50 - పూరు వంశమున అజామీడ-దివోదాస-చైద్య-శంతను వంశములును భవిష్యద్రాజ వంశములును

సూతః  : అజామీఢస్య నీలిన్యాం నీల స్సమభవ త్సుతః

నీలస్య తపసోగ్రేణ సుశాంతి రుదపద్యత

 పుర జిచ్చ సుశా నేస్తు పృథుశ్చ పుర జి త్సుతః

 భద్రాశ్వః పృథుదాయాదో భద్రాశ్వతనయా న్ఛృణు

ముద్గలశ్చ జయశ్చైవ వారాహశ్చ వృథు స్తథా

యవీయా నతివిక్రాన్తః కపిల శ్చైవ పఇమః

 పశ్చానాం చైవ ప్చలా స్తేషాం జనపదా స్మృతాః

పూనాం రక్షణో హ్యేతే దేశానామితి న శ్రుతమ్

 ముద్దలస్యాపి మౌద్గల్యాః క్షతో పేతా ద్విజాతయః

ఏతే హ్యణ్ణిరసః వ సంస్థితాః కణ్వముద్దలాః

 ముద్దలస్య సుతో జజ్జీ బ్రహ్మిష్ఠ స్సుమహాయశాః

 ఇన్దసే నాహ్వయ స్తస్య వస్ధ్యాశ్వ స్తస్య చాత్మజః

 వన్ద్యాశ్వాన్మిథనం జజ్జి మేనకాయా మితి శ్రుతిః

 దివోదాసస్తు రాజర్షి రహల్యా చ యశస్వినీ

 శరద్వతస్తు దాయాద మహల్యా సంప్రసూయత

 శతానన్ద మృషి శ్రేష్ఠం తస్యాపి సుమహాతపాః

 తస్య సత్యధృతి ర్నామ ధనుర్వేదస్య పారగః

ఆసీ తత్యధృతే శ్శుక్ల మమోఘం ధార్మికస్య తు

 సన్నం రేత సత్యధృతే ర్దృష్ట్వా చాప్సరసం జలే

మిథునం తత్ర సజ్జజ్ఞే తస్మి నరసి సం శ్రీతమ్

 తత స్సరసి తస్మింస్తు క్రమమాణం మహీపతిః

 దృష్ట్వా జగ్రాహ కృపయా శ స్తను ర్మృగయాగత

 ఏతే శరద్వతః పుత్తా ఔచథ్యా గౌతమాః పరే

 అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి దివోదాసస్యపై ప్రజాః 

దివోదాససన్తతిః.

దివోదాసస్య దాయాదో ధర్మో మిత్రాయతి ర్నృపః

 మైత్రాయణావర సోపి మైత్రేయస్తు తత స్స్మృతః

 ఏతే వంశ ధృతో దక్షాః క్షత్తభేదాస్తు భార్గవాః

 రాజా చైత్యవరో నామ మైత్రేయస్య సుత స్మృతః

 అథ చైత్యవరా ద్విద్వా న్సుదాస స్తస్య చాత్మజః

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: ఆజామీఢునకు నీలినియందు నీలుడు, అతనికి మహా తపఃఫలముగా సుశా నీ అతనికి పుర జిత్ అతనికి పృథుడు అతనికి భద్రాశ్వుడు అతనికి ముద్దలుడు జయుడు వారాహుడు పృథుడు కపి లుడు కలిగిరి. వీరు ఐదుగురు ఐదు భాగములుగా నున్న పంచాల జనపదములకు పాలకు లయిరి. వీరిలో ముద్దలునకు మౌద్గల్యులు అను పేర ప్రసిద్ధులయిన క్ష ధర్ములగు బ్రాహ్మణులు కుమారులై వంశవృద్ధి చేసిరి. వీరు సంవృతాంగి రసుని వంశమునందలి కాణ్వాయనుల కోవలోనివారై కణ్వ ముద్దలు లనబడిరి. ముద్దలునకు బ్రహ్మతత్వవేత్తలలో ఉత్తముడును మహాయశుడును నగు ఇంద్రసేనుడు అతనికి వంధ్యాశ్వుడు అతనికి మేనకయందు దివోదాసుడను రాజర్షియు యశస్వినియగు అహల్యయునను కవలు కలిగిరి. ఆహల్యకు శరద్వంతునివలన ఋషి! శ్రేష్టుడగు శతానందుడు అతనికి సుమహాతపుడు అతనికి ధనుర్వేదపారగుడగు సత్యధృతి కలిగిరి. ధార్మికుడు అమోఘ రేతస్కుడునగు అతడు జలమునందుండి ఒక అచ్చరను చూడగా అతని రేతస్సు స్కన్న మయి ఆ సరస్సునందు పడెను. దానియందే ఆ రేతస్సువలన ఒక స్త్రీ శిశువును ఒక పురుష శిశువును జనించిరి. వేటకు వచ్చిన శంతనుడు ఆ పరిసరములందు తిరుగుచు అచట నడయాడుచున్న ఆ శిశువుల జంటను కృపతో తీసికొని కాపాడెను. (వీరే కృపుడు. కృపి.ద్రోణుని భార్య.అను వారు.) దివోదాసునకు మిత్రాయతి - మైత్రాయణుడు అనువారు వారిలో మిత్రాయతికి మైత్రేయుడు అతనికి చైత్యవరుడు ఆతనికి సుదాసుడు కలిగిరి.

అజామీఢా త్పున ర్జాతః క్షీణే వం శే తు సోమకః

 సోమకస్య సుతో జను ర్హతే తస్మి న్చతంబభౌ

 పుత్త్రాణా మాజమీడస్య సోమక స్య మహాత్మనః

 మహిషీ తాజమీఢస్య ధూమినీ పుత్రగృద్ధినీ

పుత్త్రాభావే తవ స్తస్త్వా శతవర్షిణి దుశ్చరమ్

  హుత్వా_గ్నిం విధివ త్సమ్య కవిత్రీకృతభోజనా

 అగ్నిహోత్రకు శే ష్వేవ సుష్వాప సుమహావ్రతా

తస్యాం విధూతపాపాయా మాజమీడ స్సమేయివాక్

 క్షత్తం సజ్జనయామాస ధూమవర్ణం శతాగ్రజమ్

 ఋషి సంవరణో జజ్జి కురు సంవర ణా త్తతః

 యః ప్రయాగ రతిక్రమ్య కురు క్షేత్ర మకల్పయత్

 కృష్యైవ తు మహారాజో వర్షాణి సుబహూ న్యథ

 కృష్యమాణ స్తత శ్శక్ర తత స్తస్మై(భయత్తస్మై) వరం దదే

పుణ్యం చ రమణీయం చ కురు క్షేత్రం చ తత్సృతమ్

తస్యాత్వవాయ స్సుమహాన్యస్య నామ్నా తు కౌరవాః

కురోస్తు దయితాః పుత్తా స్సుధన్వా జఘ్ను రేవ చ

 పరీక్ష చ్చ మహాతేజాః ప్రజన శ్చారి మర్దనః

 సుధన్వనస్తు దాయాదః పుల్తో మతిమతాం వరః

 చ్యవన స్తస్య పుత్తస్తు రాజా ధర్మార్థత త్వవిత్

 త్యాగశీలః కిమీ ర్నామ ఈషే యజ్ఞా న్మహాతపాః

 క్రిమేః పుత్రో మహావీర్యః ఖ్యాత ఇన్జసమో విభుః

 చై ద్యోపరిచరో వీరో వసుర్నా మా నరిక్షగః

 చై ద్యోపరిచరా జడ్జ గిరికా సప్త వై సుతాః

చైద్యవంశః మహారథో మగధరా డ్విశ్రుతో యో బృహద్రథః

పుత్ర శ్రవాః కుశ శ్చైవ చతుర్దా హరివాహనః

 పఇమశ్చ యజు శ్చైవ మత్స్యః కాలస్తు సప్తమః

 బృహద్రథస్య దాయాదః కుశాగ్ర నామ వీర్య వాక్

 కుశాగ్రస్యాత్మజ శ్చైవ వృషభో నామ విశ్రుతః

 వృషభస్య తు దాయాదః పుష్పవా న్నామ పార్థివః

 పుష్పఃపుష్పవత శ్చైవ రాజా సత్యధృతి స్మృతః

 సుధన్వా తస్య దాయాద స్తస్మా త్సర్వశ్చ జజ్జీవాక్

 సర్వస్య భువనః పుత్ర స్తస్మా జజ్ఞే బృహద్రథః

 ద్వే తస్య శకలే కాలే (జాతే) జర యా సన్దితశ్చసః

జరయా సన్దితో యస్మా జరాసఛస్తు స స్మృతః

 జేతా స సర్వశత్తస్య జరాసశ్లో మహాబలః

 జరాసన్షస్య పుత్తస్తు సహదేవః ప్రతాపవాన్

 సహదేవాత్మజ శ్రీమా న్సోమవి త్సుమహాయశాః

శ్రుతశ్ర వా స్సోమవిదో మాగధాః పరికీర్తితాః

సుదాసునకు సంతతిలేక వంశము క్షీణించు సమయమున అజమీడునకు సోమకుడను కుమారుడు కలిగెను. అతనికి జంతుడు అను కుమారుడు కలిగి సంతతి లేక యే హతుడయ్యెను. ఇట్టి స్థితిలో మరల సోమకునకు నూటొక్క మంది కుమారులు కలిగిరి. అది ఎట్లు జరిగెననగా _ఆజమీఢుడు (అజమీఢుని కుమారుడు) ఆగు ఈ సోమకుని భార్య పేరు కూడ ధూమిని. ఈమె తనకు సంతానము లేక పోయినందున మరల సంతానము పై వాంఛ కలిగినదయి నూరు సంవత్సరములపాటు దుశ్చరమగు తపస్సాచరించేను. విధానము ననుసరించి అగ్ని ని వేల్చెను. పవిత్రమగు హవిష్యా ద్యాహారమునే తినెను. ఉత్తమములగు వ్రతముల నియమముల పాటించుచు అగ్ని హోత్రమునకు అమర్చిన వేదిక చుట్టునున్న) దర్భలయందే నిద్రించేను. ఇట్లామె విధూతపాప (పాపములను దూరము చేసికొన్న ది) కాగా అట్టి ఆమెతో సంగమించిన ఈ ఆజమీఢుడగు సోమకునకు ఆమెయందు మొదట ధూమవర్ణుడగు కుమారుడు కలిగెను. ఆ పొగ రంగుతో తన తేజము ఆ(సం)వదింపబడినందున ఆ క్ష త ఋషి సంవరణుడనబడెను. ఆ తరువాత ఈ సంవరణునకు సోదరులుగా సోమకునకు మరి నూరుమంది కుమారులు కలిగిరి. సంవరణుని కుమారుడు కురువు. ఈ కురువు తమ పూర్వ రాజధానియగు ప్రతిష్టానము (ప్రయాగ) దాటి కురు క్షేత్రము వరకు రాజ్యము విస్తరింపజే నెను. ఎట్లన-అతడు అనేక సంవత్సరములపాటు తాను సేద్యము చేసి ఆ ప్రదేశమును పంట పొలమునుగా చేసెను. అందుచే దానికి కురు క్షేత్రము (కురురాజు చేసిన పంట చేను) అను పేరు వచ్చెను. పంటకు అనుకూలముకాని భూమిని తన కృషిచే పంట పొలముగా మార్చుటకతడు చేసిన యత్నమునకు మెచ్చి ఇంద్రుడు ఆ ప్రదేశము పుణ్యమును రమణీయమునగునట్లు వరమునిచ్చెను. అతనిబట్టి ఆ వంశము చాల గొప్పది. కావుననే ఆ వంశమువారికి కౌరవులను పేరు వచ్చెను. అతనికి సుధన్వన్ జఘ్ను (హ్ను వు పరీక్షిత్ ప్రజనుడు అనువారు కలిగిరి. సుధన్వునకు మతిమంతులలో శ్రేష్ఠుడు చ్యవనుడు అతనికి ధర్మార్థ తత్వవేత్తయు త్యాగశీలుడును మహాతపస్వియు యజ్ఞకర్తయు అగు 'క్రిమి' అతనికి ఇంద్ర సముడు మహావీర్యుడు సమర్థుడు అంతరిక్షమునందు పయనించువాడు అగుటచే ఉపరిచరుడు అనబడు వసువనునతడు కుమారు డయ్యెను. ఇతడు చేది దేశ రాజు కనుక చైద్యుడు. అతనికి గిరిక యందు మహారథుడై మగధరాజుగా ప్రసిద్ధుడైన బృహ ద్రథుడు పుత్రశ్రవసుడు కుశుడు హరివాహనుడు యజువు మత్యుడు - కాలుడు ఆను ఏడుగురు కుమారులు కలిగిరి. వారిలో బృహద్రథునకు కుశాగ్రుడు అతనికి వృషభుడు అతనికి పుష్పవాన్ అతనికి పుప్పుడు అతనికి సత్యధృతి అతనికి సుధన్వుడు. అతనికి సర్వుడు అతనికి భువనుడు అతనికి బృహద్రథుడు అతనికి అతని భార్యలయందు జనించిన రెండు శకలములను 'జర' ఆనునా మే సంధించుటచే కలిగిన జరాసంధుడు కలిగిరి. ఇతడు మహాబలుడై సర్వక్ష త్రి యవిజేత యయ్యెను. అతనికి సహదేవుడు అతనికి సోమవిత్ అతనికి శ్రుతశవుడు కుమారులయిరి. ఇది మాగధుల వంశము.

యజు స్వజనయ త్పుత్త్రం సురథం నామ పార్థివమ్

 సురథస్యతు దాయాదో వీరో రాజా విడూరథః

 విడూరథసుతశ్చాపి సార్వభౌమ ఇతి స్మృతః

 *సార్వభౌమా జ్ఞయత్సేనో రజత స్తస్య చాత్మజః

రజతస్య(వచితేస్తు) మహాభౌమ స్వయుతాయు స్తతోభవత్

 అక్రోధనోయుతాయోశ్చ తస్మా ద్దేవాతిథి స్మృతః

 దేవాతిథేస్తు దాయాదో దక్ష ఏవ బభూవ హ

 దక్షా జ్ఞజై భీమ సేనో దిలీప స్తస్య చాత్మజః

దిలీపస్య ప్రదీపస్తు తస్య పుత్తా స్త్రయ స్మృతాః

 దేవాపి శ్శనను శ్చైవ బాప్తీక శ్చేతి తే తథా

బాహ్లిక స్య చ దాయాదా స్సప్త బాహ్లీశ్వరా స్మృతాః

 దేవాపిస్తు హ్యవధ్యాతః ప్రజాభి దభవన్మునికి

 ఋషయః : ప్రజాభి స్స కొమర్థం వై అవధ్యాతో నృపాత్మజః

కో దోషో రాజపుత్తస్య ప్రజాభి స్సముదాహృతః

సూతః : కిలాసీ రాజపుత్తస్తు కుష్ఠి తం నాభ్యపూజయ

 కార్యే వై తత్ర దేవానాం క్ష త్తం ప్రతి ద్విజోత్తమాః

 భవిష్యం కీర్తయిష్యామి శననోస్తు నిబోధత

 శ స్తను స్వభవ ద్రాజా విద్వాంసో వై మహాభిషక్

 ఇమం చోదాహర నక్షత్ర శ్లోకం ప్రతి మహాభిషక్

యం యం కరేణ స్పృశతి జీర్ణం రోగిణ మేవ వా

 పున ర్యువా చ భవతి తస్మాత్తం శ స్తనుం విదుః

శంతనువంశః.

 ఏతదర్థం శ స్తనుత్వం ప్రజాభి రీహ కీర్తితమ్

 తతో వృణే త్స భార్యార్థం శ స్తను ర్జాహ్నవీం నృపః

తస్యాం దేవవ్రతం నామ కుమారం జనయ ద్విభుః

కాలీ విచిత్రవీర్యం తు దా శేయాజనయ త్సుతమ్

శననో ఠయితం పుత్రం శాస్త్రాత్మాన మకల్మషమ్

కృష్ణ ద్వైపాయనశ్చైవ క్షేత్ర వైచిత్రవీర్య కే 

ధృతరాష్ట్రం చ పాణ్డుం చ విదురం చాప్యజ్జనత్

(*సార్వభౌమా జ్జయత్సేన పచితిస్తస్య) 

ఉప రిచరవసు కుమారులలో ఐదవవాడగు యజువునకు సురధుడు. అతనికి విదూరథుడు. ఆతనికి సార్వ భౌముడు అతనికి జయత్సేనుడు అతనికి రజతుడు అతనికి మహాభౌముడు అతనికి అయుతాయువు అతనికి అ కోధనుడు అతనికి దేవాతిథి అతనికి దక్షుడు అతనికి భీమసేనుడు అతనికి దిలీపుడు అతనికి ప్రదీపుడు అతనికి దేవాపిశంతను బాహ్లికులను ముగ్గురు కుమారులు కలిగిరి. వీరిలో బాహ్లికునకు ఏడుగురు కుమారులు (బాహ్లిక దేశపు రాజులు) బాహ్లి కేశ్వరు లనబడిరి. దేవాపిని ప్రజలు అస హించుకొనుట చే అతడు ముని యయ్యెను.

అనగా ఋషులు సూతు నిట్లడిగిరి: “రాజపుత్తడగు ఆ దేవాపియందు ఏ దోషమున్నందున ప్రజలు అతనిని అసహించుకొనిరి?” అనగా సూతు డిట్లనెను. అతనికి బొల్లి (తెల్ల కుష్టు) వ్యాధి ఉండెను. అందుచే ప్రజలు అతనిని ఆదరముతో చూడక అసహించుకొనిరి. దీనికిని క్షత్రియుల విషయమున దేవతలు సంకల్పించిన ఒకానొక. కార్యమే హేతువయ్యెను. అందుచే మహాభిషక్ అనియు శంతనుడనియు బిరుదనామములు గల రెండవ రాజపుత్రుడు రాజయ్యేను. ఏలయన అతడు మహావిద్వాంసుడు. అతని విషయమున ఈ పురాతన శ్లోకము చెప్పుదురు. “శిథిల (వృద్ధుని కాని) రోగిని కానీ అతడు ఎవరిని తన చేతితో తాకునో అతడు మరల యువకుడు అగును. అందుచే అతనిని శంతనుడు.శ.సుఖమును తనోతి వృద్ధి చేయువాడు.అందురు. అతడు జాహ్న విని వివాహమాడగా ఆమేయం దతనికి దేవవ్రతుడను కుమారుడు కలిగెను. అతనికే పుత్రియగు 'కాలియందు శంతనునకు ప్రీతిపాత్రుడు. శాంతాత్ముడు అకల్మషుడు నగు విచిత్రవీర్యుని క్షేత్రమున (భార్యలగు అంబిక-అం బాలికలయందు) ధృతరాష్ట్రుడు పాండుడు అను కుమారులను (శూద్రియందు) విదురుని కృష్ణద్వైపాయనుడు ఉత్పాదించెను.

ధృతరాష్ట్రస్తు గాంధ్యర్యాం పుత్రాణాం జనయ చ్ఛతమ్

తేషాం దుర్యోధనో జ్యేష్ఠ స్సర్వక్ష త్తస్య స ప్రభుః

మాద్రీ రాజ్ఞః పృథా చైవ పాణ్డో ర్భార్యే బభూవతుః

 దేవదత్తా సుతాః ప్చ పాణ్డో రగ్గే తు జజ్ఞిరే

ధర్మా ద్యుధిష్ఠిరో జజ్జీ వాతా జ్ఞాతో వృకోదరః

 ఇన్షా ద్దనజ్జయశ్చైవ శక్రతుల్యపరాక్రమః

 విఖ్యాతా వై సుతో మాదీ సుపువే ద్విజసత్తమాః

 నకులం సహదేవం చ మాద్యశ్విభ్యా మసూయత

వక్ష్చోవ పాణవేభ్యస్తు ద్రౌపద్యం జజ్ఞిరే సుతాః

 ద్రౌపద్యజనయ జ్యేష్ఠం ప్రతి విన్యం యుధిష్ఠిరాత్

శ్రుత సేనం భీమ సేనా చ్ఛతకీర్తిం ధనజ్జుయాత్

 చతుర్థం శ్రుతవర్మాణం నకులా తమసూయత

సహదేవా చ్ఛతానీకం ద్రౌపదేయాః ప్రకీర్తితాః

 తేభ్యః పరే పాజ్ఞవేయా షడేవాన్యే మహారథాః

హైడి మ్బో భీమ సేనస్య పుత్రో జజ్జీ ఘటోత్కచః

 సుభద్రాయాం తథా పార్థా దభిమన్యు రజాయత

 యౌధేయం దేవకీ చైవ పుత్తం లేభే యుధిష్ఠిరాత్

 కాళ్యో జలధరా భీమా జట్లే వై సర్వగం సుతమ్

సుహోత్రం తనయం మాదీ సహదేవా తసూయత

క రేణుమత్యాం చైద్యాయాం నిరమితస్తు నాకులిః

అభిమన్యోః పరీక్షిత్తు పుత్రః పరపుర జ్ఞయః

 జనమేజయః పరీక్షితః పుత్రః పరమధార్మికః

 బ్రహ్మాణం కారయామాస మఖే వాజసనేయకమ్

 స వైశమాయనే వ శ క్తః కిల మహర్షిణా

న స్థాస్యతీహ దుర్బుద్దే తవైవ వచనం భువి

 యావ త్సౌస్యతి లో కే త్వం తావదేవ ప్రవత్స్యసి

 క్షస్య విజయం జ్ఞాత్వా తతః ప్రకృతి సర్వశ

అభిగమ్య స్థితా శ్చైవం నృపం చ జనమేజయమ్

 తతః ప్రభృతి శా పేన క్షత్రియస్య తు యాజినః

 క్ష త్తస్య యాజినః కేచి చ్చాపా త్తస్య మహాత్మనః

 పౌర్ణమా సేన హవిషా ఈజే తస్మి ప్రజాపతిమ్

 స వైశమ్పాయనేనైవ ప్రవిశ స్వారిత స్తతః

పరీక్షిత స్సుత సో వై పౌరవో జనమేజయః

ద్వి రశ్వమేధ మాహృత్య మహావాజసనేయకః

 ప్రవర్తయిత్వా తత్సర్వ మృషి ర్వాజసనేయకమ్

 వివాదే బ్రహ్మణా సార్ధ మభిశప్తో వనం యణా

జనమేజయా చ్చతానీక స్తస్మా జజ్ఞే సువీర్యవాక్

 తత స్తం వై శతానీకం పుత్తం రాజేభ్య షేచ యత్

 అథాశ్వమేధేన తత శ్శతానీకస్య వీర్యవాక్

జజ్ఞేధిసీమకృష్ణాఖ్య స్సామ్పతం యో మహాయశాః

 తస్మి శాసతి రాజ్యం తు యుష్మాభి రిద మాహృతమ్

 దుష్కరం దీర్ఘసత్రం వై త్రీణి వర్షాణి పుష్కరే

 వర్షద్వయం కురు క్షేత్ర దృషద్వత్యాం ద్విజోత్తమాః 

ధృతరాష్ట్రునకు గాంధారియందు దుర్యోధనాదులు నూరుగురును పాండునకు పృథ(కుంతి)యందు ధర్మ వాయు దేవేంద్రులవలన యుధిష్ఠిర భీమార్జునులు మాద్రియందు అశ్విదేవుల వలన నకులసహదేవులు కుమారులయిరి. ఈ ఐదు గురికి ద్రౌపదియందు వరుసగా ప్రతివింద్య శ్రుత సేన శతకీర్తి శ్రుతవర్మ శతానీకులు కలిగిరి. వీరుకాక ధర్మజునకు దేవకి అను నా మెయందు యాధేయుడు భీమునకు హిడింబయందు ఘటోత్కచుడు కాశీరాజ పుత్రియగు జలధరయందు సర్వగుడు అర్జునునకు సుభద్రయం దభిమన్యుడు నకులునకు చేదిరాజ పుత్తియగు క రేణుమతియందు నిర మిత్రుడు సహ దేవునకు మాది అను నామె యందు సుహోత్రుడు కుమారులయిరి. అభిమన్యునకు శత్రుధనవిజేతయగు పరీక్షిత్ అతనికి పరమ ధార్మికుడగు జనమేజయుడు కలిగిరి.

జనమేజయుడు ఒక యజ్ఞములో *వాజసనేయియగు బ్రాహ్మణుని బ్రహ్మగా వరించెను. అది చూచి సహించక వైశంపాయన మహర్షి జనమేజయుని నిట్లు శపించెను: “దుర్బుద్దీ! నీ మాట ఈ లోకమునందు (నీ దేశమునందే) చెల్లక పోవుగాక! నీవు ఈ లోకమున జీవించియుండగనే దేశము విడిచి ప్రవాసమునకు పోదువుగాక!” అని మరియు జనమే జయునకు యజ్ఞాధికారము లేదని అతనిని యజ్ఞములు చేయవలదని వైంశపాయనుడు వారించెను. ఈతనికి యాజులు (యజ్ఞములు చేయించినవారు) నశింతురనియు అతడు శపించెను. అయినను రాజిది లెక్క పెట్టలేదు. ఇందు క్షత్రియుడే గెలిచేనని కొందరు బ్రాహ్మణులు అతని నాశ్రయించి యుండిరి. కొందరు వైశంపాయన శాపమున నశించిరి. జనమే జయుడును పౌర్ణమౌ సేష్టితో ప్రజాపతిని (యజేశ్వరుని ఆరాధించేను. తరువాత నాతడు వాజసనేయక విధానముతోనే రెండుమారులు అశ్వమేధయాగము చేసెను. మహావాజసనేయు డనుకీర్తి పొందెను. కానీ వేంశపాయనుతోడి వాదమున అతనిచే అభిశప్తుడై బ్రహ్మగా తన యజ్ఞములందుండిన వాజసనేయ బ్రాహ్మణునితో కలిసి అడవులకు పోయేను. జనమే జయుని కుమారుడు శతానీకుడు. అతడు మహావీర్యవంతుడు. జనమేజయుడు అతనిని రాజ్యమునందభి షేకించెను. శతా నీకుడు చేసిన అశ్వమేధయాగ ఫలముగా అతనికి అధిసీమ కృష్ణుడను కుమారుడు కలిగెను. ఇప్పుడు అతడు పొలన సేయుచున్నాడు. అతని పాలన కాలములోనే మీరీ దుష్కరమగు దీర్ఘసత్రయాగము చేయుచున్నారు. ఇప్పటికిది మూడు సంవత్సరములు పుష్కర క్షేత్రమున జరిగినది. రెండేండ్లపాటు కురు క్షేత్రమున దృషద్వతీనదీ తీరమున జరిగినది. (ప్రస్తుతము నైమిశారణ్యమున జరుగుచున్నది.)

(*శుక్లయజుశ్శాఖీయులను వాజననేయులు అందురు)

భవిష్యద్రాజకథనమ్

ఋషయః : *భవిష్య బ్రోతు మిచ్ఛామో భవతో రోమహర్షణ

పురా కిల యదేతద్వై వ్యతీతం కీర్తితం త్వయా

 యేషు వై స్థాస్యతి క్షత్త్ర ముత్పత్స్య నే నృపాశ్చ యే

 తేషా మాయుః ప్రమాణంచ నామత శ్చైవ తా న్నృపాక్

 కాలం యుగప్రమాణం చ యుగ దోషా న్యుగక్షయమ్

 సుఖదుఃఖం యుగస్యాస్య ధర్మాధర్మ విచేష్టితమ్

 ఏతత్సర్వం ప్రసజ్ఞ్యాయ పృచ్ఛతాం బ్రూహీ నః ప్రభో

సూతః : యథా మే కీర్తితం పూర్వం వ్యా సే నాక్లిష్టకర్మణా

 భావ్యం కలియుగం చైవ తథా మన్వన్తరాణి చ

అనాగతాని సర్వాణి బ్రువతో మే నిబోధత

 అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి భావిన్ యే నృపా స్తథా

 ఇక్ష్వాకో రన్వయే చైవ పౌరవే చాన్వయే చ యే

 యేషు సంస్థాస్యతే తద్వద్య దక్ష్వాకుకులం స్మృతమ్

తా నర్వా స్కీర్తయిష్యామి భవి ష్యే కథితా నృపాన్

తేభ్యో పరే యేఒప్యన్యే చ ఉత్పత్స్య నే నృపాః పునః

క్షత్రియాః పౌరవా శూద్ర స్తథాన్యే తు బహిశ్చరాః

ఆఫ్ఘాః పౌఢాః కశిజ్ఞాశ్చ చూళికా యవనా స్తథా

క్రైవర్తాభీరశబరా యేచాన్యే మ్లేచ్ఛజాతయః

 పర్యాయతః ప్రవక్ష్యామి నామత శ్చైవ తా న్నృపాః

అధిసీమకృష్ణో యశ్చైషాం ప్రథమం వర్తతే నృపః

తస్యాన్వవాయే వక్ష్యామి భవిష్యా న్కథితా న్నృపాక్

 అధిసీమకృష్ణపుత్తస్తు విచక్షు ర్భవితా(నృచకో భవితా) నృపః

గబ్ధయాతు హృతే తస్మి న్న గరే నాగసాహ్వయే

*త్యక్త్వా విచక్షు ర్నగరం కౌసుశా)మ్బ్యాం తు నివత్స్యతి

భూరి శ్రేష్ట స్సుత స్తస్య తత శ్చిత్రరథ స్మృతః

భవిష్యాహ్లి సుతో స్తస్య మహాబలపరాక్రమాః

 శుచిద్రథ శ్చి, తరథా దృష్టిమాంశ్చ శుచిద్రథాత్

 వృష్టిమత స్సు షేణశ్చ భవిష్యత్ పున ర్నృపః

 తస్మా త్సు షేణా ద్బవితా సునీథొ నామ పార్థివః

నృపా త్సునీథా ద్బవితా నృచక్షు(నృచక్రస్సు) స్సుమహాయశాః

 నృచక్షుషస్తు దాయాదో భవితా వై సుఖీలవః

సుఖీలవసుత శ్చాపి భావీ రాజా పరిష్ణవః

 పరిప్లవసుతశ్చాపి భవితా సుతపా నృపః

 మేధావీ తస్య దాయాదో భవిష్యతి నృపస్య తు

మేధావిన సుత శ్చాపి భవిష్యతి పురజ్జుయః

కురుభావ్య స్సుత స్తస్య నిర్మమ స్తస్య చాత్మజః

బృహద్రథో నిర్మమాద్వై వసుధా మో బృహద్రథాత్

వసుధామా చ్చతానీకో భవిష్యోదయన స్తత

భవిష్యోదయనా ద్వీరో రాజా భావీ మహీనరః

మహీనరాత్మజ శ్చైవ దణపాణి ర్భవిష్యతి

దళ్లపాణే ర్నిరామితో నిరామితాత్తు క్షేమకః

 అస్యానువంశ శ్లోకోయం గీతో వివైః పురాతనై

బ్రహ్మక్షత్తస్య యా యోని ర్వంతో దేవర్షి సత్కృతః

క్షేమకం ప్రాప్య రాజానం సంస్థాస్యతి స వై కలౌ

 ఇత్యేష పౌర వో వంశో యథావ దేహ కీర్తితః

 ధీమతః పాణ్డుపుత్తస్య అర్జునస్య మహాత్మనః 

ఇతి శ్రీమత్స్యమహాపురాణే చంద్రదవంశానువర్ణ నే పూరువం శానుకీర్తనంనామ పఞ్చాశోధ్యాయః

 చంద్రవంశ స్సమాప్తః

(*భవిష్యంశ్రోతుమిచ్చామః ప్రజానాం)  

(*నృచకో నగరం త్యక్త్యా)

ఇది విని ఋషులు సూతునిట్లడిగిరి: “రోమహరణా! నీవు ఇంతవరకును గడచిన వృత్తాంతములు చెప్పితివి. ఇక మీదట భవిష్యద్వృత్తాంతములను నీనుండి వినగోరుచున్నాము. ఇక మీదట క్షత ధర్మము ఎవరియందు నిలుచును? కాబోవు రాజులేవ్వరు? వారి ఆయుఃప్రమాణము వారి పేరులు కాలము - యుగ ప్రమాణము యుగ దోషములు యుగ క్షయము యుగములందలి సుఖదుఃఖ ధర్మాధర్మములు విచేష్టితములు ఇవి అన్ని యు మాకు చెప్పవేడుచున్నాము.”

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను: అద్బుతములను చేయగల మహానుభావుడు వ్యాసుడు. నాకు చెప్పియున్న విధమున ఇక రాబోవుచున్న కలియుగమును మన్వంతరములను రానున్న విషయములను తెలిపేదను. ఇక్ష్వాకు పూరు వంశములందు రాబోవు రాజులను వీరుకాక ఆంధ్ర పౌండ్ర కళింగ *చూళిక యవన కైవర్తాభీర శబరులు ఇతర మ్లేచ్చ జాతుల రోజులు ఈ మొదలగు శూద్ర జాతీయులు భారతదేశ మునకు బయటినుండి వచ్చి ఈ దేశమును ఏలనున్న రాజులను క్రమమున పేర్కొందును. వినుడు.

ఇపుడు (ఈ పురాణ కథా కాలమున) పాలించుచున్న అధిసీమ కృష్ణునకు విచక్షుడు కుమారుడయి పొలన చేయును. అతని కాలమున హస్తినాపురము గంగలో కొట్టుకొనిపోగా అతడు కౌసుం (శాం) బిని రాజధానిగా చేసి కొనును. అతనికి భూరి శ్రేష్టుడు అతనికి చిత్రరథుడు. అతని ఎనిమిదిమంది కుమారులలో శుచిద్రథునకు వృష్టిమాన్ అతనికి సుషేణుడు అతనికి సునీథుడు అతనికి నృచముడు అతనికి సుఖీ లవుడు అతనికి పరిష్ణవుడు అతనికి సుతపుడు అతనికి , మేధావి అతనికి పురంజయుడు అతనికి కురుభావ్యుడు అతనికి నిర్మముడు అతనికి బృహద్రథుడు అతనికి వసుధాముడు అతనికి శతానీకుడు ఆతనికి భవిష్యోదయనుడు అతనికి మహీనరుడు అతనికి దండపాణి అతనికి నిరామిత్రుడు అతనికి క్షేమకుడు కుమారులగుదురు.

ఈ క్షేమకుని విషయమున పురాతనులు పలికిన గీతము ఇట్లున్న ది: “దేవతలును ఋషులును సత్కరించు చుండిన బ్రహ్మక్షత్ర జాతుల బ్రాహ్మణులక్షత్రియుల.(బ్రాహ్మణ ధర్మమును అనుసరించి ప్రవర్తించి దానినుద్ధరించు , క్షత్రియులక్షత్ర ధర్మమును పాటించు బ్రాహ్మణుల) ఏయోని (జన్మము) ఏవంశము ( ఈ భారతదేశ మున) కలదో అదియంతయు ఈ కలియుగమున క్షేమక రాజును ఆశ్రయించి వర్దిల్లును.”

ఋషులారా! మీకు ఇట్లు ఈ పౌరవవంశ చరితమును ఉన్నది ఉన్నట్లు వివరించితిని. దీనిలో ప్రధానుడు గాను ఈ చెప్పిన వంశమునకు ఒక మూల పురుషుడుగాను నున్న మహాత్ముడు అర్జునుడు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున పౌరవవంశానుకీ ర్తన మను ఏబదియవ అధ్యాయము-చంద్రవంశ కథనము ముగిసినది.

(*చూశికులు- పఠానులలో ఒక తెగవారు; యవనులు-గ్రీసు టర్కీ మొదలగు దేశములగు; కైవర్తులు-పల్లెకారులు;అభీరాః-అహీర్ అనబడు జాతివారు; శబరాః- చెంచుబోయ మొదలగు జాతులవారు)