208 - సత్యవంతుడు సావిత్రికి వన సౌందర్యము వర్ణించి చెప్పుట.

సత్యవా : వనేస్మి నక్షిభిః కీర్ణం సహకారం మనోహరమ్

నేత్రఘాణసుఖం పశ్య వసంతే రతివర్ధనమ్

 వనే ఒప్యశోకం దృష్వైనం రాగవ నం సుపుష్పితమ్

వసన్తో హసతీ గాయం మామేవాయతలోచనే

 దక్షిణే దక్షిణే తేషాం పశ్య రమ్యాం వనస్థలీమ్

 పుష్పితే కింశుకై ర్యుక్తాం జ్వలితానలస ప్రభై

 సుగన్ది కుసుమా మోదో వనరాజివినిర్గతః

 కరోతి వాయు ర్దాక్షిణ్య మావయోః క్లమనాశ నమ్

 పశ్చిమేన విశాలాక్షీ కర్ణికారై సుపుష్పితైః

కాజ్చానేన విభాత్యేషా వనరాజీ మనోహరా

అతిముక్తలతాజాలరుద్ధమార్గా వనస్థలి

రమ్యా సా చారుసర్వాజీ కుసు మోత్కర భూషణా

మధుమత్తాళిరజారవ్యా జేన వర వర్ణిని

 చాపాకృష్టిం కరోతీవ కామః పార్శ్వే జిహంసయా

ఫలాస్వాదలసద్వ పుం స్కోకిలనినాదితా

విభాతి చారుతిలకా త్వమివై షా వనస్థలి

కోకిల శ్చూత శిఖర మజ్జరీ రేణుపిజ్జార

 గదితై ర్వ్య క్షతాం యాతి కులీన శ్చేష్టితై రివ

పుష్పరేణువిలిప్తాజ్గీం ప్రియా మనుసర న్వనే

కుసుమం కుసుమం యాతి కూజ నామీ శిలీముఖః

మఞ్జరీం సహకారస్య కాన్తచంచ్వగ్రపీడితామ్

 స్వదతే బహుపుష్పేపి పుంస్కోకిలయువా ద్రుమే

            సత్యవంతుడు ఇట్లు పలికెను: ఈ వనమునందు పక్షులతో వ్యాప్తమును నయనములకును  ముక్కులకును సుఖకరమును వసంత ఋతువునందు ఆ నంద వర్గ కమునునగు మనోహరమయినతీయమామిడి చెట్టును చూడుము; విశాల లోచనా! ఇందు (చిగురాకులచే) ఎర్రదనము కలదియు చక్కగ పూచినదియు అగు ఈ అశోక వృక్షమును చూడగా వసంతుడు నన్ను చూచి నవ్వు చున్నా డేమో అన్నట్లున్న ది; దక్షిణ (ఆనురాగ) భావము కలదానా! ఈ దక్షిణ దిశ యందు ప్రజ్వలించు అగ్ని తో సమానకాంతిగల పూచిన మోదుగలతో రమ్యమగు ఈ వనస్థలినీ చూడుము; సువాసనకల పూలవాసనతో నిండినదియు వన్య శ్రేణి నుండి వెలువడినదియు అగు పోయువు. మన పై దాక్షిణ్యము చూపుచు శ్రమ పోగొట్టు చున్నది; విశాలనేత్రా! ఈ పడమటి దిశ లో చక్కగా పూచిన కర్ణికార వృక్షములతో మనోహర మగు ఈ వన శ్రేణి బంగారుతో అలంకరించబడినట్లు ప్రకాశించుచున్నది; అతిము క్తలతో సమూహముతో ఆక్రమించబడిన మార్గము కలదయి ఈ వనస్థలి మనోహర సర్వాంగి! కుసుమ సమూహముతో అలంకరించబడినదో యనునట్లు కనబడు చున్నది; తేనె తావి మత్తెక్కిన తుమ్మెదల ఝుంకారమను మిషతో కాముడు హింసాదృష్టితో ఈ దగ్గరలోనుండి బొపమును ఎక్కు పెట్టి లాగుచున్నాడో యనునట్లున్నది; పండ్ల రసము ను ఆస్వాదించుటచే ప్రకాశించు నోరుగల గండు కోయిలల నాదముతో నిండిన ఈ వనస్థలి ఆంద మైనతీలక వృక్షములు కలదగుటచే అందమగు తిలకముతో అలంకృతవగు నిన్ను పోలియున్నది. మామిడి కొమ్మకోసమే ఈ కోకిల పుష్పమంజరుల పరాగముతో పింజర  తెలుపు ఎరుపు కలిసిన వర్లముకలదై ఉండియు ఉ తమ వంశమున పుట్టినవాడు తన కార్యములతోవలే ఇది తన కూతలతో తాను ఇదియని స్పష్టముగా తెలియుచున్నది; తుమ్మెద పుష్ప రేణువులు ఒడలినిండ పులిమీ కొని తన ప్రియురాలిని వెంటనంటుచు ఝుంకారము చేయుచు పూవుపూవునకు తిరుగుచున్నది; మామిడి చెట్టున పూవులు చాల ఉన్న ను పడుచు గండుకోయిల తన ప్రియురాలు ముక్కుతో పొడిచిన మామిడి పూగు తినే ఆస్వాదించుచున్నది.

కాకః ప్రసూతాం వృక్షాగ్రే స్వా మేకా శ్రేణ చఞ్చునా

కాకీం సమావయత్యేష పక్షాచ్ఛాదితపు త్రికామ్

 భూ భాగం చ సమాసాద్య దయితాసహితో యువా

 నాహార మపి చాద తే కామాక్రాన్తః కపిజ్జలః

కలవిజ్కస్తు రమయ న్పియోత్సం సమాశ్రితః

ముహుర్ముహుర్విశాలాక్షి ఉత్కణ్ణయతి కామినః

 క్షుద్రశాఖాం సమారూఢ శ్శుకోయం సహ కా నయా

 భ రేణ లమ్బయ జ్చోఖాం కరోతి సకలాం గిరమ్

వనేత్ర పిశితాస్వాద తృప్తో నిద్రా ముపాగతః

 శేతే సింహయువా కాన్తాచరణా త్తర గామినీ

 వ్యాఘయో ర్మిథునం పశ్య శైలకన్జర సంస్థితమ్

 య ర్నేతప్రభాలో కే గుహా భిన్నేవ లక్ష్యతే

 అయం ద్వీపీ ప్రియాం లేడి జిహ్వాగ్రేణ పునః పునః

ప్రీతిమాయాతి మహతీం లిహ్యమాన స్వకా యా

ఉత్పజకృతమూర్ధానం ని దాపహృతచేతనమ్

 జన్తద్ధరణతః కాస్తం సుఖయత్యేవ వానరీ

 భూమౌ నిపతితాం కాస్తాం మార్జాలో దర్శితోదరీమ్

నభై ర్దనే స్తుద త్యేష న చ పీడయతే యథా

శశక శ్శశకీ చైతౌ సంసుప్తే పీడితే ఇమే

సంలీనరాత్రే చరణే కర్ణ ద్వ్య క్తి ముపాగతే

స్నాత్వా సరసి పద్మాధ్యే నాగస్తు మదనప్రియః

 సమ్భావయతి తన్వణీం మృణాళకబళైః ప్రియామ్

 కానప్రోథసముత్థానైః కా నమార్గానుగామినీ

కరోతి కబళం ముస్తే ర్వారాహీ పోతకానుగా

 దృఢజగన్ది ర్మహిషః కర్దమా క్తతను ర్వనే

 అనువజ్రతి ధావన్తం ప్రియా ముద్దత ముత్సుకః 

ఆచెట్టు కొన పై మగకాకి ప్రసవించి తన శిశువును రెక్కలతో కప్పి పెట్టుకొని యున్న తన ప్రియురాలిని తన ముక్కుకొనతో స్పృశించి ఆదరించుచున్నది. కామ వర వశమగు పడుచుక పింజల పక్షి తన ప్రియురాలితో కూడి భూభాగమును చేరి ఆహారమును కూడ తినకున్నది; కలవింక పక్షి ప్రియురాలి ఒడిలో చేరి ఆమెను మాటి మాటికి ఆనంద పెట్టుచు కాముకులను రెచ్చగొట్టుచున్నది. ఈ చిలుక తన ప్రియతో కూడి రెమ్మ పై కూర్చుండి తన బరువుతో ఆ రెమ్మ వంగుచుండ అవ్య క్తమును మధురమును అగు పలుకులు పలుకుచున్నది.

(ఇంతవరకును పకుల విహరణపు వర్ణనమయినది. ఇక మీట మృగముల విహరణపు వర్ణనము) ఇదుగో! అడవిలో ఇటు చూడుము. సింహము మాంసమును ఆస్వాదించి తృప్తినంది నిదురించుచున్నది; దా నీ ప్రియురాలు తన ప్రియుని కాళ్ళనడుమ పండుకొని యున్నది; పర్వత కందరపు నడుమ చూడుము; పులి దంపతులు ఉన్న వి; ఐని కనుల వెలుగులో గుహ చీలేనో అనునట్లు కనబడుచున్నది; ఇదిగో: ఈ చిరుతపులి మాటి మాటికి నాలుక కొనతో తన ప్రియను నాకుచున్నది; తన ప్రియురాలుకూడ తను నాకుచుండ చాల ఆనందపడుచున్నది; ఈ ఆడుకోతి తన తొడ పై తల పెట్టుకొని మైమరచి నిద్రించుచున్న మగ కోతి పేలు తీసివేయుచు తన ప్రియునకు హాయిగొలుపుచున్నది. నేల పై వేల కిల పండుకొని యున్న ఆడుపిల్లికి నొప్పికలుగకుండగనే దానిని తన గోళ్ళతో దంతములతో నొక్కుచు హాయి. గొలుపుచున్నది. ఈ ఆడు మగ చెవుల పిల్లులు తమ కాళ్ళనడుమ ఒడలుముడిచికొని నిద్రించుచుండ అవి కనబడ కున్న ను వాటి చేవులను బట్టి మాత్రము అవి ఇవి అని తెలియుచున్న దీ; కామాతురమగు ఈ మగ ఏనుగు తామర పూలతో నిండిన సరస్సునందు తన ప్రియురాలికి తామరతూడులతునుకలు తినుట కందించుచు ఆదరించుచున్నది; ఆడు అడవి పంది తన పిల్లలు తన వెంట వచ్చుచుండ తన ప్రియుని ఆనుసరించుచు అందమగు ముట్టెతో త్రవ్వి ఎత్తిన ము స్తెలను తినుచున్నది. దృఢదేహసంధులు కల అడవిదున్న ఇదిగో! ఈ అడవిలో బురద నిండిన ఒడలితో నుండినదై ఎంతో ఆసక్తితోను పొగరుగాను తన ప్రియురాలు పరుగెత్తి పోవుచున్నను దాని వెంటనంటి పోవుచున్నది.

పశ్య చార్వజ్గి సారజ్గం త్వం కటాక్ష విభావనైః

సభారం మాం హి పశ్యన్తం కౌతుహల సమన్వితమ్

పశ్య పశ్చిమపాదేన రోహీ కణ్డూయతే ముఖమ్

స్నేహార్ద్రభావా త్కర్ష స్త్రీ భర్తారం శృజకోటినా

 ద్రాగిమాం చమరీం పశ్య సిత వాలా మగచ్ఛతీమ్

అన్వాస్తే చమరః కామీ మాం చ పశ్యతి గర్వితః

 ఆత పే గవయం పశ్య ప్రహృష్టం భార్యయా సహ

 రోమందనం ప్రకుర్వాణం కాకం కకుది వారయక్

 పశ్యాజం భార్యయా సార్ధం న్యస్తాగ్రచరణ ద్వయమ్

విపులే బదరీస్కనే బదరాశనకామ్యయా

 హంసం సబార్యం సరసి విచర న్తం సునిర్మలే

సుముక్త సేన్దుబిమ్బస్య పశ్య వై శ్రియ ముద్వహక్

 సభార్య శ్చక్రవాకో ఒయం కమలాకరమధ్యగః

 కరోతి పద్మినీం కాస్తాం సుపుష్పామివ సున్దరి

 మయా ఫలోచయ స్సు భూ స్వయా పుష్పోచ్చయః కృతః

ఇన్దనం న కృతం సుభూ సత్కరిష్యామి సామతమ్

 త్వమస్య సరస సీరే ద్రుమచ్ఛాయాం సమాశ్రితా

 క్షణమాత్రం ప్రతీక స్వ విశ్రమస్వచ భామిని

సావిత్రీ : ఏవ మేత త్కరిష్యామి మమ దృష్టిపథ స్వయా

దూరం కాస్త న గ నవ్యం బిభేమి గహనే వనే

మత్స్యః : తత స్స కాష్టాని చకార తస్మి న్వనే తదా రాజసుతాసమక్షమ్

తస్యా హ్యదూరే సరసశ్చ తస్య మేనే చ సా తం మృతమేవ రామా

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే సావిత్ర్యుపాఖ్యానే సావిత్యై సత్యవతో క్తవన వినోదవర్ణనం నామ అష్టోత్తర ద్విశతత మోధ్యాయః

మనోహరాంగి! కుతూహలముతో తన వైపు చూచు నన్ను ను నా భార్యనగు నిన్ను ను ఈ సారంగము. చూచు చున్నది;నీవుకూడగట్టిగ చూచినచో బెదరునేమో! నీవు దానిని నీకడగంట చూడుము; ఇటుచూడుము; ఆడు రోహి మృగము వెనుక కాలితో తన మొగమును గోకి కొనుచున్నది; ఆదే సమయములో అదీ తన హృదయమందలి స్నేహార భావముతో తనకొమ్ము కొనతో తన భర్తను దగ్గరకు లాగికొను చున్నది. నడువక కదలక కూర్చున్న చమరీ (ఆడు చమర) మృగ మును త్వరగ చూడుము; దానితోక కుచ్చు కానీ రోమ సమూహముకాని ఎంత తెల్లగ నున్న దో! మగ చమర ము కాముక మయి తన ప్రియురాలి నంటి పెట్టుకొని యుండి ఠీవిగా నన్ను చూచుచున్నది. ఎండ లో ఆగవయమును చూడుము; నెమరు వేయుచు తన మూపురము పైనున్న కాకిని తోలుకొనుచు తన భార్యతో కూడి సంతోషముగా నున్నది; రేగు ఆకులు తినదలచి ఆ చెట్టు పెనుగొమ్మ పై ముందరి రెండు కాళ్లుంచిన ఆడవి గోరే పొట్టేలును దాని భార్యను చూడుము; (జల పక్షుల వర్ల నము): చక్కని ము తైములతో ఆలంకృతమయిన చంద్రబింబపు శోభతో నుండి అతి నిర్మలమగు సరస్సునందు సంచ రించుచున్న ఆహంస దంపతులను చూడుము: సుందరీ! అటు చూడుము; తన భార్యతో కూడి సరో మధ్యమందుండిన చక్ర వాక పక్షిని చూడుము; అది ఈ వద్మ సర స్సునకు చక్కని పూలతో అలంకరించుకొనిన సుందరికి ఉండు అందమును సంతరించుచున్న ది; సరియేకాని.నుందరీ! ఇంతవరకు నేను పండ్లు ప్రోవుచేయగా నీవు పూలు సేకరించితివి; కానీ కాష్ట ములు పోవు చేయుట కాలేదు; ఇపుడిక ఆ పని చేయుదును; భామినీ! నీవు అంతలో ఒక క్షణ కాలము , ఈ సర సట మందలి చెట్టు నీడను ఆశ్రయించివి శ్రాంతి తీసికొనుచు నాకొరకుక్షోఎదురుచూచుచు ఉండుము; అంతలో నేను వత్తును; అనిన సత్యవంతుని మాటలు విని సావిత్రి.సరే; నీవు చెప్పినట్లే చేయుదును; కానిమ్ము; ప్రియా! నీవు మాత్రము నా దృష్టి పథమునుండి దూరముగా పోవలదు; ఈ కారడవిలో నాకు భయమగును;” అనేను; అంతట సత్యవంతుడును ఆ రాజ పుత్తికి దూరము కాకుండగానే ఆ సరస్సునకు దగ్గరలోనే అడవిలో క టైలు సేకరించ సాగేను. కాని ఆమె మాత్రము తన పతి మరణించినట్లే తలచేను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మనుమత్స్య సంవాదమున సావిత్ర్యుపాఖ్యానమున సత్యవంతుడు సావిత్రికి వన సౌందర్యమును వర్ణించి చెప్పుట అను రెండు వందల ఎనిమిదవ అధ్యాయము.