మత్స్య మహా పురాణము
257 - క్రియాయోగవిధి-ప్రతిమాలక్షణము-విష్ణు ప్రతిమా లక్షణము.
ఋషయః : క్రియాయోగః కథం సిద్ద్యే ద్గృహస్థాదిషు సర్వదా ।
జ్ఞానయోగ సహస్రాద్ది కర్మయోగో విశిష్యతే॥
సూతః : క్రియాయోగం ప్రవక్ష్యామి దేవతార్చానుకీర్తనమ్ ।
భుక్తిము క్తిప్రదం యస్మా న్నాన్య ల్లో కే విశిష్యతే॥
ప్రతిష్ఠాయాం సురాణాంతు దేవతార్చానుకీర్తనమ్ ।
దేవయజ్ఞోత్సవం చాపి బన్దనా ద్యేన ముచ్యతే॥
విష్ణుప్రతిమాలక్షణమ్.
విష్ణో స్తావ తవక్ష్యామి యాదృగ్రూపం ప్రశస్యతే ।
శజ్ఞచక్రధరం శాస్త్రం పద్మహస్తం గదాధరమ్॥
ఛత్త్రాకారం శిర స్తస్య కమ్బుగ్రీవం శుభేక్షణమ్ ।
తుజ్గనాసం శుక్తికర్ణం ప్రశాన్తోరుభుజక్రమమ్॥
క్వచి దష్టభుజం కుర్యా చ్చతుర్బుజ మథాపి వా ।
ద్విభుజం వాపి కుర్వీత భవనేషు, పురోధసా॥
దేవస్యాష్టభుజస్యాస్య యథాస్థానం నిబోధ మే ।
ఖజ్గో గదా శరః పద్మం దివ్యం దక్షిణతో హరేః॥
ధనుశ్చ ఖేటకం చైవ శబ్ధం చక్రం చ వామతః ।
చతుర్భుజస్య వక్ష్యామి యథే వాయుధ సంస్థితిః॥
దక్షిణేన గదాం పద్మం వాసుదేవస్య కారయేత్ ।
వామత శ్శజ్ఖచ క్రేతు కర్తవ్యే భూతి మిచ్ఛతా॥
కృష్ణావతారే తు గదా వామహస్తే ప్రశ స్య తే ।
యథేచ్చయా శబ్ధచక్రే ఉపరిష్టా త్ప్రకల్పయేత్॥
అధస్తా తృథివీ దేవీ కర్తవ్యా పాదమధ్యతః ।
దక్షిణే ప్రణతం తద్వ ద్గరుత్మ నం నివేశయేత్॥
వామతస్తు భవే ల్లక్ష్మీః పద్మహస్తా శుభాననా ।
గరుత్మా నగ్రతశ్చాపి సంస్థాప్యో భూతి మిచ్ఛతా॥
శ్రీశ్చ పుష్టిశ్చ కర్తవ్యే పార్శ్వయోః పద్మసంయుతే ।
తోరణం చోపరిష్టాత్తు విద్యాధరసమన్వితమ్॥
దేవదున్దుభిసంయుక్తం గస్థర్వమిథనాన్వితమ్ ।
పత్రవల్లీసమో పేతం సింహవ్యాఘ్ర సమన్వితమ్॥
తథా కల్పలతో పేతం స్తువద్భి రమరేశ్వరైః ।
ఏవం విధో భవేద్విష్ణు స్త్రీభాగేనాస్య పీఠికా॥
నవతాలప్రమాణాస్తు దేవదానవన్నరాః ।
ఋషులు సూతునిట్లడిగిరి: గృహస్థులు మొదలగువారియందు సర్వదా క్రియాయోగము ఎట్లు సిద్ధించును? ఏల యన-వేయి జ్ఞానయోగములకంటెను కర్మ (క్రియా ) యోగము విశిష్టతరమయినదిక దా! కావున క్రియా యోగసిద్ధి కలుగు మార్గ మెరుగుట ఆవశ్యకము. ఆన సూతుడు వారికిట్లు చెప్పెను. దేవతల ఆర్చామూర్తులను అనుకీర్తించుట (వివరించుట) అను క్రియాయోగ ప్రకారమును మీకు ప్రవచింతును; ఏలయన దానికంటే విశిష్టతరమగు భుక్తి ముక్తిప్రద సాధనము మరియేదియు లేదు. సంసార బంధము క్తి కలిగించునది కావు నను దేవతా ప్రతిష్టలయందును దేవతాయజ్ఞో త్సవములందును ఆవశ్యకము కావునను దేవతల యర్చామూర్తుల స్వరూపవర్ణనము తెలిసికొనదగియున్నది; ఇందు మొదట ప్రశస్తమగు విష్ణు ప్రతిమా రూపమును తేలి పెదను.
అతడు శంఖచక్రధరుడు శాంతుడు పద్మహస్తుడు గదాధరుడు ఛత్తాకార శిర స్కుడు శంఖమువంటి మెడయు శుభనేత్రములును కలవాడు. అతని ముక్కు ఎత్తయి చెవులు ముత్తైపుచిప్పలవలెను భుజక్రమములు గొప్పవై ప్రశాంత ములుగను నుండును; గృహముల యందు పూజకై శాస్త్రజ్ఞుడగు పురోహితుడిది ఆష్ట భుజమూర్తిగనో చతుర్భుజ మూర్తిగనో ద్విభుజమూ ర్తిగన్ చేయించవచ్చును; అష్ట భుజమూర్తికి కుడి చేతులందు ఖడ్గ గదాశర పద్మములును వామహస్తముల యందు ధనుః భేటక శంఖచక్రములు నుండును; చతుర్బుజునకు కుడి చేతులందు గదా పద్మములును ఎడమ చేతులందు శంఖచక్రములు నుండును. (ఇచట ఆయా యాయుధములు ఏ క్రమమందుండవలయునో చెప్పబడలేదను అంశము గమనించవలయును.) కృష్ణ ప్రతిమకు గద ఎడమ క్రింది చేతియందుండుట ప్రశస్తము; శంఖ చక్రములను తమ ఇచ్చానుసారము ఎడమ చేతియందో కుడి చేతియందో పైచేతులయందు నిలుపవలయును; అనగా కుడి క్రింది చేతియందు పద్మముండును; దేవుని పాదద్వయ మధ్యమున క్రింది భాగమున భూదేవియు కుడివైపున నమస్కరించుచున్న గరు త్మంతుడును ఎడమవై పున పద్మహస్తయు శుభముఖియునగు లక్ష్మియు నుండవలయును; గరుత్మంతుని విష్ణునకు ముందు ఉంచుటయు శ్రేయస్కరమే; పద్మము ధరించిన శ్రీదేవీ పుష్టి దేవులు కుడి ఎడమలందుండవలయును; దేవునకు పైభాగమున తోరణముండును; దాని పై విద్యాధరులు దేవదుందుభులు గంధర్వ దంపతులు పత్రములు వల్లులు సింహములు వ్యాఘములు కల్పలతలు స్తుతించు అమరేశ్వరులు నుందురు; విష్ణు రూపము ఇది.
మూర్తి పరిమాణములో మూడవవంతు పీఠ పరిమాణముండును.
దేవదానవ కిన్నర ప్రతిమలు తొమ్మిది తాళముల ప్రమాణముతో నుండును. (తాలము = చాచిన బొటనవేలి కొననుండి చాచిన నడి మీ వేలి కొనవరకుగల దూరము.)
అతఃపరం ప్రవక్ష్యామి మానోన్మానం వి శేషతః॥
జాలాన్తర ప్రవిష్టానాం భానూనాం యద్రజః స్ఫుటమ్ ।
త్రసరేణు స్స విజ్ఞేయో వాలాగ్రం తై రథాష్టభిః॥
తదష్ట కేణ లిక్షాతు యూకా లివాష్టకం తథా ।
యవో యూకాష్టకం తద్వ దష్టభి స్తై స్తథాజుళమ్॥
స్వకీయాజ్గుళ మానేన ముఖం స్యా ద్ద్వాదశాజ్గుళమ్ ।
ముఖమానే తు కర్తవ్యా సర్వావయవకల్పనా॥
సౌవర్లీ రాజతీ వాఒపి తామీ రత్నమయీ తథా ।
శైలీ దారుమయీ వాపి లోహసజ్వమయీ తథా॥
రీతికా ధాతుయుక్తాచ తామ్రకాంస్యమయీ తథా ।
శుభ దారుమయీ ఐపీ దేవతా ఒర్చా ప్రశస్య తే॥
ఆజ్గుష్ఠపర్వా దారభ్య విత స్తి ర్యావదేవతు ।
గృ హేషు ప్రతిమా కార్యా సాధికా శస్యతే బుధ ॥
ఆషోడశాత్తు ప్రాసాదే కర్తవ్యా నాధికా తతః ।
మధ్యోత్తమాకనిష్ణా తు కార్యా విత్తానుసారతః॥
ద్వారోచ్చాయస్య యన్మాన మష్టధా తత్తు కారయేత్ ।
భాగమేకం తత స్త్యక్త్వా పరిశిష్టంతు యద్భవేత్॥
భాగద్వయేన ప్రతిమా త్రిభాగీకృత్య తత్పునః ।
పీఠికా భాగతః కార్యా నాతినీచా న చోచ్ఛ్రితా॥
ఇక మీదట ఈ కొలతల తెలివిడి కై నూక్ష్మభేదములతో కూడ మానోన్మానమును తెలి పెదను; (ఉన్మానమనగా తూకపు పరిమాణమని యర్థము; కాని ఇచట దైర్యాది మానములను కొలుచు విధానమని యర్థము): గవాక్షరంధ్రముల నుండి లోనికి రవికిరణములు ప్రవేశించుచుండగా వానియందుండి గాలిలో ఎగురుచున్నట్లు కానవచ్చు స్పష్టర జఃకణముల లోని సూక్ష్మతమకణమును తన రేణు వందురు; అట్టివి ఎనిమిదియైన ఒక వాలాగ్రము; అవి ఎనిమిది ఒక లిక్షయగును; ఆవి ఎనిమిది ఒక యూక; ఆవి ఎనిమిది ఒక యవ; అవి ఎనిమిది (ఒక దాని ప్రక్కనొకటి ఆడ్డముగా పెట్టినయవ లేని మిదిటితో వ్యా ప్తమగు దూరము) ఒక అంగుళ ము; మానవుని బొటన వేలి కణుపుదగ్గర అరచేతివై పునగల దూర మును ఒక యంగుళముగా గ్రహింతురు; శిల్పిదియో యజమానునిడియో కుడిచేతి బొటన వేలికణుపునొద్దగల ఈ దూరము ప్రమాణముగా తీసికొనగా ఆట్టి యంగుళములు పండ్రెండు ప్రతిమాముఖపు నిలువు ఉండవలయును; ముఖమానమును బట్టి మిగిలిన అవయవముల కొలతలుండును; (అనగా ఇందీయబోవు ఆయా అవయవముల కొలతలన్నీ యు ఈ పండెం డంగుళములముఖమానమునుబట్టి యుండును; ఇది మారినచో ఆదియే యనుపోతములో మిగిలిన అవయవముల కొలతలును మారును.)
బంగారము - వెండి - రాగి - రత్నములు - శిల - దారువు - మిశ్ర (పంచ) లోహములు . ఇత్తడి . రాగి కంచు మి, శము - చందనమువంటి శుభదారువులు - ఇట్టివానితో దేవతార్చి మూర్తులు చేయుట ప్రశ స్తము; ఇండ్లయందు ఆర్చించు ప్రతిమలు కుడిచేతిబొటనవేలి కణుపంత మొదలుకొని జేనేడు (పండేండు భార తీయాంగుళముల)వరకుగల నిలువు పెత్తుతో ఉండవలెను. దేవాలయములందలి దేవతా మూర్తులు పదునారు జేనలవరకు నిలువుటెత్తుతో ఉండవచ్చును; అంతకంటే ఎక్కువ ఎత్తుగానుండుట తగదు; విత్తశ క్తిననుసరించి ఈ పరిమితులనడుమ ఉ త్తమాధ మక నష్టమానములలో దేనితోనైన విగ్రహనిర్మాణము చేయవలయును; ఇందను సరించవలసిన పద్దతి ఏమనీన - దేవాలయద్వారపు ఎత్తును ఎనిమిదిగా విభ జించి వానినుండి ఒక భాగమును వదలి మిగిలిన ఏడు భాగముల పరిమాణముతో దేవతా మూర్తిని చేయించవలయును; మొ త్తము పరిమాణమును మరల మూడు భాగములు చేసి అందు త్రిభాగము(1/3)తో పీఠమును అంత ఎక్కువ ఎత్తును అంత తక్కువయును కాకుండ నిర్మించవలయును.
ప్రతిమాముఖమానేన నవభాగా నకల్పయేత్ ।
చతురజ్గుళా భవేద్గ్రీవా భాగేన హృదయం పునః॥
శాభి స్తఫా దధః కార్యా భాగేనై కేన శోభితా ।
నిమ్న త్వే విస్తర త్వే చ అజుళం పరికీర్తితమ్॥
నాభే రధస్తా నేత్రం చ భాగేనై కేన కల్పయేత్ ।
ద్విభాగేనాయతా వూరూ జానునీ చతురజు కే॥
కే ద్విజశ్వేవిఖ్యాతే పాదౌచ చతుర జుశా ।
ఊర్ధ్వమానమిదం ప్రోక్తం పృథుత్వం చ నిబోధత॥
సర్వావయవమ్యార్గేషు విస్తారం శృణుత ద్విజాః ।
నిలువబడినట్లు ఉండు విగ్రహపు కొలతలు-నిలువు కొలతలు
ప్రతిమకు ముఖమెంత నిలువుటెత్తుండునో అంత పరిమాణములు తొమ్మిదిటిని మనస్సులో కల్పించి ఉంచుకోన వలయును; (లోగడ ముఖపు నిలువు టెత్తు పండ్రెండు అంగుళములు అని చెప్పబడినది కావున అట్టి తొమ్మిది భాగములు 9X12=108 భారతీయాంగుళములు దృష్టియందుంచుకొనవలయును.)
ఇక మూర్తి ప్రథాన ఉమల కొలతలపాళ్లు (Ratio); 1. (ముఖపు నిలువు దెత్తు 12 అంగుళములయి నపుడు) 2. మెడ 4అంగుళములు; 1 భాగమ్లు =12 అం. హృదయము; దానికి దిగువను నాభివరకు 1భాగము = 12ఆం.; డ్డులోత్తు1 ఆరకము; నానికి దిగ్గువ అంచునుండి మేడ్రము (మర్మాంగము) దిగువకొనవరకు 1భాగము = 12 అంగుళములు; 6. తొడలు 2భాగములు =2x12 = 24 అంగుళములు; 7. మోకాళ్లు (మోకాటి చిప్పలు) 4 ఆంగుళములు; 8.*జంఘలు 2 భాగములు=2x12=24 అంగుళములు; 2. పాదముల నిలువు కొలత 4 అంగుళములు; 10 శిరస్సు. 14 అంగుళములు; ముఖపు కొలత శిరపు కొలతలో చేరిపోయినది; ఇట్లు మొత్తము 108 అంగుళము లగును; 9x12 -108; నవభాగ ప్రకల్పన సరిపోయినది; ఇట్లు ఈ 108 అంగుళములకు పీఠ పుఎత్తు 54 ఆంగుళములు చేర్చగా 162 అంగుళములు; ఇది దేవాలయద్వారపు ఔత్తులో 7/8 అగుచో ద్వారపుటెత్తు-162X8=184 అంగుళ ములు;) ఇదీ విగ్రహపు నిలువు కొలతల విషయము; ఇక ఆయా అవయవముల వెడల్పును వాని చుట్టు కొలతలును వానీ చే ఏర్పడు వైశాల్యమును తెలి పెదను; వినుడు.
(* ఈ ప్రతీమాలక్షణాధ్యాయమునందు “జంఘే ద్విభాగే విఖ్యాతే- పాదౌ చ చతురంగుశౌ” కాగానే “ఊర్ధ్వమాన మిదం ప్రోక్తం-వృథుత్వంచ నిబోధత! సర్వావయవమానేషు విస్తారం శణుత ద్విజాః” అని ఉండవలెను. దాని తరువాత “చతు ర్దంగుల సద్వ న్మౌళి రస్య ప్రకీర్తితా చతురంగుళంలలాటం స్యాత్.” ఇత్యాదిగ నుండవలెను. కాని విస్తారమానములో నుండవలసిన ఈ మౌళిమానపు వాక్యములు ముదితపుస్తకములలో ఊర్వమానములో చేరిపోయినవి. శ్రీ వాజపేయం రంగాచార్ గారు దీనినిట్లే గ్రహించి తాత్పర్యము వ్రాసిరి. ఇది కాక వీరు ఈ ఊర్ధ్వమాన విషయములో “నవతాళ మిదం ప్రోక్తమ్” అను దాని ననుసరించి రావలసిన నవ తాళము = 9x12 = 108 అంగుళములు అనునది సరి పెట్టుకొనుటకై యత్నము చేయక యే తాత్పర్యము వ్రాసినారు.)
చతుర్ధ శాగుళ స్తద్వ న్మౌ శిరస్య ప్రకీర్తితః
చతుర జ్గుళం లలాటం స్యా దూర్ధ్వం నాసా తథైవచ ।
ద్వ్యజ్గుళం తు హను ర్జయ ఘోష్ఠ స్వాజుళ సమ్మితః॥
అష్టాజ్గుళం లలాటంతు తావన్మాత్రే భ్రువో మతౌ ।
ఆర్గాజు ధ్రువో లేఖా మద్యే ధనురివానతా॥
ఉన్న తాగ్రా భవేత్పార్శ్వే క్షజ్ఞ తీవ్లా ప్రశస్యతే ।
అక్ష్మిణీ ద్వ్యజుళాయామే తదర్గం చైవ విస్తరాత్॥
ఉన్నతోదర మధ్యే తు రక్షా నే శుభలక్షణే ।
తార కార్ధ విభాగేన దృష్టి స్యా త్పళ్చాభాగికా॥
ద్వ్యజుళంతు భ్రువో ర్మధ్యే నాసామూల మథాంగుళమ్ ।
నాసాగ్రవి స్తరం తద్వ త్పుటద్వయ మథానతమ్॥
నాసాపుటబిల తద్వ దర్ధాంగుళ ముదాహృతమ్ ।
కపోలే ద్వ్యంగు కే తద్వ తగ్లమూలా ద్వినిర్గతే॥
హన్వగ్ర మంగుళం తద్వ ద్విస్తారో ద్వ్యంగుళో భవేత్ ।
ఆర్గాంగుళా దువో రాజీ ప్రణాళసదృశీ సమా॥
ఆర్ధాంగుళ సమ స్తద్వ దుత్తరోష్ణస్తు విస్తరే ।
నిష్పావసదృశం తద్వ నాసాపుటదళం భవేత్॥
సృక్విణీ జ్యోతిస్తుల్యేతు కర్ణమూలా తడంగు ళే ।
కర్ణాతు భూసమౌ జైట్లో ఊర్ధ్వంచ చతురంగుశా॥
ద్వ్యంగు కర్ణపార్శ్వౌతు మాత్రా మేకాంతు విస్తృతౌ ।
కర్ణయో రుపరిష్టాచ్చ మస్తకం ద్వాదశాబ్ధుళమ్॥
లలాటా తృష్ణతోఒర్ధన ప్రోక్త మష్టాదశాంగుళమ్ ।
*ష ట్రింశదంగుళం చాస్య పరిణాహ శ్శిరోగతః॥
స కేశ నిచయో యస్య ద్విచత్వారింశదంగుళః ।
కేశాంతా ద్దనుకా తద్వ దంగుళాని తు షోడశ॥
(*షట్త్రింశదంగుళం చాస్య.)
ఆయా అవయవముల వెడల్పులు-చుట్టుకొలతలు.
మౌళి (శిరము) (రెండు మూపుల నడుమనుండి తల పై వరకు) 14 అం. లలాటపు నిలువుటెత్తు నాల్గంగుళ ములు; ముక్కు నిలువు యెత్తు నాలుగంగుళములు; హనువు ఒక్కొక్కటియు పెదవులును రెండేసి అంగుళముల వెడల్పు ఆడ్డపు కొలత): లలాటపు ఆడ్డపు కొలతలు ఎనిమిదంగుళములు; కనుబొమలు రెండును కలిసి ఎనిమిది అంగుళములు; కనుబొమ రేఖ నడుమ ధనువువలే వంగియుండుచోట దాని వంపుయెత్తు ఆరొంగుళము; కనుబొమ పార్శ్వమునందు కోన ఉన్న తమ సునుపుగను పొడిగను నుండవలయును: ఇట్టి నిర్మాణము ప్రశస్తము: కన్నులు రెండును వేరువేరుగ రెండేసి అంగుళముల అడ్డు పొడవును ఆంగుళము వేడలుపును (ఎత్తును) ఉండవలయును. కనుగుడ్లు నడుమ ఊబ్బుగను కను గోనలు (కుడి కంటి కుడి కొనయు ఎడమకంటి ఎడమకొనయు) ఎరుపుగను ఉండవలయును; ఇట్టివి శుభలక్షణ నేత్రములు; మొత్తము కంటి పొడవులో ఐదవ (1/5) వంతు కొలతతో కంటి గ్రుడ్డులోని అర్ధభాగము ఉండవలయును: (కనుగుడ్డు : కంటి మొ త్తము పొడవు 2:8); రెండు కనుబొమల నడిమి కొలత రెండు అంగుళములు; నాసా మూలము (ముక్కు మొదలు. ముక్కు కనుబొమలతో కలియు చోటు) ఒక ఆంగుళము; నాసాగ్రము కూడ ఇంతే ఒకంగుళము) వెడల్పుండవలయును; రెండు ముకు పుటములును కుడి ఎడమలకు వంగి ఉండవలయును; నాసాపుట బిలము ఆర్గాంగు శము; కర్లమూలమునుండి వెలికి వచ్చునంతవరకు క పోలములు రెండంగుళములు; హనువు (దౌడ) కొన ఒక అంగుళము; హనువు వెడల్పు రెండంగుళములు; కనుబొమల వెంట్రుకల వరున మందము ప్రణాళీ (నీరు పారు గొట్టముతో) సదృశమై నమమయి అర్ధాంగుళము వెడల్పుతో నుండవలయును; పై పెదవి వేడలుపుకూడ ఆర్ధాంగుళము: ముకుడిప్పల బ్రద్ద ఒక్కొక్కటియు ఆనుపగింజల పప్పు బద్దవలే ఉండవలయును: నేలవులు జ్యోతిస్సుల దీపజ్వాల) వలే నుండవలెను; అవి కర్ల మూలమునుండి ఆరంగుళముల దూరమందు ఉండవలెను; కనుబొమల పై అంచునకు తిన్న గా చెవుల పై అంచులు ఉండవలెను; వాటి నిలువు బెత్తు నాలుగంగుళములు; చెవుల అడ్డపు నిడివి రెండంగుళములకు కొంచెము చిల్లర ఎక్కువగ ఉండవలెను; మాత్రా - ఒక ప్రధాన పరిమాణమందలి ఆల్ఫాంశము. దీనిని వాడుకలో పైచిల్లర అందురు;) చేవుల పై అంచునుండి మస్తకపు తల) పైకొనవరకు (నిట్టనిలువుగా లంబ రేఖలో కొలిచినపుడు) ఎత్తుసరి పండ్రెండంగుళములు; లలాటపు (కుడి ఎడమలలో) ఏ అంచునుండియైనను తల వెనుక వైపు నడిమి ప్రదేశమునకు పదునెనిమిదంగుళములు; అనగా లలాటమునకు తిన్న గానుండు తల చుట్టుకొలత ముప్పదీయారంగుళములు; కేశ నిచయము (రాశి) ఉండు శిరో భాగము (లలాటపు పై అంచునుండి తల వెనుక వైపున వెంట్రుకలు ఉండు భాగపు చివరవరకు) నలువది రెండంగుళములు: తల వెనుక వైపునకు నడిమి భాగములో వెంట్రుకలు మొలచుట ఆగిపోవు చోటినుండి దౌడల ఆరంభము వరకు ఉండు దూరము పదునారంగుళములు.
గ్రీవామధ్యవరీణాహ శ్చతుర్వింశతికాంగుళీః ।
ఆష్టాంగుళా భవేద్గ్రీవా వృథుత్వేన ప్రశస్యతే॥
స్తనగ్రీవా నరం ప్రోక్త మేక తాళం స్వయమ్భువా ।
స్తనయో ర న్తరం తద్వ ర్ద్వాదశాంగుళ మిష్యతే॥
స్తనయో ర్మణ్డలం తద్వ ద్వ్యంగుళం పరికీర్తితమ్ ।
చూచుకౌ మణలస్యా న్త ర్యవమాత్రా వుభౌ స్మృత్తా॥
ద్వితాళం చైవ విస్తారా ద్వక్షస్థల ముదాహృతమ్ ।
క షే షడంగు ళే ప్రో క్రే బాహుమూల స్తనా నరే॥
చతుర్దశాంగులౌ పాదా వంగుష్ఠా తంగులౌ స్మృతా ।
ప్చంగుళపరీణాహ మంగుష్టాగ్రం తథోన్న తమ్॥
అంగుష్ఠక సమా తద్వ దాయామా స్యా తదేశినీ ।
తస్యా షోడశ భాగేన హీయతే మధ్యమాంగుళీ॥
అనామికాఇష్టభాగేన కనిష్ణాపి చ హీయతే ।
పర్వత్రమేణ చాంగుళ్యో గుల్ఫౌ ధ్వ్యంగుళకౌ మతో॥
పార్షి ర్ద్వ్యంగుళమాతస్తు కలయోచ్చః ప్రకీర్తితః ।
ద్వీపర్వాంగుష్ఠకః ప్రోక్తః పరిణాహశ్చ ద్వ్యంగుళ॥
ప్రదేశినీపరీణాహ యంగుళ స్సముదాహృతః ।
కనిష్ణా చాష్టభాగేన హీయతే క్రమశో ద్విజోః॥
ఆంగు నోచ్చయః కార్యో హ్యంగుష్ఠస్య వి శేషతః ।
తద ఫ్ఘనతు శేషాణా మంగుళీనాం తథోచ్చయః॥
జజ్ఘాగ్రే పరిణాహస్తు అంగుళాని చతుర్దశ ।
జజ్ఘామద్యే పరీణాహ స్తథై వాష్టాదశాంగుళః॥
మెడ నిలువుటెత్తులోని నడిమి భాగమున దాని చుట్టుకొలత ఇరువది నాలుగంగుళములు; మెడ ముందువై పు వెడల్పు ఎనిమిదంగుళములు; స్తనముల నడిమి బిందువునుండి మేడ క్రింది నడిమి బిందువు వరకు ఒక తాళ ప్రమా ణము; రెండు స్తనముల నడిమీ బిందువుల నడిమి దూరము పం డేండంగుళములు; ఒక్కొక్క స్తనపు చుట్టుకొలత రెండంగుళములు; ఈ స్తనమండల (వృత్తమునకు నడుమ చూచుకములు (స్తనాగ్రములు చను మొనలు. ఉబ్బెత్తు భాగములు. యవ పరిమాణము-) 1/8 భారతీయాంగుళము; వక్షఃస్థలపు వెడలుపు రెండు తాళములు; బాహ మూలపు క్రింది అంచునుండి స్తనపు నడుమ వరకుగల నడిమీ దూరము {క క్ష..చంక) ఆరంగుళములు! పాదముల నిడివి పదునాలు గంగుళములు: బొటన వేళ్ళ నిడివి మూడంగుళములు; పాదాంగుష్ఠము ఉన్నత భాగమున ఐదంగుళముల నిలువు చుట్టు కొలతతో నుండవలయును; పాదపు రెండవ వ్రేలుకూడ బొటనవేలి యంత పొడవే; పొదపు నడిమి వేలి పొడవు దీని కంటే షోడశాంశము (1/16) తగ్గును; పాదపు అనామిక పాదపు నడిమి వేలి పొడవు (1/8) అష్టాంశమును పొదపు చిటి కెన వ్రేలి పొడవు ఆనామిక పొడవులో అష్టాంశమును తగ్గును; కాలి బొటనవేలికి తప్ప మిగిలిన వేళ్ళకు అన్నిటికిని మూడేసి కణుపులు ఉండవలయును; చీలమండ నిడివి (వ్యాసము) రెండంగుళములు; మడమ ఎత్తు రెండంగుళముల కంటే కలా మాత్రము (1/16) ఎక్కువ; పాదపు బొటనవ్రేలికి కణుపులు రెండే; దాని అడ్డు (పై) చుట్టుకొలత మూడంగు శములు; పాదపు రెండవ వ్రేలి నిలువు చుట్టుకొలత మూడు అంగుళములు; ఇవి క్రమముగ కనిష్ఠిక వరకు ఒక దానికంటే ఒకటి అష్టమాంశము (1/8) తగ్గును; పాదాంగుష్ఠమును ముందునుండి చూచినప్పుడు దాని నిలువు పెత్తు ఒక అంగుళము; మిగిలిన నాలుగు వేళ్ళకును ఈ ముందు ఎత్తు అర్ధాంగుళము; పిక్కల పైభాగపు చుట్టుకొలత పదునాలుగంగుళములు; పిక్కల నడుమ (ఎక్కువ లావుగ ఉండుచోట) చుట్టుకొలత పదునెనిమిది అంగుళములు.
జానుమధ్యే వరీణాహ ఏక వింశతికాంగుళః।
జానూచ్ఛ్రయోఒంగుళః ప్రోక్తో మణ్డలంతు త్రిరంగుళమ్॥
ఊరుమద్యే పరీణాహో హ్యష్టావింశతికాంగుళః ।
ఏకత్రింశోపరిష్టాచ్చ వృషణౌ చ త్రిరంగుశా॥
ద్వ్యంగుళం తు తథా మేడ్రం పరిణాహ షడంగుళమ్ ।
మణిబన్గా దధో విన్ద్యా త్కేశ రేఖా స్తథై వచ॥
మణిబంధపరీణాహ శ్చతురంగుళ మిష్యతే ।
విస్తరేణ భవే త్తద్వత్కటి రష్టాదశాంగు॥
ద్వావింశతీస్ తథా స్త్రీణాం స్తనౌ చ ద్వాదశాంగు ।
నాభిమధ్యపరీణాహో ద్విచత్వారింశదంగుళః
పురుషే పజ్చపణ్చాక తట్యాం చైవ తు వేష్టనమ్ ।
కక్ష యో రుపరిష్టాత్తు స్కన్దా ప్రోక్తా షడంగుశా॥
అష్టాంగుళం తు విస్తారే గ్రీవాం చైవ తు నిర్ది శేత్ ।
పరిణా హే తడా గ్రీవాం కలా ద్వాదశ నిర్ది శేత్॥
ఆయామో భుజయో సద్వ ద్విచత్వారింశ దంగుళః ।
కార్యం తు బాహు శిఖరం ప్రమాణే షోడశాంగుళమ్॥
ఊర్ధ్వం యద్బాహుపర్య స్తం విన్గ్యా దష్టా దశాంగుళమ్।
తథే కాంగుళహీనం తు ద్వితీయం పర్వ ఉచ్యతే॥
బాహుమధ్యే పరీణాహో భవే దష్టాదశాంగుళ ।
షోడశోక్తః ప్రబాహుస్తు షట్కలోగ్రకరో మతః॥
మోకాళ్ళకు నిర్దేశించిన మొత్తము పొడవులో నడిమి భాగమున ఒక్కొక్క మోకాలి చుట్టుకొలత ఇరువది. యొక 5 అంగుళములు; మోకాటి చిప్ప ఎత్తునరి ఒక అంగుళము; అచట దాని (ఒక్కొక్క మోకాటి చిప్ప) చుట్టుకొలత మూడు అంగుళములు; తొడల మొత్తము దైర్యములో నడిమి భాగమున పొనిలో ఒక్కొక్క దాని చుట్టుకొలత ఇరువది ఎనిమిదంగుళములు; తొడ ఒక్కొక్కటియు పై భాగమున ముప్పదియొక్క అంగుళముల చుట్టుకొలతతో నుండును; వృషణముల రెంటి ప్రమాణము మూడంగుళములు; మేడ్రము (రహస్యాంగము) రెండంగుళములు: దాని నిలువు చుట్టు కొలత ఆరంగుళములు; మణి బంధమునకు దిగువలో కేశ రేఖలను చూపవలయును; మణిబంధపు (సగపు?) చుట్టుకొలత నాలుగంగుళములు; కటి ప్రదేశపు (ముందు భాగపు) విస్తారము (వెడలుపు) పదునెనిమిదంగుళములు; స్త్రీల కటి విస్తారము ఇరువది రెండంగుళములు; స్త్రీలకు) స్తనముల చుట్టుకొలత పండ్రెండంగుళములు; (శ్రీలకే) నాభికి తిన్న గా నుండు నడుము చుట్టుకొలత నలువది రెండంగుళములు: పురుషునకయినచో కటి ప్రదేశపు చుట్టుకొలత ఏబదియెదంగుళములు; కక్ష (చంక)లకు పైథాగమందు స్కన భుజమూలములు ఆరంగుళములు; మెడ వెడలుపు (వీపు వైపునకు ఉండు భాగ మును వదలగా) ఎనిమిదంగుళములు: గ్రీవ (మెడ చుట్టుకొలత పండ్రెండు కలలు తాళ ప్రమాణమును పదునారు 12 శ్రీ భాగములు చేసి వానిలోనుండి పండ్రెండు భాగములు గ్రహించవలెనని యర్థము; అనగా (12/16 =3/4 తాళము) భుజ ముల పొడవు నలువది రెండంగుళములు; భుజ శిఖర మొక్కొక్కటి పదునారంగుళ ములు; బాహంపర్యంతము గల పై నిడివి పదునెనిమిదంగుళములు; (మోచేతి సంధినుండి పైభాగము); రెండవ పర్వభాగము (మోచేతినుండి దిగువ భాగము) ఒక ఆంగుళము తక్కువ పదునేడంగుళములు); బాహువులలో ఒక్కొక్కటియు దాని నడిమి భాగమున గల చుట్టుకొలత పదునెనిమిదంగుళములు; మోచేతికి సరిగా దిగువ భాగపు చుట్టుకొలత పదునారంగుళములు; ఆగ్రకరపు ముంజేతి) చుట్టు కొలత ఆరు కలలు (6/16 = 3/8 తాళము).
సప్తాంగుళం కరతలం పఞ్చమధ్యాంగుళీ మతా ।
అనామికా మధ్యమాయా స్సప్తభాగేన హీయతే॥
తస్యాశ్చ పఞ్చభాగేన కనిష్ఠ పరిహీయతే ।
మధ్యమాయాస్తు హీనా వై పళ్చా భాగేన తర్జనీ॥
అంగుష్ఠస్తర్జనీమూలా దధః ప్రో కర్ణు తత్సమః ।
అంగుష్టపరిణాహను (పర్వమానను) విజ్ఞేయ శ్చతురంగుళ ॥
శేషాణా మంగుళీనాం తు భాగో భాగేన హీయతే ।
మధ్యమాపర్వమానం తు అంగుళద్వయ మాయతమ్॥
యవో యవస్తు సర్వాసాం తస్యా స్తస్యాః ప్రహీయతే ।
అంగుష్ఠ పర్వమధ్యం తు తర్జన్యా సదృశం భవేత్॥
యవద్వయాధికం తద్వ దగ్రపర్వ ఉదాహృతమ్ ।
పర్వార్డేన నఖా న్విన్ద్యా దంగుళీషు సమ న్తతః॥
స్నిగ్ధం క్లక్షం ప్రభుర్వీత ఈషద్రక్తం తథాఒగ్రతః ।
నిమ్న కృష్ణం భవే న్మధ్యే పార్శ్వతః కలయోచితమ్॥
తథైవ కేశ వల్లీయం సనోపరి దశాంగుళా ।
స్త్రీయః కార్యాస్తు తన్వజ్యః స్తనోరుజఘనాది కాకి॥
చతుర్దశాంగుళాయామ ముదరం తత్తు నిర్ధి శేత్ ।
నానాభరణసమ్పన్నా : కిష్చో చ్లక్ష ముఖా స్తథా॥
కిళ్చి దీర్ఘం భవేద్వక్త మలకావళి రుత్తమా ।
నాసా గ్రీవాలలాటంచ సార్ధమాత్రం త్రిరంగుళమ్॥
ఆధ్యర్ధాంగుళ విస్తార శ్శస్యతే ధరపల్లవః ।
ఆధికం నేత్రయుగ్మంతు చతుర్బాగేన నిర్ధి శత్॥
గ్రీవావళిశ్చ కర్తవ్యా కిడ్ఛాదర్గాంగుళోచయా ।
ఏవం నారీషు సర్వాసు దేవానాం ప్రతిమాసుచ॥
నవతాళ మిదం ప్రోక్తం లక్షణం పాపనాశనమ్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే విష్ణుప్రతిమాలక్షణాది కథనం నామసప్తపఞ్చాశదు త్తర ద్విశతత మోధ్యాయః॥
ఆర చేతి పొడవు ఏడంగుళములు; చేతి నడిమి వేలు ఐదందుళ ములు; అనామిక పొడవు, దానిలో (1/7) ఏడవ వంతు తగ్గును; కనిష్ఠిక పొడవు దానిలో ఏడవవంతు తగ్గును; నడిమి వేలి పొడవులో ఐదవవంతు తగ్గి తర్జని పొడ వుండును; తర్జనీ మూలమునుండి దిగువ భాగమునకు వచ్చిన అంగుష్ట (భాగ)ము దానితో (ఊర్ధ్వ భాగమున ఉండిపోయిన ఆంగుష్టాంశముతో) సమముగా నుండును; అంగుష్ఠపు రెండు కణుపుల వె త్తము పరిమాణము నాలుగంగుళములు; మిగిలిన వేళ్ళ కణుపులు ఒక్కొక్కటియు బొటనవేలి ఒక్కొక్క కణుపుకంటే కొంచెము తగ్గుచుపోవును. మధ్యమా వర్వపు (కణుపు) కొలత రెండంగుళములు; మిగిలిన వేళ్ళ కణుపుల పొడవులు ఒక దానికంటే మరియొక దాని కణుపు యవయవ పరిమాణము తగ్గుచుపోవును; అంగుష్ట పర్వ మధ్యము మాత్రము తర్జనితో సమానముగా నుండును; అంగుష్టపు మొదటి పర్వము (కణుపు) మాత్రము తర్జనీ పర్వ పరిమాణముకంటే రెండుయవలు ఎక్కువ; ప్రతియొక వ్రేలియందును ఆ వేలి చివరి సగములో ఆ వేలి గోరుండును; ఆవి నునుపుగా సొగసుగా చివరలో కొంచెము ఎరుపుగా నుండునట్లు చేయ వలయును; ఆందును పై భాగము కొంచెము పల్లముగా నుండును: ప్రక్కల కంటే నడుమ భాగము కొంచెమేత్తుగ నుండ వలయును; కేశవల్లిక భుజమూలములకు పైగా పది యంగుళములవరకు వ్యాపించియుండవలయును.
స్త్రీల మూర్తులు- స్తనములు తొడలు కటి ప్రదేశము - ఈ భాగములందు ఎత్తుగా నుండునట్లు నిర్మించవలయును; స్త్రీల శరీర ములు అంత స్థూలము కాకుండ ఉండవలయును: వారి ఉదరము పదునాలుగంగుళముల పొడవున ఉండును; వారు సోనాభరణ సంపన్నలై నున్న ని ఇం పైన ముఖములతో నుండవలయును; వారి మొగము కొంచెము పొడవుగా నుండవలయును; ఆలకావళి (ముంగురుల వరుస చాల ఉత్తమముగా ఉండవలయును: నాసిక-గ్రీవ లలాటము. ఇవి మూడున్న రేసి అంగుళములుండవలయును; క్రింది పెదవి చిగురాకువలేను ఒకటిన్నర అంగుళము వెడల్పుతోను (స్త్రీలకు ఉండుట మంచిది; వారి కన్నులును పురుషులనేత్ర దైర్యముకంటే అందులో నాల్గవపాలు ఎక్కువగ ఉండవలయును; వారికి) గ్రీవయును పురుషుల గ్రీవకంటే ఇంచుమించుగ ఆర్ధాంగుళమధికముగ నుండుట ప్రశ స్తము.
(ఈ చేప్పినదంతయు దేవతా ప్రతిమలయందును ఆందును స్త్రీమూర్తులయందును ఉండవలసిన ఆయా అవ యవముల లక్షణములును పరిమాణములును: ఇవి నవరాళ లక్షణము (అనగా పీఠ భాగము కాక కేవలమూర్తి భాగము తొమ్మిది తాళములుండునట్లు చేయునపుడు ఉండవలసిన కొలతలు! మూర్తి మొ త్తపు పరిమాణమునుబట్టి ఆదే అను పాతములో ఆయా అవయవముల కొలతల మార్పులను ఎరుగవలయును.)
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రతిమా లక్షణ- విష్ణు ప్రతిమలక్షణ-కథనమను రెండు వందల ఏబది ఏడవ అధ్యాయము.
Summary of chapter 256 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents the precise ecological and ritual guidelines for selecting, harvesting, and processing timber for building construction. Bhagavān Matsya instructs builders to inspect forest trees, prohibiting the cutting of trees residing in cremation grounds, holy shrines, public roads, or those inhabited by birds, sacred spirits, or struck by lightning. Sacred trees like Sāla, Asana, Teak, Chandana, Devadāru, and Khadira are recommended for structural beams and doors. The text outlines preliminary prayers offered to forest Deities before felling selected trees, followed by proper seasoning procedures to ensure durable, pest-resistant timber for long-lasting structures.