151 -  విష్ణువు గరుడునితో కూడ పారిపోవుట॥

సూతః: తస్మి న్వినిహతే దై త్యే గ్రసనేబలనాయ కే

 నిర్మర్యాదమయుధ్య న హరిణా సహదానవాః

పట్టస్తైర్ముసలైః శిప్రా సై ర్గదాభిఃకుణి కై రపి

 తీక్ష్ణాననే స్తునారాచై శ్చక్రైశ క్తిభిరేవచ

తానస్త్రాన్విప్రముక్తాంశ్చ చిత్రయోధీజనార్దనః

 ఏకై కంశతధా చ కే బాజై రగ్ని శిఖోపమైః

తతః క్షీణాయుధ ప్రాయా దానవా థా నచేతసః

 అస్త్రాణ్యాధాతుమభవ న్న సమర్థాయదారణే

తదామృతై ర్గజైర శ్వైర్జనార్దనమయోధయః

 సమన్హాతోటిశోదై త్యా స్సర్వతఃప్రత్యయోధయ

బహు కృత్వా రణంవిష్ణుః కిడ్చా చ్ఛా స్తభుజోభవత్

 ఉతాచనగరుత్మ నం తస్మింస్తుతుములేరణే

గరుత్మన్కచ్చిదళైన స్త్వమస్మిన్నైవసామతమ్

 యద్యశాస్తొసి తద్యాహి మథనస్యరథంతి

శాన్తో సిచ ముహూర్తంత్వం రణాదపసృతోభవ

 ఇత్యుక్తో గరుడ సేన విష్ణునా ప్రభవిష్ణునా

ఆససాద రణీదైత్యం మథనం ఘోర దర్శనమ్

 దైత్య స్వభిముఖందృష్ట్వాశ జచక్రగదాధరమ్

జఘాన భిడ్డవాలేన శిత ధా రేణ వక్షసి

 తండ్రహారమశిన్యైవ విష్ణుస్తస్మి న్మహాహవే

జఘాన వఇ్చభిర్బాణే ర్మార్జితై క్లోహవాహిభిః

 పునర్దశ భిరాకర్ణకృషెర్గాఢం స్తనా నరే

విద్ధో మర్మసు దైత్యేంద్రో హరిం బాణై రకమ్పయత్

 సముహూర్తం సమాశ్వస్య జగ్రాహ పరిఘంతదా

జఘ్నే జనార్దనంచాపి పరిఘేణాగ్ని వర్చసా

 విష్ణు స్తేనవహారేణ కిఞ్చిచ్చిదాఘూర్ణితోభవత్

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను సేనాపతియగు గ్రసనుడు నీహతుడు కాగానే దానవులు శ్రీహరితో కూడ మితిమీరిన యుద్దము చేసిరి పట్టనములను ముసలములను ప్రానములను గదలను కుణికములను వాడి మొనలుగల నారాచములను శక్తులను చక్రములను వారు వదలినను చిత్రయోధుడగు జనార్ధనుడు వాటినొక్కొక్క దానిని అగ్ని జ్వాలలవంటి బాణములతోనూ రేసిగా ఖండించెను అంతట దైత్యులు చాలవరకు తమ ఆయుధములు ఆయిపోవుటచే చిత్రములు భ్రాంతినొంది రణమున అస్త్రముల ప్రయోగించుటకు ఆసమర్థులు కాగానే వారు చచ్చిన ఏనుగు లను గుర్రములను గొని గోవిందునితో యుద్ధమాడసాగిరి ఇట్లు అన్ని వైపులనుండి కోట్లకొలదిగ దైత్యులు అన్ని విధముల ఎదిరించి యుద్దమొనర్పగా వారితో పోరిపోరి విష్ణుడు కొంచెము శ్రమచేందిన భుజములు కలవాడై ఆతుముల రణరంగమున గరుడునితో “గరుత్మన్! నీవు ఇంతవరకీ యుద్ధమున శ్రమచెందనేలేదనుకొందును ఇది నిజమైనచో మథనుని రథముకడకు నన్ను తీసికొని) పొమ్ము నీవును అలసితివా ముహూర్తకాలము యుద్దమునుండి తొలగి దూరముగ (నన్ను ను తీసికొని) పొమ్ము” అనెను మహాసమర్థుడగు విష్ణుడిట్లు పలుకగా గరుడుడు ఘోరాకారుడగు మథనుని దగ్గరకు (విష్ణునితో) పోయెను

ఆ దైత్యుడు తన ఎదుట శంఖచక్ర గదాధరుడుండుట చూచి వాడి దరగల భిండివాలముతో అతని వక్షమున కొట్టెను విష్ణువామహాయుద్ధమున ఆప్రహారము లెక్క చేయక యే శుద్ధి చేయబడి లోహపు మొనలుకల ఐదు బాణములను మర ల ఐదు బాణములను ఆకర్ణముగ ధనువు లాగి విడిచి వాని స్తనా న్తరమున ప్రయోగించేను మర్మములందు దేబ్బలు తిని ఆ దై త్యేంద్రుడు హరిని బాణములతో కంపింపజే నెను వాడొక ముహూర్తకాలము విశ్రాంతినొంది అగ్ని తేజస్క మగు పరిఘను గొని జనార్దనుని కొట్టేను విష్ణువా దెబ్బతో కొంచెము దిమ్మరపోయెను

తతఃకోపనివృత్తాక్షో గదాం జగ్రాహమాధవః

 మథనస్య తయామేషం నిష్పి పేషాథశాశ్వతః

మేషాత్పపాత దైత్యేౄః క్షయకాలే ఒచలో యథా

 తస్మిన్ని పతితే భూమౌ దానవే వీర్యశాలిని

అవసాదంయయు రౌత్యాః కర్మణ్యేకాకినోయథా

 తత స్తేష్వవసన్నేషు దానవేష్వభిమాన్షు

ప్రకోపాద్ర కనయనో మహిషో దానవేశ్వరః

 ప్రత్యుద్యయారణంరౌద్ర స్వబాహుబలమా శ్రితః

తీక్ష్ణధా రేణశూలేన మహిపోహరిమర్దయత్

 శక్త్యాచగరుడంవీరో హృదయేన్యహనద్దృఢమ్

తతో వ్యావృత్య వదనం మహాచలగుహానిభమ్

 గ్రస్తుమేచ్ఛద్రణే దైత్య స్సగరుత్మతమచ్యుతమ్

దృష్ట్వాచ్యు తోపి విజ్ఞాయ దానవస్యచికీర్షితమ్

వదనంపూరయామాస దివ్యైర క్రైర్మహాబలః

మహిషస్యాథ ససృజే బాణా ఘోరరుడధ్వజః

 పిధాయ వదనం దివ్యైర్డీవ్యాస్త్రైః పరిమంత్రితైః

సతై ర్బాణై రభిహతో మహిపోచలసన్నిభః

 పరివర్తిత కాయో సౌ పపాతచమమారచ

మహిషం పతితం దృష్ట్వా భూమౌ ప్రోవాచ కేశవః

 మహిషాసురమత స్వం వధం నా రిహార సి

యోషిద్వధ్యః పురోక్తో సి సాక్షాత్కమలయోనినా

 ఉత్తిష్ఠ జీవితం రక్ష గచ్ఛాస్మాత్సజ్గరాద్ద్రుతమ్

ఆంతట శాశ్వతుడగు మాధవుడు కోపముతో గ్రుడ్లు గిరగిర త్రివ్పుచు గదనుగొని దానితో వాని మేషమును పిండిచే సెను దాన ఆ దై త్యేంద్రుడు ప్రళయకాలమున పర్వతమువలే ఆమేషమునుండి పడెను వీర్యశాలియగు ఆ దానవుడు భూమి పై పడగా దైత్యులు ఆ యుద్ధ కర్మమునందు తా మొంటరివారై పోయినట్టు అవసాదము (శక్తిహీనత) నొందిరి అభిమానవంతులగు దానవులట్లగుటచూచి దానవేశ్వరుడగు మహిషుడు స్వబాహుబల మాశ్రయముగా ప్రకోప వశమున రక్తనేత్రుడయి రౌద్రుడయి ఎదిరించి పోరెను; వాడి వాదర గల శూలముతో హరిని నొప్పించెను; వీరుడాతడు శక్తి ఆయుధము)తో గరుడుని బలముగా కొటైను అంతట దైత్యుడు నుహాపర్వత గుహవలె నోరు తెరచి గరుడునితో కూడ అచ్యుతుని మింగగోరెను అది చూచి హరి వాని తలపునెరిగి మహాబలుడతడు దివ్యాస్త్రములతో వాని నోరు నింపెను పిమ్మట దివ్యాస్త్రములతో అభిమంత్రించిన దివ్య బాణములతో వానిని కొట్టేను వాడాదెబ్బలుతిని పర్వ తమువలే వెల్లకిల పడెను; మరణించనుకూడ మరణించెను మహిషుడు క్రింద పడియుండగా చూచి కేశవుడు వాని నుద్దేశించి ఇట్లు స్పష్టముగా పలికెను *మహిషాసురా! నీవిచట నాయస్త్రములతో మృతినొందదగవు; సాక్షాత్తుగ బ్రహ్మ (పద్మ సంభవుడు) నీవు స్త్రీ చేతిలో మరణింతువని పలికెను కావున జీవితమును కాపాడుకొనుచు రణరంగమునుండి శీఘ్రముగా పొమ్ము

(*మరణించిన తరువాత కొలది సేపటివరకు మృతజీవుడు లింగ శ రీరముతో ఆటనే ఉండును కావున ఇట కేశవుడు మహిషునుద్దేశించి పలి కెను అనుట సమంజసమే

తస్మిన్పరాజ్ము ఖే దై త్యే మహి షే శుమ్భదానవః

 సన్దపౌష్టపుటః కోపాద్భ్రుకుటీవికృతాననః

నిష్పిష్యపాణినా పాణిం ధనురాదాయభైరవమ్

 సజ్యంచకార స ధనుశ్శరాంస్తు భుజగోపమా

సచిత్ర యోధీ దృఢముష్టి పాత స్తతశ్చ విష్ణుంగరుడంచ దైత్యః

 బాణెర్జ్వలద్వహ్ని శిఖానికా శైః కి వైః ప్రసజ్ఞ్యః పరితోగృహీత

విష్ణుస్తు దైత్యేశ్రోళరార్ధితోహి శ క్తిం సమాదత్త కృతా నతుల్యామ్

 తయాశుశ క్త్యా స పి పేష మేషంశుంఠంచ శత్రుం ధరణీధరాభమ్

తస్మాదథాప్లుత్యహతాచ్చ మేషా ద్భూమౌ పదాతిర్థనుజాధిపస్సః

తత స్స భూస్థస్యహరిశ్శరౌఘాన్ము మోచ కాలానల తుల్యభాసః

శరై ఫ్రాభి స్తస్యభుజంబిభేదషడ్భిశ్చ శీర్షందశభిశ్చ కేతుమ్

 విష్ణుర్వికృషైశ్రవణా వసానం దైత్యస్య వివ్యాధవివృతనేత్రః

సతేన విద్రోవ్యథితో బభూవ దైత్యేశ్వరో విప్లుతశోణితౌఘః

 తతోస్య కిడ్చోచ్చలితస్య ధైర్యాదువాచ సఖ్యే స తు శార్జపాణికి

కుమారివద్యోసి రణం విముక్చా గుమ్బాసుర స్వల్పతరై రహోభిః

 వధం న మతో2ర్హసి గచ్ఛమూఢ వృథైవ కిం యుద్ధసముత్సుకోసి

శమ్బో వధం విష్ణుముఖాన్ని శమ్య నిమి స సళ్త్యే సమియేష విష్ణుమ్

 గదామథోద్యమ్య నిమిః ప్రచణ్ణం జఘాన గాడం గరుడం స ఖస్థః

జమోపి విష్ణుం పరి మేన మూల్గ్ని ప్రమృష్టర ల్నౌఘవిచిత్రభాసా

 తౌ దానవాభ్యాం విషమైః ప్రహారై ర్ని పేతతు సౌ ఘనపావకాభౌ

తత్కర్మ దృష్ట్వా దీపా జాస్తు సర్వే జగర్జు రుచ్చైః కృతసింహనా దాః

 ధనూషి చాస్ఫోట్య జవాభిఘాతై ర్న్యదారయన్భూమిమపి ప్రచణ్ణః

వాసాంసి చై వాదుధువుః పరేతు దధ్ముశ్చశజ్ఞానక గోముఖోఘాక్

 అథ సంజ్ఞామవాప్యాశు గరుడోపి స కేశవః

పరాజ్ముఖో రణా త్తస్మాత్పలాయత మహాజవః

ఇతి శ్రీమత్స్యమహావురాణే దేవాసురజ్గ్రామే గరుడ సహిత విష్ణుపలాయనం

నామ ఏకపఞ్చా శదుత్తరశతతమోఽధ్యాయః

ఆ దైత్యుడు మహిషుడు పరాజ్ముఖుడై పోగానే శుంభదైత్యుడు కోపముతో పెదవులను కోరుకుచు కనుబొమల ముడితో వికృతముఖుడై కరముతో కరము పిసికి కొని భయంకర ధనువు పునేను సర్పములవంటి బాణములు గొని వింటసారి ఎక్కించి వాటిని సంధించి చిత్రముగ యుద్ధము చేయు యోధుడును దృఢముష్టితో బాణప్రయోగము చేయగలవాడు నగు ఆ శుంభుడు వాటితో గరుడుని విష్ణుని నొప్పించెను జ్వలించు అగ్ని జ్వాలలతో సమములును శీఘ్రములును సంఖ్యాతీతములును నగు బాణములతో వాడు హరి గరుడులనట్లు చుట్టివేయగా ఆ దైత్యేంద్రుని శరములనొప్పి నందిన విష్ణుడు యమసమానమగు శ క్తి పూని దానితో పర్వత సమానమగు వాని వాహన మేషమును అట్టివాడేయగు ఆ దైత్యుని కూడ పిండిచే సెను మేషము చచ్చెను ఆదనుజాధిపతి చచ్చిన మేషమునుండి దుమికి నేలపయి నిలువబడెను హరి వాని పై ప్రళయాగ్ని వంటి బాణములను ప్రయోగించేను అ హరి గ్రుడ్లు త్రిప్పుచు ఆకర్ణాంతము ధనువు నారి లాగి మూడు బాణములతో వాని భుజమును చీల్చి ఆరింటిని వాని తల పై నాటి పదింటితో ధ్వజమును కో టైను ఆ దేబ్బలతో శుంభ దైత్యుడు రక్త ప్రవాహముతో నిండి వ్యథనొందెను; ధైర్యమునుండి కొంత చలించేనుకూడ; అది చూచి హరి “శుంభాసురా! కొలది దినములలో కుమారి చేతిలో చంపబడెదవు; ఇప్పటికి యుద్ధము మానుము; మూఢా వ్యర్థముగా యుద్దమునకై తహతహ పడెదవేల? నా చేతిలో నీవు చావదగవు” అనెను విష్ణుని నోటినుండి శంభుని చావుమాట విని నీమీ విష్ణుని నేదుర్కొ నేను; పొగాకసమున నిలిచి ప్రచండగద ఎత్తీ గరుడునీ కో టైను జంభుడనువాడు సొన పట్టిన రత్నముల విచిత్ర కాంతులతో వెలుగు పరిఘతో విష్ణుని తలపయి కొట్టెను అట్లు అప్పుడు గరుడుడును హరియు ఆ దానవుల చేతిలో విషమ ప్రహారములు తిని దట్టములగు అగ్నులవలే పడిపోయిరి ఈ కార్యము చూచి దైత్యు లందరును బిగ్గరగా గర్జించిరి సింహనాదములు చేసిరి ప్రచండులై ధనుపుల నారులను వేగముగా సారించి ఆస్పో టించి భూమిని బ్రద్దలు చేసిరి వస్త్రములను విసరిరి; శంఖములు ఆనక ములు గోముఖములు మొదలగు వాద్యములను మోగించిరి కొంత సేపటికి తెలివివచ్చి హరి గరుడునితో కూడి యుద్ధమునకు పెడ మయి మహాజవమున పారిపోయెను

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున గరుడునితో కూడిన హరి పారిపోవుటయను ఏబది యొకటవ అధ్యాయము