మత్స్య మహా పురాణము
125 - సూర్యరథస్థ దేవతాభేద కథనము - చంద్రాది గ్రహమండల స్వరూప-తద్రథాది స్వరూప ప్రతిపాదనము - అందు వసంతాది ఋతువులందు సూర్యరథస్థ దేవతా గణభేద ప్రతిపాదనము
సూతః : స రథోధిష్టితో దేవై ర్మాసేమా సే యథాక్రమమ్ ।
తతో పహత్యథాదిత్యో బహుభి రృషిభిస్సహ॥
గన్దర్వై రప్సరోభిశ్చ సర్పగ్రామణి రాక్షసైః ।
ఏతే వస నివై సూర్యే మాసౌ ద్వౌద్వౌ క్రమేణతు॥
ధాతారమా పుల స్త్యశ్చ పులహశ్చ ప్రజాపతిః ।
ఉరగా వాసుకి శ్చైవ సకణాదశ్చ తావుభే॥
తుమ్బురుర్నార్చ వ గన్జర్వౌ గాయ కేశ్వరౌ ।
కృతస్థలాప్పరా శ్చైవ యామకా పుజ్జి కలా॥
గ్రామణిర థగృత్స్నశ్చ రఘోజా శ్చైవ తావుభౌ ।
రక్ష హేతిః ప్రతిశ్చ యాతుధానా పుణె స్మృతో॥
మధుమాధవయోర్ హ్యేష గణో వసతి భాస్కరే।
వ సేద్గీ షేతు ద్వౌమాసౌ మిత్రశ్చ వరుణశ్చ వై॥
ఋషి రత్రిర్వసిష్ణశ్చ నాసౌ తక్షకరమ్భ ।
మేనకా సహజన్యాచ గన్గరౌంచ హహాహుహూ॥
రథ స్తరశ్చ గ్రామజ్యోర కృచ్చేవ తావుభౌ ।
పౌరుషో యోధన శ్చైప యాతుధానౌచ తెస్మృతా॥
ఏతే వస నీవే సూర్యే మాస శుచిశుక్ల యోః ।
ఏతే పస ని సూర్యేచ నివస న్తస్మ దేవతాః॥
ఇన్స్టశ్చైవ వివస్వాంశ్చ ఆష్ణారా భృగురేవచ ।
ఏలాపుత్త స్తథా సర్ప శ్శజ్జలశ్చ పన్నగః॥
విశ్వావసూగ్ర సేనౌచ ప్రాతశ్చైవ రథస్యహ ।
ప్రమ్లోచాచా*ప్సరాశ్చైవానుమ్లోచా చైవ తే ఉభే॥
యాతుధానా స్తథా హేతి ర్వ్యాఘశ్చైవతు తావుభౌ ।
నభో నభస్య యోరేతే వస నితు దివాక రే॥
మాసౌ ద్వౌ దేవతా సూర్యే వస నిచ శరదృతౌ ।
పర్జన్యశ్చైవ పూషాచ భారద్వాజశ్చ గౌతమః॥
చిత్ర సేనశ్చ గన్ధర్వ స్తథాచ సురుచిశ్చయః ।
విశ్వాచీచ ఘృతాచీచ ఉభే తే పుణ్య లక్షణే॥
నాగ శ్చైరావతశ్చాపి విశ్రుతశ్చ ధనజ్జుయః ।
సేనజిచ్చ సుషేణశ్చ సేనానిగ్రామణీ స్తథా॥
పారావారౌచ చ్వావేతా యాతుధానా వుభౌ స్మృతా ।
వస న్యేతే చ వై సూర్యే మాసయో స్వీష ఊర్షయోః॥
హైమ ని చ ద్వౌమాసా నిస ని దివాకరే ।
హుసో భగశ్చ ద్వావేతో కశ్యపశ్చక తుశ్చవై॥
భుజజ్ఞశ్చ మహాపద్మ సర్పః కర్కోటక స్తథా ।
చిత్ర సేనశ్చ గన్దర్వో ఘూర్ణాయు శ్చైవ మానినౌ॥
అప్సరాః పూర్వచి త్తిశ్చ గాన్జరీ చోర్వశీతథా ।
తార్జ్యశ్చారిష్టనేమిశ్చ సేనాని గ్రామణీ చతె॥
స హేచైవ సహ స్యేచ వస న్యేతే దివాకరే ।
విద్యుత్స్పర్శశ్చ తావుగౌ యాతుధానా వుభౌ స్మృతో॥
తత శ్శిశిర యాశ్చాపి మాసయో ర్ని వస ని తే ।
త్వష్టా చైవ తథా విష్ణు ర్జమదగ్ని స్సకౌశిక ॥
కాద్ర తథా నాగౌ కమ్బశాశ్వతరా వుభౌ ।
గన్ధర్వో ధృతరాష్ట్రశ్చ సూర్యవరాశ్చ తావుభౌ॥
తిలో త్తమాప్సరా శ్చైవ దేవీ రమ్బా మనోరమా ।
గ్రామణీ రుత జిచ్చైవ సత్యజిచ్చ మహాయశాః॥
బ్రహ్మో పేతశ్చ వైరక్ష యక్ష పేతశ్చ వై తథా ।
ఇత్యేతే నివస న్తస్మ ద్వౌద్వౌ మాసౌ దివాక రే॥
(*ప్రమ్లోచస్త్యప్సరాశ్చైవానుమ్లోచంతీతథైవచ))
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ సూర్యరథమును ఆయా మాసములందు యథాక్రమమున ఆయా దేవతలు అధిష్టించియుందురు. అందుచేతనే రవి ఆయా మాసములందును ఆయా ఋతువులందును ఆయా ఋషు లతో గంధర్వులతో అప్సరసలతో సర్వగ్రామణు. (శ్రేష్ట)లతో రాక్షసులతో కూడి తన రథమును నడుపుకొనుచుపోపు చుండునని వేదశాస్త్రములందు చెప్పబడుచున్నది.
సూర్యరథమున 1. వసంత ఋతువునందు-మధుమాధవమానములు; ధాత. ఆర్యమన్-ఆదిత్య దేవతా భేదములు; పుల స్త్యపులహులు - ఋషులు. వాసుకి కణాదులు నౌగులు -నారద తుంబురులు గంధర్వులు -కృతస్థలాపుంజికస్థలలు అప్సరసలు-రథగృత్స రథోజసులు గ్రామణులు. హేతిప్ర హేతులు రాక్షసులు. 2. గ్రీష్మరువునందు -శుచి. శుక్ర మాసములు; మిత్రుడు.వరుణుడు. ఆదిత్య దేవతా భేదములు -ఆతి వసిష్ఠులు ఋషులు తక్షక రంభకులు నాగులు హాహాహూహులు గంధర్వులు. మేనకా సహజన్యలు అప్సరసలు.రథంతర రథకృత్ లు గ్రామణులు. పౌరుష యోధనులు రాక్షసులు; 8. వర్ష రువు నందు నభస్.నభస్య-మాసములు-ఇంద్ర.వివస్వాన్లు ఆదిత్య దేవతాభేదములు. అంగిరుడు భృగువు ఋషులు. ఏలాపుత్ర శంఖపాలులు నాగులు_విశ్వావసూగ్ర సేనులు గంధర్వులు-ప్రహ్లిచానుచలు ఆప్సరసలు. హేతి-వ్యాఘులు రాక్షసులు; 4. శరదృతువునందు ఇషము ఊర్జము మాసములు.పర్జన్యుడు.పూషన్.ఆదిత్య దేవతాభేదములు. భారద్వాజుడు గౌతముడు ఋషులు-ఐరావతుడు.ధనంజయుడు.నాగులు. చిత్ర సేనుడు సురుచి-గంధర్వులు.విశ్వాచీ-ఘృతాచీ-అప్సరసలు. సేనజిత్.సుషే ణుడు.గ్రామణులు.పొరుడు.ఆవారుడు రాక్షసులు; 5. హేమంతమున సహస్సహన్య-మాసములు హంసుడు భగుడు. ఆదిత్య దేవతా భేదములు-కశ్యపుడు.క్రతువు-ఋషులు-మహాపద్ముడు కర్కోటకుడు నాగులు చిత్ర నేనుడు మూర్ఘాయువు-గంధర్వులు
పూర్వచి త్తి-ఊర్వశి-అప్సరసలు.తార్ క్యుడు. అరిష్టనేమి-గ్రామణులు. విద్యుత్-స్పర్ముడు.రాక్షసులు; 6. శిశిర ఋతువునందు తపన్.తపస్య మాసములు.త్వష-విష్ణువు ఆదిత్య దేవతా భేదములు-జమదగ్ని -కౌశికుడు-ఋషులు.కంబళుడు అశ్వతరుడు. నాగులు - ధృతరాష్ట్రుడు సూర్యవర్చస్-గంధర్వులు. తిలోత్తమ రంభ - అప్సర నలు-రుత జిత్ సత్యజిత్-గ్రామణులు-బ్రహ్మో పేతుడు.యక్ష పేతుడు రాక్షసులు.
స్థానాభిమానినో హ్యేతే గణా ద్వాదశ సత్తమాః ।
సూర్య మాప్యాయయ న్యేతే తేజసా తేజ ఉత్తమమ్॥
గ్రథితైస్తై ర్వచోభిశ్చ స్తువని ఋషయో రవిమ్ ।
గగ్గర్వాప్సరస శ్చైవ గీతనృత్తె రుపాసతే॥
విద్యా గ్రామనో యక్షా కుర్వని స్మేశ సజంహమ్ ।
సర్పా సర్ప నివై సూర్యం యాతుధానగణా అపి॥
వాలఖిల్యాస్తు యా నిస్మ పరివార్యోదయా దవిమ్ ।
ఏతేషామేవ దేవానాం యథావీర్యం యథా వయః॥
యథా యోగం యథాధర్మం యథాత త్వం యథాబలమ్ ।
తథా తపత్య సౌ సూర్య స్తేషాం వృద్ధిస్తు తేజసామ్॥
భూతానా మశుభం సర్వం వ్యపోహయతి తేజసా ।
మానవానాం శుభం హ్యేత దియతే దురితంతు యత్ ॥
దురితం శుభచారాణా మపహ ని క్వచితృతమ్ ।
ఏతే భమ ని సూర్యేణ సహైతే సామగా దీవి॥
తపన్తశ్చ జయన్తశ్చ హోదయ నశ్చ వై ప్రజా ।
గోపయ నిస భూతాని ఇహ తెహ్య నుకమ్పయా॥
స్థానాభిమానినా మేత త్థానం మన్వ నరేషు పై ।
ఆతీతానాగతానాంచ వర్త నే సామ్పతంచ యే॥
ఏవం పస నివై సూర్యే సప్తకాస్తు చతుర్ధశ ।
చతుర్దశసు వర్తనే గణా మన్వన్తరేజ్వహ॥
గ్రీ ష్మే హిమేచ వర్షాసు ముఞ్చమానా యథాక్రమమ్ ।
ఘర్మంచ హిమతోయంచ యథాక్రమ మహర్నిశమ్॥
[ఈ చేప్పిన దేవాది గణములు సూర్యరథమును ఆయా మాసములం దధిష్టించియుండుటలోని తాత్వికార్థమును పురాణమే ఇట్లు చెప్పుచున్నది:] 1. ఈ ద్వాదశ సత్తములు (సత్-తమ- దేవ శ్రేష్టులు)ను ఆయా మానస్థానాభిమాని దేవతలు; మాసభేదమున భిన్న దశలనొందు తమ తేజో విశేషముచే ఉత్తమ తేజోమూర్తియగు రవిలోని సూర్య ప్రధాన తత్వమును ఆప్యాయన మొందింతురు; (ప్రీతునొసరించి అధిక శక్తి సంపన్నుని చేయుదురు. ఋషులు తాము గ్రథనము (కూర్పు) చేసిన వయస్సులతో రవిని స్తుతింతురు. (ఋషులు వాగాత్మక తత్వరూపులు); గంధర్వులు నృత్త గీతములతో రవి నుపాసింతురు. గ్రామణులనగా ఊరి పెద్దలు. వీరు విద్యా గ్రామణులు-త్రయీ విద్యలకును తదంగ విద్యలకును తద్ గ్రామ సమూహమునకును ముఖ్యముగా దేవతాస్తావక గానప్రధానమగు స్వర ముల-గ్రామమునకును అధి ష్ఠాతలు; కనుకనే వీరు ఈశ సంగ్రహము (రవి యందర్ని హితమగు పర మేశ తత్వమును ప్రసన్న మొనర్చు పనిని) నేర వేర్తురు; సర్వగణములు రవిని సర్పణమొనరింతురు.రవి రథమును ముందునకు ప్రసరించు ప్రవృత్తికి సహాయకులుగా నుందురు; రక్షోగణము కూడ ఇదేపనిని (రథరడా రూపమున) నిర్వర్తింతురు. వీరు కాక ప్రగణములలో చెప్పక యు శ్రుతి పురాణములందు ఉదయము మొదలు ఆ సమయ వరకు - రవి రథము వెంటనుందురని చెప్పిన వాలఖిల్య ఋషులు రవిని పరివారించి వెంటనుందురు. వీరు సౌరశక్తి సర్వస్వ రూపులు ఋషులు.
ఇంత యేల? ఈ చేప్పిన దేవతాది గణముల వీర్యమును వయస్సును యోగమును ఆచరికను ధర్మమును తత్వమును బలమును (ఇవి అన్నియు శ్రుతులయందును శాస్త్రములందును కలవు. ఇచట చెప్పబడ లేదు.) అనుసరించి సూర్యుని తేజమాయా దేశకాలములందు వృద్ధినొందుచు పరిణమించుచు నుండును. వాని ననుసరించి రవి తపించు చుండును. ఆ దేపుడు ఆశ క్తితో తన తేజస్సుతో భూతముల యశంభము పోగొట్టి దురితమును హరించి వానికి శుభమును కలిగించును. శుచరులును ఒకోనోక చో (తెలిసి తెలియకయా) చేసిన దురితమునుకూడ ఆరని నశింప జేయును. ఈ విషయమున సూర్యునకు సహకారులై ఈ దేవాది గణములపోరు తమతమ పరివారముతో కూడ సంచరించుచు భూత ముల పై దయతోపానికి వేడిమి వెలుగులనిచ్చుచు జయము కలిగించుచు సంతోష పెట్ట చు వానిని కాపాడుచుందురు.
ఈ సప్తకము (ఆదిత్య-ఋషి-సర్పగంధర్వాపరోగ్రామణి రక్షోగణములుఏడు) ఇంతవరకును గడచిన.ఇపుడు జరుగుచున్న ఇక ముందు రానున్న -మన్వంతరములందు పదునాల్గింటియందును ఇదే విధముగా స్థానాభిమానులుగా ఉండి హిమవరాది ఋతువులయందు యథాక్రమముగ ఉష్ణ హిమ వృష్ట్యాదికమును విశ్వమునందు అహర్నిశములును ప్రవర్తిల్ల జేయుచుందురు.
గచ్ఛత్యసౌవ్రతవశా త్పరివృత్తరశ్మి ర్దేవాన్పితనాంశ్చ మనుజాంశ్చ స తర్పయన్వై ।
శుక్లేచ పూర్దస్తమనుక్రమేణ కళాక్షయే నైవ పునః పిబంతి॥
సోమేన యచ్చామృత మస్య సృష్టం కృష్ణక్షయే రశ్మిషు రక్షితం తత్ ।
సర్వేమృతం తత్పతరః పిబ స్తి దేవాశ్చ సౌమ్యాశ్చతథైవ కామ్యా
సూర్యేణ గోభి ర్షి వివర్ధితాభిః పునశ్చ తై రేవ సముచ్ఛితాభిః ।
పుష్ఠంతి వృష్యాభి రివౌషధీభి ర్మర్త్యాం స్తథాన్నేన సమేధయ స్తి॥
అమృతేన తృప్తి రర్ధమాసం సురాణాం మాసం తు స్వాహాభః స్వధయాపితృణామ్ ।
అన్నే న జీవ ననిశం మనుష్యా సూర్య స్స్వయం తద్ది బిభర్తి గోభిః॥
ఇత్యేష ఏకచత్రేణ సూర్య స్తూర్ణం ప్రవర్తతే ।
తత్ర తైరక్రమై ర్వ స్సర్పతేసౌ దినక్షయే॥
హరిర్ఘ రిది రియతే తుర జమైః పిబన్యపో గో-హరి-భి స్సహసధా ।
పున ప్రయచ్ఛ త్యథ తాశ్చ యోహరి స్సమూహ్యమానో హరిభి సురజమైః॥
అహోరాత్రం రథేనాసా వేక చ కేణ వై భమక్ ।
సప్తద్వీప సముద్రాంతు సప్తభిస్సప్తిభి ర్హృతమ్॥
చనోరూ ప్రస్తు తైర్వ ర్యతశ్చక్రం దివస్పతిః ।
కామరూపై స్సకృడ్యు క్షేః కామగై సై ర్మనోజవై ॥
హరితై రవ్యయః పింగైరీశ్వరై ర్ర్బహ్మవాదిభిః ।
వాహ్య తేన నరం చైవ మజ్జాలం దివస క్రమాత్॥
కల్పాదౌ సమ్ర్పయుక్తాశ్చ వహన్త్యభూతసమ్ల్పవమ్ ।
ఆవృతో వాలఖిల్యైశ్చ భ్రమతే రాత్ర్యహానితు॥
గ్రథితై స్స్వవచోభిశ్చ స్తూయమానో మహర్షిభిః।
సేవ్యతే గీతనృత్యైశ్చ గన్గర్వాపర సాం గణైః॥
పతంగైః పతగై రశ్వై ర్భ్రామ్య మాణో దివస్పతిః ।
ఈ రవి తన వ్రతముల (క్రియాశక్తి ప్రవృత్తి) వశమున (చంద్రకిరణములుగా) మారుచుండెడి తన కిరణములతో దేవతలను పితరులను మనుజులను తృప్తి నొందించుచుండును. ఆది ఎట్లనిన సోముడు శుక్లపక్షమున రవియందలి అమృత మును తనయందలి యమృతముగా సృష్టించుకొని తనయందు రక్షించుకొనును. ఆతనిని అతనియందలి యమృతమును సౌమ్యులు సోమారులై యజ్ఞములం దారాధ్యులు- కొమ్యులు (యజనముచే తృప్తులై యజమానులకు కామముల నొసగు వారు) ఆగు దేవతలును పితృ దేవతలును అనుక్రమమున త్రోవుదురు. అదియే చంద్రునియందు కళాక్షయరూపమున కస బడు చున్నది. ఈ దేవతలును పితరులును తా మట్లు తృప్తి నొంది వృద్యౌషధములతోవలె మనుజులను ఆయా ఆన్నము లతో పోషించి ఉ త్తేజింపజేయుచున్నారు. దీని రహస్య మేమన అమృతము త్రోవుట చే దేవతలకు కలుగు తృప్తి అర్ధ మాసము వరకు మాత్రమే యుండును. కాని స్వాహాకారములతో దేవతలను స్వధాకారములతో పితరులను యజించుటచే వారికి కలుగు తృప్తి మాసము పాటుండును. కానీ మనుజులు అన్న ముతోనే జీవింతురు. రవి ఆ మానవాహారమగు అన్న మును తన కిరణముల రూపమున తనయందు నిలుపుకొని యుండును. (అదియే చంద్రుని ద్వారమున సోమాది హవిరాది రూపమున దేవతలకును కవ్యాది రూపమున పితరులకును ఆంది తదనుగ్రహమువ అన్న రూపమున మనుజులకు చేరును. ఇట్లు రవి తన కిరణములయందు నిలుపుకొనిన దేవ పితృ మనుజాహార జన్యతృప్తియే రవి రథపు ఏక చక్రము. ఇట్టి ఏకచక రథముతో రవి వేగముగా ప్రవర్తిల్లుచుండును. అక్కడనే (అంతరిక్ష ద్యులోకములందే) ఆక్రమములు (క్రమము = పాదవిన్యాసము; పాద పిన్యాసము చేయనివి అక్రమములు) అయిన ఆశ్వములతో సాయంకాలమున ముందు నకు ప్రసరించును. ఆందుచే సూర్యుడు అస్తమించుట జరుగును.) సూర్యుడు ఇట్లు పచ్చని గుర్రములచే కొనిపోబడును. కిరణము లనెడు గుర్రములతో నీటిని వేయి విధములుగా తాగును. మరల పచ్చని గుర్రములతో రథము పై కొనిపో బడుచు మరల ఆ జలములను భూతములకు అంద జేయును.
ఈ దివస్పతియగు రవి అహోరాత్రములును ఏడు గుర్రములచే లాగబడు ఏకచకయుతమగు రథముతో సహా ద్వీప సప్త సముద్ర ఘటితమగు ఈ పృథివీ చక్రము నంతను భ్రమించుచుండును. ఆ అశ్వములు స పచ్చందోరూప ములు; కామరూపములు; కామగమములు భగవంతుని లేదా సూర్యుని - సంకల్పానుసారము పొవునవి) మనోవేగయుత ములు; సకృద్యు క్తములు (ఒకమారు పూన్చినంతనే మరల పూంచుచు విప్పుచుండవలసిన పని లేనివి) హరితవర్ణము కలవి; పింగవర్ణమును కలవి; ఎన్నటికిని ఏ మార్పును లేక యుండునవి; అవి ఈశ్వరములు సర్వసమర్థములు; బ్రహ్మ వాదులు (వేద విజ్ఞానవంతములు); అట్టి అశ్వములతో మోయబడు రథమున రవి దివసక్రమముస మండల రూపమున నిరంతరముగా సాగిపోవుచుండును.
ఈ ఛందోమయాశ్వములను కల్పాదియందు ఒక సారి రథమున పూన్చినంతనే భూత సంప్లవ (ప్రళయ) పర్యం తము ఆ రథమును అవి మోసికొనిపోవుచునే యుండును.
దివస్పతి(ద్యులోకాధిపతి)యగు రవి తన కిరణముల శక్తికి మారు రూపములగు వాలఖిల్య ఋషులు పరివార మయి తనవెంట నుండగా మహరు లందరు తాము కూర్చిన వచస్సులతో సుతించుచుండగా గంధర్వాపురోగణములు గీత నృత్యములతో సేవించుచుండగా పక్షములు కలవియు పక్షవలె ఆకాశమున పోవునవియు నగు ఆశ్వములు తన రథమును మోయుచు త్రిప్పుచుండగా రాత్రింబవళ్లు అంతరిక్ష ద్యులోక ములందు సంచరించుచుండును.
చంద్రమణ్డలపరిమాణాదికథనమ్- చంద్రమండల-తద్రథాది-ప్రతిపాదనము
వీథ్యానయాపిచర తే నక్షత్రాణి తథా శశీ॥
హ్రసపృష్టీ తథే హాస్య రశ్మయ స్సూర్యపత్మృతాః ।
త్రిచక్రాభయతోశ్వశ్చ విజ్ఞేయ శ్శశినో రథః॥
ఆంగరా త్సముత్పన్నో రథస్సాశ్వ ససారథిః ।
సుతారై స్తై శ్రేణి శ్చకైర్యుక శుక్లెర్ష యాత్తమై॥
దశభి సురగై ర్దివ్యైరసంగై ర్మనోజవై ।
సకృద్యు కరణే తస్మిన్ వహన స్వాయుగక్షయాత్॥
సమస్థితే రథే తస్మిక్ శ్వేతచక్రాశ్వవాంశ్చ వే ।
అశ్వా సమేకవర్ణాశ్చ వహ నే శబ్ఖవర్చసః॥
అజ శ్శతమఖ శ్చైవ వృషో వాజీ నరో హ్వయః ।
అశ్మశ్చ సప్తధాతుశ్చ హంసో వామో మృగ స్తథా॥
ఇత్యేతే నామభి స్సర్వై ర్గశ చన్దహయోత్తమాః ।
ఏతే చన్దమసం దేవం వహ న్యశ్వాయుగ క్షయమ్॥
దేవైః పరివృత సోమః పితృభి శ్చైవ గచ్ఛతి ।
సోమశ్చ శుక్లపక్షాదే భాస్కరే పరతః స్థితే॥
ఆపూర్యతే పరో భాగ స్సోమస్య తు అహఃక్రయాత్ ।
తతః పితృక్షయం సోమ, యుగప ద్వ్యాప్యతే రవిః॥
పీతం పశ్చాదశాహంతు రశ్మినై కేన భాస్కరః ।
ఆపూరయం స్తదేవేమం భాగం భాగ మహః క్రమాత్॥
సుషుమ్నా పూర్యమాణస్య శుక్లే వర్ధ ని తాః కలాః ।
తస్మార్టోస నివై కృష్ణ కు క్లే హ్యాప్యాయయ నిచ ॥
ఇత్యేవం సూర్యవీర్యేణ చన్హస్యాప్యాయితం వపుః ।
పౌర్ణమాస్యాం ప్రదృ శ్యేత కు క్లే సమ్పూర్ణమణలః॥
ఏవ మాప్యాయిత స్సోమ శుక్లపక్షే ష్వహక్రమాత్ ।
తతో ద్వితీయాప్రభృతి బహుశ స్య చతుర్దశీమ్॥
అపాం సారమయ స్యేందో రమృతాత్మాత్మకస్య తు ।
పీబన్యమ్బుమయం దేహి మధు సౌమ్యం తథామృతమ్॥
చంద్రుడును నక్షత్రమయమగు వ్యోమవీధియందే సూర్యుని వలెనే సంచరించును. ఇతని ప్రస(క్షయ)వృద్దు లును కిరణముల విషయమును సూర్యుని విషయమునందే చెప్పబడినవి. ఆవి అట్లే గ్రహింపవలెను. ఇచట వేరుగా చెప్ప పని లేదు. చంద్రరథమునకు చక్కని తారలతో ఏర్పడిన మూడు చక్రములును కాడికి రెండు వైపులను తెల్లని మేలగు గుర్రములును ఉండును. ఇతని రథమును అశ్వములును సార థియును జలగర్భమునుండి ఉత్పన్నమయినవి. అజ.శత మఖవృషవాజినరాశ్మ-సప్తధాతు - హంస వామ - మృగ-నామములు గల మనోజవములగు ఆ పది అశ్వములును శంఖము వంటి తెల్లని ఒకే వన్నే కలవి. తెల్లని రథమున ఒకసారి పూన్చిన ఆ ఆశ్వములు ప్రళయ పర్యంతము చంద్ర భగవానుని మోయుచుండును.
చంద్రుని పరివారముగా అతని వెంట దేవనలుసు పితృ దేవతలు నుందురు. శుక్ల పక్షారంభమునుండి సూర్యుడు చంద్రునకు ఆవలగా నుండి సుషుమ్నా మార్గమున తన యొక్కొక్క కరణముతో నింపుచు పోపును. పితరు లును దేవతలును కృష్ణపక్షమున చంద్రుని యందలి అమృతము త్రోవుట చే క్షీణించిన యంశము ఇట్లు పూరింపబడును. అందు చేతనే శుక్లపక్షమున చంద్రకలలు వృద్ధి చెందును; కృష్ణమున క్షీణించును. ఇట్లు సూర్యునిచే కలిగిన ఆప్యాయనము చంద్రకలావృద్ధికి హేతువై ఆతడు పూర్ణిమనాడు సంపూర్ణ మండలు డై కనబడును. కృష్ణపక్ష ద్వితీయ మొదలు కృష్ణ చతుర్దశి వరకు దేవతలును పితరులును జలసారమయుడును అమృతమయుడు నగు చంద్రుని చాంద్ర మధువును ఆమృత మును- త్రావుదురు.
సమృతం వర్ధమానేచ అమృతం సూర్యతేజసా ।
భక్ష్యార్థ మాగతం సోమం పౌర్ణమాస్యా ముపాసతే॥
ఏక రాత్రం సురై స్సార్గం పితృభి రృషిభిశ్చవై ।
సోమస్య శుక్లపక్షాదౌ భాస్కరాభిముఖస్యతు॥
పక్షీయతే పరోభాగః పీయమానః కలాక్రమాత్ ।
త్రయస్త్రింశచ్చతే స్పార్ధం త్రయంశ తథైవచ॥
త్రయస్త్రింశత్సహస్రాణి దేవాస్సోమం పిబ నివై ।
ఇత్యేవం పీయమానస్య కృషే వర ని తాకిక లాః॥
క్షీయ నేచ తతఃకృషే శుక్లే హ్యాప్యాయయ న్రిచ ।
ఏవం దీనక్రమా త్పీతే దేవైరపి నిశాక రే॥
పీత్వార్ధమాసం గచ్చ స్తి అమావాస్యాం సురాశ్చ తే ।
పితర శ్చాపి తిష్టస్తి అమావాస్యాం నిశాకరమ్॥
తతః పఇ్చద శే భాగే క్చిచ్చే షే నిశాకరే ।
తతోపరా హే పితరో జఘన్యే దివసే పునః॥
పిబంతి ద్వి క లంకాలం (లవం)శిష్టా సస్య కలాస్తుయాః ।
విని భ్రష్టం త్వమావాస్యాం గభస్తిభ్య స్తథామృతమ్॥
అర్థమాససమాహైతు పీత్వా గచ్చని తేమృతమ్ ।
సౌమ్యా బరి షడశ్చైవ అగ్నిష్వాత్తాశ్చ యే స్మృతాః॥
కావ్యా శ్చైవ తు యేప్రోక్తాః పితర స్సర్వఏవతే ।
సంవత్సరాస్తు వై కావ్యాః ప్చద్దా యే ద్విజాః స్మృతాః॥
సౌమ్యాస్తుఋతవో జేయా వూసా బర్హిషద స్తథా ।
అగ్నిష్వాత్రా ర్తవాశ్చైవ పితృసర్దోహ్యయం ద్విజాః॥
పితృభిః పీయసూనాయాం పఇదశ్యాంతు వైకలా ।
యాప స్న క్షీయతే తస్య భాగః పజ్ఞ్చదశస్తు సః॥
అమావాస్యోం తథా తస్య ఆ నరా పూర్యతే పరః ।
వృద్దిక్షణా వై పక్షాదౌ షోడశ్యాం శశినః స్మృతా॥
*ఏవం సూర్యసముద్దేశాత్తయవృద్దీ నిశాకరే ।
(*ఏవం సూర్యనిమిత్తైషా క్షయవృద్ధి ర్నిశాకరే)
ఇట్లు వర్దమాన- శుక్లపక్షమున నూర్యతేజస్సుచే చంద్రునియం దమృతము నింపబడును. దేవతలును పితరు లును తమకు భక్ష్యమై వచ్చిన సోము ని పూర్ణిమనాడు పరివారించి యుందురు. ఇది ఒక రాత్రి మాత్రమే. శుక్లపక్షాది తిథి మండి భాస్కరాభిముఖుడై యున్నందున నింపబడిన చంద్రుని పర భాగము కలాక్రమమున ఆనాటినుండి దేవతలచే పితరులచే ఋషులచే (ఉపాసకులచే) ప్రొవబడి క్షయించును. చంద్రామృతపానము చేయు దేవతల సంఖ్య ముప్పది మూడు వేలును ముప్పది మూడు వందలును ముప్పది మూడు =36333 ఆగును. ఇట్లర్ఘ మాసముపాటు చంద్రామృతపానము చేసి దేవతలు వెడలిపోవుదురు. కావ్యులు బరిషదులు అగ్ని ష్వాత్తులు అను) పితరులు నిలిచియుండి అమావాస్యనాటి అప రాహపు కడపటి భాగమున రెండు కలల కాలమున చంద్రుని పంచదశ భాగమున మిగిలి జారిపడిన - కలా శేష మును గ్రహించి దానియం దింకను మిగిలియున్న అమృతమును తావి వెడలిపోవుదురు. పితృ దేవతల కందరకును కావ్యులు అని సాధారణముగా వ్యవహారము. కాని వారి విషయ భేదానుసారము నామభేదములు ఉండును. ఈ శ్లోకములందలి విషయ విశ దీకరణము ముందు 140 అ. లో చూచునది.
ఇట్లు పితరులు పదునై దవ కలను అమావాస్య నాడు తావుటతో అది అంతయు నిశ్శేషముగ క్షయించుటకు లోపలనే ఆ చంద్ర మండలములో రవి కిరణవశ మున మరి యొక కల పూరింపబడును. ఇట్లు శుక్లపక్షారంభమునుండి చంద్రక లావృద్ధియు కృష్ణపక్షారంభమునుండి చంద్రకలాక్షయమును ఆరంభమగును. వృద్ధి పదునారు కలల వరకు జరు గును. ఇట్లు చంద్రుని యందు కలుగు కలావృద్ది క్షయములు సూర్యవశముననే జరుగును.
తారాగ్రహాణాం వక్ష్యామి స్వర్భానోస్తు రథం పునః॥
యః ప్రయాతి సుళు భస్తు సోమపు తస్య వై రథః।
యుక్తో హయైః పిళ జైస్తు(వశిభి ర్వాతసంభవై)అష్టభి ర్వాతరంహసైః॥
శ్వేతః పిశ జ స్సారజో నీల శ్యా పి లోహితః ।
శ్వేతశ్చ హరిత శ్చైవ చిత్రవర్ణా స్తథైవచ॥
అష్టభిస్తే ర్మహాభాగై రుతమే ర్వాతరహ సైః ।
తతో భౌమరథశ్చాపి అష్టాళైః కాఇన స్మృతః॥
అష్టభి ర్లోహితై ర శ్వై స్సధ్వజై రగ్ని సమ్భవై ।
సర్పతే వై కుమారోసా వృజువ కాతివక్రగః॥
తతస్త్వాజీరసో విద్వాక్ దేవాచార్యో బృహస్పతిః ।
గౌరా శ్వేసతు ర్మౌ ణ స్యన్దనేన విసర్పతి॥
య కే నాష్టాభిర శ్వైశ్చ ధ్వజై రగ్ని సముద్భవైః ।
అబ్దం వసతి యో రాశా స్వాం దేశం తేన గచ్ఛతి॥
యుక్రేనాప్టాభిర శ్వైశ్చ సధ్వజై రగ్ని సమ్భవైః ।
ర థేన కి ప్రవేగేన బార్గవ సేన గచ్చతి॥
కత శనైశ్చర్యో శ్శబ ర్వాతరంహ సైకి ।
కాల్షియసం సమారుహ్య స్యన్దనం యాత్యనీ శనై కి॥
స్వర్భానోస్తు తతోషాశ్వాః కృష్ణావే వాతరంహసః ।
రథం తమోమయం తస్య వహస్త స్సముద జ్చోతాః॥
ఆదిత్య మేతి సోమంచ తమస్సర్వేషు పర్వసు ।
తతః కేతుమత శ్చ్వా అష్టాజ్గా వాతరంహసః॥
పలాలధూమవర్ణాభాః కేతోర శ్వా స్సుదారుణాః ।
ఏతే వాహా గ్రహాణాంవై మయా ప్రోక్తా రథై స్సహ॥
కుజ బుధ గురు శుక్ర శనులకు తారాగ్రహములని జ్యోతిక శాస్త్ర వ్యవహారము. వీరి రథముల విషయమును రాహు కేతు రథ విషయమును ఇక తెలి పెదను. బుధ రథము. తెల్లనిది. దానికి శ్వేత పిశంగ సారంగ నీలశ్యామలోహిత హరిత చిత్రవర్ణములు గలిగి వాయువేగము గల ఎనిమిది యశ్వములు పూన్చియుండును. కుజుని రథమును సధ్వజములు సలక్షణములగు అష్టాంగములు కలిగినవై అగ్ని నుండి పుట్టిన ఎనిమిటి ఎర్రని గుర్రములు లాగుచుండ అతడు దాని పై ఋజువక్రాతిపకగతిత్రయముతో సంచరించుచుండును. బృహస్పతి రథము బంగారుతో చేసినది. దానికి అగ్ని సంభవములగు గౌరాక్వము లెనిమిది పూన్చియుండును. అతడు ప్రతి రాశియందును సంవత్సరముండుచు తన గతి క్రమమున సంచరించును. కు కుని రథమును ధ్వజమును అగ్ని సంభవ ములగు ఎనిమిది గుర్రములును కలిగి మహావేగవంత మయి యుండును. శనియు శబల మిశ్రిత ) వర్గము పొయు వేగము కలిగిన గుర్రములు పూన్చిన ఇనుపరథ మెక్కి నెమ్మదిగా పోవును. రాహురథము తమోమయము; దానికి వాయు వేగములగు నల్లని గుర్రము లేనిమిది యుండును. కేతుర థాశ్వములు సలక్షణాష్టాంగ యుతములై పలాల ధూమవర్ణములై దారుణములై నవి. వాయువేగ ములు. ఇవి ఆయా గ్రహముల రథముల - అశ్వముల - విషయము.
సర్వే ధ్రువనిబద్ధా సే నిబద్ధా వాతరశ్మిభిః ।
ఏతేవై క్రమమాణా స్తే యథాయోగం వహ నితే॥
వాయవ్యాభి రదృశ్యాభిః ప్రబద్దా వాతరశ్మిభిః ।
పరిభ్రమంతి తద్బద్ధా శ్చంద్రసూర్యగ్రహా దివి॥
యాన న మనుపరియంతి ధ్రువం తే జ్యోతిషాంగణాః ।
యథా నద్యుదకే నౌస్తు ॥ ఉద కేన సమూహ్యతే॥
తథా దేవగృహాణి స్యు రూహ్య నే వాతరంహసా ।
తస్మా ద్యచత్ర దృశ్య నే వ్యోమ్ని దేవగృహా దివి॥
యావత్య శ్చైవ తారాస్స్యు స్తావత్యశ్చ మరీచయః ।
సర్వా ధ్రువనిబదాస్తా భ్రమన్త్య భామయ ని తమ్॥
తథా భ్రమ నీ జ్యోతీంషి వాతావిద్దాని సర్వశః ।
అలాతచక్రవద్యా ని వాతచకేరితాని తు॥
యస్మా తవహతే తాని ప్రవహ స్తేన స స్మృతః ।
ఏవం ధ్రువే నియుక్తాసౌ భ్రమతి జ్యోతిషాం గణః॥
ఏష తారామయో జ్ఞేయ శ్శింకుమారో ధ్రువో దివి ।
యహ్నా త్కురుతే పాపం దృష్ట్వా తాని విముచ్యతే॥
శింశుమార శరీరస్థా యావన్య స్తారకా మతాః ।
వర్షాణి దృష్ట్వా జీవ స్తి తావదేవాధికానితు॥
శింశుమారాకృతిం జ్ఞాత్వా ప్రవిభాగేస సర్వశః ।
ఉత్తానపాద సస్యాథ విశ్లేయ శోత్తరేహనో॥
యజ్ఞోధరేతు విషైయో ధర్మో మూర్గాన మా శ్రితః ।
హృది నారాయణ స్సాధ్యా హ్యశ్వినౌ పూర్వపాదయోః॥
వరుణ శ్చార్యమాచైవ పశ్చిమే తస్య సర్థిని ।
శి శ్నే సంవత్సరో జేయో మిత్ర శ్చాపాన మాశ్రితః॥
పుచ్ఛేగ్నిశ్చ మ హేన్దశ్చ మారీచః కాశ్యపో ధ్రువః ।
ఏష తారామయః సమ్బో నా సమేత నచోదయమ్॥
నక్షత్రచన్దసూర్యాశ్చ గ్రహా స్తారాగభై స్సహ ।
తన్ముఖాభిముఖాస్సర్వే చక్రభూతా దివి స్థితాః ॥
ధ్రువేణాధిష్ఠితాశ్చైవ ధ్రువమేవ ప్రదక్షిణమ్ ।
పరియ న్రిచ సురశ్రేష్ఠం మేథీ భూతం ధ్రువం దివి॥
ఆగ్నీధంకాశ్యపానాంతు తేషాం స ర మో భువః ।
ఏక ఏవ భ్రమల్యేష మేరో ర నర మూర్ధని॥
జ్యోతిషాం చక్రమాదాయ ఆకరం స్తమధోముఖః ।
మేరు మాలోకయన్నేవ ప్రతియాతి ప్రదక్షిణమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే ఖగోళే సూర్యమణ్డలాదికథనం నామ పఞ్చవింశత్యుత్తరశతతమోఽధ్యాయః॥
ఈ సూర్యచంద్రాది గ్రహములును జ్యోతిర్గణములును అన్ని యువాతమయములగు పగ్గములతో ఆయా ఆమ రికలతో ధ్రువునితో బిగింపబడి కంటికీ కానరాని ఆ వాయవ్య పాశముల బలమున ఆ ధ్రువుడు ఉన్నంత కాలమును అతనిని ప్రదక్షిణించుచు అంతరిక్షమున సంచరించుచుండును. నదీ ప్రవాహజలమందలి నౌకను ఆ జల మెట్లు వహించునో అట్లే ఈ వాయుశక్తి ఈ దేవ గృహముల (జ్యోతిర్గణముల)ను అంతరిక్షమున వహించుచుండును. ఇవియే కాదు. తారలన్నియు మరీచులు-కిరణములును . కిరణయుతములగు జ్యోతిస్సులును) అవియు ధ్రువునితో నిబద్ధములై తా దతని చుట్టు తిరుగుచు ధ్రువుడును తిరుగుట కషకాశము నిచ్చుచున్నవి. (ధ్రువుడు తన చుట్టు తాను తిరుగుచు జ్యోతిర్గణములను కూడ తన చుట్టు త్రిప్పుచున్నాడు;) ఇవన్ని యు వాయుమయ చక్రముచే పేరితములయి కొర విని గిరగిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె తిరుగుచుండును. ఇట్లు జ్యోతిర్గణములు అంతరిక్షమున తిరుగుటకు హేతువు అగు వాయువునకు ఈ హేతువుతోనే ప్రవహము (ప్ర= మిక్కిలిగా; వహ=వహించునది;) అని నామము ఏర్పడింది.
ఇట్లు ధ్రువుని కేంద్రముగా చేసికొనియున్న తారామయమగు అమరికకు ‘శింశుమార చక్రము’ (శిశుమారమను జలచరపు రూపమున నున్నది) అనీ సంప్రదాయగత నామము. ఈ శింశుమారపు అమరికను ప్రవిభాగ పూర్వకముగ ఎరిగి తత్వమెరిగి దీనిని దర్శించినచో ఏనాటి పాపమానా డే విముక్తమగును. ఏతద్దర్శనముచే ఈ శింశుమార శరీ రమున చిన్న చిన్న జ్యోతిస్సులు తారకలు ఎన్ని కలవో అన్ని యు. అంతకంటే ఎక్కువగను కూడ.సంవత్సరముల పాటు జీవించును.
ఈ శింశుమారపు అమరిక ఇది: పైదౌడ -ఉత్తానపాదుడు యజ్ఞుడు క్రింది దౌడ - మూర్గము(శిరస్సు) ధర్ముడు - హృదయము నారాయణుడు.ముందరి పాదములు సాధ్యులు-ఆశ్వినులు వెనుక సర్దులు (తొడలు అని అర్థము. కాని ఇచ్చట సక్తి అనగా పాపములనియే గ్రహించవలెను.) వరుణుడు అర్యమన్ అను ఇద్దరు దేవతలు శిశ్నము సంవత్సరము . ఆపానము మిత్రుడు-పుచ్చము అగ్ని మహేంద్ర మారీచ కాశ్యప ధ్రువులు అను పదునాలుగు దేవతాత్మక తారాగణముతో ఈ శింశుమారము ఏర్పడినది. (యజురారణ్యక మునుడు ‘ధర్మోపూర్ణానం-బ్రహ్మోత్తరాహనుః యజో2ధరా.విష్ణు రృదయం-సంవత్సరఃప్రజననం- ఆశ్వినౌ పూర్వపాదౌ-ఆతీర్మధ్యం.మి తావరుణావపరపాదౌ.అగ్ని కిపుచ్చస్య ప్రథమం కొండం-తత ఇంద్ర స్తతః ప్రజాపతి రభయం చతుర్థం సవా ఏష దివ్యః శాక్వర శ్శిళుకుమారః’ అని యున్న ది.) ఇట్టి ఈ తారామయ స్తంబము (దుబ్బువంటి ఆమరిక) ఆస్తమించక ఉదయించక సర్వదా ప్రకాశించుచుండును. నక్షత్రములు చంద్రుడు సూర్యుడు గ్రహములు తారాగణములు ఈ శిశుమార చక్రమున కతిముఖములయి చక్రాకృతితో ద్యులోకమున అంతరిక్షాన్నత స్థానమునందు ఉన్నవి. ఇవి తమకు ధ్రువుడు అధిష్టాతగా సురశ్రేష్ఠుడగు ఆ ధ్రువుని మేథిగా చేసికొని అతనిని ప్రదక్షిణించుచుండును. ఈ ధ్రువుడు ఆగ్నీధ్రకాశ్యప వంశీయులలో పరము (శేష్ఠుడు; ఈ జ్యోతీ రూపుడు తానొక్కడే ప్రధానభూతుడై) మేరుపర్వత శిరోమధ్యమునకు తిన్నగా అంతరిక్షాగ్రమున) ఈ జ్యోతి శ్చక్రమును తన యధీసమున పట్టుకొని లాగికొనుచు ఆధోముఖుడై మేరువును చూచుచు ప్రదక్షిణ ప్రతియానము (ఆత్మ ప్రదక్షిణము చేయుచు ఉండును. (మారీచుడు = మరీచికి కుమారుడు)
(ఇది ధ్రువుడు కేంద్రముగాను సూర్యుడు దక్కాలాత్మక ప్రజాపతి కధీసుడుగాను సుండుననేడు సుప్ర దాయము ననుసరించి జ్యోతీరాశి వ్యవస్థ విషయక భావనతో ప్రతిపాదింపబడినది. – అనువాదకుడు)
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఖగోళ వ్యపనయందు సూర్యాది గ్రహ రథాది స్వరూప శిశుమార స్వరూప ప్రతిపాదనమను నూట ఇరువదియైదవ అధ్యాయము.
Summary of chapter 125 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the twelve Ādityas who preside over the solar disc in each of the twelve months of the year. Bhagavān Matsya lists their divine names, including Dhātā, Aryamā, Mitra, Varuṇa, Indra, Vivasvān, Pūshā, Parjanya, Tvashṭā, Vishṇu, Aṁshu, and Bhaga. Each Āditya, accompanied by specific Rishis, Gandharvas, Apsaras, Nāgas, and Yakshas, enters the solar chariot for one month to radiate heat, shower rain, and sustain living beings across the universe.