మత్స్య మహా పురాణము
193 - అంకు శేశ్వర తీర్థాది మహిమానువర్ణనము - నర్మదా మాహాత్మ్య సమాప్తి॥
మార్కణ్డేయః : తతో గచ్ఛేత్తు రాజేంద్ర హ్యజ్కు శేశ్వర ముత్తమమ్ ।
దర్శనా తస్య దేవస్య ముచ్యతే సర్వపాతకైః॥
తతో గచ్ఛేత్తు రాజేంద్ర నర్మదేశ్వర ముత్తమమ్ ।
తత్ర స్నాత్వా నరో రాజ న్వర్గ లో కే మహీయతే॥
అశ్వతీర్థం తతో గచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్ ।
సుభగో దర్శనీయశ్చ భోగవా స్టాయతే నరః॥
వైతామహం తతో గచ్ఛేదహ్మణా నిర్మితం పురా ।
తత్ర స్నాత్వా నరో భ క్త్యా పితృపిజ్జంతు దాపయేత్॥
తిలదర్బవి మిశ్రం తు హ్యుదకం తత్ర దాపయేత్ ।
తస్య తీర్థప్రభావేన సర్వం భవతి చౌక్షయమ్॥
సావిత్రీతీర్థ మాసాద్య యస్తు స్నాన సమాచరేత్ ।
విధూయ సర్వపాపాని బ్రహ్మలోకే మహీయతే॥
మనోహరం తు తత్రోవ తీర్థం పరమశోభనమ్ ।
తత్ర స్నాత్వా నరో రాజ నితృలో కే మహీయతే॥
తతో గచ్ఛేత్తు రాజేంద్రో మానసం తీర్థ ముత్తమమ్ ।
తత్ర స్నా త్వా నరో రాజ స్రుద్రలో కే మహీయతే॥
తతో గచ్చేచ్చ రాజేంద్రో కురుతీర్థ మనుత్తమమ్ ।
విఖ్యాతం త్రిషు లో కేషు సర్వపాపప్రణాశనమ్॥
యాన్యానార్థయతే కామా న్పశుపుత్ర వనానిచ ।
ప్రాప్నుయా త్తాని సర్వాణి తత్ర స్నా త్వా నరాధిప॥
తతో గచ్చేత్తు రాజేన త్రిదశ జ్యోతి రుత్తమమ్ ।
యత్ర తా ఋషిక న్యాస్తు తపో ఒతప్య న సువ్రతాః॥
భర్తా భవతు సర్వాసా మీశ్వరః ప్రభు రవ్యయః ।
ప్రీతస్రాసాం మహాదేవో దణ్ణరూపధరో హరః॥
వికృతానన బీభత్సు రతీ తీర్థ ముపాగతః ।
తత్ర కన్యా మహారాజ వరయ స్పర మేశ్వరమ్॥
అస్మాకం దేవదేవస్య కన్యాదానం ప్రదీయతామ్ ।
తీర్థం తచ్చ మహారాజ దశకన్యేతి (ఋషికన్యేతి) విశ్రుతమ్॥
తత్ర స్నా త్వార్చయే దేవం సర్వపాపైః ప్రముచ్యతే ।
మార్కండేయుడు ధర్మజునకు ఇట్లు చెప్పెను; తరువాత ఆంకు శేశ్వరమను ఉత్తమ తీర్థము; ఆచటి ఆ అంకు శేశ్వరుని దర్శించినంతనే సర్వపాపముక్తుడగును; తరువాత నర్మదేశ్వర తీర్థము; ఈ ఉత్తమ తీర్థమున స్నానము చే స్వర్గ లోకప్రాప్తియగును; తరువాత ఆశ్వతీర్థము; ఆట కేగి స్నానమాచరించినచో చూడ ఇంపగు రూపము కలుగును; భోగ వంతుడగును; స్త్రీలకు ప్రీతిపాత్రుడగును; తరువాత పూర్వము బ్రహ్మ స్వయముగా నిర్మించిన ప్రేతామహ తీర్థము; అందు స్నానమాడి భక్తితో పితరులకు పిండదానము చేసి తిలదర ఏమిశ్రమగు జలముతో తర్పణము వదలినచో ఆ తీర్థ ప్రభా వమున ఆ పితృ కార్యమక్షయ ఫలప్రదమగును; తరువాత సావిత్రి తీర్థము; దానియందు స్నానమాడిన వారు బ్రహ్మలోక ప్రాప్తులగుదురు॥ అచ్చట నే మనోహరమును పరమ శోభనమునగు మనోహర తీర్థముగలదు; అందు స్నా నమాడినచో పితృ లోకప్రాప్తిచే సుఖించగలరు; తరువాత మానస తీర్థము॥ ఆందు స్నానమాడిన చో రుద్రలోక ప్రాప్తియగును॥ తరువాత అనుత్తమమగు కురు తీర్థము॥ అది త్రిలోక విశ్రుతమును-నర్వపాప ప్రణాశనమును॥ లోకమునందు మానవులు పడు పుత ధనాదికములను వేటిని వేటిని కోరుచుందురో అవన్ని యు ఈ తీరమున స్నానమాడినచో సిద్ధించును॥ తరువాత ఉత్తమమగు త్రిదశ జ్యోతి స్త్రీర్థము॥ ఆందు ప్రసిద్దలగు ఋషికన్యలు (కొందరు) మంచి వ్రత నియమముల నవలంబించి తమ కందరకును లోక ప్రభుడును అవ్యయుడునగు ఈశ్వరుడు ప్రతి కావలయునను సంకల్పముతో తపమాచరించిరి॥ అంతట శ్రీమహాదేవుడగు హరుడు॥ వారిని మెచ్చి ప్రశ సమగు (పలాశ) దండమును ధరించి బ్రహ్మచారియై వికృత మగు మొగము కలిగి అసహ్యము గొలుపు రూపముతో వచ్చెను॥ అయినను వారు పరమేశ్వరుని (గుర్తించి) వరించిరి; ఋషి కన్యలమగు మేము దేవదేవుడగు శివునకు పత్నులుగా దానము ఈయబడవలయును అని తపమాచరించిన ప్రదేశ మగుటచే దీనికి ఋషి (దశ) కన్యా తీర్థమను నామము ప్రసిద్దమయ్యెను॥ ఇందు స్నానమాడి శివునర్చించినచో సర్వ పాపము క్రియగును॥
తతో గచ్చేచ్చ రాజేంద్ర స్వర్ణ బిందు త్వితి స్మృతమ్॥
తత్ర స్నా త్వా నరో రాజ ముర్గతిం న చ పశ్యతి ।
అప్సరేశం తతో గచ్ఛే త్స్నానం తత్ర సమాచరేత్ ॥
క్రీడ తే నాగలోకస్థో హ్యప్సరై స్పహ మోదతే ।
తతో గచ్చేత్తు రాజేంద్ర నరకం తీర్థ ముత్తమమ్॥
తత్ర స్నాత్వార్చయే దైవం నరకంచ న గచ్ఛతి ।
భారభూతిం తతో గచ్చే దుపవాసపరో జనః॥
ఏత తీర్థం సమాసాద్య చావతారం తు శామ్భవమ్ ।
ఆర్చయిత్వా విరూపాక్షం రుద్రలో కే మహీయతే॥
అస్మిం సీఠే నర స్స్నా త్వా భారభూతో మహాత్మనః ।
యత్ర తత్ర మృతస్యాపి ధ్రువం గాణేశ్వరీ గతిః॥
కార్తిక స్యతు మాసస్య హ్యర్చయిత్వా మహేశ్వరమ్ ।
అశ్వమేధా దశ గుణం ప్రపద ని మనీషిణకి॥
దీపకానాం శతం తత్ర ఘృతపూర్ణం తు దాపయేత్ ।
విమానై స్సూర్యసఙ్కా ర్వజలే యత్ర శబరః॥
వృషభం యః ప్రయచ్ఛేత్తు శజుకున్డేను సన్నిభమ్ ।
వృషయుక్తేన యానేన రుద్రలోకం స గచ్ఛతి॥
ధేను మేకాంతు యే దద్యా త్తస్మిం క్షీర్దే నరాధిప ।
పాయసం మధుసంయుక్తం భక్ష్యాణి వివిధాని చ॥
యథాశక్త్యాతు రాజేన్ద బ్రాహ్మణా నోజయే తతః ।
తస్య తీర్థప్రభావేన సర్వం కోటిగుణం భవేత్॥
నర్మదాయా జలం పీత్వా సమభ్యర్చ్య వృషధ్వజమ్ ।
దుర్గతిం న చ పశ్య స్తి తస్య తీర్థప్రభావతః॥
ఏత తీర్థం సమాసాద్య యస్తు ప్రాణా న్పరిత్యజేత్ ।
సర్వపాపవిశుద్దాత్మా వ్రజతే యత్ర శఙ్కరః॥
జలప్రవేశం యః కుర్యా త్తస్మిం సీన్డే నరాధిప ।
హంసయు కేన యానేన రుద్రలోకం స గచ్చతి॥
యావ చ్చన్దశ్చ సూర్యశ్చ హిమవాంశ్చ మహోదధిః ।
గజ్గాద్యా స్సరితో యావ త్తావత్స్వర్గే మహీయతే॥
అనాశకంతు యః కుర్యా త్తస్మీం స్తీర్థే నరాధిప ।
గర్బవా సేతు రాజేంద్ర న పున ర్జాయతే పుమా॥
తరువాత స్వర్ణ బిందుతీర్థము; ఆండు స్నానమాడిన వారికి దుర్గతి కలుగదు;తరువాత అప్పరస్ తీర్థము; ఇందు స్నానమాడినవారు నాగలోకమును పొంది ఆందు అప్సరసలతో సుఖింతురు; తరువాత అనరక తీర్థము; అందు స్నానమాడి శివునర్చించిన వారికి నరకప్రాప్తి యుండదు; తరువాత భార భూతి తీర్థ ము; ఇందు స్నానమాడి ఉపనా సమాచరించి శాంభ వావతార మగు విరూపాక్ష దేవుని అర్చించినచో రుద్రలోక ప్రాప్తులగుదురు; ఈ భార భూతితీర్థమునందు స్నానమాడినవారు మహాత్ములు; ఏలయన-వారు ఇందేకాక మరి ఎచ్చట మరణించినను గణేశ్వరులు గానయి శివసానిధ్య మందుట నిశ్చయము॥ ఇచ్చట కార్తీకమాసమున మహేశ్వరుని ఆర్చించినచో అశ్వమేధమునకు పదింతలుగా ఫలము కలుగునని విద్వాంసు లందురు; అందు నేతిదీపములు నూరు వెలిగించినచో సూర్య సమానప్రకాశ ఏమానముల పై శంకరుని సంనిధి కేగును; శంఖమువలే మొల్లపూవువలె చంద్రునివలే తెల్లనగు వృషభమును ఇచ్చట దానమిచ్చినచో రుద్రలోక ప్రాప్తుడగును; ఈ తీర్థమున గోదాన మొక టియెన చేసినను తేనేతో పాయసముతో కూడ వివిధ భక్ష్యములను యథాశక్తిగా బ్రాహ్మణులను భుజింప జేసినచో ఈ తీర్థప్రభావమున ఈ పుణ్య కార్యములలో ప్రతియొక టియు కోటిగుణితమగు ఫలము నిచ్చును; ఈ తీర్థము నాశ్రయించి యుండి ప్రాణత్యాగము చేసినవాడు శంకర లోకమున కేగును; ఇచట నర్మదా జలముత్రావి వృషధ్వజునర్చించినచో దుర్గతి కలుగదు; ఈ తీర్థ మున (ప్రాణ త్యాగమునకై) జలప్రవేశము చేసినచో హంసలను పూంచిన విమానము పై రుద్రలోక మేగును; చంద్రసూర్యులు హిమాలయము మహాసముద్రము గంగాది నదులు ఉన్నంత వరకు స్వర్గలోకమున సుఖపడును! నిరాహార తావ్రతముతో ఇచట ప్రాణ త్యాగము చేసిన వారికి పునర్జన్మ ముండదు॥
తతో గచ్ఛేత్తు రాజేంద్ర ఆషాఢతీర్థ ముత్తమమ్ ।
తత్ర స్నాత్వానరో రాజ న్నింద్రస్యార్ధాసనం లభేత్ ॥
స్త్రీయా సీర్థం తతో గచ్చే త్సర్వపాపప్రణాశనమ్ ।
తతాపి స్నాతమాత్రస్య ధ్రువం గాణేశ్వరీ గతిః॥
ఐరణ్డ్యా నర్మదాయాశ్చ సజ్గమం లోకవి శ్రుతమ్ ।
తచ్చ తీర్థం మహాపుణ్యం సర్వపాపప్రణాశనమ్॥
ఉపవాసపరో భూత్వా నిత్యవ్రత పరాయణః ।
తత్ర స్నా త్వా నరో రాజ న్ముచ్యతే బ్రహ్మహత్యయా॥
తతో గచ్చేచ్చ రాజేంద్రో నర్మదోదధిసజమమ్ ।
జామదగ్న్య మితి ఖ్యాతం సిద్ధే యత్ర జనార్దనః॥
యశ్రేష్ట్వా బహుభి ర్యజై రిష్ణో దేవాధిపో భవత్ ।
తత్ర స్నా త్వా నరో రాజ న్నర్మదోదధిసణమే॥
త్రిగుణం చాశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవః ।
పశ్చిమగ్యోదధేస్సన్గా స్వర్గ ద్వార విపాటనమ్॥
తత్ర దేవా స్సగష్ణర్వా ఋషయ స్సిద్ధ చారణాః ।
ఆరాధయ స్తి దేవేశం త్రిసన్ధ్యం విమలేశ్వరమ్॥
తత స్నా త్వా నరో రాజ స్రుద్రలో కే మహీయతే ।
విమలేశం పరం తీర్థం న భూతం న భవిష్యతి॥
తత్రోపవాసం కృత్వా యే పశ్యన్తి విమలేశ్వరమ్ ।
సప్తజన్మకృతం పాపం హిత్వా యా న్తి శివాలయమ్॥
తరువాత ఆషాడీ తీర్థము; ఇది ఉత్తమము; అందు స్నానమాడినచో ఇంద్రుని ఆర్గాననములభించును; తరువాత యాతీర్థము॥ ఇది సర్వపాప ప్రణాశ కము॥ ఇందు స్నానమాత్రముచే గణేశ్వరుడే రుద్రలోక మున సుఖించును॥ తరువాత ఐరండీ (ఉపనది) నర్మదా నదుల సంగమపు తీర్థ ము॥ ఇది లోక విశ్రుత ము॥ ఇందు అనుదినము స్నానము చేయుచు వత పరాయణుడై ఉపవాసము చేయు చుండినచో బ్రహ్మ హత్యాదోష ముక్తి యగును॥ (ఈ పేరు లోగడ కూడ వచ్చినది)॥ తరుపోర నర్మదో సొగర సంగమ తీరము॥ దీని కే జామ దగ్న్య తీర్థమనియు నామాంతరము॥ ఇచట జనార్దనుడు సన్ని హితుడై యుండును॥ అతడిచ్చట సిద్ధినందెను॥ ఇచ్చట బహుయజ్ఞము లాచరించినందుననే ఇం దుడు దేవాధిపతి కాగలిగేను॥ ఇందు స్నానమాడిన నరుడు అశ్వమేధ ఫలమునకు మూడింతల ఫలమందును॥ ఇది పశ్చిమ సముద్రపు సంధియందు ఉన్నది॥ స్వర్గ ద్వారమును తెరచు పవిత్ర ప్రదేశ మిది॥ ఇచట దేవగంధర్వ ఋషి సిద్ద చారణాదులు ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యలయందు దేవేశుడగు విమలేశ్వరుని ఆరాధింతురు॥ ఇందు స్నానమాడిన వారు రుద్రలోక ప్రాప్తులగుదురు॥ ఈ విమలేశ స్థానముకంటే గొప్పదియగు తీర్థము॥ ఇదివరకు లేదు॥ ఇక ముందుండదు॥ ఇచట ఉపవసించి విమలేశ్వరుని దర్శించి నవారు నప్త జన్మకృతమగు పాపములనుండి ముక్తులయి శివస్థానము చేరి సుఖింతురు॥
తతో గచ్చేత్తు రాజేంద్ర కౌశికీతీర్థ ముత్తమమ్ ।
తత్ర స్నా త్వా నరో రాజ న్ను పవాస పరాయణః॥
ఉపోష్య రజనీ మేకాం నియతో నియతాశనః ।
తీర్థస్యాస్య ప్రభావేన ముచ్యతే బ్రహ్మహత్యయా॥
సర్వతీర్థాభి షేకం చ యః పశ్యే త్సాగరేశ్వరమ్ ।
యేజనాభ్యన్తరే తిష్ఠ న్నొ వర్డీ సంస్థిత శ్శివః॥
తం దృష్ట్వా సర్వతీర్థాని దృష్టాని తు స సంశయః ।
సర్వపాపవినిర్ముక్తో యత్ర రుద్ర స్స గచ్ఛతి॥
నర్మదాసజ్జమం యావ ద్యావచ్చామరకల్టకమ్ ।
తత్రాన్తరే మహారాజ తీర్థ కోట్యో దశ స్స్మృతాః॥
తీర్థా తీర్జానరే తత ఋషికోటిభి రన్వితే ।
సాగ్నిహోత్రాశ్చ విద్వాంస స్సర్వే ధ్యానపరాయణాః॥
సేవ నే నర్మదాం రాజనీప్సితార్థ ప్రదాయినీమ్ ।
య స్వీదం పఠతే నిత్యం శృణుయాద్వాపి భావతః॥
తస్య తీర్థాని సర్వాణి హ్యభిషి ఇచ్చి ని పాణవ ।
నర్మదా చ సదా ప్రీతా భవేత్తస్య న సంశయః॥
తస్య ప్రీతో భవే ద్రుద్రో మార్కణేయో మహామునిః ।
వన్ద్యాచ లభతే పుత్రం దుర్బగా సుభగా భవేత్॥
భర్తారం లభతే కన్యా యశ్చ య ద్వాళ్ఛతే ఫలమ్ ।
తదేవ లభలే సర్వం నాత్ర కార్యా విచారణా॥
బ్రాహ్మణో వేద మాప్నోతి క్షత్రియో విజయీ భవేత్ ।
వైశ్యస్తు లభతే లాభం శూద్రః ప్రాప్నోతి సద్గతిమ్॥
మూర్ఖస్తు లభతే విద్యాం త్రిసన్యం యః పఠేన్నరః ।
నరకంతు న పశ్యేత్తు వియోనిం నైవ గచ్చతి॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే మార్కణ్డేయ యుధిష్ఠిరసంవాదే నర్మదామహిమానువర్ణనం నామ త్రినవత్యుత్తర శతత మోధ్యాయః॥
తరువాత కౌశికీ తీర్థము॥ ఇది ఉత్తమము॥ ఇందు స్నానమాడి శ్రద్ధతో ఒక ఆహోరాత్రము ఉపవసించి నియమపరుడే ఆహార నియమము పాటించినచో ఈ తీర్థ ప్రభావమున బ్రహ్మహత్యాదోష మోచనమగును॥ ఇచట సర్వ తీర్థ స్నానము చేసిన పుణ్యఫలమునిచ్చు సాగ రేశ్వర తీర్థము కలదు॥ ఇచట సాగరేశ్వరుడను శివుడు ఉన్నాడు॥ ఈ శివుడు సముద్రమునుండి యోజనము లోపలగా సముద్ర జలపు సుడుల నడుమనున్నాడు॥ ఆ తీర్థ మును అందలి విమలేశ్వరుని దర్శించినచో సర్వ తీర్థ దర్శనము చేసినట్లే యగును॥ తత్ఫలముగా నర్వపాప ముక్తియగును॥ రుద్రత్వము ప్రాప్తించును॥
నర్మదా తీర్థ మాహాత్మ్య ఫలశ్రుతి॥
నర్మదా నదికి ఆది స్థానమందున్న ఆమరకంటక పర్వత ప్రాంతము మొదలుకొని నర్మదా సాగర సంగమము నకు నడుమ పది కోట్ల తీర్థములున్న వి॥ తీర్థమునకును తీర్థమునకును నడుమ కోట్లకొలది ఋషులును ఉన్నారు॥ వారందరును అగ్నిహోత్రపరులు॥ ధ్యానపరాయణులు॥ విద్వాంసులు॥ వీరందరును అట ఉండుచు ఈప్సిత ఫలప్రదాత్రి యగు నర్మదను సేవించుచుందురు॥ ఈ నర్మదా తీర్గ మాహాత్మ్యమును ఎవరు శ్రద్దా భావముతో విందులో పఠింతురో అతనిని ఈ సమస్త తీర్థములును తమయందలి జలముతో అభి షేకించును॥ అన్ని తీర్థములయందు స్నానమాడినంత పుణ్యము లభించును॥ అత నియందు నర్మదకు ప్రీతి కలుగుట నిన్సంశయము॥ రుద్రుడును మార్కండేయుడును అతని పై ప్రీతులగుదురు॥ ఇది వినుటచే చదువుట చే గొడ్రాలికిని సంతతి కలుగును॥ దుర్బగ (మగని ప్రీతికి నోచు కొనని శ్రీ) కూడ సుభగ (భర్తకు ప్రీతిపాత్రము) అగును॥ కన్యకు తగిన భర్తతో త్వరగ, పెండ్లియగును॥ కోరిన కోరికలన్నియు తీరును॥ ఇందు సంశయము లేదు॥ బ్రాహ్మణునకు వేదార్ధ జ్ఞానసిద్దియు క్షత్రియునకు విజయమును వైశ్యునకు ధనలాభమును శూద్రునకు సద్దతియు లభించును॥ దీనిని మూడు సంధ్యలయందును పఠించుచుండినచో మూర్బుడును విద్యావంతుడుఅగును॥ నరకమునకు పోవరు॥ హీన నానులందు జన్మించరు॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున మార్కండేయ యుధిష్ఠిర సంవాదరూపమగు నర్మదా మాహాత్మ్య వర్ణనమను నూట తొంబది మూడవ అధ్యాయము॥
Summary of chapter 193 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya concludes the systematic enumeration of the four hundred plus sanctified Tīrthas lining the banks of river Narmadā. Bhagavān Matsya asserts that the entire Narmadā valley is a permanent spiritual sanctuary where Devas, Rishis, and Gandharvas constantly reside in subtle forms, making it an ideal realm for yoga, meditation, and ancestral rites.