37 - యయాతి స్వర్గభ్రంశము - యయాత్యష్టక సంవాదము

ఇంద్రః : సర్వాణి కర్మాణి సమాప్య రాజ శృహా న్పరిత్యజ్య వనం గతోఽసి

పృచ్ఛామి త త్వాం నహుషస్య పుత్త

 కోఽన్య స్తుల్య స్తపనో తే యయాతే

 యయాతిః : నాహం దేవమను ష్యేషు న గనర్వమహర్షిమ

ఆత్మన స్తపసా తుల్యం క ఇ తృశ్యామి వాసవ

 ఇంద్రః : యదావమంస్థాః సదృశ శేయసశ్చ పాపీయస శ్చావిదితప్రభావః

తస్మా కా హ్య నవ న్త స్తవేమే క్షీణే పుణ్యే పతితో స్యద్య రాజన్

 యయాతిః : సురర్షి గన్జర్వనరావమానా త్తయం గతా మే యది శక్ర లోకాః

ఇచ్చేయం త త్సుర లో కా ద్విహీన స్సతాం మధ్యే పతితుం దేవరాజ

 ఇంద్రః : సతాం సకా శే పతితో సి రాజం శ్చ్యుతః ప్రతిష్ఠాం యత్ర లబ్ధి సి

భూయః

ఏవం విదిత్వా తు పునర్య యాతే న తే వమాన్యా సదృశా శేయసశ్చ

 శౌనకః : తతః ప్రహాయామరరాజజుష్టా త్పుణ్యా ల్లోకా తాత్యమానం

యయాతిమ్

సమేక్య రాజర్షవరోఅష్టక స్త మువాచ వై ధర్మనిదాన గోప్తా

 అష్టకః : క సం యువా వాసవతుల్యరూప స్వతేజసా దీప్యమాన్ యథా గ్నిః

పత స్యు దీర్థామ్బుధరాగ్ధకారా లౌళైచరాణాం ప్రవరో యథాఽర్కః

 దృష్ట్వా చ త్వాం స్వర్గపథా త్పతనం వైశ్వానరారద్యుతి మప్రమేయమ్

 కిన్ను స్వి దేత త్పతతీతి సర్వే వితర్కయ నః పరిమోహితా స్స్మ

 దృష్ట్వాచ త్వాధిష్ఠితం దేవమాధే మత్వార్కవిష్ణుప్రతిమప్రభావమ్

 ప్రత్యుద్ధతా స్వాం వయమేవ సర్వే తత్త్వం పాతే తవ జిజ్ఞాసమానాః

 న వాఒపి త్వాం ధృష్ణవః ప్రష్టు మగ్రే న చ త్వ మస్మా స్పృచ్ఛసి కే వయం స్మః

 తత్త్వాం పృచ్ఛామి స్పృహణీయరూపం కస్య త్వం వా కింనిమిత్తం త్వ మాగాః

 భయం తు తే వ్యేతు విషాద మోహౌ త్య జాకు దేవేందసమానరూప

 త్వాం వర్తమానం హి సతాం సకా శే నాలం ప్రసోడుం బలహాపి శక్రః

 సన్తః ప్రతిష్ఠ ద్యుసుఖచ్యుతానాం జయ ని దేవామర రాజకల్ప

 తే సజ్ఞతా స్థావర జజ్ఞమేళాః ప్రతిష్ఠిత స్వం సదృ శేషు సత్సు

 ప్రభు రగ్నిః ప్రతపనే భూమి రావపనే ప్రభుః

 ప్రభు సూర్యః ప్రకా శేచ సతాం చాభ్యాగతః ప్రభుః

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే శౌనక శతానీక సంవాదే చంద్రవంశానువర్ణనే యయాతిచరితే సప్తత్రింశోధ్యాయః

ఇంద్రుడు యయాతితో ఇట్లనెను: “నహుషపుత్తా: యయాతి రాజా! గృహసుడుగా సర్వకర్మములను ముగించుకొని గృహములను విడిచి వానప్రస్థుడవయి వనమును చేరుకొంటివి. అందువలన నిన్న డుగుచున్నాను. తపస్సుచే నీకు సమానుడు మరి ఎవ్వరో చెప్పుము. యయాతి: “వాసవా! దేవతలు మనుష్యులు గంధర్వులు మహర్షులు. ఈ ఎవ్వరి యందును తపస్సు చే నాకు సమానుడు మరి ఎవ్వడును కనబడడు.” ఇంద్రుడు: “నీవు వారివారి వైయక్తిక ప్రభావమును ఎరుగక యే సమానులను అధికులను హీనులను కూడ అవమానించినావు. కావున ఇవిగో! ఈ నీలోకములన్నియు అంత వంతములు ముగిసిపోయినవి) అగుచున్నవి. ఇప్పుడే పడిపోవుచున్నావు.” యయాతి: “సుర లను ఋషులను గంధర్వులను సరులను అవమానించినందున నాలోకములన్నియు క్షీణములయినచో ఇంద్రా! సురలోకమునుండి జారిపడియు సత్ జనుల నడుమ పడ గోరుచున్నాను." ఇంద్రుడు: “యయాతిరాజా! నీవు జారియును సత్ జనుల నడుమనే పడు చున్నావు. మరల వారివలననే నిలుకడను పొందగలవు. ఈ విషయమును గుర్తునందుంచుకొసి మరల ఎప్పుడును సమానులనుగాని అధికులనుగాని అవమానింపకుము.”

అంతట దేవేంద్రుడే సాక్షాత్ అనుభవించు పుణ్య లోకమునుండి పడద్రోయబడుచున్న యయాతిని చూచి రాజర్షి వరుడును ధర్మమునకు మూలతత్వమును (వేదమును వేదమార్గమును రక్షించువాడునగు అష్టకుడు అతనితో ఇట్లనెను: “నీవు ఎవరవు? యువకుడవు. ఇంద్రుని రూపమువంటి రూపముతో సున్నావు. స్వతేజముతో అగ్నివలె ప్రకా శించుచున్నావు. మేఘావరణముచే విజృంభించిన అంధకారముతో నిండిన ఆకాశమునుండి గ్రహ శ్రేష్టుడగు సూరుడు వలె పడుచున్నావు, అగ్నివలేను అరునివలేను ద్యుతి కలిగి ఇంతటివాడవు అన నలవికాని నీవు స్వరపథమునుండి పడుచుండుట చూచి ఈ పడుచున్నది ఏమియా అని అందరమును పరి మోహితులము (ఏమియు తెలియని వారము) అగు చున్నాము. స్వర్గమార్గము నధిష్టించియున్న నీవు రవి విష్ణుల ప్రభావమువంటి ప్రభావము కలిగియున్నావు. ఇట్టి నీవు పడుటకు కారణమగు తత్వము ఎరుగగోరి మేమందరమును లేచి నీకు ఎదురు వచ్చుచున్నాము. నిన్ను మేమే మొదట ప్రశ్నించుటకు సాహసించలేకున్నా ము. నీవో. మమ్ములను మీరెవ్వరని అడుగుటయులేదు. కావున ముచ్చటగొలుపు రూపముగల నిన్ను నేనే ముందుగా ప్రశ్నించుచున్నాను. నీవు ఎవ్వరివాడవు? ఏందులకే నీవు వచ్చితివి? దేవేంద్ర సమాన రూపుడవు-గాని నీవు సామాన్యుడవు కావు. నీవు ఏమాత్రమును భయమును విషాదమును మోహమును (ఏమీ చేయుటకును తోచకుండుటను) విడువుము. నీవిపుడు సత్ జనుల దగ్గర నున్నా వు. ఇంద్రుడు బలాసురునంతటివానిని చంపినవాడే అగుగాక! ఇట్టి నిన్ను అతడును ఏమియు ఎదిరింపజాలడు. అదియుగాక స్వర్గసుఖమునుండి భ్రంశము నొందిన వారికి నిలుకడ చోటయి సత్ జనులు వర్ధిల్లుచున్నారు. నీవో. దేవులతో దేవరాజుతో సమానుడవు. సజ్జనులును సత్ జనులును ఒక చోట పరస్పరము కలిసినచో స్థావర జంగమరూపమగు ప్రపంచమున కెల్ల ప్రభువులై దానిని రక్షించగలరు. నీవు ఇపుడు నీకు సాటివార గు_సత్ జనుల (మైనమా) యందు నిలుకడ పొ దీనావు. కనుక భయపడకుము. చింతింపకుము.) వేడిమినిచ్చుటలో అగ్ని యు బీజములను విత్తుటకు అనుకూలమగుటలో భూమియు ప్రకాశమునిచ్చుట లో రవియు ఆభ్యాగతులకు ఆశ్రయమునిచ్చుటలో సజ్జనులును సమర్థులు.”

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున యయాతికి స్వర్గభ్రంశము - యయాత్యష్టక సంవాదము అను ముప్పది ఏడవ అధ్యాయము.