మత్స్య మహా పురాణము
180 - నందీశ్వరుడు సనత్కుమారునకు అవిముక్త మాహాత్మ్యము తెలుపుట॥
సూతః : అథ పుణ్యోద్భవాం స్నిగ్ధాం కథాం పాపప్రణాశ నీమ్ ।
శృణ్వంతు మునయ స్సర్వే శుచి శ్రద్ధాసమాహితాః॥
గణేశ్వరపతిం దివ్యం రుద్రతుల్యపరాక్రమమ్ ।
సనత్కుమారో భగవా నపృచ్చ న్న న్దీకేశ్వరమ్॥
సనత్కుమారః : బ్రూహి గుహ్యం యథాత త్వం యత్ర నిత్యం భవ స్థితః ।
మాహాత్మ్యం సర్వభూతానాం పరమాత్మా మహేశ్వరః॥
ఘోర రూపం సమాస్థాయ దుష్కరం దేవదానవై ।
ఆభూతసంప్లవం యావ త్థ్సాణుభూతో మహేశ్వరః॥
నన్ది కేశ్వరః : పురా దేవేన యత్ప్రోక్తం పురాణం పుణ్యము త్తమమ్ ।
తత్సర్వంచ ప్రవక్ష్యామి నమస్కృత్య మహేశ్వరమ్॥
యతో దేవేన తుష్టేన ఉమాయాః ప్రియకామ్యయా ।
కథితం భువి విఖ్యాతం యత్ర నిత్యం భవ స్థితః॥
రుద్రస్యార్ధాసనగతా మేరుశృజ్గే యశస్వినీ ।
మహాదేవం తతో దేవీ ప్రణతా పరిపృచ్ఛతి॥
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పేను: సర్వ మునులారా! శుచియగు శ్రద్ధతో సమాహిత మనస్కులయి పావనాశ కమును పుణ్య సంపాదకమును ప్రీతికరమును నగు కథ వినుడు॥ భగవానుడగు సనత్కుమారుడు గణేశ్వరుల కును అధిపతియు రుద్ర సమాన పరాక్రముడును దేవుడు నగు నంది కేశ్వరుని ఇట్లు ప్రశ్నించెను: సర్వభూతములకు అంతర్యామియు లోక కారణుడును అగు మ హేశ్వరుడు దేవదానవులకును ధరించ సాధ్యము కాని ఘోర రూపము ధరించి స్థాణు(స్థిర కూటస్థ రూపుడయి సర్వభూత ప్రళయకాలము వరకును ఎచట నిరంతరము వసించునో ఆ స్థానపు రహస్య మగు మాహాత్మ్యమును తెలుపుము॥ అన నంది కేశ్వరు డిట్లనెను: పూర్వము మహాదేవుడే చెప్పినదియు ప్రాచీనమును పుణ్య కరమును నగు ఆ విషయమంతయు మహేశ్వరుని నమస్కరించి చెప్పుదును॥ ఏలయన ఉమ విషయమున తుష్టుడే శివుడు ఆ మేకు ప్రీతి కలిగించగోరి భవుడు నిత్యమును ఉండు విఖ్యాత స్థానపు మాహాత్మ్యమును తానే చెప్పియుండెను॥ పూర్వము మేరుపర్వత శృంగమున రుద్రుని అర్ధాసనమందుండి కీర్తిశాలిని యగు దేవి మహాదేవుని నమస్కరించి ఇట్లడిగెను॥
దేవీ : భగవన్దేవదేవేశ చన్ద్రార్ధకృత శేఖర ।
ధర్మం ప్రబ్రూహి మర్త్యానాం భువి చై వోర్ధ్వరేతసామ్॥
ఇష్టం దత్తం హుతం జప్తం తవ స్త ప్తం కృతంచ యత్ ।
ధ్యానాధ్యయనసమ్పన్నం కథం భవతి చాక్షయమ్॥
జన్మాన్తర సహస్రేణ యత్సాహం పూర్వస్చతమ్ ।
కథం తత్క్షయమాయాతి తన్మమాచక్ష్వ శఙ్కర॥
యస్మిన్న వస్థితో భక్త్యా తుష్య సే పర మేశ్వర ।
వ్రతాని నియమాశ్చైవ మాచారో ధర్మ ఏవచ॥
సర్వసిద్ధికరం యత్ర హ్యక్షయ్యగతిదాయకమ్ ।
వక్తుమర్హసి తత్సర్వం పరం కౌతూహలం హి మే॥
దేవదేవః: శృణు దేవి ప్రవక్ష్యామి గుహ్యానాం గుహ్యముత్తమమ్ ।
సర్వ క్షేత్రేషు విఖ్యాత మవిముక్తం ప్రియం మమ॥
అష్టషష్టిపురాప్రోక్త స్థానానాం స్థాన ముత్తమమ్ ।
యత్ర సాక్షాత్స్వయం రుద్రః కృత్తివాసా స్వయం స్థితః॥
తత్ర సన్ని హితో నిత్య మవిముక్తే నిరన్తరమ్ ।
త త్క్షే న మయా ముక్త మవిముక్తం తత స్మృతమ్॥
అవిముక్తే పరా సిద్ధిరవిముక్తే పరా గతిః ।
ఇష్టం దత్తం హుతం జప్తం తప స్తప్తం కృతంచ యత్॥
ధ్యానమధ్యయనం దానం సర్వం భవతి చాక్షయమ్ ।
జన్మాన్తర సహస్రేణ యత్పాపం పూర్వసఞ్చితమ్॥
అవిముక్తే ప్రవిష్టస్య తత్సర్వం వ్రజతి క్షయమ్ ।
అవిముక్తాగ్ని నా దగ్ధ మగ్నౌ తూలమివాహితమ్॥
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రావై వర్ణసజ్కరాః ।
స్త్రియో మ్లే చ్చాశ్చ యే చాన్యే సజ్కీర్ణాః పాపయోనయః॥
కీటా: పిపీలికా శ్చైవ యేచాన్యే మృగపక్షిణః ।
కాలేన నిధనం ప్రాప్తా హ్యవిముక్తే శృణుష్వ మే॥
భగవన్! దేవదేవేశా: చంద్రార్ధమౌళీ! బ్రహ్మచర్యమున ఊర్ధ్వరేతస్కులగు మానవు లాచరింపదగు ధర్మమును యజ్ఞదాన హవన జపతపః ప్రభృతి కర్మానుష్ఠానములును ధ్యానాధ్యయనములును ఎట్లు అక్షయమగును? వేయి జన్మాంత రములందు సంచితమగు పాపమయినను నశించు ఉపాయ మేమి? శంకరా! నాకు తెలుపుము; ఏ స్థానమందుండినచో నీవు ఆభక్తుల భక్తికి తుష్టుడ వగుదువు? వ్రతములు నియమములు ఆచారము ధర్మము ఎచట నాచరించినచో సర్వసిద్ధికరమయి॥ అక్షయ పుణ్యగతి నిచ్చును? అది యంతయు తెలుప వేడుచున్నాను॥ నా కది విన పరమకుతూహలముగ నున్నది॥ అన దేవదేవు డిట్లనెను; దేవీ! చెప్పెద వినుము; అది రహస్యములలో ఉత్తమ రహస్యము; సర్వక్షేత్రములందును విఖ్యాతమగు 'అవిము క్తము' 'వారాణసి' నాకు ప్రియము; పూర్వులు చెప్పిన ఆరువది ఎనిమిది పుణ్యస్థానములలో ఇది ఉత్తమము; ఇచ్చట గజచర్మధారియగు రుద్రుడు తానై సాక్షాత్తుగ ఉండును॥ ఈ ఆవిము క్తమం దతడు నిరంతరము సన్నిహితుడు; ఈ క్షేత్రము నాచే ఆవిముక్తము (విడువబడనిది) కావున దీని కీ నామ మేర్పడినది; ఇది పరమసిద్ధిని పరమగ తిని ఇచ్చును; ఇచట అనుష్టించిన యజ్ఞ దానహవన జపతపో ధ్యానాధ్యయనములు అన్ని యు అక్షయ పుణ్యప్రదము లగును; దీనిని ప్రవేశించినంతనే జన్మాంతర సహస్ర సంచితమగు పావమును నశించును; ఆవిముక్త క్షేత్రాగ్నితో ఆవి నిప్పులో వేసిన దూదివలె బూది యగును॥ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును సంకీర్ణ జాతులవారును స్త్రీలును బ్లేచ్చులును వేరగు సంకరజాతివారును పాపజన్ములును కీటపిపీలికా మృగపక్షులును తమ కాలము వచ్చి ఇందు మరణించి ఏమగుదురో తేలిపెద వినుము॥
చన్ద్రార్ధమౌళినస్సర్వే లలాటాక్షా వృషధ్వజాః ।
శివే మమ పురే దేవి జాయన్తే తత్ర మానవాః॥
అకా మో వా సకా మోవా తిర్యగ్యోనిగతోఽపి వా ।
ఆవిముక్తే త్యజే త్ప్రాణా న్మమ లో కే మహీయతే॥
అవిముక్తం యదా గచ్చే త్కదాచి త్కాలపర్యయాత్ ।
అశ్మనా చరణౌ బధ్వా తత్రై వ నిధనం వ్రజేత్॥
అవిముక్తం తతో దేవి న నిర్గచ్చేత్తతః పునః ।
సోపి మత్పద మాప్నోతి నాత్ర కార్యా విచారణా॥
వస్త్ర ప్రదం రుద్రకోటిం సిద్దేశ్వర మహాలయమ్ ।
గోకర్ణం భద్రకర్ణంచ సువర్ణాక్షం తథైవచ॥
అమరంచ మహాకాలం తథా కాయావరోహణమ్ ।
ఏతాని హి పవిత్రాణి సాన్నిధ్యాత్ సంధ్యయోర్ద్వయోః॥
కాలజ్ఞరవనం చైవ శజ్కుకర్ణస్థలేశ్వరమ్ ।
ఏతానిచ పవిత్రాణి సాన్ని ధ్యాధి మమ ప్రియే॥
అవిముక్తే వరారో హే త్రిసన్ద్యం నాత్ర సంశయః ।
హరిశ్చన్ద్రం పరం గుహ్యం గుహ్య మామ్రాత కేశ్వరమ్॥
జలేశ్వరం పరం గుహ్యంగుహ్యం శ్రీపర్వతం తథా।
మహాలయం పరం గుహ్యం యమం చణ్డేశ్వరం తథా॥
గుహ్యాతి గుహ్యం కేదారం మహాభైరవ మేవచ ।
అష్టా వేతాని స్థానాని సాన్నిధ్యాద్ది మమప్రియే॥
అవిముక్తే వరారో హే త్రిసన్ద్యం నాత్ర సంశయః ।
యాని స్థానాని శ్రూయన్తే త్రిషు లోకేషు సువ్రతే॥
అవిము క్రే పరా సిద్ధిర విము కే పరా గతిః ।
ఇష్టం దత్తం హుతం జప్తం తవ స్త ప్తం కృతంచ యత్॥
ధ్యానమధ్యయనం దానం సర్వం భవతి చాషియమ్ ।
జన్మా నర సహ సేణ యతాపం పూర్వస్చతమ్॥
అవిముక్తి ప్రవిష్టస్య తత్సర్వం వ్రజతి క్షయమ్ ।
అవిముక్తాగ్ని నా దగ్గ మగ్నౌ తూలమి వాహితమ్॥
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రావై వర్ణసజ్కరాః ।
స్త్రీయే ప్లేచ్ఛాశ్చ యే చాన్యే సజీర్ణాః పాపయోనయః॥
కీటాః పిపీలికా శ్చైవ యేచాన్యే మృగపక్షిణః ।
కాలేన నిధనం ప్రాప్తి హ్యవిము కే శృణుష్వ మే॥
భగవన్! దేవదేవేశా: చంద్రార్ధమౌళీ! బ్రహ్మచర్యమున ఊర్ధ్వరేతస్కులగు మానవు లాచరింపదగు ధర్మమును యజ్ఞదాన హవన జపతపః ప్రకృతి కర్మానుష్టానములును ధ్యానాధ్యయనములును ఎట్లు అక్షయమగును? వేయి జన్మాంత రములందు సంచిత మగు పాపమయి నను నశించు ఉపాయ మేమి? శంకరా! నాకు తెలుపుము; ఏ స్థానమందుండినచో నీవు ఆభక్తుల భ క్తికి తుష్టుడవగుదువు? వ్రతములు నియమములు ఆచార ము ధర్మము ఎచట నాచరించినచో సర్వసిద్ధికరమయి॥ అక్షయ పుణ్యగతి నీచ్చును? ఆది యంతయు తెలుప వేడుచున్నాను॥ నా కది విన పర మకుతూహలముగ నున్నది॥ ఆన దేవదేవు డిట్లనెను: దేవీ! చెప్పెద వినుము; ఆది రహన్యములలో ఉత్తమ రహస్య ము; నర్వ క్షేత్రములందును విఖ్యాత మగు ‘ఆవిముక్తము' 'వారాణసి' నాకు ప్రియము; పూర్వులు చెప్పిన ఆరువది ఎనిమిది పుణ్యస్థానములలో ఇది ఉత్తమము; ఇచ్చట గజచర్మధారియగు రుద్రుడు తానై సాక్షాత్తుగ ఉండును॥ ఈ ఆవిము క్రమం దతడు నిరంతరము సన్నిహితుడు; ఈ క్షేత్రము నాచే ఆవిముక్తము (విడువబడనిది) కావున దీని కీ నామ మేర్పడినది; ఇది పరమసిద్ధిని పర మగతిని ఇచ్చును; ఇచట ఆనుష్టించిన యజ్ఞ దానహవన జపతపో ధ్యానాధ్యయనములు అన్నియు ఆక్షయ పుణ్యప్రదము లగును; దీనిని ప్రవేశించినంతనే జన్మాంతర సహస్ర సంచితమగు పాపమును నశించును; ఆవిముక్త క్షేత్రాగ్నితో ఆవి నిప్పులో వేసిన దూదివలే బూది యగును॥ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును సంకీర్ణ జాతులవారును స్త్రీలును మ్లేచ్చులును వేరగు సంకరజాతివారును పాప జన్ములును కీటపిపీలికా మృగపక్షులును తమ కాలము వచ్చి ఇందు మరణించి ఏమగుదురో తెలి పేద వినుము॥
చన్దార్ధమౌళినస్సర్వే లలాటాక్ష వృషధ్వజాః ।
శివే మమ పురే దేవి జాయ నే తత్ర మానవాః॥
ఆకామో వా సకామో వా తిర్యగోనిగతోపి వా ।
ఆవిము కే త్యజే ల్ఫైణా న్మమ లో కే మహీయతే॥
అవిముక్తం యదా గచ్ఛే తదాచి త్కాలపర్యయాత్ ।
అశ్మనా చరణా బద్ధ్వా తత్రోవ నిధనం వ్రజేత్॥
అవిముక్తం తతో దేవి న నిర్గచ్చేత్తతః పునః ।
సోపి మత్పద మాప్నోతి నాత్ర కార్యా విచారణా॥
వస్త్ర ప్రదం రుద్రకోటిం సిద్దేశ్వర మహాలయమ్ ।
గోకర్ణం భద్రకర్ణంచ సువర్ణాక్షం తథై వచ॥
ఆమరంచ మహాకాలం తథా కాయావరోహణమ్ ।
ఏతాని హి పవిత్రాణి సాన్నిధ్యాత్ సంధ్యయోర్వయోః॥
కాలజ్జురవనం చైవ శక్కుకర్ణస్థలేశ్వరమ్ ।
ఏతానిచ పవిత్రాణి సాన్ని ధ్యాద్ధి మమ ప్రియే॥
అవిము కే వరారో హే త్రిసన్ధ్యం నాత్ర సంశయః ।
హరిశ్చన్దం పరం గుహ్యం గుహ్య మామ్రాత కేశ్వరమ్॥
జలేశ్వరం పరం గుహ్యంగుహ్యం శ్రీపర్వతం తథా ।
మహాలయం పరం గుహ్యం యమం చణేశ్వరం తథా॥
గుహ్యాతి గుహ్యం కేదారం మహాభైరవ మేవచ ।
అష్టా వేలాని స్థానాని సాన్ని ధ్యాద్ది మమ ప్రియే॥
అవిము కే వరారో హే త్రిసన్యం నాత్ర సంశయః ।
యాని స్థానాని శ్రూయ నే త్రిషు లో కేషు సువతే॥
ఆవిముక్తస్య పాదేషు నిత్యం సన్ని హితాని వై ।
అథోత్తరాం కథాం దివ్యా మవిముక్తస్య శోభనే॥
సనో వశ్యతి మాహాత్మ్యం యదుక్త మీశ్వరేణ తు ।
ఋషీణాం భావితాత్మనాం త చ్ఛృణుష్వ నరేశ్వర॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే నన్దకేశ్వర సనత్కుమార సంవాదే అవి
ముక్తమాహాత్మ్యే ఆశీత్యుత్తరశతత మోధ్యాయః॥
అందరును చంద్రార్గ శిర స్కులు లలాట నేత్రులు వృషభ ధ్వజులు అయి శుభకరమగు నా పురమునందు జనింతురు; నిష్కాములుగాని సకాములు గాని (తెలిసికొని తెలియక కాని) మానవులే కాక తిర్యక్ (పశుపక్ష్యాది) ప్రాణులును ఆవిము క్షమున మరణించినచో నా లోకమున పూజితులై సుఖింతురు॥ అవిముక్త మేత మేగినవారు అచటినుండి బయటికి రాక కాళ్లకు రాలు కట్టుకొనియైన కదలకుండి తమ కాలము రాగా మరణించినచో వారును నా స్థాన మందుదురు; అందు సందియము లేదు॥ వస్త్రప్రదము- రుద్రకోటి- సిద్దేశ్వరము- మహాలయము - గోకర్ణము -భద్రకర్ణము – సువరాక్షము- ఆమరము- మహాకాలము- కాయావరోహణము- ఈ క్షేత్రములందు ప్రాతః సాయంసంధ్యలందు నాసాన్ని ధ్వముండును; కావున ఆవి పవిత్రములు; కాలంజరవనము శంకు కర్ణము స్థలేశ్వరము॥ ఇవియు; వరారోహా! (చరమసుందరీ!) పరమ గుహ్యముల గు హరిశ్చంద్రము ఆమాత కేశ్వరము ఇవియు జలేశ్వరము శ్రీపర్వతము మహాలయము యమము చండేశ్వరము గుహ్యాతిగుహ్యములగు కేదార మహాభైరవములు అవిము క్తము ఈ ఎనిమిదియు త్రిసంధ్యములందును నా నన్నిధిచే పవిత్రములు; త్రిలోక ప్రసిద్ధములగు స్థానములన్నియు అవిముక్త క్షేత్ర పాదములందు నిత్యమును సన్నిధానము చేసియుండును; ఈశ్వర పో9 క్రమేయగు ఆవిముక్త క్షేత్రపు అనంతర కథా వృత్తాంతమును దాని మాహాత్మ్యమును స్కందుడు భావితాత్ములగు ఋషులకు చెప్పినదానిని చెప్పెదను-మనురాజా: వినుము॥ అనీ మత్యుడు చెప్పినని సూతుడు ఋషులతో చెప్పెను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున నందికేశ్వర సనత్కుమార సంవాద రూపమగు ఆవిముక్త క్షేత్ర మాహాత్మ్యమను నూట ఎనుబదవ అధ్యాయము॥
Summary of chapter 180 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya concludes the war narrative by describing the restoration of peace across the three worlds. Devarāja Indra and the Devas were reinstated in Svarga, sages resumed Vedic fire sacrifices without fear, and the earth flourished with abundant rain and crops. The Devas, Led by Bhagavān Brahmā and Bhagavān Vishṇu, gathered on Mount Kailāsa to offer glorious hymns of praise to Mahādeva, celebrating His supreme grace in preserving Dharma.