232 - అతివృష్ట్యాఽఽద్యుత్పాతములు-తచ్ఛాంతి.

 గర్గః : అతివృష్టి రనావృష్టి ర్దుర్భిక్షాయోభయం స్మృతమ్

 అనృతౌ త్రిదినం ము క్త్వా వృష్టి ర్ఞేయా భయానకా

అనభ్రే వైకృతా శ్చైవ విజ్ఞేయా రాజమృత్యవే

 శీతోష్ణానాం విపర్యా నే నృపాణాం రిపుజం భయమ్

 శోణితం వర్షతే య త తత్ర శభయం భవేత్

  అఙారపాంసువర్ణే తు నగరం తద్వినశ్యతి

మజ్జాస్థి స్నేహమాంసానాం జనమారభయం భవేత్

 ఫలం పుష్పం తథా ధాన్యం వరేణాతిభసూయ తు

 పాంసుజస్తుఫలానాంచ వర్షణే రోగ జం భయమ్

 ఛిద్రమన్న ప్రవర్షణ సస్యానాం భీతివర్ధనమ్

 విరజ స్కే రవో వ్యభే యదా చ్ఛాయా న దృశ్యతే

 దృశ్యతే తు ప్రతీపా వా తత్ర దేశ భయం భవేత్

 నిరభే చాథ రాత్రే పో శ్వేతం యామ్యోత్తరేణచ

ఇంద్రాయుధం యదా చోల్కాపాతం(శ్) చైవ భవే ద్యది

 దిగ్గాహపరి వేషాచ గన్ధర్వ నగరం తథా

పరచక్రభయం బ్రూయా దేశోపద్రవమేవచ

 సూర్యేచ్లు పర్జన్య సమీరణానాం యాగస్తు కార్యో విధివ ద్ధ్విజేంద్రైః

 ధనాని గౌః కాఞ్చన దక్షిణాశ్చ దేయా ద్విజానామఘనాశ హేతోః

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే అతివృష్ట్యాద్యుత్పాత శాంతి కథనం నామ ద్వాత్రింశ దుత్తర ద్విశతతమోఽధ్యాయః

 గర్గుడిట్లు చెప్పేను; అతివృష్టియు అనావృష్టియు ఈ రెండును కరవునకు నిమి త్తములు; అనృతువునందు మూడు దినములకు మించి ఎగ తెగని వాన కురియుట భయ హేతువు; మేఘములు లేక యే మెరయుట ఉరుముట పిడుగులు పడుటవంటి వైకృతములు జరిగినచో రాజు మరణించును; శీతోష్ణ వ్యత్యాసమయినచో రాజులకు శత్రుభయము; రక్తపు వాన కురిసినచో శస్త్రభయమేర్పడును; బొగ్గులు నిప్పుకణికలు ధూళి వర్షించినచో నగర నాశమగును; మడ్డ ఎముకలు నూనె మాంసము వర్షించినచో జనమృత్యు భయము; ఫలపుష్ప ధాన్యములు కురిసినచో శత్రుభయము; ధూళి ప్రాణులు పండు వరించినచో రోగభయము; అన్న వర్ష మయినచో దేశమున ఛిద్రములును సస్యములకు భీతియు కలుగును; ఆక సమున ధూళి లేక యు మేఘములు లేకయు రవి ప్రకాశించుచున్న ను నీడ కనబడక పోయినను ఎదురు రూపుతో (తలక్రిందుగా) కనబడినను దేశ భయమగును; ఆకసమున మేఘములు లేనపుడు కాని రాత్రివేళ కాని దక్షిణపు కొనలో గాని ఉత్తరపు కొనయందుగాని తెల్లని ఇంధ్రధనుస్సు కనబడినను ఉల్కాపాతమును దీర్ణాహమును పరివేషమును ఏర్పడి నను గంధర్వ నగరము కనబడినను పరచక్ర (శత్రు సేనవలన) భయమును దేశోపద్రవమును కలుగును; ఈ నిమి త్తముల శాంతి కై సూర్యచంద్ర వర్జన్య దేవతలనుద్దేశించి ద్విజ శేష్ఠులచే యథావిధి యాగము జరిపించవలెను; ధనము గోవులు సువర్ణము దక్షిణలుగా బ్రాహ్మణులకీయవలెను; దోష శాంతి యగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున అతివృష్ట్యాద్యుత్పాతములును  తచ్చాంతియునను రెండు వందల ముప్పది రెండవ అధ్యాయము.