54 - నక్షత్రపురుష వ్రతము   

సూతః: అతఃపరం ప్రవక్ష్యామి దానధర్మా న శేషతః

వ్రతో పవాసంయుక్తా న్యథామత్స్యోదితా న్మనోః

 మహాదేవస్య సంవాదం నారదస్య చ ధీమతః

యథావృత్తం ప్రవక్ష్యామి ధర్మకామార్థసాధనమ్

 కైలాసశిఖరాసిన మపృచ్ఛ న్నా రదః పురా

త్రిశూలిన మనజ్గారి ముమాజ్గార్దధరం హరమ్

 నారదః: భగవన్దేవదేవేశ బ్రహవిష్వైననాయక

 శ్రీమదారోగ్య రూపాయు ర్భోగ్య సౌభాగ్య సమ్పదా

 సంయుక్త స్తవ విష్ణోర్వా పుమా న్భక్తః కథం భవేత్

నారీవాఽవిధవా సర్వగుణసౌభాగ్యసంయుతా  

క్రమాన్ముక్తిప్రదం దేవ కిఞ్చి  ద్వత మిహోచ్యతామ్

  శ్రీ ఈశ్వరః: సమ్య క్పృష్టం త్వయా బ్రహ్మ న్త్సర్వలోకహితావహమ్

 వ్రతమప్యత యచ్చాన్య త్తద్వృతం శృణు నారద

 నక్షత్రపురుషం నామ వ్రతం నారాయణార్చనమ్

 పాదాది కుర్యా ద్విధివ ద్విష్ణునామాని కీర్తయః

 (ప్రీత్యర్ధం)ప్రతిమాం వాసుదేవస్య మూలర్క్షాది ప్రపూజయేత్

 చైత్రమాసం సమాసాద్య కృత్వా బ్రాహ్మణవాచనమ్

 సితపక్షేచ విధిత స్సోమో మూలేన సంయుతః  

సూతుడిట్లు ఋషులకు చెప్పెను : ఇక మీదట (కర్మయోగ సంబంధులగు) దానములను ధర్మములను వ్రతము లను ఉపవాసములను యథా శాస్త్రముగా సమగ్రముగా తెలి పెదను. ఇవి అన్ని యు ధర్మ కామార్థ సాధకములు. మహాదేవ నారద సం వాద రూపములగు వీటిని మత్స్యనారాయణుడు మనువునకు తెలి పెను.  పూర్వము ఒకప్పుడు త్రిశూలి మన్మథ శత్రువు ఉమాదేహార్ధ ధారి అగు హరుడు కైలాస శిఖరమున కూర్చుండి యుండ నారదుడు అతని నిట్లడిగేను : “భగవన్! నీవు దేవదేవేశుడవు-బ్రహ్మ విష్టిందులకును ఈశ్వరుడవు. నీ యందో విష్ణునందో భక్తి గల పురుషుడు కాని సువాసిని అగు శ్రీ కాని యథాసంభవముగా సిరి ఆయువు రూపము భోగములు సౌభాగ్యము సమృద్ధిగ పొందుటకు అనుకూలించునదై క్రమముగ ము క్లినికూడ ఇచ్చు వ్రత మేదయిన నున్న చో తెలుపుము.” ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: నారదా! నీవు అడిగిన ప్రశ్నము సర్వలోక హితకరమయినది. ఇట్టి వ్రతము ఒకటి కలదు. దీనికి నక్షత్రపురుషవ్రత మని పేరు. పరమ పురుషుని శరీరమును నక్షత్ర రూపమున భావించి ఆర్చించుట); దీని యందు వాసుదేవుని ప్రతిమను పాదాదిగా నక్షత్ర నామములతో విష్ణు నామములు కీర్తించుచు అర్చించవలయును. చిత్ర మాస శుక్ల పక్షమున చంద్రుడు మూల నక్షత్రముతో కూడియున్న నాడి వ్రతము చేయవలెను, మొదట (సంకల్ప పూర్వక ముగా) బ్రాహ్మణులచే పుణ్యాహవాచనము జరిపించవలెను. పిమ్మట ఈ క్రింది విధమున పూజించవలెను.

 మూలే నమో విశ్వధరాయ పాదౌ గుల్పా వనస్తాయచ రోహిణీషు

జజ్ఘేతు పూజ్యే వరదాయ చైవ ద్వే జానునీ చాశ్వికుమార ఋక్షే

 పూర్వోత్తరాషాఢయుగే తథోరూ నమశ్శివాయే త్యభిపూజనీయమ్

 పూర్వోత్తరఫల్గునయుగ్మ కేచ మేడ్రం నమః పఞ్చకరాయ పూజ్యమ్  కటిం నమ శ్శార్జ్గధరాయ విష్ణో సమ్పూజయే న్నారద కృత్తికాను

తథాఽర్చయే ద్భాద్రపదద్వయేచ పార్శ్వే నమః కేశినిషూదనాయ

లక్ష్మి ద్వయం నారద రేవతీషు దామోదరాయే త్యభిపూజనీయమ్

తథాఽనురాధాసు చ మాధవాయ నమ స్తథోరస్థ్సలమేవ పూజ్యమ్

 పృష్ఠం ధనిష్ఠాసుచ పూజనీయ మమౌఘవిధ్వంసక రాయ తద్వత్

 శ్రీశజ్ఖచక్రాసిగదాధరాయ నమో విశా ఖాసు భుజాశ్చ పూజ్యా  

హస్తేపి హస్తా న్మధుసూదనస్య నమోఽభిపూజ్యా న్మ ధు కైటభారేః

 పునర్వసా వజ్గుళిపర్వభాగా సామ్నా మధీశాయ నమోఽభిపూజ్యోః

 భుజజ్గనక్షత్రదినే నఖాని సమ్పూజయే న్మత్స్యశరీరిణశ్చ

కూర్మస్య పాదౌ శరణం ప్రజామి జ్యేష్ఠాసు కణ్ఠే హరి రర్చనీయః

 శ్రోత్రే వరాహాయ నమోఽభిపూజ్యే జనార్దనస్య శ్రవణేన సమ్యక్

 పు ష్యే ముఖం దానవసూదనాయ నమో నృసింహాయ చ పూజనీయమ్

 నమోనమః కారణవామనాయ స్వాతీషు దన్తాగ్ర మథార్చనీయమ్

ఆస్యం హరే ర్బార్గవనన్దనాయ సమ్పూజనీయం ద్విజ వారుణే తు

 నమోస్తు రామాయ మఘాసు నాసా సమ్పూజనీయా రఘునన్దనస్య

మృగో త్తమాజ్గే నయనేఽభిపూజ్యే నమోస్తు తే రామ విఘూర్ణితాక్ష

 బుద్దాయ శాన్తాయ నమో లలాటం చిత్రాసు సమ్పూజ్యతమం మురారేః

శిరోఽభిపూజ్యం భరణీషు విష్ణో ర్నమోస్తు విశ్వేశ్వర కల్కిరూప

 ఆర్ద్రాసు కేశాః పురుషోత్తమస్య సమ్పూజనీయా హరయే నమస్తే

 1. విశ్వధరాయ నమః-మూలే పొదౌ పూజయామి; 2. అనస్తాయ నమః- రోహిణీషు-గుల్ఫౌ పూజయామి, 8. వర దాయ నమః అశ్విన్యాం-జం మే-జానునీచ పూజయామి; 4. శివాయ నమః పూర్వాషాడాను ఉత్తరాషాఢసుచ-ఊరూ పూజ యామి; 5. పంచశరాయ నమః-పూర్వ ఫల్గున్యాం ఉత్తర ఫల్గున్యాంచ - మేడ్రం పూజయామి; 6. శార్జధరాయ నమః-కృత్తి కాసు కటిం పూజయామి; 1. కేశినిషూదనాయ నమః-పూర్వాభాద్రోత్తరాభాద్రయోః పార్శ్వే పూజయామి; 8. దామోద రాయ నమః. రేవతీషు-కుక్షి ద్వయం పూజయామి; 9. మాధవాయ నమః_అనూరాధాసు. ఊరఃస్థలం పూజయామి; 10. అమౌఘ విధ్వంసక రాయ నమః ధనిష్టాసుపృష్టం పూజయామి; 11. శ్రీ శంఖ చక్రగదాసీధరాయ నమః విశా ఖాను. భుజాన్ పూజయామి; 12. మధు కైట ధారయే మధుసూదనాయ నమః హస్తే-హస్తాన్ పూజయామి- 18. సామ్నాం అధీ శాయ నమః-పునర్వసౌ-అంగుళి పర్వభాగాన్ పూజయామి; 14. మత్స్య శ రీరిణే నమ: ఆ శ్లేషాసు-నఖాని పూజయామి; 15. కూర్మ రూపిణే హరయేనమః జ్యేష్టాసు-కంఠం పూజయామి; 16. వరాహ రూపిణే జనార్ధనాయ నమః-శ్రవణే-శ్రోత్రే పూజయామి; 17. దానవ సూద నాయ నర సింహాయ నమః-పు ష్యే-ముఖం పూజయామి; 18. కారణ వామనోయ నమః స్వాతీషు-దంతాగ్రం పూజయామి; 19. భార్గవ నందనాయ నమఃశతభిషకు ముఖం పూజయామి; 20. రఘునందనాయ రామాయ నమః. మససు-నాసికాం పూజయామి; 21. పరశురామాయ నమః-మృగశిరే-నేత్రే పూజయామి; 22. . శాస్త రూపాయ బుద్దాయ నమః-చిత్రాసు-లలాటం పూజయామి; 28. కల్కి రూపాయ నమః -భరణీషు శిరః పూజయామీ; 24. పురుషోత్తమాయ నమః. ఆర్దాసు. కేన్ పూజయామి.(ఇవి మొ త్తము ఇరువది నాలుగు).

ఉపోషితేన ర్క్షదినేషు భక్త్యా సమ్పూజనీయ ద్విజపుజ్గవా స్యుః

 పూర్ణే వతే సర్వగుణాన్వితాయ వాగ్రూపశిలాయ  చ సామగాయ

 హైమీం విశాలాయత బాహుదణ్డాం ముక్తాఫలేన్ద్రోపలవ జ్రజుష్టామ్  

గుడస్య పూర్ణ కలశే నివిష్టా మర్చాం హరే ర్వస్త్రగవా స హైవ

 శయ్యాం తథోపస్కర భోజనాదియుక్తాం ప్రదద్యా ద్విజపుజ్గవాయ

 యద్య త్ప్రియం కించిదిహాస్య దేయం త త ద్ద్విజా యాత్మ హితాయ సర్వమ్

మనోరథా న్న సఫలా న్కురుష్వ హిరణ్యగర్భాచ్యుతరుద్రరూపిక్

 సలక్ష్మీకం సభార్యాయ కాఞ్చనం పురుషోత్తమమ్

 శయ్యాంచ దద్యా న్మన్త్రేణ గ్రన్థిభేదవివర్జితామ్

 యథా న విష్ణుభక్తానాం వృజినం జాయతే క్వచిత్

 తథాఽనురూప మారోగ్య మర్ఘ్యం దద్యాచ్చ కేశవే

 యథా న లక్ష్మ్యా శయనం తవ శూన్యం జనార్దన

శయ్యా మమా ప్యశూన్యాతు( ఽస్తు)కృష్ణ జన్మని జన్మని

ఏవం నివేద్య తత్సర్వం వస్త్రమాల్యానులేపనమ్

నక్షత్రపురుషజ్ఞాయ విప్రాయాథ విసర్జయేత్

 భుఞ్జీ తాతై లలవణం సర్వర్క్షేష్వ ప్యు పోషణమ్

భోజనంచ యథాశక్త్యా విత్తశాఠ్యవివర్జితః

 ఇతి నక్షత్రపురుష మవాప్య విధివ త్స్వయమ్

 సర్వా న్కామా నవాప్నోతి విష్ణులో కే మహీయతే

బ్రహ్మహత్యాదికం కిఞ్చి దదత్రాముత్ర వా కృతమ్

 ఆత్మనా వాఽథ పితృభి స్తత్సర్వం నాశ మాప్నుయాత్

 ఇతి పఠతి శృణోతి వాఽథ భక్త్యా పురుషవరోఽత్ర త మజ్గనాచ కుర్యాత్

కలిక లువిదారణం మురారే స్సకలవిభూతిఫలప్రదం చ పుంసామ్

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదా న్తర్గతేశ్వర నారదసంవాదే

నక్షత్రపురుష వ్రతకథనం నామ చతుఃపథ్చాశోఽధ్యాయః

 ఇట్లు ఆయా నక్షత దినములందు ఉపవాసముండి ఏ నక్షత్రమునాడు ఏ అవయవమును పూజించవలేనో ఆ అవయవమును ప్రధానముగా ఉద్దేశించి మిగిలిన సర్వావయముల పూజను కూడ చేయు చుండవలెను. ఈ విధముగా పూజిం చుచు ఆ నక్షత్ర దినములందు బ్రాహ్మణులను భోజన దక్షిణా వస్తాదులతో పూజించవలెను.

ఇట్లు వ్రతము పూర్తియైన తరువాత నర్వ సద్గుణములును ఉత్తమమగు వాక్కు రూపము శీలము కలిగి సామ వేదము నధ్యయనము చేసిన బ్రాహ్మణునకు ఈ చెప్పబోవు వానిని దానము చేయవలయును. 1. విశాలములయి పొడవయిన బాహుదండములు కలదియే ము తెములు ఇంద్రనీలమణులు వజములు తాపటము చేసిన విష్ణు స్వర్ణ ప్రతిమను బెల్లముతో నింపిన పాత్రయందుంచి దానిని-గోవును. వస్త్రములను ఆయా సాధన సామగ్రులతోను పాత్రలతోను కూడ మంచమును పడకను కూడ దానము చేయవలయును. ఇది కాక తనకు ఏదేది ప్రీతికర మో అది ఎల్ల తనహితమునకు గాను దానము చేయవలయును. “హిరణ్య గర్భ రూపా! అచ్యుతా! రుద్రరూపా! మా మనోరథములను సఫలము చేయుము.” అను అర్థ మిచ్చు పంతమును దానసమయమున పలుకవలెను. ఇట్లు బంగారుతో చేసిన విష్ణు ప్రతిమను లక్ష్మీ ప్రతిమతోకూడ భార్యతో కూడియున్న బ్రాహ్మణునకు (బ్రాహ్మణ దంపతులకు దానమీయవలెను. ముడులు పగుళ్లు లేని మంచమును శయ్యను కూడ ఈయవలెను. విష్ణువునకు అర్యమును కూడ ఈయవలెను. ఇట్టి విష్ణుభక్తులకు పాపములు తొలగును. ఏ పాపమును అంటదు. ఆరోగ్యము కలుగును. శయ్యా దానము చేయునప్పుడు “జనార్ధనా! నీ శయనము లక్ష్మీదేవితో శూన్యము కానట్లే కృష్ణా! నాశ యనము కూడ జన్మజన్మములందును శూన్యము కాకుండుగాక !" అను అర్థ మిచ్చు మంత్రము చేప్పవలయును.

ఇట్లు వస్త్రములను మాల్యములను గంధద్రవ్యములను పై చెప్పిన వాటిని నక్షత్ర పురుషత త్వ మెరిగిన బ్రాహ్మణునకు దాన మిచ్చి అతనిని వీడు కొనవలయును. ఈ ప్రతి నక్షత్ర దినమునందును ఉపవాసముండి తైలము లవ ణము (పులుపు కారము) లేని ఆహారము తినవలెను. ధనమున లోభము చూపక యథాశ క్తిగ భోజనములు పెట్టవలెను.

ఇట్లు నక్షత్ర పురుషవ్రతమును సమాప్తము చేసినవారికి సర్వకామములు (సంకల్పములు) నెర వేరును. విష్ణులోక ప్రాప్తియగును. తాను కాని తన పెద్దలు కాని చేసిన బ్రహ్మ హత్య మొదలగు పాపములన్నియు నశించును.

ఈ వ్రత విషయ) మును చదివినను వినినను వ్రతమును ఆచరించినను స్త్రీలకు కాని పురుషులకు కాని కలి దోషములన్నియు నశించును. సకలైశ్వర్యములు కలుగును. అన్ని కోరికలును తీరును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సం పోదమున నక్షత్ర పురుష వ్రతము అను ఏబది నాలుగవ అధ్యాయము.