మత్స్య మహా పురాణము
73 - శుక్రగురు పూజా విధానము
పిప్పలాదః : అథాత శ్శృణు భూపాల ప్రతిశుక్ర ప్రశా స్తయే ।
యాత్రారంభేఽవసానే చ తథా శుక్రోదయే ష్విహ॥
రాజతే వాపి సౌవర్ణే కాంస్యపాత్రేఽథవా పునః ।
శుక్లపుష్పామ్బరయుతే సితతణ్డులపూరితే॥
విధాయ రాజతం శుక్రం శుచిముక్తాఫలాన్వితమ్ ।
మ న్త్రేణానేన తత్సర్వం సామగాయ నివేదయేత్॥
నమస్తే సర్వలోకేశ నమస్తే భృగునన్దన ।
కవే సర్వార్థసిద్ధ్యర్థం గృహాణార్ఘ్యం నమోస్తుతే॥
ఏవ మస్యోదయే కుర్యా ద్యాత్రాదిషుచ భారత ।
సర్వకామా నవాప్నోతి విష్ణులో కే మహీయతే॥
యావ చ్ఛుక్రస్య న కృతా పూజా సోమాలికై శ్శుభై ।
వటు కై: పూరికాభిశ్చ అపూవై శ్చణకై రపి॥
తావ న్న వాన్నం నాశ్నీ యా త్స్రిభిః కామార్థసిద్ధయే।
తద్వ ద్వాచస్పతేః పూజాం ప్రవక్ష్యామి యుధిష్ఠిర॥
సువర్ణపాత్రే సౌవర్ణ మమ దేశ పురోహితమ్ ।
పీతవస్త్రామ్బరయుతం కృత్వా స్నానం సుసర్ష వైః॥
పలాశాశ్వత్థభజ్గేన వఞ్చగవ్యజలేన చ ।
పీతామ్బరాజ్గవసనో మృతహోమంతు కారయేత్॥
ప్రణమ్యచ గవా సార్ధం బ్రాహ్మణాయ నివేదయేత్ ।
నమస్తే వచసాం నాధ వాక్పతేఽథ బృహస్పతే॥
క్రూరగ్రహైః పీడితానా మవనాయ నమో నమః।
సజ్కృన్తా వస్య కౌన్తేయ యాత్రా స్వభ్యుదయేషు చ॥
కుర్వ న్బృహస్పతేః పూజాం సర్వా నామా నమశ్నుతే॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే పిప్పలాదయుధిష్ఠిరసంవాదే శుక్రగురుపూజావిధి రామ త్రిసప్తతిత మోఽధ్యాయః॥
పిప్పలాదుడు యుధిష్ఠిరునితో ఇట్లు చెప్పెను: భూపాలా! ఇక ఇప్పుడు యాత్రారంభావసానములందు ప్రతి శుక్ర (చుక్క ఎదురు) (దోష) ప్రశాంతి కై శుక్రోదయ సమయమందు చేయవలసినది చెప్పెదను. బంగారుతో కాని వెండితో కాని కంచుతో కాని చేసిన పాత్రప ఖైర)మందు తెల్లని వస్త్రము పరచి తెల్లని బియ్యము నింపి శుకుని రజత ప్రతిమను పులు కడిగిన ముత్తెములను దానియందుంచి ఈ అర్థము నిచ్చు మంత్రముతో అవి అన్నియు సామవేదియగు బ్రాహ్మణు నకు దానమీయవలెను. “సర్వలోకేశా! భృగునందనా! కవీ! నీకు నమస్కారము. అర్ఘ్య మందుకొని మ"కు సర్వార్థసిద్ధి కలిగించుము.” ఇట్లు చేసినచో అన్ని కోరికలును( ఇహమున)తీరి విష్ణులోకమున పూజితు డై సుఖించును.
ఇట్లు సోమాలికములు వటుకములు పూరికలు అపూపములు శనగలు వీనితో శుక్రుని పూజించు నంతవరకును ఇంటిలో స్త్రీలును క్రొత్త పంట ధాన్యపు అన్న మును తినరాదు. ఇట్లు నియమమును పాటించినచో సర్వార్థసిద్ధి కలుగును.
యుధిష్ఠిరా! ఇట్టిదే బృహస్పతి పూజయు కలదు. అది చేప్పెదను. బంగారు పాత్రపళ్లైర మందు గురుని స్వర్ణ ప్రతిమను పచ్చని పట్టు వస్త్రము చుట్టి నిలుపవలెను. యజమానుడు ఆవలతో (ఆవపిండి. ఆవనూనెలతో) మోదుగ-రావి. చిగుళ్ల ముక్కలతో కూడిన పంచగవ్య మిశ్రితజలముతో స్నాన మాడి పీతాంబరములు ధరించి నేతితో (బృహస్పతి నుద్దే శించి)హోమము చేయవలెను. బ్రాహ్మణునికి నమస్కరించి గోవును ఈ చేప్పిన సామగ్రిని దాన మీయవలెను. (మంత్రా ర్థము)-“వచస్సులకు నాధా! వాక్పతీ! బృహస్పతీ! క్రూరగ్రహపీడితులను రక్షించువాడా! నమస్కారము.”
సంక్రాంతి బృహస్పతికాని రవికాని రాశియందు ప్రవేశించు) .. సమయమందును యాత్రాకాలమునందును ఆభ్యుదయ (శుభ కర్మారంభములందును బృహస్పతి పూజ చేయు వారికి సర్వకామములును సిద్ధించును. (యాత్ర రాజులు యుద్దముల కై కాని రాచరికపు పనుల కై కాని బయలుదేరుట; లేదా స్త్రీలు పుట్టి నింటికో ఆ త్తవారి ఇంటికో బయలుదేరుట; లేదా వ్యాపారమునకో వ్యవహార మునకో తీర్థ క్షేత్రాది సేవకో బయలుదేరుట)
ఇది శ్రీమత్స్య మహాపురాణమున శుక్రగురు పూజా విధానమును డెబ్బది మూడవ అధ్యాయము.
Summary of chapter 73 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the specialized ritual procedures for Bṛhaspati-Śukra-Shānti, designed to pacify and gain the benevolent blessings of the two great planetary preceptors, Bṛhaspati and Śukra. The Lord explains that when these planets occupy unfavorable astrological positions, human beings experience loss of wisdom, academic failure, financial loss, and marital conflict. The practitioner constructs a consecrated altar, fashioning a golden image of Bṛhaspati and a silver image of Śukra, and worships them with yellow and white flowers, turmeric, white sandalwood, yellow garments, and specific grain offerings into the sacred fire. The ritual concludes with gifting yellow cloth, gold, and topaz for Bṛhaspati, and white cloth, silver, and diamonds for Śukra to learned Vedic scholars, restoring wisdom, wealth, and domestic harmony.