18 - ద్విజాదులకు ఆ శౌచాదిక ము-ఏకోద్దిష్టాది శ్రాద్ధవిధి 

సూతః : ఏకోద్దిష్ట మథో వక్ష్యే యదుక్తం చక్రపాణినా

మృతే పుత్రై ర్యథా కార్య మాశౌచం చ పితర్యపి

 దశాహం శావ మాశౌచం బ్రాహ్మణేషు విదేయతే

 క్షత్రియేషు ద్వాదశాహం పక్ష వై శ్యేషు చైవ హి

 శూద్రేషు మాస మాశౌచం సపిండేషు విధీయతే

 నైశం చాకృతచూదీస్య త్రిరాత్రం పరతః స్మృతమ్

 జననే ష్వేవమేవం తు సర్వవర్ణేషు సర్వదా

 అస్థిసంచయనా దూర్ద్వ మంగస్పర్శో విధీయతే

 ప్రేతాయ పిండ దానం తు ద్వాదశాహం సమాచరేత్

 పాథేయం తస్య త్పత్రోక్తం యతః ప్రీతికరం మహత్

 తస్మా త్ప్రేతపురం ప్రేతో ద్వాదశా హేన నీయతే

 గృహపుత్త్రకళత్రాది ద్వాదశాహం ప్రపశ్యతి

 తస్మా న్ని ధేయమాకా శే దశరాత్రం పయ స్తథా

ప్రేత తాపోపశాంత్యర్థ మధ్వ శ్రమవినాశనమ్

 ఏకాదశా హే విప్రాణాం ద్విజా నేకాద శైవ తు

 క్షత్త్రాది సూతకాంతే తు భోజయే దయుతం ద్విజాన్  

ద్వితీయేఽ హ్ని పున స్తద్వ దేకోద్దిష్టం సమాచరేత్

 ఆవాహనాగ్నౌ కరణే దేవహీనం విధానతః

 ఏకం పవిత్ర మేకార్ఘ్య మేకః పిండో విధీయతే

 ఉపతిష్ఠతా మిదం దేయం పశ్చాచ్చైవ తిలోదకమ్

 స్వదీతం వికి రే బ్రూయా ద్విసర్గే చాభిరమ్యతామ్

శేషం పూర్వవ దత్రాపి కార్యం వేదవిదో విదుః

 అనేన విధినా సర్వ మనుమాసం సమాచరేత్

 సూతకాన్తే ద్వితీయేహ్ని శయ్యాం దద్యా ద్విచక్షణః

సూతుడు మహరులకుఇంకను ఈ విధముగా చెప్ప నారంభించెను: మత్స్యరూపుడగు నారాయణుడు మనువు నకు చెప్పినట్లు తండ్రి మరణించినపుడు పుత్తులు చేయవలసిన ఏకోద్దిష్ట శ్రాద్ధ విధానమును ఆశౌచము పాటించవలసిన నిర్ణయమును తెలిపేదను.

మృతాశౌచము బ్రాహ్మణులకు పది దినములు క్షత్రియులకు పం డేండు దినములు వేశ్యులకు పదునై దు దీన ములు శూద్రులకు ముప్పది దినములు ప్రాటించవలసియుండును. పదునొకండవ-పదుమూడవ-పదునారవముప్పదియొక టవ-దినములందు స్నానము చేసిన వీరి కందరకు కుద్ధి యగును.) చూడాకర్మ జరుగని (మూడేండ్లు నిండని) శిశువు మరణించినచో ఒక దినము మూడేండ్లు నిండినది మొదలు ద్విజులకు ఉపనయనమును ఇతరులకు వివాహమును కానంత వరకు మూడు దినములు మృతాశౌచము.

జాతాశౌచము (పురుడు) కూడ ఆయా వర్ణముల వారికి పైన చెప్పినట్లు పది-పండ్రెండు-పదునై దు.ముప్పది దినములే అని తెలియవలెను.

తండ్రి మొదలగువారు మరణించినపుడు దహనము జరిపి పిమ్మట అస్థి సంచయనము దహనము చేయగా ఏర్పడిన భస్మమునుండి ఎముకలను ప్రోగు చేయుట) జరిగిన తరువాతనే అంగస్పర్శము మరణించిన వాని పుత్రుడు మొదలగు శ్రాద్ధకర్తలను అతని సన్నిహిత జ్ఞాతులై నను తాకుట) జరుగవలెనని శాస్త్రము విధించుచున్నది.

తరువాత పండ్రెండు దినముల వరకు పేతమునకు పిండదానము చేయుచుండవలెను. ఏలయన పర లోకము నకు పోవు పేతమునకు ఆ పిండములు దారి పై తేముగా అయి చాల ప్రీతిని కలిగించును. ఈ పిండదానముచే సంతృప్తి చెందుచు పేతము పం డేండు దినములు ముగియుసరికి పేతములు చేరవలసిన లోకమునకు తీసికొనిపోబడును. (చేర్చ బడును.) మరణించిన ప్రాణి (పేతము) ఈ పండ్రెండు దినములును తాను మరణించక మునుపు తనవిగా నుండిన ఇల్లు పొలము పుత్తులు భార్య మొదలగునవి చూచుచునే ఉండును. వీరు తన కొరకై దారి బత్తెముగా ఏమయిన సుఖ సాధనమును సమకూర్తురా లేదా యను చింతతో ఉండును. అందుచేతనే పది దినములవరకు శూన్యమునందు వ్రేలాడు నట్లుగా పేతము నుద్దేశించి నీటితో (పాలతో నిండిన పాత్రము ఉంచెదరు. దీనివలన ఆ పేతమునకు తాపోపశాంతియు మార్గాయాసశాంతియు కలుగును.

పదునొకండవనాడు బ్రాహ్మణులు పదునొకండు మంది బ్రాహ్మణులను భోక్తలుగా ఉంచి శ్రాద్ధము జరుపవలేను. ఇట్లే క్షత్రియులును వైశ్యులును శూద్రులును వారి వారి ఆశౌచము ముగిసిననాడు బేసి సంఖ్యలో భోక్తలను భుజింపజేయ వలెను. (శూద్రులు ఆహార పదార్థ దానము మాత్రమే చేయవలెను.)

ఆశౌచము ముగిసిన రెండవనాడు (పదునొకండవ-పదుమూడవ.పదు నారవ. ముప్పది యొక టవ దినములలో పేతము నుద్దేశించి ఏకోద్దిష్టమును జరుపవలెను. (ఏక ఉద్దిష్ట = పేతమును మాత్రమే ఉద్దేశించి-వారి పై వారినిగానీ వి శ్వే దేవులను గాని ఉద్దేశించక -చేయు శ్రాద్దము అని అర్థము. దీనియందు ఆవాహనము అగ్నౌ కరణము యథావిధానముగా ఉండును. విశ్వేదేవులకు అర్చన యుండదు. ఒకే పవిత్రము ధరించుట ఒకే అర్ఘ్యము వదలుట ఒకే పిండము వేయుట దీనియందు విధింపబడును. దీనిలో ' ఇదం ఉపతిష్టలు.' ఇది ఈ పేతమునకే సన్ని హితమై ఉvడుగాక !" అని మాత్రమే చెప్పవలెను. (స్వధా అని చెప్పకూడదు. పిండదానము తరువాత తిలోదక ము ఈయవలెను. వికిరపిండము ఇచ్చు సమ యమున ‘స్వదితం' 'చక్కగా తినబడినది' అనియు -బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పునపుడు 'అభిరమ్యతామ్' “సుఖము ఆనందమును పొందుగాక !' అనియు చెప్పవలెను. ఇవి కాక మిగిలిన ప్రక్రియలన్ని యు లోగడ ఆయా శ్రాద్ధముల విషయ మున చెప్పినట్లే ఈ ఏకోద్దిష్టమునను చేయవలెను.

ఈ విధముగా ఏకోద్దిష్టమును ప్రతి మాసమునందును జరుపుచుండవలెను. (వా సవమున సపిండికరణము సంవ త్సరాంతమున జరుగవలేను. అంతవరకును మరణించిన జీవునకు ' పేతము' అను వ్యవహార మే యుండును. కాని పితృ దేవత్వము రాదు. అంతవరకును చేయు పితృకార్యము అతనిని ఒక్కనికే ఉద్దేశించి చేయుదురు. కావున ఇది ఏకోదిష్టము.)

కాంచనం పురుషం తద్వత్ ఫలవస్త్రసమన్వితమ్

 సంపూజ్య ద్విజదాంపత్యం నాసాభరణభూషణైః

 వృషోత్సర్గం ప్రకుర్వీత దేయా చ కపిలా శుభా

ఉదకుంభశ్చ దాతవ్యో భక్ష్యభోజ్య సమన్వితః

 యావదబ్దం నర శ్రేష్ఠః సతిలోదక పూర్వకమ్

 తత సంవత్సరే పూర్ణే సపిండీకరణం భవేత్

 సపిండీకరణా దూర్ద్వం  పేతః పార్వణభా గ్భవేత్

 వృపోత్సర్గం సుతః కుర్యాత్ పి త్రో శ్చైకాదశేహని

అథవా పుణ్యదేవ సే విధినా వృష ముత్సృజేత్

 వృషోత్సర్గం సుతో మాసి కుర్యా దేకాదశేఽహని

 సహోమం విధివచ్చైప పితర్యపిచ జీవతి

 వృద్ధిపూర్వేషు యోగ్యశ్చ గృహస్థశ్చ భవేత్త్రతః

 సపిణ్డీకరణ శ్రాద్ధం దేవపూర్వం నియోజయేత్

 పితృనేవాశయేత్తత్ర వృథక్ప్రేతం వినిర్ధి శత్

 గన్దోదకతిలై ర్యుక్తం కుర్యా త్ప్రాత్ర చతుష్టయమ్

అర్ఘ్యార్థం పితృపాత్రేషు పేతపాత్రం ప్రసేచయేత్

 తద్వ త్సంకల్ప్య చతురః పిండా న్పిణ్డ ప్రద స్తథా

యే సమానా ఇతి ద్వాభ్యా మంతంతు విభజేత్ప్రిధా

 చతుర్థస్య పునః కార్యం నక దాచి దతో భవేత్

 తతః పితృత్వ మాపన్న స్సర్వతః పుష్టిమాగతః

 అగ్నిష్వాత్తాదిమధ్యత్వం ప్రాప్నో త్యమృతముత్త్రమమ్

 సపిణ్డీకరణాదూర్ద్వం తస్మైతస్మా న్న దీయతే

పిత్రాది ష్వేవ దాతవ్యం తత్పిణ్డో యేషు సంస్థితః

తతః ప్రభృతి సజ్క్రాన్తా వుపరాగాదిపర్వసు

 త్రిషిణ్డ మాచరే చ్చ్రాద్ద మేకోద్దిష్టం మృతాహని

ఏకోద్దిష్టం పరిత్యజ్య మృతా హేన్య త్సమాచరేత్

 తథైవ పితృహా స స్యా న్మాతృభ్రాతృవినాశకః

 మృతా హే పార్వణం కుర్వ న్నఽధోధో యాతి మానవః

 సమ్పర్కే త్వాకులీ భావః పేతేషుతు యతో భవేత్

ప్రతిసంవత్సరం తస్మా దేకోద్దిష్టం సమాచరేత్

 యావదబ్దంచ యోదద్యా దుదకుమ్భం విమత్సరః

పేతాయన్న సమాయుక్తం సోఽశ్వమేధఫలం లభేత్

ఆమ శ్రాద్ధం యదా కుర్యా ద్విధిజ్ఞ శ్శ్రాద్దద స్తథా

తేనాగ్నౌ కరణం కుర్యా త్పిణ్డాం స్తేనైవ నిర్వ పేత్

త్రిభి స్సపిణ్డీకరణా నాసకతీతయం పితా

 యదా ప్రాప్స్యతి కాలేన తదా ముచ్యేత బన్ధనాత్

 ముక్తోపి లేపభాగిత్వం ప్రాప్నోతి కుశమార్జనాత్

లేపభాజ శ్చతుర్థాద్యాః పిత్రాద్యాః పిణ్డభాగినః

పిణ్డద సప్తమ స్తేషాం సాహిణ్డ్యం సా ప్రపౌరుషమ్

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమను సంవాదే శ్రాద్ధకల్పే సపిణ్డీకర ణాది

శ్రాద్ధవిధిర్నా మాష్టాదశోఽధ్యాయః

ఆశౌచము తీరిన తరువాత రెండవ దిన మున (విప్రులు 11వ-క్షత్రియులు 18వ.వైశ్యులు 16వ-శూద్రులు 31వ దినములందు ] సంప్రదాయము నెరిగి శ్రాద్ధకర్త పేత నుద్దేశించి అతని సుఖమునకై శయ్యను బంగారు ప్రతిమను ఫలములను వస్త్రములను బ్రాహ్మణ దంపతులకు-వారిని నానాభరణ భూషణములతో ఆలంకరించి పూజించి-దానము ఈయవలెను. వృషోత్సర్జనము -ఆబోతును విడుచుట-చేయవలెను. కపిలగోవును దాన మీయవలెను. భక్ష్యభోజ్యములను ఉదకుంభమును దానము చేయవలెను. ఇట్లు సంవత్సరము నిండువరకు ఆయా దానములును శ్రాద్ధములును తిలోదక పూర్వకముగా ఆయా సమయములందు జరుపుచుండవలయును. సంవత్సరము నిండిన తరువాత సపిండీకరణము జరుప వలెను. సపిండీకరణము జరిగిన తరువాతనే మరణించిన వ్యక్తికి పేతత్వము తీరి పార్వణమునకు (పార్వణశ్రాద్ధము నందు చేయు ఆయా పిండదానాదికమును గ్రహించుటకు అర్హుడగును. తల్లిదండ్రులు మరణించినపుడు పదునొకండవ దినమున కుమారుడు వారి సుఖము నుద్దేశించి వృషోత్సర్గము చేయవలెను. లేదా ఏదై న పుణ్య సమయమునందై నను ఇది చేయవచ్చును.

కుమారుడు ఇది తల్లి విషయములో ఆమె మరణించిన తరువాత పదునొకండవ దినమునగాని మరేదైన పుణ్యదిన మున గాని చేయవలెను. తండ్రి విషయమున అతని పుణ్యమున కై అతడు జీవించియుండగా కూడ వృషోత్సర్గము చేయ వచ్చును. ఇవి ఈ విధముగా జరుపుట వలన గృహస్థుడు మరణించిన వారి కుమారులు మొదలగువారు వృద్ధిపూర్వక ములగు కృత్యములను (నాందిశ్రాద్దమును జరిపి చేయవలసిన వివాహాది శుష కార్యములను జరుపుటకు యోగ్యుడగును.  సపిండీకరణ శ్రాద్ధమున మొదట విశ్వేదేవులకును తరువాత పితరులకును ఆవాహనము ఆర్చనము భోజనము మొదలగునవి జరుపవలేను. అందునను పితరులు అనగా అప్పటికి పితృత్వమును పొందియున్న వారిని మాత్రమే గ్రహించ వలేను. పేతను వేరుగా పేర్కొనవలెను. పితృస్థానమునందు నాలుగు పాత్రలను (అర్ఘ్యమునకు ఉంచి గంధములు తిలలు ఉదకము మొదలగువానితో వేరు వేరుగా అప్పటికీ పితృత్వము పొందియున్న మూడు తరముల వారికి మూడు పేతకు ఒకటి. మొ త్త్రము నాలుగు నింపవలెను. తరువాత పేతపాత్రయందలి గంధతిలలతో కూడిన ఉదకమును మూడు భాగములుగా మిగిలిన మూడు పాత్రలయందు కలిపి వేయవలెను. అదే విధముగా పితరులకు ముగ్గురకు మూడును. పేతకు ఒక టియు మొత్త్రము నాలుగు పిండములను చేయవలెను. 'యే సమానా' అని ఆరంభమగు రెండు ఋక్కులతో నాలుగవ పిండమును మూడుగా విభజించవలెను. ఆ ఖండములను పితరులకు ఉద్దేశించిన పిండములతో కలుపవలెను. ఇంతేకాని నాలుగవ పిండమునకు అంతకంటే వేరు వినియోగము లేదు. ఈ సపిండికరణము జరుపుటతో ఈ మరణించిన జీవుడు పేతత్వము వదలి పితృత్వమును పొందును. అన్ని విధముల పుష్టిని (శుభమును పొందును,

శ్రీమత్స్యమహాపురాణము. అగ్ని ష్వాత్రాది పితృదేవతల దగ్గర ఉత్త్రమము అమృతము (శాశ్వతము ఆగు స్థానమును పొందును. ఆందుచేతనే సపిండీకరణము జరిగిన తరువాత ఈ మరణించిన వ్యక్తికి వర్షత్రయములోని వాడుగానే కాని ఆతనికి వేరుగా పారలౌకిక పితృకార్యములు జరుపబడవు. ఏలయన అతని పిండము తన పై పెద్దల పిండములోనికి చేరినది. కనుక ఇతడును వారిలో ఒకడుగా ఐనాడు.

ఆది మొదలుకొని సంక్రాంతి చంద్రగ్రహణము మొదలగు విశిష్ట పర్వములందును అతడు మరణించిన దినమున ప్రతి సంవత్సరమును పిండత్రయముతో శ్రాద్ధము జరుపవలెను. మరణించిన పెద్దలకు ఇదే విధముగ మ తదినమునను ఆశౌచదినములందును ఏకోద్దిష్ట శ్రాద్దమునే పేత నుద్దేశించి చేయవలెను. కాని అంతకుమించి అతనికి పితృత్వమును భావనచేసి పార్వణ శ్రాద్దము మొదలగునవి చేయరాదు. అట్లు చేసినవాడు తల్లిదండ్రులను సోదరులను చంపినందువలన కలుగు పాపమును పొందును. పేతలుగా నున్న వారు తనకు పితరులతో (గాని ఇతరులతోగాని సంపర్కము కలిగినచో కల వరము చెందుదురు. కనుక వారికి ఏకోద్దిషమునే వారిని ఒక్కరిని మాత్రమే ఉద్దేశించి చేయు శారిద్దమునే) జరుపవల యును. కాని ఇతరులతో కలిపి జరుపరాదు. మృతదినములందు పార్వణ శాద్దమును బరిపిన మానవుడు కిందికి కిందికి పతితుడగును. కనుక సంవత్సరము నిండు వరకు ఏకోదిష్టమునే జరుపవలయును. ( ఇచట మూలమున ‘పతి సంవత్సరం' అని యున్నది. దీనికి సంవత్సరే సంవత్సరే-=పతి సంవత్సరం' అని వీప్సార్థమునకాక ‘సంవత్సరే ప్రతి సంవత్సరం' అని స షమ్యర్థమున మాత్రమే అవ్యయీ భావమును చెప్పవలెను. లేనిచో సంప్రదాయవిరుద్ధమగును, )

సంవత్సరము నిండువరకు మరణించిన వారి ( పేతల) నుద్దేశించి ఉదకుంభమును ఆన్న మును దానము చేయు వారికి అశ్వమేధయాగము చేసినచో కలుగునంత ఫలము కలుగును.

శాస్త్ర విధానానుసారము కర్మములను ఆచరించుట ఎరిగిన శాద్దకర్త అన్న శాద్ధమును కాక ఆమశాద్ధమును జరుపునప్పుడు అగ్నౌ కరణము కాని పిండదానముగాని ఆమ పదార్థములతోనే చేయవలెను కాని పక్వదవ్యములతో చేయ రాదు. పేతకు తనకు పై వారితో సపిండీకరణము జరుపగానే ఆతడును పితృవర్గతిత యములో ఒక డగు స్థితిని పొందును. అప్పటినుండి అతడు పేతత్వ బంధనమునుండి ముక్తి పొందును.

ఇట్లు ముకుడే నవాడు కూడ తన వంశమువారిలో తన కుమారుడు కాక మిగిలిన వారినుండి లేపమును (పిండ ములు పెట్టినప్పుడు మిగిలిన అంటును ఆహారముగా పొందదగినవాడు ఆగును. ఈ లేపము కుశ మార్జన పూర్వకముగా ఆందును.

దీనికి కారణము ఏమన మూడు తరములు దాటి నాలుగవ తర మునుండి పై వారు లేపభాక్కులు. పితృపితా మహపంపితామహులు పిండ భాగులు. ఏడు తరములవరకు ఎవరై నను తమ పూర్వులకు పిండములు వేయవచ్చును. ఏల

యన సపిండత్వము ఏడు తరములవరకు నిలుచును.

ఈ పై వాక్యములకు చాల వివరణము కావలెను. ఎట్లన రామశర్మ ఆనువాడు తన తండ్రికి ఆబ్దికము జరుపు చున్నాడు. ఇతనికి పితృపితామహ ప్రపితామహులు పిండ భాగులు. ప్రపితామహుని తండ్రియు పైవరును తన వంశము లోనే వీరి సరితరమునకు చెందిన వారును ఈ రామశర్మ చేయు శ్రాద్ధమున - లేపభాక్కులు. కాని ఈ లేపథాగులు ఈ రామ శర్మకు పైతరము వారు కొందరు జీవించియుండి వారు తమ తండ్రికి జరుపు శ్రాద్దమున పిండ బ్లాగులుగా ఉండవచ్చును. వంశ మూల పురుషునికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులుండినచో వారిలో జ్యేష్టుని మనుమలును కనిష్టుని కుమారులును ఒక వయస్సు వారు అగుట సంభవించును. ఇట్లే తర ములు గడచిన కొలది. ఒక వ్య- క్రియే ఒకరు జరుపు శ్రాద్ధమున పిండ భాగి అగుటయు మరియొకరు శ్రాద్ధమున లేపభాగి అగుటయు జరుగును. అట్లే ఒక మృతునికి కుమారులుగాని న్నీ హిత జ్ఞాతులు కానీ లేనపుడు అతని మూల పురుషుని నుండి ఏడు తరములకులోగా పై చెప్పిన పద్దతిలో అగువారు వరైనను ఇతనికి కర్మలు జరిపి పేతత్వము నుండి ముక్తి కలిగించవచ్చును.)

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున ఏకోద్దిష్ట శ్రాద్ధాది విధానము అను పదునెనిమిదవ అధ్యాయము.