66 - సారస్వత వ్రతము

మనుః : అధునా భారతీ కేన వ్రతేన మధుసూదన

తథైవ జ్ఞానసౌభాగ్యమతి విద్యాసుకౌశలమ్

అభేదశ్చాపి దమ్పత్యో స్తథా బన్ధుజనస్య చ

ఆయుష్యం విపులం పుంసాం తన్మే కథయ మాధవ

 శ్రీమత్స్యః : సమ్య క్పృష్టం త్వయా రాజ ఇ్ఛృణు సారస్వతం వ్రతమ్

యస్య సజ్కీర్తనాదేవ సా తుష్యతి సరస్వతీ

యో యద్భక్తః పుమా న్కుర్యా దేతద్ర్వత మనుత్తమమ్

 తద్వాసరాదౌ సమ్పూజ్య విధానేన సమారభేత్

అథవాఽఽదిత్యవారేణ గ్రహతారాబలేన చ

పాయసం భోజయే ద్విప్రా న్కృత్వా బ్రాహ్మణ వాచనమ్  

 శుక్లవస్త్రాణి దత్వాతు సహిరణ్యాని శ క్తితః

 గాయత్రీం పూజయే ద్భక్త్యా శుక్లమాల్యానులేపనై

 యథా స దేవి భగవా న్భ్రహ్మా లోకపితామహః

త్వాం పరిత్యజ్య స న్తిష్ఠే తస్మా దృవ వరప్రదా

వేద శాస్త్రాణి సర్వాణి నృత్తగీతాదికం చ యత్

త్వదధీనం యథా దేవి తథా మే స న్తు సిద్ధయః

లక్ష్మీ ర్మేధా వరా పుష్టి ర్గౌరీ తుష్టిః ప్రభా మతిః

ఏతాభిః పాహి చాష్ఠాభి స్తనుభి ర్మాం సరస్వతి

మనువు మత్స్య నారాయణునితో ఇట్లనెను: సరస్వతికి సంబంధించిన ఏవ్రతము చేత జ్ఞానము సౌభాగ్యము విద్యలయందు అత్యంత కౌశలము దంపతుల నడుమను బంధుజనములోను అభేద భావము విపులమగు ఆయుష్యము లభించునో దానిని నాకు తెలుపుము. అని ఇట్లడుగగా నారాయణుడిట్లనెను: రాజా! నీవు చక్కగా ఆడిగితివి. సారస్వత వ్రతమును తెలిపెదను. దీనిని కీర్తించినంత మాత్రముననే నర స్వతి సం తుష్టయగును.

ఈ వ్రతమును చేయదలచిన భక్తుడు ఆ దినారంభమున యథా శాస్త్ర విధానమున ఆరంభించి పూజ చేయ వలయును. లేదా ఆదిత్యవారమున గ్రహ తారాబల యు కదినమున బ్రాహ్మణులచే పాయసమును భుజింపజేసి వారి చేత స్వస్తి పుణ్యాహవాచనము జరిపించవలేను. వారికి తెల్లని వస్త్రములను బంగారును ఈయవలెను. తరువాత భక్తితో తెల్లని పూవులతో సుగంధపు పూతలతో గాయత్రిని పూజించవలెను.

“దేవీ! లోకపితామహుడు భగవానుడు అగు బ్రహ్మ సదా నిన్ను విడిచియుండడు. అట్టి నీవు నాకు వర ప్రదురాలవుకమ్ము, సర్వ వేదశాస్త్రములును నృత్తగీతాది విద్యలును నీ అధీనములు. అట్టి నీకృపవలన నాకును వాటి యందు సిద్దులు కలుగుగాక ! సరస్వతీ! లక్ష్మీ-మేధా-పరా (వాస్తత్వము) పుష్టి-గౌరి-తుష్టి-ప్రభా-మతి-అను ఈ ఎనిమిది శరీరములతో కూడిన నీవు నన్ను రక్షించుము.” అని దేవిని ప్రార్థించవలయును.

ఏవం సమ్పూజ్య గాయత్రీం వీణాక్షమణి ధారిణీమ్

శుక్ల పుష్పాక్షతైర్భక్త్యా సకమణ్డలుపుస్తకామ్

మౌనవ్రతేన భుఞ్జిత సాయం ప్రాతశ్చ ధర్మవిత్

 పఞ్చమ్యాం ప్రతిపక్షంచ పూజయేచ్చ సువాసినీమ్

 తథైవ తణ్డులప్రస్థం ఘృతపాత్రేణ సంయుతమ్

క్షీరం దద్యా ద్ధిరణ్యంచ గాయత్రీ ప్రీయతా మితి

 సన్ద్యాయాంచ తథా మౌన మేత త్కుర్వ నమాచరేత్

 నా న్తరా భోజనం కుర్యా ద్యావ న్మాసా స్త్రయోదశ

 సమా ప్తేతు వ్రతే దద్యా ద్బాజనం శుక్లతణ్డులై  

 పూర్ణం సవస్త్రయుగ్మంచ గాంచ విప్రాయ శోభనమ్

 దేవ్యా వితానఖణ్డంచ సితనేత్రపటావృతామ్

చన్దనం వస్త్రయుగ్మం చ దధ్యాన్న కరకం పునః

 తతోపదేష్టారమపి భక్త్యా సమ్పూజయే ద్గురుమ్

 విత్తశాఠ్యేన రహితో వస్త్రమాల్యానులేపనై

 అనేన విధినా యస్తు కుర్యా తారస్వతం వ్రతమ్

 విద్యావా న ర్థసంయుక్తో రక్తకణ్ఠశ్చ జాయతే

సరస్వత్యాః ప్రసాదేన బ్రహ్మలో కే మహీయతే

నారీవా కురుతే యాతు సాపి తత్ఫలభాగినీ

 బ్రహ్మలోకే వసే ద్రౌజ న్యావత్కల్పాయుతత్రయమ్

సారస్వతం వ్రతం యస్తు శృణుయాదపి యః పఠేత్

 విద్యాధరపురే సోఽపి వస్తే త్కల్పాయుతత్రయమ్

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే సారస్వత వ్రతకథనం నామ

షట్షష్టిత మోఽధ్యాయః

వీణాక్షమాలా కమండలు పుస్తక ధారిణియగు గాయతిని తెల్లని పూవులతో తెల్లని అక్షతలతో పూజించవలెను. సంప్రదాయ ధర్మమును ఎరిగి యజమానుడు ప్రతిపక్షమున పంచమినాడు సాయం ప్రాతఃకాలములందు దేవిని పూజించి సువాసినిని పూజించి మౌన వ్రతము పాటించి హవిష్యమును) భుజించవలయును. కుంచెడు బియ్యమును ఘృతపాత్రమును పాలను బంగారమును ఆ ముత్తైదువకు “గాయతీ పీయతామ్” అను మంత్రముతో దానమీయవలెను. ఈ వ్రత దినమునందు సంధ్యా కాలమునందు మౌనవ్రతమును పాటించవలయును. ఇట్లు పదుమూడు మాసములు జరుపవలెను. ఈ వ్రతకాలములో నియత కాలములందు నియత భోజనము తప్ప నడుమ ఏ ఆహారమును భుజించరాదు.

ఇట్లు వ్రతము ముగిసిన తరువాత తెల్లని బియ్యముతో నిండిన పాత్రలును వస్త్రముల జతను తెల్లని కంటి ఆవరణ వస్త్రముతో కూడ చక్కని గోవును దేవిని పూజించిన మండపపు పొందినీనుంచి తీసిన ముక్కను చందనమును అంగవస్త్రముల జతను పెరుగన్నముతో నిండిన గరిగ పాత్రను కూడ దానముగ ఈయవలయును. తరువాత తనకు ఉప దేష్టయగు గురుని భక్తితో వస్త్ర మాల్య సుగంధ ద్రవ్యములతో పూజించవలయును. ఏ విషయమునను ధనమునకు లోభము చూపరాదు.

ఈ విధానము ననుసరించి సారస్వత వ్రతము నాచరించువాడు విద్యావంతుడును ధనవంతుడును మధురమగు కంఠము కలవాడునునగును. సరస్వతీ ప్రసాదమున బ్రహ్మలోకమున సుఖించును. దీనిని స్త్రీ ఆచరించినను ఈ ఫలమును పొందును. ముప్పదివేల కల్పములంత కాలము బ్రహ్మలోకమున వసించును. ఈ సారస్వత వ్రతమును వినినను చదివినను అట్టివారు కూడ ముప్పదివేల కల్పముల కాలము విద్యాధర లోకమున వసింతురు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున సారస్వత (గాయత్రీ) వ్రతము అను అరువది ఆరవ అధ్యాయము.