78 - కమల సప్తమీ వ్రతము

ఈశ్వర : : అతఃపరం ప్రవక్ష్యామి తద్వత్కమలస ప్తమీమ్ ।

యస్యా స్సజ్గీర్తనాదేవ తుష్యతీహ దివాకరః॥

వసన్తామలస ప్తమ్యాం స్నాతః సన్గౌరసర్ష వైః ।

తిలపా తేచ సౌవర్ణం నిధాయ కమలం శుభమ్॥

పస్త్రయుగ్మయుతం కృత్వా గన్దపుష్పైః సమర్చయేత్ ।

నమః కమలహస్తాయ నమస్తే విశ్వధారిణే॥

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు తే ।

తతో వికాలవేళాయా ముదకుమ్బసమన్వితమ్॥

విప్రాయ దద్యా త్సమ్పూజ్య వస్త్రమాల్యవిభూషణైః।

శక్తిశ్చే త్కపిలాం దద్యా దలజ్కృత్య విధానతః॥

అహోరాత్రే గతే పశ్చా దష్టమ్యాం భోజయే ద్ద్విజాక్ ।

యథాశక్త్యా ఽథ భుఞ్జీత సప్తమ్యాం తైలవర్జితమ్॥

అనేన విధినా శుక్ల సప్తమ్యాం మాసిమాసి చ ।

సర్వం సమాచరే ద్భక్త్యా విత్తశాఠ్యవివర్జితః॥

వ్రతాన్తే శకునం దద్యా త్సువర్ణకమలాన్వితమ్ ।

గాంచ దద్యా త్స్వశక్త్యాచ సువర్ణాంచ పయస్వినీమ్॥

భాజనానదీపాదీక్ దద్యా దిష్టా నుపస్కరా ।

అనేన విధినా యస్తు కుర్యాత్కమలసప్తమీమ్॥

లక్ష్మీ మనన్తా మభ్యేతి సూర్యలో కేచ మోదతే ।

కల్పేకల్పే తథా లో కాన్త్సప్త గత్వా పృథక్పృథక్॥

అప్సరోభిః పరివృత స్తతో యాతి పరాం గతిమ్ ।

ఏతద్వృతం యశృణుయా త్సమగ్రం పఠేచ్చ భక్త్యాఽథ మతిం దదాతి॥

సోఽప్యత లక్ష్మీ మచలా మవాప్య గన్ధర్వ విద్యాధర లోకభా క్స్యాత్॥

ఇతి శ్రీమత్స్యమహాపురాణే కమలసప్తమీవ్రతకథనంనామాష్ట్ర సప్తతిత మోఽధ్యాయః॥

ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇపుడిక ఇట్టిదే యగు కమల సప్తమీ వ్రతమును తెలి పెదను. దానిని కీర్తించినంతనే ఆదిత్యుడు సంతసించును. వసంత (చైత్ర వైశాఖములలో నేదైన) శుక్ల సప్తమినాడు తెల్లని ఆవల (పిండితో నూనె)తో స్నానము చేసి నూవుల పల్లెరమునందు నూతన వస్త్రయుగ్మమునుంచి దాని పై బంగారు కమలముంచి గంధపుష్పాదికముతో సమర్చించవలెను. కమలహస్తుడు.విశ్వధారి దివాకరుడు-ప్రభాకరుడు (పగటిని.ప్రకా శమును కలిగించువాడు అగు రవీ! నీకు వందనము. అని నమస్కరించవలెను. పిమ్మట వికాల సంధ్యా సమయమున విప్రుని వస్త్రమాల్య విభూషణములతో సంపూజించి ఈ సామగ్రితో సువర్ణ కమలమును ఉదకుంభమును శక్తి యున్నచో సాలంకారముగ క పిలగోవును విధానానుసారము దానమీయవలెను. సప్తమినాడుపవసించే అష్టమినాడు యథాశ క్తిగ భుజింపజేసి తానును భుజింపవలెను. సప్తమినాడు మాత్రము తైలము లేని ఉపాహారము తినవలెను.

ఇట్లు ప్రతిమాసమున ధ:ముండియు లోభి చక శుక్ల సప్తమినాడు సంవత్సరము పొడవున చేయుచు పోవల యును. వ్రతాంతమున (ఉద్యాపనముగా) బంగారు కమలము తో పాటు సర్వోపసరములతో శయనము (మంచము పడ కలు) బంగారు కొమ్ములు అలంకరించిన పాడి కపిల గోవును పాత్రలు పీఠములు ఆసనములు దీపములు మొదలగు ఇష్ట సామగ్రిని కూడ ఈయవలెను.

ఇట్లు కమల సప్తమీ వ్రత మాచరించినవాడు అనంతమగు లక్ష్మిని పొందుటయే కాక సూర్యలోకమున సుఖిం చును. కల్పమునకు ఒకటి చొప్పున ఏడు ఊర్వలోకములకు క్రమశః పోయి అచ్చట నెల్ల అప్సరసలతో పూజలందుకొని సుఖించి తుదకు ముక్తి నందును.

దీనిని సమగ్రముగా భ క్తితో వినినను తెలిపినను ఇహమున స్థిరమగు ఐశ్వర్యము ననుభవించి పరమున విద్యా ధర లోకమున సుఖించును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున కమల సప్తమీ వ్రతమను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.