69 - కల్యాణ భీమ ద్వాదశీ వ్రతము  

మనుః : కథ మారోగ్య మైశ్వర్య మనన్త మమరేశ్వర

 స్వల్పేన తపసా దేవ భవే న్మోక్ష స్సదా నృణామ్

కి మజ్ఞాతం మహాదేవ త్వత్ర్పసాదా దధోక్షజ

 ఆల్ప కేనాపి తపసా మహాఫల మిహోచ్యతామ్  

శ్రీమత్స్యః : పురా రాథ న్తరే కల్పే పరిపృష్టో మహాత్మనా

మన్దరస్థో మహాదేవః పినాకి బ్రహ్మణా స్వయమ్

ఇతి పృష్ట స్సవిశ్వాత్మా బ్రహ్మణా లోక భావనః

 ఉమాపతి రువాచేదం మనసః ప్రీతికారకమ్

ఈశ్వరః : అస్మా ద్రాథన్తరా త్కల్పాత్ప్రయోవింశతిమే యదా

వారాహో భవితా కల్ప స్తస్య మన్వ న్తరే శుభే

వైవస్వతాఖ్యే సఞ్జాతే సప్తమే సప్తలోకకృత్

ద్వాపరాఖ్యం యుగం తచ్చ సప్తవింశ త్తమం యదా

తస్యాన్తే సుమహాతేజా వాసుదేవో జనార్దనః

దాగావతరణార్థాయత్రిధా విష్ణు ర్భవిష్యతి

ద్వైపాయనో ముని స్తద్వ ద్రౌహిణేయోఽథ కేశవః

కంసారి: కేశిమథనః కేశవః క్లేశ నాశనః

మనువు మత్స్యనారాయణు నిట్లడిగెను: దేవేశ్వరా! దేవా! మానవులకు స్వల్పమగు తపస్సుతోనే ఆనంతమగు ఆరోగ్యము ఐశ్వర్యము మోక్షము కలుగు నుపాయమును తెలుపుము. నీకు తెలియని దేదియు లేదు. అనగా నారాయణు డిట్లతనికి తెలి పెను. పూర్వము రాథంతర కల్పమున మందర పర్వతమున నున్న పినాక ధారియగు మహాదేవుని భగ వానుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు ఈ విషయమును అడుగగా అతడతనికి మనకి ప్రీతి కారకమగు ఈ విషయము ఇట్లు చెప్పెను: బ్రహ్మా! ఇప్పుడు జరుగుచున్న ఈ రథంతర కల్పమునుండి ఇరువది మూడవ కల్పమున వారాహకల్పము వచ్చును. దానిలో ఏడవదగు వైవస్వత మన్వంతరమున ఇరువది ఏడవ ద్వాపరయుగపు తుదలో మిగుల మహా తేజస్కుడు వాసు దేవుడు నగు (సర్వమునందు తానుండుచు సర్వమునందు తానుండు) జనార్దనుడు విష్ణువు లోక (భూ) భారమును ఉంచుటకు మూడుగానై ద్వైపాయనముని బలరాముడు కృష్ణుడు. అని ముగ్గురుగా అగును. కృష్ణుని కే కేశవుడు కంసారి కేశి మథనుడు అని ప్రసిద్ది, ఆ మహానుభావుడు క్లేశముల నన్నిటిని నశింపజేయువాడు.

పురీ ద్వారవతీ నామ సాంప్రతం యా కుశ స్థలీ

దివ్యానుభావసంయుక్తా సా నివాసాయ శార్జ్గిణః

త్వష్టా మమాజ్ఞయా బ్రహ్మ న్కరిష్యతి జగత్పతేః

తస్యాం కదాచి దాసీన స్సభాయాం చామితద్యుతిః

భార్యాభిర్వృష్టిభి ర్భూయో సుహృద్భిరివ దక్షిణైః

 కురుభి ర్దేవగన్దర్వై స్సహితః కైటభార్దనః

ప్రవృత్తేషు పురాణేషు ధర్మసంవాదినీషు చ

కథాన్తే భీమ సేనేన పరిపృష్టః ప్రతాపవాక్

 త్వయా పృష్టస్య ధర్మస్య రహస్యస్యాస్య భేదకృత్

భవితా స తదా బ్రహ్మ న్కర్తా చైవ వృకోదర

ప్రవర్తకోఽస్య ధర్మన్య పాణ్డుసూను ర్మహాబలః

యస్య తీక్ష్ణో వృకో నామ జఠరే హవ్యవాహనః

 మయా దత్త స్స ధర్మాత్మా తేన చాసౌ వృకోదరః

మతిమా న్దానశీలశ్చ నాగాయుత బలో మహాక్

భవిష్య త్యజర స్సాక్షాత్కన్దర్ప ఇవ మూర్తిమాక్

 ధార్మిక స్యాప్యశక్తస్య తీవ్రాగ్ని త్వా దుపోషణే

 ఇదం ప్రత మ శేషాణాం వ్రతానా మధికం యతః

 కథయిష్యతి విశ్వాత్మా వాసుదేవో జగద్గురుః

 అ శేషయజ్గఫలద మ శేషాఘవినాశనమ్

 అ శేషదుఃఖశమన మ శేషామరపూజితమ్ 

పవిత్రాణాం పవిత్రం య న్మజ్గశానాంచ మజ్గళమ్

భవిష్యాణాం భవిష్యంచ పురాణానాం పురాతనమ్

వాసుదేవః : యద్యష్టమీ చతుర్దశ్యో ర్ద్వాదశీష్వపి భారత

అన్యేష్వపి దీనర్క్షేషు నశ క్త స్వ ముపోషితుమ్

తతః పుణ్యా మిమాం భీమ తిథిం పాపప్రణాశనమ్

ఉష్య విధానాఽనేన గచ్ఛే ద్విష్ణోః పరం పదమ్

దివ్యములగు అనుభావములుకల ఈనాటి (మత్స్యనారాయణుడు మనువునకు ఈ విషయమును చెప్పిన కాలమునందలి) కుశ స్థలిపురీని జగత్పతియగు నాయాజ్గచే (దేవశిల్పి) త్వష్ట శార్ణ ధనుర్ధారియగు శ్రీకృష్ణడగవానుని నివానమునకై ద్వాగవతీ పురియను పేర నిర్మించును. కైటభాంతకుడగు శ్రీకృష్ణుడు ఒకానొక సమయమున ఆ ద్వారక యందు సభయందాసీనుడు అగును. అమిత ప్రకాశుడగు ఆయనను తన పత్నులును. వృషైజాతీయులగు క్షత్రియులును మిగుల ప్రియులగు మిత్రులును కురు వంశీయులగు క్షత్రియులును దేవతలును గంధర్వులును దేవ గంధర్వులును పరివేష్టించియుందురు. ఆసభలో పురాణములును ధర్మమున క నుకూలములగు కథా ప్రవృత్తులును సాగుచుండ మాటలనడుమ ప్రతాపవంతుడగు శ్రీకృష్ణుని భీమ సేనుడు ఇపుడు నన్ను (మత్స్యనారాయణుని) నీపు (మనువు) అడిగిన ఈ రహస్యమును భేదించు ప్రశ్న మును ప్రశ్నించును. తరువాత ఆ భీమ సేనుడే ఈ ధర్మము (వ్రతము) ను ఆచరించు వాడును ఆధర్మమును లోకమున ప్రవర్తింపజేయువాడును అగును.

ఆ భీమ సేనుడు పాండు రాజకుమారుడు మహాబలుడు; ఆ ధర్మాత్మునకు నేను వృకము అను పేరుగల జత రాగ్ని ని ఇత్తును. అందుచే అతనికి వృకోదరుడను పేరు ప్రసిద్ద మగును. అతడు బుద్ధిశాలియు దానశీలుడును పదివేల ఏనుగుల బలమంత బలముగల గొప్పవాడును వార్తకము మొదలగు లోపములు లేనివాడును సాక్షాత్ రూపొందిన మన్మథుని వంటివాడును; ఐనను అతడు ధార్మికుడై ఉండియు తీవ్రమగు జఠరాగ్ని దీప్తి కలవాడగుటచే ఉపవాసము చేయుటకు శ క్తిలేని వాడు.

అతనికి విశ్వాత్ముడును లోకగురుడును అగు వాసుదేవుడు (శ్రీకృష్ణుడు) అన్ని వ్రతములలో గొప్పదియగు ఈ వ్రతము తెలుపును. ఇది సమస్త యజ్గముల ఫలము నిచ్చునది.సర్వపాపరాసుల నశింపజేయునది ఆ శేష దుఃఖముల శమింపజేయునది-సకల దేవతల పూజలనందుకొనునది. పవితములగు వానిలో పవితమును - శుభములగు వానిలో శుభ మగునదియు భవిష్యములగు వానిలో భవిష్యము (ఇంకముం దేంత కాలమువర కైన లోకమున ప్రచారములో నుండునది) పురాతనములగు వానిలో పురాతనమయినది (ఎంతో కాలమునుండి లోకమున ప్రచారమునందున్నది.

మాఘమాసస్య దశమి యదా శుక్లా భవే త్తదా

ఘృతే నాభ్యఞ్జానం కృత్వా తిలై స్నానం సమాచరేత్

తథైవ విష్ణు మభ్యర్చ్య నమో నారాయణేతి చ

 కృష్ణస్య పాదౌసమ్పూజ్య శిర స్సర్వాత్మనే నమః

 వై కుళ్లాయేతి వై కణ ముర శ్రీవత్సధారిణే

 శజ్ఖినే చక్రిణే తద్వ ద్గదినే వరదాయ చ

సర్వం నారాయణ స్యైవం సమ్పూజ్యాఽఽవాహయే త్క్రమాత్

దామోదరాయే త్యుదరం మేడ్రం పఞ్చశరాయ వై

ఊరూ సౌభాగ్యనాధాయ జానునీ భూతధారిణే

నమోఽతులాయవై జజ్ఘే పాదౌ విశ్వసృజే నమః

నమో దేవ్యై నమ శాన్తయై నమో లక్ష్మ్యై నమశ్శియై

నమః పుష్టై నమ సుష్టై నమో ధృత్యై నమో నమః

నమో విహజ్గనాధాయ వాయువేగాయ పక్షీణే

 విషప్రమథనాయేతి గరుడం చాభిపూజయేత్

 ఏవం సమ్పూజ్య గోవిన్ద ముమాపతివినాయకౌ

 గన్దమాల్యై స్తథా ద్భూపై ర్భక్షై ర్నా నావిధై రపి

గవ్యేన వయసా సిద్దాం కృసరా మథ వాగ్యతః

 సర్పిషా సహ భుక్త్వా తాం గత్వా శతపదం బుధః

న్యగ్రోధం దన్తకాష్ఠం స్యా దథవా ఖాదిరం బుధః

గృహీత్వా ధావయే దన్త నా చా నః ప్రాగుద జ్ముఖః

బ్రూయా త్సాయ న్తనీం కృత్వా సన్ద్యా మ స్తమితే రనౌ

నమో నారాయణాయేతి త్వామహం శరణం గతః

ఏకాదశ్యాం నిరాహార స్సమ్య గభ్యర్చ్య కేశవమ్

 రాత్రించ సకలాం స్థిత్వా స్నానంచ పయసా తతః

సర్పిషావాపి హవనం హుత్వా, బ్రాహ్మణపుజ్గవై

 సహైవ పుణ్డరీకాక్ష ద్వాదశ్యాం క్షీరభోజనమ్

 కరిష్యామి యతాత్మాఽహం నిర్విఘ్నం కురు మే వ్రతమ్

 ఏవము క్త్వా స్వ పేద్భూమా వితిహాసకథాం పునః

వాసుదేవుడు భీమసేనునకు ఇట్లు చెప్పెను: నీవు అన్ని అష్టమీ ద్వాదశీ చతుర్దశీ తిథులయందును ఇతరములగు శుభ నక్షత్ర తిథులయందును ఉపవసించి వ్రతము అనుష్టించుటకు శక్తి లేని పొడవయినచో ఈ పాప ప్రణాశక మగు మాఘ శుక్ల దశ మ్యే కాదశీ ద్వాదశీ తిథుల యందయిన ఈ చెప్పబోవు విధానమున వ్రతము చేసినచో విష్ణుస్థానము నందగలవు.

శ్రీకృష్ణుడు భీమసేనునకు ఇట్లు చెప్పెను: (ఈవ్రతము మూడునాళ్ళు-మాఘ శుక్ల దశ మ్యేకాదశీ ద్వాదశి తిథులయందు-దీక్షతో నుండి చేయవలసినది. అందు మొదట దశమి నాటి కృత్యము) మాఘ శుక్ల దశమినాడు నేతితో అభ్యంజనము చేసికొని నూవుల (పిండి)తో స్నానము చేయవలెను. ఈ చెప్పబోవు మంత్రములతో విష్ణుని పూజించ వలయును. మొదట విష్ణుని పాదములను పూజించవలయును. పిమ్మట 1. సర్వాత్మనేనమః శిరః పూజయామి; 2. వైకుంఠాయనమః కంఠం పూజయామి; 8. శ్రీవత్సధారిణేనమః ఉరః పూజయామి; 4. దామోదరాయనమః ఉదరం పూజయామీ; 5. పంచశ రాయనమః మేడ్రం పూజయామి; 6. సౌభాగ్యనాథాయనమః ఊరూ పూజయామి; 1. భూత ధారిణేనమః జానునీ పూజయామి; 8. ఆతులాయనమః జంఘే పూజయామి 9. విశ్వసృజేనమః పాదౌ పూజయామి.

ఈ మంత్రములతో నారాయణుని ప్రతియొక అవయవమును పూజించవలెను. ఈ పూజకు ముందుగా శంఖినే నమః చక్రిణేనమః గదినేనమః వరదాయనమఃఇత్యాది మంత్రములతో విష్ణుని ఆవాహనము చేయవలెను.

శ్రీదేవ్యైనమః-శాంత్యైనమః.ల వ్యైనమః - శియైనమః - పు ష్యైనమః -తు ష్యైనమః-ధృత్యైనమఃఇత్యాది మంత్రము లతో లక్ష్మిని పూజించవలెను.

విహంగనాధాయనమః వాయువేగాయనమః పక్షిణేనమః. విషప్రమథ నాయనమః- ఇత్యాది మంత్రములతో గరుడుని పూజించవలెను.

ఇట్లు గోవిందుని (లక్ష్మిని-గరుడుని) శివుని వినాయకుని నానావిధ గంధమాల్య ధూపదీప భక్ష్యములతో పూజించవలయును. ఆవుపాలతో పండిన పులగమును నేతితో మౌనముగా భుజించవలేను. నూరడుగులు నడువవలెను. సాయంకాలము కాగానే మర్రి ఊడను కాని చండ్రపుల్లను కాని ఉపయోగించి - దంత ధావనము చేసి తూర్పుగానో ఉత్తరముగానో తిరిగి కూర్చుండి ఆచమించవలెను. పిమ్మట సూర్యాస్తమయము కాగానే సాయం సంధ్యను ఉపాసించ వలయును. నమో నారాయణాయ. అహం త్వాం శరణంగత:-(నేను నిన్ను శరణు చొచ్చుచున్నాను. ) అని ప్రార్థించి భూమి పై నిద్రించవలెను.

(ఏకాదశీ దినకృత్యము) ఏకాదశినాడు నిరాహారుడై యుండి లెస్సగా కేశవుని అభ్యర్చించవలెను. (పిమ్మట విష్ణుని ఇట్లు ప్రార్థించవలెను.) “నేను ఈ రాత్రియంతయు గడపి (రేపుదయము) స్నా సమాడుదును. పాలతోగాని నేతితో గాని (నిన్నుద్దేశించి) హోమము చేయుదును. బ్రాహ్మణులతో కూడ క్షీరముతో భోజనము చేయుదును. ఇట్లు నియత మనస్కుడనై నీ వ్రతము చేయుదును. ఆ వ్రతమును నిర్విఘ్నము చేయుము.” అని ఇట్లు ప్రార్థించి కడపట ఇతి హాస కథను విని భూమి పై పరుండవ లేను.

శ్రుత్వా ప్రభాతే సఞాతే నదీం గత్వా విశాం పతే

స్నానంకృత్వా మృదా తద్వ త్పాషణ్డనపి వర్జయేత్

ఉపాస్య సన్ద్యాం విధివ తృత్వాచ పితృతర్పణమ్

ప్రణమ్యచ హృషీ కేశ మమలం చార్క మీశ్వరమ్

 గృహస్య పురత శ్శక్త్యా మణ్డపం కారయే ద్బుధః

దశర్హస్త మథాప్టావా తత్ర కుర్యా ద్విశాం పతే

 చతుర్హ స్తాం శుభాం కుర్యా ద్వేదీ మరినిషూదన

 చతుర్హ స్తప్రమాణంచ విన్య సే తత్ర తోరణమ్

 ప్రలమ్బ్య కలశం తత్ర మాష మాత్రేణ సంయుతమ్

 ఛిద్రేణ జలసమ్పూర్ణ మధః కృష్ణాజినే స్థితః

 తస్య ధారాం చ శిరసా ధారయే త్సకలాం నిశామ్

ధారాభి ర్బహుభి ర్బూరి ఫలం వేద విదో విదుః  

యస్మా త్తస్మా త్కురు శ్రేష్ఠ ధారా ధార్యాస్తు శ క్తిత

 తథైవ విష్ణో శ్శిరసి క్షీర ధారాం ప్రదాయేత్

అరత్ని మాత్రం క్షుణ్డoచ కృత్వా తత్తు త్రిమేఖలమ్

యోనిచక్రంతు తత్కృత్వా బ్రాహ్మణై ర్యవసర్పిడీ

తిలాశ్చ విష్ణుదేవత్యై ర్మన్త్రై రేకాగ్నివ త్తథా

కృత్వాద వైష్ణవం సమ్య క్చరుం గోక్షీరసంయుతమ్

మాషమాత్ర ప్రమాణంతు ధారా మాజ్యస్య పాతయేత్

జలకుమ్బా న్మహావీర స్థాపయిత్వా త్రయోదశ

భక్ష్యై ర్నా నావిధై ర్యుక్తా న్త్సితవ స్త్రై రలజ్కృతాః

యుక్తా నౌదుమ్బరై  పత్రైః పఞ్చరత్న సమన్వితాక్

 చతుర్భి ర్బహ్వృచైర్హోమ స్తత్ర కార్యో హ్యుదజ్ముఖై 

 రుద్రజాప శ్చతుర్భిశ్చ యజుర్వేదపరాయణే కి

వైష్ణవానిచ సామాని చతుర స్సామవేదినః

 అరిష్టవర్గ సహితా నభితః పరిపాఠయేత్

 (ద్వాదశీ దిన కృత్యము) ద్వాదశినాడు ఉదయమున నదికిపోయి -మృత్తికతో స్నానము చేసి వేద బాహ్యుల నెవరిని చూడక తాకక వారితో మాటలాడక సంధ్యావందనమును పితృ తర్పణమును చేయవలెను. నారాయణుని సూర్యుని ఈశ్వరుని నమస్కరించవలెను. ఇంటిముందు యథాశక్తిగ మంటపమును (పందిరిని) ఎనిమిది మూరలు కాని పది మూరలు కాని భుజముండునట్లు చతురస్రముగా నిర్మించి దాని నడుమ నాలుగు మూరల కొలత తో చతురస్రా కారపు చక్కని వేదిక (అరుగు) నిర్మించవలెను. అంతే కొలతగల తోరణమును కూడ దాని పై చుట్టును కట్టవలయును. ఆ వేదిక నడుమ పైనుండి వేలాడునట్లు జలపూర్ణ మై మినుప గింజంత రంధ్రముకల కడవను వేలాడదీయవలయును. దానినుండి పడు ఉదక ధారను రాత్రియంతయు యజమానుడు కృష్ణాజినముపై కూర్చుండి తన తల పై పడునట్లు చేసికొనవలెను. ఇట్లు అనేక జలధారలు పడుటచే విస్తారమగు ఫలము కలుగునని వేదవేత్తలు చెప్పుదురు. అట్లే వ్రత దిన మున విష్ణుని శిరము పై ఈ కలశము నుండి గోక్షీర ధారపడునట్లు చేయవలెను.

పిడిమూర కొలతతో చతురసపు కుండమును దానిచుట్టును మూడు మేఖలలను (అంచులను) చేయవలెను. దాని ముందు యోనిచక్రమును ఏర్పరచవలయును. బ్రాహ్మణులు విష్ణు దైవత్యములగు మంత్రములతో ఏకాగ్ని విధాన మున విష్ణుని ఉద్దేశించి ఆజ్యాహుతులను వేయవలయును. హోమమునకు. యవలు నేయి తిలలు ఆవుపాలతో నేతితో వండిన చరువును ఉపయోగించవలయును. ఆహుతులు మినుప గింజంత పరిమాణముతో ఉండవలయును. హోమస్థానము నందు పదుమూడు జలకలశములను నిలుపవలయును. వాటి పై నానా విధములగు భక్ష్యముల నుంచవలయును. పంచ రత్నములతో మేడి చిగురాకులతో తెల్లని కొత్త వస్త్రములతో వాటినలంక రించవలయును. నలుగురు ఋగ్వేదీయులు ఉత్తరముఖులై కూర్చుండి హోమము చేయవలయును. నలుగురు యజుర్వేదీయులు రుద్రమంత్ర జపము చేయవలయును. నలుగురు సామవేదులు విష్ణుదేవతాక సామమంత్రములు పఠించుచుండవలయును. వీరందరు శుభ లక్షణములు శుభ వస్త్ర ధారణము కలిగి శుభద్రవ్యములు దగ్గర నుంచుకొని యుండవలయును.

ఏవం ద్వాదశ తా న్విప్రా న్వస్త్రమాల్యానులేపనై  

 పూజయే దజ్గుళీయైశ్చ కటకై ర్హేమభూషణైః

వాసోభి శ్శయనీయైశ్చ విత్తశాఠ్యవివర్జితః

ఏవం క్షపాఽతినేయా చ గీతమజ్గశ నిస్వనై:

ఉపాధ్యాయస్య చ తతో ద్విగుణం సర్వమేవ తత్

తతః ప్రభాతే విమలే సముత్థాయ త్రయోదశ

 గావో దద్యాత్కురు శ్రేష్ఠ సౌవర్ణశృష్టిసంయుతాః

పయస్విన్య శీలవత్యః కాంస్యదోహసమన్వితా

రౌప్యఖురా స్సవస్త్రాశ్చ చన్దనే నాభి షేచితాః

తాశ్చ తేషాం తతో దద్యా దృక్ష్యభోజ్యసమన్వితా

 కృత్వాచ బ్రాహ్మణా న్త్సర్వా వృక్ష్యా పరమయా యుతః

 భుక్త్వా చాక్షార లవణ మాత్మనా చ విసర్జయేత్

అనుగమ్య ఫదాన్యస్టౌ పుత్రభార్యాసమన్వితః

 ప్రియతామత్ర దేవేశ  కేశవః క్లేశనాశనః  

 శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః

యథాఽన్తరం న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి

 ఏవ ముచ్చార్య తా న్కుంభా నావశ్చ శయనాని చ

 వాసాంసిచైవ సర్వేషాం గృహాణి ప్రావయే ద్బుధః

అభావే బహుశయ్యానా మేకామపి సుసంస్కృతామ్

 శయ్యాం దద్యా ద్ద్విజాతీనాం సర్వోపస్కరసంయుతామ్

 ఇతిహాసపురాణాని వాచయిత్వాఽతివాహయేత్

తద్దినం ద్విజశార్దూల య ఇచ్ఛే ద్విపులాం శ్రియమ్

ఇట్లు పూజా-జప-హోమ-ప్రక్రియ ముగిసిన తరువాత వస్త్ర-మాల్య - గంధానులేపనములతోను స్వర్ణాంగుళీయ కటక. హేమభూషణములతోను మంచములతో పడకలతోను శ క్తికి లోపము రానీయక ఆ పండ్రెండు మంది విప్రులను పూజించవలెను. ఆచార్యునకు మాత్రము ఋత్విక్కులలో ఒక్కొక్కరికి ఇచ్చిన దానికి రెట్టింపు దక్షిణాదికము ఈయవలెను.

తరువాత ఆ రాత్రి గీత వాద్యవినోదములతో గడుపవలెను. తెల్లవారిన తరువాత (త్రయోదశినాడుదయ మున) ఈ పదుముగ్గురకును (గాని మరి పదుముగ్గురు బ్రాహ్మణులకుగాని) పదుమూడు పాడియావులను దాన మీయవలేను. అవి బంగారు కొమ్ములు వెండి గిట్టలు పాలు పిదుకుటకు కంచుపాత్రలు నూతన వస్త్రపు కప్పడములు కలవై పొడువక తప్పిపోక మంచి స్వభావము కలవై యుండవలెను. వాటిని చందనముతో అభిషేకించి దానము ఈయవలెను. పిమ్మట వారిని భక్ష్యభోజ్య సమన్వితముగా భుజింపజేసి తానును ఉప్పు పులుపు కారము లేని యాహారము భుజించి వారిని వీడ్కొని తన భార్యాపుతులతో కూడ ఎనిమిది అడుగులు కూడ వెళ్లి వారిని సాగనంపవలయును. “కేశముల నశింపజేయువాడును దేవేశుడు నగు కేశవుడు నేను జేసిన ఈ వ్రతముచే ప్రీతి నొందుగాక! శివుని హృదయ(తత్వ)ము విష్ణువు-విష్ణుని హృద య(తత్వ)ము శివుడు; ఇట్లు పా రిరువుర నడుమ నేను అభేదమును భావన చేయుచున్నాను. కావున నాకు శుభమగు ఆయువును శుభములును కలుగుగాక!” అని పలుకుచు ఆ కుంభములను గోపులను శయనీయములను వస్త్రములను ఆయా బ్రాహ్మణుల ఇండ్లకు పంపవలయును. శ క్తిలేని యజమానుడు అందరకును (బ్రాహ్మణులకు) కలిసి ఒకే శయ్యనైన సామగ్రులతో అలంకరించిన దానిని ఈయవలెను.

ఆ దినము అంతయు ఇతిహాస పురాణ కథాశ్రవణముల తో గడుపవలయును. ఇట్లు చేసినచో విపులమగు సంపత్ భాగ్యములు కలుగును.

తస్మా త్స త్త్వం సమాలమ్బ్య భీమ సేన విమత్సరః

కురు వ్రత మిదం సమ్య క్స్నేహా దుహ్యం మయేరితమ్

త్వయా కృత మిదం వీర త్వన్నా మాజ్కం భవిష్యతి

సా భీమద్వాదశీ హ్యేషా సర్వపాపప్రణాశనీ  

యా తు కల్యాణినీ నామ పురాకల్పేషు పఠ్యతే

త్వ మాదికర్తా భవ సౌక రేఽస్మి న్కల్పే మహావీర వర ప్రదానే

 యస్మా త్స్మర న్కీర్తన మవ్య శేషు వినష్టపాప స్త్రీధశాధిప స్స్యాత్

కృత్వాచ యా మప్సరసా మధీశా వేశ్యా కృతా హ్యన్యభవాన్తరేషు

ఆభీరక న్యాతు కుతూహలేన సైవోర్వశీ సమ్పతి నాకవృష్ఠే

జాతాఽథ సా వైశ్యకులోద్భవాపి పులోమకన్యా పురుహూతపత్నీ

తత్రాపి తస్యాః పరిచారి కేయం మమ ప్రియా సంప్రతి సత్యభామా !

స్నాతః పురా మణల  మేష తద్వ తేజోమయం వేదశ రీర మాప

 అస్యాంచ కల్యాణతిథౌ వివస్వా న్త్సహస్రధా రేణ సహస్రరశ్మిః

ఇద మేవ కృతం మహేన్ద్రముఖ్యై ర్వసుభిర్దేవసురారికోటిభిశ్చ

 ఫలమస్య న శక్యతేఽభివక్తుం యది జిహ్వాయుతకో టయో ముఖే స్యుః

కలిక లుష విదారిణీ మనస్తా మీతి కథయిష్యతి యాద వేన్ద్ర సూనుః

 అపి నరకగతా న్పితృ న శేషా నల ముద్దర్తు మి హైవ యః కరోతి

య ఇద మనుశృణోతి చాతిభ క్త్యా పరీపఠ తీహ పరోపకార హేతో

 తిథి మిహ సకలార్థదాం నరేన్ద్ర స్స చ చతురాననసామ్యతా మువైతి !

 కల్యాణినీ నామ పురాఽబ్జగర్భా ద్యా ద్వాదశి మాఘదినేఽభీపూజ్యా

సాపాండుపుత్త్రేనకృతా భవిష్య తన నపుణ్యా ఽనఘభీమపూర్వా

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే కల్యాణభీమద్వాదశీ వ్రత

కథనం నా మైకోనస పతిత మోఽధ్యాయః

కావున భీమ సేనా! నీవు మత్సరములేక ఇతరులతో పోటీ చేయు తలంపులేక సత్వగుణము నవలంబించి లేన్సగా ఈ వ్రతము నాచరింపుము. ఈ వ్రత మతి రహస్యమయినను నీ యందలి స్నేహముచే నేను నీ కిది తెలిపితిని. నీవు దీని ననుష్ఠించుట చేత సర్వపాప ప్రణాశనమగు ఈ వ్రతమునకు భీమ ద్వాదశీ వ్రతమను పేరు ప్రసిద్ద మగును. పూర్వ కల్పములందు కల్యాణి నీ వ్రతమని ప్రసిద్ధమయి ఇష్టవరప్రదమగు దీనికి నీవు ఈ వారాహ కల్పమున ఆదికర్తవు మొదట చేసినవాడవు) కావలయును. ఏలయన ఈ వ్రతకల్పము అంతయు కీర్తించినను స్మరించినను అతడు కూడ దేవేంద్రుడగును. కుతూహలముతో దీనిని చేసినచో ఏ ఫలము కలుగునో చూతమని ఒకానొక ఆభీర ఆ హీరులను గోపాలకుల ! కన్య జన్మాంతరమునందు ఈ వ్రతము చేసి దేవవేశ్యలలో శ్రేష్టయగు ఊర్వశి యయ్యెను. ఒకానొక వైశ్య కన్య దీని నాచరించి మరియొక జన్మమున పులోముని కూతురై ఇం దుని భార్యయగు శచి యయ్యెను. . ఆ జన్మమున ఆ మేకు పరిచారిక గా నున్న యామె ఇపుడు నా భార్య సత్యభామగా నే నది. పూర్వము ఈ శుభ తిథియందు సహస రంధ్రములుకల కలశపు జలధారలతో స్నాన మాడిన పుణ్యపు ప్రభావమున సూర్యుడు వేదాత్మక శ రీర రూపమగు తేజో మయ మండలమును పొందగలిగెను.

ఇపుడు మహేంద్రుడుగా వస్తువులుగా గణదేవతలుగా దేవకోటులుగా రాక్షస శేషులుగా నున్న వారు కూడ ఒకప్పుడు ఈ వ్రతము నాచరించినవారే.

నోటియందు పదివేల కోటుల నాలుకలున్న ను దీని మహిమము చెప్పుట సాధ్యము కాదు. ఇది కలికలుష నాశ కము. ఆనంత పుణ్యప్రదము. అని ఇట్లు శ్రీకృష్ణుడు భీమ నేనునకు చెప్పును.

దీని నాచరించినవారు తమ పితరులను ఆంగరను నరకమునుండి ఉద్ధరించినవా రగుదురు. సకలార్థపదమగు ఈ ద్వాదశీ వ్రత మహిమమును వినినవాడును చదివి ఇతరులకు పరోపకార బుద్దితో వినిపించిన వాడును బ్రహ్మత్వమును పొందును.

పూర్వ కల్పములందు కల్యాణినీ ద్వాదశీ వ్రతమను పేర బ్రహ్మదేవునిచే లోకమున ప్రవర్తిల్ల చేయబడిన ఈ వ్రతము వాసుదేవుని ఉపదేశ ముచే భీమసేనునిచేత చేయబడి అనంత పుణ్యప్రదమయి భీమ ద్వాదశీ వ్రతమని ప్రసిద్ధ మగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున కల్యాణినీ భీమ ద్వాదశీ వ్రత కథనమను ఆరువది తొమ్మిదవ అధ్యాయము.