263 - దేవతా ప్రతిష్టా విధి - కుండ మండప వేదుల లక్షణము

ఋషయః : దేవతానా మథై తాసాం ప్రతిష్ఠావిధీ ముత్తమమ్

కుణ్డమణ్డపవేదీనాం ప్రమాణం చ యథాక్రమమ్

 వద సూత యథాన్యాయం సర్వేషామ ప్య శేషతః

సూతః : అథాత స్సమవక్ష్యామి ప్రతిష్ణావిధి ముత్తమమ్

కుణ్డమణ్డపవేదీనాం ప్రమాణం చ యథావిధి

 చైత్రే వా ఫాల్గునే వాపి జ్యేష్ఠే వా మాధవే తథా

మా ఘే వా సర్వదేవానాం ప్రతిష్ణా శుభదా భవేత్

 ప్రాప్య పక్షం శుభం శుక్ల మత్తే దక్షిణాయనే

పళ్చామీ చ ద్వితీయా చ తృతీయా సప్తమీ తథా

దశమీ పౌర్ణమాఫీ చ తథా శ్రేష్టా త్రయోదశి

 ఆసు ప్రతిష్ఠాం విధివ తృత్వా బహుఫలం లభేత్

ఆషాడే ద్వే తథా మూల ముత్తరాద్వయ మేవ చ

 జ్యేష్ఠాశ్రవణరోహిణ్యః పూర్వాభాద్రపదా తథా

హస్తాశ్వినీ రేవతీ చ పుష్యో మృగశిరా స్తథా

అనూరాధా తథా స్వాత ప్రతిష్టాదిషు శస్యతే

 బుధో బృహస్పతి శుక్ర గ్రయోజ ప్యేతే శుభగ్రహాః

 ఏభిర్ని రీక్షితం లగ్నం నక్షత్రం చ ప్రశస్యతే

 గ్రహతారాబలం లఙ్వా గ్రహపూజాం విధాయ చ

 నిమిత్తం శకునం లబ్ద్వి వర్జయిత్వాద్భుతాదికమ్

 శుభయోగే శుభస్థానే క్రూరగ్రహవివర్జితే

లగ్నే ఋ షేచ కుర్వీత ప్రతిష్టాదిక ముత్తమమ్

 అయనే విషువే తద్వ తడ శీతిముఖే తథా

ఏతేషు స్థాపనం కార్యం విధిదృషైన కర్మణా

 ప్రాజాపత్యేతు శయనం శ్వేతే తూత్థాపనం తథా

 ముహూర్తే స్థాపనం కుర్యా త్పున ర్భ్రాహ్మే విచక్షణః

ఋషులు సూతునితో నిట్లనిరి: సూతో! ఈ దేవతల ఉత్తమమగు ప్రతిష్టా విధిని కుండ మండప వేదుల ప్రమాణ ములను ఏమియు వదలక యథాక్రమమునను యథాన్యాయముగను (శాస్త్ర సంప్రదాయానుసారముగను యుక్తి యుక్తముగను) తెలుపుము. అన సూతుడు వారికిట్లు చెప్పెను :

మీరు అవి తెలిసికొన జిజ్ఞాసువులయి యున్నారు. కావున ఉత్తమమగు ప్రతిష్ణా విధానమును కుండ మండప వేదికల లక్షణమునుకూడ యథా శాస్త్ర విధానాను సారముగ తెలిపెదను.

కాలము

ఎల్ల దేవతల ప్రతిష్టలకును చైత్ర వైశాఖ జ్యేష్ట మాఘ ఫాల్గున మాసములు ప్రశస్తములు; శుక్ల పక్షమును ఉత్తరాయనమును మంచివి; తిథులలో ద్వితీయా తృతీయా పంచమీ సప్తమీ దశ మీ త్రయోదశీ పూర్ణిమలు మంచివి; ఈ చెప్పిన వానియందు యథావిధిగ ప్రతిష్ఠ జరిపినచో బహు ఫలము లభించును.

నక్షత్రములలో పూర్వాషాడోత్తరా షాఢలు-మూలోత్తర ఫల్గున్యుత్తరాభాద్రలు జ్యేష్ఠ శ్రవణము రోహిణి పూర్వా బాద్ర హస్త ఆశ్విని రేవతి పుష్యమి మృగశిర అనూరాధ స్వాతి- ఈ నక్షత్రములు మంచివి; బుధ బృహస్పతి శుక్రులు అను మూడు గ్రహములనేవి కాని చూచుచుండు లగ్న మును నక్షత్రమును ప్రశస్తములు.

గ్రహ బల తారా బలములను చూచికొని గ్రహపూజను జరిపి ప్రశ స్తమగు నిమిత్తమును శకునమును చూచికొని అద్భుతములు మొదలగు క్రూరములగునవేవియు జరుగని సమయమున శుభయోగమున క్రూర గ్రహములు లేని శుభ స్థానమున (రాశియందు) శుభలగ్నమునందు శుభ నక్షత్రమునందు ఆయన పుణ్య కాల విషువ పుణ్యకాల షడశీతి ముఖ పుణ్య కాలములందు శాస్త్ర విధానమునందు చెప్పిన ఆయా కర్మలననుష్ఠించుచు దేవతా ప్రతిష్ఠ జరుపవలయును.

ముహూర్తముల విషయమున-ప్రాజాపత్యముహూర్తమునందు దేవతార్చామూర్తి శయనమును శ్వేత ముహూ రమునందు ఉత్థాపనమును బ్రాహ్మముహూర్తమునందు స్థాపనమును (ప్రతిష్టాపనమును) జరుపవలయును.

ప్రాసాదస్యోత్తరే వాపి పూర్వేవా మణ్డపో భవేత్

హస్తా న్షోడశ కుర్వీత దశ ద్వాదశ వా పునః

మధ్యే వేదికయా యుక్తః పరిక్షిప్త స్సమ స్తతః

వఞ్చ సప్తాపి చతురః కరా నుర్వీత వేదికామ్

 చతుర్భి స్తోరణై ర్యుక్తో మణప స్స్యా చతుర్ముఖః

 ప్లక్ష ద్వారం భవే త్పూర్వం యామ్యే చౌదుమ్బరం భవేత్

పశ్చాదశ్వత్తఘటితం న్యగ్రోధం చ తథోత్తరే

 భూమౌ హస్తప్రవిష్టాని చతుర్హస్తాని చోచ్ఛయే

సూపలిప్తం తథా క్లష్ణం భూతలం స్యా త్సుశోభనమ్

 వనౌ ర్నా నావిధై స్తద్వ తుష్పపల్లవశోభితమ్

 కృత్వైవం మజ్జపం పూర్వం చతుర్ధ్వారేషు విన్య సేత్

అవణా నలశా నష్టా జ్వలత్కాఇ్చనగర్భితాక్

 చూతపల్లవసఇఛిన్నా నితవస్త్రయుగాన్వితాక్

 నానాపుష్పఫలో పేతాం శ్చన్దనోదకపూరితాక్

 ఏవం నివేశ్య తద్దర్భే గన్దధూపార్చనాదిభిః

 ధ్వజాధిరోహణం కార్యం మళ్తపస్య సమ స్తోతః

ధ్వజాంశ్చ లోకపాలానాం సర్వదిక్షు నివేశయేత్

 పతాకా జలదాకారా మధ్యే స్యా న్మణపస్యతు

గన్ధధూపాదికం కుర్యా శ్వైః స్వే ర్మనై ర్యథాక్రమమ్

 బలిం చ లోకపాలేభ్య స్స్వమ శ్రేణ నివేదయేత్

ఊర్ధ్వం తు బ్రహ్మణో దేయం త్వధస్తా చ్ఛేషవాసు కేః

సంహితాయాం తు యే మస్తా సద్దెవత్యా శ్రుతో స్మృతాః

 తైః పూజా లోకపాలానాం కర్తవ్యా చ సమ స్తతః

 త్రిరాత్ర మేకరాత్రం వా పథ్చారాత్ర మథాపి వా

 అథవా సప్తరాత్రం వా కార్యం స్యా దధివాసనమ్

 ఏవం సతోరణం కృత్వా అధివాసనమజ్ఞపమ్

 తస్య చోత్తరతః కుర్యా త్నానమజ్ఞప ముత్తమమ్

 తదర్దేన త్రిభాగేన చతుర్బాగేన వాపునః

ఆనీయ లిజ్గ మర్చాం వాశిల్పినం పూజయే ద్బుధః

వస్త్రాభరణరత్నైశ్చ యేపి తత్పరిచార కాః

 క్షమధ్వ మితి తా న్బూయా ద్యజమానోప్యతః పరమ్

మండపాది లక్షణము

ప్రాసాద (దేవాలయ)మునకు ఉత్తరమందుకొని తూర్పునకాని (హోమాది ప్రక్రియలకు) మండపముండవల యును; ఆది పదునారుకాని పండ్రెండు కానీ హస్తముల (మూరల) ప్రమాణముకల నాలుగు భుజములతో చతురస్రాకృతితో నుండవలయును; దాని నడుమ వేదిక యుండవలయును; ఈ మండపము చుట్టును ఆంచుకట్ట మొదలగు అవధి జ్ఞాపి కలు ఉండవలయును. ఈ వేదిక నాలుగుకొని ఐదుకోని ఏడు కాని మూరల భుజములతో చతురస్రముగా నుండవలయును; ఈ మండపము చతుర్ముఖమై నాలుగు వైపులను నాలుగు తోరణములతో (ద్వారములతో) నుండవలయును; ఈ ద్వారములలో తూర్పు ద్వారము జువ్వి కొయ్యతో దక్షిణ ద్వారము మేడి కొయ్యతో పశ్చిమ ద్వారము రావి కొయ్యతో ఉత్తర ద్వారము మర్రి కొయ్యతో చేయవలయును; ఈ ద్వారముల నిలువు కమ్ములు ఐదు మూరల పొడవుతో చేయవలయును; ఆందు ఒకమూ రేడు ముక్క భూమిలోనికిపోగా నాలుగు మూరలు భూమి పై నుండును.

మండప మందలి భూతల మంతయు చక్కగా అలికి కంటికి ఇంపుగా నుండునట్లు చేయవలయును; దానినంత టీని నానా విధ వస్త్రములతోను పుష్పములతోను పల్లవములతోను అలంకృతమునుగా చేయవలయును; ఇట్లు మండపమును శోభింపజేసిన తరువాత నాలుగు ద్వారములందును ఒక్కొక్క ద్వారపు రెండేసి నిలువు కమ్ముల దగ్గరను రెండేసి చొప్పున మొత్తము ఎనిమిది కలశములను ఉంచవలయును; వానికి రంధ్రములు సొట్టలు మొదలగునవి యుండరాదు; వానియందు ప్రకాశించు పదారు వన్నె బంగారు ఉంచవలయును; మామిడి చిగుళ్లతో వానిని కప్పవలయును; రెండేసి నూతన వస్త్ర ములు చుట్టవలెను; నానా పుష్ప ఫలములనందుంచవలెను; ఇట్టి ఈ కలశములను చందనోదకముతో నింపవలయును; ఆ మండపాంతర్భాగమునందు ఇవియన్నియును నిలిపి వానికి గంధ ధూపొదికముతో ఆర్చనలు జరుపవలయును; తరు వాత మండవము పై అన్ని వైపులను ధ్వజములను (జెండాలను) ఎక్కించవలెను. ఇవికాక అన్ని దిక్కులందును ఆయా దిక్పాలకులకు చెందిన ధ్వజములనుకూడ ఎక్కించవలయును; మండపపు పై భాగమున నట్టనడుమ మేఘమువంటి ధ్వజ మును ఒక దానినికూడ ఎక్కించవలయును; వానికి ఆయా దేవతా మంత్రములతో గంధ ధూపాదికముతో యథాక్రమ ముగ అర్చనలు జరుపవలయును; వారి వారి మంత్రములతో లోకపాలురకు బలులుకూడ అర్పించవలయును; బ్రహ్మకు అంతటిలో పై భాగమందును శేషునికి వాసుకికి అంతటిలో క్రింది. ప్రదేశమందును పుష్ప గంధాదికమును అర్పించవల యును; ఆయా దేవతలకే ఏయే మంత్రములు శ్రుతియందు చెప్పబడి యున్నవో ఆయా లోకపాలురకు ఆయా మంత్రము లతో పూజయును జరుపవలయును. ఇట్లు తోరణ నపాతముగా ఆధివాననశాలను ఏర్పరచిన తరువాత దేవతా మూర్తులకు ఒక రాత్రిని మూడు రాత్రులు కాని ఐదు రాత్రులు కాని ఏడు రాత్రులుకొని ఆధివాసనము జరుపవలసియుండును.

ఈ ఆధివానన మండపమునకు ఉత్తరమున ఈ మండలపు కోలతలో సగము కోలతతో కానీ మూడవవంతు కొలతతో కాని నాలుగవంతు డోలతతోకాని స్నానమండపమును నిర్మించవలయును. లింగమునో అర్చామూర్తినో (ప్రతిష్ఠించవల సినదానిని) తెప్పించిన తరువాత ఆ తెచ్చిన శిల్పులను వారి పరిచారకులను కూడ యజమానుడు ఆయా విషయములను సంప్రదాయములను ఎరిగి వస్తాథర జాదికముతో పూజించవలయును. తరువాత క్షమించుడని అతడు వారిని ప్రార్థించవలయును.

నేత్రోన్మీలన విధానము.

 [ఈ చేప్పబోవు ప్రక్రియను నేత్రోన్మీలనము-నేత్రోద్దరణము (కనురెప్పలు పైకెత్తుట కనులు తెర చుటకనులకు చూపు వచ్చునట్లు చేయుట కనులకు ప్రకాశమును జ్యోతిస్సును కలిగించుట) మొదలగు పదములతో ఇందు వ్యవహరించి యున్నారు. దేవతా ప్రతిష్టాప్రక్రియయందీది ముఖ్యాంశము.]

నేత్రోన్మీలనవిధిః.

దేవం ప్రస్తరణే కృత్వా నేత్రజ్యోతిః ప్రకల్పయేత్

ఆక్ష్ణో రుద్దరణం వచ్యే లిజ్గస్యాపి సమానతః        

 సర్వతస్తు బలిం దద్యా త్సిద్ధార్థమృతపాయ సైః

శుక్లపుష్పై రలజ్కృత్య మృతగుగ్గులుధూపకైః

విప్రాణాం చర్చనం కుర్యా ద్దద్యా చ్ఛక్త్యా చ దక్షిణామ్

గాం మహీం కానం చైవ స్థాపకాయ నివేదయేత్

 లక్షణం కార యే ద్భక్త్యా మ శ్రేణానేన వై ద్విజః

 ఓం : నమో భగవతే తుభ్యం శివాయ పరమాత్మనే

 హిరణ్యరేతసే విష్ణో విశ్వరూపాయ తే నమః

 మనోయం సర్వదేవానాం నేత్రజ్యోతిష్వపి స్మృతః

 ఏవమామ స్త్యో తం దేవం కాజ్చానేన విలేఖయేత్

మజ్గళ్యాని చ వాద్యాని బ్రహ్మ ఘోషం సగీతకమ్

 సిద్ధ్యర్థం కారయే ద్విద్వా నమజ్గజళ్యనివారణమ్

దేవుని అర్చామూర్తిని (లింగమును) దర్భలు మొదలగు వానితో ఏర్పరచిన ప్రస్తరణము పై పొన్పు పైడించి ఆ మూర్తికి నేత్ర జ్యోతిస్సును ప్రకల్పింప (ఏర్పరచవలయును; సంక్షేపముగా ఈ అత్యుద్ధరణ ప్రక్రియను (ఆక్షి+ ఉద్దరణము = అత్యుద్ధరణము-కనులు పైకెత్తుట-మూతను తెరచుట-ఆని యర్థము) తెలి పెదను - వినుడు; మూర్తిని తెల్లని పూవులతో అలంకరించి నేతితోను గుగ్గులుతోను ధూపమిచ్చి ఆర్చించవలయును; తెల్లని ఆవలతోను నేతి పాయసముల తోను మూర్తికి బలి (నివేదనము) జరుపవలయును: విప్రులనుకూడ ఆర్చించవలయును; యథాళ కిగ వారికి గోవునో