33 - జరాప్రాప్తి విషయమున యయాతి-తత్పుత్త్రుల సంవాదము

శౌనకః జరాం ప్రాప్య యయాతిస్తు స్వపురం ప్రాప్య చైవహి

పుత్తం జ్యేష్టం వరిష్ఠం చ యదుమి త్యబ్రవీద్వచః

యయాతిః జరా వలీ చ మాం పు పలితానిచ పర్యగుః

కావ్యస్యోశనస శాపా న్న చతృప్తోస్మి యౌవనే

త్వం యదోః ప్రతిపద్యస్వ పాప్మానం జరయాసహ

యావనేన త్వదీయేన చరేయం విషయానహమ్

పూర్ణ వరసహ సేతు పునస్తే యౌవనం త్వహమ్

దత్వా స్వం ప్రతిపత్స్యామి పాప్మానం జరయాసహ

యదుః : జరాయాం బహవో దోషా పానభోజనకారితాః

తస్మా జైరాం న తే రాజ శొహిష్య ఇతి మే మతిః

సితశ్మశుధరో దీన్లో జరయా శిథిలీకృతః

వల్లీసన్నతగాత్రస్తు దుర్ధర్మో దుర్బలః కృశః

ఆశ క్తః కార్యకరణే పరిభూత స్స యౌవనై ఽ

సహోపజీవిభ శ్చైవ తజ్జరాం నాభికామయే

సత్తి తే బహవః పుత్తా మత్తః ప్రియతరా నృప

జరాం గ్రహీతుం ధర్మజ్ఞ పుత్త మన్యం బ్రవీహి వై

యయాతికి : య స్త్వం మే హృదయాజ్ఞాతో సం వయో న ప్రయచ్ఛసి

తస్మా దరాజ్యభా కాత ప్రజా తవ భవిష్యతి

యయాతికి : తుర్వసో: ప్రతిపద్యస్వ పాప్మానం జరయాసహ

యౌవనేన చరేయంవై విషయం స్తవ పుక

పూర్ణే వర్షసహసే తు పున ర్దాస్యామి యౌవనమ్

తథైవ ప్రతిపత్స్యామి పాప్మానం జరయాసహ

తుర్వసుః : న కామయే జరాం తాత కామభోగప్రణాశినీమ్

బలరూపా నకరిణీం బుద్ధి ప్రాణవినాశినీమ్

యయాతిః : య స్త్వం మే హృదయా జై తో వయ స్స్వం న ప్రయచ్చసి

తస్మాత్ర్పజా సముచ్ఛేదం తుర్వసో తవ యాస్యతి

సజ్కీర్ణాచారధర్మేషు ప్రతిలో మేఘ పుత్రక

పిశితాశీషు చా న్యేషు నూనం రాజా భవిష్యసి

గురుదారప్రసక్తేషు తిర్యగ్యోనిగతేషుచ

మ్లేచ్ఛేషు పశుధ ర్మేష పా పేషు ప్రసవిష్యసి

శౌనకః : ఏవం తు తుర్వసుం శస్త్వా యయాతి స త మాత్మజమ్

శర్మిష్ఠాయా స్సుతం జ్యేష్ఠం ద్రుహ్యుం వచన మబ్రవీత్

శౌనకుడు శతానీకునితో ఇంక ను ఇట్లు చెప్పెను: ఇటు పొర్ణకమును పొందిన యయాతి తన రాజధానిని చేరి తన పెద్ద కుమారుడును అందరకీ మేలే నవాడును అగు యదుని పిలిచి ఇట్లు పలికెను. “కుమారా! కవి మునికుమారు డగు ఉశనసుని శాపమువలన నాకు శ రీరము ముడుతలు పడినది; జుట్టు నరసినది. నాకో . యావనసుఖముల విషయమున ఇంకను తృప్తి కలుగలేదు. నీవు నా దోషమును ఆదోషమునకు ఫలమగు వార్ధక లక్షణమును స్వీక రింపుము. నీ యావనముతో నేను విషయముల ననుభవింతును. వేయి సంవత్సరముల తరువాత మరల నీ యావనము నీకు ఇచ్చి నా పాపమును వార్ధకమును తీసికొందును.” యదువు: “తండ్రీ! ముసలితనము కలిగినచో దానివలన పాన భోజనాది విషయములందు ఎన్ని యో దోషములు ఏర్పడును. అందుచే నీ ముసలితనమును నేను తీసికొనను. ఇది నా నిశ్చయము. ముసలితనముచే దేహము శిథిలమగును. మీసములు తెల్లనివగును. శరీరము ముడుతలు పడును. వంగి పోవును. చూచుటకు బాగుగా నుండదు. చిక్కిపోవును. ఇట్టిపాడు పనులు చేయుటకు అశక్తు డగును. వనమునందున్న వారును తన పై ఆధారపడి జీవించువారును కూడ అవమానింతురు. ఆందుచే నాకు ముసలితనము ఇష్టము కాదు. నీకు నాకంటెను ప్రీతిపాత్రులగు కుమారులు ఇంకను చాలమంది ఉన్నారుగదా! వారిలో ఇంకెవ్వరినై న మీవార్ధకమును తీసి కొమ్మని అడుగుడు. మీరు అన్ని ధర్మములను ఎరిగినవారు.” యయాతి “నా హృదయమునుండి పుట్టినవాడవై ('హృదయాదధి జాయసే.' అని శ్రుతి.) ఉండియు నీవు నాకు నీవయస్సు నీయకున్నావు. కావున నాయనా! నీ సంతతికి రాజ్యాధికారము లేకుండును.” అని అతడు తుర్వసునితో ఇట్లనెను. “కుమారా! తుర్వసూ! నో పాపదోషమును వార్ధక మును కూడ గ్రహింపుము. నీ యౌవనముతో విషయ సుఖముల ననుభవింతును. వేయి సంవత్సర ముల తరువాత తిరిగి నీ యౌవనమును నీకిత్తును. నా పాప దోషమును ముసలితనమును తీసికొందును." తుర్వసుడు : “తండ్రీ! వార్ధకము కామ సుఖానుభవములను తదితర భోగానుభవములను కూడ లేకుండ జేయును. బలమును రూపమును బుద్ధిని ప్రాణశక్తిని నశింపజేయును. కనుక నేనది గ్రహించ ఇష్టపడను.” యయాతి: “నీవు నా హృదయమునుండి పుట్టిన వాడవై ఉండియు నీ వయస్సును నాకీయకున్నావు. కనుక నీ సంతతి తుదివరకు కొనసాగక సముచ్చిన్న మగును. నీవు సంకీర్ణమగు ఆచా రములను ధర్మములను పాటించువారు ప్రతిలోమ జాతులవారు తక్కువ వర్ణపు పురుషునకు ఎక్కువ వర్ణపు స్త్రీతో సంగమము చే కలిగినవారు) పచ్చిమాంసమునై న తినువారు అంత్య వర్ణములవారు (ఊరి చివర నివసించువారు)-ఇట్టి వారి నడుమ రాజ వగుదువు. ఇది నిశ్చయము. గురుపత్ని తో నైన తిరక్-పశుపక్ష్యాది) ప్రాణులతోనైన సంగమించువారు మేచ్చులు (స్పస్టోచ్చారణము మొదలగు వవిత్ర రూపము లేని భాషల మాటలాడు వారు) పశువులవలె జీవించు.వ్యవహ రించువారు పాపులు మొదలగు వారినడుమ ఉండు చు సంతతిని కనెదవు.” తుర్వసుని ఇట్లు శపించి యయాతి శర్మష్ణకు పెద్దకొడుకగు ద్రుహ్యునితో ఇట్లు పలికెను.

యయాతిః : ద్రుహ్యో త్వం ప్రతిపద్యస్వ వర్ణరూపవినాశినీమ్

జరాం వర్ష సహస్రం మే యౌవనం సమయచ్చ తమ్

పూర్ణే వర్ష సహసే తు తే ప్రదాస్యామి యౌవనమ్

స్వం బౌదాస్యామి భూయో2పి పాప్మానం జరయాసహ

ద్రుహ్యుః : న రాజ్యం న రథం శాశ్వం జీర్ణో భుంకే న చ స్త్రీయః

నో రాగ శాస్య భవతి న జరాం తే న కామయే

యయాతిః : య స్త్వం మే హృదయాజ్ఞాతో వయః స్వం న ప్రయచ్ఛసి

తస్మాద్దుహ్యా ప్రియః కామో న తే సమ్పత్స్యతే క్వచిత్

ఉడుపప్లవసన్తారో యత్ర నిత్యం భవిష్యతి

ఆరాజ్యభాగభ్రష్టత్వం తత్ర ప్రాప్స్యసి సాన్వయః

యయాతిః : అనో! త్వంప్రతిపద్యస్వ పాప్మానం జరయాసూ

ఏవం వర్చసహస్రంతు చరేయం యావనేన తే

అనుః : జీర్ణ శ్శిశు రీవాద త్తే కాలే_న్న మశుచిర్యథా

న జుహోతిచ కాలేఒగ్నిం తాం జరాం నాభికామయే

యయాతికి : యస్వం మే హృదయాజ్ఞాతో వయ స్స్వం న ప్రయచ్ఛసి

జరాదోష స్వయోక్తో య స్తస్మా త్వం ప్రతిపత్స్య

ప్రజాశ్చ యౌవనం ప్రాప్తా వినశిష్య న్యనో తవ

అగ్నిప్రసననమనా స్వంచా పేలవం భవిష్యసి

యయాతిః : పూరో త్వం మే ప్రియః పుత్త స్వం వరీయా న్భవిష్యసి

జరా వలీ చ మే తాత పలితానిచ పర్యగుః

కావ్య స్యోశనస శాపా న్నచ తృప్తోస్మి యావనే

పూరో త్వం ప్రతిపద్యస్వ పాప్మానం జరయాసహ

కిడ్చాత్కాలం చరేయం వై విషయా న్వయసా తవ

పూర్ణే వర్షసహ సేవై ప్రతి దాస్యామి యౌవనమ్

స్వంచైవ ప్రతిపత్స్యామి పాపానం జురయాసహ

శౌనకః : ఏవముక్తః ప్రత్యువాచ పూరుః పితర మంజసా

యదార్థ త్వం మహారాజ తత్కరిష్యామి తే వచః

ప్రతిపత్స్యామి తే రాజ నాప్మానం జరయాసహ

గృహాణ యౌవనం మత్త శ్చర కామా న్యథేప్సితాక్

జరయాహం ప్రతిచ్ఛన్నో వయోరూపధర స్తవ

యావనం భవతే దత్వా చరిష్యామి యథేచ్ఛయా

యయాతిః : పూరో పీతోస్మి తే వత్స జరా మేతాం దదామి తే

సర్వకామసమృద్ధాసే ప్రజా రాజ్యం భవిష్యతి

ఇతి శ్రీమత్స్యమహాపురాణే శానకశతానీక సంవాదే చంద్రవంశానువర్ణ నే యయాతిచరితే యయాతితత్ పుత్త్ర సంవాదో నామ త్రయస్త్రింశోఽధ్యాయః

“ద్రుహ్యూ! జర అనునది దేహపువర్ణమును రూపమును నశింపజేయునదియే. ఐనను వేయి సంవత్సరములపాటు నాజరను నీవు తీసికొని నీ యౌవనమును నాకు ఇమ్ము. వేయేండ్లు కాగానే నీ యౌవనమును నీకిత్తును. నా పాపదోషమును ముసలితనమును తిరిగి తీసికొందును" ద్రుహ్యుడు: "జర చే శిథిలుడయినవాడు రాజ్యమును రథమును అశ్వమును స్త్రీలను వేటినీ కూడ అనుభవించజాలడు. వాటియందు ఇష్టము కూడ ఉండదు. కనుక నాకు అది ఇష్టము కాదు.” యయాతి: “నీవు నా హృదయమునుండి పుట్టినవాడ వై యుండియు నీవయస్సు నాకీయకున్నావు. కావున ద్రుహ్యూ! నీకు ఇష్టమగు ఏ కామమును (కోరిక యు) నెర వేరకుండుగాక ! నిత్యమును తెప్పల పై దాటియే వేరొక చోటికి పోవలసియుండు దేశమున రాజ్య భష్టుడవే జీవింతువుగాక! నీ సంతతివారును ఇట్టే అయి రాజ్యాధికారము లేకుందురుగాక!” యయాతి: “అనూ! నా పాపదోషముతో కూడ నొవార్తకమును నీవు తీసికొనుము. నీ యౌవనముతో వేయేండ్లు విహరింతును." అనువు: “జర చే శిథిలుడయినవాడు శిశువు వలెను అశుచియేమో అన్న ట్లును ఏదో సమయమున అన్న మును తినుచుండును. తగిన సమయములో అగ్ని కి హోమము చేయజాలడు. కనుక జర నాకు ఇష్టము కాదు.” యయాతి: “నాహృదయమునుండి పుట్టినవాడవై ఉండియు నీ యౌవనమును నాకీయకున్నావు. కనుక నీవు అనిన జరాదోషము నీకే ప్రాప్తించుగాక! నీ వంశము వారందరును యౌవనము రాగానే నశించుచుందురుగాక! నీపును నీవనినట్లే అగ్ని ప్రస్కందన మనస్కుడవు (అగ్ని మీదుగా దుముకుట యందు ఇష్టము కలవాడవు ఆగుదువుగాక! (ఇది మహాదోషము)”.

పిమ్మట యయాతి: “పూరూ! నీవు నా ప్రియపుత్రుడవు. అందరలో గొప్పవాడవు కూడ అయ్యెదవు. కవి మునికుమారుడగు ఉశనసుని శాపమువలన నన్ను ముడుతలును నరలును క్రమ్ముకొన్న వి. యౌవనము చే కలుగవలసిన తృప్తి నాకింకను కలుగలేదు. కనుక నీవు నాపాపదోషమును జరను గ్రహింపుము. నీవయస్సుతో కొంత కాలము విషయ సుఖముల ననుభవింతును. అట్లు నిండుగా వేయేండ్లున్న తరువాత నీ యౌవనము నీకిత్తును. నా పాప దోషమును వార్ధకమును నేను తీసికొందును." ఇట్లు పలికిన యయాతితో వెంటనే పూరు డి విధముగా ననేను: “మహారాజా! నీవు చెప్పినట్లే చేయుదును. నీ పాపదోషమును వార్తకమును నేను తీసికొందును. సోనుండి యావనము గ్రహింపుము. ఈప్సితములగు కామము లనుభవింపుము. ఇతరుల బలాత్కారము చే కాక) నా యథేచ్చతోనే నా యౌవనమును నీకిచ్చి నీవార్తకముతో కప్పబడి నీవయస్సును రూపమును ధరించి వ్యవహరింతును."

అని పలుకగా యయాతి: “నాయనా! పూరు: నేను నీ విషయమున ప్రీతుడనైతిని. నా ముసలితనమును నీకిత్తును. నీ ప్రజలు సంతతివారు) సర్వకామ సమృద్దులు అయ్యేదరు. నీకు (నీ సంతతి వారికి కూడ) రాజ్యాధికారము ఉండగలదు.”

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరిత్రమున యయాతి - తత్పుత్త్ర సంవాదము అను ముప్పదిమూడవ అధ్యాయము.