక్షత్రములోనికి వచ్చునాటికి ముందు రాబోవు ఆంధ్రుల పాలనకాలము పూర్తియగును; ఏలయన స పరులు తమ పర్యాయావృత్తిలో ఒక్కొక్క నక్షత్రమందు నూ రేసి ఏండ్లు ఉందురు; ఇట్లు ఇరువది ఏడు నక్షత్రము లందును సంచరించుటకు పట్టు కాలమును దివ్యమానముతో లెక్కించగా ఏడు #సంవత్సరముల ఆరు మాసము లగును.

• చత్వార్యష్ట

* ఇచట ఇపుడు లభించు ప్రతులయందు “నమాదివ్యాః స్మృతాః షష్టి ఫ్లిప్యాబ్దానిచన ప్రతిః (భిః)” అనియున్నది;

ఇచట స పతిః అనినచో 60470-180 దివ్య సంవత్సరములు; ఇది మనుష్యమానముతో 180x360 -_43800; లేదా 'సప్తభిః' అని గ్రహించినచో 60+7 = 67 దివ్య సంవత్సరములు; 67x860 -24120 మానవ సంవత్స రములు అగును; ఈ రెండును స పరుల న పవింశతి నక్షత్ర సంచార కాలమగు 2700 మానవ సంవత్సరములకు సరిపోవు; కావున పాఠ కారణముననో పూర్వమే పొరపాటుగా మారియుండును; ఆది “మాసా దివ్యాః న్మృతాః

 షట్చ దివ్యాన్యజ్ఞాని న వచ." ఆయియుండును. అపుడు 71/2X 360 = 15/2 x 360 = 2700 మానవ సంవత్సరములు సరిపోవును. అని యూహించి వ్రాయుటయైనది; విజ్ఞులు దీనినాలోచించి తమనినిర్ణయములు తాము చేయుదురుగాక!-అనువాదకుడు.. మత్స్య-272. ఆధ్యా-శ్లో. 48 సప్తమహర్షులు ఇరువది ఏడు నక్షత్రములందు సంచరించుటక గు 2700 వత్సరము లను దివ్య వత్సరములలో చెప్పుచు. ఇచ్చట

 1. సప్తర్షీణాం తు పర్యాయో (యః) స్మృతం (తో) వై దివ్యసంఖ్యయా!

సమా దివ్యాః స్మృతాః షష్టి ర్దివ్యాజ్ఞాని తు సప్తభిః-(కన్నడ)

 2. సప్తర్షిణా ముపర్యేతత్ స్మృతం వై దివ్యసంఖ్యయా!

సమా దివ్యాః స్మృతాః షష్టి ర్దివ్యాజ్ఞాని తు సప్తభిః- (నందలాల్ మోర్)

 3. సప్తవర్షిణాం తు పర్యాయే తత్సృతం దివ్య సంఖ్యయా!

సమా దివ్యాః స్మృతాః షష్టి ర్దివ్యాబ్దాని తు స పతిః. (పువ్వాడ వేంకటరావుగారి తెలుగుప్రతి.)

ఈ విధముగనే దివ్యులగు న పరుల చేత కాలగణన ప్రవర్తింపజేయబడుచున్నది; ఆది ఎట్లనగా రాత్రులందు ఉదయించి కనబడు న పరులలో పైగా కనబడు ఇరువురి నడుమకు సరిగా ఆకాశమందు ఏ నక్షత్రము కనబడునో ఆ నక్షత్రమందు సప్తర్షులున్నా రని నిర్ణయము; అట్లు వారొక్కొక్క నక్షత్రమునందు నూరేసి యేండ్లుందురు; ఇది యే సప్తర్షులు ఆయా నక్షత్రములతో కూడియుండుట; నక్షత్రములు ఋషులును కూడియుందురనుటకిది నిదర్శనము; పరీక్షిజన్మ కాలము నందు నూరేండ్లపాటు సప్తర్షులు మఖా నక్షత్రమందుండిరి; ఈ బ్రాహ్మణరులు ఇరువది నక్షత్రముల సంచారము ముగించు నాటికి ఆంధ్రరాజుల పాలనమారంభమయి వారు మరల మఖా నక్షత్రములోనికి వచ్చు నాటికి వీరి పాలన కాలము ముగియును.

ఆది మొదలుకొని ఈ లోక ము మిగుల వ్యాపత్తు ( క్లేశముల)లకు లోనగును; జనులు అనృతోప హతులును లుబ్దులును ధర్మ కామార్థములనుండి భ్రష్టులును శ్రోతస్మార్త ధర్మములు నశించినందునను వర్ణాశ్రమ ధర్మ ప్రవృత్తులు పాడై నందునను మోహితులలునయి వర్ల సాంకర్యములను పొందుదురు; బ్రాహ్మణులు శూద్రయోని గతులగుదురు; శూద్రులు మంత్ర యోనులగుదురు. శూద్రులు బ్రాహ్మణ ధర్మమాచరించుచు మంత్రజ్ఞానమునకు మూల హేతువులగుదురు; విప్రులు వారిని ఆశ్రయించి సేవించి వేదములను వేదార్థములను గ్రహింపగోరుదురు; కాలక్రమమున వీరు (విప్రులు) తమ వర్ణమునకును వర్ణాంతరములకును గల భేద మేమో కూడ లేకుండ ధర్మము నశింపజేయువారగుదురు.

 కృష్ణ భగవానుడేదినము నదివమేగేనో ఆనాడే కలియుగమారంభమయినది; దాని ప్రమాణమును తెలిపేదను వినుము; ఇదీ మానుష మానానుసారము నాలుగు లక్షల ముప్పది రెండు వేల సంవత్సరములు అగును; దివ్యమానాను సారము వేయి దివ్య సంవత్సరములు కలియుగమున ముగియగానే కలి సంధ్యాకాలమారంభమగును; ఇది నూరు దివ్య సంవత్సరములును దాని తరువాత కలి సంధ్యాంశము నూరు దివ్య సంవత్సరములును కాగా కలి ముగియును.

నిశ్శే షేతు తదా తస్మిoకృతం వై ప్రతిపత్స్యతే

ఐళ శ్చే క్ష్వాకువంశ్య శ్చ సహదేవః ప్రకీర్తితాః

ఇక్ష్వాకో స్సంస్తుతం క్షత్త్రం సుమిత్రా న్తం భవిష్యతి

ఐళం క్షత్త్రం సమాక్రాన్తం సౌమం వంశ విదో విదుః

ఏతే వివస్వతః పుత్త్రాః కీర్తితాః కీర్తివర్ధనాః

ఆతీతా వర్తమానాశ్చ తథై వానాగతాశ్చ యే

బ్రాహ్మణాః క్షత్త్రియా వైశ్యా స్తథా శూద్రాశ్చ తే స్మృతాః

వైవస్వతేఽ oతరే తస్మిన్నతి వంశ స్సమాప్యతే

దేవాపిః పౌరవో రాజా ఐక్ష్వాకో యశ్చ తే మతః

మహాయోగబలో పేతౌ కలాపగ్రామ మాశ్రితౌ

ఏతౌ క్షత్త్రప్రణీతారౌ నవవిం శే చతుర్యుగే

సువర్చా మనుపుత్త్రస్తు ఐక్ష్వాకాద్యో భవిష్యతి

నవవింశే యుగే సోవై వంశ స్యాది ర్భవిష్యతి

దేవాపీపుత్త్రస్సత్యస్తు ఐళానాం భవితా నృపః

క్షత్త్రప్రవ రకా వేతౌ భవి ష్యేచ చతుర్యుగే

ఏవం సర్వేషు విజ్ఞేయం సoతానార్థంతు లక్షణమ్

క్షీణే కలియుగేచైవ తిష్ఠంతీతి కృతే యుగే

సప్తర్షయస్తు తై స్సార్ధం మధ్యే త్రేతాయుగే పునః

కాని వాస్తవముగ ఇది.

మాసా దివ్యాః స్మృతాః షట్చ దివ్యై ర్వర్టైశ్చ సప్రభిః

 7 గం.6 మా (దివ్య =7 1/2 X 360 = 15/2 x 360 = 15x180=2700. మానుష సంవత్సరములు. అని ఉండదగును. అనువాదకుడు

బీజార్థం వై భవిష్యoతి బ్రహ్మ క్షత్త్రేతు వై నృప

ఏవ మేవంతు సర్వేషు తిష్యాoతే ష్వoతరేషుచ

 సప్తర్షయో నృపై స్సార్థం సoతానార్థం యుగే యుగే

 ఏవం క్షత్త్రస్య చోత్సేధస్సమ్బoధో వై ద్విజై స్స్మృతః

మన్వoతరాణాం సoతానే సoతానాశ్చ శ్రుతౌ స్మృతాః

అతిక్రాoతయుగా శ్చైవ బ్రహ్మక్ష త్త్రస్య సమ్బవాః

తథా ప్రశాoతి స్తేషాంపై ప్రకృతీనాం యథాక్షయః

సప్తర్షయో విదు స్తేషాం దీర్ఘాయు స్త్వం క్షయోదయౌ

కలియుగము నిఃశేషముగా ముగియగానే మరల కృతయుగమారంభమయి ప్రవర్తిల్లును; సహదేవుడను వాడు ఐలుడగుటచే (ఇలగా మారిన ఇలుడను ఇక్ష్వాకు వంశ జుని వలన జనించిన రాజుల వంశ మందలి వాడు అగుటచే) అతడే చంద్రసూర్య వంశములకు రెంటికిని చెందిన క్షత్రియుడని చెప్పబడినది; ఏలయన వంశక్రమ విషయ తత్వవేత్తలు ఐళ (సూర్య) వంశ క్షత్రియ పరంపర సోమ వంశ పరంపర యందు సంక్రాంతమయ్యేనని కదా చెప్పిరి; ఏలయన సం స్తుత మగు ఇక్ష్వాకు వంశము సుమిత్రుడను వానితో ముగియును.

ఈ విధముగ కీర్తివర్ధనులగు వివస్వంతుని (రవి) పుత్రులును తద్వంశీయులును ఆగు అతీతానాగత వర్తమాన క్షత్రియులును వారినుండి ప్రవర్తిల్లినవారో పొలితులో యగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర జాతులును ఈ జాతుల యందు జనించి పాలకులయిన వారును చెప్పబడినారు; ఈ విధముగా వైవస్వత మన్వంతరమందు ప్రవర్తిల్లు (రాజ) వంశ పరంపర ముగియు చున్నది; తరువాత రాజత్వముతో పరిపాలించువారుండరని యర్థము;) లోగడనే చెప్పియున్న పూరు వంశ సంజాతుడగు దేవాపియను క్షత్రియుడును ఇక్ష్వాకు వంశజుడు (మనువంశ్యుడు) అగు సువర్చుడను వాడును రాబోవు ఇరువది తొమ్మిదవ మహాయుగమందు క్షత్రియవంశ ప్రవర్తకు లగుదురు; వీరు ఇరువురును అంతవరకును తమ మహాయోగశక్తి శే కలాప గ్రామమును ఆవానముగా చేసికొనియుందురు; వీరితోపాటు నపరులును నుండి మరల క్షత్రియ జాతిని కృత యుగ ధర్మమును త్రేతాయుగ ధర్మమును ప్రవర్తిల్ల జేయుదురు; ఇట్లు వీరు బీజభూతులై జాతిని ధర్మమును ప్రవర్తిల్లజేయుట ప్రతి కలియుగాంతమందును జరుగుచునే యుండును; క్షత్రజాతియు ధర్మమును లోకమున ప్రవర్తిల్లు టకై విప్రులు క్షత్రియులతో సంబంధము నందుటయే ఈ సూర్యచంద్ర వంశ క్షత్రియులగు దేవాది సువర్చసులతో సప్తర్షులు కలియుట; దీని చేతనే ధర్మనంతాన వర్ణ సంతానములు నడుచును. (సంతానమనగా అవిచ్ఛిన్న మయి కొన సాగుట(Continuity) మన్వ నరములు కొనసాగు విధానములును ధర్మ-జాతి సంతానముల ప్రకారములును వేదముల యందు చెప్పబడినవి; స్మృతులయందును స్మరింపబడినవి; వీనిని బట్టి తెలియునది యేమనగా అతిక్రాంతయుగములందును ధర్మ-జాతి వృద్దులు బ్రహ్మ-క్షత్ర జాతులలో శ్రేష్టులగు వారివలన ప్రవర్తిల్లినవే; ఆదియునుగాక సప్తర్షులు సామాన్యులు కారు; గడచిన యుగములును వానియందలి బ్రహ్మక్షత్రజాతుల ఉత్పత్తి ప్రకారములును వారి ప్రకృతులును ప్రశమ ము ( అణగారి పోవుటయు) ను క్షయమును వారికి దీరాయుః పరిమాణము కలిగించు విధమును వారి వృద్ధియు ఇన్ని యును వారెరుగుదురు.

ఏతేన క్రమయోగేన ఐళా ఇక్ష్వాకవో నృపాః

ఉత్పద్యమానా స్త్రేతాయాం క్షీయమాణాః కలౌ యుగే

అనుయాన్తి యుగాఖ్యాంతు యావ న్మన్వంతరక్షయమ్

జామదగ్న్యేన రామేణ క్షత్త్రే నిరవశేషితే

రిక్తేయం వసుధా సర్వా క్షత్త్రియై ర్వసుధాధి వైః

ద్వివంశకరణం సర్వం కీర్తయి ష్యే నిబోధమే

ఐళం చేక్ష్వాకువంశంచ ప్రకృతిం వరిచక్షతే

రాజాన శ్శ్రేణిబద్ధాశ్చ తథాఽన్యే క్షత్త్రియా భువి

ఐళ వంశాస్తు భూయాంసో న తథైక్ష్వాకవో నృపాః

ఉత్పద్యమానా స్తే చాశు (స్త్రేతాయాం) క్షీయమాణాః కలౌపునః

తేషా మేక శతం పూర్ణం కులానా మభిరోచతే

తావదేవతు భోజానాం విస్తారా ద్ద్విగుణం స్మృతమ్

భోజానాం ద్విగుణం క్షత్త్రం చతుర్ధా తద్యథాతథమ్

తే హ్యతీతా స్సనామానో బ్రువత స్తా న్ని బోధమే

శతం వై ప్రతివిన్ద్యానాం శతం నాగా శ్శతం హయాః

శత మేకం ధార్తరాషా హ్యశీతి ర్జనమేజయాః

శతం వై బ్రహ్మదత్తానాం వీరాణాం కురవ శ్శతమ్

తతశ్శతం చ ప్చలా శ్శతం కాశికుశాదయః

తథా పరే సహసే ద్వే యే నీపా శ్శశ బిగ్గవః

ఇష్టవ నశ్చ తే సర్వే సర్వే నియుతదక్షిణాః

ఏవం రాజర్షయోతీతా శ్శతశోథ సహస్రశః

మనో ర్వైవస్వతస్యాస న్వ ర్తమానే నరే విభోః

తేషాంతు నిధనోత్పత్తి లోకసంస్థితయ స్థితాః

న శక్యో విస్తర స్తేషాం సస్తానస్య పరస్పరమ్

తత్పూర్వాపర యోగేన వక్తుం వరశతైరపి

అష్టావింశతమాఖ్యాతా గతా వైవస్వతే నరే

ఏతే దేవగజై స్సార్గం శిష్టా ఏతా న్ని బోధత

చత్వారింశ యశ్చైవ భవిష్యా స్తే మహాత్మనః

అవశిష్టా యుఖ్యా స్తే తతో వైవస్వతో హ్యయమ్

ఏతద్వ: కీర్తితం సర్వం సమాససాద్ వ్యాసయోగతః

పునర్వక్తుం బహు త్వాత్తు న శక్యం విస్తరేణతు

ఉత్తా రాజర్షయే యే తు అతీతా స్తే యుగై స్సహ

ఏతే యయాతివంశ్యానాం యే చ వంశా విశామ్పతే

కీర్తితా ద్యుతిమనస్తే య ఏతా ఛారయే న్నరః

లభతే సవరా నఇ్చ దుర్లభా నిహ లౌకికాక్

ఆయుః కీర్తిం ధనం స్వర్గం పుత్రవాంశ్చ భిజాయతే

ధారణా చ్ఛ్రవణాచ్చైవ వరం స్వర్గోస్య ధీమతః

ఇతి శ్రీమత్స్య మహాపురాణే భవిష్యద్రాజానుకీర్తనం నామ ద్విస ప్తత్యుత్తర ద్విశతత మోధ్యాయః

ఈ చెప్పిన కమయోగము ననుసరించి ఐళులును (చంద్రవంశములో సం క్రాంతులయిన సూర్యవంశీయులును) ఇక్ష్వాకులును (కేవల సూర్యవంశీయులును) గడచిన త్రేతాయుగమునందు జనించిరి; పా రీ కలియుగమున క్షీణింతురు; హెరిట్లు జనించుచు వృద్ధినందుచు క్షీణించుచు మన్వంత రావసానము వరకును కొ సాగుచునే యుందురు; ఆయా యుగ ధర్మానుసారము నడుచుకొనుచుందురు. జామదగ్న్యుడగు రాముడు క్ష తజాతిని నిరవశేష మొనర్చగా ఈ వసుధ యంతయు క్షత్రియజాతిరాజశూన్య యగును: ఐనను తరువాత మరల రెండు రాజవంశములు లోకమున కొనసాగుచునే ఉండును: అది తెలి పెదను వినుము: ఈ రెండు వంశములకును ఐళవంశమును ఇక్ష్వాకు వంశమును మూల భూతములు: వీరి మూలముననే లోకమునందలి రాజవంశ పరంపరలును ఇతర క్షత్రియ జాతీయులును వర్ధిల్లుచు ప్రవర్తిల్లుచుందురు: ఐనను ఈ ఇరుతెగలలోను ఐళవంశీయుల సంఖ్య ఇక్ష్వాకు వంశీయుల సంఖ్యకంటే అధిక తరము; ఏ మయినను ఈ ఇరు తెగలవారును త్రేతాయుగమున ఉత్సన్ను లగుదురు; కలియుగమున క్షీణింతురు; (అనగా పూర్తిగా నశింతురని యర్థము కాదు.) వీరు మొత్తము ఏక శత వంశములవారు: తరువాత క్రమముగా వృద్ధి పొందినపుడు భోజులే అంతకు రెట్టింపు (202 వంశములవారు) అయిరి: మొత్తము ఉత్తమ వంశ క్షత్రియులు భోజులకు ద్విగుణ మయిరి: (అనగా 404 ప్రధాన వంశములవారు.) అనగా మూలభూతులగు ఐలై శ్వాక రాజవంశ సంఖ్యకు ఇది నాలుగు రెట్లు.

గడచిపోయిన రాజ వంశములలో వారివారి సనామత్వము ననుసరించి (వారివారి వంశ నామమును ఇంటి పేర్లను అనుసరించి పేర్కొందును వినుము; ఆయా ప్రధానవంశముల మూల కుటుంబ సంఖ్య ఇట్లుండును; 1. ప్రతి వింధ్యులు -100; 2. నాగులు-100 3. హయులు.100; 4. ధార రాములు.100; 5, జనమేజయులు-80; 6. బ్రహ్మ దత్తులు -100; 7. కురువులు.100; 8. పంచాలురు.100; 9. కాశికుశాదుల వంశమువారు ఒక్కొక్క కోవవారు నూరేసి వంశములు; 10. నీపులు శశ బిందువులు అను తెగలవారు వేయి వంశముల వారు; వారందరును యజ్ఞముల నాచరించిన వారే; లక్షల సంఖ్యలో (గోవులనో సువర్ణమునో) దక్షిణలుగా ఆ యజ్ఞములందు ఇచ్చినవారే; ఇట్టి రాజర్షులు వదల కోలదిగా గడచిపోయిరి; వీరందరును ఈ వైవస్వత మన్వంతరమున ప్రవర్తిల్లిన ప్రవర్తిల్లునున్న ప్రవర్తిల్లనున్న వారే; వారి ఉత్పత్తి క్షయములయందే లోక వ్యవస్థలు అన్ని యు ఆధారపడియున్న వి; వారి సంతానపు పరంపరల ఏ స్తర మును పారస్సరిక సంబంధ బాంధవ్యములతో కలిగిన వృద్ధిని సమగ్రముగా చెప్పుటకు పూర్వాపర యోగ సంబంధ) వృద్ధిని తెలుపుటకును నూర్ల ఏండ్లయినను చాలవు; ఈ వై వస్వత మన్వంతరమున ఇంతవరకును ఇరువది ఎనిమిది మహాయుగ ములు గడచినవి; ఇంకను నలువది మూడు మహాయుగములు గడువవలసియున్న వి; ఈ మహాయుగములతో పాటు ఎందరో దేవగణములవారును సంబద్దులే యు న్నారు; ఈ 'వంశ వృత్తాంతమనబడు పురాణాంగమగు అంశమును భవిష్య కలియుగ 'రాజవంశ' వృత్తాంతమును 'సమాస' 'వ్యాస' ' సంక్షేప’ ‘విస్తరణ' విధానములతో ఇంతవరకును తెలిపితిని; ఇంకను చెప్పుదుననినను ఆది బహు విస్తరమగుటచే నేను చెప్పజాలకున్నాను; ఇంతవరకును మీకు చెప్పబడిన రాజరు లందరును ఆయా యుగములందలి పొరు; వారు ఆయా యుగములతో పాటే గడచిపోయినారు; ఆ యుగములందు వారు మహా పురుషులుగ ప్రసిద్ధులు; రాజా! ఈ చేప్పినవి యన్ని యును యయాతి వంశ మునుదు జనించిన రాజులకు చెందిన ఆనువంశ వృత్తాంతములు; వీనిని హృదయమునందు ధరించు మానవులు తేజోవంతులగుదురు; ఆయువు కీర్తి ధనము స్వర్ణము పుత్రులు అను ఐదు విధములగు లౌకిక వర ములను ఐదింటిని పొందగలుగుదురు. దీనిని వినినవారును హృదయమందు ధరించిన వారునగు ధీమంతులకు ఉత్తమ సుఖ పద మగు స్వర్గ ము లభించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భవిష్య ద్రాజాను కీర్తనమను రెండు వందల డెబ్బది రెండవ అధ్యాయము.