67 - గ్రహణ స్నాన విధి   

మనుః: చన్ద్రాదిత్యోపరాగేషు యత్స్నాన మభిధీయతే

తదహం శ్రోతు మిచ్ఛామి ద్రవ్యమ విధానతః

శ్రీమత్స్య: యస్య రాశిం సమాక్రమ్య భవే ద్గృహణ  (సంప్లవ)సమ్భవః

తత్ర స్నానం ప్రవక్ష్యామి మన్త్రౌషధివిధానతః

చన్ద్రోపరాగే సంప్రాప్తే కృత్వా బ్రాహ్మణవాచనమ్

సమ్పూజ్య చతురో విప్రా ఞ్చుక్ల మాల్యానులేపనై

 పూర్వమేవోపరాగస్య సమాసా ద్యౌషధీగణమ్

స్థాపయే చ్చతురః కుమ్బా నవ్రణా న్త్సాగరానివ

రథాశ్వగజవల్మీక సజ్గమహ్రద గోకులాత్

రాజద్వారప్రదేశాచ్చ మృద మానీయ ని క్షిపేత్

పఞ్చగవ్యంచ క మేషు శుద్ధముక్తాఫలాని చ

రోచనాం పద్మశజ్ఖౌచ పఞ్చరత్న సమన్వితౌ

 స్ఫటికం చన్దనం శ్వేతం తీర్థ వారి ససర్షపమ్

గజద న్తం సకుముదం తథై వోశిర గుగ్గులు

 ఏతత్సర్వం వినిక్షిప్య కుంభే ష్వావాహయే త్సురా

మనువు మత్స్య నారాయణునిట్లు ప్రార్థించెను. చంద్ర సూర్యగ్రహణములు సంభవించినపుడు స్నానము చేయ వలయునని శాస్త్రము విధించుచున్నది కదా! దాని విధానమును. అందు వినియోగించవలసిన ద్రవ్యములను మంత్రములను మీనుండి వినగోరుచున్నాను. అనగా నారాయణుడతనికి ఇట్లు తేలిపేను:

ఏ రాశియందు గ్రహణము సంభవించునో ఆ రాశి నందు చేయవలసిన స్నానపు విధానమును మంత్రములను ద్రవ్యములను తెలి పెదను; వినుము. చంద్ర సూర్యగ్రహణములు జరుగబోవుచున్నవి అనగా ముందుగానే బ్రాహ్మణులచే స్వ స్త్రీ వాచనమును జరిపించుకొనవలయును. నలుగురు బ్రాహ్మణులను లెస్సగా శుక్ల వస్త్రములతో శుక్ల గంధ ద్రవ్యము లతో సంపూజించవలయును. గ్రహణమునకు ముందుగానే దర్బాధికమగు ఓషధులను సంపాదించుకొనవలయును. రంధములు లేని నాలుగు కడవలను నాలుగు సముద్రములను వలె నాలుగు చోట్ల వేరువేరుగా నిలుపవలెను. రథములు అశ్వములు గజములు గోవులు నిలుచు తావులనుండియు పుట్టలు నదీ ద్వయ సంగమ నదీ సాగర సంగమ ప్రదేశముల నుండియు పెద్ద ప్రదములనుండియు రాజద్వార ప్రదేశములనుండియు మట్టిని తెచ్చి వాటియందు వేయవలెను. పంచ గవ్యములను మంచి ముత్తెములను గోరోచనమును పద్మములను శంఖములను పంచరత్న ములను స్పటికమును తెల్ల చంద నమును తీర్థ జలములను తెల్ల ఆవాలను ఏనుగ దంతమును కలువపూలను వట్టి వేళ్ళను గుగ్గిలమును కూడ వాని యందు వేయవలయును. పిమ్మట ఈ మంత్రము లతో ఆయా దేవతలను ఆ నాలుగు కడవలలోనికి ఆవాహనము చేయ వలయును. (వచ్చి వాటియందు నిలువవలసినదిగా పిలువవలయును.)

సర్వే సము ద్రాస్సరిత స్తీర్థాని జలదా నదాః

ఆయాన్తు యజమానస్య దురితక్షయకార కాః

యోఽసౌ వజ్రధరో దేవ ఆదిత్యానాం ప్రభుర్మతః

సహస్రనయన శ్చేన్ద్రో గ్రహపీడాం వ్యపోహతు

ముఖం య స్సర్వదేవానాం సప్తార్చి రమిత ద్యుతిః

 చన్ద్రో పరాగ (సమ్భూతామగ్నిపీడాం)సమ్భూతాం గ్రహపీడాం వ్యపోహతు

యః కర్మసాక్షీ భూతానాం ధర్మో మహిషవాహనః

యమ శ్చన్ద్రోపరాగోత్థపీడా మత్ర వ్యపోహతు

రక్షోగణాధిప సాక్షా త్ర్పళ యానలనన్ని భ

 ఖడ్గహస్తోఽ తిభీమశ్చ(రక్షఃపీడాం)గ్రహపీడాం వ్యపోహతు

ఖడ్గపాశధరో దేవస్సదా మకరవాహనః

సజలాధిపతి శ్చన్ద్ర గ్రహపీడాం వ్యపోహతు

 ప్రాణరూపేణ యో లోకా న్పాతి కృష్ణ మృగప్రియః

 వాయు శ్చన్ద్రోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు

 యేఽసౌ నిధిపతి ర్దేవః ఖడ్గశూలగదాధరః

 చన్ద్రోపరాగసమ్భూతా ని గ్రహపీడాం వ్యపోహతు

యోఽసావిన్దుధరో దేవః పినాకీ వృషవాహనః

 చన్ద్రోపరాగపాపాని శీఘ్రం నాశయ శంకర

 త్రైలో క్యే యాని భూతాని స్థావరాణి చరాణి చ  

బ్రహ్మవిష్ణ్వర్కయు క్తాని తాని పాపం హరస్తు మే

అన్ని సముద్రములును నదులును తీర్థములును మేఘములును నదములును ఈ యజమానునకు దురితమును నశింపజేయుట కై ఈ కలశములలోనికి వచ్చు గాక ! వజ్రధరుడు ఆదిత్యులకు ప్రభువు సహస్రనయనుడు అగు ఇంద్రుడు గ్రహపీడను పోగొట్టుగాక ! సర్వదేవతలకు ముఖము వంటివాడు అమిత ప్రకాశము కలవాడు అగు అగ్ని చంద్ర గ్రహణము వలన కలిగిన పీడను పోగొట్టుగాక ! ప్రాణుల కర్మలకు సాక్షి మహిష వాహనుడు ధర్మదేవుడు ఆగు యముడు చంద్రగ్రహణము వలన కలిగిన పీడను తొలగించుగాక ! రాక్షస గణాధిపతియు సాక్షాత్ ప్రళయాగ్ని వంటి వాడు ఖడ్గహస్తుడు అతి భయంకరుడు అగు నిరృతి గ్రహ బాధను తొలగించుగాక! ఖడ్గ పాశధరుడు మకర వాహనుడు జలాధిపతియగు వరుణుడు చంద్రగ్రహణ గ్రహపీడను తొలగించుగాక! ప్రాణరూపుడై యుండి లోకములను రక్షించు వాడు కృష్ణమృగము (నల్లని లేడి)యందు ప్రీతి కలవాడునగు వాయువు చంద్రగ్రహణముచే కలిగిన గ్రహపీడను పోగొట్టు గాక! నిధిపతియు ఖడ్గశూల గదాధరుడునగు కుబేరుడు చంద్రగ్రహణము వలన కలిగిన గ్రహపీడను పోగొట్టుగాక ! చంద్రధరుడు పినాక ధారి వృషభ వాహనుడు అగు శంకరుడు చంద్రగ్రహణ పాపముల నశింపజేయు గాక! త్రిలోకముల యందున్న స్థిరచర భూతములు బ్రహ్మ విష్ణు సూర్యాది దేవతలు అందరును గ్రహణ పాపములమ పోగొట్టుగాక !

ఏవ మామన్త్రితైః కుంభై రభిషిక్తో గుణాన్వితై

ఋగ్యజుస్సామమన్త్రైశ్చ శుక్లమాల్యానులేపనై

 పూజయే ద్వస్త్రగోదానై ర్ర్బహ్మణా నిష్టదేవతాః

 ఏతానేవ తతో మన్త్రా నాలిఖ్య కరకాన్వితా

 స్థాపయేయుశ్చ త్రైఃకుమ్బై ర్యజమానం ద్విజోత్తమాః

వస్త్రఖణ్డేఽథవా పట్టే హేమరత్న సమన్వితా

యజమానస్య శిరసి నిదధ్యు స్తే ద్విజోత్తమాః

 తతోఽ తివాహమే ద్వేలా ముపరాగానుగామినీమ్

 ప్రాజ్ముఖః పూజయిత్వా తు నమస్య న్నిష్టదేవతాః

చన్ద్రగ్ర హే వినిర్వృత్తే కృతగోదానమజ్గళ

కృతస్నా నాయ తద్వస్త్రం బ్రాహ్మణాయ నివేదయేత్

అనేన విధినా యస్తు గ్రహణస్నాన మాచరేత్

న తస్య గ్రహపీడా స్యా న్నచ బన్దుజనక్షయ్య

 పరమాం (సిద్ధిమాప్నోతిపునరావృత్తిదుర్లభాం) శుద్ది మాప్నోతి క్షేమ మారోగ్య ముత్తమమ్

సూర్యగ్ర హే సూర్యనామ సదా మన్త్రేషు కీర్తయేత్

అధికం పద్మరాగంచ కపిలాంచ సుశోభనామ్

ప్రయచ్చే ద్విత్తసమ్పన్న శ్చన్ద్రసూర్యోపరాగయోః

 య ఇదం శృణుయా న్నిత్యం శ్రావయే ద్వా సమాహితః

 సర్వపాపవినిర్ముక్త శ్శివలో కే మహీయతే  

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే చన్ద్రసూర్యోప రాగ స్నానవిధికథనం నామ సప్తషష్టితమోఽధ్యాయః

 ఈ విధముగా పూర్ణముగా మంత్రింపబడిన సర్వగుణ సమన్వితములగు కుంభములలోను ఋగ్యజుస్సామ మంత్రములతోను స్నానము చేయించుకొని యజమానుడు తెల్లని పూవులతోను తెల్లని సుగంధములతోను వస్త్రదాన గోదానములతోను బ్రాహ్మణులను ఇష్ట దేవతలను పూజించవలయును.

తరువాత ఈ మంత్రములనే (వత్రముల పై) వ్రాసి కరక (గరిగ) యందుంచి వాటితోపాటు బంగారును. రత్నములను చేర్చి యజమానుని వస్త్ర ఖండమునందు కానీ పట్టముమీద (జంపకానావంటి దానిమీద) కాని ఆకడవలతో కూడ యజమానుని కూర్చుండ పెట్టుదురు. తరువాత ఆ మంత్రలేఖనములతో కూడిన గరిగను యజమానుని తలమీద ఉంచుదురు.

తరువాత యజమానుడు ప్రాజ్ముఖుడై దేవతలను పూజించి నమస్కరించుచు చంద్రగ్రహణ కాలమునంతటిని గడపును.

చంద్రగ్రహణము విడిచిన తరువాత గోదానము అనేడు శుభమును ( కేశ ఖండనమును) జరిపించుకొనవలెను. స్నానము చేసియున్న బ్రాహ్మణునకు తానంతవరకు కూర్చుండియున్న వస్త్రమును. ఈయవలెను.

ఈ విధానము ననుసరించి గ్రహణ స్నానము చేసిన వానికి గ్రహపీడ కలుగదు. వాని బంధుజనులకును. కీడు కలుగదు. ఉత్తమ శుద్దిని ఉత్తమమగు క్షేమారోగ్యములను పొందును.

సూర్య గ్రహణమునందు ఎల్లప్పుడును మంత్రములతోపాటు సూర్య నామములను కీర్తించవలెను. చంద్ర సూర్యోపరాగ (గ్రహణ)ములందు పద్మ రాగమును ప్రశ స్తమగు కపిలగోవును కూడ విత్త సంపన్నుడై నచో దానము చేయవచ్చును.

దీనిని చదివినను వినినను సర్వపాప విముక్తుడై శివలోక మునందు సుఖించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్ర సూర్యగ్రహణ స్నా నవిధి కథనము  ఆను అరువది ఏడవ అధ్యాయము.