71 - అశూన్యశయన వ్రతము

బ్రహ్మా: భగవ న్పురుష స్యేహ స్త్రీయాశ్చ విరహాదికమ్!

రోగవ్యాధిభయం దుఃఖం న భ వే ద్యేన తద్వద॥

ఈశ్వర: శ్రావణస్య ద్వితీయాయాం శుక్లాయాం మధుసూదనః ।

క్షీరార్ణ వే సలక్ష్మీక స్సదా వసతి కేశవః॥

తస్యాం సమ్పూజ్య గోవిన్దం సర్వా నామా న్త్సమశ్నుతే ।

గోభూహిరణ్యదానాని సప్తకల్పశతాయుతమ్॥

అశూన్యశయనం నామ ద్వితీయా సా ప్రకీర్తితా ।

తస్యాం సమ్పూజయే ద్విష్ణు మేభి ర్మన్త్రై ర్విధానతః॥

శ్రీవత్సధారి శ్రీకాన్త శ్రీవాస శ్రీపతేఽవ్యయ ।

గార్హస్థ్యం మా ప్రణాళం మే యాతు ధర్మార్థకామద॥

ఆగ్న యో మా ప్రణశ్యత్తు దేవతాః పురుషో త్తమ ।

పితరో మా ప్రణశ్యన్తు మాఽస్తు దామత్యభోదనమ్॥

లక్ష్మ్యా వియుజ్య సే దేవ న కదాచి ద్యథా భవాక్ ।

తథా కళత్రసమ్భన్దో దేవ మామే వియుజ్యతామ్॥

లక్ష్మ్యా న శూన్యం వరద యథా తే శయనం సదా ।

శయ్యా మమాప్యశూన్యాతు (సు) తథైవ మధుసూదన॥

గీతవాదిత్రనిర్ఘోషం దేవదేవస్య కారయేత్ ।

ఘణ్టా భవే దశ క్తస్య సర్వవాద్యమయీ యతః॥

బ్రహ్మ ఈశ్వరుతో నిట్లనెను. భగవన్! స్త్రీ పురుషులకు విరహ-వ్యాధి- రోగ భయ దుఃఖములు కలుగకుండు ఉపాయమును తెలుపు మనగా ఈశ్వరుడిట్లు చెప్పెను: నారాయణుడు లక్ష్మీ సమేతముగా క్షీరసాగరమున నిరంతరము వసించు చుండునుగదా! ఆయనను శ్రావణ శుక్ల ద్వితీయ నాడు అర్చించినచో అన్ని కోరికలును నెర వేరును. ఆశూన్యశయన ద్వితీయ అనబడు ఈనాడు గోవిందుని కల్పోక్త విధానముతో సంపూజించి గోభూహిరణ్య దానములు చేసినవారు డెబ్బది. వేల కల్పముల కాలము సుఖింతురు.

ప్రార్థనామంత్రము: శ్రీవత్సధారిన్! శ్రీకాంతా! శ్రీవాసా! అవ్యయా! శ్రీపతీ! ధర్మార్థ కామప్రదా! నాగారస్యము హాని చెందకుండుగాక! మా దాంపత్యము భుగము నొందకుండుగాక! మా అగ్నులు దేవతలు పితృదేవతలు పితరులు హాని నొందకుందురు గాక ! మధుసూదనా! నీకు వలెనే నాకును కళత్రముతో నిత్యసంబంధ ముండుగాక! నీ శయన మెల్ల ప్పుడు అశూన్యమయి యుండునటే నో శయనముకూడ ఆశూన్యమై యుండుగాక! పూజా సమయమున గీతవాద్యముల విని పించవలెను. ఇందులకు శక్తి లేనివారు ఘంటానాదమే చేయవచ్చును. ఏలయన ఘంట సర్వ వాద్యరూపమయినది.

ఏవం సమ్పూజ్య గోవిన్ద మ శ్నీయా త్తైలవర్జితమ్ ।

నక్త మక్షార లవణం యావ ద్యామచతుష్టయమ్॥

తతః ప్రభాతే సంజాతే లక్ష్మీపతిసమన్వితామ్ ।

దీపాన్న భోజనై ర్యుక్తాం శయ్యాం దద్యా ద్విలక్షణామ్॥

పాదుకోపానహచ్ఛత్ర చామరాసనసంయుతామ్ ।

అభీష్టోపస్కరై ర్యుక్తాం శుక్లమాల్యానులేపనామ్॥

సోపధానక విశ్రామం ఫలైర్నానావిధై ర్యుతామ్ ।

తథాభరణగన్దైశ్చ యథాశక్త్యా సమన్వితామ్॥

అవ్య జ్గాజ్గాయ విప్రాయ శ్రోత్రియాయ కుటుమ్బినే ।

దాతవ్యా వేద విదు షే(భావేనాఽపతితాయచ) సర్వక్రతుకృతే క్వచిత్॥

తత్రోపవేశ్య దామ్పత్య మల జ్కృత్య విధానతః ।

పత్న్యాస్తు భాజనం దద్యా ద్భక్ష్యభోజ్యసమన్వితమ్॥

బ్రాహ్మణస్యాపి సౌవర్ణీ ముపసరసమన్వితామ్ ।

ప్రతిమాం దేవదేవస్య ప్రదద్యా ద్దక్షిణాన్వితామ్॥

ఏవం యస్తు పుమా న్కుర్యా దశూన్యశయనం హరేః ।

విత్తశా ఠ్యేన రహితో నారాయణపరాయణః॥

న తస్య పత్న్యా విరహః కదాచిదపి జాయతే ।

నారీ వాఽవిధవా బ్రహ్మ న్యావ చ్చ న్ద్రార్కతారకమ్॥

న విరూపం న శోకా ర్తం దామ్పత్యం జాయతే క్వచిత్ ।

న పు త్త్రపశురత్నా ని క్షయం యా నీ పితామహ॥

సప్తకల్పసహస్రాణి సప్తకల్పశతానిచ ।

కుర్వ న్న శూన్యశయనం విష్ణులో కే మహీయతే॥

ఇతి శ్రీ మత్స్యమహాపురాణే అశూన్యశ యనద్వితీయావ్రతకథనం నౌ మైకసప్తతితమోఽధ్యాయః॥

ఇట్లు గోవిందుని పూజించి పగలు ఉపవసించి ఆ రాత్రి (న కం) తైలము- ఉప్పు-పులుపు)-కారము లేని ఆహా రము తిని ఆ రాత్రి గడుపవలెను. తెల్లవారిన తరువాత కుటుంబియు వేదపండితుడును శోత్రియుడును సర్వ క్రతు కర్తయు ఎక్కడను ఏ లోపములేనివాడును ఆంగ వైకల్యము లేనివాడును ఆగు విప్రునకు లక్ష్మీ నారాయణ ప్రతిమను దీపములను అన్నపు పాత్రములను మంచమును పరపులను దిండ్లను ఆనుకొను దిండ్లను పాదుకలను చెప్పులను గొడుగు లను చామరములను ఆసనములను ఇంకను ఇష్టములగు సాధన సామగ్రులను తెల్లని గంధపు పూత సామగ్రులను పూల దండల)ను దానము చేయవలయును. ఆ బ్రాహ్మణుని అతని పత్ని ని మంచము పై కూర్చుండ పెట్టి శాస్తోక్త విధాన మున అలంకరించి పత్ని కి భక్ష్య భోజ్య సమన్విత పాత్రను పతికి సర్వసామగ్రీ యుక్తమగు లక్ష్మీ నారాయణుల బంగారు ప్రతిమను చేతితీయవలెను.

ధనమునకై లోభించక యథాశ కిగా కల్ప విధానముగా నారాయణుడే దిక్కనీ ఈ ఆశూన్య శయనవతము చేయువారు దాంపత్యమున వియోగము లేకుండ ఆచంద్రతారార్కము పై రూప్యము శోకము లేక సుఖింతురు. వారికి పడుపు త ధన నాశ మును కలుగదు. ఏడువేల ఏడువందల కల్పములపాటు వారు విష్ణులోకమున సుఖింతురు.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున అశూన్య శయన వ్రత మను డెబ్బది ఒకటవ అధ్యాయము భావేనాపతీతాయచమ.