మత్స్య మహా పురాణము
191 - శుక్ల తీర్థ మాహాత్మ్యము॥
మార్కణ్డేయః : భార్గవేశం తతో గచ్ఛే దృగ్నో యత్ర జనార్దనః ।
అసురై స్తు మహాయుద్దే మహాబలపరాక్రమైః॥
హుజ్కారీతాస్తు దేవేన దానవాః ప్రలయం గతాః ।
తత్ర స్నాత్వాతు రాజేంద్ర సర్వపాపైః ప్రముచ్యతే॥
శుక్ల తీర్థస్య చోత్పత్తిం శృణు పాణ్డవనన్దన ।
హిమవచ్ఛిఖరే రమ్యే నానాధాతు విచిత్రితే॥
తరుణాదిత్యసఙ్కా శే తప్రకాఇనసప్రభే ।
వజస్పటిక సోపానే చిత్ర వేదిశిలాతలే॥
జామ్బూనదమయే దివ్యే నానాపుష్పోపశోభితే ।
తత్ర్రాసీనం మహాదేవం సర్వజ్ఞం ప్రభు మవ్యయమ్॥
లోకానుగ్రాహకం శాంతం గణబృబృందై స్సమాకులమ్ ।
స్కన్దనన్దిమహాకాళై ర్వీరభద్రగణాదిభిః॥
ఉమయా సహితం దేవం మార్కణ్డః పర్యపృచ్చత ।
దేవదేవ మహాదేవ బ్రహ్మవిష్ణ్వింద్రసంస్తుత॥
సంసారభయభీతోఽహం సుఖోపాయం బలీహిమే ।
భగవ న్భూతభవ్యశ సర్వపాపప్రణాశనమ్॥
తీర్థానాం పరమం తీర్థం తద్వదస్వ మ హేశ్వర ।
ఈశ్వరః శృణు విప్ర మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద॥
స్నానాయ గచ్ఛ సుభగ ఋషిసజ్ఘై స్సమావృతః ।
మన్వత్రికశ్యపా శ్చైవ యాజ్ఞవల్క్యోశనాజ్గిరాః॥
యూమాప స్తమ్బసంవర్తాః కాత్యాయన బృహస్పతీ ।
నారదో గౌతమ శ్చైవ సేవంతే దర్శకాజ్ఞిణః॥
గజ్గాం కనఖలం పుణ్యం ప్రయాగం పుష్కరం గయామ్ ।
కురుక్షేత్రం యథా పుణ్యం రాహుగ్రస్తే దివాకరే॥
దివా వా యది వా రాత్రా శుక్ల తీర్థం మహాఫలమ్ ।
దర్శనా త్స్పర్శనాచ్చైవ స్నా నా ద్దానా త్తపోజపాత్॥
హోమాచ్చైవోపవాసాచ్చ శుక్ల తీర్థం మహాఫలమ్ ।
శుక్ల తీర్థం మహాపుణ్యం నర్మదాయాం వ్యవస్థితమ్॥
మార్కండేయుడిట్లు చెప్పెను: తరువాత భార్గవేశ తీర్థము; అచ్చట విష్ణువు మహాబల పరాక్రములగు దానపు లతోడి యుద్ధమున వారి చేతిలో ఓడేను॥ పిమ్మట అతని హుంకారము చే వారు నశించిరి; ఆందు స్నానమాడినచో సర్వ పాప ముక్తుడగును; ఇక శుక్ల తీర్లోత్పత్తి తేలి పెదను వినుము॥ నానా గైరిక ధాతువులతో విచిత్ర రూపమును బాల సూర్య సమానమును కాచిన బంగారు వన్నె కలదియు వజస్పటికమణి సోపానములు కలదియు చిత్ర శిలాతలములతో కట్టిన యరుగులు కలదియు బంగారుతో చేయబడినదియు నాసో పుష్పోప శోభితమునునగు హిమవత్పర్వత శిఖరమునందు సర్వ జ్ఞుడును ప్రభుడును అవ్యయుడును లోకానుగ్రహ కర్తయు శాంతుడును స్కంద నంది మహాకాళ వీర భద్రాది ప్రమథ గణ పతులతోను ఉమతోనుకూడి కొలువు తీరినవాడునగు మహాదేవుని మార్కండేయు డిట్లడిగేను: దేవదేవా! మహాదేవా! బ్రహ్మ విష్ట్వింద్రాదులచే స్తుతించబడువాడా! భగవన్! భూత భవిష్యద్వర్తమాన ప్రభూ! మ హేశ్వరా! సంసార భీతుడనయిన నాకు సర్వపాప నాశమునకు సుఖోపాయమగు ఉత్తమ తీర్థ మేదియో తెలుపుము॥ " అనగా ఈశ్వరుడిట్లనెను: విప్రాః మహాప్రాజ్ఞా! సర్వశాస్త్ర విశారదా! సుందరుడా! (నాకు ప్రియమగువాడా!) మనువు ఆత్రి కశ్యపుడు అంగిరుడు - యాజ్ఞవల్క్యుడు శుక్రుడు యముడు ఆప స్తంబుడు సంవర్తుడు కాత్యాయనుడు బృహస్పతి నారదుడు గౌతముడు ఇట్టి ధార్మికులందరును సేవించునదియు నర్మదా నదియంద లిటియు నగు శుక్ల తీర్థ మునకు ఋషి సంఘములతో కూడిపోయి సేవింపుము; ఇది గంగా కనఖల ప్రయాగ పు రగయా కురు క్షేత్రములవలేనే పుణ్య ప్రదము; సూర్యగ్రహణ సమయమందును పగలుకాని రాత్రి కాని ఎపుడయినను దానిని దర్శించినను స్పృశించినను అందు స్నానమాడినను దాన జపతపములు హోమము ఉపవాసము చేసినను మహా పుణ్య ఫలమబ్బును॥
చాణక్యో నామ రాజర్షి స్సిద్దిం తత్ర సమాగతః ।
ఏతత్తైతం సముత్పన్నం యోజనం వృత్తసంస్థితమ్॥
శుక్లతీర్థం మహాపుణ్యం సర్వపాపప్రణాశనమ్ ।
పాదపాగ్రేణ దృష్టేన బ్రహహ్మత్యాం వ్యపోహతి॥
జలస్య(జగతీదర్శనాచ్చైవ) దృష్టిమాత్రేణ భ్రూణహత్యాం వ్యపోహతి ।
అహం తత్ర ఋషిశ్రేష్ఠ తిష్ఠామి హ్యుమయా సహ॥
వై శాఖే మాఘమా సేతు(వైశాఖే చైత్రమాసేతు) కృష్ణపక్షే చతుర్దశీ ।
కైలాసాచ్చాపి నిస్క్రమ్య తత్ర సన్నిహితో హ్యహమ్॥
దైత్యదానవగన్దర్వా స్సిద్దవిద్యాధరా స్తథా ।
గణాశ్చాప్సరసో నాగా స్సర్వే దేవా స్సమాగతాః॥
గగనస్థాస్తు తిష్ఠస్తి విమానై స్సార్వకామికైః ।
శుక్ల తీర్థంతు రాజేంద్ర హ్యాగతా ధర్మకాజ్జీణః॥
రజ కేన యథా వస్త్రం శుక్లం భవతి వారణా ।
ఆజన్మస్స్చూతం పాపం శుక్ల తీర్థం వ్యపోహతి॥
స్నానం దానం మహాపుణ్యం మార్కణ్డ ఋషిసత్తమ ।
శుక్ల తీర్థా త్పరం తీర్థం న భవిష్యతి భూతలే॥
పూర్వే వయసి కర్మాణి కృత్వా పాపాని మానవః ।
అహోరాత్రోపవాసేన శుక్ల తీర్థం వ్య పోహతి॥
తపసా బ్రహ్మచర్యేణ యజ్ఞై ర్ధానేన వా పునః ।
దేవార్చనేన యా తుష్టి ర్న సా క్రతుశ తైరపి॥
ఆచట చాణక్యుడను రాజర్షి సిద్ధి పొందెను; యోజన వైశాల్యముతో వృత్తముగా ఈ తీర్థ క్షేత్రమున్నది; ఇది సర్వపాప నాశకమును మహాపుణ్య ప్రదమును॥ ఇందలి చెట్టుకొన చూచినను బ్రహ్మహత్య తొలగును; దీని జలమును చూచినంతనే భ్రూణ హత్యాపాపము తొలగును; వైశాఖ మాఘ కృష్ణ చతుర్దశులందు కైలానమునుండి వచ్చి నేనచట ఉమతోకూడి నన్నిహితుడనై యుందును; ఆపుడు దైత్యదానవ గంధర్వసిద్ద విద్యాధరాప్పరో నాగులందరును సర్వకామ భోగ ప్రదములగు కామ గమన విమానముల పై గగనమున నిలుతురు; ఆ తీర్థము తన కడకు వచ్చిన ధార్మికుల ఆ జన్మ సంచిత పాపములను రజకుడు వస్త్రపు మురికిని కడిగి దానిని శుక్ల మొనర్చినట్లు శుద్ద పరచును; ఇంతకు మించిన తీర్థము ఇది వరకు లేదు; ఇక ముందుండదు; మానవుడు బాల్యమున చేసిన పాపములన్నియు ఇందు ఒక ఆహోరాత్ర ముప వసించినంతనే నశించును; ఇందు తప మోబ్రహ్మచర్యమో యజ్ఞమో దానమో దేవార్చన మో చేయుటచే కలుగు భగవతీతి వేరొక చోట వందల కొలదిగా యజ్ఞములు చేసినను కలుగదు;
పుణ్యే కార్తీకమా సేతు కృష్ణపక్షే చతుర్దశీ ।
ఘృతేన స్నాపయే ద్దేవ ముపోష్య పరమేశ్వరమ్॥
ఏక వింశ కులో పేతో న చ్యవే దైశ్వరా త్పదాత్।
శుక్లతీర్థం మహాపుణ్య మృషి సిద్దై ర్ని షేవితమ్॥
తత్ర స్నాత్వా నరో రాజ న్న పునర్జన్మభా గృవేత్ ।
స్నా త్వా వై శుక్ల తీర్థతు హ్యర్చయే ద్వృభధ్వషజమ్॥
కపాలపూరణం కృత్వా తుష్యత్యత్ర మహేశ్వరః ।
అర్ధనారీశ్వరం దేవం వటస్థం యో లిఖాపయేత్॥
శజ్ఞతూర్యనినాదై శ్చ బ్రహ్మ మో షైశ్చ సద్ద్వి జైః ।
జాగరం కారయే త్తత్ర నృత్యగీతాది జ్గళైః॥
ప్రభాతే శుక్ల తీర్థేతు స్నానం వై దేవతార్చనమ్ ।
ఆచార్యా గోజయే త్పశ్చా చ్ఛివవ్రతపరా ఇ్ఛుచీక॥
దక్షిణాం చ యథాశక్త్యా విత్తశాఠ్యం న కారయేత్ ।
ప్రదక్షిణం తతః కృత్వా శనై ర్దేవాన్తకం వ్రజేత్॥
ఏవం వై కురుతే యస్తు తస్య పుణ్యఫలం శృణు ।
దివ్యం విమానం చారూఢ స్తూయమానోఽ ప్స రోగ ణైః॥
శివతుల్యబలో పేత స్తిష్ఠ త్యాభూతసమ్లవమ్ ।
శుక్లతీర్థేము యా నారీ దదాతి కనకం శుభమ్॥
ఘృతేన స్నాపయే ద్దేవం కుమారం చాపి పూజయేత్ ।
ఏవం యా కురుతే భక్త్యా తస్యాః పుణ్యఫలం శృణు॥
మోదతే దేవలోకస్థా యావదింద్రా శ్చతుర్దశ ।
పౌర్ణమాస్యాం చతుర్దశ్యాం సజ్క్రానౌ విషువే తథా॥
స్నా త్వాతు సోపవాసస్స న్విజితాత్మా సమాహితః ।
దానం దద్యా ద్యథాశక్త్యా పీయేతాం హరీశజ్కరౌ॥
శుక్ల తీర్థప్రభావేన సర్వం భవతి చాక్షయమ్ ।
అనాథం దుర్గతం విప్ర నాథవ న మథాపివా॥
ఉదాహయతి య స్తీ ర్థే తస్య పుణ్యఫలం శృణు ।
యావత్తద్రోమసజ్ఖ్యాచ తత్ప్రసూతీకులేషుచ॥
తావద్వర్ష సహస్రాణి శివలోకే మహీయతే॥
ఇతి శ్రీ మత్స్య మహాపురాణే నర్మదామాహాత్మ్యే శుక్ల తీర్థమహిమానువర్ణనం నామ
ఏకనవత్యుత్తర శతతమోఽధ్యాయః॥
పుణ్యకరమగు కార్తిక కృష్ణ చతుర్దశి నాడు ఆ తీర్థ మందుపవసించి పరమేశ్వరునకు నేతితో అభి షేకము॥ జరిపినచో అతని ఇరువది యొక తరములవారు శివలోక ప్రాప్తులగుదురు; మహా పుణ్య ప్రదమును ఋషి సిద్ద ని షేవితము నగు ఈ తీర్థ మున స్నానము చే పునర్జన్మ ముండదు; ఇచట వృషభ ధ్వజునర్చించి అచటనున్న బ్రహ్మకపాలమును పుష్పా దులతో నింపినచో శివుడు సంతుష్టుడగును; వస్త్రము పై ఆర్థనారీశ్వరమూర్తిని లిఖింపజేసి ఆర్చించవలెను; శంఖ తూర్య ధ్వనులతోను బ్రాహ్మణుల వేద ధ్వనులతోను నృత్య గీతాది మంగళములతోను జాగరణము చేయవలయును; ప్రభాత మున ఆ తీర్థమున స్నానమాడి దేవతా పూజలు జరిపి శివవ్రత పరులు శుచులునగు ఆచార్యులను భుజింపజేసి యథాశ క్తిగ వారికి దక్షిణలనిచ్చి వారిని ప్రదక్షిణించవలెను॥ తరువాత దేవుని దర్శింప పోవలెను; ఇట్లు చేసినవారు దివ్య విమానమారో హించి అప్సరోగములు స్తుతించుచుండ శివలోక మేగి శివునితో సమానముగ ఆయా బలగములతో కూడి కల్పాంతము॥ వరకు అందు సుఖింతురు॥ శుక్ల తీర్థమునందు సువర్ణ దానముచేసి శివునకు నేతియభి షేకము జరిపించి కుమారస్వామి నర్చించిన స్త్రీ పదునలుగు రింద్రులున్నంత కాలము స్వర్గమున సుఖించును; పూర్ణిమ చతుర్దశి సంక్రాంతి విషవములు - వీటియందు ఇచట స్నానమాడి ఉపవసించి జీత మనస్కుడే శ్రద్దాయుక్తుడే యథాశక్తిగ దానము చేసినచో హరి శంకరులకు ప్రీతి కలుగును॥ శుక్లతీర్థ ప్రభావమున ఆ పుణ్యఫలము అక్షయమగును: దరిద్రుడును ఆనాధుడో ననాధుడో యగు విప్రునకిచట పెండ్లి జరిపించినచో ఆ విప్రుని శరీరమందును ఆతని వంశము వారి శరీరములందును కల రోమము లన్నీ వేల సంవత్సరములు శివలోకమందు సుఖించును॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున శుక్ల తీర్థ మహిమాను వర్ణనమను నూట తొంబది ఒకటవ అధ్యాయము॥
Summary of chapter 191 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya highlights the spiritual glories of Shuklatīrtha and Bhṛgutīrtha, two renowned pilgrimage sites along the lower course of river Narmadā. Shuklatīrtha is praised as the holy spot where Chāṇakya and ancient seekers cleansed severe karmic stains through intense devotion, while Bhṛgutīrtha serves as the ancestral seat of Maharshi Bhṛgu where sacred Vedic fire sacrifices were continuously maintained.