మత్స్య మహా పురాణము
143 - ద్వాపర_కలి_యుగధర్మములు - అందు ద్వాపర యుగధర్మము
సూతః : అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి ద్వాపర స్య విధిం పునః।
తత్ర త్రేతాయుగే క్షీణే ద్వాపరం ప్రతిపద్యతే॥
ద్వాపరాదౌ ప్రజానాంతు సిద్ది స్త్రేతాయుగేతు యా ।
పరిపృత్తే యుగే తస్మిo స్తత స్తా వై ప్రణశ్యచ॥
తతః ప్రవర్తతే తానాం ప్రజానాం ద్వాపరే పునః ।
లోభో భృతి ర్వణీ గ్యుద్ధం తత్త్వానా మవినిశ్చయమ్॥
ప్రధ్వంసా శ్చైవ వర్ణానాం కర్మణాంతు విపర్యయః ।
యజ్ఞో వధః పరో ద ణ్డో మానో దర్పః క్షమా బలమ్॥
తథా రజస్తమో భూయః ప్రవృతే ద్వాపరే పునః ।
ఆద్యే కృతే నాథర్మోఽ స్తి స త్రేతాయాం ప్రవర్తితః॥
ద్వాపరే వ్యాకులో భూత్వా ప్రణశ్యతి కలౌ పునః ।
వర్ణానాం ద్వాపరే ధర్మా స్సజ్గీర్యన్తే తథాఽక్రమాః॥
ద్వైధ ముత్పద్యతే చైవ యుగే తస్మి ఞ్చ్రాతి స్మృతౌ।
ద్విధా శ్రుతి స్మృతి శ్చైవ నిశ్చయో సాధిగమ్యతే
ఆనిశ్చయోపగమనా ద్ధర్మతత్వం న విద్యతే ।
ధర్మత త్త్వే హ్యవిజ్ఞాతే మతిభేదస్తు జాయతే॥
పరస్పరం విభిన్నై స్తై ర్దృష్టానాం విభ్రమేణతు ।
అథో దృష్టి విభిన్నై స్తై: కృత మత్యా కులం త్విదమ్॥
ఏకో వేద శ్చతుష్పాద స్సంహత్యతు పునః పునః ।
సజ్క్షేపా దాయుష శ్చైవ వ్యతితే ద్వాపరే తథా॥
వేద శ్చైక శ్చతుర్దాతు వ్యస్యతే ద్వాపరాదిషు ।
ఋషిభిశ్చ పున ర్వేదా భిద్య న్తే దృష్టి విభ్రమైః॥
సతు బ్రాహ్మణవిన్యాసే స్స్వరక్రమవిపర్యయైః ।
సంహృత్య ఋగ్యజుస్సామ్నాం సంహితా స్తై శ్రుతిర్షిభిః॥
సామాన్యా ద్వైకృతాచ్చైవ దృష్టిభిన్నై: క్వచిత్వచిత్ ।
బ్రాహ్మణం కల్పసూత్రాణి భాష్య విద్యా స్తథైవచ॥
అన్యేతు ప్రస్థితా స్తాన్త్వే కేచిత్తాన్ ప్రత్యవస్థితాః
ద్వాపరేషు ప్రవర్తన్తో భి న్న్తార్థే సై స్స్వదర్శనై
ఏకమాధ్వర్యవం పూర్వ మాసీ చ్చైవతు తత్పునః ।
సామాన్యవిపరీతా ర్థైః కృతం శాస్త్రాకులం త్విదమ్॥
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను. ఇక మీదట ద్వాపర యుగధర్మ స్వరూపమును తెలి పెదను. త్రేతా యుగము ముగిసిన మీదట ద్వాపరయుగ మారంభమగును. త్రేతాయుగమున ప్రజలకు ఏఏ విధములగు లౌకిక ప్రవృత్తు లును వాటి ఫలములును ఉండెనో అవియే ద్వాపర యుగాదియం దుండును. ఆ యుగము మారిపోగానే క్రమముగా తత్పూర్వయుగ కార్యఫలసిద్దులు నశించును. తరువాత ద్వాపర యుగమున ప్రజలలో లోభము భృతి వేతనముతో పని చేయుట) వాణిజ్యము యుద్ధము తత్వ నిశ్చయము చేయలేక పోవుట వర్ణవ్యవస్థ ధ్వంసమగుట కర్మ విపర్యయము (విహిత కర్మములు చేయకపోవుట నిషిద్ధ కర్మములను ఆచరించుట) బాటసారులను చంపుట తీవ్రమగు దండనము
దురభిమానము దర్పము ఓర్పు లేకుండుట బలమునకు ప్రాముఖ్యము. అధిక మగును. ద్వాపరయుగ మారంభము కాగానే రజస్తమోగుణ ప్రవృత్తు లధిక మగును. మొట్ట మొదటిదగు కృతయుగమున ఆధర్మము ఏ మాత్రమును లేకుం డెను. త్రేతాయుగమునందు అది ప్రవర్తింపజేయబడెను. ద్వాపర మున వ్యాకులత నొందును. కలియుగమున ధర్మము పూర్తిగా నశించును. ఈ ద్వాపరయుగమున వర్ణ ధర్మములును బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మములుసు సంకీర్ణములు (ఒక దాని ధర్మమునందు మరియొకటి కలిసినవి.విహితమును చేయుటతోపాటు అవిహితమును కూడ చేయుట ఆవిహితమును విహితమని వాదించుట ఆచరించుట మొదలగు పాండిత్య దుర్విలసితములును ) అగును. శ్రుతి స్మృతుల అర్థ నిర్ణ యము విషయమున ద్వైధము (భిన్నాభిప్రాయ చిత్తవృత్తి ఏర్పడును. శ్రుతి స్మృతులును తామై రెండు అభిప్రాయముల నిచ్చుచుండును. దాని మూలమున ధర్మతత్వము ఇది యని తెలియక పోవును. దానివలన ప్రజలలో అభిప్రాయ భేదములు పెరుగును. దృష్టి భేదముచే ఐకమత్యము లోపించును. దానిచే లోకము ఆకులత సందును. త్రేతాయుగమున నాలుగు పాదములతో ఒకటిగానే యున్న వేదము మరల మరల సమకూర్చబడుటచేతను ఆయువు తక్కువ యగుట చేతను ద్వాపరయుగమున ఆది ఋషి పుత్రులచే నాలుగుగా విభజింపబడును. ఐనను ఆపుడు కూడ దృష్టి విభ్రాంతి చేత వేద ములు ఏవి ఏవి అను విషయమునను అర్థముల విషయమునను భేదము ఏర్పడును. ఆనాటి మహర్షులు వేదములను బ్రాహ్మణ (వేద ములకు ఆర్ష వ్యాఖ్యానములు బ్రాహ్మణములు) విన్యాసము (అమరిక) స్వరక్రమ విపర్యయములతోను ఋగ్యజుః సామ సంహితలుగా వ్య స్తములు(విభ క్షములు)గా చేయబడును. వాటిలో ఆయా శాఖలయందు కొంత సమానత యున్న ను వాటిలో కొంత వైకృతము(ఆకృతి భేదము కలిగి అచ్చటచ్చట దృష్టి భేదమును కలుగును. బ్రాహ్మణములు కల్ప సూత్రములు వాటి పై భాష్యములనేడు విద్యాస్థాన భేదములు వానిలో ప్రస్థానభేదములు (మార్గ-సంప్రదాయ విచారణా పద్దతి భేదములు) ఏర్పడును. కొంద రోక విషయమున ఒక ప్రస్థానము ననుసరించుచుండ మరికొందరు వారితో ప్రత్యవ స్థితులు ఎదురు వాదము చేయువారు) అగుదురు. ఇట్లు ద్వాపరయుగమున ఋషులు స్వస్వదర్శన(దృష్టి భేదముల నను సరించి వేద తత్సంప్రదాయముల విషయమున భిన్నార్ధ ప్రకాశనము చేయుదురు.. ఆధ్వర్యవ(యజుర్వేద శాఖయు అతః పూర్వము ఒకే రూపమున నుండినది ద్వాపరమున ద్విధాభావమును (రెండుగా అగుటను) పొంది కొన్ని అర్థములు సమాసాకారముతో ఉండియు కొన్నిటికి విపరీతశాస్త్ర సంప్రదాయ విరుద్ధములగు అర్థ ములు ప్రతిపాదింపబడుటచే శాస్త్ర ములు ఆకులములగును.
ఆధ్వర్యవంచ ప్రస్థానై ర్బహుధా వ్యాకులీకృతమ్ ।
తథై వాథర్వణాం సామ్నాం వికల్పే స్వస్య సజ్క్షయైః॥
వ్యాకు లో ద్వాపరే ష్వర్థః క్రియతే భిన్న దర్శనైః ।
ద్వాపరే సన్నివృత్తాస్తే వేదా నశ్య న్తివైకలౌ॥
అదృష్టిర్మరణం చైవ తథైవ వ్యాధ్యుపద్రవాః ।
వాజ్మనః కర్మభి ర్దుఃఖై ర్ని ర్వేదో జాయతే తతః॥
నిర్వేదా జ్ఞాయతే తేషాం దుఃఖ మోక్ష విచారణా ।
విచారణాయాం వైరాగ్యం వైరాగ్యా ద్ధోషదర్శనమ్॥
దోషాణాం దర్శనాచ్చైవ జ్ఞానోత్పత్తిస్తు జాయతే ।
తేషాం మేధావినాం పూర్వం మర్త్యే స్వాయమ్బవేఽన్తరే॥
ఉత్పత్స్య న్తీహ శాస్త్రాణాం ద్వాపరే పరిపన్థినః ।
ఆయుర్వేదవికల్పశ్చ అజ్గానాం జ్యోతిష సచ॥
అర్థశాస్త్రవిక ల్పాశ్చ హేతుశాస్త్రవికల్పనమ్ ।
ప్రక్రియా కల్పసూత్రాణాం భాష్య విద్యావికల్పనమ్॥
స్మృతిశాస్త్ర ప్రభేదాశ్చ ప్రస్థానాని పృథక్పృథక్ ।
ద్వాపరే ష్వభివర్త న్తే మతిభేదా స్తథా నృణామ్॥
మనసా కర్మణా వాచా కృచ్చ్రా ద్వార్తా ప్రసిధ్యతి ।
ద్వాపర స్సర్వభూతానాం కాయక్లేశ ధుర స్మృతః॥
లాబో భృతి ర్వణిగ్యుద్ధం తత్త్వానా మవినిశ్చయః ।
వేదశాస్త్ర ప్రణయనం ధర్మాణాం సజ్కర స్తథా॥
పర్ణాశ్రమపరిధ్వంసః కామద్వేషౌ తథైవచ ।
పూర్ణే వర్ష సహస్రే ద్వే పరమాయు స్తథా నృణామ్,
నిశ్శేషే ద్వాపరే తస్మిం స్తస్యసంధ్యాకు పాదతః ।
గుణహీనాస్తు తిష్ఠన్తి ధర్మస్య ద్వాపరస్య తు॥
తథైవ సన్ద్యా పాదేన అంశ స్తస్యాం ప్రతిష్ఠితః ।
ద్వాపరస్య తు పర్యాయే తిష్యస్యతు నిబోధత॥
కలియుగధర్మా ॥
ద్వాపర స్యాంశ శేషేతు ప్రణిపత్తిః కలే రథ ।
హింసాస్తేయానృతం మాయా వధ శ్చైవ తపస్వినామ్
ఏతే స్వభావా స్తిష్యస్య సాధయ నిచ తాః ప్రజాః ।
ఏష ధర్మ స్మృతః కృత్స్నో ధర్మశ్చ పరిహీయతే॥
ఆధ్వర్యవ (యజుర్)వేదము కూడ వేరు వేరు ప్రస్థానమార్ధ సంప్రదాయములతో బహు భేదముల నొంది వ్యాకుల మగును. వాటి అర్థములకు ఆయా ఋషులును మునులును భిన్న దర్శనులయి సాంకర్యము కలిగింతురు. ఉచితానుచితార్థ సంమిశ్ర ణము కలిగింతురు.) ద్వాపరయుగమున ఇట్లు నడచి నడచి వ్యాకులత నొందిన ఆ వేద వేదార్థ ములును కలియుగమున నాశమునందును; దీనిచే ద్వాపరమున అజ్ఞానము అకాల మరణము వ్యాధుపద్రవములు కలుగును. వాజ్మనః కాయిక ములగు దుఃఖము లనుభవించుట కలుగును. దానిచే నిర్వేదము ప్రాపంచిక జీవనము పై విసుగు) కలు గును. తత్పలముగా ప్రజలలో ఈ దుఃఖములనుండి ము కి ఎట్లను విచారణ కలుగును. విచారణచే వైరాగ్యమును దాచే సంసార దోష దర్శనమును దానిచే జ్ఞానోత్పత్తియు కలుగును.
ఈ ద్వాపరమున స్వాయంభువ మన్వంతరము నాటి మేధావులకు శత్రువులు (అలనాటి మేధావుల ఉదారాభి ప్రాయములను కాదను వారు) జన్మి తురు. ఈ ద్వాపరమున ఆయుర్వేదము జ్యోతిషము ఇతర వేదాంగములు-వీని విషయము నను శాస్త్ర విరోధులు జన్మింతురు. ఈ శాస్త్రములలో వికల్పములును సంప్రదాయ తదభిప్రాయ - భేదములును) ఏర్ప డును. అర్థ శాస్త్రమున హేతు (న్యాయ వైశేషిక) శాస్త్రమునందు కల్పసూత్రములందు భాష్యరూపమగు విద్యాస్థానములందు స్మృతి శాస్త్రములందు ప్రస్థానములందు వికల్పము లేర్పడి దాని చే ప్రజలందును మతి భేదములు ఏర్పడును. మనో వాక్కాయిక కర్మములతో ఎంతో శ్రమ పడిన మీదటగాని లోక యాత్ర జరుగక పోవును. ఇట్లు ద్వాపర యుగము సర్వభూతములకును కాయ క్లేశము కలిగించునదియని పెద్దలు తలచుచున్నారు. లాభము - భృతి-వాణిజ్యము యుద్ధము శాస్త్రత త్వ నిశ్చయము లేక పోవుట -వేద శాస్త్రములను (విభిన్న రీతుల) నిర్మించుట ధర్మ సంకరము వర్ణాశ్రమ ధర్మ పరిధ్వంసము కామము ద్వేషము రెండువేల సంవత్సరముల పర మాయువు ఇవి ద్వాపరయు లక్షణములు. ద్వాపర సంధ్యా కాలమున యుగ కాలధర్మములో చతుర్థాంశమును సంధ్యాంశ కాలమున దానిలో చతుర్థాంశ మును ధర్మము ప్రవర్తిల్లును. ఇట్లు ద్వాపరము గడచిన తరువాత వచ్చు కలియుగ స్వరూపమును తెలి పెదను; వీనుడు: కలియుగ ధర్మములు- ఈయుగమున విప్రుల ప్రవృత్తియందలి దోషములు ప్రజల క్షేమహానికి హేతువులనుట.
ద్వాపర యుగ సంధ్యా సంధ్యాంశముల ప్రవృత్తి ముగియగానే తిష్య (కలియుగము ఆరంభమగును. హింస-చౌర్యము. అనృతము. మాయ. తపస్వుల వధ _ఇవి కలియుగ ధర్మములు; ఆనాటి ప్రజలు ఈ ప్రవృత్తులను సాధింతురు. ఇది యే వారికి ధర్మము; వాస్తవమగు ధర్మమంతయు పరిహిణమగును. పూర్తిగా నశించును.)
మనసా కర్మణా వాచా వార్తా సిధ్యతివా నవా ।
కలిఃప్రమారకో రోగ స్సతతం చాపి క్షుద్బయమ్॥
అనావృష్టిభయంచైవ దేశానాంచ వివర్యయః ।
న ప్రమాణస్థితి ర్హ్యు స్తి తిష్యే మోరే యుగే కలౌ॥
గర్బస్థో మ్రియతే కశ్చి ద్యౌవనస్థ స్తథా పర: ।
స్థావిరే వాఽథ కౌమారే ప్రియ నేచ కలౌ ప్రజాః॥
అల్పతేజో బలాః పాపా మహాకోపా హ్యధార్మికాః ।
అనృతవ్రతలుబ్ధాశ్చ తిష్యే చైవ ప్రజా స్థితాః॥
దురిష్టై ర్దుర ధీతైశ్చ దురాచారై ర్దురాగమైః ।
విప్రాణాం కర్మదోషై స్తైః ప్రజానాం జాయతే భయమ్॥
హింసా మాన స్తథెర్ష్యాచ క్రోధో మాయాఽక్షమాఽధృతిః ।
తి ష్యే భవతి జన్తూనాం లోభో మోహశ్చ సర్వశః॥
సజ్క్షోభో జాయతేఽత్యర్థం కలి మాసాద్య వై యుగమ్।
నాధీయన్తే కలౌ వేదాన్న యజ న్తే ద్విజాతయః॥
ఉత్సీద న్తి తదా చైవ వైశ్యై సార్ధంతు క్షత్రియాః
శూద్రాణాం మన్త్ర యోనీషు సమ్బన్దో బ్రాహ్మణే సహ॥
భవన్తీహ కలౌ తస్మి ఞ్చయనాసనభోజనైః ।
రాజాన శూద్రభూయిష్ఠాః పాషణ్డానాం ప్రవృత్తయః॥
కాషాయణశ్చ నిర్గ్రన్థా (నిష్కచ్ఛా) స్తథా కాపాలినశ్చ హ ।
వైశున్యే దేవ వతిన స్తేషాం యే ధర్మదూషకః॥
దివావ్రతాశ్చ యే కేచి ద్వృత్యర్థం శ్రుతిలిజ్గినః ।
ఏవంవిధాశ్చ యే కేచి దృవన్తీహ క లౌ యుగే॥
అధీయ న్తే తథా శూద్రా శ్శూబ్రా ధర్మార్థకోవిదాః ।
యజ న్తే హ్యశ్వమేధైశ్చ రాజాన శూద్రయోనయః॥
స్త్రీ బాలగోవరం కృత్వా హత్వాచైవ పరస్పరమ్ ।
ఉపకృత్య తథా న్యోఽన్యంసాధయ న్తి తథా ప్రజాః,
దుఃఖప్రచుర తాఽల్పాయు ర్దేశోత్సార స్సరోగతా ।
అధర్మా భినివేశ త్వా త్తవృత్తం కలౌయుగే॥
భ్రూణహత్యా ప్రజానాంచ తథా హ్యేవం ప్రవర్తతే ।
తస్మా దాయు ర్బలం రూపం ప్రహీయ న్తే కలౌ యుగే॥
దుఃఖేనాభిప్లుతానాంచ పరమాయు శ్శతం గృణామ్ ।
భూత్వాచ నభవన్తీ హ వేదాః కలియుగేఽఖిలాః॥
ఉత్సీద న్తే తథా యజ్ఞా: కేవలా ధర్మ సేతవః ।
ఏషా కలియుగావస్థా సన్ద్యాంశౌ తు నిబోధత॥
కలియుగమున మనోవాక్కాయ కర్మములతో వా ర లోకయాత) నెర వేరునో జరుగునో లేదో కూడ చెప్పజాలము. కలియుగము ప్రాణులకు అధికముగా సురణ పదము; ఎల్లప్పుడును రోగము ఆక లివలని భయము అనావృష్టి భయము దేశోపద్రవము ఉండును. ప్రజలు దేనినిగానీ ప్రమాణముగా గ్రహించరు. ఇట్లే ఘోర కలి యుగమున గర్పస్తులుగా యౌవనస్థులుగా కౌమారమున వార్త క మున ఇట్లనేక వయో దశలలో జనులు మరణింతురు. ప్రజలకు తేజోబలములలములు; వారు పాపులు. మహాకోపులు- అధార్మికులుగా నుందురు. అనృతమాడుటయే వారి వ్రతము. వారు లోభపరులు; వారు అనుష్టించు యజనములు అధ్యయనములు ఆచారములు (ప్రమాణముగా గ్రహించు) ఆగమములు సరియైనవికావు. ముఖ్యముగా సమాజమునకు క్షేమము కలిగింప యత్నించవలసిన బ్రాహ్మణులు ఆచరించు కర్మములండలి దోషముల ప్రభావమున ప్రజలు భయముల పాలగుదురు. ఈ యుగమున ప్రజలలో హింసా (దురభిమానము ఈర్య క్రోధము మాయ అక్షమ (ఓర్పు లేకుండుట) ఆధృతి నిబ్బరము లేక పోవుట) లోభము మోహము అన్ని విధముల వ్యా ప్రమగును. సర్వవిధములగు సంక్షోభములును మిక్కిలిగా కలు గును. బ్రాహ్మణులు వేదాధ్యయనము చేయరు; సరియగు) యాగము లనుష్ఠించరు. ఇట్లు విప్రులే కాదు. శ్రీయులును వైశ్యులను ఉత్సాదము మానసికమగు నాశ స్థితి) నందుడురు-శూద్రులకు బ్రాహ్మణులతో (వా స్తవమున బ్రాహ్మణులకు శూద్రుల తో) మంత్రము-వేదము) యోని కామ ప్రవృత్తి) పడక .భోజనము కలిసి-కూర్చుండుట మొదలగు విషయము లలో సంబంధము ఏర్పడును. చాలవరకు శూద్రులు రాజు (పొలకు లగుదురు. పాషండ వేద శాస్త్రములందు ప్రామాణ్య బుద్ధిలేని) ప్రవృత్తులధికమగును.ప్రజలు కాషాయ వస్త్రధారులు నిర్గంథులు కర్మానుష్ఠానములను వదలిన వారు నిష్కచ్చులు లోపల గోచీవంటి దానిని ధరించకయే వస్త్రధారణ చేయువారు) కపాలాది ధారణము తమ ధర్మ లక్షణముగా ధరించు కాపాలికులు- దేశ భక్తుల వేషములు ధరించిన లోకవ చకులు లోక నాశకులు ధర్మమును పాడు చేయువారు కొందరు దివావతులు (పగలు మాత్రము జనులకు తాము సదా చాంద్ లక్షణ , సంపన్నులని చూపుటకు వేషముతో సటన చేయుచు పరోక్షమునను మనస్సులోను దుష్పవృత్తులతో ఉండువారు) వృ తినిమి త్తము (పొట్టకూటి కై) వేదాధ్యయనాదికము చేసినట్లు నటించువారు అగుదురు. శూద్రులు వేదాధ్యతలుగా ధర్మార్థ కోవిదులుగా అగుదురు. శ్రీ బాల గోవధ పరస్పర వధలు స్వార్థమున కై పరస్పరోపకారము చేయువారు అగుదురు. దుఃఖప్రాచుర్యము అల్పాయువు-ప్రజలు దేశ ములు వదలిపోవుట రోగములు చెందుట ఆధర్మమునంద భినివేశము (గాథాస కి తమోగుణ ప్రవృత్తి భ్రూణ (సొంగ వేదాధ్యయనము వేద ధర్మానుష్టానము కల బ్రాహ్మణుల గర్భస్థ శిశువుల - హత్య) ఆయుర్బల రూపహాని అధికమగును. (ప్రజలేలరు దుఃఖములతో అభిప్లుతులు (మునుక లె త్తినవారు) అగుదురు. వీరి పరమాయువు ఎక్కువకు ఎక్కువయును) నూరు సంవత్సరములు. అదివరకు ఉన్నంత మంచిస్థితిలో కాదు నరేగదా ఏమాత్రమును మంచిస్థితిలో ఈయుగమున వేదములుండవు. కేవలము ధర్మ వ్యవస్థాపరిరక్షణలో అడ్డుకట్టలవలేనుండు యజ్ఞములు నడువక నశించును. ఇది కలియుగధర్మ ప్రవృత్తి స్వరూపము . ఇక కలి సంధ్యా సంధ్యాంశముల ధర్మస్వరూపమును తెలిపెదను.
కలిసన్ది -తదంశ -ధర్మాః ॥
యుగే యుగే తు హీయన్తే త్రింస్త్రీన్పాదాంశ్చ సిద్ధయః ।
యుగ స్వభావా త్సన్ద్యాస్తు అవతిష్టని పాదతః॥
సన్ద్యాస్వభావా స్స్వాం శేషు పాదేనై వావతస్థిరే ।
ఏవం సన్ద్యాoశ కే కాలే సంప్రాప్తేతు యుగా న్తి కే॥
తేషాం రాజ్ఞా మసాదూనాం శాస్తా భృగుకులోత్థితః ।
గోత్రేణవై చన్ద్రమనో నామ్నా ప్రమతి రుచ్యతే॥
కలిసన్ద్యాoశ భా వేషు మనో స్స్వాయంభువేఽన్తరే ।
సమాస్త్రింశత్రు సమ్పూర్ణాః పర్యటన్వై వసున్దరామ్॥
అస్త్రకర్మా సవై సేనాం హ స్త్యశ్వరథసజ్కులామ్ ।
ప్రగృహీతాయుధై ర్విప్రై శతశోఽథ సహస్రశః॥
స తదా తైః పరివృతో మ్లేచ్ఛా న్త్వర్వా న్ని జఘ్నిపా ।
స హత్వా సర్వశ శ్చైవ రాజాన శూద్ర యోనయః॥
పాషణ్డాం త్స తదా సర్వా న్ని శ్శేషా నకరో త్ప్రభుః ।
అధార్మికశ్చ యే కేచి తా న్త్సర్వా హన్తి సర్వశః॥
ఉదీచ్యా న్మధ్యదేశ్యాంశ్చ పార్వతీయాం స్తథైవచ ।
ప్రాచ్యా న్ప్రతీచ్యాంశ్చ తథా విన్ద్యపృష్ఠాపరా న్తికా॥
తథైవ దాక్షిణాత్యాంశ్చ ద్రవిడా న్త్సింహ ళై స్సహ ।
గాన్గారా న్దర దాం శ్చైవ పప్లవా న్యవనా ఇ్ఛకా॥
తుషారా బర్బరాం చ్ఛ్వేతా పుళిన్దా న్పులసా నథ ।
లిమ్బకా నర్ధక రకాం శ్చారాణాం చైవ జాతయః॥
ప్రవృత్తచక్రో బలవా ఞ్చూధ్రాణా మ నకృద్విభుః ।
విద్రావ్య సర్వభూతాని చచార వసుధా మిమామ్॥
మానవస్య తు వం శేతు నృదేవ స్యేహ జజ్జీవా ।
పూర్వే జన్మని విష్ణుశ్చ ప్రమతిర్నామ వీర్యవాక్॥
సుతస్సవై చన్ద్రమసః పూర్వే కలియుగే ప్రభుః ।
ద్వాత్రిం శేఽభ్యుదితే వర్షే ప్రకా నస్త్రింశతః సమాః॥
నిజ ఘ్నే సర్వభూతాని మానుషాణ్యేవ సర్వశః ।
కృత్వా బీజావశిష్టాన్తాంపృథ్వీం క్రూరేణ కర్మణా॥
ప్రతి యుగమునందును ఆయా యుగపు సద్ ధర్మములు దాని సంధ్యాకాలమునందు మూడు వంతులు నశించి ఒక నాలవ వంతు మాత్రము శేషించును. సంధ్యా కాల ధర్మములలో నాలవవంతు మాత్రమే ఆయుగపు సంధ్యాంశ కాలమున మిగులును. ఇట్టి కలియుగ సంధ్య కాలము కూడ గడచి సంధ్యాంశ కాలము . వచ్చిన యుగావసాన సమయమున ఆనాటి అసాధు వర్తనులను రాజులను దండించుట కై ధృగు వంశమున జన్మించిన చంద్రుడను దాని గోత్రమున మీదటి తరములలో) ప్రమతియను నాతడు జన్మించును. ఆతడా స్వాయంభువ మన్వంతరపు కలియుగ సంధ్యాంశ కాలమున నిండుగ ముప్పది ఏండ్లు పృథివియంతయు సంచరించుచు అస్త్ర ప్రయోగముతో యుద్ధములు చేయుచు చతురంగ బలము వెంటరాగా ఆయుధములుపట్టి నూర్ల కొలది వేల కొలది విపులు తను పరివారించి వచ్చుచుండగా సర్వ మేచ్చులను సంహరించును. శూద్రులగు రాజులను పొషులను నీ। శేషులనుగా చేసెను. అధార్మికులనందరను. ఉదీచ్య మధ్య దేశ్య పార్వతీయ ప్రాచ్య ప్రతీచ్య వింధ్య పృష్ట వాసులను అపరాంతికులను భారత దేశపు పడమటి అంచులందలి వారిని దాక్షిణాత్య ద్రవిడ సింహళ జనులను గాంధార దరద పప్లవ యవన శ క తుషార బర్బర పుళింద పులస లింబకార్ధకరక చొర జాతులను సంహరించును. తన చక్రము ( సేన)ను ప్రవర్తిల్ల (సంచరింప జేసి శూద్ర రాజులను అంతమొందించును. ధర్మవిరోధి) సర్వ ప్రాణులను తరుముచు ఈ భూమియందంతటను ఆతడు సంచ రించును. ఇతడు మను వంశమున జన్మించిన నృ దేవునికి రాజునకు) కుమారుడు; ఈ జన్మమునకు ముందు అతడు సాక్షాద్విష్ణువే. అతడు ప్రమతియను పేర చంద్రముడను రాజునకు వీర్యశాలియగు కుమారుడుగా పుట్టును. అతడు తన ముప్పది రెండవ ఏట బయలుదేరి ఇరువది సంవత్సరములపాటు ఇట్లు మానవులలో సర్వ ప్రాణులను చంపిచంపి క్రూరకర్మమునాచరించి ఈ పృథివిని మానవ బీజావ శేషమునుగా (ఏకొలదిమందియో మాత్రము మిగులునట్లు చేసెను.
పరస్పరనిమి త్తేన కాలేనాక స్మి కేన చ ।
సంస్థితా సహసా యాతు సేనాప్రమతీనా సహ
గజ్గాయమునయోర్మధ్యే సిద్ధిం ప్రాప్తి సమాధినా ।
తత స్తేషు ప్రణష్టేషు సన్యాంశే క్రూరకర్మసు॥
ఉత్సాద్య పార్థివాన్త్సర్వా స్తేష్వతీతేషు వై తదా ।
తత స్సన్ద్యాంశ కే కాలే సంప్రాప్తేచ యుగా స్త్రీ కే॥
స్థితాఃస్వల్పావశిష్టాస్తు ప్రజా స్త్విహ క్వచిత్క్వచిత్ ।
స్వప్రధానా స్తదా తేవై లోభావిష్టాస్తుసర్వశ ॥
ఉపహింస న్తి చాన్యోన్యం ప్రలుమ్పన్తి పరస్పరమ్ ।
అరాజ కే యుగాం శేతు సంశయే సముపస్థితే॥
ప్రజాసావై తదాసర్వాః పరస్పరభయార్ధితాః ।
వ్యాకులాస్తాః పరావృత్తా స్త్యజ్య దేహం గృహాణి తు॥
స్వాన్త్వా న్ప్రాణా నవేక్షన్తో నిష్కారణ్యాత్ సుదుఃఖితాః ।
నష్టే శ్రౌతస్మృతౌ ధర్మే కామక్రోధవశానుగా।॥
నిర్మర్యాదా నిరానన్దా ని స్నేహా నిరసత్రపాః ।
నష్టే ధర్మే ప్రతిహతా హ్రస్వకాః పశ్చివింశ కాకి॥
హిత్వా దారాంశ్చ పుత్రాంశ్చ విషాదవ్యాకులాః ప్రజాః ।
ఆనావృష్టిహతా సేపై వార్తాముత్సృజ్య దుఃఖితాః॥
సదా కృష్ణాజినధరా నిష్క్రియా నిష్పరిగ్రహః ।
వర్ణాశ్రమపరిభ్రష్టా స్సజ్కరం ఘోర మాశ్రితాః॥
ఏతాం కాష్ఠా మనుప్రాప్తా హ్యల్ప శేషాః ప్రజా స్తతః।
జనవశ్చ క్షుధాఽఽ విష్టా దుఃఖా న్ని ర్వేద మాగమన్॥
సంశ్రయ న్తి విదేశాంస్తాం శ్చక్రవ త్పరివర్తనాః ।
తతః ప్రజాసు తాస్సర్వా మాంసాహారా భవన్తి తాః॥
మృగా స్వరాహా స్వృషణా న్యే చాన్యే వనచారిణః ।
భక్ష్యాంశ్చైవాప్యభక్ష్యాంశ్చ సర్వాంస్తా నక్షయ ని తాః॥
సముద్రం సంశ్రితా యాస్తు నదీశ్చైవ ప్రజా స్తథా।
తేపి మత్స్యా హరన్తీ హ ఆహారార్థం చ సర్వశ
అభక్ష్యాహార దో షేణ ఏకవర్ణా గతాః ప్రజాః ।
యథా కృతయుగే పూర్వ మేకవర్ణ మభూత్కిల॥
తథా కలియుగస్యా నే శూద్రీభూతాః ప్రజా స్తథా ।
ఏవం వర్ష శతం ప్యుం దివ్యం తేషాం ప్రవర్తతే॥
(షడ్వింశస్తు) షట్రింశత్రు సహస్రాణి మానుషాణితు తానివే ।
ఇట్టి స్థితిలో పరస్పర హేతువుల చేతను కాలవశమునను ఆకస్మిక ముగను (ఏ కారణమును లేక యును) ఒక టీగా ప్రమతి వెంట కూడియున్న సేన ఈ చెప్పిన పని పూర్తికాగానే శీఘకాలముననే గంగా యమునల నడుమ (ప్రయాగ క్షేత్రములో) సమాధి నవలంబించి ప్రమతితోకూడ దేహత్యాగ మొనరించెను. ఇట్లు స్వాయంభువ మన్వంతర మందలి సంధ్యాంశ మున కూరకర్ములగు జనులు పూర్తిగా నశించగా నాటి రాజులనందరను నశింపజేసి ప్రమతి మొదలగువారును గతించిపోగా సంధ్యాంశమందలి కడపటి కాలమాసన్న ముకాగా స్వల్పావశిష్టులుగా మిగిలిన కొలదిమంది ప్రజలును అచ్చటచ్చట మిగిలియుందురు. వారును తమ క్షేమమే తాము చూచుకొనుచు స్వ ప్రధాన దృష్టి కలవారై సర్వ విధముల లోభావిష్ణులయి వర స్పరము హింసించుకొనుచు దోచుకొనుచు నుండిరి. లోకమరాజక మే ప్రజల జీవితము సంశయగ్ర సనుయ్యెను. ప్రజలు పరస్పర భయపీడితులై వ్యాకులత నొంది ఒకరికింకొకరికి పొతు పొంతనలు లేక కొందరు గృహములు విడిచిపోయిరి. మరికొందరు దేహములనే విడిచిరి. తమ్ము దయ చూచువారు లేక పోగా తమతమ ప్రాణముల కాపాడు కొనుచు మిగుల దుఃఖపీడితులై . శ్రాతస్మార్త ధర్మములు నశించెను. ప్రజలు - కామ క్రోధ వశులు మర్యాద తప్పినవారు ఆనందరహితులు స్నేహబుద్ధి సిగ్గు బిడియములు లేని వారునయిరి. ధర్మనాశ మయ్యెను. వారాపదలపాలై రి. పొట్టివారును ఇరువదియై దేండ్లకంటే జీవించని వారునయి. ప్రజలు విషాదముతో వ్యాకులు రై దారపుత్తూల విడిచి వానలు లేక ఇబ్బందులపాలయి జీవనోపాధులు విడిచి (లేక) దుఃఖితులై జింక చర్మములే ధరించుచు ఏ పనులును చేనుక ఇచ్చువారును పుచ్చుకొనువారును లేక వర్ణాశ్రమ పరిభ్రష్టులయి ఘోర మగు ధర్మ సంకరము నొందిరి. మిగిలిన కొలదిమంది ప్రజలును ఈ స్థితినొందిరి. ఇతర ప్రాణులును ఆక లి పీడనందుచు జీవితము పై విసుగు చెందెను. చక్రములవలే నిలుకడలేక సంచరించుచు తమ దేశ ముల విడిచి విదేశముల నొశ్రయించిరి. వారు మాంసాహారులయి లేళ్ళు మొదలగు వానిని పందులను ఎదులను మరి ఇతర వన చారి ప్రాణులను తినసాగిరి. సముద్ర నదీ తీర ముల నాశ్రయించిన ప్రజలును మత్స్యములు మొదలగువానిని (వారు బ్రాహ్మణులై నను) తినిరి. భక్ష్యాభక్ష్య విచారణను వారు విడిచిరి. అభజ్యాహార దోషముచే జగత్తున ఒకే వర్ణమయ్యెను. ఇది కృతయుగపు స్థితివలె నుండెను. కృతమున అందర ను ధర్మపరులై ఒకే వర్ణము వారుగానయి. ఈ కలియుగమున అధర్మవశులై ఏక వర్ల మువారైరి.) ఇట్లు కలియుగాంతమున ఎల్ల ప్రజలును శూద్రీభూతులయిరి. ఇట్లు నూరు దివ్య వరముల కాలము గడ చేను. ఇది మానవ మానమున ముప్పది ఆరువేల సంవత్సరములు.
అథ దీర్ఘేణ కాలేన పక్ష్మిణః పశవ స్తథా॥
మత్స్యాశ్చైవ హతాస్సర్వే క్షుదావిష్టైశ్చ సర్వశః ।
నిశ్శే షేష్వథ సర్వేము మత్స్య క్షిపణుష్వథ,
సన్ద్యాంశే ప్రతిపన్నేము నిశ్శేషాస్తు తదాకృతాః ।
తతః ప్రజాస్తు సమ్భూయ కన్దమూల మథాఖనత్॥
ఫలమూలాశినస్సర్వే అని కేతా స్తథైవచ ।
వల్కలా న్యథ వాసాంసి అధశ్శయ్యాశ్చ సర్వశః॥
పరిగ్రహో న తేష్వస్తి న చ శుద్ధి మవాప్నుయుః ।
ఏవం క్షయం గమిష్య న్తి హ్యల్ప శిష్టాః ప్రజా స్తదా॥
తాసా మల్పావశిష్టానా మాహారా ద్వృద్ధిరీష్యతే ।
ఏవం వర్ష శతం దివ్యం సన్ద్యాంశ స్తస్య వర్తతే॥
తతో వర్షసహస్రాన్తే అల్పశిష్టాః శ్రియస్తు తాః ।
మిథునానితు తాస్సర్వా హ్యన్యోన్యం సంప్రజజ్ఞిరే॥
తతస్తాస్తు మ్రియంతేవై పూర్వోత్పన్నాః ప్రజాస్తు యాః ।
జాతమాత్రే ష్వపత్యేషు తతః కృత మవర్తత॥
యథా స్వర్గే శరీరాణి నర కేచైవ దేహినామ్ ।
ఉపభోగసమర్ధాని ఏవం కృతయుగాదిషు॥
ఏవం కృతస్య సన్తానః కలేశ్చైవ క్షయ స్తథా ।
విచారణాత్తు నిర్వేద స్యామ్యావస్థాత్మతా తథా॥
తత శైవాత్మ సమ్బోధః సమ్బోధా ద్ధర్మ శీలతా ।
కలిశి ష్టేషు తే ష్వేవ జాయ న్తే పూర్వవ త్ప్రజాః॥
భావినోఽర్థస్యచ బలా త్తతః కృత మవ ర్తత ।
అతీతానాగతాని స్యు ర్యాని మన్వన్తరే ష్విహ॥
ఏతే యుగస్వభావాశ్చ మయోక్తాస్తు సమానతః ।
విస్తరేణానుపూర్వ్యచ్చ నమస్కృత్వా స్వయమ్బువే॥
ఇట్లు చాలకాలము గడచిన మీదట ఆకటి బాధతో ప్రజలు పశు పక్షులను మత్స్యములను దొరకినచోట దొర కిన వెల్ల తిని వేయగా అవి ఏమాత్రమును మీగులక పోయేను. నాటి కలి సంధ్యాంశ స్థితి ఇది. అంతట ప్రజలు నేల త్రవ్వి కొని కందమూలములను చెట్లనుండి ఫలములను-తినసాగిరి. వారుండుట కిండ్లు లేకుండెను. వారికి చెట్ల బెరడులే వస్త్రములు. నేలయే పడకలు. దాన పరిగ్రహములు వారిలో లేకుండెను. శుద్ది లేకుండెను. ఇంకను మిగిలిన కొలది మంది కూడ ఇట్లు క్రమముగ నశించిరి. ఇంకను అల్పావశిష్టులుగా మిగిలినవారు ఆహార మునుఉన్న దానిని తిని వృద్ధి నొందిరి. ఇట్లు కలిసంధ్యాంశము నూరేండ్లును గడచెను. ఇట్లు వేల మానవ సంవత్సరముల తరువాత మిగిలిన కొలది మంది ప్రజలును వారి కుమారులును మిగిలియున్న స్త్రీలతో దాంపత్య సంబంధమును వ్యవస్థ చేసికొనిరి. సంతానమును నిరి. వారికి సంతానము కలిగిన కొలది కాలములోనే వారికి ముందటి తరముల జనులు ఈ పుట్టిన సంతానపు తల్లిదండ్రుల తరపు జనులు) మరణించిరి. (కలియుగపు జను లేవ్వరును మిగులలేదు. ఇట్లంతట కృతయుగ మారంభమయ్యెను. జీవులు ఈ భూలోకపు దేహమును విడిచిన తరువాత వారి పుణ్య పాపముల ననుసరించి స్వర్గనరక సుఖదుఃఖానుభవార్థము మరి యొక దేహము ఆ జీవులకు లభించునట్లే కలియుగపు జనులనుండి కృతయుగమునకు సంబంధించిన జనులకు దేహ ప్రాప్తి యయ్యెను. ఇది కలియుగము ముగిసి కృతయుగ మారంభమయిన విధము. కలియుగమునుండి మిగిలినవారెవ్వరైన నున్న చో వారియందును ఈ కృతయుగ జలయందును విచారణా ప్రవృత్తి కలిగేను. దాని ప్రాపంచిక జీవితము పై విసుగు సత్వరజస్తమోగుణముల సమతాస్థితి దానిచే ఆత్మజ్ఞానము దానిచే ధర్మశీలము కలిగి. మొదటి కృతయుగమందు వలే సజ్జనులగు ప్రజలు పుట్టిరి. దీని కంతటికిని భవితవ్యమగు అర్థము (జరుగవలసిన విషయము -జీవుల పూర్వ కర్మాను గుణమగు అదృష్టమను ధర్మాధర్మఫలములును) హేతువు. దీని కంతటికిని మూలతత్వమగు స్వయంభూ బ్రహ్మకు నమస్క రించి మీకు ఈ యుగధర్మ ప్రవృత్తులన్ని యు తెలిపితిని. యుగప్రవృత్తులు ప్రతి ఆ వృత్తియందును ఇట్లే యుండును. ఇది యుగ ప్రవృత్తుల సమాస-వ్యాస-కథనము. (మొదట ఒక విషయమును సంగ్రహముగ చెప్పి పిదప దానియందలి ప్రత్యేకాంశముల గ్రహించి విస్తరించి చెప్పుట సమాస-వ్యాస కథనము.)
ప్రవృత్తేతు తత స్తస్మి న్పునః కృత యుగే తు వై ।
ఉత్పన్నా : కలిశే షేషు ప్రజా: కార్తయుగా స్తథా
తిష్ఠన్తి చేహ సిద్దా యే అదృష్టా విహర న్తి చ ।
సహ సప్తర్షిభి ర్యేతు తత్ర యేచ వ్యవస్థితాః॥
బ్రహ్మక్షత్త్రవిశ శూద్రా బీజార్థే యే ఇహ స్స్మృతాః ॥
కార్తే యుగ భవైస్సార్దం నిర్వి శేషా సదాఽభవ॥
తేషాం సప్తర్షయో ధర్మం కథయ న్తీహ తేషు చ ।
వర్ణాశ్రమాచారయుక్తా శ్రౌతస్మార్తోదితం తదా॥
శ్రౌతస్మార్త స్థితానాంతు ధర్మే సప్తర్షిదేశితే ।
తేతు ధర్మవ్యవస్థార్థం తిష్ఠన్తే హ యుగే యుగే॥
మస్వ త్తరాధికా రేతు తిష్ఠన్తి ఋషయస్తు తే ।
యథా దావప్రదగ్ధేషు తృణే ష్వేవాపరం తృణమ్
వసానాం పథమం వృష్ట్యా తేషాం మూలేషు సమ్భవః ।
ఏవం యుగయుగానాంవై సన్తానస్తు పర స్పరః॥
వర్తతే హ్యనవచ్చేదా ద్యావ స్మన్వన్తర క్షయః ।
సుఖ మాయు ర్బలం రూపం ధర్మోఽర్థ కామ ఏవ చ॥
యుగే ష్వేతాని హీయ న్తే తీన్పాదాంశ్చ క్రమేణ తు ।
ఇత్యేష ప్రతి సన్దిర్వ: కీర్తితస్తు మయా ద్విజా:॥
చతుర్యుగానాం సర్వేషా మేత దేవ ప్రసాధనమ్ ।
ఏషాం చతుర్యుగానాంతు గణితా హ్యేకసప్తతిః॥
క్రమేణ పరివృతాస్తా మనోర న్తర ముచ్యతే ।
యుగాఖ్యాసుతు సర్వాసు భవతీహ యథాచ యత్ ॥
తదేవ చ తదన్యాసు పురస్తాద్వై యథాక్రమమ్ ।
సర్గేసర్గే యథా భేదా హ్యుత్పద్య న్తే తథైవచ॥
చతుర్ధశసు జాయన్తో జ్ఞేయా మన్వన్తరే ష్విహ ।
ఆసురీ యాతుధానీచ పైశాచీ యక్షరాక్షసీ॥
యస్మి న్యుగే తదాకాలం ప్రజా జాయన్తి తా శ్శృణు ।
తథా కల్పయు గై స్సార్గం భవ న్తే తుల్యలక్షణాశి:
ఇత్యేత ల్లక్షణం ప్రోక్తం యుగా నాం వై యథాక్రమమ్ ।
మన్వన్తరాణాం పరివర్తనాని చిరప్రవృత్తాని యుగస్వభావాత్॥
క్షణం న సంతిష్ఠతి జీవలోకః క్షయోదయాభ్యాం పరివర్తమానః ।
ఏతే యుగస్వభావాశ్చ పరి క్రాన్తా యథాక్రమమ్॥
మన్వన్తరాణీ యాన్యస్మి న్కల్పే వక్ష్యామి తాని చ॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మన్వ నరానువర్థనే ద్వాపరక లియుగ యుగధర్మాది
కథనం నామ తీచత్వారింశ దుత్తరశతతమోఽ ధ్యాయః॥॥
ఇట్లు ప్రవర్తిల్లిన కృతయుగమునందు ఆది కలియుగమునుండి మిగిలిన వారికి జనించినవారే ఆది ప్రజ లగు దురు. ఈ లోకమున ఎవరికిని కనబడక అదృష్టులే తిరుగుచుండు సిద్ధులును సప్త ఋషులతోను కూడ ద్యులోకమందుండు మహాపురుషులును లోకమున ఈ కృతయుగ ప్రజల ఉత్పత్తి కి బీజరూపమున నిలిచియున్న బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర శేష ప్రజలును ఈ కృతయుగారంభపు ఆది ప్రజలతో కలిసి మెలసి తత్సములయి యుండి వీరికి ధర్మము నుప దేశింతురు. వర్ణాశ్రమాచార ధర్మములను క్రౌత స్మార్త కర్మ మూల ధర్మ ప్రవృత్తులును సప్తర్షులు వీరి కుపదేశింతురు. ఏలయన ధర్మవ్యవస్థా ప్రతిష్టార్థమై సపరులు ఈ లోకపు ప్రజల నడుమ ప్రతియుగమునను నిలుతురు. వారి యుపదేశ ముచే ప్రజలును ధర్మకర్మాచరణములందు ప్రతిష్టితులు దృఢాభి నివేశము తో నిలిచినవారు) అగుదురు. ఈ ఋషు లిట్లు మన్వంతర ప్రవర్తనాధికారమునందు నిలిచియుండి లోక ముస ధర్మప్రతిష్ణా ప్రవృత్తులకు హేతుభూతు లగుదురు. వనము లలో దావాగ్ని దవమనగా అడవి) వలన తృణములు కాలిపోయినను దానిని చల్లార్చుటకై కురిసిన వాననీటిబొట్టు పడి నందున ఆ దావాగ్ని పాలయిన తృణపు మొదటినుండి యే ఈ దావాగ్నితో దగ్గము కాక మిగిలిన ఈ తృణ బీజ శేషము నుండి । కోత తృణము మొలచును గదా। అట్లే యుగము తరువాత మరియొక యుగపు ఆరంభమున ప్రజా సంతానము సంతానము – నేరంతరమున కొనసాగుట) జరుగును. ఇట్లు రెండేసి యుగముల పరస్పర సహకారముతో యుగానంతర యుగప్రవృతి మన్వంతరము ముగియు వరకు అనవచ్చిన్న మయి సాగుచునే యుండును. కృతము మొదలు క లివరకు యుగములలో ఆయుర్బల ధర్మార్థ కామములు క్రమమున నాల్గవవంతు చొప్పున తగ్గుచు వచ్చును. ఇది ప్రతిసంధి సంధ్యా సంధ్యాంశ) శాప్రవృత్తి ప్రకారము (ప్రకారము _ రీతి); ప్రతి చతుర్యుగము చతుర్యుగము = మహాయుగము కృత త్రేతా ద్వాపర కలియుగముల సముదాయము నందును యుగ పరివర్తన క్రమ మిట్లే యుండును.
ఇటువంటి మహాయుగములు డెబ్బది యొకటి ఐనచో ఒక మన్వంతర మగును.
ప్రతి యుగమునందును కృతాదియుగ చతుష్టయమునందును ఏ యుగమునందు ఒక సారి ఏది ఎపుడు ఎట్లు జరుగునో అదియే అట్టి ప్రతియొక ఆవృ యందును జరుగును. ప్రతియొక యుగ సృష్టియందును కొన్ని విశేషాంశము లందు వీటికి పరస్పర భేదమును ఉండవచ్చును. ఇవియు అట్లే ప్రతియుగ మహాయుగా వృత్తియందును జరుగుచుండును. ఈ విషయము పదునాలుగు మన్వంతరములందును ఇట్టే ఆవృత మగును. మానవులు మాత్రమేకాక అసురులు యాలు ధానులు పిశాచులు యక్షులు రాక్షసులు మొదలగు జ్ఞాతులవారు కూడ ఆయా యుగ మహాయుగ మన్వంతరములయందు సమాన లక్షణములతో సుందురు.
ఇట్లు మీకు యుగముల లక్షణము యథాక్రమముగ తెలిపితినీ. ఇట్టే కల్పావసానము వరకు మన్వంతరము లును పరివర్తనమునందుచు పోవును. ఇవి ఇప్పటికి ఎంతయో చిరకాలమునుండి ప్రవర్తిల్లుచు వచ్చుచున్నవి. ఇక ముందును కొనసాగుచుండును. యుగ స్వభావమే ఇందులకు హేతువు. ఈ జీవలోకము క్షణకాలము కూడ ముందునకు సాగక మార్పు నొందక యుండదు. ఈ జీవలోకమునకు నాశము ఉత్పత్తి ఈ రెండును స్వాభావికములు.
ఇట్లు యథాక్రమమున మీకు యుగ స్వభావములను తెలిపితిని. ఈ కల్పమునందు గడచిన గడుచుచున్న - గడువనున్న - మన్వంతరముల విషయమును కూడ తెలి పెదను.
ఇది శ్రీమత్యమహాపురాణమున మన్వంతరాను కీర్తనమున యుగ లక్షణాను కీర్తనమను నూట నలువది మూడవ అధ్యాయము.
Summary of chapter 143 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the joyful arrival of six-day-old Kārttikeya at Mount Kailāsa, greeted with supreme love by Mahādeva and Goddess Pārvatī. Recognizing His unmatched divine prowess, Bhagavān Brahmā, Bhagavān Vishṇu, and Indra Deva performed His ceremonial coronation as the Senāpati, the supreme commander-in-chief of the celestial Deva army, bestowing upon Him the invincible Śakti spear and divine weapons.