96 - ఆదిత్యవార నక్తవతము

నారదః : య దారోగ్యకరం పుంసాం యదనంత శ్రఫలప్రదమ్

య చ్చాంతయే చ మర్త్యానాం వద నందీశ తర్ద్వతమ్

 నన్ది కేశ్వరః : య త ద్విశ్వాత్మనో ధామ పరం బ్రహ్మ సనాతనమ్

 సూర్యాగ్ని చన్దరూపేణ త త్రిధా జగతీ స్థితమ్

 తదారాధ్య పుమా న్విప్రః ప్రాప్నోతి కుశలం సదా

తస్మా దాదిత్యవారేషు సదా నక్తాశ నో భవేత్

 యది హస్తేన సంయుక్త మాదిత్యస్య దినం భవేత్

 తదా శనిదినే కుర్యా దేక భుక్తం విమత్సర

  నక్త మాదిత్య వారేణ భోజయిత్వా ద్విజోత్తమాక్

వతై ర్ద్వాదశభి ర్యుక్తం రక్తచన్దనపక్కజమ్

 విలిఖ్య విన్య సే త్సూర్యం నమస్కారేణ పూర్వతః

 దివాకరం తథాగ్నేయ్యాం వివస్వ త్తం తతఃపరమ్

భగంతు నైరృతే దేవం వరుణం పశ్చి మేద

 మా హీన మనిలే తద్వ దాదిత్యంచ తథోత్తరే

 శాస్త్ర మీశానభాగేతు నమస్కారేణ విన్య సేత్

కర్ణికాపూర్వపత్రైతు సూర్యస్యతుర గా న్న్య సేత్

దక్షిణే యమనామానం మార్తాణ్డం పశ్చి మే దళే

 ఉత్తరేణ రవిం దేవం కర్ణికాయాంతు భాస్కరమ్ 

నందీశ్వరా! మానవులకు ఆరోగ్య ప్రదమును అనంత ఫలప్రదమును శాంతి ప్రదమును నగు - వ్రతమును తెలుపుమనిన నారదున కతడిట్లు వచించెను: విశ్వాత్మక మును సనాతనము నునగు పరబ్రహ్మ తత్వపు తేజము జగ మున సూర్య చంద్రాగ్నులను మూడు రూపములతో ప్రకాశించుచున్నది. దాని నా రాధించినవారు సదా క్షేమమునందుదురు. అందులకయి ఆదిత్య హారములందు నియతముగ పగలుపవసించి నక్తమున (రాతియందు) భుజించవలెను. ఎట్లన ఆదిత్య వారములో హస్త నక్షత్రము వచ్చినప్పుడు దానికి ముందటినాడు. శనివారమున పగటి మాత్రపు భోజనముతో ఏక భుక్తము చేసి విమత్సరు డై యుండి ఆదిత్యహరమునాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి తానును భుజించవలెను.

(దానికి ముందు) రక్తచంద సముతో ద్వాదశ దళ పద్మము వ్రాసి దానియందు తూర్పున 'సూర్యాయనమః' ఆగ్నేయమున 'దివాకరాయనమః' దక్షిణమున 'వివస్వతే నమః' నైరృతమున 'భగాయనమః' పడమర 'వరుణాయనమః' వాయవ్యమున “మ పేంద్రాయనమః' ఉత్తరమున “ఆదిత్యాయనమః' ఈశాన్యమున 'శాంతాయనమః' అని వ్రాయవలెను. అట్లే కర్ణిక లో తూర్పున 'రవితుర గేభ్యోనమః' దక్షిణమున 'యమాయనమః' పశ్చిమమున మార్తాండాయనమః' ఉత్తరమున 'రవయేనమః' కర్ణిక నడుమ 'భాస్కరాయనమః' అని వ్రాయవలెను.

రక్తపుష్పోద కేనార్ఘ్యం సతిలాగుణచన్దనమ్

తస్మి స్పద్మే తతో దద్యా దిమం మంత్ర ముదీరయేత్

 కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా సర్వతోముఖః

యస్మా దగ్నీన్దరూప స్వం నమస్తే ప్రాగ్దివాకర

 అగ్ని మీరే నమస్తుభ్యమి షేత్వోర్జతి భాస్కరమ్

 అగ్న ఆయాహి వరద నమస్తే జ్యోతిషాం పతే

 అర్ఘ్యం దత్వా విసృజ్యాథ నిశి తైలవివర్జితం

 భుజ్జిత వత్సరా నేతు కాఇనం కమలో త్తమమ్

 పురుషంచ యథా శ క్త్యా కుర్వీత ద్విభుజం తథా

 సువర్గశృజీం కపిలా మనర్యాం రౌప్యాం ఖురైః కాంస్య దోహాం సవత్సామ్

 పూర్ణే గుడస్యోపరి తామ్రపాత్రే నిధాయ పద్మం పురుషంచ దద్యాత్

సమ్పూజ్య శయ్యామ్బరధూపమాల్యై ర్ద్విజంచ రకై రథవా పిశజ్గైః

 ప్రక్షాళయిత్వా పురుషంచ పద్మం దద్యా దనేక వ్రత దానకాయ

అవ్యజ్ఞరూపాయ జితేన్దియాయ కుటుమ్బినే దేయ మనుద్దతాయ

 నమో నమః పాపవినాశ నాయ విశ్వాత్మనే సప్తతుర జ్ఞమాయ

 సామర్ధ్యజుర్ధామనిధే విధాత్రే భవాబ్దిపోతాయ జగత్పవిత్ర

 ఇత్యనేన విధినా సమాచరే దబ్ద మేక మిహ యస్తు మానవః

సో2ధిరోహతి వినష్టకల్మష స్సూర్యధామ సకలామరావృతః

 కర్మసంక్షయ మవాప్య భూపతి శోకదుఃఖభయ రోగవర్జితః

సో భవే ద్బువనస ప్రసంయుతో ధర్మమూర్తి రమితాయురాత్మవాక్

 యాచ భర్తృగురుదేవతత్పరా వేదకర్తు రిహ నక్త మాచరేత్

సాపి లోక మమతౌఘపూజితం యాతి నారద పదం న సంశయః

 యః పఠే ధథ నర శ్శృణోతి వా పఠ్యమాన మథవాను మోదతే

 సోపి శక్రభవనే దివౌక సైః పూజ్యతేబ్దశతకోటివి స్తరమ్

ఇతి శ్రీమత్స్యమహాపురాణే ఆదిత్యవారనక్తవ్రతమాహాత్మ్యకథనం

నామ షణ్డవలిత మోధ్యాయః

పిమ్మట ఆ పద్మమున నూవులును రక్తచందనమును కలిసిన రక్త పుష్పోదకముతో రవికి అర్ఘ్య మీయవలెను. మంత్రార్థము): దివాకరా! నీవు కాలాత్ముడవు; సర్వభూతాత్ముడవు; వేదాత్ముడవు; సర్వతోముఖుడవు; అగ్నీ ద్ర రూపుడవు; ఇట్టి నీకు తూర్పుదిశయందు నమస్కారము. 'అగ్ని మీశే' ఇత్యాది ఋక్కుతో నీకు నమస్కారము. 'ఇషే త్వోర్ణేత్వా' ఇత్యాది మంత్రముతోను 'అగ్న ఆయాహి' ఇత్యాది మం! తముతోను భాస్కరా! వరదా! జ్యోతిషాంపతీ! నీకునమస్సు. అనుచు రవి కర్యము ఇచ్చి అతనికి ఉద్వాసనము చెప్పవలెను. ఆ రాత్రి తైలము లేకుండ భుజించవలెను. ఇట్లు సంవత్సరము గడచిన తరువాత అనేక ప్రతములను దానములను ఆచరించినవాడు అంగ వైకల్యము లేనివాడు జితేంద్రియుడు కుటుంబి పొగరులేనివాడు అగు బ్రాహ్మణుని ఎర్రనివికాని ఎరుపు పసుపు కలిసిన రంగువికాని అగు వస్త్ర మాల్య ధూపములతో అర్చించి అతనికి యథాశ క్తిగ బంగారుతో చేసిన పద్మమును ద్విభుజుడగు పురుషుని బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అలంకరించినదియు దూడ కలదియు పాలు పిదుకుటకు కంచుపాత్ర కలదియు ఆగు పొడి యావును దానమీయవలెను. (దానమంత్రము): “పాపనాశనుడు విశ్వాత్ముడు సప్తాశ్వుడు ఋగ్యజుస్సామవేదములకు తేజస్సులకు నిధియు విధాతృడును సంసార సాగర నౌకయు జగత్పవిత్రుడునగు రవికి నమస్కారము."

ఈ విధానమున సంవత్సరకాలమాచరించు మానవుడు పాపముక్తుడై సకల దేవతలు తను సేవింప సూర్య పదమునందును. అతడు కర్మ నాశమును పొంది భూనాధుడై దుఃఖభయ రోగ రహితుడై ధర్మమూర్తియు: అమి తాయువునై ఊర్ధ్వ సప్తలోకములను చేరి సుఖించును.

 శ్రీయైనను థర్తృ గురుదేవభక్తి కలిగి ఆదిత్య వార నకవత మును ఇట్లాచరించినచో అమెయు దేవ గణ పూజితమగు ఉత్తమలోకమునందును. సందియము లేదు.

ఈ విధానమును వినినను చదివినను ఇతరులు చదువుట విని అను మాదిరి ప్రశంసించినను అట్టివాడును నూర్ల కోట్ల సంవత్సరములపాటు దేవపూజితుడై ఇంద్రభవనమున సుఖించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆదిత్యవార నక్త వ్రత మాహాత్మ్య కథనమను తొంబది ఆరవ అధ్యాయము.