253 - చతుశ్శాలాది స్వరూప వివేచనము.

 సూతః : చతుశ్శాలం ప్రవక్ష్యామి స్వరూపం నామత స్తథా

చతుశ్శాలం చతుర్ద్వరై రశిందై స్సర్వతోముఖమ్

నామ్నా త త్సర్వతోభద్రం శుభం దేవనృపాలయే

పశ్చిమద్వారహీనం చ నగ్ధ్యావర్తః ప్రచక్యతే

దక్షిణద్వార హీనం తు వర్ధమాన ముదాహృతమ్

పూర్వద్వార విహీనం తు స్వస్తికం నామ విశ్రుతమ్

రుచకం చోత్తర ద్వార విహీనం త త్ర్పచక్షతే

సౌమ్యశాలావిహీనం త త్రిశాలం ధాన్యకం చ యమ్(త్)

చేమవృద్ధికరం నృణాం బహుపు తఫలప్రదమ్

శాలయా పూర్వయా హీనం సు క్షేత్ర మితి విశ్రుతమ్

ధన్యం యశస్య మాయుష్యం శోక మోహ వినాశనమ్

కాలయా యామ్యయా హీనం యద్విశాలం తు శాలయా

కులక్షయకరం నృణాం సర్వవ్యాధిభయావహమ్

హీనం పశ్చిమయా యత్తు పక్షఘ్నం నామ తత్పునః

మిత్రబన్దుసుతా హంతి తథా సర్ఫభయావహమ్

యామ్యా ఒవరా భ్యాం శాలాభ్యాం సర్వధాన్యఫలప్రదమ్

షేమవృద్ధికరం నృణాం తథా పుత్తఫలప్రదమ్

యమసూర్యం చ విజ్ఞేయం పశ్చిమోత్తర శాలికమ్

రాజాగ్ని భయదం నృణాం కులక్షయకరం మహత్

ఉదక్ఫూర్వే తు శాలే ద్వే దణ్డాఖ్యే యత్ర త ద్భవేత్

 అకాలమృత్యుభయదం పరచక్ర భయావహమ్

ధనాఖ్యం పూర్వరూమ్యాభ్యాం శాలాభ్యాం చ ద్విశాలకమ్

 త చ్ఛ స్త్రళయదం నృణాం పరాభవభయావహమ్

 పూర్వాపరాభ్యాం తు సా భవే న్మృత్యుసూచనీ

 వైధవ్యదాయినీ స్త్రీణా మనేక భయదాయికా

 కార్య ముత్తరయామ్యాభ్యాం శాలాభ్యాం భయదం నృణామ్

 సిద్ధార వప్రవర్జ్యాణి విశాలాని సదా బుధైః

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: లోగడ చెప్పిన నామక్రమమున మొదట చతుశ్శాల గృహస్వరూపమును తెలి పెదను; 1. ఇది నాలుగువై పులను వాకిండ్లును ఆశిందములును (పంచలు - వసారాలు) కలిగిన నాలుగు శాలా గృహములు కలది; దీనికి సర్వతోభద్రము అని శాస్త్రవ్యవహారము; దేవతలకును నృపులకును ఇదిచాల మంచిది; 2. ఆన్ని విషయములును ఇట్టేఉండి పడమటకు మాత్రము వాకిలిలేని చతుశ్శాలము నంద్యావర్తమనబడును; 3. దక్షిణము నకు మాత్రము వాకిలిలేని చతుశ్శాలము స్వస్తిక ము; 4. ఉత్తరమునకు మాత్రము ద్వారములేని చతుశ్శాలము రుచకము; ఇక త్రిగా లగృహములు: ఉత్తరమున మాత్రము శాలలేనిది (తూర్పు పడమర దక్షిణములందు శాలలుకలది) ధాన్యక మన బడును; ఇది క్షేమవృద్ధికరము - బహుపు తఫలప్రదము; తూర్పున ఈలలేని తొలగృహము ‘సుక్షేత్ర’మనబడును; ఇది శుభమును ఆయువును యశమును కలిగించును; శోక మోహనాశక ము; దక్షిణమున శాలలోని త్రిశాలగృహమునకు ‘విశాల’మని పేరు; ఇది కులక్షయకరమును; వ్యాధి భయావహమును; పశ్చిమమున మాత్రము కాలలేని త్రిశాలగృహ మునకు పక్షఘ్నమని పేరు; ఇది మిత్రబంధుసుతనాళమును సర్పభయమును కలిగించును; (ఇక ద్విశాల గృహములు): దక్షిణ పశ్చిమములయందు శాలలుకలది నర్వధాన్యఫలప్రదము; మవృద్దీకరమును పుతఫలప్రదమును; పశ్చిమోత్తర శాలలుకల ద్విశాలము యమసూర్యమనబడును; రాజభయాగ్ని భయప్రదము - కులక్షయకరము; ఉత్తర పూర్వదిక్మాలలు కల ద్విశాలము ‘దండ’మనబడును; ఆది అకాలమృత్యుపరచక్ర (సేనా) భయజనక ము; పూర్వదక్షిణ కౌలాద్వయము కల ద్విశాలము ‘ధన’మనబడును; అది శస్త్రళయ పరాభవ భయప్రదము; తూర్పు పడమరల శాలలుకల ద్వీశాలము ‘చుల్లీ’ ‘పొయ్యి’ అనబడును; ఇది మృత్యుభయదము - వైధవ్యప్రద ము; ఉత్తర దక్షిణములందు మాత్రము శాలలుకల ద్విశాలము ‘కార్యము’ అనబడును; ఇది భయప్రదము; ఇవికాక సిద్దార్థము - వజ్రము మొదలగు పేరులుకల ద్విశాలా భేదములనుకూడ వివేకులు నిర్మింపరాదు.

రాజభవనాదినిర్మాణ క్రమః.

ఆథాత స్సమ్పవక్ష్యామి భవనం పృథివీపతేః

 పశ్చాప్రకారం తత్రోక్త ముత్తమాదివిభేదతః

అష్టోత్తరం హ స్తశతం విస్తర శ్చాత్తమో మతః

 చతుర్హ్వన్యేషు విస్తారో హీయతే త్వష్టభిః కరైః

 చతుర్థాంశాధికం దైర్ఘ్యం పళ్చి స్వపి నిగద్యతే

యువరాజస్య వక్ష్యామి తథా భవనపళ్చికమ్

 షడ్బి షడ్బి స్తథా శీతిర్ హీయతే తత్ర వి స్తరాత్ 

త్ర్యం న బాధికం దైర్యం పజ్చస్వపి నిగద్యతే

 సేనాపతేః ప్రవక్ష్యామి తథా భవసపజ్ఞ్చకమ్

 చతుష్టష్టిస్తు విస్తారా తడి షడ్భిః ప్రహీయతే

పఇ్చ స్వేతేషు దైర్ఘ్యం చ షడం శేనాధికం భవేత్

 మ స్త్రిణా మపి వక్ష్యామి తథా భవనపఇకమ్

 చతుశ్చతుర్భి డ్రీ నా స్యా త్కరషష్టిః ప్రవి స్తరే

 అష్టాంశే నాధికం దైర్ఘ్యం పఃస్వపి నిగద్యతే

సామగ్లామాత్యలోకానాం వ్య భవనపళ్చికమ్

 చత్వారింశ త్తథాష్టా చ చతుర్భి  యతే క్రమాత్

 చతుర్థాంశాధికం దైర్ఘ్యం పళ్చా స్వేతేషు శస్యతే

 శిల్పినాం కణ్చుకీ(కి)నాం చ వేశ్యానాం గృహపశ్చికమ్

అష్టావింశకరాణాం తద్విహీనం విస్తరా తమాత్

 ద్విగుణం దైర్ఘ్య మేవో క్తం మధ్య మే ష్వేవ మేవ తు

దూతీకర్మా నీకాదీనాం వత్యే భవనపళ్చికమ్

 చతుర్థాంశాధికం దైర్ఘ్యం విస్తారో ద్వాదశైవ తు

 ఆర్ధార్దకరహాని స్స్యా ద్విస్తారా త్చఞ్చుసు క్రమాత్ 

ఇక మీదట రాజభవనపు కొలతలను చెప్పేదను; ఆది ఉత్తమాది భేదమున ఐదు విధములు (బహుశ  1. ఉత్తమము 2. ఉత్తమమధ్యమము - 3. మధ్యమము- 4. మధ్యమాధమము 5. ఆధమము). వీనిలో మొదటి దాని వేడలుపు 108 మూరలు; మిగిలిన నాలుగింటికిని క్రమముగా దీనినుండి ఎనిమిదేసి మూరలు తగ్గును; పొడవు ప్రతిదాని యందును వెడల్పుకంటె . వెడల్పులో మరియొక చతుర్దంశ మధికము. వే:పొ=1:1+1/4 అనగా 1. పొడవు 135 మూరలు - వెడల్పు - 108 మూరలు 2. పొ.125; వే.100; 3. పొ-115; వే.92; 4. పొ.105; వే. 84; 6. పొ. 95; వే. 76.

యువరాజ గృహమునకు వెడల్పు మొదటిదానికి 80 మూరలు; క్రమముగా మిగిలిన నాలుగింటికినీ చొప్పున మూరలు తగ్గవలయును; పొడవు ప్రతిదానియందును వెడల్పునకు మరల దానిలో మూడవవంతు అధికము వే:పొ= 1. 1+1/3; అనగా 1. వె.80; పొ.106+2 /4; 2. వె.74; -9842/8; 8. వె68; పొ -90+2/3; 4. వె.62; పొ-82+2/3; 5. వే-56; పొ-74+2/3;

సేనాపతి గృహమునకు- 1. వె.84; పొ-7442/8; 2. వె58; పొ67+28; 8. వే-52; పొ. 60+26; 4. వె.46; పొ.582/8: 5. వె.40: పొ46+2/8: అనగా వెడల్పు 64 మూరలు: ఇది క్రమముగా 6 మూరలచొప్పున తగ్గుచు పోవును; పొడవు ప్రతిదానియందును వెడల్పుకంటె మరల దానిలో ఆరవవంతు అధికము పొ:వే =1:1+1/6.

ఇక మంత్రుల గృహములకు. వెడల్పు 60 మూరలు: ఇది మిగిలిన నాలుగింటిలో 4 మూరలచొప్పున తగ్గును. పొడవు వెడల్సుకంటే మరల వెడల్పులో ఎనిమిదవవంతు ఆధికమగును . పొ=1:1+1/8: ఆనగా 1. 2.60: పొ.87 +1/2; 2. 3.56: పొ. 68: 8. వె.52: పొ_58412: 4. 48: పొ.64: 6. వే-44: పొ.4941/2.

ఇక సామంతులు ఆమాత్యులు మొదలగువారి గృహముల ఐదు భేదములు; 48తో ఆరంభించి క్రమముగ 4 చొప్పున తగ్గుచు వెడల్పును వెడల్పుకంటే దానిలో 1/4వంతు కలిసినంత పొడవును; వే:పొ: 1:!1 1/4; ఉండవలయును: 1. వే. 48: పొ.60; 2. 3.44; పొ.65: 8. వే-40; పొ.50; 4. వే-86; .46; 5. వే.82; పొ.40; .

శిల్పి కంచుకి వేశ్యాగృహముల పంచభేదములు; 28 మూరలతో ఆరంభించి వెడల్పు 2 చొప్పున తగ్గుచు పోవును; వెడల్పునకు రెట్టింపు పొడవుండును; వె: పొ–1:2; 1. వే-28; పొ.6; 2. వే-26; పొ$2; 8. వే-50; పొ.100; 4. వె,48; పొ.96; 5. వే. 46; పొ.92;

దూతికలు కర్మాంతికులు (కమతగాండ్రు) మొదలగువారి పంచగృహ భేదములు; 12తో ఆరంభించి 1/4మూర చొప్పున వెడల్పు తగ్గుచుపోవును; వెడల్సుకంటే దానిలో నాలుగవవంతు ఆధికమయినంత పొడవు; వే: పో -1: 1/4: 1. వై.12; పొ.15; 2.3.11 1/2; సొ.14 3/8: 3. వై.11;పొ.13 3/4; 4. 3.10 1/2;పొ.18 1/6; 6. 3.10;పొ-12 1/2;

దైవజ్ఞగురువే ద్యానాం సభాస్తారపురోధసామ్

తేషామపి ప్రవక్ష్యామి తథా భవనపఞ్చకమ్

 చత్వారింశత్తు విస్తారా చ్చతుర్భి ర్హీయతే క్రమాత్

పశ్చి స్వేతేషు దైర్ఘ్యం చ షడ్భాగేనాధికం భవేత్

చాతుర్వర్ణ్యస్య వక్ష్యామి సామాన్యం గృహపజ్ఞ్చకమ్

ద్వాత్రింశతి కరాణాం తు చతుర్బి ర్జీయతే క్రమాల్

 ఆషోడశాదితి పరం న్యూన మ నేఒవసాయినామ్

దశాం తేన త్రిభాగేస త్రిథాగేనాథ పాదికమ్

 అధికం దైర్ఘ్య మిత్యాహు ర్ర్బహ్మణాదేః ప్రశ స్యతే

సేనాపతే ర్నృపస్యాపి గృహయో రన్తరేణతు

 నృపవాస గృహం కార్యం భాణా గారం తథైవచ

సేనాపతే ర్గృహస్యాపి చాతుర్వర్ణ్యస్య  చానరే

 వాసాయచ గృహం కార్యం రాజపూజ్యేషు సర్వదా

 అ న్తరప్రభవాణాం చ స్వపితు ర్గృహ విష్యతే

 తథా హస్తశ తా దర్గం గదితం వనవాసినామ్

సేనాపతే ర్నృపస్యాపి సప్తత్యా సహితేజన్వితే

 చతుర్దశహతే వ్యాసో లావ్యాసః ప్రకీర్తితః

పళ్చాత్రింశాన్వితే తస్మి న్న శిన్ద సముదాహృతః

 తథా షట్రింశద్దస్తా తు సప్తాజ్గుళ సమన్వితా

విప్రస్య మహతీ శాలా న దైర్ఘ్యం పర తో భవేత్ 

దైవజ్ఞులు గురువులు వైద్యులు నభిస్తారులు పురోహితులు ఇట్టి వారి పంచగృహ భేదములు; 40తో ఆరంభించి వెడల్పు క్రమముగ 4 మూరలు తగ్గుచుపోవును; వెడల్పు: పొడవు= 6: 7;

చాతుర్వర్ణ్యముల వారికిని గ్రామాంత వాసులవరకు ఒకే విధముగ పంచవిధ గృహభేదములు; వీని వెడల్పులు 32తో ఆరంభించి 17 వరకు 4 చొప్పున తగ్గుచుపోవును; బ్రాహ్మణ గృహముల పొడవు: వెడల్పు =11:10; క్షత్రియు లకు- పొడవు: వెడల్పు =9:8; వైశ్యులకు.పొతవు: వెడల్పు 4:3; శూద్రులకును ఆంత్యజులకును పొడవు: వెడల్పు = 5:4:

సేనాపతిగృహ నృపగృహములకు నడుమ (అతిథులుగా వచ్చిన) నృపులకు గృహములుండవలెను; అచటనే భాండాగారము (ఉగ్రాణము-Store house) నుండవలెను; సేనాపతిగృహ చాతుర్వర్డ్యులగృహములకు నడుమ రాజ పూజ్యులగు పెద్దల బస కై గృహములుండవలెను; ఆందే మంత్రి సేనాపతి ప్రభృతుల కుమారుల గృహములును రాజు పితృగృహము కూడ ఉండవలెను; వనవాసులగు వారి (విడిది)గృహములు ఏబది మూరల వెడల్పుతో నుండవలయును.

ఈ చేప్పిన పొడవులను వెడల్పులను శాలకు కొంతయును అళిందమునకు (పంచకు) కొంతయుసుగా విభజించ వలయును. దాని విభాగము ఎట్లనిన: రాజునకును సేనాపతికిని నిర్మించు గృహములకై చెప్పిన వెడల్పునకు డెబ్బది (మూరలు) చేర్చి ఆ మొ త్తమును పదునాలుగుతో భాగించగా వచ్చినంత వెడల్పు శాలా భాగమునకును అదే గృహపు వెడల్పునకు ముప్పదియైదు చేర్చి దానిని పదునాల్గుతో భాగించగా నై సంత వెడల్పు అళిందమునకును గ్రహించవలయును.

విప్రుల గృహములకు సంబంధించిన మహాశాల ముప్పదియారు మూరల ఏడంగుళముల పొడవుండవలయును; అంతకంటే ఎక్కువ పొడవు ఉండరాదు.

దశాజ్గుళాధికా తద్వ త్క్ష త్రియస్య విధీయతే

పఞ్చత్రింశత్కరా వై శ్యే ఆజ్గుళాని త్రయోదశ

 తావత్కరై వ శూద్రస్య యుతా ప్చదశాజ్గు శైః

 శాలాయాస్తువిభాగేన యస్యాగే వీథికా భవేత్

 సోషీషం నామ తద్వాస్తు పశ్చాచేయోచయం భవేత్

పార్శ్వయోర్వీధికా యత్ర సావష్టమ్భం తదుచ్యతే

 సమన్హాద్వీథికా యత్ర సుస్థితం తదిహోచ్యతే

 శుభదం సర్వ మేత త్యా చ్చాతుర్వర్ణ్యే చతుర్విధమ్

 విస్తారా త్షోడశో భాగ స్తథా హ స్తచతుష్టయమ్

 ప్రథమో భూమికోచ్ఛాయ ఉపరిష్టా తహీయతే

 ద్వాదశాం శేన సర్వాసు భూమికాసు తథోచయః

ప క్వేష్టకా భవేదిృత్తి షోడశాంశేన విస్తరాత్ 

దారవైరపి కల్ప్యా స్యా త్తథా మృన్మయభిత్తికా

గర్బమానేన మానం తు సర్వవాస్తుషు శస్య తే

గృహవ్యాసస్య ప ఞ్చాశ దష్టాదశభి రజ్గు శైః

సంయుతో ద్వారవిష్కమ్భో ద్విగుణే నోచ్ఛ్రయో భవేత్

ద్వారశాఖాసు బాహుళ్య ముచ్ఛ్రాయకర సమ్మితైః

అజ్గుశై స్సర్వవాస్తూనాం పృథ క్త్వం శస్యతే బుధైః

ఉదుమ్బరో త్తమాజ్గం చ తదర్ధార్థ ప్రవి స్తరాత్

ఇతి శ్రీమత్స్య మహాపురాణే వాస్తుశా స్త్రే చతుశ్శాలాది నిర్మాణక్రమో నామ త్రిపఞ్చాశదుత్తర ద్విశతతమోఽధ్యాయః

క్షత్త్రియుల గృహముల మహాజాల పొడవు ముప్పది ఆరు మూరల  పది యంగుళములుండవలెను.

వైశ్యుల మహాశాల పొడవు ముప్పదియైదు మూరల పదుమూడంగుళములుండవలయును.

శూద్రుని మహాశాల పొడవు ముప్పదియైదు మూరల పదునై దంగుళములు.

శాలకు ముందు భాగమున వీథిక (శాలయంత పొడవునను ఆవరణముగాని నిర్మాణముగాని లేని 'నడక' ప్రదేశము) ఉన్న చో అట్టి వాస్తును “సోష్ణీషము' వెనుక వైపున వీథిక యున్నచో అట్టి వాస్తును 'శ్రేయోచ్ఛయము' శాలకు రెండువైపులను వీథిక కలవాస్తును 'సావష్టంభము' అన్ని వైపులను - వీథికయున్న వాస్తును సుస్థితము' అందురు: చాతుర్వర్ణ్యులకును ఈ నాలుగు విధములగు వాస్తులలో ప్రతియొక టియు శుభకరము.

* (ఎక్కువ భూమిక [అంతస్తు]లతో భవనములు కట్టునపుడు) భవనపు గర్భపు వెడల్పు (భుజము) ఎంత యుండునో దానిలో పదునారవవంతు ఆగు మూరల ఎతుగ మొదటి యంతస్తు ఉండవలయును; ఆంతకు మించి ఎక్కువ అంతస్తులకు పోవుకొలది మొదటి అంతస్తు ఎత్తులో పండ్రెండవవంతు తక్కువగా రెండవదియు రెండవదానీ ఎత్తులో వండెండవవంతు తక్కువగా మూడవ యంతస్తును ఆను ఈ క్రమములో ఉండవలయును. ఇదీయొక విధము; అథవా-ఆన్ని అంతస్తులు నాలుగు మూరల ఎత్తుతోనే ఉండుట రెండవ పద్ధతి.

గోడలు-కాల్చిన ఇటుకలతో కట్టవలయును; వాని మందము శాలా విస్తారములో (వెడల్పులో) పదునారవ వంతు ఉండవలయును; గోడలు కొయ్య తునుకలతో గాని మట్టితో గాని కట్టవచ్చును.

ఏ విధమగు వాస్తు (నిర్మాణము)ల యందై నను గృహపు మొ త్తపు వెడల్పును నడుమింటి (గర్భపు) వెడల్పును సరియగు అనుపాతములో నుండవలయును.

ద్వారపు వెడల్పు అరువది ఎనిమిది అంగుళములును దాని ఎత్తు అంతకు రెట్టింపు (నూట ముప్పదియారంగు ళములు)ను ఉండవలయును; వాకిటి ఎత్తు ఎన్ని మూరలో ద్వార శాఖల వెడల్పు అన్ని అంగుళములుండవలయును: ఈ మందము అన్ని వాస్తులయందును వర్తించును; ద్వారము పై వేయు ఆడ్డుపడై (ఉత్తరాసి) మందము ద్వార శాఖల వెడల్పులో నాలుగవవంతుండవలయును; ఈ అడ్డుపట్టెను మేడికొయ్యతో చేయవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వాస్తు శాస్త్రమున చతుశ్శాలాది నిర్మాణక్రమము అను రెండు వందల ఏబది మూడవ అధ్యాయము.

            (* ఇచట ముఖ్యముగా ఈ విషయమును గమనించవలయును. ఒక టికంటె ఎక్కువ అంతస్తులు ఉన్న గృహములు 'ప్రాసాదములు అనబడును. ప్రాసాదము'లలో అన్నిటికంటే కింది నిర్మాణము 'భూమి' (Ground floor);  ప్ర+థమ భూమిక (మొదటి అంతస్తు-First floor) మొదలుగా ఏడు -అంతస్తుల వరకు అంతస్తులను పెంచుట ప్రాచీన భారతీయుల అలవాటు అని కనబడుచున్నది. ఇట్లు అంతస్తులను పెంచునప్పుడు వాని ఎత్తుసరి ఏ ఆంతస్తు నకు ఎంత ఉండవలయును? అనునది ఇచట చెప్పబడినది. ఇచట ఆ కొలతలకు రెండు పద్దతులు చెప్ప బడినవి. అందు మొదటిదాని ననుసరించి చూచునప్పుడు రాజ ప్రాసాదము విషయము ఆలోచింతము. దానికిగల ‘భూమి' భుజపుకొలత 108 హస్తములు; కనుక మొదటి అంతస్తు 108/21=27/4 హస్తములు. రెండవ అంతస్తు = 1 ( 27/4- 27/4 ) )X 1/12= 297/48 హస్తములు; మూడవ అంతస్తు (297/48- 297/48 ) X1/12= 3267/576 హస్తములు. అని ఈ విధముగా గణితము చేయుచు ఏడు అంతస్తుల వరకు పరిమాణము నిర్ణయించుకొనవలెను. అథవా.రాజ ప్రాసాదము కాక మిగిలిన వారిగృహములును లోగడ చెప్పినట్లు రాజ ప్రాసాదములందు కూడ (పంచ విధము లలో మిగిలిన విధములగునవియు 108 హస్తములకంటె తక్కువ హస్తముల భుజముగల ‘భూమి’తో ఉండును: కనుక అట్టివానికి అన్నిటికిని నరిపడు పద్దతిగా అన్ని అంతస్తులకును 4 హస్తములే అను రెండవ విధము చెప్పబడినది. ఈ రెండవ పద్దతిలో ఏడు అంతస్తులును కలిసియు 7x4=28 హస్తములును వానికితోడు అంతస్తుల కప్పు మందమును చేరినంత మాత్రమేయుండును. కాని మొదటి పద్దతి ననుసరించినచో ఏడు అంతస్తులకును కలిసి మరికొంచెము ఎక్కువ ఎత్తు అగును.)