8 - బహ్మ పృథువు మొదలగు వారికి ఆయా ఆధిపత్యము లిచ్చుట

 ఋషయః: ఆదిసర్గ స్త్వయా సూత కథితో విస్తరేణ నః

 ప్రతిసర్గశ్చ ఏతేషా మధిపాం స్తా న్వదస్వ నః

 సూతః: యదాభిషి క్త స్సకలాధిరాజ్యే పృథుర్ధరిత్ర్యా మమరాధి పేన

 తదౌషధీనా మధిపం చకార యజ్ఞవ్రతానాం తపసాం చ సోమమ్

నక్షత్ర తారా ద్విజ వృక్ష గుల్మ లతా వితానస్య చ రుక్మగర్భమ్

అపా మధీశం వరుణం ధనానాం రాజ్ఞాం ప్రభుం వైశ్రవణం చ తద్వత్

విష్ణుం రవీణా మధిపం వసూనా మగ్నిం చ లోకాధిపతిం చకార

ప్రజాపతీనా మధిపం చ దక్షం చకార శక్రం మరుతా మధీశమ్

 దైత్యాధిపానా మథ దానవానాం ప్రహ్లాద మీశం చ యమం పితృణామ్

పిశాచరక్ష : వశుభూతయక్ష బేతాళ రాజ్ఞా మథ శూలపాణిమ్

 ప్రాలేయ శైలం చ పతిం గిరీణా మీశం సముద్రం ససరిన్న దీనామ్

గన్దర్వవిద్యాధర కిన్నరాణా మీశం పున శ్చిత్రరథం చకార

 నాగాధిపం వాసుకి ముగ్రవీర్యం సర్పాధిపం తక్షక మాదిదేశ

దిగ్వారణానా మధిపం చకార గజేన్ద్ర మైరావత నామధేయమ్

 సుపర్ణ మీశం పఠతాం హయానాం రాజాన ముచ్బైశ్శ్రవసం చకార

సింహం మృగాణా మృషభం చకార ప్లక్షం పున స్సర్వవనస్పతీనామ్

 పితామహః పూర్వ మథాభ్యషిఇ దీశాన్పున స్సర్వదేశాధినాధాక్

పూర్వేణ దిక్పాల మథాభ్యషించ న్నామ్నా సుధర్మాణ మరాతి కేతుమ్

తతోఽధిపం దక్షిణత శ్చకార సర్వేశ్వరం శజ్ఖపదాభిధానమ్

సు కేతుమ న్తం దిగధీశ మీశం చకార పశ్చా ద్బువనాణ్డగర్భః

హిరణ్యరోమాణ ముదగ్ధీగీశం ప్రజాపతి స్సోమపతించ కార

అద్యాపి కుర్వన్తి దిశా మధీశా శ్శబ్దం వహన్తస్తు భువోఽభిరక్షామ్

 చతుర్భి రేభిః పృథునామధేయో నృపోభిషిక్తః ప్రథమం పృథివ్యామ్  

 మన్వన్తరే చాధిగతే తథైవ వైవస్వతం చక్రు రిమం పృథివ్యామ్

గతేఽన్తరే చాక్షుష నామదేయే వైవస్వతాఖ్యే చ పునః ప్రవృత్తే

ప్రజాపతి సోఽస్య చరాచరస్య బభూవ సూర్యాన్వయవంశ చిహ్నః

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే విరిఇ్చకృత పృథు రాజ్యాభి షేకాదిక థనం నామాష్టమోఽధ్యాయః

 శౌనకాది ఋషులు సూతు నిట్లడిగిరీ : అయ్యా ! మీరు మాకు పరమాత్మ చేసిన ఆదిసర్గమును (ప్రథమసృష్టిని తెలిపితిరి. దీని తరువాత చేసిన ప్రతీ సర్గమును ఆ సృష్టియందలి ఆయా భూతములకును పదార్థములకును ఆధిపతులను విశదీకరింపుడు.

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను : అమరాధిపుడగు బ్రహ్మ సకల ధరిత్రికి పృథువును ' అధిపతిగా చేసెను. అట్లే ఓషధులకు యజ్ఞ కర్మలకు తపస్సులకు సోముని-నక్షత్రములు తారలు పనులు వృక్షములు గుల్మము పొదలు లతలు మొదలగు వానికి హిరణ్య గర్బుని జలములకు వరుణుని ధనములకు రాజులకు కుబేరుని ఆదిత్యులకు విష్ణువను ఆదిత్యుని వస్తువులకు అగ్ని అను వసువును ప్రజాపతులకు దకుని దేవతలకు ఇంద్రుని దైత్యదానవులకు ప్రహ్లాదుని పితృ దేవతలకు యముని పిశాచములకు రక్ష స్పులకు పశువులకు యక్ష భూత భేతాళములకు శూలపాణిని పర్వతములకు హిమవంతుని సరిత్తులకు (జల ప్రవాహములకు) నదులకు సముద్రుని గంధర్వులకు విద్యా ధరులకు కింనరులకు చిత్ర రథుని నాగులకు వాసుకిని సర్పములకు తక్షకుని దిగ్గజములకు ఐరావతమును పక్షులకు గరుడుని అశ్వములకు ఉచ్చైః శ్రవమును మృగములకు సింహమును వనస్పతు (పూయక యే కాయలు కాచేడు చెట్టు)లకు జువ్వి చెట్టును అధిపతులనుగా చేసెను. సుధర్ముని తూర్పునకు శంఖుని దక్షిణమునకు సు కేతుమంతుని పశ్చిమమునకు హిరణ్యరోముని ఉత్త్రరమునకు దిగధిపతులనుగా బ్రహ్మ అభి షేకించెను. వారు ఇప్పుడును (మత్స్య నారాయణుడు మనువునకు ఈ వృత్తాంతము చెప్పు నాటికి) ఈ నలుగురు దిక్పాలురును పృథుని మొదటి భూలోకాధిపతినిగా అభి షేకించిరి. ఆ మన్వంతరము గడచిన తరువాత సూర్య వంశజుడగు వైవస్వతుని భూలోకాధిపతినిగా చేసిరి. అనగా చాక్షుష మన్వంతరము గడువగా వైవ స్వత మన్వంతరము ప్రారంభము కాగా సూర్య వంశమునకు పతాక వంటి వాడగు వైవస్వతుడు భూలోక చక్రవర్తిగా ప్రజా పతిగా అభిషిక్తుడయ్యె.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున బ్రహ్మ పృథుపు మొదలగు వారిని ఆయా అధిపతులసుగా అభి షేకించుట యను అష్టమాధ్యాయము.