మత్స్య మహా పురాణము
113 - భారత వర్ష వర్ణనము
ఋషయః : యదిదం భారతం వర్షం యస్మి న్స్వాయంభువాదయః।
చతుర్దశైతే మనవః ప్రజా స్తత్ర ససృఞిరే॥
ఏత ద్వేదితు మిచ్ఛామ స్త్వతో నిగడస త్తమ ।
ఏతచ్ఛ్రుత్వా ఋషీణాంతు ప్రాబ్రవీద్రోమహర్షణిః ॥
పౌరాణిక స్తథా సూతో ఋషీణాం భావితాత్మనామ్ ।
బుద్ద్యా విచార్య బహుధా విమృశ్యచ పునః పునః॥
తద్వ్యాహృతేతు సమ్భూయ స్స ఉవాచ ముదాన్వితః ।
అద్య వః కథయిష్యామి వరేస్మినారతే ప్రజాః॥
ఇదంతు మధ్యమం వరం శుభాశుభఫలోదయమ్ ।
దక్షిణంతు హిమాహ్వస్య సముద్రస్యాపిచోత్తరమ్॥
వర్షం తద్భారతం నామ యత్రీమా భారతాః ప్రజాః ।
భరణాత్తు ప్రజానాం వై నను భారత ముచ్యతే॥
నిరుక్తవచనాచ్చైవ వర్షం తద్భారతం స్మృతం ।
తత్రస్వర్గశ్చమోక్ష శ్చ మధ్యమశ్చ ఇతి స్మృతు॥
నఖల్వన్యత మర్త్యానాం భూమిః కర్మవిధౌ స్మృతా ।
భారతస్యాస్య వరస్య నవ భేదాన్ని బోధత॥
ఇంద్రద్వీపః క శేరుశ్చ తామ్రపర్ణో గభస్తిమా ।
నాగ ద్వీప స్తథా సౌమ్యా గందర్వ స్త్వథ వారణః॥
ఋషులు సూతునిట్లడిగిరి: పరమాత్మనుండి జనించిన స్వాయంభువాది చతుర్ధశ మనువులును ప్రజలను సృజించుటకు ఆశ్రయమగు భారతవర్ష స్వరూపము తాము ప్రతిపాదించగా వినవలెనని మాకు కుతూహలమున్నది. అన గౌమ హర్షణుడగు సూత పౌరాణికుడు భావితాత్ములగు ఋషుల వచనము వినీ తన బుద్దీతో బహు విధముల విచా రణము చేసి మరల మరల విమర్శము చేసికొని వారందరును కూడి అడిగిన విషయమునందు సంతోషము కలిగి. ఇట్లు పలికెను: మీకు ఇక మీదట భారత వర్షమునందలి ప్రజల విషయమును తెలి పెదను; స్వర్గ పాతాళములకు నడుమ నుండుటచే మధ్యమ మనబడుచున్న ఈ భూలోకమందును ఈ భారత వర్షము మానవులు చేసిన కర్మలననుసరించి శు భో శంభ ఫలోదయమునకు హేతువయినది. దక్షిణ మహా సముద్రమునకు ఉత్తరమునను హిమాలయము నకు దక్షిణమునను కల ఈ దేశ మే భారత వర్షమనునది. దీనియందలి ప్రజలకు భార తులని వ్యవహారము. ప్రజలను భరించు-పోషించు. నది కావుననే దీనికి భారతము అని పేరు. ఈ దేశమునందలివారికి మాత్రమే తాము చేసిన కర్మల ఫలానుసారము స్వర్గము కలుగును. సాధనానుసారము మోక్షము కలుగును. దీనికే మధ్యమ (లోక) మను వ్యవహారము సార్థకము. ఈ భూమియందు కాక మరీ ఎచ్చటీపోరికిని (వేదిక స్మార పౌరాణిక) కర్మ విధులు ఇచట వలె విధింపబడియుండ లేదు. ఈ భారత వర్షము మరల నవద్వీప (ఖండములుగా విభక్తమయి ఉన్నది. ఆపి తెలి పెదను వినుడు. 1. ఇంద్రద్వీపము. 2. క శేరు ద్వీపము -8. తామ్రపర్ణ ద్వీపము 4. గభస్తి మాన్) మత్ ద్వీపము 5. నాగ ద్వీపము 6. సౌమ్యద్వీపము 7. గంధర్వ ద్వీపము 8. వారుణ ద్వీపము 2. భారత ద్వీపము (వీనినే ఆయా ఖండములనియు ననవచ్చును. దీనిలో భరత ఖండము సమగ్ర భారత దేశ మనియు మిగిలిన ఎనిమిదియు సింహళ ము బర్మా తూర్పు ఇండియా దీవులు మలయా అనియు గ్రహింపవలయును.)
అయంతు(భారతో) నవమ స్తేషాం ద్వీప సాగరసంవృతః ।
యోజనానాం సహస్రంతు ద్వీపోయం దక్షిణోత్తరః ॥
ఆయత స్త్వాకుమారీభ్యో గజ్గాయాః ప్రభవోవధిః ।
తిర్యగూర్థ్వంతు వి సీర్ణో సహస్రాణి నవై వతు॥
ద్వీపో హ్యుపనివిష్టాయం మేచ్ఛ ర నేషు సర్వశః ।
యవనాశ్చ కిరాతాశ్చ తథా నే పూర్వపశ్చిమే॥
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్రాశ్చ భాగశః ।
ఇజ్యాయుధవణిజ్యాభి ర్వర్తయన్తో వ్యవస్థితాః॥
తేషాం సంవ్యవహారోయం వర్తతేచ పరస్పరమ్ ।
ధర్మార్థకామసంయుక్తో వర్ణానాంచ స్వకర్మను॥
సజ్కల్పపచ్యమానాత్తు ఆశ్రమాణాం యథావిధి ।
ఇహస్వర్గాపవర్గారం ప్రవృత్తిరీతి మానుషీ॥
య స్వయం నవమోద్వీప స్తిర్యగ్గ్రామః ప్రకీర్తితః ।
యఏనం జనయేత్కృత్స్నం ససమాడితి కీర్త్య తే॥
అయంలోకస్తు వైసమ్రా డ నరిక్షం విరాట్స్మృతః ।
స్వరాడసౌ స్మృతో లోకః పునర్వక్ష్యామి విస్తరమ్॥
ఈ భారతవర్షము చూడు వైపులందు సముద్రముచే చుట్టబడియున్నది. దీని దక్షిణా త్తర దైర్ఘ్యము వేయి యోజనములు; ఈ వర్గపు దక్షిణావధి కుమారీ స్థానము-ఉత్తరావధి-గంగా నది జన్మస్థానము. పొడవు వెడల్పులు పరస్పరము గుణించగా ఆగు వైశాల్యము తొమ్మిది వేల చదరపు యోజనములు. దేశపు పూర్వ పశ్చిమో త్తర దిశల ఆంతములయందు అంతటను మ్లేచ్చులగు యవనులును కిరాతులును ఉపనివేశ ముల నేర్పరచుకొని వసించుచున్నారు. ఇక నడుమయందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములవారు ఆయా తావులయందు యజనము ఆయుధవృత్తి వాణిజ్యము జీవనోపాధులుగా వర్ధిల్లుచు వ్యవహరించుచు నివసించుచున్నారు. వారియందు పరస్పర భేదముండని ఏకరూప సమాన వ్యవహారమును కలదు. ఆయా వర్ణములకును ఆశ్రమములకును విహితములగు కర్మలననుష్ఠించుచు ధర్మార్థ కామ మోక్షము ల పై సంకల్ప పూర్వకముగా యత్నము చేయుటలో వీరందర వ్యవహారమును సమముగా నుండును. ఇచటి మానవుల ప్రవృత్తియంతయు ఇహలోక జీవనము విషయమున గాక పరమున స్వరమునో అపవరము (మోక్షము)నో సాధించుటకు అభిముఖ మైయుండును. ఈ చెప్పిన తొమ్మిదింటిలో తొమ్మిదవదియగు భారత ద్వీప (భరతఖండ)మునకు తిర్యగామమని తూర్పు పడమరలుగా వ్యాపించిన వీథి నిర్మాణముగల గ్రామములు గలదియని వ్యవహారము కలదు. ఈ లోకమునంతటిని సృష్టించు సృష్టికర్తకు ‘నమ్రాట్’ అని వ్యవహారము; ఇంతియకాక-భూర్-భువర్-సువర్ అను మూడు వ్యాహృతులలో మొదటి దానికి అర్హనుగు ఈ మధ్యమ లోకమునకు సమ్రాట్ అనియు భువర్ అను వ్యాహృతికర్థమగు అంతరిక్ష లోకమునకు విరాట్ ఆనియు సువర్ అను వ్యాహృతి కర్ధమగు ద్యులోకమునకు స్వరాట్ అనియు వ్యవహారము. వీనిలో మొదటిదియు స మాట్ అనబడునదియునగు ఈ లోకపు. భరత వర్షపు. విస్తరమును ఇంకను చెప్పెదను.
సప్త(నవ) మేస్మి న్మహావర్షే విస్తృతాః కులపర్వతాః।
మ హేంద్రో మలయస్సహ్య శ్శుక్తి మా నృక్ష వానపి ॥
విన్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతాః ।
తేషాం సహస్రశశ్చన్యే పర్వతాస్తు సమీపతః॥
అభిజ్ఞాతాః పర్వవన్తో విపులా శ్చిత్రసానవః ।
అన్యే తేభ్యః ప్రతిజ్ఞతా హ్రస్వా స్వల్పోపజీవినః॥
తై ర్విమిశ్రా జనపదా ఆర్యా మేచ్ఛాశ్చ సర్వతః ।
పిబ ని బహుశా నద్యో గజ్గాం సిందుం సరస్వతీమ్॥
గజ్గాదినదీవర్ణనమ్
శతద్రూం చన్దదాగాంచ యమునాం సరయూమపి ।
శరావతీం వితస్తాంచ విపాపాం దేవికాంకుహూమ్॥
గోమతీం ధూమపాపాంచ బాహుదాంచ దృషద్వతీమ్ ।
కౌశికీంచ తృతీయాంతు నిశ్చారిం గణకీంతభా॥
బహు హిత్య ఇత్యేతా హిమవత్పాద నిస్సృతాః ।
వేదస్మృతిం నేత్రవతీం వితస్తాం సిన్దుమేవచ॥
పర్ణాసాం నర్మదాంచైవ కౌబేరీం మహతీంతథా ।
వారాం చన్హవతీం యూదాం విదుషాం వేణుజీవికామ్॥
శిప్రామవ స్త్రీం కౌంతీంచ పారియాత్రా న నిస్సృతాః ।
శోణం మహానదంచైవ సన్దినీం సుకృతాం కృశామ్॥
మన్దాకినీం దేవపర్ణాం చిత్రకూటాం తథైవచ ।
తమసాం పిప్పలాం శోణాం కరతోయాం తథామ్బికామ్॥
చిత్రోపలాం విశాలాంచ మధురాం బహువాహినీమ్ ।
ము క్తిం మన్దాకినీం లజ్జం మకుటో ద్భేది కామపి॥
ఋక్షవతః ప్రసూతాస్తా సద్యోమలజలాశ్శుభా।
తాపీంపయోషీం నిర్వీన్ద్యాం శీ(క్షి) ప్రాంచ వృషభాం నదీమ్॥
వేణీం వైతరణించైవ విశ్వమాలాం కుముద్వతీమ్ ।
తోయాంచైవ మహాగౌరీ దుర్గమాంతు శిలాంతథా॥
విన్ద్యపాదప్రసూతాస్తా స్సర్వా శీతజలా శ్శుభాః ।
గోదావరీ భీమరథీ కృష్ణ వేణీచ వఞ్జశా॥
తుజ్గభద్రా సుప్రయోగా బాహ్యా కావేరి రేవచ ।
దక్షిణాపథనద్యస్తా స్సహ్యపాదా ద్వినిస్సృతాః॥
తమాలా తామ్రపర్ణీ పుష్పజా హ్యుత్పలా అపి ।
మలయప్రసృతా నవ్య స్సర్వా శ్శీతజలాశ్శుభాః॥
విషమా సర్పకుల్యాచ ఇక్షుజా త్రిదివాచలా ।
తామ్రపర్ణి తథామూలీ శరారీ విమలాతథా॥
మ హేంద్రతనయా స్సర్వాః ప్రఖ్యాతా శ్శుభగామినీః ।
కౌశికా సుకుమారీచ మనగా మనవాహినీ॥
కృపా పలాశినీచైవ శుక్తిమత్పర్వతోద్భవాః ।
సర్వాః పుణ్య జలాః పుణ్యా స్సమగ్రాశ్చ సముద్రగాః॥
ఏతాః పుణ్యజలా నద్యో మహాద్రి తనయా శ్శుభాః ।
విశ్వస్య మాతర స్సర్వా సర్వపాపహరా శ్శుభా॥
తాసాం నద్యుపనదశ్చ శతశోథ సహస్రశః ।
ఏడ (తొమ్మిద)వదగు ఈ మహావరమునందు ఏడు విశాల కులపర్వతములు మ హేంద్రము.మలయము.సహ్యము శుక్తిమాన్ ఋక్ష వాన్.వింధ్యము . పొరియాత్రము. అనునవి కలవు. వీటికి సమీపములందు ఈ కులపర్వతములకు సంబం ధించినవి ఇవి అని గుర్తింప వీలగు లక్షణములు కలవి.పర్వములు (బుడిపేలు-ఉబ్బు-ఎత్తులు) కలవీ విశాలము లే చిత్రములై వివిధ లక్షణములు కలిగి అచ్చెరువు గొల్పు నేత్రములు (ఉన్నత సమతలములు) కలవి అగు శాఖా పర్వతములు వేలకొలదిగ కలవు. ఈ శాఖా పర్వతములకు అనుబద్దములై వీనికి పిలకలవలె పుట్టినవి.పొట్టివిఎన్వల్పమగు ఉపజీవనము (వృద్ధియు శిలాదార్ద్యమును కలవియగు చిన్న గుట్టలు మరి వేల కొలది గలవు. ఈ పర్వతములతో శాఖోపశాఖా పర్వతములతో ఏమిశ్రములగు (వీనికి చుట్టు పట్టులనో వీని నడుమనో ఉన్న) జనపదములు (పల్లెలు) న్న వి. వానియందు ఆర్యులును మ్లేచ్చులును ఆంతట నివసించుచున్నారు. వారు ఆయా ప్రదేశములందు గంగా సింధు సరస్వతీ శతద్రూ చంద్రభాగా యమునా సరయూ శరావతీ వితస్త్ర విపా పాశా). దేవికా కుహూ గోమతీ- ధూమపాపా బాహుదా దృషద్వతీ కౌశికీ తృతీయా నిశ్చారీ గండ కీ బహు లోహితా నదులనేడుహిమవత్పాదములనుండి జనించిన సదుల (జలము)ను వేదస్మృతి వేత్రవతీ వితస్తా సింధు- పర్ణాసా నర్మదా కౌబేరీ మహతీ వారా చంద్రవతీ యూపొ విదుషా వేణు జీవి ఆ శి ప్రావంతీ కౌంతీ నదుల నేడు పొరియాత్రగిరి పరిసరములనుండి జనించిన నదుల (జలము)ను శోణ మహానద నందినీ సుకృ కృశా. మందాకినీ (ఇది గంగానది కాదు.) దేవ వర్ణ చిత్ర కూటా తమసా పిప్పలా శోణా కర తోయాంబికా చిత్రోవలా విశాలా మధురా బహు వాహినీ ముక్తి మందాకినీ (ఇది మరియొకటి) లజ్జా మకుటోద్భేది కా నదులనేడు అమల జలయుతములగు ఋక్షవత్పర్వత సంజాత నదుల (జలము)ను తాపీపయోష్ఠి నిర్వీంధ్యా శ్రీపావృషభా వేణీ వైతరణీ విశ్వమాలా కుముద్వతీ తోయా మహాగౌరీ దుర్గమా శిలానదులనెడు వింధ్య పాదమునుండి ప్రభవించిన మరి కొన్ని నదుల (జలమును శుభ శీతజలములగు గోదావరీ భీమరథీ కృష్ణవేణీ వంజు తుంగభద్రా సుప్రయోగా బాహ్యా కావేరీ నదులనేడు సహ్య పర్వత పాద నంజాత దక్షిణాపథ నదుల జలము)ను కృతమాలా తామపర్ణీ పుష్ప జోత్పలా నదులనేడు శుభ శీత జలములగు మలయ పర్వత పాద సంజాత నదుల జలము)ను విషమా సర్వకుల్యేకుజ, తిదీవాచలా తామ్రపర్ణీ మూలీ శరారీ విమలా నదులనేడు శుభ ప్రవాహ యుతములగు మ హేంద్ర పర్వత - సంజాత నదుల (జలము)ను కౌశికా సుకుమారీ మందగా మంద వాహినీ కృపా - పలాశిని నదులనెడు శు శ్రీమత్పర్వత సంజాత ములును పుణ్య జలయుతములును పుణ్యకరములును సమగ్రములును సముద్రము గామినులును నగు నదుల (జలమును తావుచు జీవించుచుందురు. ఈ చెప్పిన నదులన్నియును పుణ్య జలవంత ములు.మహాద్రి సంజాతములు-విశ్వమునకు తల్లులవంటివి.సర్వ పాపహరములు - శుభకరములునై నవి. ఈ నదులలో కలి సెడి చిన్న నదులును ఉపనదులును నూరుల కొలదిగా వేలకొలదిగా గలవు.
కురుపఞ్చాలాదిదేశాః
తాస్విమే కురుపాఞ్చాలా స్సాళ్వా శ్చైవ సజాజ్గాలాః॥
శూర సేనాథ కామ్భోజా ఆంద్రాశ్చైవ సబర్బరాః ।
మత్స్యాః కిరాతాః కుల్యాశ్చ కాశీకు స్తలకోసలాః॥
అవనా శ్చానులిష్ణోశ్చ మూకా శ్చైవామ్బకై స్సహ ।
మధ్యదేశ్యా జనపదాః ప్రాయశః పరికీర్తితాః॥
ధన్యస్స దేశ మ నవ్యో యత్రగోదావరీనదీ ।
పృథివ్యామపి కృత్స్నాయాం స ప్రదేశ్ మనోరమః॥
యత్ర గోవర్దనా నామ నగరీచ వినిర్మితా ।
రామప్రియార్థం సుగ్రీవఋ జై ర్దివ్యా సభౌషధీః॥
భరద్వాజేన మునినా యతియార్థవతారితాః ।
తస్మాత ప్రవరో దేశ సేన జట్లే మనోరమః॥
బాహ్లికా రాజధాన్యాశ్చ ఆధీరాఃకాలతోయకాః ।
పరాన్జా శ్చైవ శూద్రాశ్చ పప్లవా శ్చోపఖజ్జితాః॥
గాన్గారా యవనా శ్చైవ సిన్హుసౌవీరమద్రకాః ।
శశాకా) హూణాః కశిజ్ఞాశ్చ పారదా హారమూర్తికాః॥
రామఠాః కర్ణికారాశ్చ కేకయా దశ నాసికాః ।
క్షత్రియోపనివేశాశ్చ వైశ్యాశూద్రజనా అపి॥
ఆత్రేయాశ్చ భరద్వాజాః ప్రస్థలా స్సర మేర కాః ।
లమ్బకా స్థలబాణాశ్చ సైనికా సహజాజ్ఞలైః॥
ఏతే దేశా ఉదీచ్యాస్తు ప్రాచ్యానేశా న్ని బోధత ।
అజ్ఞా వజ్జా మడ్డువకా ఆ నర్గిర బహిర్గిరాకి తతః
ప్లవజ్జమాతజ యమకామలవర్ణ కాః ।
సహ్యోత్తరాః ప్రవిజయా భార్గవా గేయమాళ వాః,
ప్రగ్జ్యోతిషాశ్చ పుణ్డ్రాశ్చ విదేహా స్తామ్రలిప్తగాః ।
సాళ్వా మాగధగోనర్ష్ణాఃప్రాచ్యాం జనపదాః స్మృతాః॥
ఆ నదుల నడుమ ఈ చెప్పబోవు దేశము లనేకములు గలవు. (అవి మధ్యదేశములు - ఉదీచ్య దేశములు - ప్రాచ్య దేశములు-దక్షిణాపథ దేశ ములు-అపరాంత దేశములు.వింధ్య పృష్టస్థ దేశములు-పార్వతీయ దేశములు అని ఆరు విధములుగా విభజింపబడినవి. వానిలో మొదట *మధ్య దేశ జనపదములు:) కురువులు పాంచాలములు సాశ్వ ములు జాంగలములు (పంటకు అంతగా పనికిరాని భూములు కల జనపదములు) శూర సేనములు కాంభోజములు ఆంధ్రములు బర్బరములు మత్స్యములు కిరాతములు కులములు కాశిజనపదములు కుంతలములు - కోసలములు ఆవంత ములు అనులింగములు మూక ములు అంబకములు - ఇవి మధ్యదేశ జనపదములలో చాలవరకు అయినవి: (మధ్య దేశము అనగా హిమాలయపు దక్షిణపు అంచునకును వింధ్యపు ఉత్తరపు అంచునకును నడుమ కురు క్షేత్రమునకు తూర్పున ప్రయాగకు పడమటగల దేశము.)
గోదావరినది ప్రవహించు దేశము ధన్యము; పృథివియంతటిలోను అది మనోరమము. ఈ - నదీతీరమునందే శ్రీరామ ప్రీతికై సుగ్రీవాది వానరులును ఋక్షులు జాంబవజాతీయులు)ను 'గోవర్ధన' అను నగరిని నిర్మించిరి. భర ద్వాజ మునియు ఆ శ్రీరామ ప్రీతి కే దివ్యౌషధులను భూమి కవతరింవజే సెను. కావుననే ఆ దేశ శేష్ణ ము మనోరమమయ్యెను.
ఇక ఉదీచ్య దేశములు: బాహ్లికములు - రాజధాన్యములు ఆభీరములు ఆకాలములు తోయక ములు పరంధములు శూద్రములు దేశ నామము) పప్లవములు ఉపఖండితములు గాంధారములు యవనములు సింధువులు సౌవీరములు మద్రకములు శశకములు హూణములు కళింగములు పాఁదములు హార ములు పూర్తికములు రామ ఠములు కర్ణికారములు కేక యములు దశ నములు అసికములు క్షత్రియ వైశ్య శూద్రుల ఉపనివేశములు ఆత్రేయములు భరద్వాజములు ప్రస్థలములు రమేరక ములు లంబక ములు స్థల బాణములు సైనికములు జాంగ లములు అను ఈ జన పదములు ఉదీచ్యములు.
ఇక ప్రాచ్యజనపదములు: అంగములు వంగములు మండుకములు ఆంతర్గెర ములు బహిర్గిరములు (పర్వతము లకు లోపల-వెలుపల ఉండునవియని ఆర్థము ) ప్లవంగములు మాతంగములు యమకములు ఆమలవర్ణకములు సహ్యోత్తర ములు ప్రవిజయములు భార్గవములు గేయములు చూళవములు ప్రార్ణ్యోతిషములు పుండ్రములు విదేహములు తామలి ప్రక ములు స్వాములు మాగధములు గోనర్ణములు అనునవి ప్రాచ్యజనపదములు.
(* శరావతీనది సీమా రేఖగా దానికి పశ్చిమో తరమునం(లం)దు ఉండిన ఉత్తర భారత దేశమునకు ఉదీచ్యదేశము అనియు ఆనది కే ప్రాగ్గక్షిణములందు ఉన్న ఉత్తర భారత దేశమునకు ప్రాచ్య దేశము అనియు పూర్వుల వ్యవ హారము. ఇట్లుత్తర భారత దేశమునందలి దేశములన్నియు ఉదీచ్యములు ప్రాచ్యములు అని రెండు విధములే అగు చున్న వి దేశ ములకు పూర్వము జనపదములనియే ఎక్కువ వాడుక. జనపదములే గ్రామములే) అధికముగా ఉండుటచే వాని సముదాయమునే ఒక పాలనా విభాగముగా గ్రహించుటచే ఈ వాడుక ఏర్పడియుండును. కనుక నే కురువులు ఇత్యాది దేశ నామములు బహువచనములు.)
తేషాంపరే జనపదా దక్షిణాపథవాసినః ।
పాణ్డ్యాశ్చ కేరళాశ్చైవ చోళాః కుల్యా స్త థై వచ॥
సేతుకా మూషికా శ్చైవ కుపథాశ్చారవాసికాః ।
నవరాష్ట్రా మాహిషకాః కశిజ్జా శ్చైవ సర్వశః॥
కావేర్యాశ్చ మహాశ్రీకాః కేరా ఖ్యా సృవరా స్తథా ।
పుళిన్హా విన్ష్యభూతాశ్చ మూషకా దబ్ద కైస్సహ॥
కులపాశ్చ నిరాభాశ్చ రూపసా స్తార నైస్సహ ।
సదనా స్తథా తరుణికా యేచ సర్వాకరా స్తథా॥
వాసిక్యాశ్చైవ యేచాన్యే యేచై వానర నర్మదాః ।
బెరుక చ్చాః సమా హేయా స్సహసార స్వతై స్సహ॥
కాశ్మీరా శ్చైవ సౌరాష్ట్ర ఆనన్దా హ్యర్బుదై స్సహ ।
ఇత్యేతే అపరా నాస్తు శృణు తే విన్ష్య వాసినః॥
మలకా దాశ్చ కరూషాశ్చ మేలకా శ్చేలకై స్సహ ।
ఆర్దాశ్చ షోడశార్ణాశ్చ భోజాః కిష్కిన్ద కైస్సహ॥
గోసహ్యాః కోసలాశ్చైవ శ్రీపురా వైదికా స్తథా ।
తుసురాస్ తుమ్బురా శ్చైవ పడుమా నైరథై స్సహ॥
ఉత్తరాశ్చ దశా శ్చైవ కామ్భో మాగధై స్సహ ।
కౌసలాః కోసలాశ్చైవ క్రేపురా వేదికా స్తథా॥
మర్మరా ఘూర్జరా శ్చైవ తావద్గృహబలై స్సహ ।
అ న్తపా స్తుణ్ణికారాశ్చ వీతిహోత్రా హ్యవనయః॥
ఏతే జనపదాః ఖ్యాతా వినవృష్ణనివాసినః ।
ఆతో దేశా నవక్ష్యామి పర్వతాశ్రయిణశ్చ యే॥
నీహారా హిమవర్గాశ్చ కున్తోదాః కుశ లావహాః ।
కర్ణ ప్రావరణాశ్చాపి ఊర్వా దర్వాః సమద్రకాః॥
త్రిగర్తా మండ లా శ్చైవ కిరాతాశ్చామరైః సహ ।
ఇక దక్షిణాపథ జనపదములు: పాండ్యములు కేరళములు చోళములు కుల్యములు సేతుక ములు మూషికములు కుపథములు చార వాసికములు నవరాష్ట్రములు మాహిషకములు క శింగములు కావేర్యములు మహా శీకములు కేరములు సవరములు. ఇవి దక్షిణాపథమునందలి జనపదములు.
ఇక అపరాంత (పశ్చిమ దిశయందలి) జనపదములు: పుళిందములు (నేటి బుందేల్ ఖండ్) వింధ్యభూతములు మూషకములు దండకములు కులపములు నీరాభములు రూపసములు తారసములు సదనములు తరుణికములు సర్వాకర ములు నాసిక్యములు ఆంతర నర్మదములు భరుక చ్చములు మా హేయములు సారస్వతములు కాశ్మీరములు సౌరాష్ట్రములు ఆర్బుదములు. ఇవి అపరాంత జనపదములు (భారతదేశపు పడమటి దిశ లో పశ్చిమ సముద్రవరకు వ్యాపించిన ప్రదేశ మందలి జనపదములు.)
ఇక వింధ్య పర్వతముతో సంబంధముగల జనపదములు: మలడములు క రూశములు మేలకములు చేలక ములు అర్ధములు షోడశార్ణములు భోజములు కిష్కింధకములు గోసహ్యములు కోసలములు శ్రీపురములు వై దికములు తుసుర ములు తుంబురములు పడుమములు నై రథములు ఉత్తరములు దశములు కాంభోజములు మాగధములు కొసలములు కోసల ములు కై పురములు వేదికములు మర్మరములు ఘూర్జరములు గృహ బలములు అంతపములు తుండికా కేరములు వీతి హోత్రములు అవంతులు -ఇవి వింధ్యమును ఆశ్రయించియుండు జనపదములు.
ఇక ఇతర పర్వత ప్రాంతములందును పర్వతములందును ఉండు జనపదములు: నీహారములు హిమవర్తములు కుంతోదములు కుశ లావహములు కర్ణ ప్రావరణములు ఊర్ణములు దార్వములు మద్రకములు త్రిగర్తములు (తిర్ హుత్) మండలములు కిరాతములు చామరములు (చమరీపశువు లుండు జనపదములు)- ఇవి పర్వతాశ్రయి జనపదములు.
[ఈ చెప్పిన జనపదముల పేరులలో కొన్ని ఆయా స్థానములందలి గుణలక్షణములను బట్టి ఏర్పడినవి. కొన్ని ఆచట నివసించు జనులను బట్టి ఏర్పడినవి. కొన్ని మన కీనాడు తెలియని ఏ భాషకో చెందినవి.
ఈ జనపదములు కూడ మనకు తెలిసిన కొన్ని ఈనాడు మన మను కొనుచోట కాక మరియొక ప్రాంత మున నున్నట్లు ఇచట కనబడు చున్నది. మరికొన్ని దేశ నామములు రెండుచోట్ల వచ్చు చున్నవి. ఇందులకు హేతువులను జాగ్ర తతో.. పరిశీలించుకొన నగునే కాని అవి తోచినట్లు వ్రాసిన పుక్కిటి పురాణము, మాత్రము కాదు. ఉదాహరణమునకు ‘ఆంధ్ర’ జనపదము మధ్యదేశ జనపదములలో సున్నది. నే ఓ ఆంధ్రదేశ ము దక్షిణాపథ మునం దున్నది. నేడును మధ్య దేశమున ఆంధ్రులు చాలమంది యుండుట ప్రసిద్దము. దీనిని బట్టి చూడగా ఈ ఆంధ్రులు పూర్వము మధ్యదేశీయు లేయై యుండి వారిలో కొందరు దక్షిణాపథమున కూడ వ్యాపించి రేమో యనియు. ఆలోచింపవలయును. ఇట్లే మరికొన్ని జనపద ముల విషయమును.]
సూతః : చత్వారి భారతే వర్షే యుగాని మునయోబ్రువన్॥
కృతం త్రేతా ద్వాపరం చ కలి శ్చేతి చతుర్యుగమ్ ।
తేషాం స్వరూపం వక్ష్యామి హ్యుపరిష్టాత్తు కృత్స్న శ॥
ఏతచ్చుత్వాతు ఋషయ ఉత్తరం పున రేవతే ।
శుశ్రూషవో ముదా యు క్రా హ్యట్రువ నోమహర్షణీమ్॥
ఋషయః : జమ్బూద్వీపస్య విస్తారం తథాన్యేషాం ద్విజోత్తమ ।
ద్వీపానాం వాసిన్హాం తేషాం వృక్షాణాం ప్రబ్రహీహి నః॥
యచ్చ కెమ్పురుషం వరం హరివర్షంత థై వచ ।
ఆచక్వవై యథాత త్త్వం కీర్తితం భారతం త్వయా॥
పృష్ట శ్చైవ తథా విపైర్యథావృష్టం విశేషతః ।
ఉవాచరి పురాణాని యథాచైవ నరోత్తమ॥
కింపురుషాదివర్షవర్ణనమ్
సూతః : శు శూషా యది వో విప్రా స్తచ్ఛృణుధ్వ మతంద్రితాః ।
జమ్బూషణ్డః కిమురుషో సుమహా న్న ననోపమః॥
దశవర్ష సహస్రాణి స్థితిః కిమ్పురుషే స్మృతః ।
జాయంతే మానవా స్తత్ర(సుతప్త) నిర్ఘృష్టక నక ప్రభా॥
వరేకిమ్పురుషేపుణ్య ప్లక్క్షో మధు వహస్స్మృతః ।
తస్య కమ్పురుషాస్సర్వే సిబన్లో రసము త్తమమ్॥
అనామయా హ్యశోకాశ్చ నిత్యం ముదిత మానసాః ।
సువర్ణవర్ణాశ్చ న శ్రియ శ్చాప్సరసోపమా॥
సరం కమ్పురుషాద్వరం హరివర్షం ప్రచక తే ।
సరా రాజత సజాశా జాయ నే తత్రమాసః ॥
దేవలోక చ్యుతా స్సర్వే దేవరూపాశ్చ సర్వశ ।
హరివద్దే నరాస్సర్వే ఇచ్ఛ నీకుర సం శుభమ్॥
న జరా బాధతే తత్ర ఏతే జీవ నివై చిరమ్ ।
ఏకాదశ(త్రయోదశ) సహస్రాణి లేపామాయుః ప్రకీర్తితమ్॥
ఈ భారతవర్షము నందు కృత త్రేతా ద్వాపరక లులు అను నాలుగు యుగములు వ్యవహార మునం దుండునని మునులు వచించిరి. ఈ చతుర్యుగ స్వరూప లక్షణములను ఇక మీదట ఏమియు పిడువక అంతయు చెప్పెదను. ఆసగా ఋషులు ఇంతవరకు అతడు చెప్పినదే మరికొంత వినరి సంతోషముతో కూడిన కుతూహలము తో నిట్లనిరి: ద్విజో తమా! జంబూద్వీప తదితర ద్వీప విస్తర మును వానియందు వసించు మానవులయు ఉండు. వృక్షములయు వివరణ మును మాకు తెలుపుడు. మీరు భారతవరమును యథాతత్వముగ మాకు తెలిపితి. హరి కింపురుష వరములను కూడ తెలుప వేడెదము. అనగా సూతు డిట్లనెను: విప్రులారా! మీకు వినగోరిక కలదేని సావధానులై వినుడు. కింపురుష వర మున సందసవనమువంటి జంబూ(నేరేడు)వనము కలదు. అచట వారి ఆయువు పడి వేలేండ్లు. వారి దేహకాంతి మెరుగు పెట్టిన బంగారు కాంతి. ఆ ద్వీపమున తేనెలు ప్రవహించు జువ్విచెట్టు కలదు. అచటి వారు. దాని ఉత్తమ రసము తావి రోగ శోక రహితులై సదా ముదిత మానసులై ఉందురు. అచటి స్త్రీ లప్సరసలవంటి సుందరులు. దాని కవతలిది హరివరము. అచటి జనులు వెండి కాంతిబోలు దేహచ్ఛాయ కలవారు. దేవలోక పరిభ్రష్టులు అచట జనింతురు. వారు దేవతలను పోలి యుందురు. వారు చెరకు రసమును తాపి జబాధలు లేక పదునొకండు వేలేండ్లు జీవింతురు.
మధ్యమం యన్మయా ప్రోక్తం నామ్నా వర మీశావృతమ్ ।
న తత్ర సూర్య స్తపతి తే న జీర్య స్తి మానవాః॥
న చంద్రసూర్యౌ నక్షత్రం న తత్ర పవనానలౌ ।
పద్మప్రభాః పద్మవర్ణాః పద్మపత్రనిభేక్షణాః॥
పద్మగనానువర్ణాశ్చ జాయ నే తత్ర మానవాః ।
జమ్బూఫలర సాహార మశ్న న స్తే సుగన్దినః॥
దశపజ్చసహస్రాణి వర్షాణాం తే నరోత్తమాః ।
ఆయుఃప్రమాణం జీవ ని వర్షే యే తు ఇళావృతే॥
తస్య జమ్బూఫలరసో నదీ భూత్వా ప్రసర్పతి ।
మేరుం ప్రదక్షిణం కృత్వా జమ్బూమూలం గతా పునః॥
తు పిబ ని సదాతుష్టా జమ్బూరస మిలావృతే ।
జమ్బూఫలరసం పీత్వా న జరా బాధతే చ తాన్॥
న క్షుధా న క్లమశ్చాపి న మృత్యుర్న చ వై జరా ।
తత్ర జామ్బూనదంనామ కనకం దేవభూషణమ్॥
ఇన్దగోపప్రతీకారం జాయతేపో స్వయంచ యత్ ।
సర్వేషాం వర్ష వృక్షాణాం శుభ ఫలరసస్తు సః॥
సన్నంతు కాఇనం శుభ్రం జాయతే దేవభూషణమ్ ।
తేషాం మూత్రం పురీష నివా దీక్వష్టాసు చ సర్వదా॥
ఈశ్వరానుగ్రహాద్ భూమి స్తేషాంతు గ్రసతే మృతాక్ ।
రక్షఃపిశాచయక్షశ్చ సర్వే హేమయుతాస్తు తే॥
హేమకూటేతు గగ్గర్వా విజ్ఞేయా స్సాప్సరోగణాః సర్వేనాగా షేవనే శేషవాసుకితక్షకాః॥
మహా మేరౌ త్రయస్రాంశ తీగ నే చాజ్ఞయా సురాః ।
నీలవైదూర్యయు కేస్మి నదా బ్రహ్మర్షయోఒవసక॥
దైత్యానాం దానవానాంచ శ్వేతఃపర్వత ఉచ్యతే ।
శృజపా నర్వత శ్రేష్ఠః పితృణాం ప్రతిసఇ్చరః॥
ఇత్యేతాని మయోక్తాని నవవర్షాణి భారతే ।
భూతైరపి నివిష్టాని గతిమ నీ ధ్రువాణిచ॥
తేషాంవృద్ధి ర్బహువిధా దృశ్యతే దేవమాను షైః ।
ఆశ క్యా వరిసజ్ఞ్యాతుం శ్రద్ధీయావై మయోదితాః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే భూగోళే భారతాదివర్షవర్ణనం నామ
త్రయోదశోత్తరశతత మోధ్యాయః।
భారత కేతుమాల భద్రాశ్వ కురువరి ముల నడుమ నున్నదని నేను లోగా చెప్పిన ఇలావృత వర్షమున సూర్యుడు తపింపడు. అచటి వారికి శైథిల్యము కాని వార్ధకము గాని లేదు. అచట చంద్ర రవి నక్షత్ర పవనాగ్ను లతో పని లేదు. అచటీవారు పద్మ కాంతి పద్మవర్ణము పద్మపత్ర నేత్రములు పద్మ గంధ సదృశ గంధము కలిగి అచటి జంబూ ఫల రసపానముచే పదునై దు వేల ఏండ్లు జీవింతురు. వారికి వార్ధకము ఆక లిబడలికలు మృత్యువు లేవు. ఇదంతయు వారు తావు జంబూ ఫలరస మహిమమే. ఆ రసము నదియై మేరువును ప్రదక్షిణించి మరల జంబూ వృక్ష మూలమును చేరును. అచటి దేవులకును మానవులకును సహజ కనకమయ భూషణములే. అవి ఇంద్రగోప కీటముల ఆర్ద్రపురుగుల)వన్నె తో నుండును. ఏలయన అన్ని వర్షములందలి ఆయా ఫలరసము లును ప్రవహించి నిర్మలమగు బంగారయి దేవభూషణ మగును. ఆచటి వారి మూత్ర పరీషములును అష్టదిశలందును సువర్ణ మే సదా ప్రకాశించును. ఈశ్వర సంకల్ప రూపాను గ్రహమున వారిలో కొందరిని అచటి భూమి మింగివేయును. అదియే వారికి మృతి. అచట వసించు రక్షః పిశాచయములును సువర్ణవంతులే.
హేమకూట పర్వతమున గంధర్వాప్సరసలు శేషవాసుకి తక్ష కాది మహానాగులు వసింతురు. మహామేరు పర్వత మున ముప్పది ముగ్గురు దేవతలును (ఏకాదశ రుద్రులు. ద్వాదశాదిత్యులు - అష్టవసువులు. ఇద్దరు అశ్వినులు) సదా వసింతురు. నీల వైదూర్యమణియుతమగు దీనియందు సదా బ్రహ్మరులు నివసింతురు. శ్వేత పర్వతమునందు దైత్యులు దాన వులు నివసింతురు. శృంగవత్పర్వతము శ్రేష్ఠమయినదియు పితృ దేవతలకు లయాత్మకమయినదియు; (పితృ దేవతలు దీనియందు లయమునొంది అదృశ్యరూపులై యుందురు.)
ఈ విధముగ నేను మీకు భరతవర్షము మొదలుగా నవవరముల విషయము తెలిపితిని. వీనియందు ఆయా స్థిర చర భూతములు నివసించుచున్న వి. దేవమాన మానుషమానముల ననుసరించి వాని పరిమాణాదిక మును జనన వృద్దులు ఆయువు మొదలగు పరిమాణములును బహు విధములుగా పెద్దలు చెప్పుచున్నారు. దానిని స్పష్ట రూపమున ఇది ఇట్లని చెప్పుట శక్యము కాదు. కావున నేను చెప్పిన ఈ విషయము లన్నీ యు ఆస్తికతా ప్రామాణిక తా భావములతో విశ్వసింప విలసినది.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున భూగోళ వర్ణనమున సప్తద్వీప వర్ణనమున జంబూద్వీప వర్ణనమున భారతాది వర్ష వర్ణనమను నూట పదుమూడవ అధ్యాయము.
Summary of chapter 113 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya transitions the discourse to cosmic geography, providing King Vaivashvata Manu with a detailed account of the structure of the earthly realm divided into seven vast island-continents known as Sapta-dvīpas. Bhagavān Matsya begins with Jambūdvīpa, situated at the center of the world, surrounded by the salt-water ocean. At the heart of Jambūdvīpa stands the magnificent golden mountain Mount Meru, shining like a sun and serving as the central pillar of the cosmic order around which the sun, moon, and stars revolve.