మత్స్య మహా పురాణము
195 - అంగిరోగోత్ర ప్రవరాను కీర్తనము॥
మత్స్యః : మరీచితనయా రాజ స్త్సురూపా నామ విశ్రుతా ।
భార్యా చాజ్గిర సో దేవా స్తస్యాః పుత్తా దశ స్మృతాః॥
ఆత్మా యు థమనో దక్ష స్సదఃప్రాణ స్తథైవచ ।
హవిష్మాంశ్చ గవిష్ఠశ్చ ఋత సత్యశ్చ తే దశ॥
ఏతే చాజిర సో నామ దేవా వై సోమపాయినః ।
సరూ జనయామాస ఋషీ న్సర్వేశ్వరా నిమాక్॥
బృహస్పతిం గౌతమంచ సంవర్త మృషిముత్తమమ్ ।
ఉచథ్యం వామదేవంచ ఆజస్య మృషిజం తథా॥
ఇత్యేతే ఋషయ స్సర్వే గోత్ర కారాః ప్రకీర్తితాః ।
తేషాం గోత్రే సముత్పన్నా శోత్రకారాన్ని బోధ మే॥
ఉచథ్యో గౌతమ శ్చైవ తెలేయోభిజిత స్తథా ।
సార్ధ నేమి స్సలౌగాక్షి క్షీరః కౌష్ఠికి రేవచ॥
రాహుకర్ణి స్సౌపురశ్చ కైరాతి స్సామలోమతిః ।
పౌషజితి ర్బార్గవతో హ్యృషి శైరీడవ స్తథా॥
కారోటక సజీవీచ ఉపబిన్దుసురైషిణి ।
వాహినీపతి వైశాలీ క్రోష్టా చై వారుణి స్తథా॥
సో మోత్రాయనికాసోరుకౌసల్యా పార్థివా స్తథా ।
రౌహిణ్యాయని రేవాగ్నీ మూలపః పాణు రేవచ॥
క్షపావిశ్వక రోఒరిశ్చ పారి: కారారిరేవచ ।
అజీరాస్సువచ్చళ్యో ఉశిజశ్చ మహానృషిః ।
పరస్పర మవ్ర వాహ్యా ఋషయః పరికీర్తితాః॥
ఆత్రేయాయని సౌష్ట్యా వగ్ని వేశ్య శ్శిలాస్థలిః ।
బాలిశాయని శ్చై కేపీ వారాహి ర్బాష్కలి స్తథా॥
సౌటిశ్చ తృణకర్ణిశ్చ స్రవహి శ్చాశ్వలాయనిః ।
వారాహి ర్బర్షి సాదీచ శిఖా గ్రీవి స్తథైవచ॥
కార కిశ్చ మహాకాపి స్తథా చోడుపతిః ప్రభుః ।
కౌచకి ఝూమిత శ్చైవ పుష్పాన్వేషి స్తథైవచ॥
సోమతన్వి ర్ర్బహ్మతన్వి స్సాలడి రాలడి స్తథా ।
దేవరాతి రేవస్థానిర్దారికర్ణి స్సరిద్భవి॥
బ్రా వేపి స్సాద్యసుగ్రీవి స్తథా గోమేదగల్గిక ।
మత్స్యాచ్చాదో మూలహరిః ఫలాహార స్తథైవచ॥
గాజోదధిః కౌరుపతిః కౌరు క్షేత్రి స థైవచ ।
నాయకి రైత్య దౌణిశ్చ జై హ్మలాయని రేవచ॥
ఆప స్తమి ర్మౌజ్ఞావృష్టి ర్మార్ఘ పిడ్గశిరేవచ ।
వైల శ్చైవ మహాతేజా శ్శా లఙ్కాయని రేవచ॥
ద్వ్యాఖ్యేయో మారుత శ్చైషాం త్ర్యార్జేయః ప్రవరో నృప ।
ఆక్టిరాః ప్రథమ స్తేషాం ద్వితీయశ్చ బృహస్పతిః॥
తృతీయశ్చ భరద్వాజః ప్రవరాః పరికీర్తితాః ।
పరస్పర మవై వాహ్యా ఇత్యేతే పరికీర్తితాః॥
[ఈ శ్రీమత్స్యమహాపురాణమున ఆంగిరో గోత్ర ప్రవర్తక ఋషులు పదునేడు గణములుగనున్నారు॥]
మత్స్య జనార్ధనుడు వైవస్వతునకు ఇట్లు వచించెను: రాజా! మరీచి ప్రజాపతి పుత్రి సురూప అను నామే అంగిరోమునికి పత్ని యయ్యెను॥ ఈ దంపతులకు పదిమంది దేవతలు కుమారులయిరి॥ వారు: ఆత్మ- ఆయువు-దమనుడు దక్షుడు సదుడు ద్రోణుడు హవిష్మాన్ గవిష్ణుడు ఋతుడు సత్యుడు॥ అంగిరసులను ప్రసిద్ధ నామముగల ఈ దేవతలు యజ్ఞములందు సోమపానము చేయువారు; ఈ సురూపయందే (ఈశ్వరులను వారు ఋషులలో ఉత్తమ శ్రేణికి చెందిన వారనీ లోగడ చెప్పబడినది॥) ఆందరును ఈశ్వరులను శ్రేణికి చెందిన ఈ ఋషులు కలిగిరి॥ 1॥ బృహస్పతి 2॥ గౌత ముడు 3॥ సంవర్తుడు 4॥ ఉతథ్యుడు 5॥ వామ దేవుడు 6॥ ఆజస్యుడు 7॥ ఋషిజుడు॥ ఈ - ఋషులందరును గోత ప్రతిష్టాపకులు; వీరి గోత్రములందుత్పన్ను లైన గోత్రకారుల వర్గములు ఇవి:
మొదటి వర్గము: ఉచడ్యుడు గౌతముడు తొలేయుడు ఆభిజితుడు సార్ధనేమి లౌగాక్షి క్షీరుడు కౌష్టికి రాహుకర్ణి సౌపురి కే రాతి సామలోమకి పౌషజిత్ భార్గవతుడు (ఋషి) ఐరీడవుడు కారోటకుడు సజీవి ఊపబిందువు సురేషిన్ వాహినీ పతి వైశాలి క్రోష్టా ఆరు సోముడు అత్రాయని కాసోరువు కౌ సేరువు కౌశల్యుడు పార్థివుడు గౌహిణ్యాయని అగ్ని మూలపుడు పాండుడు క్షపా విశ్వక రుడు ఆరి పారి కారారీ అను ఋషుల గోత్రము వారలకు ఆంగిరసుడు ఉచథ్యుడు గౌతముడు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వార లకు పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
రెండవ వర్గము: ఆత్రేయాయని సౌవేష్టుడు ఆగ్ని వేశ్యుడు శిలాస్థలి బాలిశాయని ఏవేషీ వారాహి బాషలి సౌటీ తృణకర్తి ప్రొఫహి ఆశ్వలాయని వారాహీ బర్షి సాది శిఖా గ్రీవి కారకి మహాకా(క)పి ఉడుపతి కౌచకి ధూ మీతుడు పుష్పా న్వేషి సోమతన్వి బ్రహ్మతన్వి సాలడి బాలడి దేవరాతి దేవస్థాని హారికర్ణి సరిద్బవి ప్రావేపి సాద్యసుగ్రీవి గోమేదగంధి కుడు మత్స్యాచ్ఛాదుడు మూలహ(లాహారి ఫలాహారి గాంగోదధి నౌరుపతి కౌరు క్షేత్రి నాయకి జై ద్రౌణి జైహ్మలాయని ఆప స్తంబి మౌంజవృష్టి మార్పుడు పింగళి పైలుడు శాలంకాయని ద్వ్యా ఖ్యేయుడు మారుతుడు॥ అను ఈ ఋషుల (గోత్రముల వార)లకు ఆంగిరసుడు బృహస్పతి భరద్వాజుడు ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు తగవు॥
కాణ్వాయనా కోపచయా స్తథా వాత్స్యతరాయణాః ।
భ్రాష్ట్రకృదాష్ట్రపిణ్డీచ లైంద్రాణి స్సాయకాయని॥
క్రోష్టాక్షీ బహువీతీచ తాలకృ న్మధురావహః ।
లావకృ ద్ధాలవి దౌథీ మార్కటిః పౌలికాయనిః॥
స్కన్దనశ్చ తథా చక్రీ గార్గ్య శ్యామాయని స్తథా ।
బలాకి సహరి శ్చైవ పఞ్చారేయాః ప్రకీర్తితాః॥
అజిరాశ్చ మహాతేజా దేవాచార్యో బృహస్పతిః ।
భరద్వాజ స్తథా గర్గ శైన్యశ్చ భగవా నృషిః॥
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః ।
కపితర స్స్వస్తితో దాక్షి శక్తిః పతజ్జలి॥
భూయసి ర్జలసన్దిశ్చ బిన్దు ర్మాదిః కుసీదకిః ।
ఊర్వసు రాజ కేశీచ నౌషటి శ్శంసపి స్తథా॥
శాలిశ్చ కలశీ కణ్ణఋషిః కారీరయ స్తథా ।
కాజ్యోధాన్యాయని శ్చైవ భావాస్యాయని రేవచ॥
భారద్వాజశ్చ సౌబుద్ది క్లఘ్వీ దేవమతి స్తథా ।
త్ర్యారేయో మునయ శ్చైషాం ప్రవరో భూమిపో శ్రమ॥
అజీరా దమబాహ్యశ్చ తథా చై వా పురుక్షయః ।
పరస్పరాయణ్య పర్ణీ లౌకిర్గాధ్యహరి స్తథా॥
గాలవిశ్చైవ త్ర్యారేయ స్సర్వేషాం ప్రవరో మతః ।
అజిరా స్సజ్కృతిశ్చైవ గౌరవీతి స్తథైవచ॥
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః ।
కాత్యాయనో హరితకః కౌత్సః పింగ స్తథైవచ॥
హండీదాసో వాత్స్యాయని ర్మాది ర్మౌలి? కుబేరణిః ।
భీమవేగః శార్వదర్బి స్సర్వే త్రిప్రవరా మతాః॥
అంగిరా బృహదశ్వశ్చ జీవనాశ్వ స్తథైవచ పరస్పరమవై వాహ్యా ఋషయః పరికీర్తితాః॥
బృహదుక్థో వామదేవ స్తథా త్రిప్రవరా మతాః ।
అజిరా బృహదుక్తశ్చ వామదేవ స్తథైవచ॥
పరస్పర మవై వాహ్యా ఇత్యేతే పరికీర్తితాః ।
కుత్సగోత్రోద్బ వాశ్చైవ తథా త్రిప్రవరా మతాః॥
అంగిరాశ్చ సదస్యుశ్చ పురుకుత్స సభై వచ ।
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః॥
సంకృతిశ్చ త్రిమార్షశ్చ మనుః సంబంధిరేవవా ।
తండ్రిశ్చ నాతకి శ్చైవ తై లకో దక్ష ఏవచ ॥
కుతాః కుత్సై రవైవాహ్యా ఏవ మాహుః పురాతనః ।
రథీత రాణాం ప్రవరాస్ త్యారేయాః పరికీర్తితాః॥
ఆళ్లిరాశ్చ విరూపశ్చ తథైవచ రథీతరః ।
రథోతరా హ్యవై వాహ్యా నిత్య మేవ రథత రైః॥
విష్ణువృద్ధిశ్శివమతి ర్జతృణః కర్తృణ స్తథా ।
పుత్రవశ్చ మహాతేజా స్తథా వైరపరాయణః॥
త్ర్యారేయోభి మత స్తేషాం సర్వేషాం ప్రవర శ్శుభః ।
సాత్యము ర్మహాతేజా హిరణ్య స్తంబముద్దలో॥
త్ర్యార్షేయోహీ మత స్తేషాం సర్వేషాం ప్రవరో నృప ।
అజ్గీరా మత్స్యదగ్ధశ్చ ముద్గలశ్చ మహాతపాః॥
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః ॥
మూడవ వర్గమువారు: కాణ్వాయనులు కోపచయులు వాత్స్యతరాయణులు భ్రాష్ట్రకృత్ రాష్ట్రపిండి లైద్రోణి సాయకాయనీ క్రోష్టాక్షి బహువీతిన్ తాలకృత్ మధురావహుడు లావకృత్ గాలవిత్ గాథ-మార్కటి పౌలికాయని స్కంద నుడు చక్రిన్ గాధ్యుడు - శ్యామాయని బలాకి హరి॥ ఈ ఋషుల (గోత్రముల వార)లకు ఆంగిరసుడు బృహస్పతి భర ద్వాజుడు గర్గుడు శై న్యుడు అను ఐదుగురు ప్రవర ఋషులు॥ ఈ ఋషుల గోత్రముల వారికి పరస్పర వివాహ సంబం ధములు పనికిరావు॥
నాలుగవ వర్గమువారు: కపివరుడు స్వ స్థితరుడు దాక్షి శక్తి పతంజలి భూయసి జలసంధి బిందుడు మాది కుసీదకి ఊర్వుడు రాజ కేశిన్ పౌషటి శంసపి శాలి కలశీకంఠుడు కారీరయుడు కాట్యుడు ధాన్యాయని భావాస్యాయని భార ద్వాజుడు సౌబుద్ది లఘ్విన్ దేవమతీ - ఈ ఋషుల (గోత్రములవార)లకు ఆంగిరసుడు దమ బాహ్యుడు ఉరుక్షయుడు అనుమువ్వురు ప్రవర ఋషులు; ఈ ఋషుల గోత్రముల వారలకు పరస్పర వివాహసంబంధములు పనికిరావు॥
ఐదవ వర్గము వారు: సంకృతి - త్రిమార్షి మనువు (సంబంధి) తండి ॥ నాతకి॥తై లకుడు దకుడు పరస్పరాయణి అపర్ణితాక్షి గార్గ్యహరి గోలవీ అను ఋషుల (గ్రోత్రముల వారల) కు అంగిరసుడు సంకృతి గౌరవీతి అను మువ్వురును ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
ఆరవ వర్గమువారు : కాత్యాయనుడు హరితకుడు కౌత్సుడు పింగుడు హండి దాసుడు వాత్స్యాయని మాది మౌళి కుబేరణి భీమవేగుడు శార్వదర్భి - ఈ ఋషుల గోత్రముల వారలకు అంగీరసుడు బృహదశ్వుడు జీవనాశ్వుడు ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహములు పనికిరావు॥
ఏడవ వర్గమువారు: బృహదుక్తుడు - వామ దేవుడు - అను ఈ ఋషుల (గోత్రముల వారల)కు ఆంగిరసుడు బృహదుక్తుడు వామదేవుడు అను మువ్వురు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారలకు వరస్పర వివాహ సంబంధములు తగవు॥
ఎనిమిదవ వర్గమువారు: కుత్సగోత్రము వారికి ఆంగిరసుడు సదస్యుడు పురుకుత్సుడు ఆనువారు ప్రవరఋషులు; ఈ కుత్సగోత్రమువారు తమలో తాము ఇచ్చిపుచ్చుకొనరాదు॥
తొమ్మిదవ వర్గమువారు: రథతర గోత్రము వారికి అంగిరసుడు విరూపుడు రథీత రుడు ఆనువారు ప్రవర ఋషులు; రథతర గోత్రమువారు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు॥
హంసజిహ్వా దేవజిహ్వా హ్యగ్ని జిహ్వావిరాడపః ।
ఆపాగ్నేయ స్త్వశ్వయుశ్చ పర ణ్యస్తావిమౌద్గలాః॥
త్ర్యార్షేయాభిమతా స్తేషాం సర్వేషాం ప్రవరా శ్శుభిః ।
అజీరా శ్చైవ తాణ్డిశ్చ మౌద్గల్యశ్చ మహాతపాః॥
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః ।
ఆపాణ్ణుశ్చ గురు శ్చైవ తృతీయ శ్శాకటాయనః॥
తతః ప్రగాథమానారీ మార్కణ్ణ శ్శరణ శ్శివః ।
కటుమర్కటప శ్చైవ తథా నాడాయనో హృషిః॥
శ్యామాయన స్తథై వై షాం త్ర్యార్జేయాః ప్రవరా మతాః ।
అజిరాశ్చాజమథశ్చ కట్య శ్చైవ మహాతపాః॥
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః ।
తిత్తిరిః కపిభూ శ్చైవ గార్గ్య శ్చైవ మహానృషి:॥
త్ర్యారేయో హి మత స్తేషాం సర్వేషాం ప్రవర శ్శుభః ।
అజీరా స్త్రీ త్తిరి శ్చైవ కవిభూశ్చ మహా నృషిః॥
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః ।
ఆథ ఋక్షభరద్వాజౌ ఋషివా న్మానవ స్తథా॥
ఋషి రైతవర శ్చైవ పశ్చార్జేయాః ప్రకీర్తితాః ।
అడ్గరా స్సభర ద్వాజ స్తథైవచ బృహస్పతిః॥
ఋషి ర్మిత్రవర శ్చైవ ఋషివా నానవ స్తథా ।
పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః॥
భార ద్వాజో హుత శ్శాజ్ఞ శ్శైశి రేయ స్తథైవచ ।
ఇత్యేతే కథితా స్సర్వే ద్వ్యాముష్యా యణగోత్రజాః॥
పక్చర్జేయా స్తథా హ్యేషాం ప్రవరాః పరికీర్తితాః ।
అజిరాశ్చ భర ద్వాజ స్తథైవచ బృహస్పతిః॥
మౌద్గల్య శైశిరి శ్చైవ ప్రవరాః పరికీర్తితాః ।
పరస్పర మవ్ర వాహ్యా ఋషయః పరికీర్తితాః॥
ఏతే తవోక్తాజ్గిర సస్తు వం మహానుభావా ఋషి గోత్రకారాః ।
యేషాం తు నామ్నా పరికీర్తితేన పాపం సమగ్రం పురుషో జహాతి॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే గోత్రప్రవరానుకీర్తనే ఆజ్గిరోగోత్ర ప్రవర వివరణం నామ
పఞ్చనవత్యు త్తర శతత మోధ్యాయః ॥
పదియవ వర్గమువారు: విష్ణువృద్ది శివమతి జతృణుడు కరృణుడు పుత్తవుడు (మహాతేజసుడు) వై రపరాయణుడు - ఈ ఋషుల గోత్రముల వారలకు అంగిరసుడు వీరూపుడు వృషపర్వుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారికి పరస్పర వివాహ సంబంధములు తగవు॥
పదునొకండవ వర్గము వారు: సాత్యముగ్రి - హిరణ్య స్తంబుడు- ముద్గలుడు॥ ఈ ఋషుల గోత్రముల వారలకు అంగీరసుడు మత్స్యదగ్గుడు ముద్గలుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
పండ్రెండవ వర్గము వారు: హంస జిహ్వుడు దేవజిహ్వుడు అగ్ని జిహ్వుడు విరాట్ ॥ అ ఆపుడు అగ్నేయుడు ఆశ్వయుడు పర ణ్యుడు తావి మౌద్గలుడు - ఈ ఋషుల గోత్రముల వారలకు ఆంగిరసుడు తాండి మౌద్గల్యుడు అను వారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారికి పరస్పరము వివాహ సంబంధములు పనికిరావు॥
పదునాలుగవ వర్గము వారు: ఆపాండువు గురువు శాక టాయనుడు ప్రగాథుడు మానాం మార్కండుడు శరణుడు శివుడు కటువు మర్కటపుడు నాడాయనుడు శ్యామాయనుడు అను ఈ ఋషుల గోత్రముల వారలకు ఆంగిరసుడు అజమీడుడు కాట్యుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పర స్పర వివాహ సంబంధములు పనితీగావు॥
పదునైదవ వర్గము వారు: తిత్తిరి - కపిభూ - గార్ధ్యుడు ఆను ఋషుల (గోత్రముల వారల)కు అంగీరసుడు తిత్తిరి కవీభూ అను వారు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
పదునారవ వర్గము వారు: ఋక్షుడు భరద్వాజుడు మానవుడు మైత్రవరుడు - అను ఈ ఋషుల గోత్రముల వారలకు అంగిరసుడు భరద్వాజుడు బృహస్పతి మీ తవరుడు మానవుడు అను ఐదుగురు ప్రవర ఋషులు; ఈ గోత్ర ముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
పదునేడవ వర్గ ము వారు: భారద్వాజుడు హుతుడు శొంగుడు శే శిరేయుడు - అనువారు ద్వ్యాముషాయణగోత్ర ములయందు జన్మించిన ఋషులు; ఈ ఋషుల గోత్రముల వారలకు ఆంగిరసుడు భరద్వాజుడు బృహస్పతి మౌద్గల్యుడు శై శిరి ఆనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
ద్వ్యాముషాయణులు తన కన్న తండ్రికిని పెంపుడు తండ్రికిని తారకులై రెండు వంశముల వారికి చెందిన గోత్రముల వారుగా గణింపబడువారు॥
ఈ అంగిరో వంశ గోత్ర కారుల నామములను కీర్తించినను నరుడు సర్వపాపముక్తుడగును॥
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున గోత్ర ప్రవరాను కీర్తనమున అంగిరోగోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది యైదవ అధ్యాయము॥
Summary of chapter 195 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya initiates the detailed genealogical section on Rishi lineages, beginning with the glorious Gotra and Pravaras descending from Maharshi Bhṛgu. The chapter lists major sub-lineages including Jamadagni, Aurva, Āpnavāna, and Vātsya, outlining the specific Pravara sage groups required for marital alliances and sacrificial invocations to maintain Vedic lineage purity.