మత్స్య మహా పురాణము
30 - దేవయానీ వనవిహారము
శౌనక: : అథ దీర్ఘేణ కాలేన తస్మిన్నేవ నృపోత్తమ ।
వనం తదేవ నిర్యాతా క్రీడార్థం వర వర్ణినీ॥
తేన దాసీసహ సేణ సార్ధం శర్మిష్ఠయా తదా ।
తమేవ దేశం సంప్రాప్తా యథా కామం చచార సా॥
తాభి స్సఖిభి స్సహితా సర్వాభి ర్ముదితా భృశమ్ ।
క్రీడన్త్యోఽ ధీరతా స్సర్వాః పిబన్త్యో మధు మాధవే॥
ఖాదన్యో వివిధా న్భక్ష్యా న్విదశన్త్య: ఫలాని చ ।
పునశ్చ నాహుషో రాజా మృగలిప్సు ర్యదృచ్ఛయా॥
తమేవ దేశం సంప్రాప్తో జలలిప్సు స్స కర్శితః ।
దదర్శ దేవయానీం చ శర్మిష్ఠాం తాశ్చ యోషితః॥
పిబన్త్యో లలమానాశ్చ దివ్యాభరణభూషితాః ।
ఉపవిష్టాంచ దదృశే దేవయానీం శుచిస్మితామ్॥
రూపేణా ప్రతిమాం తాసాం స్త్రీణాం మధ్యే వరాజ్గనామ్ ।
శర్మిష్ఠయా సేవ్య మానాం పాద సంవాహనాదిభిః॥
శౌనకుడు శతానీకునితో ఇంక ను ఇట్లు చెప్పెను: ఇట్లు చాలకాలము గడ చెను. దేవయాని ఆ వృషపర్వుని పురమునందే నివసించుచుండెను. ఒకమారు ఆమహాసుందరి క్రీడార్దమయి తాను పూర్వము పోయిన వనమునకే వెళ్ళెను. తన దాసీ సహసముతో శర్మిష్టయు ఆమెవెంట నుం డెను. దేవయాని అప్పటి ప్రదేశమును చేరెను. ఆయా చెలిక తై లందరతో కూడి మిగుల సంతోషముతో తన ఇచ్చవచ్పినట్లు విహరించెను. వారు అందరును ఆ వసంత రువులో చాల ఆనందముగా క్రీడించుచు మద్యమును త్రాగిరి. వివిధ భక్ష్యములను భక్షించుచు 'వివిధ ఫలములను తినుచుండిరి.
ఇంతలో నహుష పుత్రుడగు యయాతి దైవసంకల్పమున వేట కే వచ్చి అలసి నీటికై ఆ ప్రదేశమున కే వచ్చెను. అచ్చట అతనికి దేవయానియు శర్మిష్టయు వేయిమంది శర్మిష్ణ దాసీజనమును కనబడిరి. వారందరు ను దివ్యాభర ణములతో అలంకరించుకొని మద్యము తావుచు విలాసము లనుభవించుచుండిరి. వారందర నడుమ దేవయాని కూర్చుండి యుండెను. ఆమే చిరునవ్వు నిర్మలము. ఆ మే రూపము సాటిలేనిది. ఆమె స్త్రీలలో ఉ తమురాలు. శర్మిష . ఆమెకు పాదములోతుట మొదలగు సేవలు చేయుచుండెను.
యయాతిదేవయానీ సంవాదః॥
యయాతిః: ద్వాథ్యాం కన్యాసహస్రాభ్యాం ద్వే కన్యే పరివారితే।
గోత్రేచ నామనీ చైవ ద్వయోః పృచ్ఛా మ్యహం యతః॥
దేవయానీ : ఆఖ్యాస్యా మ్య ను మోదస్వ వచనం మే నరాధిప।
శుక్రో నా మాసురగురు స్సు తాం జానీహి తస్య మామ్॥
ఇయం చ మే సఖీ దాసీ య తాహం తత్రగామినీ ।
దుహితా దానవేన్ద్రస్య శర్మిష్ఠా వృషపర్వణః॥
యయాతి: కథంచ తే సఖీ దానీ కన్యేయం వర వర్ణినీ ।
అసురేన్ద్రసుతా సుభూః పరం కౌతూహలం హి మే॥
దేవయానీ : సర్వ ఏవ నర వ్యాఘ్ర విధాన మనువర్తతే ।
విధినా విహితం మత్వా మా విచిత్రం యథా నృప॥
రాజవద్రూపవేష స్తే బ్రాహ్మీం వాచాం బిభర్షి చ ।
కింనామా త్వం కుతశ్చాసి కస్య పుత్రోసి శంస మే॥
యయాతి: : బ్రహ్మచర్యేణ కృత్స్నో మే వేద శ్రుతిపథం గతః ।
రాజాఽహం రాజపుత్త్ర శ్చ యయాతిరితి విశ్రుతః॥
దేవయానీ : కేనాప్యర్థేన నృపతే ఇమం దేశం సమాగతః ।
జిఘృక్షు ర్వారిజం కిఞ్చి దథవా మృగలిప్సయా॥
యయాతి: : మృగలిప్సు రహం భద్రే పానీయార్థ మిహాగతః ।
బహుధా వ్యనుయుక్తోస్మి త దనుజ్ఞాతు మర్హ సి॥
దేవయానీ : ద్వాభ్యాం కన్యాసహస్రాభ్యాం దాస్యా శర్మిష్ఠయా సహ ।
త్వవధీనాస్మి భద్రం తే సఖా భర్తా చ మే భవ॥
యయాతిః : స్యా దౌశనసి భద్రంతే న త్వా మరోఽస్మి భామిని ।
అవై వాహ్యాశ్చ రాజానో దేవయాని పితు స్తవ॥
దేవయానీ : సంసృష్టం బ్రహ్మణా క్షత్రం క్షత్రంచ బ్రహ్మ సంస్థితమ్ ।
ఋషీశ్చ ఋషిపుత్రశ్చ నాహుషాద్య భజస్వ మామ్॥
యయాతిః : ఏక దేహోద్భవా వర్ణాశ్చత్వారోఽపి వరాననే ।
పృథగ్ధర్మాః పృథక్ఛౌచా స్తేషాం వై బ్రాహ్మణో వరః॥
దేవయానీ : పాణిగ్రహో నాహుషాయం న పుమ్భి సేవితః పురా ।
త్వం పాణి గ్రహీరగ్రే వృణోమి త్వా మహం తతః॥
కథం తు మే మనస్విన్యాః పాణి మన్యః పుమా నృత్ ।
గృహీత మృషిపుత్త్రేణ స్వయం వా వృషిణా త్వయా॥
యయాతి: : క్రుద్దా దాశీ విషా త్సరా జ్జ్వలనా త్సర్వతో ముఖాత్ ।
దురాధర్షతరో విప్రః పురు షేణ విజ్ఞానతా
దేవయానీ : కథ మాశీ విషాత్సర్పా జ్జ్వలనా త్సర్వతోముఖాత్ ।
దురాధర్షతరో విప్ర ఇత్యర్థ పురుషరథ॥
యయాతిః : దశే దాశీ విష స్వేకం శ ణేకశ్చ వధ్యతే ।
హ న్తి విప్ర స్వరాష్ట్రాణి పురాణ్యపిచ కోపతః॥
దురాధర్షతో విప్ర స్తస్మా ద్భీరు మతో మమ అతోఽదత్తాం హి పిత్రా త్వాం భద్రే న వివహామ్యహమ్॥
శుక్రభ్య నుజ్ఞాతస్య యయాతే ర్దేవయానపరిగ్రహః॥
దేవయానీ : దత్తాం వహసి పిత్రా త్వం మాం హి రాజనృతో మయా ।
మా యాచతో భయం నాస్తి దత్తాంచ ప్రతిగృహ్ణతః॥
యయాతి ఇట్లు పలికెను: “ఇచ్చట ఇద్దరు కన్యలున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక క న్యాసహస్రము పరివారముగా ఉన్నది. కనుక నేను ఆ ఇద్దరి నామస్తోత్రములు తెలిసికొనగోరుచున్నాను. దేవయాని: “రాజా! చెప్పెదను. నామాటనే ప్రమాణముగా గ్రహింపుము. రాక్షస గురుడు శుక్రుడున్నా డే. అతని కూతురను నేను. ఇది నా పరిచయము. ఈమె నాకు చెలిగా ఉండు దాసి. నే నెచ్చటికి పోయిన అచ్చటికి వచ్చును. ఈమే దానవేంద్రుడగు వృషపర్వుని కూతురు." యయాతి: “ఈమే రాక్షసరాజు కూతురు. చక్కని కనుబొమలు (మొదలగు మహా సౌందర్య లక్షణములు కలిగిన ఉత్త్రమశ్రీ కదా ఈమె! ఈకన్య నీకు దాసి ఎట్లయినది? నాకు విన వేడుకగా ఉన్న ది.” దేవయాని: “రాజా! ప్రతి ఒకరును విధి విధించిన విధానమును అనుసరించి నడుచుకొనవలసినదే. అది ఎరిగినచో నీకు ఆశ్చర్యము కలుగదు. నీరూపమును వేషమును రాజునకువలె నున్న వి. బ్రాహ్మణుని వాక్కు కలిగి ఉన్నావు. నీ పేరు ఏమీ? ఎక్కడివాడపు? నీ తం! 'ఎవరు?'' యయాతి: “బ్రహ్మచర్య వ్రతమున నేను వేదము అంతయు అధ్యయనము చేసితిని. నేను రాజను. రాజవంశమున పుట్టిన పొడను. నా పేరు యయాతి.' దేవయాని: “ఏదో పని మీద నే నీవీ ప్రదేశమునకు వచ్చియుందువు. నీటినుండి లభించుదానీ నేదై న గ్రహింపగోరియా? వేట కోరియా?” యయాతి: “నేను వేటకై వచ్చి నీటికాను ఇక్కడకు వచ్చితిని. నీవడిగిన అన్ని ప్రశ్నలకును సమాధానము ఇచ్చితిని. నేను పోయివత్తును. అనుజ్ఞ ఇమ్ము." దేవ చని: "ఈ రెండు వేల దాసీ కన్యా జనముతోను దాసియగు శర్మిషతోను నీ అధీనురాల నగుచున్నాను. పూజ్యుడవగు నీవు నాకు మిత్రుడును భర్తవును కమ్ము, యయాతి: “అగుగాక ! నీవు శుక్రుని కూతురు పూజ్యురాలవు. కోపింపకుము. నేను నిన్ను వివాహ మాడ అర్హుడను కాను. నీ తండ్రి క్షత్రియులతో వివాహ సంబంధమును అంగీకరించడు.” దేవయాని: "బ్రహ్మము క్షత్రముతోను. క్షత్రము బ్రహ్మముతోను పరస్పరము కలిసియే యున్న వి. బ్రహ్మము-బ్రాహ్మణజాతి ప్రధాన లక్షణములు; క్ష త్త్రము క్షత్రియజాతి ప్రధాన లక్షణములు) నీవు ఋషివి.ఋషిపుత్త్రడవును. నహుష కుమారుడవు నీవు. ఇప్పు డయిన నీవు నన్ను పెండ్లాడుటకు అంగీక రించుము. యయాతి: "సుందరీ! నాలుగు వర్ణములును ఒక దేహమునుండి పుట్టినవే. కాని వాని ధర్మములును రూపములును వేరువేరు. ఈ నాలుగు వర్ణములవారిలో బ్రాహ్మణుడు శ్రేష్టుడు. (కనుక శేష్ట వర్ల స్త్రీని తక్కువ వర్ణపు పురుషుడు పెండ్లాడరాదు.) దేవయాని: “రాజా! ఈనా పాణిని ఇంతకుముందు ఏ పురుషుడును గ్రహించలేదు. మొట్టమొదట బావిలోనుండి తీసినప్పుడు నీవే ఆది పట్టుకొంటివి. అందు చేతనే నేను నిన్ను వరించుచున్నాను. ఋషి పుత్రుడవును స్వయముగా ఋషివి ఐన నీవు గ్రహించినది ఈ చేయి. నేను అభిమానవతిని. అట్టి నాయీకరమును మరెవరుగాని - ట్లు గ్రహింపదగుదురు? యయాతి: “కోరలనిండ విషము కలిగినదియు కోపించిన దియు అగు సర్పము కంటెను. అన్ని వైపులకును మంటలు రేగుచున్న అగ్నికంటెను విప్రుడు స్పృశించి కలత పరచరాని వాడు ఈ విషయము విజ్ఞులకు మాత్రమే తెలియును. దేవయాని: “పురుష! శ్రేష్టా! ఇది యెట్లో తెలియగోరుచున్నాను. యయాతి: “పాము ఒక్కనినే కరచును. శస్త్రము ఒక్కనిని మాత్రము చంపును. కానీ కోపించిన బ్రాహ్మణుడు రాష్ట్ర ములను (గ్రామాదిజన నివాసస్థానములను) పురములను (రాజధానీస్థానములను) కూడ నశింపజేయగలడు. భయపడకుము. ఈ కారణముతోనే బ్రాహ్మణుడు పైచెప్పినవాటి అన్నిటికంటెను దురాధర్షతరుడు (స్పృశించికలతపరచరానివాడు) అని నేనంటిని. అందువలననే పూజ్యురాలవగు నిన్ను నీ తండ్రియే స్వయముగా ఇచ్చిననేకాని వివాహమాడను. దేవయాని:
“రాజా! నేనై స్వయముగా కోరినందునను మాతండ్రి స్వయముగా నన్ను నీకు ఇచ్చిన మీదటను నన్ను నీవు పెండ్లాడ బోవుచున్నావు. అంతే కాని నీవు కోరుటలేదు. అడుగక యే ఇచ్చిన దానిని ప్రతిగ్రహించుట దోషము కాదు.
శౌనక : త్వరితం దేవయాన్యాఽథ ప్రేషితా పితు రాశ్రమమ్ ।
సర్వం నివేదయామాస ధాత్రీ తస్మై యథా శ్రుతమ్॥
శ్రుత్వైవ చ స రాజానం దర్శయామాస భార్గవః ।
దృష్టైవ మాగతం విప్రం యయాతిః పృథివీపతిః॥
పవన్దే బ్రాహ్మణం కావ్యం ప్రాఞ్జలిః ప్రణత స్థితః ।
తం చాథాభ్యవద త్కావ్య సామ్నా పరమవల్గునా॥
దేవయానీ : రాజాఽయం నాహుష స్తాత దుర్గే మే పాణి మగ్రహీత్ ।
నమస్తే దేహి మా మస్మై లో కే నాన్యం పతిం వృణే॥
శుక్రః : వృతోఽనయా పతి ర్వీర సుతయా త్వం మమేచ్ఛయా ।
గృహాణేమాం మయా దత్తా॥ మహిషీం నహుషాత్మజ॥
యయాతి: : అధర్మో న స్పృశే దేవం పాపం మా స్యాచ్చ భార్గవ ।
వర్ణసజ్కరజో బ్రహ్మ న్ని తి త్వాం ప్రావృణే మ్యహమ్॥
శుక్రః : అధర్మా త్త్వాం చ మోక్ష్యామి వరం పరయ చేప్సితమ్ ।
అస్మి న్వివా హే మా గ్లాని రహం పాపం తుదామి తే॥
వహస్వ భార్యాం ధర్మేణ దేవయానీం శుచిస్మితామ్ ।
అనయా సహ సంప్రీతి మతులాం త్వ మవాప్ను హి॥
ఇయం చాపి కుమారీ తే శర్మిష్ఠా వార్షపర్వణీ।
సంపూజ్యా సతతం రాజ న్న చై నాం శయనే హ్వయ॥
శౌనకః : ఏవ ముక్తో యయాతిస్తు శుక్రే దత్వా ప్రదక్షిణమ్ ।
జగామ స్వపురం హృష్ట స్సోఽనుజ్ఞాతో మహాత్మనా॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే మత్స్యమనుసంవాదా నర్గత శౌనకశతానీక సంవాదే చన్దవంశానువర్ణనే యయాతిచరితే యయాతికృత దేవయానీగ్రహణం నామ త్రింశోఽధ్యాయః॥
పిమ్మట వెంటనే దేవయాని తన దారిని తన తండ్రి ఆశ్రమమునకు పం పెను. ఆమె శుక్రునితో తాను వినిన విషయము విన్నట్లు చెప్పెను. వినిన వెంటనే శుక్రుడును వచ్చి రాజునకు దర్శన మిచ్చెను. ఇట్లు తన దగ్గరకు వచ్చిన విప్రుడు. వేదములందు మహాపండితుడు ఒక విమహాముని కుమారుడు అగు శుక్రుని యయాతిరాజు నమస్కరించి దోసిలిపట్టి వినయముతో వంగి ఎదుట నిలువబడెను. శుకుడు అతనిని ఏల ఇం పై టలతో పలుకరించి మాట లాడెను.
దేవయాని: "ఈ రోజు నహుష పుత్రుడు. ఇతడు ఒకప్పుడు దుర్గ ప్రదేశము (తప్పించుకొని బయటపడ అలవి కాని ప్రదేశము)నందున్న నా చేతిని పట్టుకోనెను. పాణిని గ్రహించెను.) నీకు వందనము. నన్ను ఇతని కమ్ము. ' లోక మున నేను మరెవ్వరిని పతిగా వరించను." శుక్రుడు: “ఓ వీరా! నిన్ను ఈ నా కుమార్తె తానే వరించినది. అది నేను ఇష్టపడుచున్నాను. ఈ మేను నేనే నీకు ఇచ్చుచున్నాను. నీ వీమెను గ్రహించి రాణిగా చేసికొనుము.” యయాతి: “పూజ్య బ్రాహ్మణుడవగు భార్గవా! ఇట్లు చేయుట వలన నాకు అధర్మదోషము కాని వర్ల సంకరము చేసిన పాపము కాని నా కంట కుండునట్లు నాకు వరమీయ ప్రార్ధించుచున్నాను.” శుక్రుడు: “ఇదే కాదు. నీ విం కేదయిన ఈపి తవరమును కూడ కోరు కొమ్ము . ఇత్తును. నిన్ను అధర్మమునుండి విడిపించుచున్నాను. ఈ పెండ్లి వలన నీకు ఎట్టి హానియు కలుగదు. నీ పాపములను నేను ఖండించు/తెగనర కుచున్నాను. ఈ శుచిస్మితయగు దేవయానిని ధర్మపత్నిగా గ్రహింపుము. ఇది ధర్మమే కాని అధర్మము కాదు. . ఈమెతో కూడి నీవు సాటిలేని సుఖ మనుభవింపుము. . వృషపర్వుని కూతురగు ఈ కుమారి శర్మిష్టయు నీకు సతతము ఆదరణీయురాలే. కాని నీవు ఈమెను శయనమున గ్రహించరాదు.
- ఇట్లు పలికిన శుక్రునకు ప్రదక్షిణము చేసి ఆ మహాత్ముని అనుమతి పొంది యయాతి హర్షముతో తన రాజ ధానికి వెడలెను.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున. యయాతి దేవయానిని గ్రహించుట యను ముప్పదవ అధ్యాయము.
Summary of chapter 30 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya relates how Devayānī stipulated that King Vṛshaparvan's daughter Śarmishṭhā, along with a thousand Asura maidens, must become her personal handmaidens and accompany her wherever she married. King Vṛshaparvan consented to save his realm, and Princess Śarmishṭhā accepted her role with humility. Śukrāchārya then offered his daughter Devayānī in marriage to King Yayāti with great royal pomp and spiritual blessings, while issuing a strict injunction to King Yayāti never to invite Śarmishṭhā to his bed chamber or engage in romantic relations with her. King Yayāti accepted the condition, returned to his capital with Devayānī and her entourage, and lived in great luxury, with Devayānī subsequently giving birth to two noble sons named Yadu and Turvasu.