మత్స్య మహా పురాణము
186 - జ్వాలేశ్వ తీర్థ మహిమాను వర్ణనము - బాణాసుర త్రిపుర దాహకథ॥
మార్కణ్డేయః : నర్మదాతు నదీశ్రేష్టా పుణ్యాత్పుణ్యతమా హితా ।
మునిభిస్తు మహా భాగై ర్విభక్తా ధర్మకాజ్క్షిభిః॥
యజ్ఞోపవీతమాత్రాణి ప్రవిభక్తాని పాణ్డవ ।
తేషు స్నా త్వా తు రాజేంద్ర సర్వపాపైః ప్రముచ్యతే॥
జ్వాలేశ్వరం పరం తీర్థం త్రిషు లో కేషు విశ్రుతమ్ ।
తస్యోత్పత్తిం కథయత శ్శృణు పాజ్ఞవనన్దన॥
పురా మునిగణా స్సర్వే సేంద్రాశ్చైవ మరుద్గణాః ।
స్తువనిస్మ మహాత్మానం దేవదేవం మహేశ్వరమ్॥
స్తూయమానస్తు తైఃప్రాప్త స్తత్ర దేవో మహేశ్వరః ।
విజ్ఞాపయ ని దేవేశం సేన్దాస్తే సమరుద్గణాః॥
భయోద్విగ్నా విరూపాక్షః పరిత్రాయస్వ నఃప్రభో ।
ఈశ్వరః : స్వాగతంతు ముని, శేష్టాః కిమర్ల మిహ చాగతాః॥
కిం దుఃఖం కోఒత్ర సస్తాపః కుతోనో భయమాగతమ్
కథయధ్వం మహాభాగా ఏతమి(ది) చ్చామి వేదితుమ్॥
ఏవ ముక్తాస్తు రుద్రేణ ప్రోచు స్తే శంసితవ్రతాః ।
ఋషయః : అతి మోరో మహాధీరో దానవో బలదర్పిత॥
బాణో నామేతి విఖ్యాతో యస్యైత త్రిపురం పురమ్ ।
గగనే సతతం దివ్యం భర్గమతే తస్య తేజసా॥
తతో భీతా విరూపాక్ష త్వామేవ శరణం గతాః ।
త్రైయస్వ మహతో దుఃఖా త్వం హి నః పరమా గతిః॥
ఏవం ప్రసాదం దేవేశ సర్వేషాం కర్తుమర్హసి ।
యేన దేవా స్వగన్దరా స్సుఖ మేధ స్త్రీ శక్కర॥
పరాం నిర్వృతి మాయా ని తత్ర్పభో కర్తుమర్హసి ।
దేవదేవః : ఏతత్సర్వం కరిష్యామి మా విషాదం గమిష్యథ॥
ఆచి రేణైవ కాలేన కుర్యాం యుష్మత్సుఖావహమ్ ।
మార్కండేయు డిట్లనెను: పాండవా? నదీ శేష్టయు నర్మద పుణ్యమగు వానిలో పుణ్యతమమయినది; దానిని ధర్మకాంక్షులు మహాభాగులునగు మునులు యజ్ఞోపవీతములంత నన్న ని ప్రవాహములుగాను తీర్థములుగాను విభజించిరి॥ వాటియందు స్నానమొనర్చినవారు సర్వపాపముక్తులగుదురు॥ జ్వాలేశ్వరము త్రిలోక విశ్రుతమగు పరమ తీర్థ ము; దాని యుత్ప త్తిని తెలి పెదను వినుము; పూర్వము సర్వమునులును ఇంద్రాది మరుత్ (దేవగణములును మహాత్ముడు దేవదేవుడు॥ నగు మహేశ్వరుని స్తుతింపసాగిరి॥ వారుస్తుతించునంతలో మహేశ్వర దేవుడటకు వచ్చెను॥ ఇంద్రాది దేవతలు భయో ద్వేగము లతో దేవేశుడగు విరూపాక్షునకు ప్రభూ! మమ్ముల రక్షించుమని మనవిచేసిరి॥ ఈశ్వరుడు వారితో “ముని, శేషు లారా! మీకు స్వాగతము॥ మీరేల ఇటకు వచ్చితిరి? దుఃఖమేమి? సంతాపమేమి? దేనివలన మీకు భయమగుచున్నది? మహాభాగులారా! నేనది తెలియగోరుచున్నాను; చెప్పుడు;” అనగా రుద్రవచనమునువీని ప్రశ స్తనియమవంతులగు ఆమునులు ఇట్లనిరి: అతి ఘోరుడు మహాధీరుడు బలదర్పితుడునగు బాణుడను దానవుడు వీఖ్యాతుడు కలడు; త్రిపుర మును ఈ పురము పోనిది; ఇది వానీ తేజము చే నతతము గగనమున తిరుగుచుండును; వానివలన నుండి భయపడి విరూపాక్షి! నిన్ను శరణం దితిమి; మాకు పరమగతివి నీవే కావున మమ్మీ మహాదుఃఖమునుండి రక్షించుము; ఈ విధముగానే దేవేశా! నీవందరను అనుగ్రహింప వేడుచున్నా ము; దేనిచే దేవతలును గంధర్వులును సుఖముగ వర్ధిల్లుదురోశంకరా! ప్రభూ! పరమ సుఖ మందుదురో అట్టి అనుగ్రహమును తాము చూపవలయును;” అనెను
మార్కణ్డేయః - ఆశ్వాసయిత్వా తా నర్వా న్నర్మదాతట మాశ్రితః
చిన్తయామాస దేవేశ సద్వధం ప్రతి పాణ్డవ ।
అథ కేన ప్రకారేణ హస్తవ్య స్త్రీపురో మయా
సస్మార నారదం దేవో బ్రహ్మర్షం వృషభధ్వజః ।
స్మృతమాత్ర స్సమాగమ్య ప్రోవాచ ప్రణతో మునిః॥
నారదః : ఆజ్ఞాపయ మహాదేవ కీమర్థం సంస్మృతో హ్యహమ్ ।
కిం కార్యం తు మహాదేవ కర్తవ్యం కథయస్వమే॥
ఈశ్వరః : గచ్ఛ నారద తతైవ యత్ర తత్తేపురం మహత్ ।
బాణస్య దానవేన్హస్య శీఘ్రం గత్వా చ తత్కురు॥
తా భర్తృదేవతా స్తత్ర శ్రియ శ్చాప్సరసాం సమాః ।
తాసాం వై తేజసా విప్ర భ్రమతే త్రిపురం దివి॥
తత్ర గత్వాతు విపేన్ద మతిమన్యాం ప్రబోధయ ।
దేవస్య వచనం శ్రుత్వా ముని స్వరితవిక్రమః॥
స్త్రీణాం హృదయనాశాయ చలిత సత్పురం ప్రతి ।
శోభతే తత్పురం దివ్యం నానారత్నోపశోభితమ్॥
శతయోజనవి సీర్ణం తతో ద్విగుణ మాయతమ్ ।
తతో ఒపశ్యద్దీ తత్రోవ బాణంతు బలదర్పితమ్॥
మణికుణ్ణల కేయూరముకు దేన విరాజితమ్ ।
హేమహార శతై రత్నై శ్చంద్రకాంతై ర్విభూషితమ్॥
రళ నా తస్య రత్నాథ్యా బాహూ కనక మట్టితో ।
చన్డకా న మహావజమణి విద్రుమభూషితే॥
ద్వాదశారద్యుతినిఖీ నివిష్టం పరమాననే ।
ఉత్తితో నారదం దృష్ట్వా దానవేంద్రో మహాబలః॥
బాణః : దేవన్డే త్వం స్వయం ప్రాప్తో అర్ఘ్యం పాద్యం నివేదయే ।
సోభివన్ద్య యథాన్యాయం క్రియతాం కిం ద్విజోత్తమ॥
చిరా త్వ మాగతో విప్ర స్త్రీయతా మిద మాసనమ్ ।
ఏవం సమ్బాషయిత్వాతు నారదం ఋషిసత్తమమ్॥
తస్య భార్యా మహాదేవీ హ్యసౌమ్యాతు నామతః ।
అనౌపమ్యా : భగవ నేన ధర్మేణ దేవా స్తుష్యంతి నారద॥
వ్రతేన నియమేనాపి దానేన తపసాపి వా ।
ధర్మజా! ఇట్లు వారినందర॥ నోదార్చి దేవేశుడు నర్మదాతీరమందు కూర్చుండి పొనిని పోని త్రిపురములను నేను ఎట్లువధించి నశింపజేయవలయు నాయని ఉపాయమాలోచించెను॥ అంత వృషభధ్వజూడగు మహాదేవుడు బ్రహ్మర్షియగు నారదుని స్మరించెను॥ స్మరించినంతటనే వచ్చి ఆముని ప్రణతుడై “మహాదేవా! ఆజ్ఞనిమ్ము; నన్నేల స్మరించితీరి? మహ్మాదేవా! నేజేయవలసిన పనిఏమి? నాకు సెలవిండు॥” అనెను॥ ఈశ్వరుడిట్లనెను: నారదా! నీవీ మహాత్రిపురములున్న చోటికి పొమ్ము ॥ దానవేంద్రుడగు బాణుని ఈ పురములకు పోయినే జెప్పినట్లు చేయుము; అందలి స్త్రీలందరు పతిని దేవతగా భావించు ఉత్తమలును సౌందర్యము నందప్సరసలవంటివారును; :రి తేజముననే త్రిపుర ము గగనమున తిరుగుచున్నది; విపేంద్రా! నీవటకుపోయి వారికి మతిభేదమును ప్రబోధించుము; అనగా వినినారదుడు ఆచటి స్త్రీలకు బుద్ధి భ్రంశము కలిగించుట కై బయలుదేరి - త్వరితగతితో ఆపురమునకు పోయెను; ఆ దివ్యపురము నానా రత్నములతో శోభిల్లుచుండెను॥ నూరు యోజనముల వెడల్పు రెండువందల యోజనముల పొడవుతో నుండెను॥ అంతట అతనికచట బలదర్పీతుడగు బాణుడు కనబడెను॥ వాడు॥ మణి కుండలములతో భుజకీర్తులతో కిరీటముతో వందలకొలది బంగరు హారములతో చంద్రుని మనోహరములగు రత్నములతో రత్న సమృద్ధిగల మొలనూలితో కనకాభరథములుగల బాహువులతో ప్రకాశించు చుండెను॥ చంద్రకాంతములతో మహావజ్రములతో మణులతో పగడములతో అలంకృతమయి పండ్రెండుగురు ఆదిత్యు లతో సమమయి వెలుగు ఉత్తమాసనమునవాడు కూర్చుండియుండెను॥ మహాబలుడగు ఆదానవేంద్రుడు నారదుని చూచిలేచి దేవరీ! నీవు స్వయముగా వచ్చితివి; అర్య పాద్యముల నమర్పింతును; అనుచు ఆవి ఆర్పించేను॥ శాస్త్ర న్యాయానుసారము అభివందనము చేసేను॥ ద్విజోత్తమా! నేనేమి చేయవలయును? చాల కాలమునకు వచ్చితిరి; విప్రాః కూర్చుండుడు; ఇదిగో ఆననము;” అని ఇట్లు పలుకరించెను; తరువాత ఋషి సత్తముడగు నారదునితో అతని భార్యయును మహాదేవియు (పట్టపురాణి) ఆగు ' అనౌపమ్య' ఆనునా మె॥ “నారదా! ఏ ధర్మముచే వ్రతముచే నియమము చే దానముచే తవముచే దేవతలు నంతుష్టులగుదురు?” ఆని యడిగెను॥
అనౌపమ్యాయై నారదోక్తదానవి శేషాః - నారదుడు అనౌపమ్యకు దాన విశేషములు తెలుపుట॥
నారదః : తిలధేనుం చ యో దద్యా ద్భ్రాహ్మణే వేదపారగే॥
ససాగర వనద్వీపా దత్తా భవతి మేదినీ ।
సూర్య కోటిప్రతీకా శై రీమానై స్సర్వకామికై:
మోదతే సుచిరం కాల మక్షయం కృత శాసనమ్ ।
ఆమామలకపిత్థాని బదరాణి తథైవచ॥
కదమ్బచమ్పకాశోకా ననేక వివిధద్రుమాక్ ।
అశ్వత్థపిప్పలం చైవ కదళీవటదాడిమా॥
పిచుమనం మధూకంచ ఉపోష్య స్త్రీ దదాతి యా ।
స్తనౌ కపిత్తసదృశా వూరూచ కదళీసమౌ॥
అశ్వత్థ వన్షనీయాచ పిచుమన్డే సుగన్దినీ ।
చమ్ప కే చమ్పకాభా స్యా దశోకే శోకవర్జితా॥
మధూ కే మధురం వక్తి వలేచ మృదుగాత్రికా ।
బదరీ సర్వదా స్త్రీణాం మహాసౌభాగ్యదాయినీ॥
కుక్కుటీ కర్కటీచైవ ద్రవ్యషషీ నశస్యతే ।
కదమ్బమిశ్రకనకమజ్జరీపూజనం తథా॥
అనగ్నిపక్వాశనంచ నాళి కేరస్య భక్షణమ్ ।
ఫలానాంచ పరిత్యాగ స్సన్ద్యామౌనం తథైవచ॥
ప్రథమం క్షేత్రపాలస్య పూజా కార్యా ప్రయత్నతః ।
తస్యా భవతి వై భర్తా ముఖపేక్ష స్సదాన ఘో॥
అష్టమీచ చతుర్జీచ పళ్చామీ ద్వాదశీ తథా ।
సజాస్తి ర్విషువచ్చైవ దినచ్ఛిద్రముఖం తథా॥
ఏతాంస్తు దివసా ఛివ్యానుపవస ని యా యః ।
తాసాంతు ధర్మయుక్తానాం స్వర్గవాసో న సంశయః॥
కలికాలుష్యనిర్ముక్తా స్సర్వపాపవివర్జితాః ।
ఉపవాసర తాం నారీం నోపసర్పతి తాం యమః॥
అనౌపమ్యా : అస్మి నృతేన పుణ్యేన పురా జన్మకృతేన వా !
భవదాగమనం జాతం కిడ్చో తృచ్చా మ్యహం మునే॥
అ స్తి విన్ద్యావళిర్నామ బలిపత్నీ యశస్వినీ ।
శ్వశ్రూ ర్మమాపి వి పేస్ట్రో న తుష్యతి కదాచన॥
శ్వశురో మే సర్వకాలం దృష్ట్వా చాపి న తుష్యతి ।
ఆ స్త్రీ కుమ్భిననీ నామ ననాన్గా పాపకారిణీ॥
దృష్ట్వా చై వాజుళీభజం సదాకాలం కరోతి మే ।
దివ్యనతు పథాయాతి మమసౌఖ్యం కథం వద॥
ఊషరే న ప్రరోహ ని బీజాంకూరాఃక థంచన ।
యేన వ్రతేన చీర్ణేన భవంతి పశగా మమ॥
తద్వ్రతం బ్రూహి విప్రేంద్ర దాసభావం ప్రజామి తే ।
నారదుడు అనౌపమ్యకు ఇట్లు చేప్పెను: వేద పారంగతుడగు విప్రునకు తిలధేను దానము (ఇది లోగడ చెప్పబడినది) చేసినచో సముద్రవన ద్వీప సహితముగా భూమినంతను దానమిచ్చినట్లగును; దీని దాతలు తమ శాసనము అందర పై చెల్లుచుండ కోటి సూర్య సమతేజము గలిగి అన్ని కోరికలను తీర్చు విమానములపయి సంచరించుచు అతి చీర కాలము ఆనందింతురు॥ తీయమామిడి ఉసిరిగ వెలగ రేగు కదంబము సం పెంగ ఆశోకము పున్నాగము పిప్పలము ఆరటి మర్రి దానిమ్మ పిచుమందము ఇప్ప మొదలగు వృక్షములను - ఉపవాస పూర్వకముగా దానమీయవలయును॥ వెలగ (దానము)చే వెలగ పండ్లవంటి స్తనములు ఆరటిచే అరటికంబములవంటి తోడలు కలుగును; దానిచే ఆందర వంద నము లందుకొనును॥ పిచుమందవృక్షముచే సుగంధి దేహము సంపెంగచే ఆ పూవువంటి చాయ అశోకముచే శోక రాహిత్యము ఇప్పచే తీయని మాటలు మరిచే మృదు శరీరము రేగుచే స్త్రీలకు సౌభాగ్యము సిద్ధించును; కుక్కుటియు కర్కటి దోస)యు దానయోగ్యములే; ద్రవ్య షష్టి ? ప్రశ స్తముకాదు; (దానవ్రత సందర్భములో) కడిమి పూలతో కలిపిన ఉమ్మెత్త పూలతో వూజ చేయవలయును; అగ్ని యందు పక్వము కాని యాహారమును కొబ్బరికాయను తినవలయును, ఇతర ఫలములు తినక విడువవలయును; సంధ్యా సమయములందు మౌనముతో నుండవలయును; అందును మొదట యథాశక్తిగా క్షేత్ర పాలుని పూజించవలయును; ఇట్లు జరిపిన స్త్రీకి భర్తవశుడై సదా ఆమె ఆజ్ఞకే ఆమె మొగమువై పు చూచుచుండును; అష్టమి చతుర్థి పంచమి ద్వాదశి సంక్రాంతి (రవిరాశి ప్రవేశ దినము) విషువత్ (రాత్రింబవళ్ళు సమాన పరిమాణముతో నుండు దినము) ఛిద్ర తిథుల (ఆష్టమి-ద్వాదశి-షష్ఠి-చతుర్ధి-చతుర్థశి) ఆరంభకాలము॥ ఇవి దివ్యదినములు; దీనియందువవ సించి ధర్మము నాచరించు స్త్రీకి నిస్సంశయముగా స్వర్గవానము లభించును; ఇట్టి స్త్రీలు కలిదోష॥ ము కల నర్వపాప రహితలగుదురు; ఇట్లు ఉపవాసములయందాన క్తిగల స్త్రీదగ్గరకు యముడు రానై న రాజాలడు; అని నారదుడు అనౌ పమ్యతో చెప్పెను॥
అది విని ఆమే యతనినిట్లడిగెను॥ విపేంద్రా ! నారదమునీ! నేను ఈ జన్మమందును పూర్వజన్మమందును చేసిన పుణ్యఫలముగా మీరు ఇటకు వచ్చితిరి; చిన్న మాట అడుగుచున్నాను; బలిచక్రవర్తికి పత్నియు కీ - శాలినియు ఆగు వింధ్యా వళి యున్న దిక దా! ఆమె మాయ త్తగారు; ఆమెకు నా విషయము సంతోష మేలేదు; మా మామగారును నన్నెప్పుడును చూచుచు (నాగుణము లెరిగి) ఉండియు నాయందు సంతుష్టుడు/ కాడు; కుంభీనసియను నా ఆడుబిడ్డ యున్నది; ఆమె చేయునవన్నియు పాపపు పనులే; నేను కనబడిన చాలు॥ నిరతము ఆమె మెటికలు విర చుచుండును? (ఇవి తొలగిస్తే దివ్య మార్గమున నాకు సౌఖ్యము లభించు ఉపాయము తెలుపుము; చవుటి పర్రలో విత్తనములు ఎట్లును ఎన్న డును మొలకెత్తవు గదా! నేను మీకు దాస్యమయిన చేయుదును; ఏవ్రతమాచరించినచో వీరందరు నా వశవర్తులగుదురో విపేంద్రా! నాకు ఆ వ్రతము తెలుపుము; అనెను॥
నారదః : యదేత త్తే మయా పూర్వం వ్రతము క్తం శుభాననే॥
అనేన పార్వతీ దేవీ చీర్ణేన వరవర్ణిని ।
శజ్కరస్య శరీరస్థా విష్ణోర్లక్ష్మీ స్తథై వచ॥
సావిత్రీ బ్రహ్మణశ్చాపి వసిష్ఠస్యాప్యరుందతీ ।
ఏతేనోపోషితేనేహ భర్త స్థాస్యతి తే వశే॥
శ్వగ్రూశ్వశుర శ్చైవ ముఖబందో భవిష్యతి ।
ఏవం శ్రుత్వాతు సుశ్రోణి యథేష్టం కర్తుమర సి॥
నారదస్య వచశ్శత్వా రాజ్జీ వచన మబ్రవీత్ ।
ప్రసాదం కురు ఏ పేన్త దానం గ్రాహ్యం యథేప్సితమ్॥
సువర్ణమణిరత్నా ని వస్త్రాణ్యాభరణాని చ ।
తవ దాస్యామ్యహం విప్ర యచ్చాన్యదపి దుర్లభమ్॥
ప్రగృహాణ ద్విజ శేష ప్రీయేతాం హరీశ జ్కరౌ ।
నారదః అన్య స్మై దీయతాం భధ్ర క్షీణవృత్తిస్తు యే ద్విజః॥
అహం సర్వత సమ్పన్నో మద్భక్తిః క్రియతామితి ।
మార్కణ్డేయః : ఏవం తాసాం మనో హృత్వా సర్వాసాంతు పతివ్రతాత్॥
జగామ భరతశ్రేష్ట స్వకీయం స్థానకం పునః ।
తతో హ్యహృష్టహృదయా అన్యతోగతమానసాః॥
పురే ఛిద్రం సముత్పన్నం బాణస్యతు మహాత్మనః॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే నర్మదామాహాత్మ్యే జ్వాలేశ్వర తీర్థమహిమానువర్ణనే నారదస్య బాణపురప్రవేశకథనం నామ షడశీత్యుత్తర శతత మోధ్యాయః॥
నారదుడు అనౌపమ్యతో ఇట్లు పలికేను : శుభాననా! నేను ఇంతవరకును నీకు చెప్పిన వ్రతము ఏది కలదో దానిని పార్వతి యాచరించి ఓవర వర్షినీ! శంకరుని అర్ధ శ రీరమందుండగలిగేను॥ లక్ష్మి విష్ణుని శరీరమందును సావిత్రి బ్రహ్మ శ రీరమందును ఆరుంధతి వసిష్ట శరీరమందును ఉండగలిగిరి; ఈ ఉపవాసవ్రత ఫలముగా నీభర్త నీవశ మందుండును; నీ య త్తమామల నోళ్ళు మూతపడును; నేను చెప్పినదిది వింటివికదా! ఇక నీకు తోచినట్లు చేయుము; అనగా నారదుని వచనమును విని రాణి ఇట్లు పలికెను; విపేంద్రా! నాయందనుగ్రహము చూపుము; నీకిష్టమయినన్నీ దానములు స్వీకరింపుము; విప్రాః బం గారము మణులు రత్నములు వస్త్రములు ఆభరణములు-ఇవియే కాదు-ఇంకను దుర్లభమగునవి ఏవియున్న ను అవన్ని యు నీకిత్తును; ద్విజ శేష్టా! హరి శంకరులు ప్రీతినందునట్లు అవి గ్రహించుము॥ ఆన నారదుడిట్లనెను: శుభరూపా! జీవనాధార ములేని మరెవరికై న విప్రునకుఇమ్ము; ఆన్ని విషయములందును నంపన్ను డను; నాయందుభ క్తిమాత్రము చూపుము; అని ఇట్లు నారదుడు పతివ్రత మునుండి వారందర మసస్సులను హరించి పెడతోవ పట్టించి భరత శ్రేష్ఠా! ధర్మజా! మరల తన స్థానమునకు పోయెను; తరువాత నుండి ఆత్రిపుర స్త్రీలు హర్షము లేని (అసంతృప్త) హృదయములతో కూడినవారును మరి ఇతరములందు వ్యా ప్రములగు మనస్సులుగల వారును యిరి॥ దానిచే మహాత్ముడగు ఆ బాణాసురుని త్రిపుర మునందు ఛిద్రములు (లోపములు) ఏర్పడేను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున జ్వాలేశ్వర మాహాత్మ్యమున నారదుడు బాణపుర స్త్రీల మనస్సులు విరచుటయను నూట ఎనుబది యారవ అధ్యాయము॥
Summary of chapter 186 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya begins the sacred chronicle of Narmadā-māhātmya, proclaiming that while the river Gaṅgā purifies bathers upon contact and Yamunā purifies upon drinking, the sacred river Narmadā purifies a living entity by her mere sight. Bhagavān Matsya describes how Narmadā was manifested directly from the intense ascetic penance of Mahādeva on the Riksha mountain, establishing her as an eternal, holy river capable of granting both material prosperity and ultimate liberation.