మత్స్య మహా పురాణము
107 - ప్రయాగ మాహాత్మ్యము
యుధిష్ఠిరః : శ్రుతం బ్రహ్మణా ప్రోక్తం పురాణం పుణ్యకీర్తనమ్ ।
తీర్థానాం తు సహస్రాణి శతాని నియుతానిచ॥
సర్వే పుణ్యాః పవితాశ్చ గతిశ్చ పర మా స్మృతా।
పృథివ్యాం నై మిశం పుణ్య మన్తరి క్షేచ పుష్కరమ్॥
త్రయాణామపి లోకానాం కురు క్షేత్రం విశిష్యతే ।
సర్వాణి తాని సన్యజ్య కథమేకం ప్రశంసనీ॥
ప్రయాగేతు త్వయాప్రోక్త మశ్రద్దేయ మనుత్తమమ్ ।
గతించ పరమాం దివ్యభోగాంశ్చైవ యథేప్సితాన్॥
కిమర్థ మల్పయోగేన బహుధర్మా నశంససి ।
ఏతన్మే సంశయం బ్రూహి యథాదృష్టం యథాశ్రుతమ్॥
మార్కణ్డేయః : ఆశ్రద్దేయం నవక్తవ్యం ప్రత్యక్షమపి యద్భవేత్ ।
నరస్యాశ్రద్దధానస్య పాపోపహతచేతసః॥
అశ్రద్దగానో హ్యశుచి ర్దుర్మతి స్యక్తమజః ।
ఏతే పాతన స్సర్వే తేనేదం భాషితం మయా॥
శృణు ప్రయాగ మాహాత్మ్యం యథాదృష్టం యథాశ్రుతమ్ ।
ప్రత్యక్షంచ పరోక్షంచయథాతథ్యంభవిష్యతి ॥
నచై వాన్యదదృష్టంచ యథాదృష్టం యథాశ్రుతమ్ ।
శాస్త్రం కృత్వా ప్రమాణంచ యుజ్యతే యోగమాత్మనా॥
క్లిశ్యతే చాపర స్తత్ర నైవయోగ మవాప్నుయాత్ ।
జన్మా త్తర సహ సేభ్యో యోగం లప్స్యతి మానవః॥
యథా యోగసహ సేణ యోగో లభ్యత మానవైః ।
యస్తు సర్వాణి రత్నాని బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛతి॥
తేన దానేన ద ళ్తేన యోగో లభ్యేత మానవైః ।
ప్రయాసేతు మృత స్యేదం సర్వం భవతి నాన్యథా॥
ప్రయాగ హేతుం పక్ష్యామి శ్రద్దధానస్య భారత ।
యథా సర్వేషు భూతేషు సర్వత్రేవచ దృశ్యతే॥
బ్రహ్మా నై వా స్త్రీ యత్కించి దబ్రాహ్మ మీతి బోధ్యతే ।
ఏవం సర్వేషు లో కేషు బ్రహ్మా సర్వత్ర పూజ్యతే॥
తథా సర్వేషు తీర్దేషు ప్రయాగః పూజ్యతే బుధే ।
పూజ్యతే తీర్థరాజశ్చ సత్యమేవ యుధిష్ఠిర॥
బ్రహ్మాపి స్మరతే నిత్యం ప్రయాగం తీర్థము త్తమమ్ ।
తీర్థరాజ మనుప్రాప్య నచాన్య త్కించిదర్షతి॥
కోహి దేవత్వ మాసాద్య మానుషత్వం చికీర్షతి ।
అనే వ ప్రమాణేన విజ్ఞాస్యసి యుధిష్ఠిర॥
యథా పుణ్యతమం నాస్తీ తథైవ కథితం మయా।
యుధిష్ఠిరుడు మార్కండేయునితో నిట్లనెను: కీ ర్తించినంతన పుణ్యకరమును తీర్ధ క్షేత్ర విషయక మునగు బ్రహ్మ పోక పురాణమును విని ఉంటిని. దానియందు నూరుల వేల లక్షల కొలదిగ తీర్థములు పేర్కొనబడినవి. అవన్నియు పుణ్యములును పవిత్రములును పరమగతి నిచ్చునవియును; అందునను పృథివి పై నై మిశమును అంతరిక్షమున పుష్కర మును లోకత్రయమునను కురు క్షేతమును విశిష్టములు. అవన్ని యు వీడిచి ఈ ప్రయాగమును ఇంతగ ప్రశంసింతు వేమి? ఇది నాకు విశ్వసనీయముగా తోచుట లేదు. అల్పయత్నముచే బహు భోగప్రాప్తియు పరమగతియు నెట్లు లభిం చును? ఇది నాకు సంశయకరముగ ఉన్నది. కావున మీరు వినినంత క నినంత తెలిపినా సంశయము దీర్ప వేడెదను. ఆన మార్కండేయు డిట్లు చెప్పెను. పాపోపహతచిత్తుడై పెద్దలను శాస్త్రములను విశ్వసించని వానికి ప్రత్యక్షముగ కనబడు విషయము కూడ నమ్మరానిదీగా తోచును. అతనికి ఏదియు చెప్పరాదు. అశ్రద్దధానుడు (ఆ సీక్యముతో విశ్వాసము పెట్టుకోననివాడు) అశుచియు దుర్మతియు అశుభ రూపవచన చిత్తకార్యములు కలవాడును వీరందరును పాతకులు; కావు ననే వీరి కేదియు చెప్పరాదంటిని. ప్రయాగ మాహాత్మ్యము పెద్దలనుండి వినబడునదియు ప్రత్యక్షముగ కనబడునదియు చెప్పెదను; వినుము. శాస్త్రమును ప్రమాణముగా చేసికొని చిత్తమును యోగమున నిలిపినవానికి పరోక్ష విషయము కూడ యథాతథముగ ప్రత్యక్షమగును. శాస్త్రములందు వినబడునదియు లోకమున కనబడునదియు మాత్రమే కాదు; అంతయు నతనికి గోచరమగును. యోగికి అదృష్టము కనబడనిది) ఏదియు లేదు. ఇతరుడు ఆయా విషయముల నేరుగుటకు ఎంతయో శ్రమ పడును. కాని యోగమును పొందజాలడు. (కావున వాడు అతీంద్రియ విషయము ల నేరుగజాల కుండును. ఏలయన జన్మాంతర సహస్రముల పుణ్యమున కాని మానవుడు యోగమును పొందజాలడు. వేలకొలది పుణ్యముల యోగము( కూడిక)చే మానవుడు యోగమును పొందగలుగును. సర్వ రత్నములను తనకున్న ఉత్తమ పదా ర్థములన్నియు) బ్రాహ్మణులకు దానము చేసినవానికి ఆ పుణ్యమున యోగము లభించును. కాని ప్రయాగలో మరణించిన వానికంతమాత్రనే యోగ సిద్ధి కలుగును. విశ్వసించువానికి ప్రయాగ శ్రేష్ఠత్వమును నిరూపించు యుక్తి చేప్పెదను వినుము. సర్వ భూతములయందును బ్రహ్మతత్త్వము చేతన్యరూపమున కనబడు చునే యున్నది. ఐనను బ్రహ్మము లేనే లేదు. అది కనబడుటలేదు. 'అని నా స్త్రీకుడు తలచుచున్నాడు. ఐనను సర్వలోకములందును బ్రహ్మమును విశ్వసించు చునే యున్నారు. పూజించుచునే యున్నారు. అట్లే వివేకులందరును సర్వ తీర్థములందును మిన్న యని ప్రయాగను పూజింతురు. కావుననే యది తీర్థరాజము; బ్రహ్మయు నిత్యమును ప్రయాగను స్మరించుచుండును. ఈ తీర్థరాజమును పొందగలిగినవాడు మరేదియు పొంద నక్కరలేదు. దేవత్వమును పొందినవాడు మానవత్వమును కోరడు గదా! ఈ యుక్తితోనే నీవు ప్రయాగ శ్రేష్ఠత్వము నాలోచింపుము. ఇ టైంతకంటే పుణ్యతర తీర్థ క్షేత్రము మ రేదియు లేదని నీకు తెలిపితిని.
యుధిష్ఠిరః : శ్రుతంహి య త్వయా ప్రోక్తం విస్మి తోహం పునః పునః॥
కథం యోగేన తత్రాప్తం స్వర్గవాసంతు కర్మణా ।
దాతా వై లభతే భోగా నథంవై కర్మణః ఫలమ్॥
తాని కర్మాణి పృచ్ఛామి పునర్వై ప్రాప్యతే మహి ।
మార్కణ్డేయ : శృణు రాజ స్రవక్ష్యామి యథోక్తకరణీం మహీమ్॥
గామగ్ని బ్రాహ్మణం శాస్త్రం కాళ్చానం సలిలం యః ।
మాతరం పితరంచైవ య నిన్హని నరాధమా॥
న తేషా మూర్ధ్వగమన మీతిప్రాహ ప్రజాపతిః ఏవం యోగస్య సమ్రాప్తి స్థానం పర మదుర్లభమ్॥
పత ని నర కే ఘోరే యే నరాః పాపకర్మిణః ।
హ స్వశ్వం గామన్వహం మణిముక్తాదిక్చానమ్॥
పరోక్షం హరతే యస్తు దానం నైవ ప్రయచ్ఛతి ।
న తే గచ్ఛ నివై స్వర్గం దాతారో యత్ర భోగినః॥
అనేక కర్మణా యుక్తః పచ్యతే నర కేఒధమః ।
మార్కణ్డేయః: శృణు రాజ న్మహాప్రాజ్ఞ యథోక్తాచారలక్షణమ్॥
వివిధానిచ రత్నా నీ గావో ముక్తాశ్చ కాఇ్చనమ్ ।
పరోపకారతో యస్తు పుమా స్థానం ప్రయచ్ఛతి॥
సవై గచ్ఛతిచ స్వర్గం స సుఖం పరమాం గతిమ్ ।
తస్మా త్సర్వప్రయత్నేన దేయం న్యాయార్జితంధనమ్॥
ఏవం స్వర్గాపవర్గెవా శుభాని లభతే నరః ।
అన్యాయార్జితవి త్రేన నరకం యాతి దారుణమ్॥
యోఒన్యస్య హృత్వా రత్నాని ప్రయచ్ఛతి నరోయది ।
రత్నాధిపస్య తత్పుణ్యం హృత్వా చౌర్యఫలం లభేత్॥
ఏతత్సర్వం సమా సేన కథితం రాజసత్తమ ।
పృచ్చ మాం యచ్చ వక్తవ్యం తత్సర్వం కథయామి తే॥
యుధిష్ఠిరః: ఆథ తీర్థం హ్యనుసర నేనవా కర్మణా మునే ।
తీర్థయాత్రాస్థలం మర్త్యో లభతే తద్వదస్వ మే॥
మార్కండేయ: శృణు రాజస్రవక్ష్యామి తీర్థయాత్రావిధిక మమ్ ।
ప్రతిగ్రహా దుపావృత్త స్సనుష్ణో యేన కేనచిత్॥
అహఙ్కార విముక్తాత్మా న తీర్థఫలమశ్ను తే ।
అకోపనశ్చ రాజేంద్ర సత్యవాదీ దృఢవ్రతః॥
ఆత్మోపమశ్చ భూతేషు స తీర్థఫలమశ్నుతే ।
ఏవం యోగం చ ధర్మంచ దాతారంచ యుధిష్ఠిర॥
యచ్చ సత్య మసత్యం వా అస్తి నాస్తితి యత్పలమ్ ।
నిరుక్తంతు ప్రవశ్యామి యథాహ స్వయ మజ్జజః
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మార్కణ్డేయయుధిష్ఠిరసంవాదే ప్రయాగ మాహాత్మ్యే సప్తోత్తరశతత మోధ్యాయః॥
మీరు చెప్పినది విని నాకు మరి మరి ఆశ్చర్యము కలుగుచున్నది. స్వర్గవాసము ఎట్టి యోగముచే ఎట్టి కర్మా చరణముచే లభించును? ఏ కర్మముల ఫలము ఎట్టిది? ఏ భోగములను ఏ కర్మములచే స్వర్గమం దనుభవించి మరల భూ లోకమునకు ఎట్లు ఎట్టి చోటికి చేరును? ఆ కర్మముల స్వరూపమును తెలుప వేడుచున్నాను. అన మార్కండేయు డిట్లు చేప్పెను: రాజా! కర్మ ఫలక్రమమును చెప్పేదను వినుము. భూమిని గోవును అగ్ని ని విప్రుని శాస్త్రమును బంగారమును నీటిని స్త్రీలను తల్లిదండ్రులను నిందించు నరాధముల కూర్ధ్వలోక గతులు లేవని ప్రజాపతి వచనము. ఇట్లే యోగసిద్ది ప్రదమగు స్థానము కూడ దుర్లభము. ఇట్టి పాపకర్ములగు నరులు ఘోర నరకమున పడుదురు. ఏనుగును గుర్రమును గోవును ఎద్దును మణిముక్తి కాంచనములను దాన మీయక పోగా పరోక్షముగా హరించువారు దాతలు పోవు లోకముల కేగి. భోగముల భుజించరు. అట్టి యధములు అనేక పాపకర్మముల ఫలముగా నరకమున ఉడికించబడుదురు.
మహాప్రాజ్ఞా! యుధిష్ఠిరా! యథా శాస్తోకాచార లక్షణమును తెలి పెద వినుము; వివిధములగు రత్నములు గోవులు ముత్తెములు బంగారము పరోపకారమునకై దానము చేయువాడు , స్వర్గ సుఖమును పరమపదమును కూడ పొందును. కావున సర్వ యత్న ములతో తన న్యాయార్జిత ధనమును దానము చేయుటచే నకల శుభములను స్వర్గమును మోక్షమును లభించును. విత్తము నన్యాయముగ నార్జించుటచే దారుణ నరకము నందును. ఇతరుల ధనమును హరించి దానము చేసినచో ఆ పుణ్యము ధనవు సొంతదారునకు చెందును. ఈ దాతకు దొంగతనము చేసిన పాపము చెందును. నీ వడిగినది సం క్షేపమున చెప్పితిని. "మరేదైన నడుగు -మదియంతయు చెప్పెదను. "అన యుధిష్ఠిరుడు మార్కండేయు నిట్లడిగేను: తీర్థయాత్ర కేగినవి డచట నేయే కర్మల నాచరించినచో యాతాఫలము లభించునో తెలుపుము. అన మార్కండేయు డిట్లనెను: రాజా! తీర్థయాత్రా విధాన క్రమములు తెలి పెద; వినుము. ప్రతిగ్రహమున కాసింపక ఏది లభించిన దానితో తృప్తి సందుచు అహంకార రహితుడై అకోపనుడై సత్యవాదియై చిత్తశుద్ధితో కర్మల నాచరించువాడై నర్వభూతములయందు తనయందువలే భావము కలిగియుండు నాతనికి తీర్థయాతాఫలము లభించును. ఇట్లే యోగము ధర్మము దాతృత్వము సత్యము అసత్యము ఆస్తిక త్వము నా స్త్రీకత్వము మొదలగు పదముల నిర్వచనమును (అర్థవిశదీకర ణమును) కూడ నీకు తెలి పెదను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట ఏడవ అధ్యాయము.
Summary of chapter 107 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the sacred discourse highlighting the celestial origins and spiritual virtues of Goddess Gaṅgā and Goddess Yamunā. Bhagavān Matsya enumerates various sanctified bathing ghats and sub-tīrthas established along the banks of these holy rivers, including Haṁsaprapatana, Urvaśītīrtha, Sandhyāvaṭa, and Bhogavatī. Bathers who perform ancestral Śrāddha and offer sesame seeds and water oblations at these specific locations satisfy their ancestors for thousands of years, securing health, prosperity, and spiritual liberation for their descendants.