మత్స్య మహా పురాణము
217 - విష నిర్హరణోపాయము.
మనుః : రక్షోఘ్నా ని విషఘ్నా ని యాని ధార్వాణి భూభుజా ।
అథేదానీం సమాచక్ష్వ తాని ధర్మవతాం వర॥
మత్స్యః : బిల్వాటకీ యవక్షారం పాటలా బాహ్లికోషణాః ।
శ్రీవర్ణీ సల్లకీ యుక్తో నిక్వాథః ప్రోక్షణం పరమ్॥
సవిషం ప్రోక్షితం తేన సద్యో భవతి నిర్విషమ్ ।
యవ సైనంధవపానీయ వస్త్రశయ్యాసనోదకమ్॥
కవచాభరణం ఛత్తం బాలవ్య జన వేశ్మనామ్ ।
శేలు పటోలాతివిషా శి గ్రుమూర్వా పునర్నవా॥
సమంగావృషమూలంచ కపిత్తవిష శోణితమ్ ।
*సహదేవా హరి దేతు విషనాశం ప్రకీర్తితమ్॥
లాషాప్రియజుమఞ్జిష్ఠా సమమేలాహ రేణుకా ।
యష్ట్యాహ్వా మధునా యుక్తా బభ్రుపి త్తేన కల్పితాః॥
నిక్ష పేద్గో విషాణస్థం సప్తరాత్రం మహీతలే ।
తతః కృత్వా మణిం హేమ్నా బద్దం హస్తేన ధారయేత్॥
సంసృష్టం సవిషం తేన సద్యో భవతి నిర్విషమ్ ।
మనోహ్వయా శమీపత్రం తుమ్బికా శ్వేతసరః॥
కపిత్థకుష్ఠమష్ణాః పి త్రేన శక్లకకల్పితాః ।
శునో గోః కపిలాయాశ్చ సౌమ్యాక్షిప్తో ఒపోగదః॥
విషజిత్పరమం కార్యం మణిరత్నం చ పూర్వవత్ ।
మూషికా జతుకా చాపి హస్తే బద్ద విషాపహా॥
హ రేణుమాంసీ మజ్జిషా రజనీమధుకామధు ।
అక్షత్వకురసంలాక్షా శ్వపిత్తం వూర్వవద్బువి॥
వాది త్రాణి పతాకాశ్చ పిష్టై రేతై ర్విలేపితాః ।
శ్రుత్వా దృష్ట్వా సమామ్రాయ సద్యో భవతి నిర్విషః॥
(*మహదంతశఠం తద్వత్ప్రోక్షణం విషనాశనం)
ధర్మ విద్వరుడవగు మత్స్య ప్రభూ రాక్షస-విషనాశకములగు వేనిని రాజు తన దుర్గమున నిలుపుకోన వలయునో తెలుపుమనిన మనువుతో మత్సుడిట్లనెను: బిల్వాటకీ.యవక్షారము-పాటలా-బాహ్లికము-ఊషణము-శ్రీపర్ణి-సల్లకి- ఈ ఆన్ని టితో కాచీన కషాయమును సవిష పదార్థముల పై చిలుకరించినచో అవి నిర్విషములగును; యవలు సైంధ వము పానీయములు వస్త్రములు శయన సామగ్రి ఆసన సామగి. ఉదకము -కవచములు ఆభరణములు ఛతములు వింజామరములు నివాస గృహములు ఇట్టివి విష సంయు క్షములయ్యేననిపించినచో వాటి పై ఈ కషాయమును చల్ల వలయును. శేలువు-పాటలీ-అతివిష శిగువు-మూర్వా-పునర్నవ-సమంగా-వృషమూలము-కపిత్తము-వృషము శోషితము- సహదేవ-హరిద్ర- ఇవియు విష నాశకములు; లాక్ష –ప్రియంగువు-మంజిష్ట ఏలా-హ రేణుకా- అతి మధురము-ఇవి ముంగిస పిత్తముతో కలిపి భావనచేసి ఎద్దుకొమ్ములో ఈ మిశ్రమును పోసి దానినేడు అహోరాత్రములు నేలలో పాతిఉంచి తీసి దానిని పూసలుగా చేయవలెను; వానిని బంగరు దానములో గ్రుచ్చి చేతికి కట్టుకొనిన విష యుక్త పదార్థములను తాకినను అవి వెంటనే నిర్విషములగును; మనోహ్వయా శమీ పత్రము తుంబీకా - శ్వేత సరపములు కపిత్తము కుష్ఠము మంజిష్ణా. ఇవి కుక్క పిత్తముతోగాని కపిల గోపి తముతో గాని నున్న గా అరగదీసి పూసిన చో ఇదియు ఒక విధమగు విషనాశక మగు ఔషధమగును; మూషికా-జతు ఈ రెండు ఓషధులతో కూడ పెవలెనే పూసలనుచేసి హస్తమందు ధరించినను విషహరౌషధముగా పని చేయును; హరేణువు.మాంసి మంజిష్ట మధుకొమధువు- అక్షత్వక్ - సుర సము-వీనిని శ్వ(కుక్క) ఏ త్తములతో వేనుక టివలే గోశృంగములో నింపి భూమియందుంచి తీసి సిద్దపరచిన పిష్టము పూసిన వాద్యముల (ధ్వనుల)ను వినినను పతాక లను చూచినను వాసన చూచినను నవిష పదార్థములు నిర్విషములగును.
త్య్రుషణం పఞ్చాలవణం మఞ్జిష్ఠా రజనీద్వయమ్ ।
సూక్ష్మేలా త్రివృతా పత్రం విడ జ్గానీన్దవారుణీ॥
మధుకం వేతనం క్షౌద్రం విషాణేచ నిధాపయేత్ ।
తస్మాదుష్ణామ్బునామాత్రం ప్రాగుక్తం వినియోజయేత్ ॥
విషభుక్త జ్వరం యాతి నిర్వి షే పిత్తదోషకృత్ ।
శుక్లం సర్జరగోశీర సర్పపా ఏలవాలు కై॥
సువేగాతస్కరసురౌ కుసుమై గర్జునస్యలు ।
ధూపో వాసగృహే హ న్రీ విషం స్థావర జజ్ఞమమ్॥
మహాద శఠం తద్వతోక్షణం విషనాశనమ్॥
న తత్ర కీటా న విషం దద్దురా న సరీసృపాః ।
నకృత్యాకర్మణాం చాపి ధూపోయం యత్ర దహ్యతే॥
శిఖిపిచ్ఛబలాకాస్థి స్వపాశ్చన్దనం ఘృతమ్ ।
ధూపో విషఘ్న శ్శయన వస్త్రగే హే తథాఒపిచ॥
పూర్వోక్తం భూషణాద్యంచ స్నా నేనామ్భసి యోజయేత్ ।
క్వాథోవార్జునకుసుమ శ్వేతాపామార్గ సర్ష వై॥
న దధ్యాఢ్యఘృతై ర్యు క్తః కామో నాన్య కులద్ధయః ।
కల్పితై శ్చన్దనక్ష్మీర పలాశ ద్రుమవల్కలై ॥
మూర్వైభావాలుసరసా నాకులీ తబ్దులీయ కైః ।
క్వాథస్సర్వోదకార్యేషు కాక మాచీయుతో హితః॥
రోచనాపత్ర నేపాళీ కుజ్కుమై స్తిల కాన్వహక్ ।
విషెర్నబాధ్యతే సాధు నర నారీనృపప్రియః॥
చూర్ణైర్హ రిగ్రా మఞ్జిష్ఠా కిణిహీక ణనీమ్బజైః ।
దిగ్ధం నిర్విషతామేతి గాత్రం సర్వవిషార్ధితమ్॥
పిప్పలి మిరియాలు శొంఠి అను ఊషణత్రయము సాముద్ర లవణ సైంధవ లవణ బిడాల లవణ సౌవర్చల లవణములనెడు పంచలవణములు మంజిష్ఠ పసుపు - మానిపసుపు సూక్ష్మేలా - త్రివృతా పత్రము - వాయు విడంగములు ఇందవారుణీ - మధుకము – వేతనము- తేనే-ఇవి అన్నియు కలిపి కొమ్మునందుంచవలెను; దానినుండి తీసిన మాత్రలను వేడి నీటితో కలిపి సేవించినచో నవిషాహారము జీర్ణమగును; విషములేని దానిని తినినపుడు ఇది సేవించినచో పైత్య దోషము చేయును; శుక్లము వర్ణరసము ఉశీరము సర్వపములు ఏలావాలుకములు సువేగ - తస్కరము - సురము. అర్జునకుసుమములు - వీనిపొగ వేసినచో ఇంటియందలి స్థావర (పదార్థముల) విషమును జంగమ (చరప్రాణుల) విషమును కూడ విరిగిపోవును; ఈ పొగ వ్యాపించుచోట కీటకములు కాని విషములుకొని కప్పలు కానీ సరీసృపములుకాని ఆభిచారిక కృత్యముల ప్రభావములు కాని శ క్తిహీనములగును; నేమిలిపింఛము కొంగ ఎముకలు సర్ప పములు చందనము-నేయి. వీటి పొగ శయనాసన వస్త్ర గృహములందు వ్యాపించినచో విషమును విరుచును; చందనము పొల చెట్టు మోదుగు చెట్టుల బెరడు చూర్వొ - ఏలవాలుకము సురసము - నాకులి . తండులీయకము - పినీతో కాచీన కషాయము అన్ని విధములగు (స్నాన పానాది) ఉదక కార్యములందును కాక మాచి రసముతో కలిపి వినియోగించినచో విషహరమును హితకరమునగును; గోరోచనము తాళీసపత్రి . నేపాళి - కుంకుమపూవు - వీని చూర్ణములో తిలకము ధరించినచో అతడు విష బాధలనందడు; నరులకును నారులకును నృపులకును ప్రీతిపాత్రుడునగును; హరిద్ర-మంజిష్ణ కిణిహి పిప్పలి వేప చెక్క - వీని చూర్ణముతో పూసిన పదార్థములు విషములయినను నిర్వషములగును; సర్వ విషముల స్పర్శనందిన శరీరము కూడ విషదోష రహితమగును.
శిరీషస్య ఫలంపత్రం పుష్పం త్వజ్మూల మేవ చ ।
గోమూత్రఘృష్టో హ్య గద స్సర్వకర్మకర స్మృతః॥
ఏక వీరమహౌషధ్య శ్శృణు చాతః పరం నృప ।
వంధ్యాకర్కోటకీ రాజన్విష్ణు కాస్తా తథోత్కటా॥
శతమూలీ సీతానన్గా(నా) బలా మోచా పటోలికా ।
సోమాపిణ్డా నిశాచైవ తథాదగ్గరుహాచయా॥
స్థలే కమలినీ యాచ విశాలీ శజమూలికా ।
చణ్డాలీహ స్తిమగధా గో జాపర్టోకరమ్బికా॥
రక్తాచైవ మహారకా తథా బరి శిఖాచయా ।
కోశాతకీ నక్తమాలం ప్రీయాలం చ సులోచనీ॥
వారుణీ వసుగన్గాచ తథావై గన్ధనాకు ।
ఈశ్వరీ శివగన్గాచ శ్యామలా వంశ నాళికా॥
జతుకాళీ మహా శ్వేతా శ్వేతాచ మధుయష్టికా ।
వజ్రకః పారిభద్రశ్చ తథావై సిన్హువార కాః॥
జీవానన్దా వసుచ్ఛిద్రా నతనాగరకజ్జికా ।
నాళంచ నాళీ జాతీ చ తథాచ వటపత్రికా॥
కార్తస్వరం మహానీలా కుగ్గురు ర్హంసపాదికా ।
మడ్డూకపర్టీ వారాహీ ద్వే తథా తణులీయ కే॥
సర్పాక్షీ లవళీ బ్రాహ్మీ విశ్వరూపా సుఖాకరా ।
రుజాపహా వృద్దికరీ తథా చై వతు శల్యదా॥
పత్రికా రోహిణీచైవ ర క్తమాలా మహౌషధీ ।
తథామలకవర్గాకం శ్యామచిత్రఫలా చ యా॥
కాకోలీ క్షీర కాకోలీ పీలుపర్ణీ తథైవచ ।
కేశినీ వృశ్చికాలీచ మహానాగా శతావరీ॥
తథా గరుడ వేగా చ జలే కుముదినీ తథా ।
స్థలే చోత్పలినీ యాచ మహాభూమిలతాచయా॥
ఉన్మాదినీ సోమరాజీ సర్వరత్నా నీ పార్థివ ।
వీ శేష న్మరకతాదీని కీటపక్షం విశేషతః॥
జీవజాతాశ్చ మణయ స్సర్వే ధార్యాః ప్రయత్నతః ।
రక్షోఘ్నా శ్చ విషఘ్నశ్చ కృత్యావై తాళ నాశనాః ॥
విశేషా న్నరనాగాశ్చ గోఖరోష్ట్రసముద్భవాః ।
సర్పతి త్తిరి గోమాయువస్త్రమణూకజాక్చయే॥
సింహవ్యాఘ్రర్ణ మార్జార ద్వీపివానర సమ్భవాః ।
కపిఞ్జలా గజవాజి మహిషైణభవాశ్చయే॥
ఇత్యేవమేతై స్సకలై రు పేతం ద్రవ్యైశ్చ సర్వై స్స్వ పురం సురక్షితమ్ ।
రాజావ సేత్తత్ర గృహం సుశుభ్రం గుణాన్వితం లక్షణసమ్పయుక్తమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే రాజధర్మే విష నిర్హరణోపాయకథనం నామ సప్తదశోత్తర ద్విశతతమోధ్యాయః॥
శిరీషవృక్షపు ఫలము పత్రము పుష్పము బెరడు వేరు.ఇన్ని యు గోమూత్రముతో ఆరగదీసినచో సర్వవిషహర మగు ఔషధమగును; ఏక వీరుడవగు మనూ! ఇక మీదట మహౌషధులు (అనేక వ్యాధుల పై పనిచేయ ప్రసిద్ద మూలికలు) చెప్పెదను; వినుము; వంధ్య - కర్కోటకి - విష్ణు కాంత - ఉతట - శత మూలి - ఒత – నంద-బల – మోచా- పటోలిక - సోమ - పిండా - పసపు - దగ్గరుహ - మెట్టతామర - విశాలి - శంఖమూలిక - చాండాలీ - హ సీమగధ - గోజాపర్లీ - కరంభికా - రక్తా - మహార క్తా - బడ్జి శివా - కోశాతకీ - నక్తమాలము (కానుగ) - ప్రియాలము - సులోచని - వారుణీ - వసు గంధా - గంధనాకు - ఈశ్వరీ - శివగంధా - శ్యామలా - వంశ నాశిక - జతు కాళీ - మహా శ్వేతా - శ్వేతా - మధుయష్టికా - వజకము - పారిథ్య దము - సిందువారము - జీవానందా - వసు-చ్చి దా - నతము - నాగరకంటక - కాలము - జాలీ - జాతీ వటపత్రికా - కార్తస్వరము - మహానీలా - కుందురు - హంసపాది - మండూక పర్లి - వారాహీ , రెండు విధములకు తండు లీయకములు (చిర్రి) సర్పాక్షి -లవలి (రాచ ఉసిరిగ) బ్రాహ్మి (సర స్వతి) విశ్వరూపా - సుఖాకరా - రజాపహా - వృద్దిక రీ శల్యదా . పత్రికా రోహిణి - నక్తమాల - శోంఠీ - ఆమలకము - వందాకము - నల్లఉమ్మెత్త చిత్రఫల - కాకోలీ-క్షీర కా కోలీ - పీలువల్లి - కేశినీ - వృశ్చి కాలీ - మహానాగ - శతావరీ - గరుడి - వేగా - నీటికలువ - మెట్టకలువ - మహాభూమిలతా ఉన్మాదినీ - సోమరాజీ - సర్వరత్నములు - విశేషించి గరుడపచ్చ మొదలగునవి - కీటపక్షములు పురుగుల రెక్కలు) జీవజాతములు ( వేరువేరు క్రిమికీటకాదులు) మణులు. ఇవన్నియు ప్రయత్నముతో సేకరించి నిలువయుంచు కొనవలయును. రక్షస్సులను విషములను కృత్యలను బేతాళులను నశింపజేయు సామగ్రిని విశ్లేషించి నరగజ హయ గోఖర సర్పతి త్తిరి గోమాయు - వస్త్ర - మండూకముల నుండి లభించునవియు సింహవ్యాఘ్ర ఋక్ష మార్జాల ద్వీపి వానర కపింజల మహిష ముల నుండియు ఇర్రినుండియు లభించునవియు అగు ఈ పదార్థముల సేకరించవలెను; ఇట్టి ద్రవ్యములతో కూడినదై సురక్షితమును అతి శుభమును సర్వగుణయుక్తమును సర్వలక్షణ సహితమునగు గృహమందు రాజు నివసించవలయును.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజధర్మములందు విషనిర్హరణోపాయకథన మను రెండు వందల పదునేడవ అధ్యాయము.
Summary of chapter 217 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents a detailed architectural guide on the construction, strategic classification, and defensive fortification of royal castles and forts. Bhagavān Matsya enumerates six major categories of fortresses: Dhanva-durga (desert fort), Mahī-durga (earthen fort), Jala-durga (water/island fort), Vṛksha-durga (forest fort), Nṛ-durga (populated/troop-defended fort), and Giri-durga (mountain fort), highlighting Giri-durga as the most impregnable. The text outlines the stocking of forts with food grains, water, weapons, medicines, and siege equipment to withstand prolonged hostilities.